World Boxing Championships: Hussamuddin Into Quarters, Deets Inside - Sakshi
Sakshi News home page

Boxing World Championships: దీపక్‌ సంచలనం.. క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్‌ 

May 8 2023 11:08 AM | Updated on May 8 2023 11:33 AM

Boxing World Championships: Hussamuddin Into Quarters - Sakshi

తాష్కెంట్‌: ప్రపంచ పురుషుల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్‌ మొహమ్మద్‌ హుసాముద్దీన్‌ (57 కేజీలు) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో హుసాముద్దీన్‌ 5–0తో సావిన్‌ ఎడువార్డ్‌ (రష్యా)పై గెలుపొందాడు. భారత్‌కే చెందిన దీపక్‌ (51 కేజీలు) సంచలన విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు.

రెండో రౌండ్‌లో దీపక్‌ 5–2తో 2021 ప్రపంచ చాంపియన్‌ బిబోసినోవ్‌ (కజకిస్తాన్‌)ను బోల్తా కొట్టించాడు. 75 కేజీల విభాగం రెండో రౌండ్‌లో సుమిత్‌ కుందు 1–3తో సోసులిన్‌ పావెల్‌ (రష్యా) చేతిలో... ప్లస్‌ 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నరేందర్‌ 0–5తో అర్జోలా అలెజాంద్రో (క్యూబా) చేతిలో ఓడిపోయారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement