
చెన్నై గెలుపు... జడేజాకు అభినందనలు(PC: IPL/BCCI)
IPL 2022 CSK Vs RCB- Ravindra Jadeja Comments: వరుసగా నాలుగు పరాజయాల తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్-2022లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే(94 నాటౌట్), రాబిన్ ఉతప్ప( 89 పరుగులు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలుపు బాట పట్టించారు. కాగా ఐపీఎల్-2022 సీజన్‌తో తొలిసారిగా చెన్నై పగ్గాలు చేపట్టిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కెప్టెన్‌గా మొదటి విజయం.
ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జడేజా మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. ఈ గెలుపును జట్టు సభ్యులు, తన భార్య రివా సోలంకికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. ‘‘కెప్టెన్‌గా నాకు ఇది తొలి విజయం. ఈ గెలుపు ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమే! గత నాలుగు మ్యాచ్‌లలో మాకు నిరాశే ఎదురైంది. అయితే, మేము పుంజుకున్నాం.
బ్యాటింగ్ యూనిట్‌లో ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు. ముఖ్యంగా రాబీ, శివమ్ అద్భుతంగా ఆడారు. బౌలర్లు కూడా మెరుగ్గా రాణించారు. నిజానికి మేనేజ్‌మెంట్ నాపై ఎప్పుడూ ఒత్తిడి పెట్టలేదు. నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
భార్యతో జడేజా
ఇంకా నేను నేర్చుకునే దశలోనే ఉన్నాను. కెప్టెన్ అయినప్పటికీ నేను సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూనే ఉన్నాను. మహీ భాయ్ ఉన్నాడు కదా! ఆయనతో ప్రతీ విషయం చర్చిస్తాను. సారథిగా ఎదగడంలో, ఆ పాత్రలో ఒదిగేందుకు.. ఈ సలహాలు పనికివస్తాయి. అయితే, అందుకు కాస్త సమయం పట్టవచ్చు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం మాత్రం నాకు కలిసి వచ్చే అంశం.
సానుకూల దృక్పథంతో, కఠిన శ్రమకోరుస్తూ .. విజయాలను కొనసాగిస్తూ ముందుకు వెళ్తాం. కెప్టెన్‌గా నా తొలి విజయాన్ని నా సతీమణికి, జట్టు సభ్యులకు అంకితమిస్తున్నా’’ అని జడేజా పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీతో మ్యాచ్‌లో జడేజా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. వనిందు హసరంగ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. అయితే, తన బౌలింగ్ కోటా(4 ఓవర్లు)ను పూర్తి చేసిన జడ్డూ.. 39 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు:
చెన్నై: 216/4 (20)
బెంగళూరు: 193/9 (20)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే
చదవండి: IPL 2022: థర్డ్ అంపైర్‌కు మతి భ్రమించిందా..?
The Jadeja catch celebration 👌👌#TATAIPL #CSKvRCB pic.twitter.com/u3zvE59I3k
— IndianPremierLeague (@IPL) April 12, 2022