ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ | Ind Vs SA 2nd Test Day 1 Toss Playing XIs Ashwin Shardul Out Jadeja Mukesh In | Sakshi
Sakshi News home page

Ind Vs SA: ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌

Published Wed, Jan 3 2024 1:09 PM | Last Updated on Wed, Jan 3 2024 3:41 PM

Ind Vs SA 2nd Test Day 1 Toss Playing XIs Ashwin Shardul Out Jadeja Mukesh In - Sakshi

South Africa Vs India 2nd Test 2024 Day 1 Updates- కేప్‌టౌన్‌: రెండో టెస్టులో భారత పేసర్ల విజృంభణతో సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలింది. బుధవారం నాటి మ్యాచ్‌లో తొలి రోజు ఆట తొలి సెషన్‌లో 23.2 ఓవర్లలోనే ఆలౌట్‌ అయి తొలి ఇన్నింగ్స్‌ ముగించింది. ప్రొటిస్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ కైల్‌ వెరెనె 15 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవడం విశేషం.

టీమిండియా బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ అత్యధికంగా ఆరు వికెట్లు తీయగా.. బుమ్రాకు రెండు, ముకేశ్‌ కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. మరో పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ 4 ఓవర్ల బౌలింగ్‌లో పది పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగానే బౌలింగ్‌ చేశాడు.

22.6: తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
బుమ్రా బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి నండ్రే బర్గర్‌(4) పెవిలియన్‌ చేరాడు. స్కోరు: 55-9(23)

21: హాఫ్‌ సెంచరీ మార్కు అందుకున్న సౌతాఫ్రికా.. స్కోరు: 50-8

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
19.6: ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి ఔటైన కేశవ్‌ మహరాజ్‌(3). సౌతాఫ్రికా స్కోరు: 46-8(20)

17.5: ఏడో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా
సిరాజ్‌ బౌలింగ్‌లో శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెరెనె (15) ఔటయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్‌ కోల్పోయింది. సిరాజ్‌ ఖాతాలో ఆరో వికెట్‌ చేరింది. సౌతాఫ్రికా స్కోరు:  45-7(18). రబడ, కేశవ్‌ మహరాజ్‌ క్రీజులో ఉన్నారు.

15.5: తిరుగులేని సిరాజ్‌.. ఆరో వికెట్‌ డౌన్‌
టీమిండియా పేసర్‌ సిరాజ్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సత్తా చాటాడు. పదహారో ఓవర్‌ రెండో బంతికి బెడింగ్‌హాం(12)ను పెవిలియన్‌కు పంపిన ఈ హైదరాబాదీ బౌలర్‌.. ఐదో బంతికి మార్కో జాన్సెన్‌(0) రూపంలో మరో వికెట్‌ దక్కించుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌, వెరెనె క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా స్కోరు: 34-6(16)

మరోసారి మ్యాజిక్‌ చేసిన సిరాజ్‌
15.2: కేప్‌టౌన్‌ టెస్టులో టీమిండియా స్పీడ్‌స్టర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇప్పటికే మార్క్రమ్‌, ఎల్గర్‌, జోర్జి రూపంలో మూడు వికెట్లు తీసిన తాజాగా నాలుగో వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్‌ చేసి డేవిడ్‌ బెడింగ్‌హాంను ఔట్‌ చేశాడు. తద్వారా సౌతాఫ్రికా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఇక అంతకు ముందు బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌ను అవుట్‌ చేసిన విషయం తెలిసిందే.

11 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 23-4
బెడింగ్‌హామ్‌ 8, వెరెనె సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిప్పులు చెరుగుతున్న సిరాజ్‌.. 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
హైదరాబాదీ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ నిప్పులు చెరుగుతున్నాడు. అతడి ధాటికి సౌతాఫ్రికా 15 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 15 పరుగుల వద్ద డి జార్జీ (2) ఔటయ్యాడు.

నాలుగు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా
9.2
: సిరాజ్‌బౌలింగ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టోనీ డీ జోర్జీ ఔట్‌ 
8.3: బుమ్రా బౌలింగ్‌లో మూడో వికెట్‌గా వెనుదిరిగిన ట్రిస్టన్‌ స్టబ్స్‌
►రెండో వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా.. కెప్టెన్‌ ఔట్‌
►సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత్‌ బౌలర్‌ సిరాజ్‌ నిప్పులు చెరుగుతున్నాడు. 
►ఇన్నింగ్స్‌ ఐదో ఓవర్‌లో సౌతాఫ్రికా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. మొదటి మ్యాచ్‌లో సెంచరీలో రాణించిన ఎల్గర్‌ ఈ ఇన్నింగ్స్‌లో 4(15) పరుగులు చేసి ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ డౌన్‌
►ఫస్ట్‌ వికెట్‌ కోల్పోయిన సౌతాఫ్రికా.. 
►సిరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లో మార్క్రమ్‌2(10) ఔట్‌

►టీమిండియాతో రెండో టెస్టులో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తెంబా బవుమా గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో డీన్‌ ఎల్గర్‌ సౌతాఫ్రికా కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడమే తమ లక్ష్యమని టాస్‌ సందర్భంగా పేర్కొన్నాడు.

ఎల్గర్‌కు ఆఖరి టెస్టు
పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది కాబట్టే తొలుత బ్యాట్‌తో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి టెస్టులో గెలిచాం కాబట్టి కేప్‌టౌన్‌లో తాము ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడగలమని ఎల్గర్‌ పేర్కొన్నాడు. గాయాల కారణంగా జట్టుకు దూరమైన బవుమా స్థానంలో ట్రిస్టన్‌ స్టబ్స్‌, గెరాల్డ్‌ కోయెట్జీ స్థానంలో లుంగి ఎంగిడిని రెండో టెస్టులో ఆడిస్తున్నట్లు ఎల్గర్‌ తెలిపాడు. కాగా వెటరన్‌ ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌ కెరీర్‌లో ఇదే ఆఖరి టెస్టు కావడం విశేషం.

అశ్విన్‌, శార్దూల్‌ అవుట్‌
ఇక ఇప్పటికే బాక్సింగ్‌ డే టెస్టులో ఓటమి పాలైన రోహిత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్థానంలో రవీంద్ర జడేజా, పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో ముకేశ్‌ కుమార్‌ తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు.

సౌతాఫ్రికా వర్సెస్‌ ఇండియా రెండో టెస్టు తుదిజట్లు ఇవే
సౌతాఫ్రికా ప్లేయింగ్‌ ఎలెవన్‌
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెర్రెన్నె(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి.

టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌
రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్‌ కృష్ణ, ముకేష్ కుమార్.

చదవండి: T20 WC 2024: రోహిత్‌, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అగార్కర్‌ కీలక నిర్ణయం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement