
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో తానే వేసిన తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాడిగా జూనియర్ ఏబీ చరిత్ర సృష్టించాడు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన డెవాల్డ్ బ్రెవిస్ తన తొలి బంతికే కోహ్లి వికెట్ దక్కించుకున్నాడు. గుడ్ లెంగ్త్‌తో పడిన బంతి కోహ్లి ప్యాడ్లను తాకి బ్యాట్‌ను తాకింది. దీంతో బ్రెవిస్ ఎల్బీకి అప్పీల్ చేశాడు. ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. అయితే కోహ్లి రివ్యూకు వెళ్లినప్పటికి ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో డెవాల్డ్ బ్రెవిస్ ఖాతాలో కోహ్లి రూపంలో తొలి వికెట్ పడింది. ఇక ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. 152 పరగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: Surya Kumar Yadav: అంతా కట్టగట్టుకొని విఫలమయ్యారు.. ఒక్కడు మాత్రం