RCB
-
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు ఉచిత ప్రయాణం.. ఆటో డ్రైవర్ మంచి మనసు
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫ్యాన్ బేస్ గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మొదలైదంటే ఈ సారి కప్ నమ్దే అంటూ అభిమానులు చేసే హంగామా ఎంత అంత కాదు. కనీసం 18వ సీజన్లోనైనా తమ ఆరాధ్య జట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ఓ ఆటోడ్రైవర్ ఆర్సీబీ తన అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు.అజ్మల్ సుల్తాన్ అనే ఆటో డ్రైవర్ ఆర్సీబీ జెర్సీ ధరించిన వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తానని ప్రకటించాడు. ఆర్సీబీ జెర్సీ ధరించి ఉంటే రైడ్ ఫ్రీ అని తన ఆటో వెనక అజ్మల్ రాసుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అభిమానం అంటే ఇదే నీదేనే అన్నా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక ఐపీఎల్-2025 సీజన్లో ఆర్సీబీ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో ఘన విజయాలు అందుకున్న బెంగళూరు జట్టు.. బుధవారం తమ సొంతమైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో లివింగ్ స్టోన్(54) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జితేష్ శర్మ(33), టిమ్ డేవిడ్(32) రాణించారు.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు సాయికిషోర్ రెండు, అర్షద్, ప్రసిద్ద్, ఇషాంత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. జోస్ బట్లర్(73) ఆజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయిసుదర్శన్(49) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 7న ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.చదవండి: SRH: వాళ్లిద్దరు కలిసి 217 పరుగులు ఇచ్చారు.. ఇలా అయితే కష్టమే: భారత మాజీ క్రికెటర్ -
IPL 2025: ఊహకందని రికార్డును సొంతం చేసుకున్న ఇషాంత్ శర్మ
గుజరాత్ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ ఊహకందని ఐపీఎల్ రికార్డును సొంతం చేసుకున్నాడు. 2025 సీజన్లో భాగంగా నిన్న (ఏప్రిల్ 2) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ వికెట్ తీసిన ఇషాంత్.. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. తొలి ఐపీఎల్ సీజన్లో (2008) నాటి ఆర్సీబీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. తాజాగా అదే ఫ్రాంచైజీ ప్రస్తుత కెప్టెన్ రజత్ పాటిదార్‌ను పెవిలియన్‌కు పంపాడు.ఐపీఎల్ చరిత్రలో ఇలాంటి రేర్ ఫీట్‌ను ఎవరూ సాధించలేదు. 18 ఏళ్ల తేడాతో ఒకే ఫ్రాంచైజీ కెప్టెన్లను ఔట్ చేసిన తొలి మరియు ఏకైక బౌలర్ ఇషాంత్ శర్మనే. 2008 సీజన్లో కేకేఆర్ తరఫున ఆడుతూ తన స్పెల్ తొలి ఓవర్లోనే నాటి ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్ శర్మ.. ఐపీఎల్ 2025 సీజన్లో ప్రస్తుత ఆర్సీబీ కెప్టెన్‌ను కూడా తన స్పెల్ తొలి ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు.అప్పుడూ, ఇప్పుడూ ఆర్సీబీ కెప్టెన్లను ఔట్ చేసింది చిన్నస్వామి స్టేడియంలోనే కావడం మరో విశేషం. ఇక్కడ ఒకే ఒక్క తేడా ఏంటంటే.. నాడు తన స్పెల్ తొలి బంతికే ఆర్సీబీ కెప్టెన్‌ను ఔట్ చేసిన ఇషాంత్.. ప్రస్తుత సీజన్లో తన స్పెల్ రెండో బంతికి ఆర్సీబీ కెప్టెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న అతి తక్కువ మంది ఆటగాళ్లలో ఇషాంత్ ఒకడు. 36 ఏళ్ల ఈ ఢిల్లీ పేసర్ 2018 సీజన్ మినహాయించి ప్రతి ఐపీఎల్లో ఆడాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బౌలర్లు, ఆతర్వాత బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. -
IPL 2025: విరాట్ కోహ్లికి గాయం
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో ఫీల్డింగ్ చేస్తుండగా (బౌండరీని ఆపే క్రమంలో) విరాట్ చేతి బొటన వేలికి గాయమైంది. నొప్పితో విరాట్ విలవిలలాడిపోయాడు. విరాట్ ఇలా గాయపడటం చాలా అరుదుగా జరుగుతుంది. నొప్పి భరించలేక విరాట్ నేలకొరగడంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఫిజియో ఫస్ట్ ఎయిడ్ చేయడంతో విరాట్ కొద్ది సేపటికే రికవర్ అయినట్లు కనిపించాడు. అయినా విరాట్ అభిమానుల్లో ఆందోళన అలాగే ఉండింది. గాయం తర్వాత విరాట్‌లో ముందున్నంత యాక్టివ్నెస్ కనిపించలేదు. దీంతో అభిమానులు విరాట్ తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అని ఆరా తీయడం మొదలుపెట్టారు. విరాట్ గాయంపై ఆర్సీబీ ప్రధాన కోచ్ ఆండీ ఫ్లవర్ సానుకూల అప్డేట్ ఇవ్వడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. విరాట్ గాయం చిన్నదేనని ఫ్లవర్ ప్రకటించాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 7న ముంబైని వాంఖడే మైదానంలో జరుగనుంది.కాగా, నిన్నటి మ్యాచ్‌లో విరాట్ ఘోరంగా విఫలమయ్యాడు. 6 బంతుల్లో బౌండరీ సాయంతో 7 పరుగులు మాత్రమే చేసి అనామక అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ వికెట్ పడిన తర్వాత ఆర్సీబీ టాపార్డర్ అంతా పెవిలియన్‌కు క్యూ కట్టింది. పడిక్కల్ (4), సాల్ట్ (14), పాటిదార్ (12) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో ఆర్సీబీ ఓ మోస్తరు స్కోర్ (169/8) చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ అద్బుతంగా బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనకు గానూ అతడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సాయి కిషోర్ (4-0-22-2), అర్షద్ ఖాన్ (2-0-17-1), ప్రసిద్ద్ కృష్ణ (4-0-26-1), ఇషాంత్ శర్మ (2-0-27-1) కూడా తలో చేయి వేసి ఆర్సీబీని కట్టడి చేశారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
IPL 2025: చరిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్
ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో నిన్న (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్‌ను ఔట్ చేయడం ద్వారా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. బ్రావో 158 ఇన్నింగ్స్‌ల్లో 183 వికెట్లు తీయగా.. ఈ మార్కు తాకడానికి భువీకి 178 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఓవరాల్‌గా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చహల్ పేరిట ఉంది. చహల్ 161 ఇన్నింగ్స్‌ల్లో 206 వికెట్లు తీశాడు. చహల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన ఘనత పియూశ్ చావ్లాకు దక్కుతుంది. చావ్లా 191 ఇన్నింగ్స్‌ల్లో 912 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చహల్ , చావ్లా తర్వాత భువీ, బ్రావో ఉన్నారు. వీరిద్దరితో సమానంగా అశ్విన్ కూడా 183 వికెట్లు తన ఖాతాలో కలిగి ఉన్నాడు. యాష్‌కు 183 వికెట్ల మార్కును తాకడానికి 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.కాగా, నిన్న సొంత మైదానంలో (చిన్నస్వామి స్టేడియం) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్లో ఆ జట్టుకు ఇదే తొలి ఓటమి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఆదిలోనే వికెట్లు కోల్పోయి నామమాత్రపు స్కోర్‌కు (169/8) పరిమితమైంది. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) పోరాడటంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీసి ఆర్సీబీకి దెబ్బకొట్టాడు. సిరాజ్ తన మాజీ జట్టుపై మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. సిరాజ్‌తో పాటు సాయికిషోర్ (2), అర్షద్ ఖాన్ (1), ప్రసిద్ద్ కృష్ణ (1), ఇషాంత్ శర్మ (1) కూడా వికెట్లు తీశారు. సిరాజ్ తన కోటా 4 ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చాడు.అనంతరం 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) నిలకడగా ఆడి గుజరాత్‌ను గెలిపించారు. ఆఖర్లో బట్లర్, రూథర్‌ఫోర్డ్ బ్యాట్‌ను ఝులిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌కు ముందు టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
IPL 2025: ఉతికి ఆరేసిన బట్లర్.. ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు) వేదికగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 2) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. తొలుత నిదానంగా ఆడిన బట్లర్.. ఆతర్వాత గేర్ మార్చి ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్) తనదైన శైలితో చెలరేగిపోయాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టాప్ ప్లేస్‌లో ఉండిన ఆర్సీబీ మూడో స్థానానికి పడిపోయింది. -
RCB VS GT: అదిరిపోయే రీతిలో ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. ఆ జట్టు 16 ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. లివింగ్‌స్టోన్ (33), టిమ్ డేవిడ్ (6) క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ ఇంకా ఆశలు పెట్టుకుంది.రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన చేస్తుంది. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది. ఆర్సీబీని పేసర్ అర్షద్ ఖాన్ తొలి దెబ్బేశాడు. రెండో ఓవర్లోనే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (7) ఔట్ చేశాడు. ఆతర్వాత ఆర్సీబీ మాజీ ఆటగాడు సిరాజ్ లైన్లోకి వచ్చాడు. సిరాజ్ అతని వరుస ఓవర్లలో పడిక్కల్ (4), సాల్ట్‌ను (14) క్లీన్ బౌల్డ్ చేశాడు. Mo Siraj 🔥pic.twitter.com/2cbgtJIhNi— CricTracker (@Cricketracker) April 2, 2025ఆతర్వాత ఇషాంత్ అద్భుతమైన బంతితో కెప్టెన్ పాటిదార్‌ను (12) ఎల్బీడబ్ల్యూ చేశాడు. లేట్‌గా (11వ ఓవర్) బౌలింగ్‌కు దిగిన సాయికిషోర్ తన రెండో ఓవర్లోనే మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించిన జితేశ్ శర్మను (33) ఔట్ చేశాడు. సాయి కిషోర్ తన మూడో ఓవర్లో మరో ఫలితం రాబట్టాడు. ఈసారి కిషోర్ కృనాల్ పాండ్యాను (5) బోల్తా కొట్టించాడు. భారీ హిట్టర్లు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ క్రీజ్‌లో ఉండటంతో ఆర్సీబీ గౌరవప్రదమైన స్కోర్‌పై ఆశలు పెట్టుకుంది.కాగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ సాల్ట్ వికెట్ తీసిన విధానం అందరినీ ఆకర్శించింది. ఇన్నింగ్స్ 5వ ఓవర్ మూడో బంతికి సాల్ట్ సిరాజ్ బౌలింగ్‌లో 105 మీటర్ల భారీ సిక్సర్ కొట్టాడు. ఆతర్వాతి బంతికి సిరాజ్ సాల్ట్‌పై తనదైన శైలిలో ప్రతీకారం తీర్చుకున్నాడు. సాల్ట్ వికెట్లు వదిలి మరో భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. సిరాజ్ బంతిని నేరుగా వికెట్లపైకి సంధించి సాల్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ సీజన్లో సిరాజ్ ఇప్పటివరకు తీసిన నాలుగు వికెట్లు క్లీన్ బౌల్డ్లే కావడం విశేషం. సిరాజ్ బౌలింగ్‌లో సాల్ట్ కొట్టిన సిక్సర్ ఈ సీజన్లో అత్యంత భారీ సిక్సర్‌గా రికార్డైంది. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఆటగాడు ట్రవిస్ హెడ్ కూడా 105 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు. -
IPL 2025: ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం
ఆర్సీబీపై గుజరాత్ ఘన విజయం170 పరుగుల నామ మాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ 17.5 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జోస్ బట్లర్ (39 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), సాయి సుదర్శన్ (36 బంతుల్లో 49; 7 ఫోర్లు, సిక్స్), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (18 బంతుల్లో 30 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) గుజరాత్‌ను గెలిపించారు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్12.3వ ఓవర్: 107 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 49 పరుగులు చేసి హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్ఛేదనను నిదానంగా ప్రారంభించిన గుజరాత్ ఆతర్వాత గేర్ మార్చి లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 11.5 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47), జోస్ బట్లర్ (39) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. గేర్ మార్చిన బట్లర్అప్పటివరకు నిదానంగా ఆడిన బట్లర్ రసిక్ సలామ్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గేర్ మార్చాడు. ఆ ఓవర్లో బట్లర్ 2 సిక్సర్లు, ఓ ఫోర్ బాదాడు. 9 ఓవర్ల తర్వాత గుజరాత్ స్కోర్ 75/1గా ఉంది. బట్లర్ 26, సాయి సుదర్శన్ 32 పరుగులతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ గెలవాలంటే 66 బంతుల్లో 95 పరుగులు చేయాలి. తొలి వికెట్ కోల్పోయిన గుజరాత్4.4వ ఓవర్: 170 పరుగుల ఛేదనలో గుజరాత్ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ (14) ఔటయ్యాడు. సాయి సుదర్శన్ (15), జోస్ బట్లర్ క్రీజ్‌లో ఉన్నారు. టార్గెట్ 170.. నిదానంగా ఆడుతున్న గుజరాత్170 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిదానంగా ఆడుతుంది. మూడు ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు మాత్రమే చేసింది. శుభ్‌మన్ గిల్ 7, సాయి సుదర్శన్ 5 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీ.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?టాస్ ఓడి గుజరాత్ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. లివింగ్‌స్టోన్ (40 బంతుల్లో 54; ఫోర్, 5 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 32; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడటంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మధ్యలో జితేశ్ శర్మ (21 బంతుల్లో 33; 5 ఫోర్లు, సిక్స్) కూడా ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వీరు మినహా ఎవరూ రాణించలేదు. సాల్ట్ 14, విరాట్ కోహ్లి 7, పడిక్కల్ 4, పాటిదార్ 12, కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లు తీయగా.. సాయికిషోర్ 2, అర్షద్ ఖాన్, ప్రసిద్ద్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. చివరి ఓవర్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్ బాది చివరి బంతికి ఔటైన టిమ్ డేవిడ్ఏడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీసిరాజ్ బౌలింగ్‌లో బట్లర్ క్యాచ్ పట్టడంతో లివింగ్‌స్టోన్ (54) ఔటయ్యాడు.లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీరషీద్ ఖాన్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లు బాది లివింగ్‌స్టోన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరో వికెట్ డౌన్14.2వ ఓవర్: 104 పరుగుల వద్ద ఆర్సీబీ ఆరో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి కృనాల్ పాండ్యా (5) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్ (24), టిమ్ డేవిడ్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ12.4వ ఓవర్: 94 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. సాయి కిషోర్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి జితేశ్ శర్మ (33) ఔటయ్యాడు. లివింగ్‌స్టోన్‌కు (19) జతగా కృనాల్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/410 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 73/4గా ఉంది. లివింగ్‌స్టోన్ (8), జితేశ్ శర్మ (23) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ 6.2వ ఓవర్: ఆర్సీబీ కష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఆ జట్టు 42 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్ (12) ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ క్రీజ్‌లో ఉన్నారు. పీకల్లోతు కష్టాల్లో ఆర్సీబీ.. 35 పరుగులకే 3 వికెట్లు డౌన్4.4వ ఓవర్: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ జట్టు 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం ఫిల్ సాల్ట్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రజత్ పాటిదార్‌కు (6) జతగా లివింగ్‌స్టోన్ క్రీజ్‌లోకి వచ్చాడు. 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆర్సీబీఆర్సీబీ 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండో ఓవర్లో విరాట్‌ను ఆర్షద్ ఖాన్ ఔట్ చేయగా.. మూడో ఓవర్లో సిరాజ్ అద్భుతమైన బంతితో పడిక్కల్‌ను (4) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆర్సీబీకి షాక్.. రెండో ఓవర్లోనే విరాట్ ఔట్ఆర్సీబీకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (7) అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో ప్రసిద్ద్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 12/1గా ఉంది. పడిక్కల్ (4), సాల్ట్ (1) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఓవర్లోనే సాల్ట్ బతికిపోయాడు..!సాల్ట్‌కు తొలి ఓవర్లోనే లైఫ్ లభించింది. సిరాజ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జోస్ బట్లర్ చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను వదిలేశాడు. అంతకుముందు తొలి బంతికే సాల్ట్ ఔట్ కావాల్సింది. అయితే బంతి ఫీల్డర్లు లేని చోట ల్యాండైంది.ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ తలపడనున్నాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం గుజరాత్ ఓ మార్పు చేయగా.. ఆర్సీబీ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తుంది. గుజరాత్ తరఫున రబాడ స్థానంలో అర్షద్ ఖాన్ జట్టులోకి వచ్చాడు. రబాడ వ్యక్తిగత కారణాల చేత ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్‌కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మగుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ సబ్స్: షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, వాషింగ్టన్ సుందర్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్స్: సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్.కాగా, ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. గుజరాత్ రెండింట ఓ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆర్సీబీ.. కేకేఆర్, సీఎస్కేపై విజయాలు సాధించగా.. గుజరాత్.. పంజాబ్ చేతిలో ఓడి, ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. -
ధోనీపై విమర్శలు!
-
ఈ ఆర్సీబీకి ఏమైంది.. వరుసగా మ్యాచ్‌లు గెలిచేస్తుంది.. టైటిల్ కూడా గెలుస్తుందా ఏంది..?
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గత 17 సీజన్లతో పోలిస్తే కాస్త భిన్నంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్ నుంచే విజయాల బాట పట్టింది. సాధారణంగా ఆర్సీబీ తొలి మ్యాచ్‌లను పెద్దగా పట్టించుకోదు. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరిన ప్రతిసారి ఆఖరి మ్యాచ్‌ల్లోనే విజయాలు సాధించింది. ఈ సీజన్లో ఆర్సీబీ వరుసగా కేకేఆర్, ముంబై ఇండియన్స్‌పై విజయాలు నమోదు చేసింది. ఈ రెండు విజయాలు ప్రత్యర్థుల అడ్డాలో రావడం మరింత ప్రత్యేకం. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన కేకేఆర్‌ను ఆర్సీబీ ఈడెన్ గార్డన్స్‌లో ఓడించింది. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సీఎస్కేను 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో మట్టికరిపించింది.ఈ సీజన్లో ఆర్సీబీ జట్టుగా కూడా బలంగా కనిపిస్తుంది. గత సీజన్లలోలా ఒకరిద్దరిపై ఆధారపడినట్లు కనిపించడం లేదు. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ కామ్‌గా ఉంటూ ఆశ్చర్యకర రీతిలో వ్యూహాలు పన్నుతుకున్నాడు. పాటిదార్ కెప్టెన్సీ కూడా ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలుపును సూచిస్తుంది. పాటిదార్ వ్యక్తిగతంగా కూడా రాణించడం ఆర్సీబీకి మరో శుభ సూచకం. ఈ సీజన్లో ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో పాటిదార్ చాలా మూల్యమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. పాటిదార్ బలంగా షాట్లు ఆడుతూ స్పిన్నర్లను బెంబేలెత్తిస్తున్నాడు. పాటిదార్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే.. ఆర్సీబీ ఈసారి ఖచ్చితంగా అద్భుతం చేస్తుంది.ఈ సీజన్లో ఆర్సీబీకి మరో శుభ సూచకం హాజిల్‌వుడ్ ఫామ్. హాజిల్‌వుడ్ ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో హాజిల్‌వుడ్ ఆదిలోనే వికెట్లు తీసి ప్రత్యర్ధులను డిఫెన్స్‌లో పడేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీకి లభించిన మరో ఎక్స్ ఫ్యాక్టర్ ఫిల్ సాల్ట్. సాల్ట్ ఈ సీజన్లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. తొలి మ్యాచ్‌లో అర్ద సెంచరీతో మెరిసిన విరాట్.. సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లోనూ పర్వాలేదనిపించాడు.తొలి మ్యాచ్‌లో తన స్పిన్ బౌలింగ్‌తో అద్బుతం చేసిన కృనాల్ పాండ్యా కూడా ఈ సీజన్లో ఆర్సీబీకి టైటిల్ అందించేలా ఉన్నాడు. దేవ్‌దత్ పడిక్కల్, జితేశ్ శర్మ కూడా లైన్లోకి వస్తే ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మరింత పటిష్టంగా తయారవుతుంది. విదేశీ విధ్వంకర వీరులు లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్ తమ సామర్థ్యం మేరకు రాణిస్తే ఈ సీజన్లో టైటిల్ గెలవకుండా ఆర్సీబీని ఎవ్వరూ ఆపలేరు. ఆర్సీబీలో దేశీయ బౌలింగ్ విభాగం కూడా చాలా పటిష్టంగా ఉంది. భువనేశ్వర్ కుమార్ చేరిక ఆర్సీబీ పేస్ విభాగానికి మరింత ఊపునిచ్చింది. యశ్ దయాల్ సీఎస్కేతో మ్యాచ్‌లో ఒకే ఒవర్లో రెండు వికెట్లు తీసి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్పిన్నర్ సుయాశ్ శర్మ తొలి మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో సుయాశ్ వికెట్లు తీయనప్పటికీ.. పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఓవరాల్‌గా ఆర్సీబీ ఈ సీజన్లో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ప్రతి సీజన్‌కు ముందు ఈ సాలా కప్ నమ్మదే అని డప్పు కొట్టుకునే ఆర్సీబీ ఫ్యాన్స్ గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువగా హడావుడి చేయడం లేదు. ఇదీ ఓ రకంగా ఆర్సీబీ టైటిల్ గెలుపుకు సూచకంగా తీసుకోవచ్చు. అన్నిటి కంటే ఎక్కువగా ఈ సారి అంకెల కో ఇన్సిడెన్స్ ఆర్సీబీకి కలిసొస్తుందేమో అనిపిస్తుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ సంఖ్య కూడా పద్దెనిమిదే కావడం విశేషం. మరి 18 సీజన్ ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ సీజన్ అవుతుందో లేదో వేచి చూడాలి. -
మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్‌వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. -
చెన్నైపై సత్తా చాటిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
-
IPL 2025: ఇలాగే గెలుస్తూ పోతే టైటిల్ మాదే: ఆర్సీబీ కెప్టెన్ పాటిదార్
ఆర్సీబీ నయా కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా తన కెరీర్‌ను గెలుపుతో ప్రారంభించాడు. నిన్న (మార్చి 22) జరిగిన సీజన్ ఓపెనర్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో పాటిదార్ కెప్టెన్‌గా తన ఖాతాను ఓపెన్ చేయడంతో పాటు ఈ సీజన్లో ఆర్సీబీకి తొలి విజయాన్నందించాడు.ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని మరో 22 బంతులు మిగిలుండగానే ఛేదించే అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి కొత్త జోష్‌తో టైటిల్ వేటను ప్రారంభించింది.కొత్తగా వచ్చిన ఫిల్ సాల్ట్, కృనాల్ పాండ్యా ఆర్సీబీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. విరాట్ కోహ్లి (59 నాటౌట్) తన సహజశైలిలో అద్భుతంగా ఆడి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. హాజిల్‌వుడ్, యశ్ దయాల్, పాటిదార్ ఆర్సీబీ గెలుపులో తమవంతు పాత్ర పోషించారు. సుయాశ్ శర్మ (4-0-47-1), రసిక్ సలామ్ (3-0-35-1) తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి మ్యాచ్‌లో గెలుపు అనంతరం పాటిదార్ ఇలా అన్నాడు. ఇలాగే గెలుస్తూ పోతే ఈ సీజన్లో టైటిల్ తమదే అని ధీమా వ్యక్తం చేశాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ కావడంతో కాస్త ఒత్తిడికి గురైనట్లు తెలిపాడు. మొత్తంగా ఇది తనకు మంచి రోజని అన్నాడు. సుయాష్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంపై స్పందిస్తూ.. తనకు అభ్యంతరం లేదని తెలిపాడు. సుయాష్ తమ ప్రధాన వికెట్ టేకింగ్ బౌలరని అన్నాడు. కెప్టెన్‌గా అతనికి మద్దతు ఇచ్చానని తెలిపాడు. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా 3 వికెట్లు తీసి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించిన కృనాల్ పాండ్యాను పొగడ్తలతో ముంచెత్తాడు. గెలుపు క్రెడిట్లో కృనాల్, సుయాష్‌కు మెజార్టీ వాటా దక్కుతుందని తెలిపాడు. 13 ఓవర్ల తర్వాత వారు ధైర్యం, దృఢ సంకల్పం చూపించారని కితాబునిచ్చాడు. వారిలో వికెట్లు తీయాలనే తపన అద్భుతంగా ఉండిందని కొనియాడాడు.కోహ్లి గురించి మాట్లాడుతూ.. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని అన్నాడు. కోహ్లి లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని తెలిపాడు. క్రీడలో గొప్ప ఆటగాడి (కోహ్లి) నుంచి నేర్చుకోవడానికి ఇది తనకు గొప్ప అవకాశమని అన్నాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్‌పై స్పందిస్తూ.. అది ముందుగా నిర్ణయించుకుని ఆడిన షాట అని తెలిపాడు. కాగా, 2021 సీజన్ నుంచి కేకేఆర్‌తో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఆరింట ఓడింది. గత రెండు సీజన్లలో నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓటమిపాలైంది. తాజా గెలుపుతో ఆర్సీబీ కేకేఆర్‌పై తమ ట్రాక్ రికార్డు కాస్త మెరుగుపర్చుకుంది. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌లో సీఎస్కే ఢీకొంటుంది. మార్చి 28న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక నేటి (మార్చి 23) మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇవాళ డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్‌లో).. రాత్రి మ్యాచ్‌లో సీఎస్కే, ముంబై ఇండియన్స్ (చెన్నై) ఢీకొంటాయి. -
IPL తొలి మ్యాచ్ లో బెంగళూరు బోణీ
-
IPL 2025: తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
IPL 2025 RCB vs KKR 1st Match Live Updates: బోణీ కొట్టిన ఆర్సీబీ..ఐపీఎల్-2025లో ఆర్సీబీ బోణీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లి(59) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఫిల్‌సాల్ట్(31 బంతుల్లో 56), పాటిదార్(16 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా,సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు.విజయం దిశగా ఆర్సీబీ..తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 15 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి ఇంకా 18 పరుగులు కావాలి. క్రీజులో విరాట్ కోహ్లి(50), రజిత్ పాటిదార్(30) పరుగులతో ఉన్నారు.విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ..ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 30 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. కోహ్లి 54 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 134/2తొలి వికెట్ డౌన్..95 పరుగుల వద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి దేవ్‌దత్త్ పడిక్కల్ వచ్చాడు. 9 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 96/16 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 80/06 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(49), విరాట్ కోహ్లి(29) పరుగులతో ఉన్నారు.దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ..175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. క్రీజులో ఫిల్ సాల్ట్(26), విరాట్ కోహ్లి(11) ఉన్నారు.రహానే హాఫ్ సెంచరీ.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(56) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సునీల్ నరైన్(44),రఘువంశీ(30) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ మూడు వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, సుయాష్ శర్మ, సలీం తలా వికెట్ సాధించారు.173 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయిన కేకేఆర్హర్షిత్ రానా(5) ఔట్ఏడో వికెట్ కోల్పోయిన కేకేఆర్168 పరుగుల వద్ద ఆర్సీబీ ఏడో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ యశ్ దయాల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.18 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 165/618 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. క్రీజ్‌లో రఘు వంశీ(28), రమణ్ దీప్ సింగ్(5) ఉన్నారు.కేకేఆర్ ఆరో వికెట్ డౌన్.. రస్సెల్ ఔట్రస్సెల్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన రస్సెల్.. సుయాష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు.కృనాల్ సూపర్ బాల్.. రింకూ ఫ్యూజ్‌లు ఔట్కేకేఆర్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోతుంది. 12 పరుగులు చేసిన రింకూ సింగ్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. క్రీజులోకి అండ్రీ రస్సెల్ వచ్చాడు. 15 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 145/5నాలుగో వికెట్ డౌన్..వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన అయ్యర్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 141/4రహానే ఔట్..109 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 56 పరుగులు చేసిన రహానే.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువన్షి వచ్చాడు. 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 110/3కేకేఆర్ రెండో వికెట్ డౌన్.. సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 44 పరుగులు చేసిన నరైన్.. రసీఖ్ ధార్ సలీం బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు.రహానే హాఫ్ సెంచరీ..కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే హాఫ్ సెంచరీతో మెరిశాడు. 54 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు సునీల్ నరైన్(34) ఉన్నాడు. 9 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 96/1దూకుడుగా ఆడుతున్న రహానే..6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే(39) దూకుడుగా ఆడుతున్నాడు.4 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 25/14 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ అజింక్య రహానే(16), వెంకటేశ్ అయ్యర్(5) పరుగులతో ఉన్నారు.కేకేఆర్ తొలి వికెట్ డౌన్..టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. జోష్ హాజిల్‌వుడ్ తొలి ఓవర్లోనే కేకేఆర్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్(4)ను పెవిలియన్‌కు పంపాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య రహానే వచ్చాడు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..ఐపీఎల్-2025 తొలి మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి పోరులో ఆర్సీబీ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది.తుది జట్లురాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ దార్ సలామ్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యష్ దయాల్కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(వికెట్), వెంకటేష్ అయ్యర్, అజింక్యా రహానే(కెప్టెన్), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి 👉ఐపీఎల్-18వ సీజన్ ట్రోఫీని ఆవిష్కరించిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటిదార్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే.👉షారుఖ్ ఖాన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లి, రింకూ సింగ్👉 కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌తో కలిసి ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రసంగిస్తున్నాడు. వీరితో కేకేఆర్ ఫినిషర్ రింకూ సింగ్ జతకట్టాడు.డ్యాన్స్‌తో అదరగొడుతున్న దిశాబాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది.👉తన గాత్రంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న శ్రేయా ఘోషల్ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్-2025 ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ (Shreya Ghoshal) తన గాత్రంతో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తోంది. పుష్ఫ-2 సినిమాలోని ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను తెలుగులో పాడటం విశేషం.Shreya Ghosal is here. ❤️ pic.twitter.com/apPUNS1mG4— Kohlistic🔥 (@Kohlistic18) March 22, 2025👉ఈడెన్ గార్డెన్స్ షారుఖ్ ఖాన్ సందడిప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా జట్టు సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా ప్రసంగించాడు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌గా వెలుగొందిన క్రికెట్ లీగ్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశాడు.👉మరి కాసేపటిలో ఓపెనింగ్ సెర్మనీఐపీఎల్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి. ప్రముఖ గాయకులు శ్రేయా ఘోషల్, అర్జిత్ సింగ్, కరణ్ ఔజ్లా అభిమానులను అలరించేందుకు సిద్దమయ్యారు. వీరితో పాటు బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ తన డ్యాన్స్ ప్రదర్శనతో అదరగొట్టబోతోంది. ఇందుకోసం వీరు నలుగురు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్నారు.👉ఐపీఎల్-2025కు సర్వం సిద్దం.. ఐపీఎల్-2025 సీజన్‌కు మరి కాసేపటిలో తెరలేవనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. రాత్రి ఏడు గంటలకు టాస్ పడనుంది. 👉స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లుఇక తొలి మ్యాచ్ కోసం కేకేఆర్, ఆర్సీబీ జట్లు ఈడెన్‌గార్డెన్స్ మైదానానికి చేరుకున్నాయి. ఫ్యాన్స్ కూడా భారీగా తరలివస్తున్నారు. ఈడెన్‌గార్డెన్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.👉అభిమానులకు గుడ్న్యూస్కోల్కతాలో గత రెండు రోజులగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డింకిగా మారుతాడో ఏమో అని అభిమానులు ఆందోళను చెందుతున్నారు. అయితే ఐపీఎల్ లవర్స్‌కు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం కోల్‌కతాలో వర్షం పడడం లేదు. ఆకాశం మేఘావృతం ఉన్నప్పటికి వాతావరణం పొడిగా ఉంది.Reached Eden garden.. kya mast dikh rha hai yaar stadium#KKRvsRCB #KKRvsRCB pic.twitter.com/adGP1GcRhl— Ajay anshu (@Ajayanshu5) March 22, 2025 -
KKR Vs RCB: కోల్‌కతాలో వర్షం.. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపటి మ్యాచ్ జరిగేనా..?
ఐపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలేలా ఉన్నాడు. కేకేఆర్, ఆర్సీబీ మధ్య రేపు (మార్చి 22) జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశముందని తెలుస్తుంది. రేపు మ్యాచ్ జరిగే సమయానికి (రాత్రి 7:30 గంటలకు) వర్షం పడే అవకాశాలు 90 శాతం ఉన్నాయని వాతావరణ నివేదికలు ఇదివరకే స్పష్టం చేశాయి. దీన్ని నిజం చేస్తూ ఇవాల్టి నుంచే వర్షం మొదలైంది. NO RAIN pleaseeee!!!!pic.twitter.com/YgfkvBSfx0— CricTracker (@Cricketracker) March 21, 2025ఇవాళ రాత్రి 8 గంటల ప్రాంతంలో కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ మైదానంలో వర్షం కురుస్తూ ఉండింది. ఇవాల్టి పరిస్థితి చూసి రేపటి మ్యాచ్ జరిగేనా అని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మ్యాచ్ సమయానికి వర్షం తగ్గిపోవాలని దేవుడిని వేడుకుంటున్నారు. ఐపీఎల్ కోసం క్రికెట్ అభిమానులు చాలాకాలంగా కళ్లకు వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీజన్ ఆరంభ మ్యాచ్ రద్దైతే వారి బాధ వర్ణణాతీతం.మరోవైపు రేపటి మ్యాచ్‌కు ముందు ఈడెన్‌గార్డెన్స్‌లో ఐపీఎల్-18వ సీజన్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. ఈ ఓపెనింగ్ సెర్మనీ దాదాపుగా రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఇదిలా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ సొంత మైదానంలో జరిగే తొలి మ్యాచ్ విజయం సాధించి సీజన్‌ను ఘనంగా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. అయితే వారి ఆశలు వర్షార్పణం అయ్యేలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో కేకేఆర్ కొత్త కెప్టెన్ ఆజింక్య రహానే సారథ్యంలో బరిలోకి దిగనుంది. గత సీజన్లో కేకేఆర్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్‌కు వెళ్లాడు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా 'ఈ సాలా కప్ నమ్మదే' అనుకుంటూ ఉంది. అయితే వీరి ఆశలకు వర్షం ఆదిలోనే బ్రేకులు వేసేలా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీ కూడా కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగుతుంది. రజత్ పాటిదార్ ఆర్సీబీ నూతన నాయకుడిగా నియమితుడయ్యాడు.ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
ఈ ఏడాది ఐపీఎల్లో కోహ్లి బ్రేక్ చేయగలిగే ఐదు భారీ రికార్డులు
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రేపటి నుంచి (మార్చి 22) ప్రారంభం కానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్ ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ సొంత మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో రాత్రి 7:30 గంటలకు మొదలవుతుంది.అత్యధిక బౌండరీలుఈ సీజన్లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పలు భారీ రికార్డులు ఊరిస్తున్నాయి. ఈ సీజన్లో కోహ్లి మరో 64 బౌండరీలు బాదితే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బౌండరీలు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధవన్ పేరిట ఉంది. ధవన్ ఖాతాలో 768 బౌండరీలు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 705 బౌండరీలు ఉన్నాయి.అత్యధిక హాఫ్ సెంచరీలుఈ సీజన్లో విరాట్ మరో నాలుగు హాఫ్ సెంచరీలు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు (హాఫ్ సెంచరీ ప్లస్ సెంచరీలు) చేసిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఖాతాలో 66 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 63 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉన్నాయి.తొలి భారతీయుడిగా రికార్డుఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 114 పరుగులు చేస్తే.. టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 12886 పరుగులు ఉన్నాయి. ప్రస్తుతం విరాట్ ప్రపంచవాప్తంగా అత్యధిక టీ20 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (14562), అలెక్స్ హేల్స్ (13610), షోయబ్ మాలిక్ (13537), కీరన్ పోలార్డ్ (13537), డేవిడ్ వార్నర్ (12913) టాప్-5లో ఉన్నారు.తొలి ప్లేయర్‌గా..!ఈ ఐపీఎల్ సీజన్లో విరాట్ మరో 24 పరుగులు చేస్తే ఆసియా ఖండంలో 11000 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు.విరాట్ ఆసియాలో ఇప్పటివరకు 10976 పరుగులు స్కోర్ చేశాడు.ఓపెనర్‌గా 5000 పరుగులుఈ ఐపీఎల్లో విరాట్ మరో 97 పరుగులు చేస్తే టీ20 క్రికెట్లో 5000 పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్ల జాబితాలో చేరతాడు.ఐపీఎల్ 2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్తిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భాండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిఖ్ సలాం ధార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో కేకేఆర్ జట్టు..అజింక్య రహానే (కెప్టెన్), మనీశ్ పాండే, రింకూ సింగ్, రోవ్‌మన్ పావెల్, అంగ్క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, రమన్‌దీప్ సింగ్, వెంకటేశ్ అయ్యర్, మొయిన్ అలీ, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్, క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్బాజ్, లవ్నిత్ సిసోడియా, వరుణ్ చక్రవర్తి, మయాంక్ మార్కండే, వైభవ్ అరోరార, హర్షిత్ రాణా, అన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, స్పెన్సర్ జాన్సన్ -
IPL 2025: రజత్‌ను ఆశీర్వదించండి.. ఆర్సీబీ అభిమానులకు విరాట్ పిలుపు
యువ ఆటగాడు రజత్ పాటీదార్ సుదీర్ఘ కాలం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కెప్టెన్‌గా కొనసాగుతాడని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. రజత్‌ను ఆశీర్వదించాలని ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా పిలుపునిచ్చాడు. గత సీజన్లో డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఈ సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంచైజీ సారథ్య బాధ్యతలను రజత్ పాటీదార్‌కు అందించింది. విరాట్ మాటల్లో..‘రజత్ పెద్ద బాధ్యతలు అందుకున్నాడు. సుదీర్ఘ కాలం అతడు సారథిగా కొనసాగుతాడు. జట్టును నడిపంచేందుకు అతడికి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయి’ అని విరాట్ అన్నాడు. ఇక లీగ్ ఆరంభం (2008) నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న విరాట్ కోహ్లి... ఇదంతా ఆర్సీబీ అభిమానుల ప్రేమాభిమానాల వల్లే సాధ్యమైందని అన్నాడు. ‘18 సంవత్సరాలుగా ఆర్సీబీకి ఆడుతున్నా. ఇదో అద్భుతమైన అనుభూతి. ప్రతి సీజన్‌కు ముందు అదే ఉత్సాహం నన్ను మరింత ఉత్తేజపరుస్తోంది. జట్టులో నైపుణ్యానికి కొదవలేదు. ఈ బృందంతో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని అన్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్ గెలిచాక అంతర్జాతీయ స్థాయిలో ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి ఆ తర్వాత తొలిసారి ఐపీఎల్ ఆడనున్నాడు.గౌరవం.. ఆనందం.. సక్రమంగా నిర్వర్తిస్తా: పాటీదార్బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని రజత్ పాటీదార్ అన్నాడు. ‘విరాట్, డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్టుకు సారథిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. వీళ్ల ఆటను చూస్తూనే పెరిగా. చిన్నప్పటి నుంచే ఆర్సీబీ అంటే ప్రత్యేక అభిమానం. కెప్టెన్సీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తా’ అని ఆర్సీబీ జట్టు సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పాటీదార్ వ్యాఖ్యానించాడు. -
IPL 2025: ఓపెనర్లుగా కోహ్లి, సాల్ట్.. ఆర్సీబీ ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..?
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ ఎడిషన్ మరో 5 రోజుల్లో (మార్చి 22) ప్రారంభం కానుంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ సాధించని ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ కేకేఆర్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది.అన్ని సీజన్లకు ముందు లాగే ఈ సారి కూడా ఆర్సీబీ 'ఈ సాలా కప్ నమ్మదే' అన్న నినాదంతో బరిలోకి దిగుతుంది. 17 సీజన్లలో ఒక్క సారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ ఈసారి ఎలాగైనా తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తుంది. ఈ సారి ఓ అంశం ఆర్సీబీ టైటిల్ కలను సాకారం చేసేలా సూచిస్తుంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్.. ఈ సారి ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య మ్యాచ్ అవుతున్నాయి. విరాట్ జెర్సీ నంబర్ 18 కాగా.. ఈ యేడు ఐపీఎల్ ఎడిషన్ సంఖ్య కూడా పద్దెనిమిదే. ఇలాగైనా విరాట్ లక్కీ నంబర్ 18 ఆర్సీబీకి టైటిల్ సాధించిపెడుతుందేమో చూడాలి.ఇదిలా ఉంటే, గత సీజన్లతో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్లో కాస్త ఫ్రెష్‌గా కనిపిస్తుంది. కొత్త కెప్టెన్ (రజత్ పాటిదార్), కొత్త ఆటగాళ్లతో బెంగళూరు ఫ్రాంచైజీ ఉరకలేస్తుంది. మెగా వేలానికి ముందు విరాట్ (21 కోట్లు), రజత్ పాటిదార్ (11 కోట్లు), యశ్ దయాల్‌ను (5 కోట్లు) మాత్రమే అట్టిపెట్టుకున్న ఆర్సీబీ.. మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్, సిరాజ్ లాంటి స్టార్లను వదిలేసింది.మెగా వేలంలో ఆర్సీబీకి 25 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశం ఉన్నా కేవలం 22 మందితోనే సరిపెట్టుకుంది. వేలంలో ఆర్సీబీ ఫిల్ సాల్ట్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ లాంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లను.. హాజిల్‌వుడ్, ఎంగిడి లాంటి స్టార్ విదేశీ పేసర్లను కొనుగోలు చేసింది. దేశీయ స్టార్లు జితేశ్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దేవ్‌దత్ పడిక్కల్, కృనాల్ పాండ్యాపై కూడా ఆర్సీబీ మేనేజ్మెంట్ నమ్మకముంచింది.ఈ సీజన్ కోసం ఆర్సీబీ ఎంపిక చేసుకున్న జట్టును చూస్తే.. ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కూడా ధృవీకరించాడు. వన్‌డౌన్‌లో కెప్టెన్ రజత్ పాటిదార్.. నాలుగో స్థానంలో లివింగ్‌స్టోన్, ఐదో స్థానంలో జితేశ్ శర్మ, ఆరో ప్లేస్‌లో టిమ్ డేవిడ్, ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా, బౌలర్లుగా భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, హాజిల్‌వుడ్, సుయాశ్ శర్మ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.ఆర్సీబీ మొత్తం జట్టు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, జితేశ్ శర్మ, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికారా, లియామ్ లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్ భాండగే, జాకబ్ బెథెల్, జోష్ హాజల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలాం దార్, సుయశ్ శర్మ, నువాన్ తుషారా, లుంగి ఇన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రతీ, యశ్ దయాల్. -
RCB ఫ్యాన్స్ ను కెలికిన రాయుడు
-
IPL 2025: కోహ్లీ ఈసారైనా టైటిల్ సాధించేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే ఈ జట్టు ఇంతవరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని సాధించలేకపోవడం ఒకింత ఆశ్చర్యకరం. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలేసే స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మస్కట్ గా ఉన్న ఈ జట్టుకి ఎందుకో ఇంతవరకు ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయాడు.ఐపీఎల్ 2025 ప్రారంభం రోజున (మార్చి 22) కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో గతేడాది టైటిల్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగే మ్యాచ్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తన టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ అదృష్టం కలిసి రానందువల్ల ఆర్సీబీ ఇంతవరకు టైటిల్ సాధించలేకపోయిందని భావించినట్టయితే, ఈ సీజన్ అందుకు చాల అనుకూలమైనది గా భావించాలి. ఎందుకంటే ఐపిఎల్ సీజన్ 18 స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఐకానిక్ జెర్సీ నంబర్ 18 తో సరిగ్గా సరిపోతుంది. చాలా కాలంగా జెర్సీ నంబర్ 18 కి పర్యాయపదంగా ఉన్న విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఈ సారైనా టైటిల్ సాధించి పెడతాడని అతని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రజత్ పాటిదార్ కి కెప్టెన్సీ బాధ్యతలుఇక జట్టు కూర్పును చూస్తే, దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణిస్తున్న 31 ఏళ్ల రజత్ పాటిదార్ కి ఆర్సీబీ ఈసారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ చేపట్టనున్నప్పటికీ, పాటిదార్ 2024-25 సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ లో మధ్యప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో మధ్యప్రదేశ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. మెగా వేలం ద్వారా గణనీయమైన మార్పులు చేసిన తర్వాత ఆర్సీబీ కొత్త దృక్పథంతో, కొత్త ఉత్సాహంతో ఐపీఎల్-2025లోకి అడుగుపెడుతుంది. గత సీజన్లో ఆర్సీబీ వరుసగా ఆరు మ్యాచ్‌లను గెలిచి టాప్ నాలుగు స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్‌లకు అర్హత సాధించింది. చివరికి రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఎలిమినేటర్‌లో పరాజయం చవిచూసింది. ఆర్సీబీ మరోసారి సామర్థ్యంతో నిండిన జట్టును నిర్మించింది. శక్తివంతమైన బ్యాటింగ్ లైనప్, బలీయమైన బౌలింగ్, నాయకత్వ అనుభవం, కలగలిసి ఈ సీజన్ లోనైనా తొలి టైటిల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ఫిల్ సాల్ట్ తో కోహ్లీ ఓపెనింగ్ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ను ఆర్సీబీ రూ. 11.50 కోట్లకు తీసుకుంది. గత సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడంలో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు. 12 మ్యాచ్‌ల్లో 182.01 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు సాధించాడు. గత సీజన్లో ఓపెనర్‌గా అతను సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆర్సీబీలో సాల్ట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మరియు విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉన్నందున, జట్టు అసాధారణమైన టాప్ ఆర్డర్‌ను సమకూర్చుకుంది. మిడిల్ ఆర్డర్లో రజత్ పాటిదార్, లియామ్ లివింగ్‌స్టోన్ మరియు టిమ్ డేవిడ్ ఉండటం జట్టు లైనప్‌ను మరింత బలోపేతం అవుతుంది. యావ బ్యాట్స్‌మన్ జితేష్ శర్మ కీపింగ్ విధులను కూడా నిర్వహిస్తాడు.సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీ రావడంతో వారి బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన బలాన్నిచ్చింది. ముంబై ఇండియన్స్‌తో బిడ్డింగ్ యుద్ధం తర్వాత ఆస్ట్రేలియన్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ సేవలను పొందేందుకు ఆర్సీబీ రూ. 12.50 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా లుంగి ఎంగిడి, నువాన్ తుషార వంటి ఫాస్ట్ బౌలర్లను చేర్చుకోవడం వలన ఆర్సీబీ బౌలింగ్ బలీయంగా ఉంది.ఫీల్ సాల్ట్: గత సంవత్సరం కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్ సాధించడం లో కీలక పాత్ర పోషించిన సాల్ట్ ఈసారి జట్టులో చేరడంతో ఆర్సీబీ బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. గత సీజన్లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించిన సాల్ట్ మళ్ళీ అదే రీతిలో విజృభించి ఆడతాడని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు. భువనేశ్వర్ కుమార్: ఎంతో అనుభవ్గుణుడైన సీనియర్ బౌలర్ భువనేశ్వర్ జట్టులో చేరడంతో ఆర్సీబీ బౌలింగ్ లైనప్‌కు గణనీయమైన పదును లభించింది. కొత్త బంతిని స్వింగ్ మరియు డెత్ ఓవర్లలో యార్కర్లను వేసే సామర్థ్యం ఉన్న భువనేశ్వర్ జట్టు బౌలింగ్ కి కీలకం అనడంలో సందేహం లేదు. రజత్ పాటిదార్: ఆర్సీబీ తొలి సారి ఐపీఎల్ టైటిల్ సాధించాల్సిన బృహత్తర బాధ్యత రజత్ పాటిదార్ పై ఉంది. మంచి ఫామ్ తో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రజత్ పాటిదార్ జట్టును ముందుండి నడిపించడం ఆర్సీబీకి చాల ముఖ్యం.విరాట్ కోహ్లీ: ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి మంచి ఫామ్ లో ఉన్న కోహ్లీ కి ఐపీల్ సీజన్ 18 చాల కీలకం. చాలా సంవత్సరాలుగా ఐపీఎల్ ట్రోఫీని గెలవాలనే కోహ్లీ ఆకాంక్ష ఈ సారైనా నెరవేరుతుందేమో చూడాలి.ఆర్సీబీ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యష్ దయాల్, జోష్ హాజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్‌స్టోన్, రసిక్ దార్, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, స్వస్తిక్ చికర, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రథీ. -
న్యూ లుక్‌లో విరాట్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
ఆర్సీబీకి ఆడాలని ఆరాటపడుతున్న పాక్ ఫాస్ట్ బౌలర్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అమీర్ ఐపీఎల్ ఆడాలని తెగ ఆరాటపడిపోతున్నాడు. ప్రత్యేకించి ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటున్నాడు. భారత్‌తో దౌత్యపరమైన సంబంధాలు సరిగ్గా లేని కారణంగా పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్లో ఎంట్రీ లేని విషయం తెలిసిందే. అయితే అమీర్ బ్రిటన్ పౌరసత్వం పొంది తన ఐపీఎల్ కల నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాడు. అమీర్‌కు 2026 నాటికి యూకే పాస్ట్‌పోర్ట్ వస్తుంది. అప్పుడు ఐపీఎల్ వేలంలో తన పేరును రిజిస్టర్ చేసుకోవాలని అనుకుంటున్నాడు.విరాట్ అంటే అమితమైన అభిమానంఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ అయిన అమీర్‌కు విరాట్ కోహ్లి అంటే అమితమైన అభిమానం. ఈ విషయాన్ని అమీర్ చాలా సందర్భాల్లో చెప్పాడు. 2016 టీ20 ప్రపంచకప్‌కు ముందు కోహ్లి తనకు బ్యాట్‌ను బహుమతిగా ఇచ్చిన విషయాన్ని అమీర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఇదే సందర్భంగా అమీర్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి ప్రతిభను ఆరాధించే వ్యక్తి అని కొనియాడాడు. కోహ్లి తనకు బ్యాట్ ఇచ్చినప్పుడు ఉప్పొంగిపోయానని చెప్పుకొచ్చాడు. తాను కోహ్లి బ్యాటింగ్‌ను ఆరాధిస్తానని.. కోహ్లి తన బౌలింగ్‌ను గౌరవిస్తాడని తెలిపాడు. కోహ్లి ఇచ్చిన బ్యాట్‌తో చాలా మంచి ఇన్నింగ్స్‌లు ఆడానని గుర్తు చేసుకున్నాడు. అమీర్ ఆర్సీబీలో చేరితే ఆ జట్టు టైటిల్ కల నెరవేరుతుందని మరో పాకిస్తాన్ ఆటగాడు అహ్మద్ షెహజాద్ అభిప్రాయపడ్డాడు. ఆర్సీబీ బౌలింగ్ సమస్యలు పరిష్కరించడానికి అమీర్ లాంటి బౌలర్ అవసరమని షెహజాద్ అన్నాడు. ఆర్సీబీ బ్యాటింగ్ ఎల్లప్పుడూ బలంగా ఉంది. వారికి బౌలింగే పెద్ద సమస్య. అమీర్ వారితో చేరితే వారు టైటిల్ గెలుస్తారని షెహజాద్ జోస్యం చెప్పాడు.కాగా, 32 ఏళ్ల అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తిరిగి 2024లో (టీ20 ప్రపంచకప్ కోసం) రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. అయితే 2024 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అమీర్‌ను ఎంపిక చేయలేదు. ప్రస్తుతం అమీర్ ప్రపంచవ్యాప్తంగా వివిథ లీగ్‌ల్లో (ఐపీఎల్ మినహా) ఆడుతున్నాడు.ఇదిలా ఉంటే, ఆర్సీబీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లోనే డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడనుంది. మార్చి 22న జరిగే ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగనుంది. ఈ ఏడాది ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు. గత రెండు సీజన్లలో సారథ్యం వహించిన డుప్లెసిస్‌ను ఆర్సీబీ మెగా వేలానికి ముందు వదులుకుంది.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి శుభవార్త
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న జేకబ్ బేతెల్ (ఇంగ్లండ్ ఆటగాడు) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బేతెల్ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని సమాచారం. బేతెల్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్‌గా గుర్తుంపు తెచ్చుకున్న బేతెల్‌ను ఆర్సీబీ గతేడాది మెగా వేలంలో రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. బేతెల్ మిడిలార్డర్లో విధ్వంకర బ్యాటింగ్ చేయడంతో పాటు ఉపయోగకరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. బేతెల్ ఇప్పటివరకు 63 టీ20లు ఆడి 136.77 స్ట్రయిక్‌రేట్‌తో 1127 పరుగులు చేశాడు. గతేడాది చివర్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బేతెల్ 3 టెస్ట్‌లు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. బేతెల్ టెస్ట్‌ల్లో 3, వన్డేల్లో 2, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బేతెల్ మొత్తంగా అంతర్జాతీయ కెరీర్లో 674 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. 21 ఏళ్ల బేతెల్‌కు ఇది తొలి ఐపీఎల్ అవుతుంది. ఆర్సీబీ.. మార్చి 22న కోల్‌కతాలో జరిగే లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడుతుంది. ఈ ఏడాదే ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు.ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్మార్చి 22- కేకేఆర్తోమార్చి 28- సీఎస్కేఏప్రిల్ 2- గుజరాత్ఏప్రిల్ 7- ముంబైఏప్రిల్ 10- ఢిల్లీఏప్రిల్ 13- రాజస్థాన్ఏప్రిల్ 18- పంజాబ్ఏప్రిల్ 20- పంజాబ్ఏప్రిల్ 24- రాజస్థాన్ఏప్రిల్ 27- ఢిల్లీమే 3- సీఎస్కేమే 9- లక్నోమే 13- సన్రైజర్స్మే 17- కేకేఆర్ -
ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే పరిమితం
డబ్ల్యూపీఎల్ 2025 ఎడిషన్‌లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న ఎల్లిస్ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది. ఓపెనర్ వ్యాట్ హాడ్జ్ 4, రిచా ఘోష్ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్ (22), జార్జియా వేర్హమ్ (20 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్ గార్త్ (14) రెండంకెల స్కోర్ చేసింది. స్నేహ్ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్ బౌలర్లలో కశ్వీ గౌతమ్ (4-0-17-1), తనూజా కన్వర్ (4-0-16-2), కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు.కాగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ సీజన్ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్ ఓవర్లో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. -
ఆర్సీబీ నూతన కెప్టెన్ రజత్ పాటిదార్ పర్సనల్ ( ఫోటోలు )
-
WPL 2025: గుజరాత్ బ్యాటర్ సిక్సర్ల సునామీ.. ఆర్సీబీ ముందు భారీ లక్ష్యం
మహిళల ఐపీఎల్ (WPL) మూడో సీజన్ ఇవాళ (ఫిబ్రవరి 14) ఘనంగా ప్రారంభమైంది. లీగ్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గత రెండు సీజన్లుగా పేలవ ప్రదర్శన (టేబుల్ లాస్ట్) కనబర్చిన గుజరాజ్ జెయింట్స్ (GG) తలపడుతున్నాయి. వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకపోవడం తప్పని ఆర్సీబీకి ఇన్నింగ్స్ మధ్యలో అర్థమైంది. మాజీ కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ అర్ద సెంచరీతో రాణించి జెయింట్స్ ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేసింది. మూనీ 42 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 56 పరుగులు చేసి ఔటైంది. మరో ఓపెనర్ లారా వోల్వార్డ్ 10 బంతుల్లో బౌండరీ సాయంతో కేవలం 6 పరుగులకే నిష్క్రమించి నిరాశపర్చింది. వన్‌డౌన్‌లో వచ్చిన దయాలన్ హేమలత 9 బంతుల్లో 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టింది. అనంతరం బరిలోకి దిగిన ఈ సీజన్ కొత్త కెప్టెన్ ఆష్లే గార్డ్నర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.గార్డ్నర్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 79 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో డియాండ్ర డొట్టిన్ కూడా సుడిగాల ఇన్నింగ్స్ ఆడింది. డొట్టిన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 25 పరుగులు చేసింది. ఆఖర్లో సిమ్రన్ షేక్, హర్లీన్ డియోల్ కూడా బ్యాట్ ఝులిపించారు. సిమ్రన్ బంతుల్లో బౌండరీ, సిక్సర్ సాయంతో 11 పరుగులు.. హర్లీన్ 4 బంతుల్లో 2 బౌండరీల సాయంతో 9 పరుగులు (నాటౌట్) చేశారు. ఇన్నింగ్స్ 18, 19 ఓవర్లలో గార్డ్నర్, సిమ్రన్ చెలరేగి పోయారు. ఈ రెండు ఓవర్లలో గార్డ్నర్ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదింది. సిమ్రన్ బౌండరీ, సిక్సర్‌తో చెలరేగింది. ఫలితంగా 40 పరుగులు వచ్చాయి.25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గార్డ్నర్ఈ మ్యాచ్‌లో గార్డ్నర్ కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. తద్వారా లీగ్ చరిత్రలో నాలుగో వేగవంతమైన హాఫ్ సెంచరీని నమోదు చేసింది. డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్ ఫిఫ్టి రికార్డు గుజరాత్‌కే చెందిన సోఫీ డంక్లీ పేరిట ఉంది. డంక్లీ 2023 సీజన్లో ఆర్సీబీపై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది. లీగ్‌లో రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు ఢిల్లీకి చెందిన షఫాలీ వర్మ పేరిట ఉంది. షఫాలీ 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసింది.ఆతర్వాత 2023 సీజన్లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 22 బంతుల్లో అర్ద సెంచరీ చేసింది. ఈమె తర్వాత గ్రేస్ హ్యారిస్ (యూపీ), కిరణ్ నవ్‌గిరే (యూపీ), ఇవాళ గార్డ్నర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. సిక్సర్ల సునామీఈ మ్యాచ్‌లో గార్డ్నర్ సిక్సర్ల సునామీ సృష్టించింది. గార్డ్నర్ ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా అందరిపై విరుచుకుపడింది. ఈ మ్యాచ్‌లో ఆమె ఏకంగా 8 సిక్సర్లు బాదింది. లీగ్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో ఓ బ్యాటర్ కొట్టిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023 సీజన్లో సోఫీ డివైన్ కూడా గుజరాత్‌పై 8 సిక్సర్లు కొట్టింది. -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్.. అధికారిక ప్రకటన
ఐపీఎల్ 2025 (IPL) సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నూతన కెప్టెన్‌ను ప్రకటించింది. వచ్చే సీజన్లో ఆర్సీబీ కెప్టెన్‌గా రజత్ పాటిదార్ (Rajat Patidar) వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ఇవాళ (ఫిబ్రవరి 13) అధికారికంగా వెల్లడించింది. 31 ఏళ్ల పాటిదార్ గత కొన్ని సీజన్లుగా ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా వ్యవహిరిస్తున్నాడు. తొలుత ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి మళ్లీ బాధ్యతలు చేపడతాడని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారమంతా ఊహాగానాలే అని తేలిపోయింది. విరాట్‌కు కెప్టెన్సీ చేసే ఉద్దేశం లేకనే పాటిదార్ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. పాటిదార్.. గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. పాటిదార్‌కు రంజీల్లో మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం ఉంది. పాటిదార్ కొన్ని సందర్భాల్లో ఆర్సీబీ కెప్టెన్‌గానూ (తాత్కాలిక) వ్యవహరించాడు. తాజా పరిణామంతో పాటిదార్ ఆర్సీబీ ఎనిమిదో కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గతంలో రాహుల్ ద్రవిడ్ (2008), కెవిన్ పీటర్సన్ (2009), అనిల్ కుంబ్లే (2009), డేనియల్ వెటోరీ (2011), విరాట్ కోహ్లి (2011), షేన్ వాట్సన్ (2017), ఫాప్ డుప్లెసిస్ (2022) ఆర్సీబీ కెప్టెన్లుగా వ్యవహరించారు.2022 నుంచి 2024 వరకు ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను మెగా వేలంలో తిరిగి రీటైన్ చేసుకోకపోవడంతో 2025 సీజన్‌కు ముందు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఉండింది. 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన పాటిదార్ అప్పటినుంచి ఆర్సీబీలోనే కొనసాగుతున్నాడు. పాటిదార్.. తనదైన శైలిలో విధ్వంసం సృష్టించి ఆర్సీబీ మిడిలార్డర్లో డ్యాషింగ్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటిదార్.. స్పిన్ మరియు పేస్ బౌలింగ్‌ను సమర్దవంతంగా ఎదుర్కొంటాడు. ఐపీఎల్ కెరీర్లో 27 మ్యాచ్‌లు ఆడిన పాటిదార్ 158.85 స్ట్రయిక్‌రేట్‌తో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్ద సెంచరీలు ఉన్నాయి.పాటిదార్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలానికి ముందు ఆర్సీబీ రూ. 11 కోట్లు పెట్టి రీటైన్ చేసుకుంది. ఆర్సీబీ రీటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో పాటిదార్ ఒకడు. పాటిదార్ కాకుండా ఆర్సీబీ విరాట్ కోహ్లి, యశ్ దయాల్‌ను రీటైన్ చేసుకుంది.కాగా, ఐపీఎల్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా సాధించని విషయం తెలిసిందే. 2009, 2011, 2016లో రన్నకప్గా నిలిచిన ఈ జట్టు.. 2015, 2020, 2021, 2022, 2024 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు చేరింది. -
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ వెన్నులో వణుకు..!
భారత్-ఇంగ్లండ్ టీ20 సిరీస్ తర్వాత ఆర్సీబీ (RCB) వెన్నులో వణుకు మొదలైంది. ఈ సిరీస్‌లో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ ఆటగాళ్లు (England Players) దారుణంగా విఫలం కావడమే ఇందుకు కారణం. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ (Phil Salt), లియామ్ లివింగ్‌స్టోన్ (Liam Livingstone), జేకబ్ బేతెల్‌ను (Jacob Bethell) ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ ముగ్గురు తాజాగా ముగిసిన సిరీస్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక చతికిలపడ్డారు.రూ. 11.50 కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫిల్ సాల్ట్ చివరి టీ20 మినహా సిరీస్ మొత్తంలో విఫలమయ్యాడు. రూ. 8.75 కోట్ల ధర పలికిన లియామ్ లివింగ్‌స్టోన్ ఒక్క మూడో టీ20లో మాత్రమే కాస్త పర్వాలేదనిపించాడు. రూ. 2.6 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన జేకబ్ బేతెల్ సిరీస్ మొత్తంలో ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించలేక తస్సుమనిపించాడు.భారీ అంచనాలతో కొనుగోలు చేసిన తమ ఆటగాళ్లు ఘోరంగా విఫలం కావడంతో ఆర్సీబీ యాజమాన్యానికి గుబులు పుట్టుకుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి (మెగా వేలంలో) తప్పు చేశామా అని ఆత్మపరిశీలన చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లండ్ విధ్వంసకర వీరుల త్రయం తమ ఫేట్‌ను మారుస్తుందని ఆర్సీబీ అభిమానులు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఇంగ్లండ్ ఆటగాళ్ల చెత్త ప్రదర్శనల తర్వాత వారి అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి. 'ఈ సాలా కప్ నమ్మదే' అంటూ ప్రతి యేడు డప్పు కొట్టుకునే ఆర్సీబీ అభిమానులకు 2025 సీజన్ ప్రారంభానికి ముందే తమ భవిష్యత్తు అర్దమైపోయింది. ఐపీఎల్ ప్రారంభానికి మరో నెలన్నర రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ మధ్యలో ఆర్సీబీకి చెందిన ఇంగ్లండ్ బ్యాటింగ్ త్రయం టీ20లు ఆడేది లేదు. మరి ఐపీఎల్ బరిలోకి నేరుగా దిగి వీరేమి చేస్తారో వేచి చూడాలి.కాగా, భారత్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ 1-4 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమయ్యారు. ఈ సిరీస్‌లోని మూడో టీ20లో మాత్రమే ఇంగ్లండ్ విజయం సాధించగలిగింది. ఆ మ్యాచ్‌లోనూ భారత ఆటగాళ్ల స్వయంకృతాపరాధాల వల్లే ఇంగ్లండ్ గెలవగలిగింది.ఈ సిరీస్‌లో భారత ప్రదర్శన విషయానికొస్తే.. భారత ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ వీరలెవెల్లో విజృంభించగా.. బౌలింగ్‌లో వరుణ్ చక్రవరి అంచనాలకు మించి రాణించాడు. ఈ సిరీస్‌లో లీడింగ్ రన్ స్కోరర్.. లీడింగ్ వికెట్ టేకర్లు వీరిద్దరే. చివరి టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి విధ్వంసకర శతకం బాదిన అభిషేక్.. ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 219.69 స్ట్రయిక్‌రేట్‌తో 276 పరుగులు చేశాడు. వరుణ్ ఈ సిరీస్‌లో 5 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. -
ఆర్సీబీకి బ్యాడ్ న్యూస్.. సీజన్ మెత్తానికి స్టార్ ప్లేయర్ దూరం
డబ్ల్యూపీఎల్-2025 సీజన్ ఆరంభానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, న్యూజిలాండ్ కెప్టెన్ సోఫీ డివైన్(Sophie Devine) ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యారు. డొమాస్టిక్ క్రికెట్‌కు కొంత కాలంగా దూరంగా ఉండాలని డివైన్ నిర్ణయించుకున్నారు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అయితే సోఫీ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని మాత్రం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. ఇది నిజంగా ఆర్సీబీకి గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే గతేడాది డబ్ల్యూపీఎల్ టైటిల్ ఆర్సీబీ గెలుచుకోవడంలో డివైన్ది కీలక పాత్ర.2024 డబ్ల్యూపీఎల్ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన డివైన్.. 136 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ ఏడాది సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. ఇక ఈ స్టార్ ఆల్‌రౌండర్ నిర్ణయానికి బోర్డు పూర్తిగా మద్దతునిచ్చిందని ఉమెన్స్ హై పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ హెడ్ లిజ్ గ్రీన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు."ఆటగాళ్ల ఫిట్నెస్, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. మా హై పెర్ఫార్మెన్స్ యూనిట్ స్టాఫ్ నుంచి సోఫీకి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుంది. ఆమె సరైన నిర్ణయమే తీసుకుందని మేము భావిస్తున్నాము. సోఫీకి ఇప్పుడు విశ్రాంతి ఎక్కువగా లభిస్తుంది. ఇది న్యూజిలాండ్ క్రికెట్‌కు సానుకూల ఆంశమని" గ్రీన్ వెల్లడించారు.కాగా డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బరోడా వేదికగాగుజరాత్ జెయింట్స్‌తో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ టోర్నీకి వడోదరా (కొటాంబి స్టేడియం), బెంగళూరు (చిన్నస్వామి స్టేడియం), ముంబై (బ్రబోర్న్ స్టేడియం), లక్నో (ఎకానా క్రికెట్ స్టేడియం) ఆతిథ్యమివ్వనున్నాయి.డబ్ల్యూపీఎల్-2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇదే..స్మృతి మంధాన, ఎస్ మేఘన, రిచా ఘోష్, ఎలీస్ పెర్రీ, జార్జియా వేర్హామ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభనా, , రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిష్త్, కేట్ క్రాస్, కనికా అహుజా, డాని-వ్యాట్ (యూపీ వారియర్స్ నుంచి ట్రేడ్).చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టీ20.. వరల్డ్ రికార్డుపై కన్నేసిన అర్ష్‌దీప్ -
ఆర్సీబీలోకి ఇంగ్లండ్ ఆల్‌రౌండర్
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ ఛార్లీ డీన్ మహిళల ఆర్సీబీ జట్టుకు ఎంపికైంది. ఆస్ట్రేలియా బౌలింగ్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్ గాయపడటంతో ఆమె స్థానంలో ఛార్లీ డీన్ ఆర్సీబీలోకి వచ్చింది. డీన్‌ను ఆర్సీబీ 30 లక్షలకు సొంతం చేసుకుంది. మోకాలి గాయం కారణంగా మోలినెక్స్ డబ్ల్యూపీఎల్ తదుపరి ఎడిషన్‌కు (2025) దూరం కానుందని ఆర్సీబీ ప్రకటించింది. డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. గత ఎడిషన్ ఫైనల్లో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.మోలినెక్స్: లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్ అయిన మోలినెక్స్ ఆసీస్ తరఫున 3 టెస్ట్‌లు, 13 వన్డేలు, 28 టీ20లు ఆడింది. మోలినెక్స్ తన అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 71 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 23, టీ20ల్లో 41 వికెట్లు) తీసింది.ఛార్లీ డీన్: రైట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన డీన్ ఇంగ్లండ్ తరఫున 3 టెస్ట్‌లు, 39 వన్డేలు, 36 టీ20లు ఆడింది. ఇందులో మొత్తంగా 122 వికెట్లు (టెస్ట్‌ల్లో 7, వన్డేల్లో 69, టీ20ల్లో 46 వికెట్లు) తీసింది.కాగా, మహిళల ఐపీఎల్ ఇప్పటివరకు రెండు ఎడిషన్ల పాటు విజయవంతంగా సాగింది. తొలి ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలువగా.. రెండో ఎడిషన్‌లో ఆర్సీబీ ఛాంపియన్‌గా నిలిచింది. మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకు జరుగనుంది. 2025 డబ్ల్యూపీఎల్ మొత్తం నాలుగు వేదికల్లో జరుగనుంది. బెంగళూరు, లక్నో, ముంబై, వడోదరాలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. తదుపరి సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.డబ్ల్యూపీఎల్-2025లో పాల్గొనే జట్లు, ఆటగాళ్ల వివరాలు..ఢిల్లీ క్యాపిటల్స్: జెమీమా రోడ్రిగెజ్, మెగ్ లాన్నింగ్, షఫాలీ వర్మ, స్నేహ దీప్తి, తనియా భాటియా, సారా బ్రైస్, నందిని కశ్యప్, అలైస్ క్యాప్సీ, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, అరుంధతి రెడ్డి, జెస్ జొనాసెన్, మారిజన్ కాప్, మిన్ను మణి, రాధా యాదవ్, శిఖా పాండే, నికీ ప్రసాద్, నల్లపురెడ్డి చరణి, టిటాస్ సాధుగుజరాత్ జెయింట్స్: భారతి ఫుల్మలి, లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, ప్రియా మిశ్రా, సిమ్రన్ షేక్, బెత్ మూనీ, ఆష్లే గార్డ్నర్, దయాలన్ హేమలత, హర్లీన్ డియోల్, సయాలి సత్గరే, తనూజా కన్వర్, డేనియల్ గిబ్సన్, డియండ్రా డొట్టిన్, కష్వీ గౌతమ్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ షకీల్, ప్రకాశిక నాయక్ముంబై ఇండియన్స్: యస్తికా భాటియా, కమలిని, అమన్‌దీప్ కౌర్, అమన్‌జోత్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయాన్, హర్మన్‌ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, జింటిమణి కలిత, కీర్తన బాలకృష్ణన్, నాట్ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సంజీవన్ సజనా, అక్షిత మహేశ్వరి, సంస్కృతి గుప్త, నదినే డి క్లెర్క్, సైకా ఇషాఖీ, షబ్నిమ్ ఇస్మాయిల్ఆర్సీబీ: డేనియల్ వ్యాట్ హాడ్జ్, సబ్బినేని మేఘన, స్మృతి మంధన, రిచా ఘోష్, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, కనిక అహుజా, శ్రేయాంక పాటిల్, సోఫీ డివైన్, జోషిత, ప్రేమా రావత్, రాఘవి బిస్త్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, రేణుకా సింగ్, జాగ్రవి పవార్, ఛార్లీ డీన్యూపీ వారియర్జ్: కిరణ్ నవ్‌గిరే, శ్వేతా సెహ్రావత్, వృందా దినేశ్, ఆరూషి గోయల్, అలైసా హీలీ, చమారీ ఆటపట్టు, దీప్తి శర్మ, గ్రేస్ హ్యారిస్, పూనమ్ ఖేమ్నార్, సోఫీ ఎక్లెస్టోన్, తహిల మెక్‌గ్రాత్, ఉమా ఛెత్రీ, క్రాంతి గౌడ్, అంజలి శర్వాని, గౌహెర్ సుల్తానా, రాజేశ్వరి గైక్వాడ్, సైమా ఠాకోర్, అలానా కింగ్ -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చిన స్టార్ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి గుడ్ న్యూస్ అందింది. బిగ్ బాష్ లీగ్‌లో పేలవ ఫామ్‌లో ఉండిన ఆ జట్టు స్టార్ ప్లేయర్ జేకబ్ బేతెల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. హోబర్ట్ హరికేన్స్‌తో ఇవాళ (జనవరి 14) జరిగిన మ్యాచ్‌లో బేతెల్ మెరుపు అర్ద సెంచరీ (50 బంతుల్లో 87; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించాడు. ఫలితంగా అతని జట్టు మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. JACOB BETHELL - A SPECIAL PLAYER. 🌟The Highlights of Jacob Bethel's 87(50) in the BBL and all players combined made 61(70) - Bethel, The Future of RCB. 🔥pic.twitter.com/zIyhli7iOi— Tanuj Singh (@ImTanujSingh) January 14, 2025మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ రాణించలేదు. టిమ్ సీఫర్ట్ (24), కెప్టెన్ సదర్‌ల్యాండ్ (15) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. జోష్ బ్రౌన్ 6, మార్కస్ హ్యారిస్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 7, హ్యారీ డిక్సన్ 1, టామ్ రోజర్స్ 5 (నాటౌట్), ఫెర్గస్ ఓనీల్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఇల్లిస్, మిచెల్ ఓవెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.155 పరుగుల నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 7 ఓవర్ల అనంతరం రెండు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ ఓవెన్ (24), కాలెబ్ జువెల్ (1) ఔట్ కాగా.. చార్లీ వకీం (12), నిఖిల్ చౌదరీ (4) క్రీజ్‌లో ఉన్నారు. రెనెగేడ్స్ బౌలర్లలో ఫెర్గస్ ఓనీల్కు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ గెలవాలంటే 78 బంతుల్లో 105 పరుగులు చేయాలి.కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్ వేలంలో జేకబ్ బేతెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ జేకబ్ బేతెల్పై భారీ అంచనాలే పెట్టుకుంది. అయితే బీబీఎల్ తొలి అర్ద భాగంలో బేతెల్ తుస్సుమనిపించాడు.బీబీఎల్-2025లో బేతెల్ ప్రదర్శనలు..87(50) vs హోబర్ట్ హరికేన్స్1(8) vs మెల్బోర్న్ స్టార్స్2(9) vs పెర్త్ స్కార్చర్స్49(36) vs మెల్బోర్న్ స్టార్స్21(21) vs అడిలైడ్ స్ట్రైకర్స్2(4) vs సిడ్నీ థండర్30(22) vs పెర్త్ స్కార్చర్స్3(6) vs హోబర్ట్ హరికేన్స్ -
IPL 2025: ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త
ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే వార్త. ఇటీవలే ఆ జట్టులోకి వచ్చిన స్టార్ ఆటగాడు టిమ్ డేవిడ్ బిగ్‌బాష్ లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. టిమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సుడిగాలి ఇన్నింగ్స్‌లు ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. టిమ్ అరివీర భయంకరమైన ఫామ్ చూసి ఆర్సీబీ అభిమానులు సంబురపడిపోతున్నారు. టిమ్ ఇదే ఫామ్‌లో ఉంటే ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ నెగ్గడం ఖాయమని చర్చించుకుంటున్నారు.టిమ్ తాజాగా సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో టిమ్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేశాడు. గెలవడం కష్టం అనుకున్న మ్యాచ్‌లో టిమ్ విశ్వరూపం ప్రదర్శించి తన జట్టును (హోబర్ట్ హరికేన్స్) ఒంటిచేత్తో గెలిపించాడు. టిమ్ చివరి వరకు క్రీజ్‌లో ఉండి హరికేన్స్‌ను విజయతీరాలకు చేర్చాడు.- 62*(28) & Won POTM.- 68*(38) & Won POTM.THE DESTRUCTION OF TIM DAVID IN THE BBL - Fantastic news for RCB. 🥶 pic.twitter.com/OSwD9Px6DP— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025దీనికి ముందు అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ టిమ్ ఉగ్రరూపం దాల్చాడు. ఆ మ్యాచ్‌లో టిమ్ 28 బంతులు ఎదర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. ఛేదనలో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆరో స్థానంలో బరిలోకి దిగిన టిమ్.. జట్టును విజయతీరాలకు చేర్చేంతవరకు ఔట్ కాలేదు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్ట్రయికర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఛేదనలో హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించకపోగా.. టిమ్ పెద్దన్న పాత్రి పోషించి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో టిమ్ హరికేన్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. థండర్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (88 నాటౌట్) ఒక్కడే రాణించాడు. సామ్ బిల్లింగ్స్ (28), ఒలివర్ డేవిస్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. హరికేన్స్ బౌలర్లలో రిలే మెరిడిత్ రెండు వికెట్లు తీయగా.. స్టాన్లేక్, క్రిస్ జోర్డన్, నిఖిల్ చౌదరీ తలో వికెట్ పడగొట్టారు.165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో 16.5 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. హరికేన్స్ టాపార్డర్ బ్యాటర్లు మిచెల్ ఓవెన్ (13), మాథ్యూ వేడ్ (13), చార్లీ వకీమ్, నిఖిల్ చౌదరీ (29) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టిమ్ నేనున్నానంటూ తన జట్టును గెలిపించాడు. క్రిస్ జోర్డన్ (18 నాటౌట్) సహకారంతో టిమ్ హరికేన్స్‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. థండర్ బౌలర్లలో జార్జ్ గార్టన్ రెండు వికెట్లు పడగొట్టగా... వెస్ అగర్, టామ్ ఆండ్రూస్ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, 28 ఏళ్ల టిమ్‌ను ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకుంది. టిమ్‌ను ఆర్సీబీ 3 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్ వరకు టిమ్ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నప్పుడు టిమ్ ధర 8.25 కోట్లుగా ఉండేది. -
టిమ్ డేవిడ్ ఊచకోత.. ఆర్సీబీకి మరో గుడ్ న్యూస్
వివిధ టోర్నీలో ఇవాళ (జనవరి 5) ఇద్దరు ఆర్సీబీ ఆటగాళ్లు చెలరేగిపోయారు. బిగ్‌బాష్ లీగ్‌లో టిమ్ డేవిడ్ (Tim David) (హోబర్ట్ హరికేన్స్), విజయ్ హజారే ట్రోఫీలో రజత్ పాటిదార్ (Rajat Patidar) విధ్వంసం సృష్టించారు. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ వీరవిహారం చేశాడు. ఈ మ్యాచ్‌లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డేవిడ్.. ఓవరాల్‌గా 28 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. డేవిడ్ విధ్వంసం ధాటికి అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. క్రిస్ లిన్ (49), అలెక్స్ రాస్ (47) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. ఓలీ పోప్ (33), జేమీ ఓవర్టన్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు. హరికేన్స్ బౌలర్లలో వకార్ సలామ్‌ఖీల్ 2, క్రిస్ జోర్డన్, స్టాన్లేక్, రిలే మెరిడిత్ తలో వికెట్ పడగొట్టారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. టిమ్ డేవిడ్ అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. మిచెల్ ఓవెన్ (37), మాథ్యూ వేడ్ (27), నిఖిల్ చౌదరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో లాయిడ్ పోప్, కెమరూన్ బాయ్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ థార్న్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.శతక్కొట్టిన రజత్ పాటిదార్విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ సెంచరీతో కదంతొక్కాడు. బెంగాల్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ 137 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ సాయంతో 132 పరుగులు (నాటౌట్) చేశాడు. పాటిదార్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. కెప్టెన్ సుదీప్ ఘరామీ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. సుదీప్ ఛటర్జీ (47) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమీ ఇన్నింగ్స్ ఆఖర్లో బ్యాట్ ఝులింపించాడు. షమీ 34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 పరుగులు చేశాడు.అనంతరం బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయినప్పటికీ రజత్ పాటిదార్.. శుభమ్ శ్యామ్‌సుందర్ శర్మ (99) సాయంతో మధ్యప్రదేశ్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు ఆటగాళ్లు 99 పరుగుల వద్ద ఔటయ్యారు.భీకర ఫామ్‌లో పాటిదార్దేశవాలీ క్రికెట్లో రజత్ పాటిదార్ భీకరఫామ్‌లో ఉన్నాడు. రజత్ వరుసగా 76(36), 62(36), 68(40), 4(7), 36(16), 28(18), 66*(29), 82*(40), 55(33), 21*(15), 2(7), 2(3), 14(16), 132*(137) స్కోర్లు చేశాడు. రజత్ గత 14 ఇన్నింగ్స్‌ల్లో 6 అర్ద శతకాలు, ఓ శతకం బాదాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్.. భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ఉత్తర్ ప్రదేశ్ కెప్టెన్ భువనేశ్వర్ కుమార్ హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. జార్ఖండ్‌తో ఇవాళ (డిసెంబర్ 5) జరిగిన మ్యాచ్‌లో భువీ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ మ్యాచ్ 17వ ఓవర్లో భువీ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు తీశాడు. ఈ ఓవర్లో భువీ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో భువీ మొత్తంగా 4 ఓవర్లు వేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. HAT-TRICK FOR BHUVNESHWAR KUMAR IN SYED MUSHTAQ ALI 🦁- Great news for RCB in IPL 2025...!!! pic.twitter.com/mDw13DhRM4— Johns. (@CricCrazyJohns) December 5, 2024ఈ మ్యాచ్‌లో భువీతో పాటు నితీశ్ రాణా (4-0-19-2), మొహిసిన్ ఖాన్ (2.5-0-38-2), వినీత్ పన్వార్ (4-0-39-1), విప్రాజ్ నిగమ్ (2-0-18-1), శివమ్ మావి (3-0-28-1) రాణించడంతో జార్ఖండ్‌పై ఉత్తర్ ప్రదేశ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. రింకూ సింగ్ 28 బంతుల్లో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలువగా.. ప్రియమ్ గార్గ్ 31, సమీర్ రిజ్వి 24, నితీశ్ రాణా 16, శివమ్ మావి 15 పరుగులు చేశారు. జార్ఖండ్ బౌలర్లలో బాల్ కృష్ణ 3 వికెట్లు తీయగా.. వివేకానంద్ తివారి 2, వికాస్ కుమార్, వికాశ్ సింగ్, అనుకుల్ రాయ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జార్ఖండ్.. 19.5 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. అనుకుల్ రాయ్ (44 బంతుల్లో 91) జార్ఖండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. విరాట్ సింగ్ (23), రాబిన్ మింజ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా ఆటగాడు ఇషాన్ కిషన్ (8) విఫలమయ్యాడు.ఆర్సీబీలో చేరిన భువీఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. భువీపై ఆర్సీబీ 10.75 కోట్లు వెచ్చించింది. మెగా వేలానికి ముందు భువనేశ్వర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ వదులుకుంది. భువీ 2014 నుంచి సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. భువీకి పవర్ ప్లే మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుంది. భువీ 2016, 2017 ఐపీఎల్ సీజన్లలో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ 2016లో టైటిల్ సాధించడంలో భువీ కీలకపాత్ర పోషించాడు. -
జాక్‌పాట్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్
ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బేతెల్ జాక్‌పాట్ కొట్టాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) డెవలప్మెంట్ కాంట్రాక్ట్‌లో ఉన్న బేతెల్.. తాజాగా ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. ఈసీబీ రెండేళ్ల కాంట్రాక్ట్ జాబితాలో జో రూట్,జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. తాజాగా బేతెల్ వీరి సరసన చేరాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ పేస్ త్రయం జోఫ్రా ఆర్చర్, మాథ్యూ పాట్స్, బ్రైడన్ కార్స్ తమ కాంట్రాక్ట్‌ను 2026 వరకు పొడిగించుకున్నారు. దీంతో ఈ ముగ్గురు కూడా రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చేరిపోయారు.కాగా, 21 ఏళ్ల బేతెల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ల్లో వన్డే, టీ20 అరంగేట్రం చేశాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బేతెల్ టెస్ట్ అరంగేట్రం కూడా చేశాడు. బేతెల్ మూడు ఫార్మాట్లకు తగ్గ ప్లేయర్. అందుకే అతనికి రెండేళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చారు. బేతెల్‌ను ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్‌తో తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ 37 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 8 వన్డేలు, 7 టీ20లు ఆడాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఉన్నాయి. -
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆసక్తికర ఘటన
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలు చెరి ముగ్గురు ఆటగాళ్లను కుండ మార్పిడి చేసుకున్నాయి. 2025 మెగా వేలంలో ఆర్సీబీ సొంతం చేసుకున్న రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, నువాన్ తుషార 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ఆడారు. 2024 సీజన్లో ఆర్సీబీకి ఆడిన విల్ జాక్స్, రీస్ టాప్లే, కర్ణ్ శర్మ.. 2025 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ వశమయ్యారు. వేలంలో ఓ ఫ్రాంచైజీ నుంచి మరో ఫ్రాంచైజీకి మారడం సాధారణమే అయినప్పటికీ.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్ల కుండ మార్పిడి జరగడం సిత్రమే.కాగా, ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్లు పాల్గొనగా ఆయా ఫ్రాంచైజీలు 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. వీరిలో 62 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగిలిన వారు దేశీయ ఆటగాళ్లు.వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డు నెలకొల్పాడు. పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్ల భారీ మొత్తం వెచ్చింది సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో కూడా ఇదే భారీ మొత్తం కావడం విశేషం. ఐపీఎల్ 2025 వేలంలో సెకెండ్ హైయ్యెస్ట్ పేమెంట్ శ్రేయస్ అయ్యర్‌కు దక్కింది. శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. వేలంలో మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు దక్కింది. వెంకటేశ్‌ను కేకేఆర్ 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. -
ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు.. మరుసటి రోజే..!
ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్.. నిన్ననే (నవంబర్ 25) ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేతెల్‌ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టాడు. బేతెల్‌కు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన బేతెల్‌కు దేశవాలీ క్రికెట్లో పెద్దగా ట్రాక్ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి. బేతెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వార్విక్షైర్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్‌లో బేతెల్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్ నాలుగు వికెట్లు తీశాడు.ఇంగ్లండ్ జట్టు ప్రకటనఈ నెల 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బేతెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండగా.. రెగ్యులర్‌గా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ఓలీ పోప్ ఆరో స్థానానికి డిమోట్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోర్డన్ కాక్స్ గాయపడటంతో పోప్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ రానుండగా.. బేతెల్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగులో, హ్యారీ బ్రూక్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్, ఆతర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్‌ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్ వోక్స్, గస్ట్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ ఎంపికయ్యాడు.న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ -
ఆర్సీబీ బ్యాటర్ ఊచకోత
అబుదాబీ టీ10 లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్ రెచ్చిపోయాడు. ఈ టోర్నీలో బంగ్లా టైగర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్.. ఢిల్లీ బుల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో అజేయమైన హాఫ్ సెంచరీ చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. లివింగ్‌స్టోన్ ఊచకోత కారణంగా బంగ్లా టైగర్స్.. ఢిల్లీ బుల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.మ్యాచ్ వివరాల్లోకి వెళితే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బుల్స్ నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. నిఖిల్ చౌదరీ 16 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఆడమ్ లిత్ (1), టామ్ బాంటన్ (8), టిమ్ డేవిడ్ (1), ఫేబియన్ అలెన్ (6) విఫలం కాగా.. జేమ్స్ విన్స్ (27), రోవ్‌మన్ పావెల్ (17), షాదాబ్ ఖాన్ (10 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా టైగర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, జాషువ లిటిల్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్.. లివింగ్‌స్టోన్ విధ్వంసం సృష్టించడంతో 9.4 ఓవర్లలోనే (3 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేరింది. లివింగ్‌స్టోన్‌తో పాటు దసున్ షనక (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (20 బంతుల్లో 24; ఫోర్, సిక్స్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో షాహిద్ ఇక్బాల్, షాదాబ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. అబుదాబీ టీ10 లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బంగ్లా టైగర్స్‌కు ఇది తొలి విజయం. ప్రస్తుతం ఈ జట్టు పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కాగా, నిన్న (నవంబర్ 25) ముగిసిన ఐపీఎల్ వేలంలో లివింగ్‌స్టోన్‌ను ఆర్సీబీ 8.75 కోట్లకు సొంతం చేసుకుంది. -
IPL 2025: ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా..!
ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.దేశవాలీ క్రికెట్లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్లో ఇది రెండో కమిట్మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. -
ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!
రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు మహిపాల్ లోమ్రార్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (360 బంతుల్లో 300; 25 ఫోర్లు, 13 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు టీ విరామం సమయానికి రాజస్థాన్ స్కోర్ 660/7గా ఉంది. లోమ్రార్‌తో పాటు కుక్నా అజయ్ సింగ్ (40) క్రీజ్‌లో ఉన్నాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో లోమ్రార్‌కు జతగా మరో ఆటగాడు సెంచరీ చేశాడు. కార్తీక్ శర్మ 115 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేశాడు. టెయిలెండర్లు భరత్ శర్మ 54, దీపక్ చాహర్ 35 పరుగులు చేయగా.. అభిజిత్ తోమర్ 20, రామ్మోహన్ చౌహాన్ 29, జుబైర్ అలీ ఖాన్ 26, దీపక్ హూడా 10 పరుగులు చేశాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో దీపక్ దాపోలా, స్వప్నిల్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అంకిత్ మనోర్, అభయ్ నేగి, అవనీశ్ సుధ తలో వికెట్ దక్కించుకున్నారు.ఆర్సీబీ వదిలేసింది.. ట్రిపుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు..!24 ఏళ్ల మహిపాల్ లోమ్రార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇటీవల వదిలేసింది. 2025 ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో లోమ్రార్‌కు చోటు దక్కలేదు. ఆర్సీబీ వదిలేసిందన్న కసితో చెలరేగిపోయిన లోమ్రార్ ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్‌లో లోమ్రార్ మరెన్ని పరుగులు చేస్తాడో వేచి చూడాలి. లోమ్రార్ ఆర్సీబీ వదిలేసిన నాటి నుంచి కసితో రగిలిపోతున్నాడు. తాజా ట్రిపుల్ సెంచరీకి ముందు మ్యాచ్‌లో లోమ్రార్ సెంచరీ చేశాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 111 పరుగులు చేశాడు. ఇదే రంజీ సీజన్లో హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ లోమ్రార్ చెలరేగి ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లోమ్రార్ అరివీర భయంకర ఫామ్‌ను చూసి ఆర్సీబీ అతన్ని తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేస్తుందేమో వేచి చూడాలి. లోమ్రార్‌ను ఆర్సీబీ 2022 సీజన్లో 95 లక్షలకు దక్కించుకుంది. లోమ్రార్ 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసి వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. -
ఆర్సీబీకి గుడ్ న్యూస్
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతుంది. బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతనిథ్యం వహించే పెర్రీ.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో బ్యాట్‌తో, బంతితో ఇరగదీసింది.డబ్యూబీబీఎల్ 2024 సీజన్లో పెర్రీ ఇప్పటివరకు చేసిన స్కోర్లు ఇలా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో 39 బంతుల్లో 81 పరుగులు చేసి రెండు వికెట్లు తీసిన పెర్రీ.. రెండో మ్యాచ్‌లో 28 బంతుల్లో 54 పరుగులు చేసి రెండు వికెట్లు తీసింది. మూడో మ్యాచ్‌లో 25 బంతుల్లో అజేయమైన 31 పరుగులు చేసిన పెర్రీ.. ఓ వికెట్ పడగొట్టింది. నాలుగో మ్యాచ్‌లో 62 బంతుల్లో 86 పరుగులు చేసిన పెర్రీ.. తాజాగా జరిగిన ఐదో మ్యాచ్‌లో 44 బంతుల్లో అజేయమైన 48 పరుగులు చేసి ఓ వికెట్ తీసింది.ఓవరాల్‌గా పెర్రీ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 100 సగటున, 152.28 స్ట్రయిక్‌రేట్‌తో మూడు హాఫ్ సెంచరీల సాయంతో 300 పరుగులు చేసింది. అలాగే ఆరు వికెట్లు తీసింది. మహిళల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పెర్రీ సూపర్ ఫామ్ ఆర్సీబీకి శుభ శకునమని చెప్పాలి. పెర్రీ గత ఐపీఎల్ సీజన్లోనూ బ్యాట్‌తో పాటు బంతితోనూ ఇరగదీసింది. పెర్రీ 2024 సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్‌గా (9 మ్యాచ్‌ల్లో 347 పరుగులు) నిలిచి బౌలింగ్‌లో ఏడు వికెట్లు తీసింది. కాగా, మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వచ్చే ఏడాది మార్చిలో జరుగనుంది. ఈ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ నిన్నటితో ముగిసింది. లీగ్‌లోని ఐదు ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాలను వెల్లడించాయి. అలాగే తాము రిలీజ్ చేసిన పేర్లను కూడా ప్రకటించాయి.డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ కోసం ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ప్లేయర్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ప్లేయర్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
14 మందిని రిటైన్ చేసుకున్న ఆర్సీబీ.. కెప్టెన్‌గా మళ్లీ..!
మహిళల ఐపీఎల్ 2025 సీజన్ వేలానికి ముందు ఐదు ఫ్రాంచైజీలు (ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్) తమ రిటెన్షన్ జాబితాలను ఇవాళ (నవంబర్ 7) ప్రకటించాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ సైతం తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది. వచ్చే సీజన్ కోసం ఆర్సీబీ 14 మంది ప్లేయర్లను రిటైన్ చేసుకుని ఆరుగురిని వేలానికి వదిలేసింది. వేలానికి వదిలేసిన వారిలో ఒక ఓవర్సీస్ ప్లేయర్ ఉన్నారు. ఓ జట్టుకు ఆరుగురు ఓవర్సీస్ ప్లేయర్ల రూల్ నేపథ్యంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ నదినే డి క్లెర్క్‌కు వేలానికి వదిలేసింది. డి క్లెర్క్ స్థానంలో ఆర్సీబీ గత నెలలో ఇంగ్లండ్ అటాకింగ్ బ్యాటర్ డ్యానీ వాట్‌ను యూపీ వారియర్జ్ నుంచి ట్రేడింగ్ చేసుకుంది. ముంబై యాజమాన్యం వాట్‌ను 30 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. ఆర్సీబీ విడుదల చేసిన మరో ఐదుగురు ప్లేయర్లు (దిషా కసత్, ఇంద్రాణి రాయ్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్) భారతీయ ప్లేయర్లే కావడం విశేషం.ఓవరాల్‌గా చూస్తే ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ టీమ్‌ను దాదాపుగా కొనసాగించిందనే చెప్పాలి. ఆర్సీబీ మరో సీజన్‌కు స్మృతి మంధననే కెప్టెన్‌గా కొనసాగించింది. గత సీజన్లో ఆర్సీబీ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఎల్లిస్ పెర్రీ, సోఫీ డివైన్, సోఫీ మోలినెక్స్ వచ్చే సీజన్లో కూడా కొనసాగనున్నారు. వీరితో పాటు దేశీయ స్టార్లు రిచా ఘోష్, రేణుక సింగ్ ఠాకూర్ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. రిటెన్షన్ల ప్రక్రియ అనంతరం ఆర్సీబీ పర్స్‌లో ఇంకా రూ. 3.25 కోట్ల బ్యాలెన్స్ మిగిలి ఉంది. ఈ మొత్తంతో ఆర్సీబీ మరో నలుగురు లోకల్ ప్లేయర్స్‌ను కొనుగోలు చేయవచ్చు. పేస్ బౌలింగ్ విభాగంలో రేణుకా సింగ్, ఎల్లిస్ పెర్రీ మాత్రమే ఉండటంతో ఈసారి వేలంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకల్ పేసర్లపై గురి పెట్టవచ్చు. డబ్ల్యూపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ఠంగా 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసుకోవచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్స్‌కు అవకాశం ఉంటుంది. కాగా, తొలి సీజన్లో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆర్సీబీ గత సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది.ఆర్సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీళ్లే..స్మృతి మంధన (కెప్టెన్), సబ్బినేని మేఘన, రిచా ఘోష్, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్హమ్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, సోఫీ డివైన్, రేణుకా సింగ్, సోఫీ మోలినెక్స్, ఏక్తా బిస్త్, కేట్ క్రాస్, కనిక అహుజా, డానీ వాట్ (యూపీ నుంచి ట్రేడింగ్)ఆర్సీబీ వదిలేసిన ఆటగాళ్లు..దిషా కసత్, ఇంద్రాణి రాయ్, నదినే డి క్లెర్క్, శుభ సతీశ్, శ్రద్దా పోకార్కర్, సిమ్రన్ బహదూర్ -
IPL 2025: ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?
ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పణకు మరి కొద్ది గంటల సమయం (అక్టోబర్ 31 డెడ్‌లైన్) మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను అట్టి పెట్టుకోనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్ ప్లేయర్లకు ఛాయిస్ ప్రకారం వరుసగా రూ. 18, 14, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ప్లేయర్‌ని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18, 14 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రిటైన్ చేసుకునే అన్క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది.ఆర్సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లి..?రిటెన్షన్ లిస్ట్ సమర్పణ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకోబోయే ఆటగాళ్ల జాబితాను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు ఏకంగా కెప్టెన్లనే వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నాయి. ఈ జాబితాలో ఆర్సీబీ కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్సీబీ తమ కెప్టెన్ ఫాఫ్ డెప్లెసిస్కు వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. వయసు పైబడిన రిత్యా డుప్లెసిస్‌ను వేలానికి వదిలేయాలని ఆర్సీబీ భావిస్తుందట. ఈ క్రమంలో ఆర్సీబీ మేనేజ్మెంట్ మరోసారి విరాట్ వైపు చూస్తుందని సమాచారం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టేందుకు విరాట్ కూడా సుముఖంగా ఉన్నాడని తెలుస్తుంది. విరాట్ 2021 సీజన్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో 2022 సీజన్ నుంచి డుప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. -
కోచ్‌గా దినేశ్ కార్తీక్
టీమిండియా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. డీకే.. తన తాజా మాజీ జట్టైన ఆర్సీబీకి బ్యాటింగ్ కోచ్ కమ్ మెంటార్‌గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ (2025) నుంచి డీకే కొత్త విధుల్లో చేరతాడని ఆర్సీబీ పేర్కొంది. "సరికొత్త అవతారంలో మరోసారి మాలో భాగమవుతున్న దినేష్ కార్తీక్‌కు స్వాగతం"అని ఆర్సీబీ ట్వీట్లో రాసుకొచ్చింది.39 ఏళ్ల డీకే.. ఈ ఏడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో (2008, 2009, 2010, 2014) ఐపీఎల్ ప్రస్తానాన్ని ప్రారంభించిన కార్తీక్.. గత మూడు సీజన్లలో ఆర్సీబీకి (2024, 2023, 2022) ప్రాతినిథ్యం వహించాడు. ఈ మధ్యలో కార్తీక్.. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (2011), ముంబై ఇండియన్స్ (2012, 2013), ఆర్సీబీ (2015), గుజరాత్ లయన్స్ (2016, 2017), కేకేఆర్ (2018, 2019, 2020, 2021) ఫ్రాంచైజీలకు ఆడాడు.ఐపీఎల్ ఆరంభ ఎడిషన్ (2008) నుంచి ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో (ఏడుగురు) కార్తీక్ ఒకడు. ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సాహా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ మాత్రమే ఇనాగురల్ ఎడిషన్ నుంచి ఐపీఎల్ ఆడారు. ఇప్పటివరకు జరిగిన 16 ఎడిషన్లలో పాల్గొన్న కార్తీక్ కేవలం రెండే రెండు మ్యాచ్‌లు మిస్ అయ్యాడు. ఐపీఎల్లో కార్తీక్‌కు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. డీకే.. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. డీకే, రోహిత్ శర్మ ఐపీఎల్లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఐపీఎల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు ధోని (264) పేరిట ఉంది. డీకే తన ఐపీఎల్ కెరీర్లో 135.36 స్ట్రయిక్‌రేట్‌తో 4842 పరుగులు చేశాడు. ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కార్తీక్ ఖాతాలో 145 క్యాచ్‌లు, 37 స్టంపింగ్‌లు ఉన్నాయి.Dinesh Karthik talking about RCB and he continues to be with this family. ❤️- RCB 🤝 DK...!!!! pic.twitter.com/TiHTs3yjaA— Tanuj Singh (@ImTanujSingh) July 1, 2024కార్తీక్ కెరీర్‌ను 2022 ఐపీఎల్ ఎడిషన్ మలుపు తప్పింది. ఆ సీజన్లో పేట్రేగిపోయిన కార్తీక్ మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సీజన్ ప్రదర్శన కారణంగా అతనికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. 2024 సీజన్లోనూ కార్తీక్ చెలరేగి ఆడాడు. ఈ సీజన్లో అతను 187.35 స్ట్రయిక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. -
బ్యాట్ వదిలి బల్లెం పట్టిన డీకే
టీమిండియా మాజీ వికెట్‌కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్ కొద్ది రోజుల కిందటే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికి వార్తల్లో నిలిచాడు. సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం డీకే క్రికెట్ ప్రపంచం మొత్తం నుంచి ఘనంగా సెడాంఫ్ను అందుకున్నాడు.క్రికెట్‌కు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో సేద తీరుతున్న డీకే.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో కలిసి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. Neeraj Chopra trained Dinesh Karthik to be his partner at 2024 Olympics.#Neerajchopra #Dineshkarthik pic.twitter.com/zOLswEDjW8— scOut Op (@ScOutoppp69) May 29, 2024డీకే జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరలవుతంది. ఈ వీడియోలో డీకే రెండు ప్రయత్నాల అనంతరం బల్లెంను విజయవంతంగా నిర్దేశిత ప్రాంతం ఆవలికి విసరగలిగాడు. లాస్ట్ ఛాన్స్ అని నీరజ్‌ను అడిగి మరీ జావెలిన్‌ను అందుకున్న డీకే.. ప్రొఫెషన్ అథ్లెట్‌లా రన్ అప్ తీసుకుని జావెలిన్‌ను సంధించాడు. మండే ఎండలో డీకే చేస్తున్న ప్రయత్నానికి ముగ్దుడైన నీరజ్.. నువ్వు చేయగలవు దినేష్ భాయ్ అంటూ ప్రోత్సహించాడు. నీరజ్ ప్రోత్సాహంతో జావెలిన్‌ను విసిరిన డీకే అనుకున్న లక్ష్యాన్ని అధిగమించి సక్సెస్ సాధించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు డీకేను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నీ ప్రయత్నం అమోఘమని కొనియాడుతున్నారు. తెలీని క్రీడలోనూ సక్సెస్ సాధించావని కితాబునిస్తున్నారు. క్రికెట్లో మ్యాచ్ ఫినిషన్ ఇప్పుడు సక్సెస్ఫుల్ జావెలిన్ త్రోయర్ అంటూ కొనియాడుతున్నారు. మరికొందరేమో నీరజ్‌తో పాటు ఒలింపిక్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోమని సూచిస్తున్నారు. 38 ఏళ్ల డీకే 2004 నుంచి 2022 వరకు మూడు ఫార్మాట్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. డీకే ఐపీఎల్ స్టార్టింగ్ సీజన్ నుంచి తాజాగా ముగిసిన 2024 సీజన్ వరకు వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.నీరజ్ చోప్రా విషయానికొస్తే.. 26 ఏళ్ల ఈ జావెలిన్ త్రోయర్ 2020 టోక్యో ఓలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించాడు. ఈ ఏడాది జులైలో జరిగే సమ్మర్ ఓలింపిక్స్లో నీరజ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. -
ఎలిమినేట్ అయ్యేదెవరో?
-
ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన సమంత పోస్ట్!
సినిమాలకు గ్యాప్ ఇచ్చినా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది సమంత. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫ్యాన్స్ అలరిస్తుంది. తన పర్సనల్ విషయాలను సైతం షేర్ చేసుకుంటుంది. తన పోస్టులతో అప్పుడప్పడు యువతకు ఓ మెసేజ్ కూడా అందిస్తుంది. అలాగే ఒక్కోసారి చిలిపి పోస్ట్‌లు కూడా పెడుతూ.. ఫ్యాన్స్‌ని అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పెట్టిన పోస్ట్ ఒకటి ఇటు సామ్ అభిమానులతో పాటు అటు క్రికెట్ లవర్స్‌ని కన్ఫ్యూజన్లో పడేసింది. సమంత పెట్టిన పోస్ట్ ఏంటి?ఐపీఎల్ 2024 క్లైమాక్స్‌కి చేరిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచే ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం అయ్యాయి. క్యాలిఫయిర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి ఫైనల్‌కి చేరుకుంది. సన్ రైజర్స్ ఫైనల్‌కు చేరాలంటే.. క్వాలిఫయిర్ 2 తప్పక గెలవాల్సి ఉంటుంది. దీని కంటే ముందు నేడు(మే 22) రాజస్తాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగుతుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ బెర్త్ కోసం సన్‌రైజర్స్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.(చదవండి: ‘కల్కి’ ప్రమోషన్స్‌కి అన్ని కోట్లా..? ఓ పెద్ద సినిమానే తీయొచ్చు!)ఇలా ఐపీఎల్ ఆట చాలా ఆసక్తికరంగా సాగుతున్న వేళ సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో 'మీరు విజయం సాధిస్తే చూడాలని ఉంది' ఓ పోస్ట్ పెట్టింది. 'మీ హృదయం ఏది కోరుకున్నా, మీరు ఎలాంటి ఆకాంక్షలు కలిగి ఉన్నా, నేను మీ కోసం మద్దతు ఇస్తాను. మీరు విజయానికి అర్హులు’ అంటూ ఆ పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో సమంత ఆర్సీబీ మద్దతుగా ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఎస్ఆర్హెచ్కు సపోర్ట్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందని కామెంట్ చేస్తున్నారు. సామ్ పోస్ట్‌ని షేర్ చేస్తూ మాకంటే మాకు సపోర్ట్ చేస్తుందంటూ ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గొడవపడుతున్నారు. ఇంకొంత మంది నెటిజన్స్ అయితే ఇది క్రికెట్‌కు సంబంధించినది కాదని, తన అభిమానుల కోసమే అలా రాసుకొచ్చిందని అంటున్నారు. సమంత సందిస్తే తప్ప ఆ పోస్ట్ అర్థం ఏంటి? ఎవరునుద్దేశించి చేశారనే విషయాలు తెలియవు. మరి సామ్ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
RCBని ధోని అవమానించాడా..? ధోనినే ఆర్సీబీ అవమానించిందా..?
-
"సాధించాం” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క..
-
Play Offs లోకి ఆర్సిబీ
-
RCB vs CSK: ప్లే ఆఫ్స్ బెర్తుకై చావో రేవో
-
చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..
-
RCB vs DC: మరో కీలక మ్యాచ్
-
కోహ్లి విజృంభణ.. పంజాబ్‌పై ఆర్సీబీ గెలుపు
-
RCB vs PBKS: ధర్మశాలలో గర్జించేదెవరు?
-
ఐపీఎల్లో నేటి (మే 9) మ్యాచ్.. ఆర్సీబీతో పంజాబ్ 'ఢీ'.. తప్పక గెలవాలి
ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై దాదాపుగా ఆశలు వదులుకున్న పంజాబ్ కింగ్స్.. ఇంచుమించు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్న ఆర్సీబీని ఢీకొట్టనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఇరు జట్లలో ఏ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరాలన్నా ఈ మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌లన్నీ (రెండు) భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఇలా జరిగినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుందని గ్యారెంటీ లేదు. ఫైనల్ ఫోర్ రేసులో ఉన్న మిగతా జట్ల జయాపజయాలపై ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.ప్రస్తుతం ఆర్సీబీ, పంజాబ్ 11 మ్యాచ్‌లు ఆడి చెరి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ నెట్ రన్‌రేట్ కాస్త మెరుగ్గా ఉంది. ఆర్సీబీ -0.049 రన్‌రేట్ కలిగి ఉండగా.. పంజాబ్‌కు -0.049 ఉంది. ఆర్సీబీ ఈ మ్యాచ్ తరువాత ముంబై, గుజరాత్‌లతో తలపడాల్సి ఉండగా..పంజాబ్ ఈ మ్యాచ్ తర్వాత పటిష్టమైన రాజస్థాన్, సన్‌రైజర్స్‌ను ఢీకొట్టాల్సి ఉంది.పంజాబ్‌తో పోలిస్తే ఆర్సీబీ కాస్త బలహీనమైన ప్రత్యర్దులతో తలపడాల్సి ఉన్న నేపథ్యంలో ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్‌తో పాటు ముంబై, గుజరాత్‌లపై భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు ఖాతాలో ఉండి సీఎస్కే (12), ఢిల్లీ (12), లక్నోలతో (12) ప్లే ఆఫ్స్ బెర్తు కోసం పోటీపడే అవకాశం ఉంది.ఢిల్లీ, లక్నో ఇంకా రెండ్రెండు మ్యాచ్‌లు, సీఎస్కే మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కేకేఆర్ (16), రాజస్థాన్ (16) పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండి ప్లే ఆఫ్స్ బెర్తులను దాదాపుగా ఖరారు చేసుకోగా.. సన్‌రైజర్స్ (14).. సీఎస్కే, ఢిల్లీ, లక్నోల కంటే కాస్త మెరుగైన స్థానంలో ఉంది.సన్‌రైజర్స్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిచిన ప్లే ఆఫ్స్ మూడో బెర్త్ ఆ జట్టు వశమే అవుతుంది. అప్పుడు మిగిలిన నాలుగో బెర్త్ కోసం సీఎస్కే, ఢిల్లీ, లక్నో, ఆర్సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడాల్సి ఉంటుంది. నిన్న లక్నోపై సన్‌రైజర్స్ భారీ విజయం సాధించడంతో ఈ సీజన్లో ముంబై పోరాటం అధికారికంగా ముగిసింది. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా వాటి ఫలితంతో సంబంధం లేకుండా లీగ్ నుంచి నిష్క్రమించింది.తుది జట్లు (అంచనా)..పంజాబ్: జానీ బెయిర్‌స్టో, రిలీ రొస్సో, శశాంక్ సింగ్, సామ్ కర్రన్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్‌కీపర్), అశుతోష్ శర్మ, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ [ఇంపాక్ట్ సబ్: ప్రభ్‌సిమ్రన్ సింగ్]ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విల్ జాక్స్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, స్వప్నిల్ సింగ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ వైశాఖ్, మహ్మద్ సిరాజ్ [ఇంపాక్ట్ సబ్: రజత్ పాటిదార్] -
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
-
RCB vs GT: ఆర్సీబీ జోరు కొనసాగేనా?
-
IPL 2024: టాప్‌లో రాజస్థాన్.. గెలిచినా ఆఖర్లోనే ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ఆఖరి దశకు చేరింది. ప్లే ఆఫ్స్‌కు ముందు మరో 24 మ్యాచ్‌లు మాత్రమే మిగిలాయి. లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరగాల్సి ఉండగా.. ఏప్రిల్ 28 నాటికి 46 మ్యాచ్‌లు పూర్తయాయ్యి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా..కేకేఆర్, సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో ఉన్నాయి.9 మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు సాధించిన రాజస్థాన్ అనధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. మిగతా మూడు బెర్తుల కోసం ఐదు జట్ల (కేకేఆర్, సీఎస్కే, సన్‌రైజర్స్, లక్నో, ఢిలీ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. గుజరాత్, పంజాబ్, ముంబై, ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. ఏదో అద్భుతం జరిగితే తప్ప ఈ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరలేవు. ఏప్రిల్ 29 నాటికి ఐపీఎల్ 2024 సీజన్ పాయింట్ల పట్టిక..జట్టుమ్యాచ్లుగెలుపుపాయింట్లురన్రేట్ఆడాల్సిన మ్యాచ్‌లు రాజస్థాన్98160.6945కేకేఆర్85100.9726సీఎస్కే95100.8105సన్‌రైజర్స్95100.0755లక్నో95100.0595ఢిల్లీ10510-0.2764గుజరాత్1048-1.1134పంజాబ్936-0.1875ముంబై936-0.2615ఆర్సీబీ1036-0.4154 -
విల్ జాక్స్ సుడిగాలి శతకం.. గుజరాత్‌ను చిత్తుగా ఓడించిన ఆర్సీబీ
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మూడో విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతయ్యాక కోలుకున్న ఆర్సీబీ గుజరాత్‌తో ఇవాళ (ఏప్రిల్ 28) జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 16 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జాక్స్ సునామీ ఇన్నింగ్స్ ముందు విరాట్ కోహ్లి (44 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ మరుగున పడింది. ఛేదనలో ఆర్సీబీకి డుప్లెసిస్ (12 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. జాక్స్ తానెదుర్కొన్న చివరి 13 బంతుల్లో ఏకంగా 64 పిండుకున్నాడు. మోహిత్ వేసిన 15వ ఓవర్లో 29 పరుగులు, రషీద్ వేసిన ఆ తర్వాతి ఓవర్లో 29 పరుగులు రాబట్టాడు. జాక్స్ దెబ్బకు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. డుప్లెసిస్ వికెట్ సాయికిషోర్‌కు దక్కింది.అంతకుముందు టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు. -
IPL 2024 GT VS RCB: విజృంభించిన సాయి సుదర్శన్, షారుక్ ఖాన్
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 28) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్.. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో వృద్దిమాన్ సాహా (5), శుభ్‌మన్ గిల్ (16) నిరాశపర్చగా.. డేవిడ్ మిల్లర్ (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్, స్వప్నిల్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.గుజరాత్ ఇన్నింగ్స్ విశేషాలు..7.4 ఓవర్లలో 49 పరుగులు మాత్రమే చేసిన గుజరాత్ చివరి 12.2 ఓవర్లలో ఏకంగా 151 పరుగులు చేసింది.ఈ సీజన్లో సాయి సుదర్శన్ 400 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.షారుక్ ఖాన్ తన తొలి ఐపీఎల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మైలురాయిని షారుక్ కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. -
గ్రీన్ సూపర్ క్యాచ్.. గిల్‌ను బుట్టలో వేసుకున్న మ్యాక్సీ
ఆర్సీబీ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో తాను వేసిన తొలి ఓవర్లోనే ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను (19 బంతుల్లో 16; ఫోర్) బుట్టలో వేసుకున్నాడు. ఏడో ఓవర్ నాలుగో బంతికి కెమరూన్ గ్రీన్ అద్భుతమైన రన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో గిల్ పెవిలియన్‌కు చేరాడు. ఫలితంగా గుజరాత్ 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. WHAT A CATCH BY CAMERON GREEN. 🤯- He's just Incredible on the field. 🔥 pic.twitter.com/xPQgYsyBUI— Tanuj Singh (@ImTanujSingh) April 28, 2024 ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్వప్నిల్ సింగ్ గుజరాత్‌ను దెబ్బ కొట్టాడు. తొలి ఓవర్ ఆఖరి బంతికి స్వప్నిల్ సాహాను (5) బోల్తా కొట్టించాడు. కర్ణ్ శర్మ క్యాచ్ పట్టడంతో సాహా పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటింగ్ నత్త నడకను తలపిస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 72 పరగులు చేసింది. సాయి సుదర్శన్ (31), షారుఖ్ ఖాన్ (15) క్రీజ్‌లో ఉన్నారు. తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్‌కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
IPL 2024: గుజరాత్-ఆర్సీబీ మ్యాచ్.. విధ్వంసకర బ్యాటర్ రీఎంట్రీ
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 28 మధ్యాహ్నం) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో ఆర్సీబీ విధ్వంసకర బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రీఎంట్రీ ఇచ్చాడు. మ్యాక్సీ కొన్ని మ్యాచ్‌లకు ముందు ఫామ్ లేమి కారణంగా స్వతహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు. మూడు మ్యాచ్‌ల విరామం అనంతరం మ్యాక్సీ తిరిగి జట్టులోకి వచ్చాడు. మ్యాక్సీ జట్టులోకి రావడంతో ఫెర్గూసన్‌పై వేటు పడింది. ఈ ఒక్క మార్పుతో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో బరిలోకి దిగుతుంది. మరోవైపు గుజరాత్ గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి.తుది జట్లు..గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటీదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(w), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
ఐపీఎల్లో ఇవాళ (Apr 28) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ సమరాలే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 28) రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం (3:30 గంటలకు) మ్యాచ్‌లో గుజరాత్, ఆర్సీబీ.. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సన్‌రైజర్స్, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. ఆదివారం కావడంతో ఐపీఎల్ ఇవాళ రెండూ భారీ మ్యాచ్‌లనే షెడ్యూల్ చేసింది.మధ్యాహ్నం మ్యాచ్ విషయానికొస్తే..పేపర్‌పై పటిష్టంగా కనిపించే ఆర్సీబీ.. అడపాదడపా ప్రదర్శనలతో నెట్టుకొస్తున్న గుజరాత్‌ను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ గుజరాత్ హోం గ్రౌండ్ అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది.పాయింట్ల పట్టిక విషయానికొస్తే.. ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉండగా.. గుజరాత్ 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో ఏడో స్థానంలో నిలిచింది. గుజరాత్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలబడాలంటే గుజరాత్ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. మరోవైపు ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ఆర్సీబీకి ఈ మ్యాచ్ నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆర్సీబీకి పెద్ద ఫరక్ పడదు.హెడ్ టు హెడ్ ఫైట్స్ విషయానికొస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు మూడు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. గుజరాత్ 2, ఆర్సీబీ ఒక మ్యాచ్‌లో గెలుపొందాయి. తుది జట్లు (అంచనా)..గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సందీప్ వారియర్‌ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, లోకీ ఫెర్గూసన్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్రాత్రి మ్యాచ్ విషయానికొస్తే.. సీఎస్కే తమ సొంత మైదానమైన చెపాక్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సీజన్లోనే ఇది బిగ్ ఫైట్‌గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ మూడో స్థానంలో.. సీఎస్కే ఆరో స్థానంలో ఉన్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు 20 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే 14, సన్‌రైజర్స్ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.తుది జట్లు (అంచనా)..సన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్, ఎయిడెన్ మార్క్రమ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్ [ఇంపాక్ట్ సబ్: టి నటరాజన్]సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరణ [ఇంపాక్ట్ సబ్: శార్దూల్ ఠాకూర్] -
SRH Vs RCB Photos: నిన్న హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్‌కు వెళ్ళలేదా అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే
-
IPL 2024: డీజే టిల్లు పాటకు చిందేసిన విరాట్
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఆన్ ఫీల్డ్‌లో డ్యాన్సులేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో అతను మైదానంలో స్టెప్పులేస్తూ కనిపించాడు. సందర్భమేదైనా సరే పాట ప్లే అయ్యిందంటే చాలు విరాట్‌కు పూనకం వస్తుంది. పక్కన ఎవరన్నా ఉంటే వారితో కలిసి చిందేస్తాడు. లేదంటే ఒక్కడే రెచ్చిపోతాడు. ఇలాంటి సందర్భమే తాజాగా మరోసారి వచ్చింది. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో స్టేడియం స్పీకర్లలో తెలుగు పాపులర్ డీజే టిల్లు పాట ప్లే అయ్యింది. ఈ పాట వినగానే కోహ్లి రెచ్చిపోయాడు. బీట్‌కు తగ్గట్టు స్టెప్పులేశాడు. విరాట్‌కు ఈ పాట ఫాస్ట్ బీట్ బాగా నచ్చినట్లుంది. ఈ సాంగ్ ప్లే అవుతున్నంత సేపు విరాట్ బాగా ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. Virat Kohli dancing on Tillu Anna DJ song at Hyderabad yesterday.- KING KOHLI IS A VIBE. ❤️🐐 pic.twitter.com/KkI3wTKdKp— Tanuj Singh (@ImTanujSingh) April 26, 2024 ఇదిలా ఉంటే, సన్‌రైజర్స్‌కు నిన్న సొంత మైదానంలో చుక్కెదురైంది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 35 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ (43 బంతుల్లో 51; 4 ఫోర్లు, సిక్స్), పాటిదార్ (20 బంతుల్లో 50; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్దసెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ బౌలర్లు చాలాకాలం తర్వాత కలిసికట్టుగా బౌలింగ్ చేసి సన్‌రైజర్స్‌ను ఇబ్బంది పెట్టారు.స్వప్నిల్ సింగ్, గ్రీన్, కర్ణ్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టగా.. విల్ జాక్స్, యశ్ దయాల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో షాబాజ్ అహ్మద్ (40 నాటౌట్), కమిన్స్ (31), అభిషేక్ శర్మ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
RCB: గెలిచి నెలైంది.. ఆ మాత్రం ఉంటుందిలే.. విరాట్‌పై దారుణమైన ట్రోల్స్!
ఐపీఎల్ 2024 సీజన్లో ఆర్సీబీకి ఎట్టకేలకు రెండో విజయం లభించింది. నిన్న సన్‌రైజర్స్‌పై విజయం సాధించిన అనంతరం ఆ జట్టుకు వరుస పరాజయాల నుంచి ఊరట లభించింది. నిన్నటి మ్యాచ్‌లో డుప్లెసిస్ సేన సన్‌రైజర్స్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించి, పరాభావాల పరంపరకు పుల్‌స్టాప్ పెట్టింది. మార్చి 25న పంజాబ్‌పై సీజన్ తొలి విజయం సాధించిన ఆర్సీబీ.. సరిగ్గా నెల రోజుల తర్వాత ఏప్రిల్ 25న మరో విజయం నమోదు చేసింది. ఈ మధ్యలో ఆ జట్టు డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుంది. Happiness on Virat Kohli's face after the win. ❤️ pic.twitter.com/RRRZ1ViWux— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 ఈ విజయం అనంతరం ఆర్సీబీ ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా సంబురాలు చేసుకోవడం టాక్ ఆఫ్ ద సోషల్‌మీడియాగా మారింది. ఏదో టైటిల్ గెలిచినట్లు ఆనందపడిపోతున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. Cameron Green hugging Virat Kohli. ❤️ pic.twitter.com/Zl4StHBu6b— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 మ్యాచ్ గెలిచి నెల అవుతుంది కదా.. ఆ మాత్రం ఉంటుందిలే అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఆటగాళ్ల విజయోత్సవ సంబురాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలను ఆర్సీబీ వ్యతిరేకులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. RCB REGISTERED A WIN IN THEIR 250TH IPL MATCH. 🫡- A victory against one of the most dangerous sides of IPL 2024. 👌pic.twitter.com/UWn3pZD0OS— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 నిన్నటి మ్యాచ్‌లో నిదానంగా ఆడినందుకు కూడా విరాట్ కోహ్లి దారుణమైన ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. విరాట్ వ్యక్తిగత మైలురాళ్ల కోసమే ఆడతాడన్న విషయం మరోసారి రుజువైందని నెటిజన్లు మండిపడుతున్నారు. The emotional hug between Virat Kohli and Faf Du Plessis after the win. ❤️ pic.twitter.com/cb0PlDhS5z— Mufaddal Vohra (@mufaddal_vohra) April 26, 2024 రజత్ పాటిదార్ పుణ్యమా అని ఆర్సీబీ గెలిచింది కానీ.. ఫలితం తారుమారు అయ్యుంటే మాత్రం ఆర్సీబీ అభిమానులే కోహ్లిని ఏకిపారేసి ఉండేవారు. నిన్నటి మ్యాచ్‌లో పాటిదార్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తే.. విరాట్ 51 పరుగులు చేసేందుకు 43 బంతులు తీసుకున్నాడు. హాఫ్ సెంచరీకి ముందు విరాట్ చాలా బంతులు వేస్ట్ చేశాడు. అతనిలో వ్యక్తిగత మైలురాళ్లు అధిగమించాలనే ఉద్దేశం స్పష్టంగా బయటపడింది. ఇదే అభిమానులకు చిర్రెత్తిపోయేలా చేసింది.జట్టు కోసం ఎలా ఆడాలో రోహిత్‌ను చూసి నేర్చుకో అంటూ అభిమానులు చురకలంటిస్తున్నారు. మొత్తానికి మాసం తర్వాత లభించిన విజయానికి అతిగా స్పందించడం.. నిదానంగా ఆడటం వంటి కారణాల చేత విరాట్ నిన్నటి నుంచి ట్రోలింగ్‌కు గురవుతున్నాడు. -
SRH vs RCB: ఉప్పల్‌లో 300 కొడతారా..!
సాక్షి, హైదరాబాద్: 266... 277... 287... ఇదంతా ఒకే ఐపీఎల్ సీజన్లో, ఒకే టీమ్, వేర్వేరు మ్యాచ్‌లలో చేసిన పరుగుల విధ్వంసం. విశేషం ఏమిటంటే ఈ 287 పరుగులే ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు. ఈ పరుగుల సునామీ సృష్టించింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కాగా... ఇందులో 277 పరుగులు నమోదు చేసింది నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగానే.ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఈసారి ఐపీఎల్ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును ‘ఢీ’ కొట్టనుంది. 10 రోజుల క్రితం బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ జట్టు 288 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆ లక్ష్యాన్ని ఆర్సీబీ (262/7) చేధించినంత పనిచేసింది. ఈ ఇరు జట్లే మళ్లీ నేడు తలపడనుండటంతో క్రికెట్ అభిమానుల చూపంతా ఈ మ్యాచ్‌పైనే ఉంది. ఆర్సీబీ ప్రతీకారం తీర్చుకోనుందా? హైదరాబాద్ తన హవాను కొనసాగించనుందా? అనే ఆసక్తికి ఉప్పల్ స్టేడియం వేదికగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడితే బెంగళూరు ‘ప్లే ఆఫ్స్’ చేరే అవకాశాలు ఆవిరవుతాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుకు ఆడుతున్న ‘లోకల్ బాయ్’ మొహమ్మద్ సిరాజ్, భారత స్టార్ విరాట్ కోహ్లి ఎలాంటి ప్రదర్శన చేస్తారో వేచి చూడాలి. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, మార్క్రమ్, ఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి, అబ్దుల్ సమద్ చెలరేగితే సన్‌రైజర్స్ స్కోరు ఈసారి 300 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సన్‌రైజర్స్ భీకరమైన ఫామ్‌లో ఉండటం... కోహ్లిలాంటి దిగ్గజం బరిలోకి దిగనుండటంతో ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ సీజన్‌లోని గత మ్యాచ్‌ల్లాగే ఈసారీ అభిమానులకు టికెట్ల ఇక్కట్లు తప్పట్లేదు. ఆన్లైన్లో టిక్కెట్లు క్షణాల్లో అయిపోవడంతో చేసేదేమిలేక క్రికెట్ అభిమానులంతా బిగ్ స్క్రీన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న పలు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, మాల్స్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. 🧡❤️ pic.twitter.com/3ho5bxzGSZ— SunRisers Hyderabad (@SunRisers) April 25, 2024 -
తగ్గేదేలే అంటున్న కమిన్స్..ఆర్సీబీ పరిస్థితి ఏంటో?
-
IPL 2024: తిరుగులేని సన్‌రైజర్స్.. అన్ని జట్లు ఓడినా..!
ఐపీఎల్ 2024 సీజన్లో సగానికి పైగా మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ (14 పాయింట్లు), కోల్‌కతా నైట్‌రైడర్స్ (10), సన్‌రైజర్స్ హైదరాబాద్ (10), లక్నో సూపర్ జెయింట్స్ (10) జట్లు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ రేసులో ముందున్నాయి. సీఎస్కే (8), గుజరాత్ (8), ముంబై ఇండియన్స్ (6), ఢిల్లీ క్యాపిటల్స్ (6) జట్లు ఐదు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్నాయి. పంజాబ్ కింగ్స్ (4), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (2) చివరి రెండు స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్ అశలను దాదాపుగా వదులుకున్నాయి.ప్రస్తుత సీజన్లో 39 మ్యాచ్‌ల అనంతరం ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ మినహా మిగతా తొమ్మిది జట్లు తమతమ సొంత మైదానాల్లో పరాజయాలు ఎదుర్కొన్నాయి. ఒక్క సన్‌రైజర్స్ మాత్రమే హోం గ్రౌండ్లో తిరుగులేని శక్తిగా ఉంది. భారీ ఫ్యాన్ బేస్ ఉన్న చెన్నై, ఆర్సీబీ, ముంబై జట్లు సైతం సొంత మైదానాల్లో ఓటములు ఎదుర్కొంటే, కమిన్స్ సేన మాత్రం సొంత అభిమానుల మధ్యలో దర్జాగా తలెత్తుకు నిలబడింది.ఈ సీజన్లో సన్‌రైజర్స్ కమిన్స్ నేతృత్వంలో మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. పటిష్టం అంటే అట్లాంటి ఇట్లాంటి పటిష్టం కాదు. ఐపీఎల్ పునాదులు దద్దరిల్లేంత పటిష్టంగా కమిన్స్ సేన ఉంది. సన్‌రైజర్స్ బ్యాటింగ్ వీరులు విధ్వంసం ధాటికి పొట్టి క్రికెట్ బ్యాటింగ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. వీరి దెబ్బకు ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్లో ఇప్పటికే మూడు సార్లు 260 ప్లస్ స్కోర్లు నమోదు చేసింది.మరోవైపు బౌలింగ్‌లోనూ సన్‌రైజర్స్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కమిన్స్ నేతృత్వంలో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగంలో కూడా అదరగొడుతుంది. మొత్తంగా ఈ సీజన్లో ఆరెంజ్ ఆర్మీ పట్టపగ్లాల్లేకుండా టైటిల్ దిశగా దూసుకెళ్తుంది. రేపు (ఏప్రిల్ 25) జరుగబోయే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సొంత మైదానంలో ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వరద పారి ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కావడం ఖాయమని సన్‌రైజర్స్ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.ఇదే సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఏం జరిగిందో అందరం చూశాం. ఆర్సీబీ హోం గ్రౌండ్లో జరిగిన ఆ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు పరుగుల ప్రళయం సృష్టించారు. హెడ్ (102), అభిషేక్ శర్మ (34), క్లాసెన్ (67), మార్క్రమ్ (32 నాటౌట్), అబ్దుల్ సమద్ (37 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ స్కోర్ (287) నమోదు చేసింది. ప్రత్యర్ది హోం గ్రౌండ్‌లోనే సన్‌రైజర్స్ బ్యాటర్లు ఈ తరహాలో రెచ్చిపోతే.. రేపు సొంత మైదానంలో వీరిని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాదు. -
ఉప్పల్‌లో ఉల్లాసంగా SRH, RCB ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
IPL 2024 KKR Vs RCB: ఫేవరేట్ కేకేఆర్
-
ఐపీఎల్‌కు 17 ఏళ్లు.. తొలి మ్యాచ్ ఆడిన వాళ్లు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు..?
క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు నేటితో 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఇవాళ (ఏప్రిల్ 18) క్యాష్ రిచ్ లీగ్ 17వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి గతాన్ని గుర్తు చేసుకుంది. మీ ఫేవరెట్ ఐపీఎల్ జ్ఞాపకాన్ని కూడా షేర్ చేసుకోండని క్యాప్షన్ జోడించింది. దీంతో చాలామంది ఐపీఎల్ అభిమానులు తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. IPL's poster on Completed "17 Years of IPL". - The Biggest Cricket Event...!!!! ⭐ pic.twitter.com/oXgkvRf0dP — CricketMAN2 (@ImTanujSingh) April 18, 2024 ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో ఆడిన వారు ప్రస్తుతం ఎంత మంది ఇప్పటికీ ఆడుతున్నారని అడిగాడు. దీనికి చాలామంది తమకు తెలిసిన సమాధానాలు చెప్పారు. సమాధానం రివీల్ చేయకముందు మీకు తెలిసిన సమాధాన్ని మీరు కూడా షేర్ చేయండి. 17 YEARS OF THE IPL...!!! 💥 The greatest league in the world started on this day in 2008. 🇮🇳 pic.twitter.com/BPApcjBkOL — Mufaddal Vohra (@mufaddal_vohra) April 18, 2024 సమాధానం విషయానికొస్తే.. ఐపీఎల్ తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ తరఫున ఆడిన వృద్దిమాన్ సాహా, ఇషాంత్ శర్మ ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీకి ఆడిన విరాట్ కోహ్లి ఇప్పుడు కూడా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆడిన ఈ ముగ్గురు మాత్రమే ఐపీఎల్లో ఇంకా కొనసాగుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన మరో విషయం ఏంటంటే.. ఐపీఎల్ చరిత్రలో విరాట్ ఒక్కడే నాటి నుంచి నేటి వరకు ఒకే జట్టుకు ఆడుతూ ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. నాటి మ్యాచ్ విషయానికొస్తే.. బ్రెండన్ మెక్కల్లమ్ శివాలెత్తిపోవడంతో (73 బంతుల్లో 158; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) కేకేఆర్ 140 పరుగల భారీ తేడాతో ఆర్సీబీపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవరల్లో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో మెక్కల్లమ్ ఒక్కడే సింహ భాగం స్కోర్ చేశాడు. సౌరవ్ గంగూలీ 10, రికీ పాంటింగ్ 20, డేవిడ్ హస్సీ 12, మొహమ్మద్ హఫీజ్ 5 (నాటౌట్) పరుగులు చేశారు.ఆర్సీబీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆష్లే నోఫ్కే, జాక్ కలిస్ తలో వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఆశోక్ దిండా (3-0-9-2), ఇషాంత్ శర్మ (3-0-7-1), అజిత్ అగార్కర్ (4-0-25-3), సౌరవ్ గంగూలీ (4-0-21-2), లక్ష్మీ రతన్ శుక్లా (1.1-0-12-1) ధాటికి 15.1 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఒకే ఒక్కరు (ప్రవీణ్ కుమార్ (18 నాటౌట్)) రెండంకెల స్కోర్ చేశారు. ద్రవిడ్ 2, వసీం జాఫర్ 6, విరాట్ కోహ్లి 1, జాక్ కలిస్ 8, కెమరూన్ వైట్ 6, మార్క్ బౌచర్ 7, బాసిల్ థంపి 0, నోఫ్కే 9, జహీర్ ఖాన్ 3, సునీల్ జోషి 3 పరుగులు చేసి ఔటయ్యారు. వికెట్ కీపర్‌గా వృద్దిమాన్ సాహా కలిస్ క్యాచ్ అందుకున్నాడు. -
‘తప్పించమని నేనే అడిగా’
ఐపీఎల్లో వరుస వైఫల్యాల తర్వాత శారీరకంగా, మానసికంగా కూడా విరామం అవసరమని తాను భావించానని...అందుకే తుది జట్టు నుంచి తనను తప్పించాలని తానే కోరినట్లు ఆర్సీబీ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వివరణ ఇచ్చాడు. ముంబైతో మ్యాచ్‌లో వేలికి గాయం కాగా, అదే కారణంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ను ఆడించలేదని వినిపించగా... అదేమీ కారణం కాదని అతనే చెప్పాడు. ‘నేను తీసుకుంది సులువైన నిర్ణయం. కెప్టెన్, కోచ్‌ల వద్దకు వెళ్లి నా స్థానంలో మరొకరిని ప్రయత్నించేందుకు ఇది సరైన సమయమని చెప్పా. ప్రస్తుతం నాకు శారీరకంగా, మానసికంగా విరామం తప్పనిసరి అనిపించింది. అన్ని విధాలా కోలుకున్న తర్వాత మళ్లీ వచ్చి మెరుగైన ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా’ అని మ్యాక్స్‌వెల్ చెప్పాడు. ఈ సీజన్ ఐపీఎల్లో ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 5.33 సగటుతో 32 పరుగులే చేశాడు. ఇందులో 3 సార్లు డకౌట్ కాగా, ఒక్కటే మ్యాచ్‌లో ఐదుకంటే ఎక్కువ బంతులు ఆడాడు. కోల్‌కతాతో మ్యాచ్‌లో రెండు సార్లు క్యాచ్ జారవిడిస్తే 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు. -
ఆర్సీబీని ఏకి పారేసిన టెన్నిస్ దిగ్గజం.. అమ్మిపారేయండంటూ అసహనం
ఆర్సీబీ యాజమాన్యంపై భారత టెన్నిస్ దిగ్గజం.. డబుల్స్, మిక్సడ్ డబుల్స్ స్పెషలిస్ట్ (12 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విన్నర్) మహేశ్ భూపతి తీవ్రస్థాయి ధ్వజమెత్తాడు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ చెత్త ప్రదర్శన నేపథ్యంలో భూపతి అసహనం వ్యక్తం చేశాడు. నిన్న (ఏప్రిల్ 15) ఆర్సీబీపై సన్‌రైజర్స్ రికార్డు స్కోర్ చేసిన అనంతరం భూపతి ట్విటర్ వేదికగా స్పందిస్తూ ఇలా అన్నాడు. క్రికెట్ అభిమానులు, ఐపీఎల్ అభిమానులు, ఆటగాళ్ళ కోసం బీసీసీఐని విజ్ఞప్తి చేస్తున్నా. బీసీసీఐ చొరవ తీసుకుని ఆర్సీబీని స్పోర్ట్స్ ఫ్రాంచైజీ నిర్మాణంపై శ్రద్ధ చూపే కొత్త యాజమాన్యానికి అప్పగించండి. ఆర్సీబీ తాజా ప్రదర్శన చాలా బాధాకరం అంటూ భూపతి తన ట్వీట్లో పేర్కొన్నాడు. For the sake of the Sport , the IPL, the fans and even the players i think BCCI needs to enforce the Sale of RCB to a New owner who will care to build a sports franchise the way most of the other teams have done so. #tragic — Mahesh Bhupathi (@Maheshbhupathi) April 15, 2024 స్వతహాగా ఆర్సీబీ అభిమాని అయిన భూపతి తన ఆరాధ్య ఆటగాళ్లతో కూడిన ఫ్రాంచైజీ పేలవ ప్రదర్శన చూసి విరక్తి చెంది ఈ ట్వీట్ చేశాడని తెలుస్తుంది. భూపతి విరాట్, డుప్లెసిస్‌లను బాగా అభిమానిస్తాడు. విరాట్‌పై అభిమానాన్ని భూపతి గతంలో చాలా సందర్భాల్లో బహిర్గతం చేశాడు. ఆర్సీబీ తాజా దుస్థితికి యాజమాన్య వైఖరి కారణమని భావిస్తున్న భూపతి కొత్త యాజమాన్యానికి ఫ్రాంచైజీ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐని కోరాడు. ఈ సీజన్లో ఆర్సీబీ ఏడు మ్యాచ్‌ల్లో ఆరింట ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్ల చెత్త ప్రదర్శన కారణంగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
IPL 2024 RCB Vs SRH: ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ ఎంత ఛండాలంగా ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సీజన్లో ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస స్థాయి బౌలర్‌గా కనిపించడం లేదు. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న విదేశీ పేసర్లు అల్జరీ జోసఫ్, కెమరూన్ గ్రీన్, రీస్ టాప్లే, లోకీ ఫెర్గూసన్ గల్లీ స్థాయి బౌలర్లకంటే హీనంగా బౌలింగ్ చేస్తుండగా.. స్వదేశీ హీరోలు సిరాజ్, యశ్ దయాల్, విజయ్‌కుమార్ తామేమీ తక్కువ కాదన్నట్లు పోటీపడి పరుగులు సమర్పించుకుంటున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్‌లో అయితే ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శన శృతి మించిపోయింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు బౌలర్లు తమ కోటా నాలుగు ఓవర్లలో 50పైగా పరుగులు సమర్పించుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత మంది ఫిఫ్టి ప్లస్ స్కోర్లు సమర్పించుకోవడం ఇదే మొదటిసారి. ఈ మ్యాచ్‌లో రీస్ టాప్లే 68, విజయ్‌కుమార్ 64, ఫెర్గూసన్ 52, యశ్ దయాల్ 51 పరుగులు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా సన్‌రైజర్స్ బ్యాటర్లు పేట్రేగిపోయి ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను నమోదు చేశారు. ఆర్సీబీ బౌలర్ల చెత్త ప్రదర్శనను ఎప్పుడూ వెనకేసుకొచ్చే సొంత అభిమానులే జీర్ణించుకోలేకతున్నారు. ఆర్సీబీ బౌలింగ్.. నభూతో నభవిష్యతి అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో విరాట్ (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీని గెలిపించలేకపోయారు. ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
బెంగళూరులో దుమ్మురేగొట్టిన ఆరెంజ్ ఆర్మీ ‘ఓ రేంజ్’ బ్యాటింగ్ (ఫొటోలు)
-
IPL 2024 RCB VS SRH: ఓడినా ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేసిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్లో నిన్న (ఏప్రిల్ 15) అత్యంత రసవత్తరమైన సమరం జరిగింది. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఎన్నో టీ20 రికార్డులు బద్దలయ్యాయి. ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్.. ఓ టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన అత్యధిక స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262 = 549 పరుగులు).. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్ల రికార్డు (ఆర్సీబీ-22).. ఓ టీ20 మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81).. ఇలా ఈ మ్యాచ్‌లో చాలావరకు పొట్టి క్రికెట్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. ఇదే మ్యాచ్‌లో మరో భారీ రికార్డు కూడా నమోదైంది. ఆర్సీబీ మ్యాచ్ ఓడినప్పటికీ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్ (262) చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ పేరిట ఉండేది. ముంబై ఇండియన్స్ ఇదే సీజన్లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ (సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ) 246 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో సెకెండ్ బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ నమోదు చేసిన ఆర్సీబీ.. మరో రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా డ్యూయల్ రికార్డు నమోదు చేసింది. 2017 సీజన్లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 131 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ.. 49 పరుగులకే ఆలౌటైంది. ఈ స్కోర్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌గానూ రికార్డైంది. మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ ఆర్సీబీ 262 పరుగులకు పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసినప్పటికీ ఓటమి తప్పలేదు. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినా ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. -
ఐపీఎల్ నుంచి తప్పుకున్న మ్యాక్స్‌వెల్
ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా వెల్లడించాడు. శారీరక, మానసిక అలసట కారణంగా క్యాష్ రిచ్ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు మ్యాక్సీ ప్రకటించాడు. విరామం ఎన్ని రోజుల అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆర్సీబీ-సన్‌రైజర్స్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మ్యాక్స్‌వెల్ ఈ విషయాలను షేర్ చేసుకున్నాడు. పేలవమైన ఫామ్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన మాక్స్వెల్.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. తనను సన్‌రైజర్స్ మ్యాచ్ నుంచి తప్పించమని మ్యాక్స్‌వెల్ స్వయంగా ఆర్సీబీ యాజమాన్యాన్ని కోరాడు. తన స్థానంలో మరో ఆటగాడిని తీసుకోమని మ్యాక్సీ కెప్టెన్ డుప్లెసిస్‌కు విజ్ఞప్తి చేశాడు. అందుకే సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ స్థానంలో విల్ జాక్స్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మ్యాక్సీ ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం 32 పరుగులు (0, 3, 28, 0, 1, 0) మాత్రమే చేసిన విషయం తెలిసిందే. ఇందులో మూడు డకౌట్లు ఉన్నాయి. మ్యాక్సీ సహా ఆర్సీబీ బ్యాటింగ్ యూనిట్ మొత్తం (విరాట్ మినహా) దారుణంగా విఫలం కావడంతో ఈ సీజన్లో ఆర్సీబీ 7 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. గత సీజన్లలో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరఫున చేసిన స్కోర్లు.. 2021 సీజన్- 513 పరుగులు 2022 సీజన్- 301 పరుగులు 2023 సీజన్- 400 పరుగులు సన్‌రైజర్స్‌తో నిన్నటి మ్యాచ్ విషయానికొస్తే.. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 288 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదిస్తూ.. పోరాడితే పోయేదేమీ లేదన్న చందంగా ఆర్సీబీ పోరాటం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఛేదనలో ఆర్సీబీ చివరి వరకు గెలుపు కోసం పోరాడింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
చరిత్రపుటల్లోకెక్కిన సన్‌రైజర్స్-ఆర్సీబీ మ్యాచ్.. టీ20 రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆర్సీబీ-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్ చాలా వరకు టీ20 రికార్డులను బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేసిన స్కోర్ (287/3) 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికం కాగా.. పొట్టి క్రికెట్ చరిత్రలో రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా (గతేడాది ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ మంగోలియాపై చేసిన 314 పరుగుల స్కోర్ టీ20ల్లో అత్యధికం) రికార్డైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి చేసిన స్కోర్ (సన్‌రైజర్స్ 287 + ఆర్సీబీ 262=549) టీ20 హిస్టరీలో (ఓ మ్యాచ్‌లో) నమోదైన అత్యధిక స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 22 సిక్సర్లు కొట్టిన సన్‌రైజర్స్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు (ఓ ఇన్నింగ్స్‌లో) కొట్టిన జట్టుగా ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (39 బంతులు) చేసిన సెంచరీ సన్‌రైజర్స్ తరఫున వేగవంతమైన శతకంగా రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌లో నమోదైన బౌండరీలు (43 ఫోర్లు, 38 సిక్సర్లు= 81), సిక్సర్లు (38) (ఇరు జట్లు కలిపి కొట్టినవి) పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఓ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక బౌండరీలు, సిక్సర్లుగా రికార్డయ్యాయి. ఈ రికార్డులే కాక ఈ మ్యాచ్‌లో మరెన్నో చిన్నా చితక రికార్డులు నమోదయ్యాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (31 బంతుల్లో 67; 2 ఫోర్లు, 7 సిక్సర్లు), అబ్దుల్ సమద్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (22 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్రమ్ (10 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో ఫెర్గూసన్ 2, టాప్లే ఓ వికెట్ పడగొట్టాడు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. పోరాడితే పోయేదేమీ లేదనుకుని చివరి నిమషం వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. విరాట్ కోహ్లి (20 బంతుల్లో 42; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డుప్లెసిస్ (28 బంతుల్లో 62; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (35 బంతుల్లో 83; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), మహిపాల్ లోమ్రార్ (11 బంతుల్లో 19; 2 సిక్సర్లు), అనూజ్ రావత్ (14 బంతుల్లో 25 నాటౌట్; 5 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ ఆర్సీబీ లక్ష్యానికి 26 పరుగుల దూరంలో నిలిచిపోయింది. డీకే ఆఖర్లో జూలు విదిల్చినప్పటికీ లక్ష్యం పెద్దది కావడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సన్‌రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 3, మయాంక్ మార్కండే 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టాడు. -
ఆ ముగ్గురి బౌలింగ్‌లో ఆడటం ఇష్టం: కోహ్లి
ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి బ్యాట్ ఝులిపిస్తున్నా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కథ మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచి ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ క్రమంలో సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొందడం ఆర్సీబీకి అనివార్యంగా మారింది. విజయాల బాట పడితే గానీ ఈ సీజన్లో కనీసం ప్లే ఆఫ్స్ వరకైనా చేరుకునే అవకాశం ఉంటుంది. లేదంటే.. ‘‘వచ్చేసారి కప్ మనది’’ అంటూ ఆ జట్టు అభిమానులు సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 📍 Bengaluru Royal Challengers Bengaluru ❤️ take on the Sunrisers Hyderabad 🧡 at the Chinnaswamy Stadium! Another thriller on the cards tonight? Find out 🔜#TATAIPL | #RCBvSRH | @RCBTweets | @SunRisers pic.twitter.com/WTRR28gGGs — IndianPremierLeague (@IPL) April 15, 2024 ఇక ఇప్పటికే ఐదింట మూడు విజయాలతో సన్‌రైజర్స్ జోరు మీద ఉండగా.. సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుండటం ఆర్సీబీకి సానుకూలాంశం. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఈ ఎడిషన్‌లో కోహ్లి ఆరు మ్యాచ్‌లలో కలిపి 319 పరుగులు చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ తన దగ్గరే పెట్టుకున్నాడు. కోహ్లి ఖాతాలో ఇప్పటికే ఓ సెంచరీ(113*) కూడా ఉండటం విశేషం. అయితే, టాపార్డర్‌లో ఓపెనర్ కోహ్లి ఒక్కడే రాణిస్తుండగా.. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ విఫలం కావడం ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇక విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా పేరొందిన గ్లెన్ మాక్స్వెల్ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఇలా KGFలో కేవలం K మాత్రమే రాణిస్తుండగా.. మిలిగిన ఇద్దరు జట్టుకు పెద్దగా ఉపయోగపడకపోవడంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు KGF త్రయం చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా మాక్సీ.. విరాట్ కోహ్లిని ఉద్దేశించి.. ‘‘ప్రత్యర్థి బౌలర్లలో ఎవరి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం అంటే నీకు బాగా ఇష్టం’’ అని అడిగాడు. ఇందుకు బదులిస్తూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేసిన కోహ్లి.. ముందుగా మాక్స్వెల్(స్పిన్) పేరు, ఆ తర్వాత ఆస్ట్రేలియాకే చెందిన జేమ్స్ ఫాల్కనర్(పేసర్) పేరును కూడా చెప్పాడు. ఇక మూడో బౌలర్‌గా కగిసో రబడ(సౌతాఫ్రికా పేసర్) పేరు చెప్పిన కోహ్లి.. అతడి బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం చాలెంజింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక మాక్స్వెల్ తాను తరచుగా ఉపయోగించే మూడు హిందీ పదాలు ఇవేనంటూ.. ‘‘ఠీకై(మంచిది), షుక్రియా, చలో చలో’’ అని పేర్కొన్నాడు. చదవండి: BCCI: ఇకపై అలా చేస్తే భారీ జరిమానా.. ఐపీఎల్ జట్లకు వార్నింగ్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: సన్‌రైజర్స్ దూకుడు ముందు ఆర్సీబీ నిలబడేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 15) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీకొట్టబోతుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఐదింట మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలువగా.. ఆరింట ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన ఆర్సీబీ అట్టడుగు స్థానంలో కొనసాగుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు 22 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా సన్‌రైజర్స్ 12, ఆర్సీబీ 10 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. నేటి మ్యాచ్‌కు వేదిక అయిన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్సీబీని ఓడించింది. 2016 సీజన్ టైటిల్‌ను సన్‌రైజర్స్ ఇదే వేదికపై ఆర్సీబీని చిత్తు చేసి సాధించింది. 2019 తర్వాత ఇరు జట్లు ఈ వేదికపై ఇప్పటివరకు తలపడలేదు. బలాబలాల విషయానికొస్తే.. ప్రస్తుత సీజన్లో సన్‌రైజర్స్ ఆర్సీబీ కంటే చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఈ జట్టు నిండా విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. బౌలింగ్ విభాగంలోనూ సన్‌రైజర్స్ పర్ఫెక్ట్గా ఉంది. జట్టులో సగం మంది రాణించినా ఆర్సీబీతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్ లాంటి మెరుపు వీరులు.. కమిన్స్, భువీ, ఉనద్కత్, నటరాజన్ లాంటి అద్భుతమైన పేసర్లు సన్‌రైజర్స్ అమ్ములపొదిలో ఉన్నారు. నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడమే సన్‌రైజర్స్‌కు ఉన్న ఏకైక లోటు. ఆర్సీబీ విషయానికొస్తే.. ఈ జట్టు పరిస్థితి సన్‌రైజర్స్‌కు పూర్తి భిన్నంగా ఉంది. జట్టులో విరాట్ కోహ్లి మినహా ఒక్కరూ రాణించడం లేదు. మ్యాక్స్‌వెల్, గ్రీన్, విల్ జాక్స్ లాంటి విదేశీ మెరుపులు ఉన్నప్పటికీ వీరు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా పేల లేదు. విరాట్ తర్వాత దినేశ్ కార్తీక్ ఒక్కడే అడపాదడపా ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. రజత్ పాటిదార్, డుప్లెసిన్ ఇటీవల ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అర్దసెంచరీలు సాధించారు. ఆర్సీబీ బౌలింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ జట్టు బౌలింగ్ లైనప్‌లో పేరెన్నిక కలిగిన బౌలర్ ఒక్కరూ లేడు. రీస్ టాప్లే, సిరాజ్, ఆకాశ్‌దీప్, విజయ్‌కుమార్ వైశాఖ్ వికెట్లు తీయకపోగా ప్రతి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ బౌలింగ్ వనరులతో ఆర్సీబీ ఈ సీజన్లో నెట్టుకు రావడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో పటిష్టమైన సన్‌రైజర్స్‌ను ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి. -
RCB Vs SRH: చిన్నస్వామి స్టేడియంలో సత్తా చాటేదెవరు?
-
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో RCB క్రికెట్ జట్టు
-
రఫ్పాడించిన ముంబై.. ఆర్సీబీకి మరో ఓటమి
-
కోహ్లిపై పాక్ మాజీ పేసర్ ట్రోలింగ్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
ఐపీఎల్-2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో ఆర్సీబీ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌తో గురువారం నాటి మ్యాచ్ సందర్భంగా ఐదో పరాజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది. వాంఖడే మ్యాచ్‌లో తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఈ క్రమంలో ముంబైతో మ్యాచ్‌లో కోహ్లి వైఫల్యాన్ని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ పేసర్ జునైద్ ఖాన్ దారుణంగా ట్రోల్ చేశాడు. ఎక్స్ వేదికగా.. ‘‘స్ట్రైక్‌రేటు 33.33’’ అంటూ కోహ్లి బ్యాటింగ్‌పై జునైద్ ఖాన్ విమర్శలు సంధించాడు. కాగా జునైద్ కోహ్లిపై సెటైర్లు వేడయం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రాజస్తాన్ రాయల్స్‌తో విరాట్ కోహ్లి సెంచరీ చేసినపుడు కూడా ఇలాగే కామెంట్ చేశాడు. ‘‘ఐపీఎల్ చరిత్రలో స్లోయెస్ట్ 100 సాధించినందుకు శుభాభినందనలు’’ అంటూ జునైద్ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి వంద పరుగుల మార్కు అందుకోవడానికి 67 బంతులు తీసుకున్నాడు. భారత గడ్డపై ఐపీఎల్లో శతకం చేసేందుకు అత్యధిక బంతులు తీసుకున్న బ్యాటర్ కోహ్లినే కావడం గమనార్హం. ఓవరాల్‌గా మనీశ్ పాండే(2009- సెంచూరియన్)తో కలిసి ఈ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జునైద్ ఖాన్ కోహ్లిని ఇలా విమర్శించాడు. కాగా జునైద్ ఖాన్ ట్వీట్‌పై కోహ్లి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్‌లో ఏ ఆటగాడూ రాణించలేడని.. అటెన్షన్ కోసమే కోహ్లి పేరు వాడుకుంటున్నాడంటూ ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి శతకం సాధించిన రాజస్తాన్‌తో మ్యాచ్‌లో.. తాజాగా అతడు విఫలమైన ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ ఆర్సీబీ ఓడిపోయింది. ఇక పదిహేడో ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 319 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉండటం విశేషం. Boom Boom Bumrah!@Jaspritbumrah93 comes into the attack and gets the big wicket of Virat Kohli. Live - https://t.co/7yWt2uizTf #TATAIPL #IPL2024 #MIvRCB pic.twitter.com/1QbRGjV2L0 — IndianPremierLeague (@IPL) April 11, 2024 Strike rate 33.33 😶#RCBvsMI — Junaid khan (@JunaidkhanREAL) April 11, 2024 -
రోహిత్‌ను టీజ్ చేసిన కోహ్లి.. హిట్‌మ్యాన్ రియాక్షన్ వైరల్
టీమిండియా బ్యాటర్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అద్బుతమైన ఆట తీరుతోనే కాదు.. తనదైన దూకుడు శైలి, హావభావాలతో అభిమానులను మెప్పించడం ఈ రన్‌మెషీన్‌కు అలవాటు. ఇక ఐపీఎల్-2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లోనూ కోహ్లి మరోసారి ఈ విషయాన్ని నిరూపించాడు. మ్యాచ్ ఆసాంతం తన ఎక్స్‌ప్రెషన్స్‌తో హైలైట్‌గా నిలిచిన ఈ ఆర్సీబీ ఓపెనర్.. ముంబై బ్యాటర్ రోహిత్ శర్మతో వ్యవహరించిన తీరు ఇరువురి అభిమానులను ఆకట్టుకుంది. వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ చేయగా.. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ముంబైకి ఓపెనర్లు ఇషాన్ కిషన్(69), రోహిత్ శర్మ(38) శుభారంభం అందించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్(19 బంతుల్లో 52) సుడిగాలి ఇన్నింగ్స్‌కు తోడు హార్దిక్ పాండ్యా(6 బంతుల్లో 21) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దంచికొట్టడంతో ముంబై జయభేరి మోగించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ నాన్- స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సమయంలో కోహ్లి చిలిపి చేష్టలతో అభిమానులకు నవ్వులు తెప్పించాడు. రోహిత్ వెనక నుంచి అతడిని తడుతూ ఏమీ ఎరుగనట్టు ముందుకు వెళ్లి.. ఆ తర్వాత వెనక్కి తిరిగి ఓ లుక్ ఇచ్చాడు. ఇక తొలుత విషయమేంటో అర్థం కాని రోహిత్.. కోహ్లి అలా నవ్వగానే థంబ్స్ అప్ సింబల్ చూపిస్తూ తానూ నవ్వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో విరాట్- రోహిత్ మధ్య విభేదాలంటూ వార్తలు వ్యాప్తి చేసేవారికి ఈ దృశ్యాలు చూపించండని ‘విరాహిత్’ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. వాళ్లిద్దరి మధ్య సహోదర భావం ఉందని.. అనవసరంగా వారి పేరు చెప్పి గొడవలు పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీతో మ్యాచ్‌లో గెలుపుతో ముంబై రెండో విజయం సాధించగా.. ఆర్సీబీ ఖాతాలో ఐదో పరాజయం చేరింది. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి కేవలం మూడు పరుగులే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. View this post on Instagram A post shared by Ankit singh :) (@relatableboy_ankit) Not a Rohirat ship fan but Video mast hei ye🤣#ViratKohli #RohitSharma pic.twitter.com/QinqmaoRAK — Aayu sha #Ro45 (@45_ayusha) April 11, 2024 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024 MI VS RCB: సెంచరీ పూర్తి చేసిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ అరుదైన మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్‌లో 5 సిక్సర్లు బాదిన ఇషాన్ ఐపీఎల్లో సిక్సర్ల సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్‌కు ముందు రోహిత్ శర్మ, కీరన్ పోలార్డ్, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ తరఫున 100 సిక్సర్ల మార్కును తాకారు. ఇషాన్ ఖాతాలో ప్రస్తుతం 102 సిక్సర్లు (80 మ్యాచ్‌లు) ఉన్నాయి. కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో ఇషాన్‌తో పాటు రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
IPL 2024 RCB Vs MI: ముంబై, ఆర్సీబీ మ్యాచ్‌పై అనుమానాలు..?
వాంఖడే వేదికగా ముంబై, ఆర్సీబీ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌పై పలువురు క్రికెట్ అభిమానులు అనుమానం వ్యక్తిం చేస్తున్నారు. టాస్ సమయంలో ఏదో జరిగిందని చర్చించుకుంటున్నారు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని తారుమారు చేశాడని ఆరోపిస్తున్నారు. ఐపీఎల్ అంటేనే ఫిక్సింగ్ అని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిన్నటి మ్యాచ్‌లో ముంబై గెలవాలని ముందుగానే ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. శ్రీనాథ్ టాస్ ఫలితాన్ని మార్చాడనటానికి ఇదే సాక్ష్యం అంటూ ఓ వీడియోని పోస్ట్ (సోషల్‌మీడియాలో) చేశారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆర్సీబీని మట్టికరిపించింది. Rigged the toss too? @mipaltan pic.twitter.com/lmobHelD0S — 🜲 (@balltamperrer) April 12, 2024 తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. ఫలితంగా ముంబై ఇండియన్స్ సీజన్లో రెండో గెలుపును నమోదు చేసింది. ఈ విజయాలకు ముందు ముంబై హ్యాట్రిక్ పరాజయాలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబై 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మరోవైపు ఆర్సీబీ 6 మ్యాచ్్ల్లో ఒకే ఒక్క విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆర్సీబీ తదుపరి ఆడబోయే 8 మ్యాచ్‌ల్లో ఏడింట గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. లేకపోతే ఈ సీజన్లోనూ ఆర్సీబీ రిక్త హస్తాలతోనే వెనుదిరగాల్సి వస్తుంది. -
ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో వరుస ఓటమలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో అట్టడుగు (తొమ్మిది) స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు గాయమైనట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్ సందర్భంగా మ్యాక్సీ ఎడమ చేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం. ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (సన్‌రైజర్స్‌తో) మ్యాక్స్‌వెల్ ఆడటం అనుమానమేనని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాక్స్‌వెల్ లేకపోతే వరుస ఓటమలు ఎదుర్కొంటున్న ఆర్సీబీ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. ఈ సీజన్లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున విరాట్ ఒక్కడే బాగా ఆడుతున్నాడు. జట్టులో మిగతా బ్యాట్లంతా కలిపి విరాట్ చేసినన్ని పరుగులు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దమవుతుంది. ఆర్సీబీ బౌలింగ్ టీమ్ విషయానికొస్తే.. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త బౌలింగ్ టీమ్‌గా కనిపిస్తుంది. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మ్యాక్స్‌వెల్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. 𝗜𝗺𝗮𝗴𝗲𝘀 𝘁𝗵𝗮𝘁 𝘆𝗼𝘂 𝗰𝗮𝗻 𝗵𝗲𝗮𝗿 x IPL👂📸: BCCI/IPL pic.twitter.com/YnNghTPWER— CricTracker (@Cricketracker) April 11, 2024 ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. -
రఫ్పాడించిన ముంబై.. ఆర్సీబీకి మరో ఓటమి
-
ఆర్సీబీ ఖాతాలో మరో చెత్త రికార్డు.. విసుగెత్తిపోతున్న అభిమానులు
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. ఈ సీజన్లోనూ ఆ జట్టు చెత్త ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు విసుగుతెప్పిస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 196 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్లో 190 ప్లస్ స్కోర్‌ను కాపాడుకోలేకపోవడం ఆర్సీబీకి ఇది 11వ సారి. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీతో పాటు పంజాబ్ కింగ్స్ (11) మాత్రమే ఇన్నిసార్లు 190 ప్లస్ స్కోర్‌ను కాపాడుకోలేకపోయింది. ఐపీఎల్లో ఇలాంటి చెత్త రికార్డులు ఆర్సీబీ ఖాతాలో చాలా ఉన్నాయి. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు పర్వాలేదనిపించినా బౌలర్లు మాత్రం పూర్తి తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలింగ్ గల్లీ క్రికెటర్లకంటే ఘోరంగా ఉండింది. ప్రతి ఒక్క బౌలర్ 10కిపై ఎకానమీ రేట్‌తో పరుగులు సమర్పించుకున్నారు. ఆకాశ్‌దీప్ అయితే ఏకంగా 15.70 సగటున పరుగులు ఇచ్చాడు. టీమిండియా తరఫున మెరుపులు మెరిపించే సిరాజ్ అతి సాధారణ బౌలర్లా తయ్యారయ్యాడు. అన్క్యాప్డ్ బౌలర్లను తప్పుబట్టేందుకు లేదు. చించేస్తాడనుకున్న రీస్ టాప్లే 3 ఓవరల్లో 34 పరుగులు, మ్యాక్సీ ఒక్క ఓవర్లో 17 పరుగులు సమర్పించుకున్నారు. పేరొందిన బౌలర్‌ను ఒక్కరిని కూడా ఎంపిక చేసుకోకపోవడం ఆర్సీబీ యాజమాన్యం చేసిన తప్పని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. -
IPL 2024: చిత్ర విచిత్రమైన షాట్లతో చెడుగుడు ఆడుకున్న దినేశ్ కార్తీక్
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్ 11) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ వెటరన్ ఆటగాడు దినేశ్ కార్తీక్ చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో (ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్) డీకే ఆడిన షాట్లు మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచాయి. ఈ ఓవర్లో డీకే చిత్రవిచిత్రమైన షాట్లు ఆడి నాలుగు బౌండరీలు రాబట్టాడు. వినూత్న షాట్లతో డీకే ఆకాశ్‌ను చెడుగుడు ఆడుకున్నాడు. డీకే ఈ ఓవర్లో కొట్టిన నాలుగు బౌండరీలు ఒకే దిశలో వెళ్లడం విశేషం. డీకే ఉద్దేశపూర్వకంగా ఈ షాట్లు ఆడి సక్సెస్ అయ్యాడు. డీకే పవర్ హిట్టింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే రీప్లే చూసినట్లుంటుంది. అన్ని షాట్లు ఒకేలా ఉన్నాయి. It's not a replay ❌ It's just @DineshKarthik using his improvisation perfectly 👌 not once but four times. Watch the match LIVE on @JioCinema and @starsportsindia 💻📱#TATAIPL | #MIvRCB pic.twitter.com/IzU1SAqZ6m — IndianPremierLeague (@IPL) April 11, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్ పాటిదార్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను చేజార్చారు. -
IPL 2024 RCB Vs MI: బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టిన సిరాజ్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. సొంత మైదానమైన వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఆర్సీబీని మట్టికరిపించింది. తొలుత బౌలింగ్‌లో బుమ్రా (4-0-21-5) చెలరేగిపోగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్; 3 సిక్సర్లు) శివాలెత్తిపోయారు. సరదాసరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో చాలా ఆసక్తికర సన్నివేశాలు తారసపడ్డాయి. అభిమానులు హార్దిక్‌ను గేలి చేస్తుంటే విరాట్ అడ్డు చెప్పడం.. దిగ్గజ క్రికెటర్లు విరాట్, రోహిత్ మధ్య సరదా సంభాషణ.. రోహిత్ దినేశ్ కార్తీక్‌ను ఆట పట్టించడం (మరో వరల్డ్‌కప్ ఆడాలని ఉందా అని).. ఇలా మ్యాచ్ మొత్తం సరదాసరదాగా సాగింది. మ్యాచ్ పూర్తయ్యాక ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకోవడం చూపరులను ఆకట్టుకుంది. - Rohit and Bumrah handshake. 🤝 - Virat Kohli hugging Hardik. 🫂 - Siraj bowed down to Bumrah. 🙇♂️ MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS — Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024 సిరాజ్ బుమ్రాకు శిరస్సు వంచి సలాం కొట్టడం హైలైట్‌గా నిలిచింది. ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగినందుకు గాను సిరాజ్ బుమ్రాకు సలాం కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో జరిగిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియో నెట్టింట సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ఈ వీడియోకు ఫిదా అవుతున్నారు. హార్దిక్‌ను కోహ్లి వెనకేసుకురావడాన్ని అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్ (61), రజత్ పాటిదార్ (50), దినేశ్ కార్తీక్ (53 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్, రోహిత్, స్కై, హార్దిక్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచి అవకాశలున్న మ్యాచ్‌ను ప్రత్యర్దికి పూలల్లో పెట్టి ఇచ్చారు. -
RCB Vs MI: ఇదేమి బౌలింగ్ రా బాబు.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి! ఆర్సీబీపై ట్రోలింగ్
ఐపీఎల్-2024లో ఆర్సీబీ మరో ఘోర ఓటమి చూవిచూసింది. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. గల్లీ బౌలర్లు కంటే దారుణంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ బౌలర్లు.. మ్యాచ్‌ను ముంబైకు సమర్పించుకున్నారు. ఆర్సీబీ చెత్త బౌలింగ్ కారణంగా ముంబై 197 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు కోల్పోయి 15.3 ఓవర్లలోనే ఊదిపడేసింది. ముంబై బ్యాటర్లు ఇషాన్ కిషన్(69),సూర్యకుమార్ యాదవ్(52) బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశారు.కనీసం ముంబై బ్యాటర్లు అడ్డుకోవడానికి ఏ ఒక్క బౌలర్ కూడా ప్రయత్నించలేదు. సిరాజ్, టాప్లీ లాంటి అంతర్జాతీయ స్ధాయి బౌలర్లు సైతం చేతులెత్తేశారు. Let's all laugh at RCB bowlers and RCB fans 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂#MIvsRCBpic.twitter.com/ieTsdguKOd — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 11, 2024 సిరాజ్ 3 ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకోగా.. టాప్లీ కూడా 3 ఓవర్లలో 34 పరుగులిచ్చాడు. ఇక జూనియర్ బౌలర్ల విషయానికి వస్తే.. ఆకాష్ దీప్ అయితే బౌలింగ్‌లో ఏకంగా హాఫ్ సెంచరీ కొట్టేశాడు. 3.3 ఓవర్లలో ఆకాష్ ఏకంగా 55 పరుగులిచ్చి ఒక్క వికెట్ పడగొట్టాడు. అటు విజయ్‌కుమార్ వైశ్యాఖ్ సైతం భారీ పరుగులు సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా మరోసారి ఆర్సీబీ ఓటమిలో బౌలర్లు కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఆర్సీబీ బౌలర్లను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. మీకెందుకు ఆట దండగా.. వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు. Rcb Fans 😭 pic.twitter.com/c5yZNzaTnd — Gagan🇮🇳 (@1no_aalsi_) April 11, 2024 -
IPL 2024: విరాట్ ఒక్కడు 316.. డుప్లెసిస్, గ్రీన్, మ్యాక్సీ కలిపి 209
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి వన్‌మ్యాన్ షో నడుస్తుంది. ఈ సీజన్లో విరాట్ 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా.. జట్టులోని స్టార్ బ్యాటర్లంతా కలిసి విరాట్ ఒక్కడు సాధించినన్ని పరుగులు కూడా చేయలేకపోయారు. విదేశీ స్టార్లు, విధ్వంసకర వీరులు డుప్లెసిస్ 109, కెమారూన్ గ్రీన్ 68, మ్యాక్స్‌వెల్ 32 పరుగులు చేయగా.. లోకల్ ఆటగాళ్లు దినేశ్ కార్తీక్ 90, అనూజ్ రావత్ 73, రజత్ పాటిదార్ 50 పరుగులు చేశారు. ఈ సీజన్లో విరాట్ ఒక్కడే 316 పరుగులు చేస్తే.. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగమంతా కలిపి 422 పరుగులు మాత్రమే చేసింది. ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఆర్సీబీ ఇవాళ (ఏప్రిల్ 11) పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో తలపడబోతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఆర్సీబీకి విరాటే మరోసారి దిక్కవుతాడా లేక ఎవరైనా అతనికి సహకరిస్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది. విరాట్ మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తుండటంతో ఆర్సీబీ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. ప్రతిసారి ఈ సాల కప్ నమదే అన్న డైలాగ్ ఈసారి వారి నోటి వెంట వినబడటం లేదు. సొంత మైదానంలోనే ఆర్సీబీ ఘోర పరాభవాలను ఎదుర్కోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాల్టి మ్యాచ్ ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించడం అత్యశే అవుతుంది. కాగా, ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు కూడా వరస ఓటములను ఎదుర్కొని ఇటీవలే ఓ విజయాన్ని సాధించింది. ముంబై ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. దీని వెనకాలే ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. -
ఐపీఎల్లో నేడు బిగ్ ఫైట్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 11) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సొంత మైదానమైన వాంఖడేలో ఆర్సీబీతో తలపడనుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పేపర్‌పై ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్లో రెండు జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై ఎనిమిది, ఆర్సీబీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ముంబై ఈ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓవరాల్‌గా ఆర్సీబీపై ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గత ఐదు మ్యాచ్‌ల్లో పరిస్థితి వేరేలా ఉంది. ఈ రెండు చివరిగా తలపడిన ఐదు సందర్భాల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది. బలాబలాలను పరిశీలిస్తే.. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ కంటే ముంబై పరిస్థితే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ జట్టులో ఆటగాళ్లు కనీసం గెలుపు కోసం ప్రయత్నమైనా చేస్తున్నారు. ఆర్సీబీ మాత్రం విరాట్ కోహ్లి ఒక్కడిపైనే ఆధారపడి ఉంది. జట్టులో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి విదేశీ స్టార్లు ఉన్నా వీరు ఒక్క మ్యాచ్‌లో కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ ఒక్కరు కూడా లేరు. పొడిచేస్తాడనున్న అల్జరీ జోసఫ్ తుస్సుమనిపిస్తుండగా.. సిరాజ్ సాధారణ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు. ముంబై పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ జట్టులోని ప్రతి ఆటగాడు తమపాత్రకు న్యాయం చేస్తున్నారు. కలిసికట్టుగా ఆడలేక ఆ జట్టు వరుస ఓటములు ఎదుర్కొంది కానీ.. వ్యక్తిగత ప్రదర్శనల వరకైతే ఒకే అని చెప్పవచ్చు. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ వర్మ, బుమ్రా.. ఇలా సగం టీమిండియా ముంబైలోనే ఉంది. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లాంటి విదేశీ మెరుపులు ఉండనే ఉన్నాయి. స్పీడ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ మాంచి టచ్‌లో ఉన్నాడు. ఇన్ని అనుకూలతల నడుమ నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబైదే పైచేయి అయ్యే అవకాశం ఉంది. తుది జట్లు (అంచనా).. నేటి మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ విల్ జాక్స్‌ను, ముంబై లూక్ వుడ్‌ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, లూక్ వుడ్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్ -
MI Vs RCB: పంతం.. నీదా నాదా సై!
-
IPL 2024: గేల్ రికార్డు సమం చేసిన బట్లర్.. రాహుల్ తర్వాత..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో శతక్కొట్టడంతో (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. నిన్నటి సెంచరీతో క్యాష్ రిచ్ లీగ్‌లో సెంచరీల సంఖ్యను ఆరుకు పెంచుకున్న బట్లర్.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌తో (6) కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నాడు. బట్లర్ తన వందో ఐపీఎల్ మ్యాచ్‌లో వంద కొట్టడం మరో విశేషం. ఐపీఎల్ చరిత్రలో బట్లర్‌కు ముందు కేఎల్ రాహుల్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. రాహుల్ సైతం తన వందో మ్యాచ్‌లో శతక్కొట్టాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. బట్లర్ నిన్న సెంచరీ చేసిన మ్యాచ్‌లోనే విరాట్ కూడా సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో విరాట్ ఐపీఎల్ సెంచరీల సంఖ్య ఎనిమిదికి చేరింది. మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) కదంతొక్కడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ తన సెంచరీ పూర్తి చేసేందుకు 67 బంతులు తీసుకుని విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీ కావడమే విరాట్‌పై విమర్శలకు కారణం. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ కూడా విరాట్ బ్యాటింగ్ సమయంలో స్పిన్నర్ల పక్షాన ఉండింది. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. రాయల్స్ విజయానికి ఆరు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన తరుణంలో బట్లర్ సిక్సర్‌తో సెంచరీ పూర్తి చేసి మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా ఓటమితో ఆర్సీబీ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. -
IPL 2024: ఒక్కడు ఎంత కాలమని లాక్కొస్తాడు..సెంచరీ చేసినా చెత్త కామెంట్లే..!
ఐపీఎల్ 2024లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి అజేయ సెంచరీతో (72 బంతుల్లో 113 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరిసిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఇదే మొదటి సెంచరీ. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై సెంచరీ చేసేందుకు విరాట్ చాలా కష్టపడ్డాడు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా విరాట్ చివరి వరకు క్రీజ్‌లో నిలబడాలని భావిస్తే.. అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. విరాట్ సెంచరీ కోసం నిదానంగా ఆడాడంటూ గిట్టని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు. జట్టు కోసం నిస్వార్దంగా బ్యాటింగ్ చేసి విమర్శలు ఎదుర్కొంటుండటంతో కోహ్లి అభిమానులు రంగంలోకి దిగారు. తమ ఆరాధ్య ఆటగాడిని టార్గెట్ చేస్తున్న వారిపై ఎదురుదాడికి దిగారు. 18 మ్యాచ్‌లు అయినా ఒక్కరు కూడా సాధించలేకపోతే విరాట్ సీజన్ తొలి సెంచరీ చేసి చూపించాడని, ఇది తమ ఆరాధ్య ఆటగాడి లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్లోగా బ్యాటింగ్ చేశాడని కామెంట్లు చూసే ముందు విరాట్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ చురకలు అంటిస్తున్నారు. నిన్నటి మ్యాచ్ జరిగిన పిచ్‌పై 183 పరుగుల స్కోర్ డిఫెండ్ చేసుకోదగిందే అంటూ మెసేజ్‌లు చేస్తున్నారు. అయినా ఎంత కాలమని విరాట్ ఒక్కడు ఆర్సీబీ బండిని లాక్కొస్తాడని తమ ఆరాధ్య ఆటగాడిని ఆకాశానికెత్తుతున్నారు. ఈ సీజన్లో అప్పటివరకు ఎవరి వల్ల కాని సెంచరీని చేసి చూపించినా చెత్త కామెంట్లేనా అని మండిపడుతున్నారు. జట్టులోని మిగతా ఆటగాళ్లంతా సహకరిస్తే కోహ్లి వ్యక్తిగతంగా చేసిన స్కోర్‌తోనే (113) మ్యాచ్‌లు గెలవొచ్చంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. గిట్టని వారు చెబుతున్నట్లు విరాట్ ఇన్నింగ్స్ మరీ అంత నెమ్మదిగా ఏమీ సాగలేదని.. చెత్త బంతులను ప్రతి సందర్భంలోనూ విరాట్ చీల్చిచెండాడని గుర్తు చేస్తున్నారు. అద్భుతంగా బౌలింగ్ చేసినందుకు అశ్విన్, చహల్‌లకు, సూపర్ సెంచరీ చేసినందుకు బట్లర్‌కు క్రెడిట్ ఇవ్వాల్సింది పోయి విరాట్‌ను టార్గెట్ చేయడం విడ్డూరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో విరాట్ సెంచరీతో కదంతొక్కినా ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఛేదనలో జోస్ బట్లర్ మెరుపు వేగంతో సెంచరీ (58 బంతుల్లో 100 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి రాయల్స్‌ను గెలిపించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ విరాట్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. డుప్లెసిస్ (44) రాణించాడు. విరాట్ తన సెంచరీని 67 బంతుల్లో సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఇది స్లోయెస్ట్ సెంచరీగా రికార్డైంది. అశ్విన్ (4-0-28-0), చహల్ (4-0-34-2) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయండతో విరాట్ అనుకున్నంత వేగంగా పరుగులు రాబట్టలేకపోయాడు. ఈ విషయాన్ని కోహ్లి సైతం అంగీకరించాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్.. బట్లర్ సుడిగాలి శతకంతో విరుచుకపడటంతో మరో ఐదు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. బట్లర్‌తో పాటు సంజూ శాంసన్ (42 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. -
IPL 2024: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్
నిప్పులు చెరిగే వేగంతో క్రికెట్ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న లక్నో సూపర్ జెయింట్స్ పేస్ గన్ మయాంక్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లో పంజాబ్‌పై 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టిన మయాంక్.. నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మరింత చెలరేగి 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి మరోసారి 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇప్పటివరకు 16 మంది ఆటగాళ్లు తమ తొలి మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. మాయంక్ ఒక్కడే రెండో మ్యాచ్‌లోనూ ఈ అవార్డు దక్కించుకున్నాడు. మయాంక్ ఒక్కడే 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకుని రికార్డుల్లోకెక్కాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో క్రమం తప్పకుండా 150 కిమీ వేగంతో బంతులు సంధించిన మయాంక్.. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ సీజన్ ఫాస్టెస్ట్ డెలివరీని (156.7 కిమీ) బౌల్ చేశాడు. పంజాబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో 155 కిమీ వేగంతో బంతిని సంధించిన మయాంక్.. ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ 155 కిమీపైగా వేగంతో బంతిని సంధించి ఐపీఎల్ చరిత్రలో తొలి రెండు మ్యాచ్‌ల్లో 155 కిమీపైగా వేగంతో బంతులను సంధించిన తొలి పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటున్న సందర్భంగా మయాంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోవడం ఆనందంగా ఉంది. తన ప్రదర్శనలతో రెండు మ్యాచ్‌లు గెలవడం ఇంకా ఆనందాన్ని ఇచ్చిందని అన్నాడు. దేశం కోసం ఆడటమే తన లక్ష్యమని ఈ సందర్భంగా తన మనసులోని మాటను బయటపెట్టాడు. కాగా, ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. డికాక్ (81), పూరన్ (40 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ మయాంక్ యాదవ్ (4-0-14-3) ధాటికి 153 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో మహిపాల్ లోమ్రార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆర్సీబీపై గెలుపుతో లక్నో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఆర్సీబీ చివరి నుంచి రెండో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఐపీఎల్ అరంగేట్రంలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న ఆటగాళ్లు.. బ్రెండన్ మెకల్లమ్ మైఖేల్ హస్సీ పర్వీజ్ మహరూఫ్ షోయబ్ అక్తర్ శ్రీవత్స్ గోస్వామి రస్టీ థెరాన్ ప్రశాంత్ పరమేశ్వరన్ రిచర్డ్ లెవి స్టీవ్ స్మిత్ మనన్ వోహ్రా ఆండ్రూ టై జోఫ్రా ఆర్చర్ అల్జారీ జోసెఫ్ హ్యారీ గుర్నీ ఓడియన్ స్మిత్ మయాంక్ యాదవ్ -
IPL 2024: లక్నోపై ఆర్సీబీ ఆధిపత్యం కొనసాగేనా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 2) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడనున్నాయి. ఆర్సీబీ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఆర్సీబీ.. కేకేఆర్‌తో ఆడిన తమ చివరి మ్యాచ్‌లో హోం గ్రౌండ్లో పరాజయం చవిచూసింది. ఈ సీజన్లో ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉండగా.. లక్నో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ గెలుపు, ఓ ఓటమితో ఆరో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ.. సీఎస్కే, కేకేఆర్ చేతుల్లో ఓడి పంజాబ్‌పై గెలుపొందగా.. రాజస్థాన్ చేతిలో ఓడిన లక్నో.. పంజాబ్‌పై విజయం సాధించింది. హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. ఐపీఎల్లో ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు ఎదురెదురుపడగా.. మూడు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ, ఓ మ్యాచ్‌లో లక్నో గెలుపొందాయి. ఐపీఎల్లో లక్నోపై ఆర్సీబీ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది. మెరుగ్గా కనిపిస్తున్న లక్నో.. అయితే ప్రస్తుత సీజన్లో పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. ఆర్సీబీతో పోలిస్తే ఎల్ఎస్జీ పటిష్టంగా కనిపిస్తుంది. డికాక్, రాహుల్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్, కృనాల్ పాండ్యా, ఆయుశ్ బదోనిలతో కూడిన లక్నో బ్యాటింగ్ లైనప్ బలహీనమైన ఆర్సీబీ బౌలింగ్‌కు సవాలు విసురుతుంది. బౌలింగ్ విభాగంలోనూ లక్నో ఆర్సీబీ కంటే మెరుగ్గా కనిపిస్తుంది. సంచలన పేసర్ మయాంక్ యాదవ్, నవీన్ ఉల్ హక్, మొహిసిన్ ఖాన్, రవి భిష్ణోయ్, కృనాల్‌తో లక్నో బౌలింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. ఆర్సీబీ విషయానికొస్తే.. బ్యాటింగ్ విభాగంలో ఈ జట్టు పేపర్‌పై పటిష్టంగానే కనిపిస్తున్నా.. ఒక్క విరాట్ కోహ్లి మాత్రమే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో రాణించాడు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లు ఇప్పటివరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. దినేశ్ కార్తీక్ ఆఖర్లో తన పాత్రను న్యాయం చేస్తున్నాడు. కోహ్లి, కార్తీక్ మినహా ఆర్సీబీ బ్యాటింగ్‌లో ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు లేవు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలో ఆర్సీబీ చాలా పూర్‌గా ఉంది. సిరాజ్, యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లోనూ రాణించలేదు. ప్రస్తుత సీజన్లో ఆర్సీబీ బౌలింగ్ లైనప్ అత్యంత బలహీనమైనదిగా కనిపిస్తుంది. మరి లక్నోతో మ్యాచ్‌లో ఆర్సీబీ ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి. -
RCB ‘అందాల’ పేర్లు పచ్చబొట్టుగా.. చాంపియన్లకు ట్రిబ్యూట్ (ఫోటోలు)
-
IPL 2024: ఏదైనా ఆర్సీబీకి మాత్రమే సాధ్యం..!
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న వైవిధ్యం ఏ ఫ్రాంచైజీకి ఉండదు. విషయం ఏదైనా సరే ఈ ఫ్రాంచైజీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా ఈ జట్టుపై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఏ యేటికి ఆ యేడు ఆర్సీబీ క్రేజ్ పెరుగుతుందే తప్ప తరగదు. ఈ జట్టు అభిమానులు తమ ఆటగాళ్లపై ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోరు. ప్రదర్శన పరంగా ఎంతటి హీన స్థితిలో ఉన్నా ఆర్సీబీ అభిమానులు "ఈ సాలా కప్ నమదే" అంటూ బీరాలు పలుకుతుంటారు. రికార్డులు నెలకొల్పాలన్నా వీరే.. చెత్త రికార్డులు మూటగట్టుకోవాలన్నా వీరే. ట్రెండ్ సెట్ చేయాలన్నా వీరే.. అదే ట్రెండ్‌ను బ్రేక్ చేయాలన్నా వీరే. గణాంకాలు, గత రికార్డులు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన ఆర్సీబీ ఎంత వైవిధ్యమైన జట్టో మరోసారి రుజువు చేస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన 11 మ్యాచ్‌ల్లో పదింట సొంత మైదానాల్లో ఆడిన జట్లే విజేతలుగా నిలిచాయి. ఒక్క ఆర్సీబీ మాత్రమే తమ సొంత మైదానంలో మ్యాచ్‌ను కోల్పోయి హోం గ్రౌండ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసింది. శుక్రవారం (మార్చి 29) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమిపాలైంది. పది మ్యాచ్‌లుగా నడస్తున్న సెంటిమెంట్‌ను ఆర్సీబీ బ్రేక్ చేసింది. ఆర్సీబీ అన్ని జట్లలా కాదని అని నిరూపించడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ఆదివారం (మార్చి 31) డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో గుజరాత్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ను ఎదుర్కోనుండగా.. రాత్రి మ్యాచ్‌లో ఢిల్లీ, సీఎస్కే జట్లు తలడనున్నాయి. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 2న ఆడనుంది. సొంత మైదానంలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆర్సీబీ.. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఢీకొంటుంది. -
Virat Kohli-Gambhir: కలిసిపోయిన గంభీర్, కోహ్లి.. హగ్ చేసుకుని మరి! వీడియో వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మధ్య గత కొంత కాలంగా వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసిపోయారు. అవును మీరు విన్నది నిజమే. ఐపీఎల్-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ, కేకేఆర్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ స్ట్రాటజిక్ టైమ్‌లో గౌతం గంభీర్, కోహ్లి ఇద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ హగ్ చేసుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య 11 ఏళ్లగా కొనసాగుతున్న వైరానికి తెరపడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు తమ అభిమాన క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని, ఎప్పుడు మీ ఇద్దరూ ఇలానే కలిసి ఉండాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. గౌతం గంభీర్ కేకేఆర్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా తొలిసారిగా 2013 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్- ఆర్సీబీ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత 2015 ఐపీఎల్ సీజన్లో మళ్లీ విరాట్, గౌతీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ మ్యాచ్‌లో కేకేఆర్‌పై ఆర్సీబీ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేకపోయిన గౌతమ్ గంభీర్, డగౌట్లో కూర్చీని తన్ని, ఫైన్ కూడా కట్టాడు. అనంతరం 2023 ఐపీఎల్ సీజన్లో మరోసారి విరాట్ , గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నవీన్ ఉల్ హాక్-కోహ్లి మధ్య గొడవ జరగగా.. అందులో గంభీర్ జోస్యం చేసుకోవడంతో ఆ గొడవ మరింత తీవ్రమైంది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఇద్దరూ ఒకే మైదానంలో ఉండడంతో అందరి కళ్లు ఈ మ్యాచ్‌పైనే ఉన్ను. కానీ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. They hugged 😭😭😭 Gautam gambhir said sorry to king kohli for everything he spoke against him. I think the only controversy which will last this season is Hardik vs Rohit 😂#RCBvsKKR #IPL2024 #ViratKohli #GautamGambhir Maxwell pic.twitter.com/G0pZpGsOOb — RanaJi🏹 (@RanaTells) March 29, 2024 -
IPL 2024 RCB VS KKR: చరిత్ర సృష్టించనున్న సునీల్ నరైన్
ఐపీఎల్ 2024లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 29) జరుగబోయే మ్యాచ్‌తో కేకేఆర్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో నరైన్ టీ20ల్లో 500 మ్యాచ్‌ల మైలురాయిని తాకబోతున్నాడు. ప్రపంచ క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే నరైన్‌కు ముందు ఈ మైలురాయిని తాకారు. వీరిలో కీరన్ పోలార్డ్ అందరికంటే ఎక్కువగా 660 మ్యాచ్‌లు ఆడగా.. డ్వేన్ బ్రావో 573, షోయబ్ మాలిక్ 542 మ్యాచ్‌లు ఆడారు. టీ20ల్లో అత్యంత అరుదైన క్లబ్లో చేరబోతున్న నరైన్.. ఈ ఫార్మాట్లో ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడి 536 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో 3736 పరుగులు చేశాడు. 2011లో టీ20 ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చిన నరైన్ చాలా రికార్డుల్లో భాగంగా ఉన్నాడు. టీ20ల్లో అత్యధిక మెయిడిన్లు (30) వేసిన బౌలర్‌గా.. టీ20ల్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (536).. కనీసం 2000 బంతులు బౌల్ చేసిన వారిలో రెండో అత్యధిక ఎకానమీ రేట్ (6.10) కలిగిన బౌలర్‌గా.. పవర్ ప్లేల్లో నాలుగో అత్యుత్తమ స్ట్రయిక్‌రేట్ (155.05) కలిగిన బ్యాటర్‌గా.. టీ20ల్లో అత్యధిక టైటిళ్లలో (10) భాగమైన నాలుగో ఆటగాడిగా పలు రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడనున్నాయి. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉండగా.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. -
IPL 2024 RCB VS KKR: సెంటిమెంట్ కొనసాగేనా..!
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 29) మరో క్లాసీ మ్యాచ్ జరుగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం కొదమ సింహాల్లా పోరాడే అవకాశం ఉంది. కేకేఆర్ తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను మట్టికరిపించి జోష్‌లో ఉంటే.. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో (రెండోది) పంజాబ్ కింగ్స్‌కు షాకిచ్చి నూతనోత్సాహంతో ఉరకలేస్తుంది. ఇవాల్టి మ్యాచ్‌కు ముందు ఓ సెంటిమెంట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో హోం గ్రౌండ్లో ఆడిన జట్లే విజయాలు సాధించాయి. చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్‌లో సీఎస్కే (ఆర్సీబీపై విజయం), చంఢీఘడ్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పంజాబ్ (ఢిల్లీ క్యాపిటల్స్‌పై), కోల్‌కతాలో జరిగిన మూడో మ్యాచ్‌లో కేకేఆర్ (సన్‌రైజర్స్‌పై), జైపూర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్‌లో రాజస్థాన్ (లక్నోపై), అహ్మదాబాద్‌లో ముంబైపై గుజరాత్, బెంగళూరులో పంజాబ్ కింగ్స్‌పై ఆర్సీబీ, చెన్నైలో గుజరాత్‌పై సీఎస్కే, హైదరాబాద్‌లో ముంబైపై సన్‌రైజర్స్, జైపూర్‌లో నిన్న జరిగిన తొమ్మిదో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాజస్థాన్ రాయల్స్ విజయాలు సాధించాయి. ఈ నేపథ్యంలో ఆర్సీబీ హోం గ్రౌండ్లో విజయం సాధించి సెంటిమెంట్ కొనసాగిస్తుందా.. లేక కేకేఆర్‌కు దాసోహమై సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. గత రికార్డులను పరిశీలిస్తే.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరగగా కేకేఆర్ 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. బలాబలాల విషయానికొస్తే.. ఇరు జట్లు బ్యాటింగ్‌లో సమతూకంగా కనిపిస్తున్నప్పటికీ.. కేకేఆర్‌కు బ్యాటింగ్ డెప్త్ కాస్త ఎక్కువేనని చెప్పాలి. ఆ జట్టులో ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేసే వాళ్లు ఉన్నారు. ఆర్సీబీ విషయానికొస్తే పరిస్థితి అలా లేదు. విరాట్, డుప్లెసిస్, మ్యాక్సీ ఔటైతే ఆ జట్టు పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. బౌలింగ్‌లోనూ ఆర్సీబీతో పోలిస్తే కేకేఆర్ మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఐపీఎల్ కాస్ట్లీ ప్లేయర్ మిచెల్ స్టార్క్ నాయకత్వంలో కేకేఆర్ బౌలింగ్ లైనప్ పటిష్టంగా కనిపిస్తుంది. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో హర్షిత్ రాణా ఇరగదీశాడు. రసెల్ బ్యాట్‌తో పాటు బంతితోనూ చెలరేగాడు. నరైన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. స్టార్క్, వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ పరిస్థితి రిపీట్ కాదని అనిపిస్తుంది. ఆర్సీబీ విషయానికొస్తే.. ముందుగా ఈ జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. కేవలం బ్యాటింగ్‌పైనే ఆ జట్టు ఆధార పడింది. సిరాజ్, అల్జరీ జోసఫ్, యశ్ దయాల్, గ్రీన్ లాంటి పేసర్లు ఉన్నా వారి నుంచి గొప్ప ప్రదర్శనలు ఆశించలేని పరిస్థితి ఉంది. స్పిన్నర్లు కర్ణ్ శర్మ, మయాంక్ డాగర్, మ్యాక్సీ అడపాదడపా రాణిస్తుంటారు. మొత్తంగా చూస్తే.. ఆర్సీబీ కంటే కేకేఆర్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
IPL 2024 SRH VS MI: ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు.. కామన్‌గా ఒకే ఆటగాడు..!
ఐపీఎల్ 2024లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో 277 పరుగులు చేసిన సన్‌రైజర్స్.. లీగ్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్ ఈ రికార్డును నెలకొల్పే క్రమంలో ఆర్సీబీ పేరిట ఉండిన పాత రికార్డును బద్దలు కొట్టింది. 11 ఏళ్ల కిందట 2013 సీజన్లో ఆర్సీబీ.. పూణే వారియర్స్‌పై చేసిన 263 పరుగులే నిన్నటి మ్యాచ్‌కు ముందు వరకు ఐపీఎల్లో అత్యధిక టీమ్ స్కోర్‌గా ఉండింది. ఐపీఎల్లో టాప్-2 స్కోర్లు నమోదైన సందర్భాల్లో ఓ ఆటగాడు కామన్‌గా ఉండటం అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. ప్రస్తుత సన్‌రైజర్స్ ఆటగాడు జయదేవ్ ఉనద్కత్ 2013లో ఆర్సీబీతో.. ప్రస్తుతం సన్‌రైజర్స్‌లో ఉన్నాడు. ఈ విషయం గురించి తెలిసి నెటిజన్లు ఉనద్కత్‌ను లక్కీ లెగ్గా పరిగణిస్తున్నారు. భారీ స్కోర్లు నమోదు కావాలంటే ఉనద్కత్ ఉండాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయమేమిటంటే.. రెండు మ్యాచ్‌ల్లో ఉనద్కత్ ప్రత్యర్దులపై రెండేసి వికెట్లు పడగొట్టాడు. Jaydev Unadkat is the only player who has been part of two of the highest totals in IPL history. 📸: IPL/BCCI pic.twitter.com/y0sU753Ovc — CricTracker (@Cricketracker) March 28, 2024 ఇదిలా ఉంటే, ముంబై ఇండియన్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ట్రవిస్ హెడ్ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), క్లాసెన్ (34 బంతుల్లో 80 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మార్క్రమ్ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 42 నాటౌట్) విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేయగా.. ఛేదనలో ముంబై నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), నమన్ ధిర్ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (22 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌కు దడ పుట్టించారు. -
Virat Kohli: ఇంటర్నెట్లో క్యూటెస్ట్ వీడియో
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match. - CUTEST VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/srREuiqS8u — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కోహ్లి తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తుంది. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లి భార్య అనుష్క ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కోహ్లి దంపతులు ఆ పిల్లాడికి అకాయ్ అని నామకరణం చేశాడు. కోహ్లి దంపతులకు ఇదివరకే ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు వామిక. THE VINTAGE KING KOHLI...!!!!! 🐐 One of the Greatest Post Match Interview by any Cricketer in the History - King Kohli You're the GOAT. pic.twitter.com/cZ331UXGlI — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ప్రజెంటేటర్ హర్షా భోగ్లేతో కోహ్లి మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో తన వ్యక్తిగత అనుభవాల (లండన్) గురించి హర్షా కోహ్లిని అడుగగా.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. రెండో సారి తండ్రైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది తనకు తన కుటుంబానికి మరపురాని అనుభూతి. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. తమను గుర్తు పట్టని ప్రదేశంలో సాధారణ జీవనం గడిపే అవకాశం దొరికింది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలని కోహ్లి తెలిపాడు. క్రికెట్‌కు సంబంధించి కోహ్లి మాట్లాడుతూ.. అంతిమంగా గణాంకాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకుంటారు. రాహుల్ ద్రవిడ్ చెప్పేది ఇదే. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు, మద్దతు అద్భుతమైనవి. ఇవి నేనెప్పటికీ మరచిపోలేనని కోహ్లి అన్నాడు. ఇదే సందర్భంగా కోహ్లి మరిన్ని ఆసక్తికర అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. విశ్వవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ ప్రమోషన్ కోసం తన పేరు ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది ఇంకా రెండో మ్యాచ్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. హర్షా భోగ్లే విరాట్‌కు ఆరెంజ్ క్యాప్ అందజేశాడు. -
IPL 2024 RCB VS PBKS: ధోని రికార్డును సమం చేసిన కోహ్లి
పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్"గా నిలిచిన ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి.. ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రెండో స్థానంలో ఉండిన సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును కోహ్లి సమం చేశాడు. ఐపీఎల్లో ధోని ఇప్పటివరకు 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకోగా.. నిన్నటి మ్యాచ్‌తో కోహ్లి ఆ సంఖ్యను (17) సమం చేశాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ మాజీ సారధి రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నాడు. రోహిత్ ఖాతాలో 19 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు ఉన్నాయి. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో పంజాబ్‌పై ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. శిఖర్ ధవన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శశాంక్ సింగ్ (8 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్ (25), సామ్ కర్రన్ (23), జితేశ్ శర్మ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. యశ్ దయాల్, అల్జరీ జోసఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ హాఫ్ సెంచరీతో (49 బంతుల్లో 77; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. దినేశ్ కార్తీక్ మెరుపు ఇన్నింగ్స్ (10 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేయగా.. అతనికి మహిపాల్ లోమ్రార్ (8 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించాడు. ఆర్సీబీ బ్యాటర్లు డుప్లెసిస్ (3), గ్రీన్ (3), మ్యాక్స్‌వెల్ (3), పాటిదార్ (18), అనూజ్ రావత్ (11) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ (4-0-13-2), రబాడ (4-0-23-2) అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతా బౌలర్ల నుంచి వారికి సహకారం లభించలేదు. -
పంజాబ్‌తో మ్యాచ్.. ఆర్సీబీ తుది జట్టు ఇదే? రూ.11 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్?
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా సోమవారం(మార్చి 25) చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్‌తో మ్యాచ్‌కు ఆర్సీబీ మెనెజ్‌మెంట్ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి మ్యాచ్‌లో విఫలమైన మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్, అల్జారీ జోషఫ్పై వేటు వేయనున్నట్లు సమాచారం. పాటిదార్ స్ధానంలో సుయాష్ ప్రభుదేసాయి, జోషఫ్ స్ధానంలో కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ తుది జట్టులోకి రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొన్నాడు. కాగా సీఎస్కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో పాటిదార్ డకౌట్ కాగా.. పేసర్ జోషఫ్ దారుణంగా విఫలమయ్యాడు. 3. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ కరేబియన్ ఫాస్ట్ బౌలర్.. వికెట్ ఏమీ తీయకుండా 38 పరుగులిచ్చాడు. ఈ క్రమంలోనే పాటిదార్, జోషఫ్‌ను ఆర్సీబీ పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఐపీఎల్-2024 మినీవేలంలో జోషఫ్‌ను రూ.11. 50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక ఈ మ్యాచ్‌లో పేసర్ యాష్ దయాల్‌ను ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకునే అవకాశముంది. ఆర్సీబీ తుది జట్టు(అంచనా) విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్, సుయాష్ ప్రభుదేసాయి, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, లాకీ ఫెర్గూసన్, మయాంక్ దాగర్, కరణ్ శర్మ, మహ్మద్ సిరాజ్. -
IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. ఇందులోనైనా ఆర్సీబీ గెలుస్తుందా..?
ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ (మార్చి 25) పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని ఆర్సీబీ భావిస్తుండగా.. పంజాబ్ సీజన్లో వరుసగా రెండో విజయంపై కన్నేసింది. ఆర్సీబీ సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్కే చేతిలో ఓటమిపాలు కాగా.. పంజాబ్ తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో ఆయా జట్ల ప్రదర్శనలపై ఓ లుక్కేద్దాం.. ఆర్సీబీ కంటే పంజాబ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా కనిపించింది. ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ పేపర్‌పై బలంగా కనిపించినప్పటికీ తొలి మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. 8 ఫోర్లు బాది డుప్లెసిస్ (35) ప్రమాదకరంగా కనిపించినప్పటికీ.. ఆ మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ముస్తాఫిజుర్ అతన్ని పెవిలియన్‌కు పంపాడు. విరాట్ విషయానికొస్తే.. ఆ మ్యాచ్‌లో అతని బ్యాటింగ్ నత్త నడకను తలపించింది. అతను 20 బంతులను ఎదుర్కొని కేవలం 21 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటిదార్, మ్యాక్స్‌వెల్ డకౌటై దారుణంగా నిరాశపర్చగా.. కోట్లు పెట్టి అరువు తెచ్చుకున్న కెమారూన్ గ్రీన్ తుస్సుమనిపించాడు. వికెట్కీపర్లు అనూజ్ రావత్ (48), దినేశ్ కార్తీక్ (38 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడకపోయుంటే ఆర్సీబీ 100 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు కూడా తేలిపోయారు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఇవ్వలేదు. అల్జరీ జోసఫ్, కర్ణ్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మయాంక్ డాగర్ కాస్త పర్వాలేదనిపించగా.. గ్రీన్ 2 వికెట్లు తీసి నాట్ బ్యాడ్ అనిపించాడు. పంజాబ్‌తో ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ అదనపు పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. కర్ణ శర్మ స్థానంలో ఆకాశదీప్ తుది జట్టులోకి రావచ్చు. పంజాబ్ విషయానికొస్తే.. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి విజయం సొంతం చేసుకుంది. అర్ష్‌దీప్ సింగ్, రబాడ, రాహుల్ చాహర్ తమ కోటా ఓవర్లు పూర్తి చేసి పర్వాలేదనిపించగా.. హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. హర్‌ప్రీత్ బ్రార్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో సత్తా చాటిన సామ్ కర్రన్ ఒకే ఓవర్ బౌల్ చేశాడు. ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు పర్వాలేదనిపించారు. కర్రన్ (63) అర్దసెంచరీతో రాణించగా.. లివింగ్‌స్టోన్ (38 నాటౌట్), శిఖర్ ధవన్ (22), ప్రభ్‌సిమ్రన్ సింగ్ నాట్ బ్యాడ్ అనిపించారు. ఆర్సీబీతో ఇవాల్టి మ్యాచ్ పంజాబ్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఢిల్లీతో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఆర్సీబీ తుది జట్టు (అంచనా): ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్‌కీపర్), అల్జరీ జోసెఫ్, ఆకాశ్‌దీప్, మయాంక్ డాగర్, మహ్మద్ సిరాజ్ పంజాబ్ తుది జట్టు (అంచనా): శిఖర్ ధవన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్‌కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్ -
విరాట్ విజృభించేనా..ఆ జట్టుకే విజయావకాశాలు
-
IPL 2024: సీఎస్కే శుభారంభం చేసిందిలా!
-
టీమిండియాలోనే కాదు.. ఇక్కడా ఇంతేనా?! వీడియో వైరల్
ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు, ఆర్సీబీ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్.. ఇప్పుడు ఐపీఎల్-2024లోనూ అదే తీరును కనబరిచాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తొలి మ్యాచ్‌లో పాటిదార్ దారుణంగా విఫలమయ్యాడు. 3 బంతులు ఎదుర్కొన్న పాటిదార్.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ఎటువంటి ఫుట్ మూమెంట్ లేకుండా ఆఫ్ సైడ్ వైపు ఆడటానికి పాటిదార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి అతడి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ధోని చేతికి వెళ్లింది. ధోని ఎటువంటి తప్పిదం చేయకుండా రెగ్యులేషన్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేమి ఆటరా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆర్సీబీని అనుజ్ రావత్(48), దినేష్ కార్తీక్(38 నాటౌట్) తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో అదుకున్నారు. వీరితో పాటు కెప్టెన్ డుప్లెసిస్(35) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
IPL 2024: లేటు వయస్సులో డీకే ఖతర్నాక్ ఇన్నింగ్స్.. ! వీడియో వైరల్
ఐపీఎల్-2024 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్ అదరగొట్టాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన డీకే.. తన ఖాతార్నాక్ ఇన్నింగ్స్‌తో జట్టును అదుకున్నాడు. మరో యువ ఆటగాడు అనుజ్ రావత్‌తో కలిసి తన జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్‌ను అందించాడు. ఆరో వికెట్‌కు రావత్‌తో కలిసి 95 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓవరాల్‌గా 26 బంతులు ఎదుర్కొన్న కార్తీక్.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. 38 ఏళ్ల కార్తీక్ కొట్టిన 2 సిక్సర్ల కూడా మ్యాచ్ మొత్తానికి హైలెట్‌గా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడి ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఏడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు కార్తీక్ గుడ్‌బై చేప్పే అవకాశముంది. ఇక ఈ మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18. 4 ఓవర్లలో ఛేదించింది. సీఎస్కే బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(37) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. శివమ్ దూబే(34 నాటౌట్), రవీంద్ర జడేజా(25 నాటౌట్) రాణించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కార్తీక్‌తో పాటు అనుజ్ రావత్(48) పరుగులతో రాణించాడు. సీఎస్కే బౌలర్లలో ముస్తుఫిజర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చాహర్ ఒక్క వికెట్ సాధించాడు. All heads must bow, all lips must confess... ANUJ RAWAT AND DINESH KARTHIK ARE THE GREATEST DUO IN THE HISTORY OF IPL.🐐🐐pic.twitter.com/zKwLc4rKNW — VJ17 (@ABDszn17) March 22, 2024 -
రచిన్ రవీంద్ర సూపర్ క్యాచ్.. బిత్తరపోయిన ఆర్సీబీ కెప్టెన్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు రచిన్ రవీంద్ర సంచలన క్యాచ్‌తో మెరిశాడు. అద్భుతమైన క్యాచ్‌తో దూకుడుగా ఆడుతున్న ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్‌ను రవీంద్ర పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన డుప్లెసిస్ ఆది నుంచే సీఎస్కే బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. తొలి నాలుగు ఓవర్లలో ఫాప్ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మన్ ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ 5 ఓవర్ వేసిన ముస్తాఫిజుర్ రెహ్మన్ నాలుగో బంతిని డుప్లెసిస్‌కు ఫుల్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. డుప్లెసిస్ లాఫ్టెడ్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్‌కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన డుప్లెసిస్ బిత్తర పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్(35) పరుగులు చేశాడు. All Happening Here! Faf du Plessis ✅ Rajat Patidar ✅ Glenn Maxwell ✅@ChennaiIPL bounced back & in some style 👏 👏#RCB are 3 down for 42 in 6 overs! Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE Follow the match ▶️ https://t.co/4j6FaLF15Y#TATAIPL |… pic.twitter.com/tyBRQJDtWY — IndianPremierLeague (@IPL) March 22, 2024 -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి భారత క్రికెటర్‌గా
టీమిండియా స్టార్, ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత క్రికెటర్‌గా విరాట్ రికార్డులకెక్కాడు. ఐపీఎల్-2024లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి ఈ ఘనతను అందుకున్నాడు. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 376 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 41.21 సగటు, 133.42 స్ట్రయిక్‌రేట్‌తో 12000 పరుగులు చేశాడు. . ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఆరో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్‌లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (12065) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ చేరాడు. -
IPL 2024: ఆర్సీబీ, సన్‌రైజర్స్ కాదు.. ప్లే ఆఫ్స్‌కు చేరే జట్లు ఇవే?
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగైన ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో రెండు గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఈ క్రమంలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు. "ప్రస్తుత జట్ల బలాలు, బలహీనతలను చూస్తే ఆ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. అందులో మొదటిది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చాలా బలంగా కన్పిస్తోంది. ఆ తర్వాత రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్కేకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికి ఆ జట్టు మాత్రం ఎలాగైనా ముందుడగు వేస్తోంది. డెవాన్ కాన్వే గాయం కారణంగా దూరమయ్యాడు. దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చాడు. ఏదమైనప్పటికి ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది. ఎంఎస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ తన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తాడు. ఇక మూడో జట్టు లక్నో సూపర్ జెయింట్స్. ఈ సారి లక్నో కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. రాహుల్ గాయం నుంచి కోలుకుని రావడం ఆ జట్టుకు కలిసిస్తోంది. చివరగా నాలుగో జట్టుగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. కేకేఆర్‌లో కూడా రస్సెల్, మంచి పవర్ హిట్టర్లు ఉన్నారని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇర్ఫాన్ తన ఎంచుకున్న జట్లలో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ పేర్లు లేకపోవడం గమనార్హం. -
ఆర్సీబీతో తొలి మ్యాచ్.. సీఎస్కే అదిరిపోయే న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేశాడు?
ఐపీఎల్-2024 సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. చెపాక్ వేదికగా తొలి మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సీఎస్కే అదిరిపోయే న్యూస్ అందింది. ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు యువ పేసర్, శ్రీలంక యార్కర్ల కింగ్ మతీషా పతిరాన పూర్తి ఫిట్నెస్ సాధించాడు. తొలి మ్యాచ్ జట్టు సెలక్షన్‌కు పతిరాన అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని అతడి మేనేజర్ అమిలా కలుగలగే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పతిరానా ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. అతడు నిప్పులు చేరిగేందుకు సిద్దమయ్యాడని పతిరానాతో కలిసి ఉన్న ఫోటోను కలుగలగే ఎక్స్‌లో షేర్ చేశాడు. కాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో పతిరానా మోకాలికి గాయమైంది. దీంతో అతడు వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. టీ20 సిరీస్ మధ్యలోనే వైదొలిగిన పతిరానా నేరుగా కొలంబోలోని హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌కు వెళ్లి పునరవాసం పొందాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 ఫస్ట్‌హాఫ్‌కు దూరం కానున్నాడని వార్తలు వినిపించాయి. కానీ అతడు ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించడంతో ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో భాగం కానున్నాడు. అతడికి శ్రీలంక క్రికెట్ కూడా క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా గతేడాది సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలవడంలో పతిరానాది కీలక పాత్ర. 12 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచాడు. The answer to "Where's Pathirana" He is fit and ready to throw Thunder ⚡ balls. Be ready 💣. Finally a 📸 together with the Legend @matheesha_9 😄 #WhistlePodu #csk #IPL2024 pic.twitter.com/JKsv9gacWm — Amila Kalugalage (@akalugalage) March 22, 2024 చదవండి: IPL2024: 'సీఎస్కే ఓపెనర్‌గా యువ సంచలనం.. ధోని బ్యాటింగ్‌కు వచ్చేది అప్పుడే' -
IPL 2024: ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ముందడుగు పడింది. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో తొలిసారి చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల కోసం సంకేత భాష మరియు వివరణాత్మక వ్యాఖ్యానాన్ని అందించనున్నారు. చెవిటి, దృష్టి లోపం ఉన్న అభిమానుల సౌకర్యార్దం స్టార్ స్పోర్ట్స్ ఛానల్ ఈ నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ నుంచి ఈ తరహా వ్యాఖ్యానం అమల్లోకి రానుంది. ఈ నూతన ఒరవడిని అమల్లో పెట్టేందుకు ఐపీఎల్ అధికారిక ప్రసారకర్త అయిన స్టార్ స్పోర్ట్స్ ఇండియా సైనింగ్ హ్యాండ్స్ (ISH) న్యూస్‌తో చేతులు కలిపింది. ఐఎస్హెడ్ నిపుణుల ఆధ్వర్యంలో ఫీడ్‌ను భారతీయ సంకేత భాషను ఉపయోగించి బాల్ టు బాల్ అప్డేట్స్ ఇస్తామని స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. సంకేత బాష ఫీడ్‌తో పాటు సాధారణ వెర్బల్ స్కోర్ అప్డేట్స్ కూడా ఉంటాయని పేర్కొంది. ఈ వెసులుబాటుతో చెవిటి, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానులు గేమ్‌లోని ప్రతి క్షణాన్ని ఆస్వాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే, ఇవాల్టి నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. -
కోహ్లీ... టీ20ల్లో శిఖరాగ్రానికి ఆరు పరుగుల దూరం!
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిని ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇవాళ (మార్చి 22) జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో (సీఎస్కేతో) కింగ్ మరో ఆరు పరుగులు చేస్తే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. 2007లో టీ20 క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన కోహ్లి టీ20 ఫార్మాట్ మొత్తంలో కలిపి 376 మ్యాచ్‌లు ఆడి 41.21 సగటను, 133.42 స్ట్రయిక్‌రేట్‌తో 11994 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 91 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రపంచ క్రికెట్లో కేవలం ఐదుగురు మాత్రమే టీ20ల్లో 12000 పరుగుల మైలురాయిని తాకారు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విండీస్ వీరుడు క్రిస్ గేల్ (14562) టాప్‌లో ఉండగా.. పాక్ షోయబ్ మాలిక్ (13360), విండీస్ పోలార్డ్ (12900), ఇంగ్లండ్ అలెక్స్ హేల్స్ (12319), ఆసీస్ డేవిడ్ వార్నర్ (12065) వరుసగా రెండు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఇవాల్లి (మార్చి 22) నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్న సీజన్ తొలి మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024: చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌కు ముందు వాతావరణం, పిచ్ వివరాలు
ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ఇవాళ (మార్చి 22) జరుగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానుంది. అక్షయ్ కుమార్, ఏఆర్ రెహ్మాన్లచే ప్రత్యేక కార్యక్రమం.. మ్యాచ్‌కు ముందు సీజన్ ఆరంభ వేడుకలు జరుగనున్నాయి. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఈవెంట్లో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఎఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. సీఎస్కే నూతన కెప్టెన్‌గా రుతురాజ్.. లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. నూతన కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుని రుతురాజ్‌కు బాధ్యతలు అప్పజెప్పాడు. వాతావరణం ఎలా ఉందంటే.. సీఎస్కే, ఆర్సీబీ మ్యాచ్‌కు వేదిక అయిన చెన్నైలో వాతావరణం ఆటకు ఆనువుగా ఉంది. వాతావరణం నుంచి మ్యాచ్‌కు ఎలాంటి అవాంతరాలు సంభవించవు. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి తేలికపాటి వర్షం పడినప్పటికీ.. ఇవాళ మ్యాచ్ జరిగే సమయంలో (7-11 గంటల మధ్యలో) వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. మ్యాచ్ వేలల్లో ఉష్ణోగ్రతలు 30, 31 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉంది. వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. పిచ్ ఎవరికి అనుకూలం.. చెపాక్ పిచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. తొలుత బ్యాటింగ్ చేసే జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉంటాయి. రాత్రి వేళలో తేమ శాతం అధికమైతే స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఆర్సీబీపై సీఎస్కే సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024: ఆర్సీబీతో మ్యాచ్‌కు ముందు సీఎస్కేకు భారీ షాక్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్, శ్రీలంక పేస్ సంచలనం మతీశ పతిరణ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సందర్భంగా పతిరణ గాయపడ్డాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్ఓసీ ఇవ్వలేదు. పతిరణ త్వరలోనే గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది. సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కేకు ఇది రెండో ఎదురుదెబ్బ. కొద్ది రోజుల ముందు ఈ జట్టు ఓపెనింగ్ బ్యాటర్ డెవాన్ కాన్వే కూడా గాయం కారణంగా లీగ్‌కు (మే వరకు) దూరమయ్యాడు. సీఎస్కే యాజమాన్యానికి కాన్వే స్థానాన్ని భర్తీ చేయడం పెద్ద సమస్య కానప్పటికీ.. పతిరణ స్థానాన్ని భర్తీ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది. కాన్వే స్థానంలో అతని దేశానికే చెందిన రచిన్ రవీంద్ర ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారు కాగా.. పతిరణ స్థానం కోసం బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్, మొయిన్ అలీ, శార్దూల్ ఠాకూర్ పేర్లను పరిశీలిస్తున్నారు. ముస్తాఫిజుర్ కూడా డెత్ ఓవర్స్ స్పెషలిస్టే కావడంతో సీఎస్కే యాజమాన్యం ఇతని వైపే మొగ్గు చూపవచ్చు. సీఎస్కే తొలి మ్యాచ్‌కు వేదిక అయిన చెపాక్ స్టేడియం స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో మొయిన్ అలీ పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. కెప్టెన్ ధోని, బౌలింగ్ కోచ్ బ్రావో.. శార్దూల్ ఠాకూర్వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సీఎస్కే.. ఆర్సీబీతో తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ వేదికగా రేపు (మార్చి 22) రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
IPL 2024: సూపర్ కింగ్స్‌తో బెంగళూరు తొలి పోరు.. బోణీ కొట్టేది ఎవరు?
క్రికెట్ అభిమానులు ఏంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2024 సమరానికి సమయం అసన్నమైంది. మరో 24 గంటల్లో క్రికెట్ మహాసంగ్రామానికి తెరలేవనుది. తొలి మ్యాచే అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందనించనుంది. మార్చి 22న చెపాక్ వేదికగా జరగనున్న తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి శుభారంభం చేయాలని ఇరు జట్లు ఊవ్విళ్లరూతున్నాయి. ఈ క్రమంలో ఇరు జట్ల బలబలాలపై ఓ లుక్కేద్దం చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్లో తిరిగులేని జట్టుగా పేరొందిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరోసారి తమ సత్తాచాటేందుకు సిద్దమైంది. ఈ ఏడాది సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగనున్న సీఎస్కే.. ప్రత్యర్ధి జట్లను చిత్తు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. కాగా సీఎస్కే ప్రధాన బలం ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని. ఎటువంటి క్లిష్ట పరిస్థితులోనైనా ప్రత్యర్ధి జట్టును తన వ్యూహాలతో చిత్తు చేయడం ధోని స్పెషల్. ఇప్పటికే రికార్డు స్ధాయిలో ఐదు సార్లు సీఎస్కేను విజేతగా నిలిపాడు. ఇప్పుడు ఆరోసారి తన జట్టుకు టైటిల్‌ను అందించాలని మిస్టర్ కూల్ భావిస్తున్నాడు. ఇక సీఎస్కే బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే దూరం కావడం సీఎస్కేను కాస్త కలవరపెట్టే విషయం అనే చెప్పుకోవాలి. గతేడాది సీఎస్కే ఛాంపియన్స్‌గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. కాగా కాన్వే స్ధానాన్ని మరో కివీ స్టార్ రచిన్ రవీంద్ర భర్తీ చేసే ఛాన్స్ ఉంది. వేలంలో రవీంద్రతో పాటు డార్లీ మిచెల్‌ను సీఎస్కే కొనుగోలు చేసింది. కాబట్టి కాన్వే లేని లోటు వీరిద్దరిలో ఎవరో ఒకరు భర్తీ చేసే అవకాశముంది. రవీంద్ర, రుత్‌రాజ్ గైక్వాడ్ కలిసి చెన్నై ఇన్నింగ్స్‌ను ప్రారంభించే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా మిడిలార్డర్లో రహానే, దుబే వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. గత సీజన్లో వీరిద్దరూ అద్బుతమైన ప్రదర్శనలు కనబరిచారు. ఆఖరిలో ధోని, జడేజా వంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. అంతేకాకుండా శార్ధూల్ ఠాకూర్ మళ్లీ సీఎస్కేలో రావడం ఆ జట్టుకు కలిసిచ్చే ఆంశం. శార్ధూల్‌కు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించే సత్తా ఉంది. కాగా ఈ ఏడాది సీజన్లో బౌలింగ్ పరంగా సీఎస్కే కాస్త వీక్‌గా కన్పిస్తోంది. గతేడాది సీజన్లో అదరగొట్టిన యువ పేసర్ మతీషా పతిరాన గాయం కారణంగా ఐపీఎల్-2024కు దూరమయ్యాడు. అతడు దూరం కావడం సీఎస్కే నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ప్రస్తుత సీఎస్కే జట్టులో పెద్దగా అనుభవమున్న బౌలర్ ఒక్కడు కూడా కన్పించడం లేదు. ముస్తిఫిజర్ రెహ్మన్, థీక్షణ వంటి బౌలర్లు ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో వారి ప్రదర్శన అంతంతమాత్రమే. కాబట్టి మరోసారి భారత యువ బౌలర్లు ముఖేష్ చౌదరి, సిమ్రాజత్ సింగ్‌పై సీఎస్కే ఆధారపడే ఛాన్స్ ఉంది. ఆర్సీబీ.. గత 16 ఏళ్ల టైటిల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ప్రతీ సీజన్లోనూ జట్టు నిండా స్టార్ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ట్రోఫీని ఆర్సీబీ ముద్దాడలేకపోయింది. ఈ సారి ఎలాగైనా గెలిచి తమ 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ప్రతీసీజన్లానే ఈ సారి కూడా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లతో కూడా కలకలడుతోంది. బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో ఫాప్ డుప్లెసిస్,విరాట్ కోహ్లి, మ్యాక్స్‌వెల్, గ్రీన్, విల్ జాక్స్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్‌లో సిరాజ్, టోప్లీ జోషఫ్, ఫెర్గూసన్, టామ్ కుర్రాన్ వంటి వరల్డ్‌క్లాస్ ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. అయితే ఆర్సీబీలో మాత్రం చెప్పుకోదగ్గ స్పిన్నర్ మాత్రం లేడు. హెడ్ టూ హెడ్ రికార్డులు.. ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లో ఆర్సీబీపై సీఎస్కే అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా మ్యాచ్ జరిగే చెపాక్‌లో మాత్రం ఆర్సీబీకి చెత్త రికార్డు ఉంది. చెపాక్ లో చెన్నై జట్టుపై ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడితే ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్ లోనే గెలిచి.. 7 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. -
IPL 2024: సీఎస్కేతో మ్యాచ్.. భారీ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా జరిగే సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఆర్సీబీతో తలపడుతుంది. ఈ బిగ్ ఫైట్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పలు భారీ రికార్డులపై కన్నేశాడు. అవేంటంటే.. సీఎస్కేతో మ్యాచ్‌లో విరాట్ మరో 6 పరుగులు చేస్తే.. టీ20ల్లో 12000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 11994 పరుగులు ఉన్నాయి. ఈ జాబితాలో విరాట్ తర్వాత రోహిత్ శర్మ (11156), శిఖర్ ధవన్ (9645) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో క్యాచ్ పడితే టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం విరాట్.. సురేశ్ రైనాతో కలిసి టాప్‌లో ఉన్నాడు. వీరిద్దరు టీ20ల్లో 172 క్యాచ్‌లు పట్టారు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో పరుగు చేస్తే సీఎస్కేపై 1000 పరుగుల మార్కును తాకుతాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 4 క్యాచ్‌లు పడితే ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 106 క్యాచ్‌లు ఉండగా.. రైనా 109 క్యాచ్‌లతో టాప్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే ఐపీఎల్లో సీఎస్కేపై 10 హాఫ్ సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కుతాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 124 పరుగులు చేస్తే టీ20 క్రికెట్ చరిత్రలో ఓ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పుతాడు. ముష్ఫికర్ రహీం (ఢాకాలో 3239 పరుగులు) విరాట్ కోహ్లి (బెంగళూరులో 3116) అలెక్స్ హేల్స్ (నాటింగ్హమ్లో 3036) -
ఐపీఎల్ 2024 ఓపెనింగ్ సెర్మనీలో పెర్ఫార్మ్ చేయబోయేది వీరే..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 17వ ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మెగా ఫైట్ ప్రారంభమవుతుంది. AR Rahman, Sonu Nigam, Akshay Kumar and Tiger Shroff will perform at the IPL opening ceremony. pic.twitter.com/9kR2dpyOOV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 20, 2024 సీజన్ తొలి మ్యాచ్ కావడంతో మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మనీ అరేంంజ్ చేశారు నిర్వహకులు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్, సింగర్ సోనూ నిగమ్ పెర్ఫార్మ్ చేయనున్నారు. ఈ కార్యక్రమం మ్యాచ్ ప్రారంభానికి గంట ముందు (6:30 గంటలకు) జరుగనుంది. ఈ ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుండగా.. జియో సినిమాలో డిజిటల్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఇదిలా ఉంటే, సీఎస్కే-ఆర్సీబీ మధ్య హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. చెపాక్ విషయానికొస్తే.. ఈ మైదానంలో సీఎస్కే ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. ఇక్కడ ఇరు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. -
IPL 2024: ఆర్సీబీపై సీఎస్కేదే ఆధిపత్యం.. పదహారేళ్లలో..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియం (చెపాక్) వేదికగా మార్చి 22న జరుగనుంది. సీజన్ ఓపెనర్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. హెడ్ టు హెడ్ రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ఐదు సార్లు ఛాంపియన్ అయిన సూపర్ కింగ్స్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఇరు జట్లు ఐపీఎల్లో 31 సార్లు ఎదురెదురుపడగా.. సీఎస్కే 20, ఆర్సీబీ 10 సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. సొంత అడ్డా చెపాక్‌లో ఏ జట్టుపై అయినా పట్టపగ్గాల్లేని సీఎస్కే.. ఆర్సీబీపై సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉంది. చెపాక్ ఈ ఇరు జట్లు ఇప్పటివరకు 8 మ్యాచ్‌ల్లో తలపడగా.. సీఎస్కే ఏకంగా ఏడు మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆర్సీబీ విజయం సాధించింది. అది కూడా లీగ్ ప్రారంభ ఎడిషన్ అయిన 2008లో. నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ సీఎస్కేపై చెపాక్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా గెలిచింది లేదు. చెపాక్ పిచ్ విషయానికొస్తే.. ఈ మైదానం బ్యాటింగ్, బౌలింగ్ రెండిటికీ అనుకూలిస్తుందని చెప్పాలి. తొలుత బ్యాటర్లకు స్వర్గధామంగా కనిపించే ఈ పిచ్ క్రమంగా స్నిన్‌కు అనుకూలిస్తూ బౌలర్ ఫ్రెండ్లీగా మారుతుంది. ఈ పిచ్‌పై ఛేదన కాస్త కష్టంగానే ఉంటుంది. ఇందుకు అక్కడి వాతావరణం కూడా ఓ కారణం. వేసవికాలం రాత్రి వేళల్లో తేమ శాతం అధికంగా ఉండటంతో స్పిన్నర్లు చెలరేగే అవకాశం ఉంటుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (కెప్టెన్/వికెట్‌కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్‌కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్‌దీప్ -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వినయ్ కుమార్.. గేల్, ఏబీడీ సరసన చోటు
ఆర్సీబీ తమ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో మరో ఆటగాడికి చోటు కల్పించింది. ఫ్రాంచైజీ మాజీ ఆటగాడు వినయ్ కుమార్ కొత్తగా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేరాడు. గతేడాది (2023) మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి చేర్చిన ఆర్సీబీ.. ఈ ఏడాది వినయ్ కుమార్‌ను ఆహ్వానించింది. నిన్న (మార్చి 19) జరిగిన అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ వినయ్ కుమార్‌ను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి ఆహ్వానించి, సత్కరించింది. వినయ్‌ను సత్కరించిన వారిలో ఆర్సీబీ యజమానితో పాటు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన ఉన్నారు. వినయ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఆహ్వానిస్తున్న విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. Vinay Kumar joins the elite company of RCB icons 𝑪𝒉𝒓𝒊𝒔 𝑮𝒂𝒚𝒍𝒆 and 𝑨𝑩 𝒅𝒆 𝑽𝒊𝒍𝒍𝒊𝒆𝒓𝒔✨ pic.twitter.com/mJ8OdaeH6U— CricTracker (@Cricketracker) March 20, 2024 40 ఏళ్ల వినయ్ ఆర్సీబీ తరఫున 2008, 2009, 2010, 2012, 2013 సీజన్లలో ఆడాడు. వినయ్ ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (80) ఉన్నాడు. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లు ఆడిన వినయ్ 105 వికెట్లు పడగొట్టాడు. వినయ్ 2012 (19), 2013 (23) సీజన్లలో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తం 11 సీజన్లు ఆడిన వినయ్.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో కర్ణాటక తరఫున రంజీ అరంగ్రేటం (2004) చేసిన వినయ్.. రంజీ చరిత్రలో 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. దేశవాలీ క్రికెట్లో వినయ్‌ను దావణగెరె ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగిన వినయ్.. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. వినయ్ భారత జట్టు తరఫున 9 టీ20లు, 31 వన్డేలు, ఏకైక టెస్ట్ ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. -
IPL: ఫైనల్ చేరినా ఐపీఎల్ ట్రోఫీ గెలవని మూడు జట్లు.. ఈసారైనా!
ఐపీఎల్లో 16 సీజన్లు గడిచిపోయాయి... రెండు టీమ్‌లు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఐదేసిసార్లు విజేతగా నిలిచి తమ స్థాయిని ప్రదర్శిస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండు టైటిల్స్‌తో సత్తా చాటింది. మరో నాలుగు టీమ్‌లు రాజస్తాన్ రాయల్స్, దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ ఒక్కో ట్రోఫీతో కొంత సంతప్తిని మూటగట్టుకున్నాయి. కానీ అన్ని సీజన్లలో భాగంగా ఉండి ఒక్కసారి కూడా కప్‌ను ముద్దాడలేకపోయిన దురదష్టకర జట్లూ ఉన్నాయి. సీజన్లో తొలి మ్యాచ్ నుంచి చెలరేగి అంచనాలు పెంచి అభిమానుల్లో ఆశలు రేపిన తర్వాత చివరి మెట్టుపై చతికిలపడి ఈ టీమ్‌లు తీవ్ర నిరాశను పంచాయి. మూడుసార్లు ఫైనల్ చేరి ఒక్కసారి కూడా గెలవలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈ అన్ లక్కీ బ్యాచ్‌లో అగ్రస్థానంలో ఉండగా... పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కోసారి ఫైనల్ చేరి పరాజయం పక్షాన నిలిచాయి. కొత్త సీజన్లో మరోసారి తమ రాతను పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ మూడు జట్లకు ఈ సారైనా కలిసి వస్తుందా... ట్రోఫీ చెంత చేరుతుందా అనేది ఆసక్తికరం. –సాక్షి క్రీడా విభాగం ‘బెంగ’ళూరు తీరుతుందా... తొలి ఐపీఎల్ సీజన్లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన ఆర్సీబీ తర్వాతి సీజన్లో కోలుకొని ఫైనల్ చేరినా 6 పరుగుల స్వల్ప తేడాతో దక్కన్ చార్జర్స్ చేతిలో ఓడింది. అనంతరం 2011లోనూ తుది పోరుకు అర్హత సాధించినా... చెన్నై నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది. ఇక కోహ్లి ఏకంగా 973 పరుగులు సాధించిన 2016 ఐపీఎల్‌లోనూ ఆఖరి సమరంలో సన్‌రైజర్స్ చేతిలో 8 పరుగులతో ఓటమి పాలైంది. 209 పరుగుల ఛేదనలో ఒక దశలో 114/0తో ఉండి కూడా టీమ్ ఓడింది. ఇక ఆ తర్వాత ఆర్సీబీ ఆ స్థాయి ప్రదర్శనను మళ్లీ చూపించలేదు. గత సీజన్లో 7 విజయాలు సాధించిన జట్టు ఆరో స్థానంతో ముగించింది. బలాబలాలు: తాజా వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌ను ఆర్సీబీ రూ.17.50 కోట్లకు తీసుకుంది. అతని తాజా ఫామ్‌ను బట్టి చూస్తే అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో జట్టుకు కచ్చితంగా మంచి ప్రయోజనం కలగవచ్చు. ఓపెనర్లుగా డుప్లెసిస్, కోహ్లిలపై బ్యాటింగ్ భారం ఉండగా... మ్యాక్స్‌వెల్, గ్రీన్ చెలరేగిపోగలరు. గాయంతో గత సీజన్‌కు దూరమైన రజత్ పటిదార్ ఈసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లో ఫెర్గూసన్, అల్జారీ జోసెఫ్‌లలో ఒకరికి అవకాశం దక్కుతుంది. అయితే వీరిద్దరికంటే సిరాజ్, ఇటీవలే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆకాశ్‌దీప్‌లు రాణించడం కీలకం. రంజీల్లో రాణించిన వైశాక్ విజయ్ కూడా ఉన్నాడు. జట్టు స్పిన్ విభాగం బలహీనంగా ఉంది. కరణ్ శర్మలో మునుపటి పదును లేదు. జట్టులో ఇతర దేశవాళీ ఆటగాళ్లు ఎవరూ ఎక్కువ ప్రభావం చూపించగల సమర్థులు కాదు. ఓవరాల్‌గా చూస్తే బ్యాటింగ్ బలగంతోనే బెంగళూరు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. జట్టు వివరాలు ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, జోసెఫ్, టాప్లీ, టామ్ కరన్, ఫెర్గూసన్ (విదేశీ ఆటగాళ్లు); పటిదార్, కోహ్లి, రావత్, కార్తీక్, సుయశ్, సౌరవ్ చౌహాన్, లోమ్రో ర్, కరణ్ శర్మ, స్వప్నిల్, మయాంక్ డాగర్, మనోజ్, ఆకాశ్‌దీప్, సిరాజ్, యశ్ దయాళ్, హిమాన్షు, రాజన్, వైశాక్ (భారత ఆటగాళ్లు). పంజాబ్ ‘కింగ్స్’ అవుతుందా... 2014లో ఒకే ఒక్కసారి ఫైనల్ చేరిన పంజాబ్ తుది పోరులో 199 పరుగులు చేసి కూడా మూడు బంతుల మిగిలి ఉండగానే కోల్‌కతాకు తలవంచింది. ఇతర జట్లతో పోలిస్తే చాలా కాలంగా పంజాబ్ ప్రదర్శన ఘోరంగా ఉంది. 2019–2022 వరకు వరుసగా నాలుగు సీజన్ల పాటు ఆరో స్థానంలో నిలిచిన జట్టు గత ఏడాది ఎనిమిదో స్థానంతో ముగించింది. అసలు 2014 తర్వాత ఇన్నేళ్లలో ఐదో స్థానంలో (2017)లో నిలవడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన బలాబలాలు: ఎప్పటిలాగే అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు లేకపోవడం జట్టు ప్రధాన బలహీనత. ఎప్పుడో భారత జట్టుకు దూరమైనా మరో ప్రత్యామ్నాయం లేక ఆటగాడిగా, కెప్టెన్‌గా కూడా శిఖర్ ధావన్‌కు అవకాశం దక్కుతోంది. అతను ఏమాత్రం సమర్థంగా జట్టును నడిపించగలడనేది సందేహమే. చూస్తే జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నట్లు కనిపిస్తోంది కానీ వీరిలో ఎవరూ గతంలో తమ ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది లేదు. బ్యాటింగ్‌లో జితేశ్ శర్మ, బెయిర్‌స్టో, లివింగ్స్టోన్లపైనే భారం ఉంది. అర్ష్ దీప్తో పాటు కొత్తగా ఈ జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్‌పై బౌలింగ్ భారం ఉండగా, రబడ రాణించడం కీలకం. వోక్స్, స్యామ్ కరన్ ఎంత ప్రభావం చూపిస్తారో చూడాలి. జట్టు వివరాలు పంజాబ్: బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, రోసో, వోక్స్, స్యామ్ కరన్, రజా, రబడ, ఎలిస్ (విదేశీ ఆటగాళ్లు); శిఖర్ ధావన్ (కెప్టెన్), జితేశ్, ప్రభ్‌సిమ్రన్, హర్‌ప్రీత్, శశాంక్, విశ్వనాథ్, అశుతోష్, తనయ్ త్యాగరాజన్, అథర్వ, రిషి ధావన్, శివమ్ (భారత ఆటగాళ్లు). ఢిల్లీ... పంత్ ప్రతాపంపైనే... సూపర్ ఫామ్‌తో అగ్రస్థానం సాధించి 2020లో ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ బ్యాటింగ్‌తో ముంబై చేతిలో ఓడింది. 2023లోనైతే మరీ పేలవంగా ఆడి 9వ స్థానానికి పరిమితమైంది. రిషభ్ పంత్ పునరాగమనమే ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ ఆసక్తి రేపుతోంది. అయితే తీవ్ర గాయం నుంచి కోలుకొని వస్తున్న అతను ఎలా ఆడతాడు, సారథిగా ఎలా నడిపిస్తాడనేది చర్చనీయాంశం. బలాబలాలు: ఢిల్లీ బ్యాటింగ్ బలంగా ఉండటం సానుకూలాంశం. వార్నర్, పథ్వీ షా, మిచెల్ మార్‡్ష టాప్–3లో ఆడతారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడగల సమర్థుడు. లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా ప్రభావం చూపగలడు. కుల్దీప్ యాదవ్ వల్ల స్పిన్ బౌలింగ్‌లో కూడా పదును ఉంది. అయితే పేస్ బలహీనంగా కనిపిస్తోంది. నోర్జే, రిచర్డ్సన్ గాయాలతో బాధపడుతుండగా... జట్టు ఆధారపడుతున్న ఖలీల్, ముకేశ్‌ల ప్రదర్శన టి20ల్లో అంతంత మాత్రమే. బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు సాధిస్తేనే గెలుపుపై నమ్మకం ఉంచుకోవచ్చు. పంత్‌కు ఫిట్నెస్ సమస్యలు వస్తే దూకుడైన కీపర్ కుమార్ కుషాగ్ర ఆడతాడు. జట్టు వివరాలు ఢిల్లీ: వార్నర్, హోప్, స్టబ్స్, మార్‡్ష, నోర్జే, జేక్ ఫ్రేజర్, రిచర్డ్సన్ (విదేశీ ఆటగాళ్లు); పంత్ (కెప్టెన్), పథ్వీ షా, యష్ ధుల్, స్వస్తిక్, పొరేల్, రికీ భుయ్, కుశాగ్ర, అక్షర్, లలిత్, సుమీత్, ప్రవీణ్ దూబే, విక్కీ, కుల్దీప్, ఖలీల్, ఇషాంత్, ముకేశ్, రసిక్ (భారత ఆటగాళ్లు) -
IPL 2024: ఐపీఎల్ టైటిల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విరాట్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ (మార్చి 19) జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అన్‌బాక్స్ ఈవెంట్లో ఆ జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ మహిళల ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకోవడంపై స్పందిస్తూ.. ఈ ఏడాది ఆర్సీబీ టైటిళ్ల సంఖ్యను డబుల్ చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మహిళల ఆర్సీబీ జట్టు టైటిల్ గెలిచినప్పుడు తామందరం మ్యాచ్ చూస్తున్నామని.. ఆ సమయంలో ఆర్సీబీ అభిమానుల స్వచ్ఛమైన ప్రేమను ఫీలయ్యామని అన్నాడు. ఆర్సీబీ టైటిల్ గెలిచిన క్షణాన బెంగళూరు నగరమే టైటిల్ గెలిచిన ఫీలింగ్ కలిగిందని తెలిపాడు. ఇన్నేళ్ల పాటు అభిమానులు మాపై ఉంచిన నమ్మకాన్ని త్వరలోనే డబుల్ చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. THE RCB TEAM IS READY FOR IPL 2024...!!!!! 🔥 pic.twitter.com/aRCU4671at — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 16 ఏళ్లలో తాను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా టైటిల్ గెలవాలనే దృడ సంకల్పంతోనే వచ్చానని.. అందు కోసం ప్రతిసారి శాయశక్తుల కృషి చేశానని పేర్కొన్నాడు. ఐపీఎల్ టైటిల్ తొలిసారి గెలిచిన ఆర్సీబీ జట్టులో ఉండాలన్నది తన కోరిక అని.. అభిమానులు, ఫ్రాంచైజీకి సహకారాన్ని ఎప్పటికీ మరువలేనని, టైటిల్ గెలిచి వీరి రుణాన్ని తీర్చుకుంటానని తెలిపాడు. కాగా, అన్‌బాక్స్ ఈవెంట్ ప్రారంభానికి ముందు మహిళల ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీకి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చిన పురుషుల ఆర్సీబీ బృందంలో విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా విరాట్.. సహచరులతో కలిసి చప్పలు కొడుతూ ఛాంపియన్స్‌ను మైదానంలోకి ఆహ్వానించాడు. ఈ ఈవెంట్ సందర్భంగా విరాట్ చాలా హుషారుగా కనిపించాడు. మహిళా క్రికెటర్లతో కలిసి ఫోటోలను పోజులిచ్చాడు. చిన్నస్వామి స్టేడియం మొత్తం విరాట్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
IPL 2024: మహిళా ఛాంపియన్లకు "గార్డ్ ఆఫ్ హానర్" ఇచ్చిన ఆర్సీబీ
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో అన్‌బాక్స్ పేరిట ఓ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ టీమ్.. మహిళా ఐపీఎల్ ఛాంపియన్లను (ఆర్సీబీ) గౌరవించుకుంది. ఆర్సీబీ బృందం తమ మహిళా జట్టుకు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చింది. ఆర్సీబీ పురుష జట్టు సభ్యులు ఇరు వైపులా నిలబడి తమ మహిళా బృందాన్ని చప్పట్లతో సాదరంగా మైదానంలోకి ఆహ్వానించారు. RCB Team Giving Guard of honour to Women's team at Chinnaswamy stadium. - MOMENT OF THE DAY...!!!! ⭐ pic.twitter.com/JxqKUniGgW — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 Great Gesture by RCB Team...!!!!! 👏❤️ - They giving guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. pic.twitter.com/2AGVcZjVqB — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 RCB Team giving Guard of honour to RCB Women's team at Chinnaswamy stadium. - This is Beautiful gesture by RCB Team...!!!!! ❤️ pic.twitter.com/PseXxeAOdC — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 మహిళా ఆర్సీబీ జట్టు కెప్టెన్ స్మృతి మంధన ముందు నడుస్తుండగా జట్టు సభ్యులు ఆమెను ఫాలో అయ్యారు. గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్న అనంతరం ఆర్సీబీ మహిళా జట్టు ప్రేక్షకులకు అభివాదం చేస్తూ స్టేడియం చుట్టూ తిరిగింది. అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా మెన్స్ ఆర్సీబీ టీమ్ కీలక సభ్యులు విరాట్ కోహ్లి, ఫాఫ్ డెప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ మహిళల ఆర్సీబీ జట్టు సభ్యులను అభినందించారు. ఫోటోలకు పోజులిచ్చారు. Asha Sobhana clicked selfie with Virat Kohli at Chinnaswamy. - A beautiful picture! pic.twitter.com/S13eiyId4M — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE CRAZE OF VIRAT KOHLI AND RCB IS REALLY HUGE...!!!!! 🙌 ❤️ pic.twitter.com/Bx79AczHAQ — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 విరాట్ కోహ్లి కొందరు మహిళా జట్టు సభ్యులతో కలిసి సెల్ఫీలు దిగారు. చాలాకాలం తర్వాత విరాట్ కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలు అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోయింది. Smriti Mandhana and her team taking lap of honour to crowds at Chinnaswamy stadium. - This is beautiful...!!!! 🏆 pic.twitter.com/ga7aqXAuNm — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 THE INCREDIBLE ATMOSPHERE AT CHINNASWAMY. - RCB FANS ARE CRAZY...!!!!! 🔥 pic.twitter.com/2UkP8N0RDe — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 కాగా, కొద్ది రోజుల కిందట జరిగిన మహిళల ఐపీఎల్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచి ఆర్సీబీ టీమ్ తొలిసారి ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీకి ఇదే తొలి టైటిల్. పురుషుల జట్టు మూడుసార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. మహిళల టీమ్ ఇచ్చిన జోష్‌తో ఆర్సీబీ మెన్స్ టీమ్ కూడా ఆసారి ఎలాగైనా టైటిల్ సాధిస్తామని ధీమాగా ఉంది. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈసారి టైటిల్ సాధించేందుకు ఆర్సీబీ మెన్స్ టీమ్ కఠోరంగా శ్రమిస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనే ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
ఐపీఎల్ "డాన్" విరాట్ కోహ్లి.. ఢిల్లీపై అత్యధికంగా..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి టాప్ రన్ స్కోరర్ అన్న విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి సీజన్ (2008) నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి.. ఇప్పటివరకు 237 మ్యాచ్‌లు ఆడి 7 సెంచరీలు, 50 అర్దసెంచరీల సాయంతో 130.02 స్ట్రయిక్‌రేట్‌తో 7263 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్లో ఎన్నో టాప్ రికార్డులు తన ఖాతాలో వేసుకున్న కోహ్లి.. రాబోయే సీజన్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. The Roar for Virat Kohli when he entered at Chinnaswamy stadium. - THE GOAT AT HIS DEN...!!!! 🐐👑 pic.twitter.com/uJYIbVN15Q — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 VIRAT KOHLI AT CHINNASWAMY. - THE KING AT HIS KINGDOM...!!!! 🐐 pic.twitter.com/Hkr3gG7Z4o — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 ఇవాళే (మార్చి 19) ప్రాక్టీస్ ప్రారంభించిన కోహ్లి చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో సహచరులతో కలిసి సరదాగా గడిపాడు. కోహ్లిని చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. కోహ్లి క్రేజ్‌కి తోడు మహిళా జట్టు ఐపీఎల్ టైటిల్ గెలవడం ఆర్సీబీ అభిమానులకు రెట్టింపు ఉత్సాహానిస్తుంది. Virat Kohli in the batting practice session at Chinnaswamy today. - KING KOHLI IS GETTING READY TO RULE..!!! 👑 pic.twitter.com/1FIMjNze08 — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 Preparations done at the Chinnaswamy Stadium for the RCB Unbox Event. - Virat Kohli standing tall. 🐐pic.twitter.com/ZRhYJcenYy — Mufaddal Vohra (@mufaddal_vohra) March 19, 2024 ఇవాళ సాయంత్రం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్ జరుగనుండటంతో అభిమానులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కోహ్లి నామస్మరణతో స్టేడియం మార్మోగిపోతున్నాయి. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రి కావడంతో అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. The Craze for RCB & Kohli. - Incredible atmosphere in Chinnaswamy stadium. 🔥pic.twitter.com/So7Dzto8Wv — Johns. (@CricCrazyJohns) March 19, 2024 అన్‌బాక్స్ ఈవెంట్లో ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీ (మహిళా జట్టు) ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. మహిళా జట్టులాగే పురుషుల టీమ్ కూడా ఆసారి ఐపీఎల్ టైటిల్ సాధిస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. The Stage is set for RCB's Unbox Event at Chinnaswamy stadium...!!!! 🔥 pic.twitter.com/0GkKXpZyRN — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 RCB Women's has arrived at Chinnaswamy stadium in the Unbox Event...!!!! 🏆 pic.twitter.com/VYx1lMLnSo — CricketMAN2 (@ImTanujSingh) March 19, 2024 ఐపీఎల్ 2024 సీజన్లో మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లికి సంబంధించిన గణాంకాలపై ఓ లుక్కేద్దాం. కోహ్లి ఏ జట్టుపై ఎన్ని పరుగులు సాధించాడో నెమరు వేసుకుందాం. గణాంకాల ప్రకారం కోహ్లికి ఢిల్లీ ఫ్రాంచైజీపై ఘనమైన రికార్డు ఉంది. ఈ ఫ్రాంచైజీపై కోహ్లి అత్యధికంగా 1030 పరుగులు చేశాడు. ఐపీఎల్లో వివిధ జట్లపై కోహ్లి సాధించిన పరుగుల వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 1030 సీఎస్కేపై 985 కేకేఆర్‌పై 861 పంజాబ్ కింగ్స్‌పై 861 ముంబై ఇండియన్స్‌పై 852 సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 669 రాజస్థాన్ రాయల్స్‌పై 618 డెక్కన్ ఛార్జర్స్‌పై 306 గుజరాత్ లయన్స్‌పై 283 కొచ్చి కేరళ టస్కర్స్‌పై 50 లక్నో సూపర్ జెయింట్స్‌పై 117 పూణే వారియర్స్‌పై 128 రైజింగ్ పూణే సూపర్ జెయింట్‌పై 271 గుజరాత్ టైటాన్స్‌పై 232 ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ.. డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. -
WPL 2024: ఆర్సీబీ క్వీన్.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)
-
ఐపీఎల్ RCB ప్రోమోలో రష్మిక.. వీడియో వైరల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ప్రముఖ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీజన్ 17కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో చిన్న మార్పు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం RCB తమ జట్టు పేరును ఇంగ్లీషులో (Royal Challengers Bangalore) అని రాస్తోంది. ఇకపై (Royal Challengers Bengaluru) అని మార్చనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే విషయాన్ని చెబుతూ ఇప్పటికే పలు వీడియోలను RCB విడుదల చేసింది. తాజాగా రష్మిక మందన్న కూడా ఆర్సీబీ కోసం ఒక ప్రోమోను విడుదల చేసింది. అందులో రష్మిక మందన్న మేకప్ వ్యాన్ లోపలికి వెళ్తుంది. ఆ వ్యాన్ లోపల అద్దంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అని రాసి ఉంది. అది చూసిన రష్మిక రాయల్ ఛాలెంజర్స్‌ను మాత్రమే ఉంచి బెంగళూరు అనే పదాన్ని తుడిచిపెట్టేసింది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియో ఒకటి రిషబ్ శెట్టి కూడా గతంలో విడుదల చేశారు. 16 ఏళ్లుగా జట్టు పేరు మార్చాలని అక్కడి స్థానికులు ఆర్సీబీని కోరుతున్నారు. స్థానిక అభిమానుల కోరికమేరకు ఆర్సీబీ ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్లో పేరు మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది. మార్చి 22న CSK, RCB మధ్య జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. -
WPL 2024: ఫైనల్లో 4 వికెట్లు.. ఆర్సీబీ క్వీన్! ఎవరీ శ్రేయాంక?
రాయల్ ఛాలెజంజర్స్ బెంగళూరు నిరీక్షణకు తెరపడింది. గత 16 ఏళ్లగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న ట్రోఫిని ఎట్టకేలకు ఆర్సీబీ ముద్దాడింది. అయితే ఆర్సీబీ అబ్బాయిలకు సాధ్యం కాని టైటిల్‌ను.. అమ్మాయిలు అందుకుని చూపించారు. డబ్ల్యూపీఎల్-2024 ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ తొలి టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. అయితే ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడడంలో ఆ జట్టు యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌ది కీలక పాత్ర. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. అంతకుముందు సెమీఫైనల్లో రెండు కీలక వికెట్లు ఆమె పడగొట్టింది. ఓ వైపు కాలి గాయంతో బాధపడుతూనే అద్బుతమైన ప్రదర్శన కనబరిచి తన జట్టుకు టైటిల్‌ను అందించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 8 మ్యాచ్‌లు ఆడిన పాటిల్ 13 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకుంది. కాగా తొలి నాలుగు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పాటిల్‌ను ఆర్సీబీ మేనెజ్మెంట్ రెండు మ్యాచ్‌లకు పక్కన పెట్టేసింది. ఆ తర్వాత మళ్లీ తుది జట్టులోకి వచ్చిన శ్రేయాంక దెబ్బతిన్న సింహంలా చెలరేగిపోయింది. ఈ క్రమంలో ఎవరీ శ్రేయాంక పాటిల్‌ను నెటిజన్లు తెగ వేతికేస్తున్నారు. ఎవరీ శ్రేయాంక పాటిల్.. 21 ఏళ్ల శ్రేయాంక పాటిల్ బెంగళూరులో జన్మించింది. శ్రేయాంక దేశీవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంది. అయితే దేశవాళీ క్రికెట్లో మెరుగ్గా రాణించడంతో ఆమె భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఆఖరిలో ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లోకి శ్రేయాంక అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన ఈ కర్ణాటక క్రికెటర్.. వరుసగా 4, 8 వికెట్లు పడగొట్టింది. కాగా డబ్ల్యూపీఎల్ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు ఆమెను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. కాగా పాటిల్ మహిళల కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ భాగమైంది. ఈ లీగ్‌లో గయానా ఆమెజాన్ వారియర్స్‌కు శ్రేయాంక ప్రాతినిథ్యం వహిస్తుంది. చదవండి: T20 WC: టీ20 జట్టు నుంచి అవుట్! వరల్డ్‌కప్‌లో నో ఛాన్స్! Shreyanka Patil with her Purple Cap award. - The hero of the team! 💜 pic.twitter.com/ATA6DMiYqT — Mufaddal Vohra (@mufaddal_vohra) March 18, 2024 Ellyse Perry " Pretty bonkers to be honest. It's another level for us.Shreyanka Patil is such a young player and she has got the world at her feet, they are awesome.Shreyanka and Sophie devine will be owning the stage and they are the goat dangers 😄 "pic.twitter.com/ukWj0D4g9P — Sujeet Suman (@sujeetsuman1991) March 18, 2024 -
"ఈ సలా కప్ నమ్మదు.."
-
డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీ... ఫ్రైజ్ మనీ ఎన్ని కోట్లో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ కల ఎట్టకేలకు నేరవేరింది. గత 16 ఏళ్లగా ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ కలను డబ్ల్యూపీఎల్‌లో అమ్మాయిలు నెరవేర్చారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ బౌలర్ల జోరుకు 113 పరుగులకే కుప్పకూలింది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో అదరగొట్టగా.. మోలినెక్స్ 3, ఆశ శోభన 2 రెండో వికెట్లు పడగొట్టారు. అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలి టైటిల్ విజయంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక డబ్ల్యూపీఎల్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఫ్రైజ్ మనీ ఎంత? ఆరెంజ్ క్యాప్ ఎవరికి దక్కింది? ఇటువంటి విషయాలపై ఓ లూక్కేద్దం. విజేతకు ఎంతంటే? డబ్ల్యూపీఎల్ విజేత ఆర్సీబీకి రూ.6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా రన్నరప్‌గా నిలిచిన క్యాపిటల్స్ కు రూ.3 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. ఆరెంజ్ క్యాప్ విజేత పెర్రీ.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆర్సీబీ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన పెర్రీ.. 347 పరుగులు చేసింది. పర్పుల్ క్యాప్ హోల్డర్ శ్రేయంక అదేవిధంగా అత్యధిక ఈ ఏడాది సీజన్లో వికెట్లు తీసిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయంక పాటిల్ పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచింది. దీంతో ఆమెకు రూ. 5 లక్షల ఫ్రైజ్ మనీ లభించింది. ఓవరాల్‌గా ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రేయంక.. 13 వికెట్లు పడగొట్టింది. మిగితా అవార్డులు దక్కించుకున్న వారు వీరే.. ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్-దీప్తి శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ - శ్రేయాంక పాటిల్ (బెంగళూరు) మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ - దీప్తి శర్మ (యూపీ) బెస్ట్ క్యాచ్ ఆఫ్ ద టోర్నీ - సజన సజీవన్ (ముంబై) ఫెయిర్ ప్లే టీమ్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు A special moment to celebrate @imVkohli @mandhana_smriti pic.twitter.com/NkEI6iDIjq — CricTracker (@Cricketracker) March 17, 2024 -
WPL 2024: ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..?
లీగ్ క్రికెట్లో అత్యధిక ప్రజాధరణ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. తాజా (2024) డబ్ల్యూపీఎల్ (మహిళల ఐపీఎల్) ఎడిషన్‌లో ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఇవాళ (మార్చి 17) జరుగుతున్న తుది సమరంలో ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. ఆర్సీబీ బౌలర్లు రెచ్చిపోవడంతో 113 పరుగులకే కుప్పకూలింది. 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఆర్సీబీ బౌలర్లు ఒక్కసారిగా విరుచుకుపడటంతో స్వల్ప స్కోర్‌కే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక్ పాటిల్ 4, సోఫీ మోలినెక్స్ 3, ఆశా శోభన 2 వికెట్లు పడగొట్టారు. షఫాలీ వర్మ (44) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆర్సీబీ చరిత్ర తిరగరాసేనా..? ఆర్సీబీ ఐదోసారి ((2009, 2011, 2016 ) ఐపీఎల్, 2011 ఛాంపియన్స్ ట్రోఫీ) ఫైనల్‌కు చేరిన నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ.. నాలుగు సందర్భాల్లో ఛేజింగ్ చేసి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. తాజాగా జరుగుతున్న ఫైనల్లో కూడా ఆర్సీబీ ఛేజింగే చేస్తుండటంతో ఈసారైనా టైటిల్ గెలుస్తుందా అని ఆ జట్టు అభిమానులు చర్చించుకుంటున్నారు. తాజా పరిస్థితులను (113 పరుగులకే ఆలౌటైన ఢిల్లీ) బట్టి చూస్తే.. ఆర్సీబీ చరిత్ర తిరగరాసి తొలి టైటిల్ గెలిచేలా కనిపిస్తుంది. -
RCB: 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత..!
మహిళల ఐపీఎల్ (డబ్ల్యూపీఎల్) 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 17) జరిగే ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టేబుల్ టాపర్‌గా నిలిచి ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్‌కు చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్‌కు చేరింది. Literally every RCB fan. #DCvRCB pic.twitter.com/y8l9eUAR3K — Yolo247 (@Yolo247Official) March 17, 2024 డబ్ల్యూపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా రెండోసారి కాగా.. ఆర్సీబీ తొలిసారి తుదిపోరుకు అర్హత సాధించింది. డబ్ల్యూపీఎల్ అరంగేట్రం సీజన్లో (2023) కేవలం రెండే విజయాలతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆర్సీబీ.. ప్రస్తుత సీజన్లో గ్రూప్ దశలో నాలుగు విజయాలు, కీలకమైన ఎలిమినేటర్‌లో ముంబైపై విజయంతో మొత్తంగా ఐదు విజయాలు సాధించి ఫైనల్‌కు చేరింది. ఐపీఎల్ (2009, 2011, 2016), డబ్ల్యూపీఎల్ (2024), ఛాంపియన్స్ టీ20 లీగ్‌లతో (2011) కలిపి ఐదోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. 2844 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఫైనల్‌కు చేరింది. ఆర్సీబీ చివరిసారిగా 2016 ఐపీఎల్ ఎడిషన్‌లో ఫైనల్స్ ఆడింది. నాటి ఫైనల్లో ఆర్సీబీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం ఆర్సీబీ మరోసారి ఫైనల్‌కు చేరింది. మరి ఈ సారి ఫైనల్లోనైనా ఆర్సీబీ విజయం సాధించి తమ టైటిల్ దాహానికి చెక్ పెడుతుందో లేదో వేచి చూడాలి. -
అక్కడా.. ఇక్కడా ఆర్సీబీ ఆటగాళ్లదే డామినేషన్..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (ఐపీఎల్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఈ జట్టునే అధికంగా ఇష్టపడతారు. ఆర్సీబీ ప్రాతినిథ్యం వహించిన, వహిస్తున్న క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాంటి ఆటగాళ్ల రేంజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఆర్సీబీ క్రేజ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ జట్టు ఆటగాళ్ల క్రేజ్ మహిళల ఐపీఎల్‌లోనూ (డబ్ల్యూపీఎల్) ఇదే రేంజ్లో ఉంది. డబ్ల్యూపీఎల్‌లోనూ ఆర్సీబీ టైటిల్ సాధించకపోయినా విశ్వవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తాజా డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఫైనల్‌కు చేరి తమ తొలి టైటిల్‌పై అభిమానుల్లో ఆశలు రేకెత్తిస్తుంది. నేడు జరుగబోయే ఫైనల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఆర్సీబీ కేవలం క్రేజ్ విషయంలోనే తోపు కాదని గణంకాలు సూచిస్తున్నాయి. ఐపీఎల్, డబ్ల్యూపీల్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు ఆర్సీబీ ఆటగాళ్ల పేరిటే ఉన్నాయి. ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు (175) క్రిస్ గేల్ పేరిట ఉండగా.. మహిళల ఐపీఎల్లో ఈ రికార్డు ఆర్సీబీకే చెందిన సోఫీ డివైన్ (99) పేరిట ఉంది. బౌలింగ్ విషయానికొస్తే.. ఐపీఎల్లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/12) ఆర్సీబీ బౌలర్ అల్జరీ జోసఫ్ పేరిట ఉండగా.. డబ్ల్యూపీఎల్‌లో అత్యుత్తమ వ్యక్తిగత బౌలింగ్ గణాంకాలు (6/15) ఎల్లిస్ పెర్రీ పేరిట ఉన్నాయి. ఈ గణాంకాలు చూస్తే ఐపీఎల్, డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ డామినేషన్ ఏ రేంజ్లో సాగుతుందో ఇట్టే అర్దమవుతుంది. -
IPL 2024: ఆర్సీబీ ఈసారైన కప్ కొడుతుందా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్‌ను గెలవకపోయిన జట్లలో ఒకటి. ప్రతీసీజన్‌లోనూ ఎన్నో అంచనాలతో బరిలోకి దిగడం.. ఆఖరికి బొక్కాబోర్లా పడడం ఆర్సీబీకి అలవాటుగా మారిపోయింది. ఐపీఎల్ మొదటి సీజన్ నుంచి ఆర్సీబీకి టైటిల్ అందని ద్రాక్ష లాగానే మిగిలిపోయింది. కానీ ఆర్సీబీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ప్రతీ ఏడాది 'ఈసాలా కప్ నమ్దే' అంటూ సందడి చేస్తూంటారు. తమ ఆరాద్య జట్టు ఎప్పుడు టైటిల్‌ను ముద్దాడుతుందా అని వెయ్యికళ్లుతో ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024 సీజన్‌కు సమయం అసన్నం కావడంతో అభిమానుల సందడి మొదలైపోయింది. ఆర్సీబీ కనీసం ఈసారైనా అభిమానుల కలను నెరవేరుస్తుందా? గతం ఇలా.. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో 2008 ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీ ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కు చేరింది. కానీ మూడు సార్లు కూడా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. 2009లో తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన బెంగళూరు.. ఫైనల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోయింది. అనంతరం 2011 సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన ఆర్సీబీ.. చెన్నైసూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అనంతరం 2016 సీజన్లో విరాట్ కోహ్లి సారథ్యంలో వరుస విజయాలతో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. కానీ మళ్లీ హైదరాబాద్ ఫ్రాంచైజీ చేతిలోనే పరభావం ఎదురైంది. ఆ తర్వాత 2017, 2018,19 సీజన్లలో దారుణంగా విఫలమైన ఆర్సీబీ.. వరుసగా 2020,21,22 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. కొత్త కెప్టెన్ వచ్చినా అదే తీరు.. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లీ ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత తమ నూతన కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు ఫ్రాంచైజీ నియమించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్లోనే ఆర్సీబీనిప్లే ఆఫ్స్‌కు చేర్చాడు. కానీ టైటిల్నుఅందించలేకపోయాడు. ఐపీఎల్-2022 సీజన్ క్వాలిఫెయర్1లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఆర్సీబీ ఓటమి పాలైంది. అనంతరం 2023 సీజన్లో ఆర్సీబీ పేలవ ప్రదర్శన కనబరిచి ఆరోస్ధానానికే పరిమితమైంది. బలాలు.. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుత జట్టులో విరాట్ కోహ్లి, ఫాప్ డుప్లెసిస్, మాక్స్వెల్ వంటి వరల్డ్‌క్లాస్ క్రికెటర్లు ఉన్నారు. వీరికి ఈ ఏడాది సీజన్లో ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ తోడవ్వడం ఆర్సీబీ బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. గ్రీన్‌కు బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించే సత్తా ఉంది. గత సీజన్లో ఓపెనర్లుగా కోహ్లి, డుప్లెసిస్ అద్బుతమైన ఆరంభాలను అందించారు. ఈ సారి కూడా ఈ స్టార్ జోడీ చెలరేగితే ప్రత్యర్ధి జట్లకు కష్టాలు తప్పవు. ఇక బౌలింగ్ పరంగా కూడా ఆర్సీబీ బలంగా కన్పిస్తోంది. మహ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ అటాకింగ్‌కు నాయకత్వం వహిస్తాడు. గతేడాది సీజన్లో సిరాజ్ అద్బుతంగా రాణించాడు. అతడితో పాటు ఈ ఏడాది సీజన్లలో కివీస్ స్పీడ్ స్టార్ లూకీ ఫెర్గూసన్, విండీస్ పేస్ బౌలర్ జోషఫ్, టామ్ కుర్రాన్ వంటి వారు కొత్తగా ఆర్సీబీలో చేరారు. దీంతో ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకుంగా కన్పిస్తోంది. బలహీనతలు.. అయితే ఆర్సీబీకి ప్రధాన బలహీనత.. బెంచ్ బలం. ఆర్సీబీ బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా లేదు. బెంగళూరు ప్రతీ సీజన్లోనూ ఒకే ప్లేయింగ్ ఎలెవన్‌పై ఆధారపడుతూ వస్తోంది. పెద్దగా మార్పులు చేయరు. దానికి కారణం బెంచ్‌లో సరైన ఆటగాళ్లు లేకపోవడమే. ఈ సారి కూడా ఆర్సీబీ ఫారన్ ఆటగాళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. మనోజ్ భాండాగే, సౌరవ్ చౌహాన్ వంటి స్వదేశీ ఆటగాళ్లను ఆర్సీబీ సొంతం చేసుకున్నప్పటికీ.. వీరివ్వరికీ పెద్దగా అనుభవం లేదు. అంతేకాకుండా గత కొన్ని సీజన్లగా జట్టులో కొనసాగుతున్న అనుజ్ రావత్ కూడా పెద్దగా అకట్టుకోలేకపోయాడు. కానీ ఆర్సీబీ ఈ సారి కూడా అతడిని రీటైన్ చేసుకుంది. రావత్ ఇప్పటివరకు 19 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే ఫిప్టీ ప్లస్ స్కోర్లను సాధించాడు. గత సీజన్లో మరో యువ ఆటగాడు మహిపాల్ లోమ్రోర్పై కూడా ఆర్సీబీ భారీగా ఆశలు పెట్టుకుంది. కానీ మహిపాల్ ఆర్సీబీ అంచనాలను అందుకోలేకపోయాడు. మరోయువ ఆటగాడు సుయాష్ ప్రభుదేశాయ్ పరిస్ధితి కూడా అంతంతమాత్రమే. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్‌పైనే అందరి దృష్టి నెలకొంది. తన కెరీర్లో చివరి ఐపీఎల్ ఆడనున్న కార్తీక్ ఎలా రాణిస్తాడో అని అతృతగా ఎదురుచూస్తున్నారు. గత సీజన్లో అయితే కార్తీక్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. కార్తీక్‌కు మినహా సరైన వికెట్ కీపర్ కూడా ఆర్సీబీలో లేడు. ఇక ఆర్సీబీ స్పిన్ విభాగంలో పేలవంగా కన్పిస్తోంది. అంతర్జాతీయ స్ధాయిలో అనుభవం ఉన్న ఒక్క స్పిన్నర్ కూడా ఆర్సీబీలో లేడు. మ్యాక్సీ ఉన్నప్పటికీ పార్ట్‌టైమ్ బౌలర్‌గా మాత్రమే అందుబాటులో ఉంటాడు. ఇక ఐపీఎల్-2024లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఆర్సీబీ జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్వెల్, విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, వైషక్ విజయ్‌కుమార్, మొహమ్ద్, ఆకాష్ దీప్, మొహమ్ద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్ మరియు స్వప్నిల్ సింగ్. -
పేరు మార్చుకోనున్న ఆర్సీబీ..!?
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సీజన్ నుంచి ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ జట్టు పేరులో స్వల్ప మార్పుచేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆర్సీబీ తమ జట్టు పేరును ఇంగ్లీష్‌లో (Royal Challengers Bangalore) అని రాసుకొస్తోంది. అయితే ఇకపై (Royal Challengers Bengaluru)గా మార్చనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆర్సీబీ షేర్ చేసిన ఓ వీడియో ఈ వార్తలకు మరింత ఊతమిస్తున్నాయి. ఈ వీడియోలో శాండల్‌వుడ్ నటుడు రిషబ్ శెట్టి మూడు దున్నలను తీసుకువచ్చి వాటిపై రాయల్(Royal), ఛాలెంజర్స్(Challengers), బెంగళూరు(Bangalore) అని వేర్వేరుగా రాసి ఉన్నాయి. ఈ క్రమంలో రిషబ్ బెంగళూరు(Bangalore) అని రాసి ఉన్న దున్నను తీసుకెళ్లిపోమని ఓ వ్యక్తితో చెబుతాడు. కాగా క్రికెటేతర క్రీడల్లో Bangalore అని కాకుండా Bengaluru గా రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్ధానిక అభిమానుల కోరిక మెరకు ఆర్సీబీ యాజమాన్యం తమ జట్టుపేరును Bengaluruగా మార్చుకోనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కాగా మార్చి 19న చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న 'ఆన్‌బాక్స్' ఈవెంట్లో ఆధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. -
ఆర్సీబీకి శుభవార్త
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్ చివరి దశకు చేరింది. గ్రూప్ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్ బెర్త్‌లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్. ఈ బెర్త్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్ జెయింట్స్ తమ చివరాఖరి గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్ బరిలో ఉంటుంది. ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే.. ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. గుజరాత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్ మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి. ప్రస్తుతానికి రన్‌రేట్ ఆధారంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. -
మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 10) ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేసి 181 పరుగుల భారీ స్కోర్ (5 వికెట్ల నష్టానికి) చేసింది. జెమీమా రోడ్రిగెజ్ (36 బంతుల్లో 58; 8 ఫోర్లు, సిక్స్), అలైస్ క్యాప్సీ (32 బంతుల్లో 48; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ఓపెనర్లు మెగ్ లాన్నింగ్ (29), షఫాలీ వర్మ (23) సైతం ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మారిజన్ కప్ 12, జొనాస్సెన్ 1, రాధా యాదవ్ ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4 వికెట్లతో విజృంభించగా.. అషా శోభన ఓ వికెట్ దక్కించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. స్మృతి మంధన (5) ఔట్ కాగా.. సోఫీ ఎక్లెస్‌స్టోన్ (8), ఎల్లిస్ పెర్రీ (36) క్రీజ్‌లో ఉన్నారు. మంధన వికెట్ క్యాప్సీకి దక్కింది. కాగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో మూడో ప్లేస్‌లో నిలిచింది. 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఏడాది కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించగా.. యూపీ వారియర్జ్ (6 పాయింట్లు) నాలుగో స్థానంలో, గుజరాత్ జెయింట్స్ (2 పాయింట్లు) చివరి స్థానంలో ఉన్నాయి. -
'చెన్నై, ముంబై, సన్‌రైజర్స్ కాదు.. ఈ సారి ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే'
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఈ జట్టుకు ఐపీఎల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవకపోయినప్పటికీ అభిమానులు మాత్రం తమ ఆరాధ్య జట్టును ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఈ సారి కప్ మనదే అంటూ సందడి చేస్తూంటారు. ఇప్పుడు ఐపీఎల్-2024కు సమయం ఆసన్నం కావడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ నిలుస్తుందని పఠాన్ జోస్యం చెప్పాడు. టైటిల్ గెలుచుకునే అన్ని రకాల అర్హతలు ఆర్సీబీకి ఉన్నాయని పఠాన్ తెలిపాడు. "ఈ ఏడాది ఆర్సీబీ అద్భుతమైన జట్టుతో బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్ పరంగా బెంగళూరు పటిష్టంగా ఉంది. జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నారు. బెంగళూరు జట్టు బ్యాటింగ్ లైనప్ ఆఖరివరకు బలంగా ఉంది. గత సీజన్లలో ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అంత పటిష్టంగా లేదు. అయితే బౌలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఆర్సీబీని టైటిల్ ఫేవరేట్‌గా ఎంచుకోరు. కానీ ఈసారి బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా కన్పిస్తోంది. చిన్నస్వామి వంటి ప్లాట్ పిచ్‌లపై ఎక్స్‌ప్రెస్ పేస్‌తో బౌలింగ్ చేసే ఫాస్ట్ బౌలర్లు ఆర్సీబీ జట్టులో ఉన్నారు. కాబట్టి ఈసారి ఆర్సీబీ టైటిల్ నెగ్గుతుందని భావిస్తున్నాని" స్టార్ స్పోర్ట్స్ గేమ్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. -
ఆర్సీబీతో మ్యాచ్.. విధ్వంసం సృష్టించిన గుజరాత్ ఓపెనర్లు
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (మార్చి 6) జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ ఓపెనింగ్ బ్యాటర్లు లారా వొల్వార్డ్ట్, బెత్ మూనీ శివాలెత్తిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. లారా, మూనీ రెచ్చిపోవడంతో భారీ స్కోర్ చేసింది. లారా 45 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 76 పరుగులు చేయగా.. మూనీ 51 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 85 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఫలితంగా గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. లారా, మూనీ మినహా గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎవరూ రాణించలేకపోయారు. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 18, ఆష్లే గార్డ్నర్ 0, దయాలన్ హేమలత 1, వేద కృష్ణమూర్తి ఒక పరుగు చేశారు. ఆర్సీబీ బౌలర్ సోఫీ మోలినెక్స్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ 200 పరుగుల మార్కును దాటలేకపోయింది. మోలినెక్స్ ఆఖరి ఓవర్లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీసింది. ఒకరు రనౌటయ్యారు. 18వ ఓవర్ వరకు (187/1) అతి భారీ స్కోర్ దిశగా సాగుతున్నట్లు కనిపించిన గుజరాత్ వరుసగా నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 2 ఓవర్లలో కేవలం 12 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, జార్జియా వేర్హమ్ తలో వికెట్ పడగొట్టగా.. ముగ్గురు బ్యాటర్లు రనౌట్లయ్యారు. -
మెరుపులు మెరిపించిన మంధన.. ఆర్సీబీ భారీ స్కోర్
మహిళల ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో భాగంగా యూపీ వారియర్జ్‌తో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధన మెరుపులు మెరిపించింది. కేవలం 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసింది. మంధనకు ఎల్లిస్ పెర్రీ (37 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సబ్బినేని మేఘన (28), రిచా ఘోష్ (21 నాటౌట్) కూడా మెరుపులు మెరిపించారు. వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, అంజలి శర్వాణి, సోఫీ ఎక్లెస్టోన్ తలో వికెట్ పడగొట్టారు. Mandhana's magic in Chinnaswamy!#WPL2024 pic.twitter.com/rMncZXmSzx — OneCricket (@OneCricketApp) March 4, 2024 అనంతరం 199 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వారియర్జ్.. రేణుక సింగ్ వేసిన తొలి ఓవర్లో ఒక్క పరుగు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఆతర్వాత రెండు ఓవర్లలో మాత్రం వారియర్జ్ ఓపెనర్లు అలైసా హీలీ (13), కిరణ్ నవ్‌గిరే (17) రెచ్చిపోయారు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో వారియర్జ్ 3 ఓవర్లలో 40 పరుగులు చేసింది. తొలి ఓవర్ మొయిడిన్‌గా మలిచిన రేణుకా సింగ్, ఆతర్వాతి ఓవర్లో ఏకంగా 22 పరుగులు సమర్పించుకుంది. కారు అద్దాలు పగలగొట్టిన పెర్రీ.. ELLYSE PERRY HAS BROKE THE GLASS OF THE CAR...!!! 🤯 - The reaction of Perry was priceless!! pic.twitter.com/zaxiQLLN1r — Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024 -
చెలరేగిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఇవాళ (ఫిబ్రవరి 29) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఆర్సీబీ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో షఫాలీ వర్మ (31 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలైస్ క్యాప్సీ (33 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మారిజన్ కప్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్ జొనాస్సెన్ (16 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అరుంధతి రెడ్డి (4 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) చెలరేగిపోయారు. కెప్టెన్ మెగ్ లాన్నింగ్ (11), జెమీమా రోడ్రిగెజ్ (0) నిరాశపరిచారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫీ డివైన్, డి క్లెర్క్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శ్రేయాంక పాటిల్ ఓ వికెట్ దక్కించుకుంది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన (2-0-30-0), మోలినెక్స్ (3-0-23-0), వేర్హమ్ (1-0-13-0) దారాళంగా పరుగులు సమర్పించకోగా.. రేణుకా సింగ్ (4-0-28-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగని ఆర్సీబీ ధాటిగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. కెప్టెన్ స్మృతి మంధన 11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 20 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. 2 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 20/0గా ఉంది. -
అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందుకున్న ఆర్సీబీ ప్లేయర్
మహిళల ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 27) మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆర్సీబీ ప్లేయర్, టీమిండియా బౌలింగ్ ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌కు స్టాండ్స్‌లో ఉన్న ఓ అభిమాని నుంచి పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ ఏడో ఓవర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. స్టాండ్స్‌లో ఉన్న ఓ వ్యక్తి "Will You Marry Me Shreyanka" (నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయాంక) అని రాసి ఉన్న ప్లకార్డ్‌ను ప్రదర్శించాడు. ఆ ప్లకార్డ్‌పై హార్ట్ సింబల్‌తో పాటు అతని పేరు కన్నడలో రాసి ఉంది. ఈ సీన్ లైవ్‌లోకి రాగానే డగౌట్లో ఉన్న ఆర్సీబీ ప్లేయర్లు నవ్వుకున్నారు. క్రీడా ప్రాంగణాల్లో ఇలా జరగడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో క్రీడాకారులు ఇలాంటి ప్రపోజల్స్ అందుకున్నారు. గతంలో మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ అందుకున్న పెళ్లి ప్రపోజల్ బాగా హైలైట్ అయ్యింది. Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK — CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024 బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల శ్రేయాంక (రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్, మిడిలార్డర్ బ్యాటర్) ఆర్సీబీతో పాటు కర్ణాటక, టీమిండియా, గయానా అమెజాన్ వారియర్స్‌కు (కరీబియన్ ప్రీమియర్ లీగ్) ప్రాతినిథ్యం వహిస్తుంది. ఈ అమ్మాయి టీమిండియా తరఫున 2 వన్డేలు (4 వికెట్లు), 6 టీ20లు (8 వికెట్లు) ఆడింది. కాగా, గుజరాత్‌తో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, లీగ్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేయగా.. ఆర్సీబీ కేవలం 12.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రేణుకా సింగ్ (4-0-14-2), మోలినెక్స్ (4-0-25-3), స్మృతి మంధన (43), సబ్బినేని మేఘన (36 నాటౌట్), ఎల్లిస్ పెర్రీ (23 నాటౌట్) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించారు.