
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి వన్‌మ్యాన్ షో నడుస్తుంది. ఈ సీజన్‌లో విరాట్ 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, 2 హాఫ్ సెంచరీల సాయంతో 316 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతుండగా.. జట్టులోని స్టార్ బ్యాటర్లంతా కలిసి విరాట్ ఒక్కడు సాధించినన్ని పరుగులు కూడా చేయలేకపోయారు.
విదేశీ స్టార్లు, విధ్వంసకర వీరులు డుప్లెసిస్ 109, కెమారూన్ గ్రీన్ 68, మ్యాక్స్‌వెల్ 32 పరుగులు చేయగా.. లోకల్ ఆటగాళ్లు దినేశ్ కార్తీక్ 90, అనూజ్ రావత్ 73, రజత్ పాటిదార్ 50 పరుగులు చేశారు. ఈ సీజన్‌లో విరాట్ ఒక్కడే 316 పరుగులు చేస్తే.. ఆర్సీబీ బ్యాటింగ్ విభాగమంతా కలిపి 422 పరుగులు మాత్రమే చేసింది.
ఇంతటి దారుణ పరిస్థితుల్లో ఆర్సీబీ ఇవాళ (ఏప్రిల్ 11) పటిష్టమైన ముంబై ఇండియన్స్‌తో తలపడబోతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఏమేరకు రాణిస్తుందో వేచి చూడాలి. ఆర్సీబీకి విరాటే మరోసారి దిక్కవుతాడా లేక ఎవరైనా అతనికి సహకరిస్తారా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.
విరాట్ మినహా మిగతా ఆటగాళ్లంతా చేతులెత్తేస్తుండటంతో ఆర్సీబీ అభిమానులు చాలా అసహనంగా ఉన్నారు. ప్రతిసారి ఈ సాల కప్ నమదే అన్న డైలాగ్ ఈసారి వారి నోటి వెంట వినబడటం లేదు. సొంత మైదానంలోనే ఆర్సీబీ ఘోర పరాభవాలను ఎదుర్కోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాల్టి మ్యాచ్ ముంబై ఇండియన్స్ హోం గ్రౌండ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించడం అత్యశే అవుతుంది.
కాగా, ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఆ జట్టు కూడా వరస ఓటములను ఎదుర్కొని ఇటీవలే ఓ విజయాన్ని సాధించింది. ముంబై ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. దీని వెనకాలే ఆర్సీబీ ఉంది. ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment