
2025 ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభవార్త అందింది. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరమవుతాడనుకున్న జేకబ్ బేతెల్ (ఇంగ్లండ్ ఆటగాడు) గాయం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తుంది. బేతెల్ మొదటి మ్యాచ్ నుంచే అందుబాటులో ఉంటాడని సమాచారం. బేతెల్.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే.
చిన్న వయసులోనే అద్భుతమైన స్ట్రోక్ ప్లేయర్‌గా గుర్తుంపు తెచ్చుకున్న బేతెల్‌ను ఆర్సీబీ గతేడాది మెగా వేలంలో రూ.2.6 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. బేతెల్ మిడిలార్డర్‌లో విధ్వంకర బ్యాటింగ్ చేయడంతో పాటు ఉపయోగకరమైన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. బేతెల్ ఇప్పటివరకు 63 టీ20లు ఆడి 136.77 స్ట్రయిక్‌రేట్‌తో 1127 పరుగులు చేశాడు.
గతేడాది చివర్లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసిన బేతెల్ 3 టెస్ట్‌లు, 9 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. బేతెల్ టెస్ట్‌ల్లో 3, వన్డేల్లో 2, టీ20ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. బేతెల్ మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 674 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు.
21 ఏళ్ల బేతెల్‌కు ఇది తొలి ఐపీఎల్ అవుతుంది. ఆర్సీబీ.. మార్చి 22న కోల్‌కతాలో జరిగే లీగ్ ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో తలపడుతుంది. ఈ ఏడాదే ఆర్సీబీ నూతన కెప్టెన్‌గా మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్ ఎంపికయ్యాడు.
ఈ ఏడాది ఆర్సీబీ జట్టు..
రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్,స్వస్థిక్ చికార, కృనాల్ పాండ్యా, లియామ్ లివింగ్‌స్టోన్, మనోజ్ భాండగే, జేకబ్ బేతెల్, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ షెడ్యూల్
మార్చి 22- కేకేఆర్‌తో
మార్చి 28- సీఎస్‌కే
ఏప్రిల్ 2- గుజరాత్
ఏప్రిల్ 7- ముంబై
ఏప్రిల్ 10- ఢిల్లీ
ఏప్రిల్ 13- రాజస్థాన్
ఏప్రిల్ 18- పంజాబ్
ఏప్రిల్ 20- పంజాబ్
ఏప్రిల్ 24- రాజస్థాన్
ఏప్రిల్ 27- ఢిల్లీ
మే 3- సీఎస్‌కే
మే 9- లక్నో
మే 13- సన్‌రైజర్స్
మే 17- కేకేఆర్
Comments
Please login to add a commentAdd a comment