
Breadcrumb
IPL 2022 KKR Vs MI Updates: కమిన్స్ విధ్వంసం.. ముంబైకి తప్పని పరాభవం
Published Wed, Apr 6 2022 7:02 PM | Last Updated on Wed, Apr 6 2022 11:07 PM

Live Updates
IPL 2022: కేకేఆర్ వర్సెస్ ముంబై ఇండియన్స్ లైవ్ అప్డేట్స్
కమిన్స్ విధ్వంసం.. ముంబైకి తప్పని పరాభవం
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. పాట్ కమిన్స్(15 బంతుల్లో 56, 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడడంతో 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. వెంకటేశ్ అయ్యర్ 50 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో మురుగన్ అశ్విన్, టైమల్ మిల్స్ చెరో రెండు వికెట్లు తీయగా.. డేనియల్ సామ్స్ ఒక వికెట్ తీశాడు. కాగా ముంబైకి ఇది వరుసగా మూడో పరాజయం కావడం విశేషం.
డేంజర్ మ్యాన్ రసెల్(11) ఔట్.. ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్
కేకేఆర్ డేంజర్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ 11 పరుగులు చేసి టైమల్ మిల్స్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 49, కమిన్స్ 11 పరుగులతో ఆడుతున్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్
8 పరుగులు చేసిన నితీష్ రాణా మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో డేనియల్ సామ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకముందు సామ్ బిల్లింగ్స్(17) రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో బాసిల్ తంపికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 4 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 39 పరుగులతో ఆడుతున్నాడు.
రెండు వికెట్లు కోల్పోయిన కేకేఆర్..
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. ముందుగా రహానే(7) రూపంలో తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ ఆ తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(10) డేనియల్ సామ్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 24, సామ్ బిల్లింగ్స్ 9 పరుగులతో ఆడుతున్నారు.
ముంబై ఇండియన్స్ 161/4.. కేకేఆర్ టార్గెట్ 162
కేకేఆర్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 52 పరుగులతో మెరవగా.. తిలక్ వర్మ 38 పరుగులు నాటౌట్ మరోసారి ఆకట్టుకున్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ 29 పరుగులు సాధించగా.. చివర్లో పొలార్డ్ (5 బంతుల్లో 22, మూడు సిక్సర్లు) అలరించాడు. కేకేఆర్ బౌలర్లలో కమిన్స్ 2, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెరొక వికెట్ తీశారు.
సూర్యకుమార్ ఫిప్టీ.. ముంబై 134/3
ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ అర్థ శతకంతో మెరిశాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్థసెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది.
17 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 115/3
17 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ మూడు వికెట్ల నష్టానికి 1152 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 36, తిలక్ వర్మ 32 పరుగులతో ఆడుతున్నారు.
ఇషాన్ కిషన్ (14)ఔట్.. ముంబై ఇండియన్స్ 60/3
పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(14) శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఐపీఎల్లో గత నాలుగు మ్యాచ్‌ల్లో ఇషాన్ కిషన్ కమిన్స్‌కు చిక్కడం ఇది మూడోసారి. ప్రస్తుతం ముంబై 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. సూర్యకుమార్ 10, తిలక్ వర్మ 3 పరుగులతో ఆడుతున్నారు.
డెవాల్డ్ బ్రెవిస్(29) ఔట్.. రెండో వికెట్ డౌన్
ఐపీఎల్లో డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న డెవాల్డ్ బ్రెవిస్(29) స్టంప్ ఔట్‌గా వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చేశాడు. ఇది గమనించిన సామ్ బిల్లింగ్స్ వేగంగా వికెట్లను గిరాటేశాడు. ప్రస్తుతం ముంబై 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(3) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన ముంబై ఇండియన్స్
కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. మూడు పరుగులు చేసిన రోహిత్.. ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో సామ్ బిల్లింగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం కేకేఆర్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై ఒత్తిడిలో ఉండగా.. అటు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచి.. ఒక మ్యాచ్ ఓడిపోయి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.
ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు జరగ్గా.. కేకేఆర్ ఏడుసార్లు నెగ్గగా.. ముంబై 22సార్లు విజయాలు సాధించడం విశేషం.
Related News By Category
Related News By Tags
-
'ఏం చేయాలో తెలియని స్థితి.. చివరకు సీఈవో జోక్యం'
ఐపీఎల్ 2022లో సోమవారం ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ 52 పరుగుల సూపర్ విక్టరీ సాధించింది. తద్వారా తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉన్న సమయంలో కేకేఆర...
-
థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం
ఐపీఎల్ 2022 సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం మరోసారి ఒక బ్యాట్స్‌మన్ కొంపముంచింది. ఇప్పటికే ఈ సీజన్లో థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయాలకు ఆటగాళ్లు బలయ్యారు. కోహ్లి ఎల్బీ వివాదం ఎంత పెద్ద రచ్చగ...
-
రోహిత్ శర్మ ఆడడం మరిచిపోయావా .. ఏమైంది నీకు!
ఐపీఎల్‌లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మకు పేరుంది. కెప్టెన్‌గానే గాక బ్యాట్స్‌మన్‌గాను హిట్‌మాన్‌కు మంచి రికార్డు ఉంది. కానీ ఎందుకో రోహిత్ ఈ సీజన్లో యథేచ్చగా బ్యాట్‌ను ఝులుపించలేకపోతు...
-
ఆ అమ్మాయి కోసం చాలా ఎదురుచూశాను.. శ్రేయస్ అయ్యర్
ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ హోస్ట్ చేసిన ద గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో హిట్మ్య...
-
ముంబై ఇండియన్స్‌పై ఎస్ఆర్హెచ్ విజయం