Neeraj Chopra: అదే కసి.. అదే తపన.. ఫొటో వైరల్‌ | Neeraj Chopra Return Training With Same Hunger Desire Pic Goes Viral | Sakshi

Neeraj Chopra: అదే కసి.. అదే తపన.. ఫొటో వైరల్‌

Published Thu, Oct 21 2021 4:12 PM | Last Updated on Thu, Oct 21 2021 4:22 PM

Neeraj Chopra Return Training With Same Hunger Desire Pic Goes Viral - Sakshi

Neeraj Chopra

Neeraj Chopra Photo Goes Viral: ‘‘ఇంతకు ముందున్న... అదే తపన.. అదే కసితో ఈ వారం నుంచి శిక్షణ మొదలుపెట్టేశాను. గత ఒలింపిక్‌ పతకం సాధించేందుకు శిక్షణ పొందిన చోటే మరోసారి శిక్షణ పొందడం మంచి విషయం! మీ సందేశాలతో నాకు మద్దతుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఉద్వేగభరిత పోస్ట్‌ చేశాడు. బల్లెం చేతబట్టి పట్టి ప్రాక్టీసు ప్రారంభించినట్లు వెల్లడించాడు. కాగా హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా.. టోక్యో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే. 

తద్వారా భారత్‌కు తొలి పసిడి అందించిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌గా అతడు చరిత్రకెక్కాడు. ఇక ఆగష్టు 7 నాటి నీరజ్‌ గెలుపును కళ్లారా చూసి భారతావని గుండెలు గర్వంతో ఉప్పొంగాయి. అయితే, నీరజ్‌ చోప్రా మాత్రం...  విజయాన్ని ఆస్వాదిస్తూ కూర్చోకుండా వెంటనే పని ప్రారంభిస్తానన్న తన మాటలు నిజం చేస్తూ మళ్లీ బల్లెం పట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు అతడిని మరోసారి అభినందిస్తూ ఆల్‌ ది బెస్ట్‌ చెబుతున్నారు. 

చదవండి: T20 WC 2021 IND Vs PAK: ఆ మూడు స్థానాలు పెద్ద తలనొప్పి


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement