
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను మరింత పటిష్టం చేసుకున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో గిల్ 817 రేటింగ్ పాయింట్లతో ‘టాప్’ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గిల్ ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్‌పై అజేయ సెంచరీ (101 నాటౌట్) చేసిన ఈ పంజాబ్ బ్యాటర్ పాకిస్తాన్‌తో జరిగిన పోరులో 46 పరుగులు సాధించాడు. దాంతో గిల్ ఖాతాలో 21 రేటింగ్ పాయింట్లు చేరాయి.
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజమ్ 770 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. గిల్, బాబర్ ఆజమ్ మధ్య 47 పాయింట్ల వ్యత్యాసం ఉంది. భారత కెపె్టన్ రోహిత్ శర్మ (757 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఎలాంటి మార్పు లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ చేసిన భారత స్టార్ విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్‌లో నిలిచాడు.
భారత్‌కే చెందిన శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంక్‌లో, కేఎల్ రాహుల్ 15వ ర్యాంక్‌లో ఉన్నారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడో ర్యాంక్‌లో నిలిచాడు.