
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ పట్టు బిగించింది. కివీస్ బౌలర్ల దాటికి లంక తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. తద్వారా కివీస్‌కు 416 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. దీంతో లంకను ఫాలోఆన్ ఆడించడానికే కివీస్ మొగ్గుచూపింది. లంక ఓటమి నుంచి తప్పించుకోవడం కష్టమే. ఫాలోఆన్ ఆడుతున్న లంక ప్రస్తుతం వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. కరుణరత్నే 21, కుషాల్ మెండిస్ క్రీజులో ఉన్నారు.
రెండు వికెట్ల నష్టానికి 26 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన లంక ఇన్నింగ్స్ ముగియడానికి పెద్దగా సమయం పట్టలేదు. 66.5 ఓవర్ల పాటు ఆడిన లంక 164 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ కరుణరత్నే 89 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. చండిమల్ 37 పరుగులు మినహా మిగతావారంతా విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, మైకెల్ బ్రాస్‌వెల్ చెరో మూడు వికెట్లు తీయగా.. సౌథీ, టింక్నర్, బ్రాస్‌వెల్‌లు తలా ఒక వికెట్ తీశారు.
అంతకముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 580 పరుగులు వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. కేన్ విలియమ్సన్(215 పరుగులు), హెన్రీ నికోల్స్(200 పరుగులు) డబుల్ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేసింది. నాలుగో రోజు ఉదయం సెషన్‌లోగా మ్యాచ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది.
చదవండి: విండీస్ ఘన విజయం; కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు
New Zealand vs Sri Lanka 2nd Test: విలియమ్సన్, నికోల్స్ ‘డబుల్’ సెంచరీలు