
విరాట్ కోహ్లి.. గత కొన్ని రోజుల నుంచి క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. విరాట్‌కు ఏమైంది..? ఎక్కడ ఉన్నాడు? అన్న ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే కోహ్లి తాజా పోస్టుతో ఈ ప్రశ్నలకు తెరపడింది. కింగ్ కోహ్లి రెండో సారి తండ్రయ్యాడు.
అతడి భార్య అనుష్క శర్మ ఫిబ్రవరి 15న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కొడుకుకు అకాయ్‌గా పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని విరుష్క జోడీ కాస్త ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అయితే అభిమానులు ఓవైపు శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరోవైపు కోహ్లి రీ ఎంట్రీపై చర్చ మొదలెట్టేశారు.
కోహ్లి రీ ఎంట్రీ డౌటే..
ఇక విరాట్ సతీమణి అనుష్క అనారోగ్య సమస్యలతో రెండో బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అనుష్క ప్రెగ్నెన్సీలో సమస్యలు ఉన్నాయని, అందుకే లండన్‌కు తీసుకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అనుష్కకు తోడుగా కోహ్లి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో ఇంగ్లండ్ సిరీస్ మొత్తానికి దూరమైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే మరి కొంత కాలం పాటు విరాట్ ఫ్యామిలీ లండన్‌లో ఉండనున్నట్లు సమాచారం. దీంతో కోహ్లి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడు సైతం వారితో పాటు కొద్ది రోజులు లండన్‌లోనే నిర్ణయించుకున్నట్లు వినికిడి. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్ ఫస్ట్‌హాఫ్‌కు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
ఈ విషయంపై ఇప్పటివరకు అయితే ఆర్సీబీ ఫ్రాంఛైజీ నుంచి గానీ కోహ్లి నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన వెలవడలేదు. కాగా ఐపీఎల్-17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: Virat Kohli- Akaay: కోహ్లి కొడుకుకి బ్రిటన్ పౌరసత్వం?!.. అందుకే లండన్‌లో..?