
రైతుకు తీరని అన్యాయం
రబీ పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయినా జిల్లాకు చెందిన రెండు మండలాలనే కరువు జాబితాలో చేర్చడం అన్యాయం. ఈ ప్రభుత్వానికి రైతులపై కరుణ కలగలేదు. పంట నష్టాన్ని అంచనా వేయడంలో శాసీ్త్రయత లోపించింది. కూటమి సర్కార్ ఇంతవరకూ రైతులకు ఎలాంటి సాయం అందించలేదు. ఎన్నికల హామీలైన అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.20 వేలు అందజేయలేదు. ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలపై రైతాంగాన్ని సమీకరించి ఉద్యమిస్తాం.
– అడపాల వేమనారాయణ, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, పుట్టపర్తి