
నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు.
సాక్షి, వరంగల్: నగరంలో మరో కీచక లెక్చరర్ నిర్వాకం బయటపడింది. కొత్తవాడలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు. బైపీసీ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని పట్ల లెక్చరర్ రమేష్ అసభ్యంగా ప్రవర్తించాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
యాజమాన్యానికి సమాచారం అందించిన పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం.. రమేష్‌ను కావాలనే తప్పిస్తున్నారని బంధువులు మండిపడుతున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.