
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహమ్మారి కరోనా వైరస్ విజృంభణ తగ్గుముఖం పట్టింది. కొత్తగా సోమవారం 1,511 కరోనా కేసులు నమోదు కాగా కోవిడ్ కారణంగా 12 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,175 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 20,461 ఉన్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,10,681 కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 173 కేసులు నమోదయ్యాయి.