
తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భానుడి భగభగల నుంచి కాస్త ఊరట లభించనుంది. తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణం కేంద్రం తెలిపింది.
ఇక..వర్ష ప్రభావంతో ఏప్రిల్ 2, 3 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. కొన్నాళ్ల కిందట అకాల వర్షాలతో తెలంగాణ వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే.