ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. విజయవాడలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన గవర్నర్తో ముఖ్యమంత్రి సుమారు రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిపారు. హైదరాబాద్లో ఏపీ సచివాలయం అప్పగింతపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. గవర్నర్ భేటీలో హైదరాబాద్ లో ఏపీ సచివాలయం భవనాలను తెలంగాణ రాష్ట్రానికి అప్పగించేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.