పార్టీ ఫిరాయింపుల అంశంపై సోమవారం శాసనసభ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి అధికార టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ సభలో మాట్లాడే అంశం రచ్చకు దారి తీసింది. అసలు అజయ్ ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారో స్పష్టం చేయా లంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగగా.. దానిని సమర్థించుకునేందుకు మంత్రులు కడియం, కేటీఆర్ ఎదురుదాడికి ప్రయత్నించారు. అటు తన విచక్షణా ధికా రంతో అవకాశమిచ్చానన్న స్పీకర్ మధుసూదనాచారి వాదనను కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. స్పీకర్ ఫిరాయిం పులను ప్రోత్సహిస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేశారు.