అంతర్జాతీయ ఉగ్రవాదానికి పాకిస్తాన్ పుట్టినిల్లని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉగ్రవాదాన్ని, దీనికి పూర్తి మద్దతిస్తున్న వారిని ఎదుర్కొనేందుకు అన్నిదేశాలు సమగ్ర, సంయుక్త కార్యాచరణతో ముందుకెళ్లాలని బ్రిక్స్ సదస్సులో కోరారు. రష్యా, చైనా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, జీ జిన్పింగ్తోపాటు బ్రెజిల్, దక్షిణాఫ్రికాల దేశాధినేతలతో ఆదివారమిక్కడ జరిగిన బ్రిక్స్ సదస్సులో పాకిస్తాన్ పేరును ఉచ్ఛరించకుండానే.. తీవ్రవిమర్శలు చేశారు. ‘ఉగ్రవాదానికి రక్షణ కల్పిస్తూనే.. రాజకీయ అవసరాలకోసం ఉగ్రవాదానికి మద్దతివ్వటాన్ని సమర్థించుకుంటున్నారు.