టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి...టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బెయిల్ షరతుల సడలింపులతో హైదరాబాద్ వచ్చిన ఆయన బుధవారం ఎల్బీ నగర్లో మాట్లాడుతూ...' టీడీపీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ కమిషనర్ తొలగిస్తున్నారు. ఆయన కమిషనర్గా కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. మేం పిలుపునిస్తే ఒక్కే ఒక్క గంటలో హైదరాబాద్లో టీఆర్ఎస్ జెండాలనేవి లేకుండా చేస్తాం. ఆ సత్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది