జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో5 గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చి చంపాయి. కజిగూండ్‌లోని చౌగమ్ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఈ ఏరియాలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.