ముఖంపై చిరునవ్వుతో కరచాలనం చేస్తూ శత్రు దేశాధినేతను ఆత్మీయంగా పలకరించారు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. శుక్రవారం ఇరుదేశాల మధ్య గల శాంతి గ్రామం పాన్‌మున్‌జోమ్‌లో కిమ్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌ను కలుసుకున్నారు.అంతకుముందు ఇరు దేశాల సరిహద్దుల్లో నేతలు నిల్చున్నారు. మూన్‌ను ఉత్తరకొరియాలోకి రావాలంటూ కిమ్ ఆహ్వానించారు. అనంతరం మూన్‌తో కలసి కిమ్ దక్షిణ కొరియాలో అడుగుపెట్టారు. 1953-54ల మధ్య కొరియా యుద్ధం అనంతరం ఓ ఉత్తరకొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి.