రాష్ట్ర ప్రయోజనాల కోసమే మమల్నిరాజీనామ చేయాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మాజీ ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షలో మిథున్ రెడ్డి మాట్లాడారు.