అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఈ నెల 22న ఉదయం 11 గంటలకు జెడ్పీ సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఖాళీ ఏర్పడిన జెడ్పీ చైర్మన్ పదవికి 22వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు. చైర్మన్ ఎన్నిక కోసం 18వ తేదీలోగా ఫారం–9 ద్వారా జెడ్పీ సభ్యులకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు నోటీసు పంపాలని, అనివార్య కారణాల వల్ల 22వ తేదీన చైర్మన్ ఎన్నిక జరగకపోతే 23న నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిదని కలెక్టర్ పేర్కొన్నారు.