Middle East Conflict
-
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..
ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఏమిటీ వివాదం?ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది.అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలుపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.తగ్గుతున్న రాయితీలుమరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్‌తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
ట్రంప్ పాచిక పారేనా?
పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నుంచి సులభంగా నిష్క్రమించగలరా? అనే ప్రశ్న వస్తోంది. ఈ అనిశ్చితుల నేపథ్యంలో చాలా కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్లు విలువ పరంగా ఇటీవల కొంత ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భౌగోళిక రాజకీయ పరిణామాలు మాత్రం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి.వ్యూహాత్మక ఆధిపత్యం: ఇరాన్ ఎందుకు కీలకం?గత కొంతకాలంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి గాజా, సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో తమ వ్యతిరేక శక్తులను క్రమపద్ధతిలో బలహీనపరుస్తూ వస్తున్నాయి. గల్ఫ్ దేశాలు పాలస్తీనాకు సానుభూతి తెలుపుతున్నట్లు కనిపిస్తున్నా లోలోపల అమెరికా రక్షణ గొడుగు కిందకే చేరుతున్నాయి. గల్ఫ్ దేశాల సంపద అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడిగా మారుతూ యూఎస్ ఆర్థిక ఆధిపత్యాన్ని బలపరుస్తోంది.అయితే, ఈ పూర్తిస్థాయి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది ఇరాన్, దాని ప్రాక్సీలు (హిజ్బుల్లా, హౌతీలు). హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం ద్వారా చైనా వంటి ఆసియా దేశాల ఇంధన సరఫరాను నియంత్రించే ‘ట్రంప్ కార్డ్’ అమెరికాకు ఇక్కడే దొరుకుతుంది. అందుకే ఈ దశలో యుద్ధం నుంచి వైదొలగడం అంటే ఇరాన్ సామీప్య శక్తులకు తలవంచడమే అవుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. అమెరికా చర్యలను ఇరాన్ ప్రతిఘటిస్తుండడం అగ్రరాజ్యానికి మింగుడుపడడం లేదు. దాంతో యూఎస్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఇరాన్‌లోని మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. అందుకు తప్పకుండా ప్రతికారం తీర్చుకుంటామని ఇరాన్ చెప్పింది.ఆర్థిక సంక్షోభంఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బదీస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మాజీ ఆర్థికవేత్త కెన్నెత్ రోగోఫ్ హెచ్చరించినట్లుగా, ఐదు దశాబ్దాల్లో ప్రపంచం చూడని అతిపెద్ద స్టాగ్ఫ్లేషనరీ ముప్పు (ఆర్థిక మందగమనం + అధిక ద్రవ్యోల్బణం) దిశగా ఈ యుద్ధం దారితీస్తోంది. మార్చి నెల జేపీ మోర్గాన్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ ప్రకారం, ఇన్పుట్ ధరల ద్రవ్యోల్బణం 44 నెలల గరిష్టానికి చేరింది. ఇది వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు చల్లింది. భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం, చమురు, ఎరువుల సరఫరాలో అంతరాయం, లాజిస్టిక్స్ ఖర్చులు పెరగడం, గల్ఫ్ నుంచి వచ్చే రెమిటెన్స్‌లు తగ్గడం వంటి అంశాలు రూపాయి విలువను మరింత పాతాళానికి నెట్టే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రతిచర్యగా ఆర్బీఐ ఇటీవల కొన్ని చర్యలు తీసుకుంది.భారత మార్కెట్లు - రంగాల వారీ విశ్లేషణవిమానయానం, ఆటోమొబైల్, నిర్మాణ రంగాలు పెరిగిన ఇంధన, ముడిసరుకు ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి.రక్షణ రంగం కొత్త పుంతలు తొక్కనుంది. యుద్ధతంత్రంలో మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునే భారతీయ రక్షణ కంపెనీలకు ఇది కలిసొచ్చే అంశం.రసాయన, సిరామిక్ రంగాల్లో కొన్ని బలహీనమైన సంస్థలు నిష్క్రమించి, పటిష్టమైన కంపెనీలకు మార్కెట్ వాటా పెరిగే అవకాశం ఉంది.ట్రంప్ ఏం చేయబోతున్నారు?ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎంత దారుణంగా నిర్వహించినా చివరకు తనే గెలిచినట్లు ప్రకటించుకుని వైదొలిగే అవకాశం ఉంది. ఆయనకు ఓటమిని అంగీకరించే అలవాటు లేదు. యుద్ధం ముగిసినా దాని వల్ల కలిగే ఆర్థిక పర్యవసానాలు మాత్రం దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో పెట్టుబడిదారులు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి ఉత్తమం.ఇదీ చదవండి: వైద్యరంగానికి ‘సహకారి’ కరవు -
లీటర్ పెట్రోల్ రూ. 458.. పాకిస్తానీలు చెప్పినట్లు వినాల్సిందే!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిపై ఆ దేశ ప్రజలు భగ్గుమంటున్నారు. ‘‘మరీ ఇంతకు దిగజారాలా? కాస్తైనా సిగ్గుపడు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా చివాట్లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ (USA- Israel)పై దాడులు.. అందుకు ప్రతిగా ఇరాన్ స్పందిస్తున్న తీరుతో పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసి వేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలపై ప్రభావం పడింది.లీటర్ పెట్రోల్ ధర రూ. 458ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ (Petrol- Diesel Price Hike) ధరలు భారీ ఎత్తున పెరిగాయి. తాజాగా మరోసారి పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. దీంతో పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ ధర 458 రూపాయలకు (స్థానిక కరెన్సీ) చేరగా.. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 520.35కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యానే ఇంధన ధరలు ఈ స్థాయిలో పెంచక తప్పలేదని పాకిస్తాన్ పెట్రోలియం శాఖా మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. మరోవైపు.. నెలరోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 50 శాతానికి పైగా పెరగడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు.మన పరిస్థితి మెరుగ్గా ఉందిఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. ఇందులో పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దతుగా ఆఫ్రిది మాట్లాడటం విమర్శలకు దారితీసింది. ‘‘స్నేహితులకు నమస్కారం. నేను షాహిద్ ఆఫ్రిది. ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొన్న తరుణంలో పాకిస్తాన్‌పై కూడా ప్రభావం పడింది. అయితే, చాలా దేశాల కంటే మన పరిస్థితి మెరుగ్గా ఉంది. ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలిఇలాంటి సమయంలో ప్రభుత్వానికి మనమంతా అండగా ఉండాలి. పాకిస్తానీలంతా ప్రభుత్వం చెప్పినట్లే నడుచుకోవాలి. దేశ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి’’ అని ఆఫ్రిది పేర్కొన్నాడు. దీంతో.. ‘‘నీలాంటి సోకాల్డ్ సెలబ్రిటీలకు సామాన్య ప్రజల బాధలు పట్టవు. ఇలా మాట్లాడానికి ప్రభుత్వం నుంచి ఎంత తీసుకున్నావు?’’ అంటూ నెటిజన్లు ఆఫ్రిదికి చురకలు అంటిస్తున్నారు.చదవండి: ముంబై ఇండియన్స్‌కు శుభవార్త -
వంతెనలు.. అభివృద్ధికి వారధులు
పశ్చిమాసియాలో భీకరపోరు కొనసాగుతోంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను, పశ్చిమ నగరమైన కరాజ్‌తో అనుసంధానిస్తూ సుమారు 136 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న అద్భుత ఇంజినీరింగ్ కట్టడంపై అమెరికా తాజాగా జరిపిన దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేవలం రెండు దేశాల మధ్య ఘర్షణగానే కాకుండా ఒక దేశ ఆర్థిక వెన్నెముకపై దెబ్బకొట్టే వ్యూహంగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.ఆర్థికాభివృద్ధికి వంతెనలే ప్రాణాధారంఏ దేశానికైనా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నప్పుడే ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుంది. వంతెనలు ఇరు ప్రాంతాలను కలపడంతోపాటు చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. వీటి వల్ల..ప్రయాణ దూరాన్ని తగ్గించడం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి.పారిశ్రామిక హబ్‌లను నౌకాశ్రయాలతో లేదా మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా ఎగుమతులు పెరుగుతాయి.భారీ వంతెనల నిర్మాణం వల్ల వేల సంఖ్యలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుంది.సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలను, సామగ్రిని వేగంగా తరలించడానికి వంతెనలు కీలకం.దేశ ప్రగతికి నిదర్శనాలుభారతదేశం కూడా గత దశాబ్ద కాలంలో అద్భుతమైన వంతెనలను నిర్మించి తన ఆర్థిక శక్తిని చాటుకుంది.అటల్ సేతు: ముంబై - నవీ ముంబైలను కలిపే ఈ వంతెన దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ఇది పారిశ్రామిక కారిడార్లకు ఊపిరిపోస్తోంది.చీనాబ్ వంతెన: జమ్మూ కాశ్మీర్లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన. ఇది వ్యూహాత్మకంగా, పర్యాటక పరంగా భారత్‌కు ఎంతో కీలకం.ధోలా-సాదియా వంతెన: అసోం, అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెన ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులనే మార్చివేసింది.నెక్ట్స్ ‘కింగ్ ఫహాద్ కాజ్వే’?ఇరాన్ వంతెనపై దాడి నేపథ్యంలో కింగ్ ఫహాద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్‌తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ఈస్ట్లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు పెరిగితే ఇరాన్ తన ప్రతీకార చర్యల్లో భాగంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవచ్చనే ఆందోళన నెలకొంది. ఒకవేళ కింగ్ ఫహాద్ కాజ్వే వంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.ఇదీ చదవండి: మందుబాబులకు ‘పెగ్గు’ మరింత ఖరీదు! -
అమెరికా దాడులు.. ఇరాన్లో కూలిన అతి పెద్ద వంతెన
పశ్చిమాసియాలో యుద్ధం కల్లోలం సృష్టిస్తోంది. ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామని.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా దాడులు తీవ్రతరం చేసింది. తాజాగా ఇరాన్లో అతి పెద్ద వంతెనపై అమెరికా దళాలు దాడులు చేశాయి.ఇరాన్‌ను రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామంటూ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటలకే.. మధ్యప్రాచ్యంలోనే అత్యంత ఎత్తైన వంతెనను అమెరికా దళాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో 8 మంది మృతి చెందగా.. 90 మందికిపైగా గాయపడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది.దాడి జరిగిన ప్రాంతంలో భారీ పొగ అలుముకుంది. వంతెన కూలిపోవడాన్ని చూపే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వంతెనపై దాడి చేసిన తర్వాత ఇరాన్‌పై మరిన్ని దాడులు జరగబోతున్నాయంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను పశ్చిమ నగరం కరాజ్‌తో అనుసంధానించేలా నిర్మితమవుతున్న ఈ వంతెన 136 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది.దాడికి సంబంధించిన దృశ్యాలను ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. ఇరాన్‌లోని అతిపెద్ద వంతెన కుప్పకూలింది. ఇది ఇకపై ఎప్పటికీ ఉపయోగపడదు. మున్ముందు ఇంకా చాలా ఉన్నాయి’’ అంటూ పేర్కొన్నారు. సమయం మించిపోకముందే ఇరాన్ ఓ ఒప్పందానికి రావాలని ఆయన హెచ్చరించారు.అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంలో తామే విజయం సాధించామని చెప్పుకుంటున్న ట్రంప్.. అమెరికా సైనిక చర్య టెహ్రాన్ సైనిక సామర్థ్యాన్ని ధ్వంసం చేసిందన్నారు. రాబోయే 2-3 వారాల పాటు ఇరాన్‌పై అత్యంత కఠినంగా దాడులు కొనసాగుతాయని ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై కూడా దాడులు చేస్తామని ఆయన మరోసారి బెదిరింపులకు దిగారు. మన శత్రువులు ఓడిపోతున్నారు. గత ఐదేళ్లుగా నా అధ్యక్షతన అమెరికా సాధించిన విజయాల కంటే ఇప్పుడు మరింత భారీ విజయాన్ని నమోదు చేస్తోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఆ ప్రమాదం పొంచి ఉంది.. ఐరాస హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులను ఆపాలంటూ ఆయన పిలుపునిచ్చారు.'నాయకులు విధ్వంసం కంటే చర్చలకే మొగ్గు చూపినప్పుడు యుద్ధాలు ముగుస్తాయన్న ఐరాస చీఫ్.. తాను సంబంధిత పక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని.. ఈ ప్రయత్నాలకు మద్దతుగా తన వ్యక్తిగత రాయబారి జీన్ ఆర్నాల్ట్‌ను ఈ ప్రాంతానికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. దాడులను ఖండించడమే కాకుండా.. హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నౌకాయాన హక్కులు, స్వేచ్ఛను గౌరవించాల్సిన అవసరాన్ని ఆంటోనియో పునరుద్ఘాటించారు.నౌకాయాన స్వేచ్ఛను నిరాకరించడం వల్ల ఫిలిప్పీన్స్ నుంచి శ్రీలంక, మొజాంబిక్ వరకు ఉన్న ప్రపంచంలోని నిరుపేదలు ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన హెచ్చరించారు. మధ్యప్రాచ్య సంక్షోభం నియంత్రణ తప్పుతోందని.. ఇది మొత్తం ప్రాంతాన్ని కమ్మేసే విస్తృత యుద్ధంగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు, రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్‌పై భీకర స్థాయిలో దాడులకు దిగబోతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లో యుద్ధం ముగిసిపోవచ్చని సంకేతాలిచ్చిన ట్రంప్.. శత్రువును ఈసారి గట్టిగా దెబ్బ కొడతామన్నారు. వారిని(ఇరాన్) రాతియుగంలోకి తిరిగి తీసుకెళ్తామని, ఎందుకంటే వారు ఆ యుగానికి చెందినవారేనని వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై యుద్ధంలో తమ జవాన్లు సైతం మరణిస్తున్నారని.. అయినప్పటికీ వెనక్కి తగ్గబోమని, చేయాల్సిన పనిని చాలా వేగంగా, కచ్చితంగా పూర్తి చేస్తామన్నారు. లక్ష్యానికి చాలా చేరువలోకి వచ్చేశామని ఉద్ఘాటించారు. -
శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుంది: ఇరాన్
టెహ్రాన్: వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ సైన్యం తీవ్రస్థాయిలో బదులిచ్చింది. శత్రువు లొంగిపోయే వరకు యుద్ధం కొనసాగుతుందని ఇరాన్ మిలిటరీ ఆపరేషనల్ కమాండ్ ఖతమ్ అల్ అన్బియా ప్రకటించింది. ఇరాన్‌ను అణిచివేసి.. రాతి యుగం నాటికి పంపుతానన్న ట్రంప్ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. భారీ స్థాయిలో దాడులు చేస్తామని అమెరికా, ఇజ్రాయెల్లను ఇరాన్ హెచ్చరించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ వెల్లడించింది.ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, సామర్థ్యాలను దెబ్బతీశామన్న అమెరికా వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ సైనిక శక్తిపై అమెరికా వద్ద ఉన్న సమాచారం అసంపూర్ణంగా పేర్కొంది. టెహ్రాన్ క్షిపణి, డ్రోన్ దాడి సామర్థ్యాలను భారీగా తగ్గించామన్న ట్రంప్ వాదనలను కొట్టిపారేస్తూ.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యూహాత్మక సామర్థ్యాల గురించి వాషింగ్టన్కు ఏమీ తెలియదంటూ ఖాతమ్ అల్-అన్బియా ప్రతినిధి పేర్కొన్నారు."మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర శ్రేణి దాడి డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలను నాశనం చేశామని అనుకోవద్దు. అటువంటి అంచనాలు మీరు చిక్కుకున్న ఊబిని మరింత లోతుగా చేస్తాయి. మీరు దెబ్బతీశామని భావిస్తున్న ప్రాంతాలు చాలా స్వల్పమైనవి. మా వ్యూహాత్మక సైనిక ఉత్పత్తి మీకు తెలియని.. మీరు చేరుకోలేని రహస్య ప్రాంతాల్లో జరుగుతోంది’’ అని ఇరాన్ పేర్కొంది. అమెరికా దురాక్రమణకు దిగిందని ఆరోపిస్తూ.. ప్రతీకార చర్యలు కొనసాగుతాయి. ఈ యుద్ధం అమెరికా లొంగిపోయే వరకు ఆగిపోదు.. భవిష్యత్తులో మరిన్ని వినాశకరమైన దాడులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ తమ్ అల్-అన్బియా ప్రతినిధి హెచ్చరించారు. -
ఇరాన్లో ఇంకేం సాధించాల్సి ఉంది?: ఆస్ట్రేలియా ప్రధాని
కాన్బెర్రా: ఇరాన్లో సాధించాల్సింది ఇంకేముందంటూ అమెరికాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ప్రశ్నించారు. ‘‘ఇరాన్ సంఘర్షణలో నిర్దేశించుకున్న ప్రాథమిక లక్ష్యాలు నెరవేరాయని.. ఇకపై అక్కడ సాధించాల్సింది ఏముందో స్పష్టంగా తెలియడం లేదు. యుద్ధం ముగింపు ఎలా ఉంటుంది’ అంటూ అల్బనీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, సైనిక పారిశ్రామిక కేంద్రాలు దెబ్బతిన్నాయన్నారు. ఉద్రిక్తతలను తగ్గించాలని అల్బనీస్ పిలుపునిచ్చారు.రాజధాని కాన్బెర్రాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఒకటి మాత్రం స్పష్టం.. ఈ యుద్ధం ఎంత కాలం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంత తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై మరో రెండు మూడు వారాల పాటు అత్యంత కఠినమైన దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నేపథ్యంలో అల్బనీస్ ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా, ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంలోకి తమను ఎవరూ లాగలేరని బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇప్పటికే తేల్చిచెప్పారు. ఈ యుద్ధంలో తాము పాల్గొనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా దౌత్య, రాజకీయ చర్యలపై చర్చించడానికి ఈ వారంలోనే అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నాటోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు.పశ్చిమాసియా యుద్ధం బ్రిటన్ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని స్టార్మర్ చెప్పారు. ఈ తుఫాను ఎంత తీవ్రమైనదైనా, తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నాటో అనేది ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన సైనిక కూటమి అని తెలిపారు. ఈ కూటమి ఎన్నో దశాబ్దాలుగా తమను కాపాడుతోందని వెల్లడించారు. ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆ యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, అందులోకి అడుగుపెట్టబోమని స్టార్మర్ స్పష్టంచేశారు. -
కాల్పుల విరమణ కోరిన ఇరాన్.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాత పాలకుడితో పోలిస్తే కొత్త పాలకుడు కొంత నయం. హర్మూజ్ జలసంధి తెరిస్తే.. కాల్పుల విరమణ పరిశీలిస్తాం. హర్మూజ్ తెరిచే వరకు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తాం. ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం.. వారు అన్నట్లుగానే తిరిగి రాతి యుగానికి పంపిస్తాం’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణ కోరలేదని.. ట్రంప్ చేసిన వాదనను ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తోసిపుచ్చారు. మరోవైపు, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా ప్రజల నుండి కూడా యుద్ధానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో ట్రంప్ ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొంది. యుద్ధాన్ని ముగించాలని నిర్ణయించుకుంటే రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయని ట్రంప్ గతంలో పేర్కొన్నారు. అయితే, హోర్ముజ్ జలసంధి తెరిచే వరకు దాడులు ఆపబోమని తాజాగా హెచ్చరించడం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై సందిగ్ధత నెలకొంది.ఇంటా బయటా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఇరాన్‌పై యుద్ధానికి వీలైనంత త్వరగా తెర దించేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన సన్నిహితులతో ఆయన తాజాగా ఈ మేరకు పేర్కొన్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదించింది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణం తెరవాల్సిందేనని కొన్నాళ్లుగా అధ్యక్షుడు పట్టుబడుతుండటం తెలిసిందే. దాన్ని తెరిచినా, తెరవకపోయినా యుద్ధాన్ని మాత్రం ముగించేస్తానని ఆయన చెబుతున్నట్టు ఆ వార్తా సంస్థ తెలిపింది. -
ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్ ప్రధాని షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ షాక్ ఇచ్చారు. ఎంత ఒత్తిడి చేసినా యుద్ధంలో పాల్గొనే ప్రసక్తేలేదని తేల్చిపారేశారు. తమకు బ్రిటన్ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్న స్టార్మర్.. పశ్చిమాసియా యుద్ధంతో మాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో బ్రిటన్ పూర్తిగా పక్కకు తప్పుకోవడం లేదని కూడా ఆయన సంకేతాలిస్తూ.. హర్మూజ్ సంక్షోభాన్ని నివారించడానికి కావాలంటే మధ్యవర్తిత్వం వహిస్తామని బ్రిటన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్ నేతృత్వంలో 35 దేశాలతో సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇజ్రాయెల్-అమెరికా దాడుల తర్వాత ఇరాన్ ఈ జలసంధిని అడ్డుకుంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఈ రవాణా మార్గానికి ఆటంకం కలగడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని స్టార్మర్ అన్నారు.‘‘నేను ప్రజలతో నిజాయితీగా ఉండాలి, ఇది అంత సులభం కాదని చెబుతూ.. యుద్ధం కారణంగా బ్రిటన్ ప్రజల దైనందిన జీవితంపై పడే ప్రభావాన్ని ఆయన అంగీకరించారు. ఈ సంక్షోభ సమయంలో యూరోపియన్ మిత్రదేశాలతో బలమైన సంబంధాలు కలిగి ఉండటం కేవలం దౌత్యం మాత్రమే కాదని.. అది బ్రిటన్ జాతీయ ప్రయోజనాలకు అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు.మరోవైపు, ఇరాన్‌పై యుద్ధంలో తమతో కలిసి రావడం లేదంటూ నాటో భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ‘మీకు కావాల్సిన చమురును మీరే సమకూర్చుకోండి’ అంటూ సోషల్ మీడియా పోస్టులో వాటిపై ఆక్రోశం వెళ్లగక్కారు. ‘‘మీకోసం మీరు ఎలా పోరాడాలో నేర్చుకోండి. అమెరికా మీకిక ఏ మాత్రమూ సాయం చేయబోదు. మీరూ మాకు సాయానికి రాలేదు కదా! చమురు కావాలంటే మీకు రెండే మార్గాలున్నాయి...మా దగ్గర పుష్కలంగా ఉన్న నిల్వల నుంచి కొనుక్కోవడం. లేదంటే సాహసం చేసి హార్మూజ్ వద్ద ఇరుక్కున్న మీ చమురు నౌకలను విడిపించుకోవడం’’ అంటూ బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు సలహా ఇచ్చారు! ముఖ్యంగా అమెరికా యుద్ధ విమానాలను తన గగనతలం గుండా వెళ్లేందుకు ఫ్రాన్స్ అనుమతించలేదంటూ మండిపడ్డారు. దీన్ని కచ్చితంగా గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. -
బంకర్ బస్టర్లతో దాడి.. సంచలన వీడియో షేర్ చేసిన ట్రంప్
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగుతోంది. తాజాగా.. ఇరాన్లో అణుకేంద్రాలు ఉన్న ఇస్ఫహాన్‌పై అమెరికా విరుచుకుపడింది. ఓ ప్రధాన ఆయుధ నిల్వల డిపోపై బంకర్ బస్టర్లతో దాడి చేసింది. భారీ పేలుళ్లకు సంబధించి ఓ వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున ఇస్ఫహాన్ నగరంలో చోటుచేసుకుంది.ఈ వీడియోలో వరుస పేలుళ్లు సంభవించడం.. ఆ తర్వాత ఆకాశమంతా నారింజ రంగు మంటలతో నిండిపోవడం కనిపిస్తోంది. అయితే, ట్రంప్ ఈ వీడియోకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. అయితే, ఇస్ఫహాన్‌లోని ఆయుధ నిల్వలు ఉన్న డిపోపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల దృశ్యాలేనని మీడియా నివేదికలు చెబుతున్నాయి. సుమారు 23 లక్షల జనాభా కలిగిన ఇస్ఫహాన్ నగరంలో 'బదర్' సైనిక విమానశ్రయం కూడా ఉంది.మరోవైపు, ఇరాన్‌కు ట్రంప్ తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చిన సంగతి తెలిసిందే. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. -
గల్ఫ్ జలాల్లో మళ్లీ మొదలైన డ్రోన్ దాడులు
పశ్చిమాసియాలో రణజ్వాలలను ఉవ్వెత్తున ఎగదోసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం ఇరాన్‌కు తీవ్రస్థాయి హెచ్చరికలతో అల్టిమేటం ఇచ్చారు. అత్యంత శుద్ధ యురేనియం నిల్వలను అప్పగిస్తూ, యుద్ధం నుంచి తప్పుకుంటూ శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్‌ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. -
భారత్ నుంచి భారీగా ఇంధనం వచ్చింది: శ్రీలంక అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ‘పశ్చిమాసియా’ సంక్షోభం వేళ భారత్ నుంచి 38,000 మెట్రిక్ టన్నుల ఇంధనాన్ని అందుకుంది శ్రీలంక. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం.. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాల్లో ఆటంకాలు కలిగించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ తన ‘పొరుగు దేశాల పాలసీ’లో భాగంగా శ్రీలంకకు ఇంధనాన్ని పంపింది. దీంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సానాయకే ఆదివారం (మార్చి 29) భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.“పశ్చిమాసియా ఘర్షణ కారణంగా ఇంధన సరఫరాల విషయంలో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆటంకాల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కొన్ని రోజుల క్రితం మాట్లాడాను. భారత్ త్వరితగతిన సాయం చేసింది.. కృతజ్ఞతలు. నిన్న 38,000 ఎంటీ ఇంధనం కొలంబోకు చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ కోఆర్డినేషన్‌కు కూడా ధన్యవాదాలు” అని దిస్సానాయకే ఎక్స్‌లో పేర్కొన్నారు.ఈ వారం ప్రారంభంలో, అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంపై దిస్సానాయకేతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. “భారత్-శ్రీలంక ఇంధన సహకారాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ భద్రతను పెంచే కీలక కార్యక్రమాల పురోగతిని సమీక్షించాం. సన్నిహిత, విశ్వసనీయ భాగస్వాములుగా ఇరుదేశాలు సవాళ్లను ఎదుర్కోవడంలో కలిసి పనిచేయాలన్న స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని నిర్ణయించాం” అని మోదీ ఎక్స్‌లో తెలిపారు. కాగా, ఈ 38,000 మెట్రిక్ టన్నుల్లో 20,000 ఎంటీ డీజిల్.. 18,000 ఎంటీ పెట్రోల్ ఉన్నాయి.మరోవైపు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో పాక్, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్ విదేశాంగ మంత్రుల భేటీ అయ్యారు. ఇరాన్ యుద్ధంపై వారు చర్చించారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చలు జరుపుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్యవర్తులుగా ఈ నాలుగు దేశాలు ఉన్నాయి. యుద్ధం మరింత విస్తరించకుండా ఆపడం ప్రధాన లక్ష్యం. Spoke with PM @narendramodi a few days ago about the fuel supply disruptions Sri Lanka is facing due to the Middle East conflict. Grateful for India’s swift support. 38,000 MT of fuel arrived in Colombo yesterday. My thanks also to EAM @DrSJaishankar for his close coordination.— Anura Kumara Dissanayake (@anuradisanayake) March 29, 2026 -
సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..
-
‘ఇథనాల్’ ఇంధనమే ఆదుకుంటోంది..
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో.. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడంలో కేంద్ర ప్రభుత్వ 'ఇథనాల్ మిశ్రమ విధానం' (Ethanol Blending Policy) భారత్‌కు రక్షణ కవచంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. శనివారం జేవార్‌లోని నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, దేశ ఇంధన భద్రతలో రైతుల పాత్రను కొనియాడారు.చమురు దిగుమతులకు అడ్డుకట్ట..ముడి చమురు దిగుమతుల కోసం వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఆదా చేయడంలో పశ్చిమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన చెరకు రైతులు కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలిపారు. "ఇథనాల్ మిశ్రమ విధానం లేకపోతే, మనం విదేశాల నుండి అదనంగా 4.5 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. రైతులే మన దేశ విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడారు" అని ఆయన పేర్కొన్నారు.భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40% పశ్చిమాసియా నుండే అందుతోంది. ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ధరలు పెరిగినప్పటికీ, ఇథనాల్ వాడకం వల్ల భారత్ ఆ ప్రభావాన్ని తట్టుకోగలుగుతోందని ప్రధాని వివరించారు.వేగంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ఖరీదైన ముడి చమురు దిగుమతులను తగ్గించడం, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్న భారత ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ మోదీ ప్రభుత్వ హయాంలో వేగం పుంజుకుంది. నిర్ణయించుకున్న 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని, గడువు కంటే ఐదేళ్ల ముందే గత ఏడాది భారత్ సాధించింది.ఈ క్రమంలో గత ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 (20% ఇథనాల్ మిశ్రమం) సరఫరా అవుతోంది. దీంతో ఇదే ఉత్సాహంతో 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దిగుమతి చేసుకున్న ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా భారతత్ గత 10 ఏళ్లలో సుమారు రూ.1.36 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ గతేడాది జూలైలో తెలిపింది. -
యుద్ధంలోకి హౌతీలు.. ఇజ్రాయెల్ పై మిసైల్ దాడులు
-
అమెరికాలో మళ్లీ 'నో కింగ్స్'.. ట్రంప్‌నకు నిరసన సెగ..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు నిరసన సెగ గట్టిగానే తగులుతోంది. ట్రంప్ పరిపాలనా విధానాలను తప్పుబడుతూ.. దేశవ్యాప్తంగా ప్రజలు ‘నో కింగ్స్ (No Kings) నిరసనలు చేపట్టారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా నిరసనలు చేపట్టారు. మిన్నెసోటాలోని కాలిపాట్ లాన్‌కు భారీగా నిరసన కారులు వీధులోకి వచ్చారు.అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాలతో పాటు లండన్, పారిస్, రోమ్ వంటి అంతర్జాతీయ నగరాల్లో కలిపి 3,200 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. గతంలో జరిగిన రెండు 'నో కింగ్స్' ఈవెంట్లకు లక్షలాది మంది హాజరయ్యారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సింగిల్-డే నిరసనగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.గాయకులు బ్రూస్ స్ప్రింగ్స్టీన్, జోన్ బేజ్ మిన్నెసోటా స్టేట్ క్యాపిటల్ వద్ద ర్యాలీకి నాయకత్వం వహించనున్నారు. ఇక్కడ సుమారు లక్ష మంది మంది పాల్గొంటారని అంచనా. మిడ్‌టౌన్ మాన్హాటన్లో వేలాది మంది వీధులోకి చేరుకున్నారు. నటుడు రాబర్ట్ డి నీరో మాట్లాడుతూ.. గతంలో చాలామంది అధ్యక్షులు తమ రాజ్యాంగ పరిమితులను పరీక్షించారు, కానీ మన స్వేచ్ఛకు, భద్రతకు ఇంతటి ముప్పుగా ఎవరూ మారలేదంటూ వ్యాఖ్యానించారు.వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ వద్ద నిరసనకారులు ప్రజాస్వామ్య అనుకూల నినాదాలు చేస్తూ.. ట్రంప్ వ్యతిరేక ప్లకార్డులను ప్రదర్శించారు. మేరీల్యాండ్‌లోని ఒక వృద్ధాశ్రమం బయట చక్రాల కుర్చీల్లో ఉన్న వృద్ధులు కూడా నిరంకుశత్వాన్ని ఎదిరించండి అంటూ బోర్డులతో నిరసన తెలిపారు. ఈ నిరసనలు.. ప్రజల మద్దతు లేని వామపక్షాల ఆధ్వర్యంలో జరిగాయంటూ వైట్ హౌస్ కొట్టిపారేసింది. -
అలా చేస్తేనే.. ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: శాంతి కావాలంటే తాము చెప్పినట్టు వినాల్సిందేనని గల్ప్ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. గల్ఫ్ గగనతలాలను యూఎస్, ఇజ్రాయెల్ వినియోగించుకోకుండా నిషేధం విధించాలని.. తాము చెప్పినట్టు చేస్తేనే గల్ఫ్‌పై దాడులు ఆపుతామంటూ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తేల్చి చెప్పారు. తమ దేశాల్లో అభివృద్ధి, భద్రతను కోరుకుంటే.. ఇరాన్‌పై దాడి చేయడానికి అమెరికా-ఇజ్రాయెల్‌లు తమ భూభాగాలను ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే.. అమెరికా-ఇజ్రాయెల్‌లపై ఇరాన్ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.ఇరాన్ ముందస్తు దాడులు చేయదని మేము చాలాసార్లు చెప్పాం. కానీ మా మౌలిక సదుపాయాలు, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటే మేము గట్టిగా సమాధానం ఇస్తాం. గల్ఫ్ దేశాలకు నేను చెప్పేది ఒక్కటే.. మీకు అభివృద్ధి, భద్రత కావాలంటే మా శత్రువులను మీ గడ్డల నుండి యుద్ధం చేయనివ్వకండి’’ అంటూ పెజెష్కియాన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మరోవైపు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య దుబాయ్‌లోని రెండు అమెరికా సైనిక "దాగుడు స్థావరాలపై తాము దాడి చేసినట్లు ఇరాన్ పేర్కొందని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ఫార్స్ న్యూస్ ఏజెన్సీ' నివేదించింది.మరోవైపు, హార్మూజ్ గుండా వెళ్లే నౌకల నుంచి సుంకం వసూలును ఇరాన్ అధికారికంగా మార్చే పనుల్లో పడింది. ఈ మేరకు త్వరలో పార్లమెంటులో చట్టం తేనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఐరాసకు కూడా ఇప్పటికే వర్తమానం ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే రెండు నౌకలు ఇరాన్‌కు చైనా కరెన్సీలో సుంకం చెల్లించి హార్మూజ్‌ను దాటినట్టు లాయిడ్స్ లిస్ట్ ఇంటలిజెన్స్ సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక ఉగ్రవాదమే తప్ప మరోటి కాదంటూ పలు దేశాలు మండిపడుతున్నాయి. ఇరాన్ తన క్షిపణులపై ‘థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా’అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పైకి ప్రయోగిస్తోంది! ఇందుకు సంబంధించిన విజువల్స్‌ను ఇరాన్ మీడియాతో పాటు ముంబైలోని ఆ దేశ కాన్సులేట్ జనరల్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్పెయిన్, జర్మనీ, పాకిస్తాన్లకు కూడా ఇలాగే ఇరాన్ ధన్యవాదాలు తెలపడం విశేషం! తమ అతి కొద్ది మిత్ర దేశాల్లో భారత్ ఒకటని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పేర్కొనడం తెలిసిందే. -
పశ్చిమాసియా యుద్ధం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని.. దేశాల్లో ధరలు పెరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌లో సంక్షోభ పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్న మోదీ.. సామాన్య ప్రజలు, రైతులపై ప్రభావం పడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నామన్నారు.‘‘నోయిడాలో సెమీ కండక్టర్ ప్లాంట్, ఢిల్లీ మీరట్ మెట్రో రైలు సహా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించుకున్నాం. ఇవన్నీ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రభుత్వానికి నిదర్శనం. జేవర్ ఎయిర్పోర్ట్ ఉత్తర భారతాన్ని ప్రపంచానికి అనుసంధానిస్తుంది. ప్రతి రెండు నిముషాలకు ఒక విమానం ఎగురుతుంది. గత యూపీఏ ప్రభుత్వం యూపీని దోచుకుంది. 2004 నుంచి 2014 వరకు జేవర్ ఎయిర్పోర్ట్ ఫైళ్లకి మాత్రమే పరిమితమైంది. యూపీలో ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం పూర్తయి అందుబాటులోకి కూడా వచ్చింది’’ అని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు.రైతులు పండించే పంటలు, ఉద్యోగులు తయారు చేసే వస్తువులు ప్రపంచ నలుమూలకు చేరుతాయి. అంధ విశ్వాసాలతో నోయిడాను పక్కన పడేశారు. ఎస్పీ హయాంలో ముఖ్యమంత్రి నోయిడా వచ్చే దైర్యం చేయలేదు. నోయిడా ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ.. రైతుల వల్ల నోయిడాలో కొత్త అభివృద్ధి ప్రారంభమవుతుందంటూ తెలిపారు. -
టీమ్ ఇండియాగా సవాళ్లు ఎదుర్కోవాలి.. సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్
-
మనమంతా ‘టీమ్ ఇండియా’గా కలిసి పనిచేద్దాం... ముఖ్యమంత్రులతో భేటీలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
-
ఇరాన్‌కి మద్దుతుగా జేకేఎన్సీ ఎమ్మెల్యేల ఆందోళన
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఇరాన్‌కి మద్దుతుగా నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో జేకేఎన్సీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా జేఎన్ఎన్కే ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ లోపల, బయట కూడా నిరసనలు చేపట్టారు.జేకేఎన్సీ ఎమ్మెల్యే తన్వీర్ సాదిక్ మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇరాన్‌కు అండగా నిలుస్తుందని,.. ఈ దాడులను ఖండించాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గతంలోనే అయతొల్లా అలీ ఖమేనీ హత్యను ఖండించారు. ఇరాన్‌కు మేమంతా అండగా నిలబడ్డామని పేర్కొన్నారు. ఖమేనీ హత్య అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన.. ఒక సార్వభౌమ దేశంపై మరో దేశం ఇలాంటి చర్యలకు పాల్పడకూడదంటూ సాదిక్ నొక్కి చెప్పారు.‘‘అంతకుముందు జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణను ఖండించారు. సైనిక బలంతో పాలన మార్పును సాధించలేమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వాన్ని ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలి.. బాహ్య జోక్యం ఉండకూడదు. ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల హత్యను నేను ఖండిస్తున్నాను. ఇలా చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఏ చట్టం అధికారం ఇచ్చింది’’ అంటూ ఆయన ప్రశ్నించారు.J-K: National Conference MLAs protest in assembly, express solidarity with Iran over killing of Ayatollah Ali KhameneiRead @ANI Story |https://t.co/RphI1lVvvm#JammuKashmirAssembly #Khamenei #protest #NationalConference #JKNC pic.twitter.com/FTZOaZy5ML— ANI Digital (@ani_digital) March 27, 2026 -
250 మంది విద్యార్థులు, టీచర్లు మృతి: ఇరాన్
పశ్చిమాసియా యుద్ధంమరింత తీవ్రతరమయ్యే సూచనలు కన్పిస్తుండడం ప్రపంచదేశాలకు ఆందోళన కలిగిస్తోంది. హార్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ పట్టువీడకపోవడం, చర్చలపై షరతులకు అమెరికా ఒప్పుకోకపోవడం, వేలాది మంది అమెరికా జవాన్లు పశ్చిమాసియాలో అడుగుపెడుతుండడం వంటి పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. -
గల్ఫ్ దేశాలకు మరో టెన్షన్.. ఇరాన్ అలా చేస్తే మాత్రం..!
తీర ప్రాంతాల్లోని నిర్లవణీకరణ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోతుంది. సముద్ర జలాల్లోని ఉప్పును తొలగించి, శుద్ధ జలంగా మార్చే ప్లాంట్లు ఇవి. ఈ నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘ముహార్రక్’పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ డీశాలినేషన్ ప్లాంటు దెబ్బతింది. దైనందిన తాగునీటి అవసరాల కోసం గల్ఫ్ దేశాలు ప్రధానంగా ఈ నిర్లవణీకరణ కేంద్రాలపై ఆధారపడుతున్నాయి. ఈ ప్లాంట్ల నిర్వహణ ఇప్పుడు భద్రతాపరమైన అంశంగా మారింది.నిర్లవణీకరణ జలాన్ని ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నది గల్ఫ్ దేశాలే. వీటి తీరప్రాంతాల్లో వందలాది డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కువైట్ ప్రాంతంలో 90 శాతం తాగునీరు ఇదే. తీర నగరాలు, విద్యుత్కేంద్రాలు, పారిశ్రామిక హబ్స్ వద్ద ఈ డీశాలినేషన్ ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇదిప్పుడు వాటి బలహీనతగా, ఇరాన్ ఆయుధంగా మారుతోంది. నిర్లవణీకరణ కేంద్రాల్ని లక్ష్యాలుగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరికలు పంపుతోంది.విద్యుత్ సరఫరాతోనే డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేస్తాయి. విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేస్తే అవి మూతపడతాయి. ఉద్రిక్తతలు పెరిగితే డీశాలినేషన్ ప్లాంట్లు, విద్యుత్కేంద్రాలపై ఇరాన్ దాడులు చేస్తుందేమోనని, అప్పుడిక గృహావసరాలు, ఆస్పత్రులు, పరిశ్రమలకు నీరు అందదేమోనని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భయపడుతున్నాయి. ఇది వాటి ఆర్థిక వ్యవస్థలకు తీవ్ర నష్టం కలిగించే పరిణామమే. అయితే ఈ రిస్క్ అన్ని గల్ఫ్ దేశాలకు ఒకేలా లేదు. మిగతా వాటితో పోలిస్తే సౌదీ, ఖతార్, యూఏఈల పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది.- జమ్ముల శ్రీకాంత్ Sources: SANA (Syrian Arab News Agency), Gulf News -
ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బకొట్టిన ఇజ్రాయెల్!
టెహ్రాన్: ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళ అధిపతి అలీరెజా టాంగ్సిరి మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారి ఒకరు గురువారం జెరూసలేం పోస్ట్ మీడియాకు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఐదు రోజుల విరామం ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య ఈ దాడి జరిగింది.హార్మూజ్ జలసంధికి సమీపంలో బందర్ అబ్బాస్ ఉంది. ప్రపంచ వాణిజ్య చమురు, సహజ వాయువు సుమారు 20 శాతం హార్మూజ్ గుండా సాగుతుంది. ఈ జలసంధి మూసివేతకు బాధ్యుడిగా అలీరెజాను పేర్కొంటారు. అతడి మరణం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలో కీలక పరిణామం. ఎందుకంటే ఐఆర్జీసీ నౌకాదళానిదే ఇరాన్ సముద్ర కార్యకలాపాల్లో కీలక పాత్ర. అలాగే, గల్ఫ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసేది కూడా ఐఆర్జీసీ నౌకాదళమే.హార్మూజ్‌పై పట్టును మరింత సాధిస్తున్న వేళ ప్రస్తుతం హార్మూజ్ జలసంధిపై పట్టును మరింత పెంచుకుంటోంది ఇరాన్. కాల్పుల విరమణ ప్రయత్నాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ అంశం మరింత కీలకంగా మారింది. ప్రస్తుతం ఇరాన్ “డీ ఫాక్టో టోల్ బూత్ విధానం” (అధికారిక ప్రకటన లేకుండా అమలులో ఉన్న ఫీజు వ్యవస్థ) అమలు చేస్తోందని నిపుణులు చెప్పారు. ఈ విధానంలో కొన్ని నౌకలు తమ సరుకు వివరాలు, సిబ్బంది సమాచారం, గమ్యస్థానం వివరాలు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్‌కు అందించాలి. లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ (నౌకాయాన విశ్లేషణ సంస్థ) కూడా ఇదే విధానాన్ని ప్రస్తావిస్తూ, కనీసం రెండు నౌకలు జలసంధి గుండా వెళ్లేందుకు చైనా యువాన్‌లో ఫీజులు చెల్లించాయని తెలిపింది. ఈ ఫీజు వసూలు వ్యవస్థను అధికారికం చేయడానికి తమ పార్లమెంట్ ప్రయత్నిస్తోందని ఇరాన్ నేత ఒకరు అన్నారు. “మేమే భద్రత కల్పిస్తున్నాం, నౌకలు, చమురు ట్యాంకర్లు ఈ ఫీజులు చెల్లించడం సహజమే” అని చెప్పారు.ఈ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ప్రపంచ ఇంధన మార్కెట్లలో భయాలను పెంచింది. బ్రెంట్ క్రూడ్ (అంతర్జాతీయ చమురు ధర సూచిక) ధర గురువారం 104 డాలర్ల వద్ద ఉంది, ఘర్షణ ప్రారంభం నుంచి 40 శాతం పైగా పెరిగింది. -
పశ్చిమాసియా కల్లోలం.. కీలక పరిణామాలు
పశ్చిమాసియా కల్లోలానికి తెర దించే దిశగా బుధవారం మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. యుద్ధాన్ని ఏదోలా ముగించే ప్రయత్నాల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ విషయమై ఇరాన్ ముందు 15 ప్రతిపాదనలుంచారు. వాటికి అంగీకరిస్తే తొలుత నెల రోజుల పాటు కాల్పుల విరమణకు సిద్ధమని పేర్కొన్నారు. కానీ వాటిని ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. -
పాతాళానికి రూపాయి.. రోజుకో కొత్త పతనం
రూపాయి రోజుకో కొత్త కనిష్టానికి పతనమవుతోంది. డాలర్ మారకంలో 20 పైసలు బలహీనపడి తాజా జీవితకాల కనిష్టం 93.96 వద్ద స్థిరపడింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలతో విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, నెలాఖరున డాలర్లకు డిమాండ్ నెలకొనడం అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడి పెంచాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 93.94 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 93.86 – 94.13 శ్రేణిలో ట్రేడైంది. -
ఇరాన్ పతనమే లక్ష్యంగా ? సౌదీ బిగ్ ప్లాన్
-
ఫలించని ట్రంప్ పిలుపు.. ఆగని ఇజ్రాయెల్,ఇరాన్ యుద్ధం
-
PSL: బంగ్లాదేశ్ కీలక నిర్ణయం
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వేళ పాకిస్తాన్‌లోనూ గందరగోళం నెలకొంది. అఫ్గనిస్తాన్‌పై పాక్ వైమానిక దాడుల నేపథ్యంలో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)-2026 నిర్వహణ విషయంలో బోర్డు ఇప్పటికే తమ వైఖరిని స్పష్టం చేసింది.ప్రేక్షకులు లేకుండానే..ఆరంభ మ్యాచ్‌లకు స్టేడియంలో ప్రేక్షకులను అనుమతించమని.. కరాచీ, లాహోర్లలో మాత్రమే మ్యాచ్‌లు జరుగుతాయని పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రీడా శాఖా మంత్రి అమినుల్ హక్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ భద్రతా ముప్పు ఉందని భావిస్తే PSLలో ఆడేందుకు తమ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రం (NOC) ఇచ్చే విషయంలో పునరాలోచన చేస్తామని అమినుల్ వెల్లడించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు PSLలో పాల్గొనేందుకు NOCలు జారీ చేసినట్లు సమాచారం.బంగ్లాదేశ్ కీలక నిర్ణయంఈ విషయం గురించి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి క్రిక్‌బజ్‌తో మాట్లాడారు. ‘‘విదేశాంగ శాఖతో మేము చర్చలు జరిపాము. ఇస్లామాబాద్‌లో ఉన్న మా హై కమిషన్‌ను కూడా సంప్రదించాము. వారి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే PSLలో ఆడేందుకు మా ఆటగాళ్లకు అనుమతి ఇచ్చాము’’ అని పేర్కొన్నారు.కాగా మరోసారి ఐపీఎల్‌కు పోటీగా పాక్ బోర్డు PSLను నిర్వహించేందుకు సిద్ధమైంది. మార్చి 26న తాజా ఎడిషన్ మొదలుకానుంది. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రహమాన్, పర్వేజ్ హొసేన్ ఇమాన్, షోరిఫుల్ ఇస్లాం, నహీద్ రాణా, తాంజిద్ హసన్ తమీమ్, రిషాద్ హొసేన్ తదితరులు ఈ సీజన్లో భాగం కానున్నారు.చదవండి: అతడు టీమిండియాలో చోటుకు అర్హుడు: భారత స్పిన్ దిగ్గజం -
యుద్ధం వల్ల భారత్‌కు ఈ సవాళ్లు ఎదురయ్యాయి: మోదీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం వేళ చోటుచేసుకున్న పరిస్థితులపై ఇవాళ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఇరాన్ యుద్దానికి పరిష్కారమని, ఉద్రిక్తత తగ్గించేందుకు భారత్ ప్రయత్నాలు చేసిందని అన్నారు. దేశం ఐక్యంగా ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కోగలమని తెలిపారు.‘యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భారత్‌కు ఆర్థిక, భద్రత, మానవతా సవాళ్లు ఎదురయ్యాయి. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు ఉన్నారు. వారి భద్రతకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకు 3.75 లక్షల భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు. ఇరాన్ నుంచి సుమారు 1,000 మంది భారతీయులను తరలించాం. అందులో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.విదేశాల్లోని భారత మిషన్లు 24/7 సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. హెల్ప్లైన్లు, కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. హార్మూజ్ జలసంధిలో నౌకాయానం కష్టతరం. అయినప్పటికీ ఇంధన సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నాం. భారత్ వద్ద 53 లక్షల మెట్రిక్ టన్నుల చమురు నిల్వలు ఉన్నాయి.ప్రస్తుతం 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుగుతున్నాయి. ఎల్పీజీలో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. దేశీయ ఉత్పత్తి పెంపుపై దృష్టి పెట్టాం. ఎథనాల్ బ్లెండింగ్ వల్ల చమురు దిగుమతులు తగ్గిస్తున్నాం. రైల్వే విద్యుతీకరణతో డీజిల్ వినియోగం తగ్గిస్తున్నాం.ఎరువుల సరఫరా కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయి. రిన్యూవబుల్ ఎనర్జీలో భారత్ పురోగతి సాధించింది. తప్పుడు ప్రచారం, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటాం. మనముందు చాలా సవాళ్లు ఉన్నాయి. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. విదేశాల్లో ఉన్న భారతీయులందరి రక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారు’ అని మోదీ చెప్పారు. -
ఎఫ్-35.. ఇక చౌక బేరం!
ప్రపంచంలోనే అత్యాధునిక అమెరికా యుద్ధవిమానం ఎఫ్-35ను కూల్చివేసినట్టు ఇరాన్ ఈ నెల 19న ప్రకటించింది. ఈ వాదనే నిజమైతే ప్రపంచంలో ఆ ‘ఘనకార్యం’ చేసిన తొలి దేశం ఇరానే అవుతుంది. శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఎఫ్-35 ఫైటర్ జెట్... అమెరికా మిలిటరీ పరాక్రమానికి రెండు దశాబ్దాల ప్రతీక. శత్రువులు కనుగొనలేని, ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలు కూడా గుర్తించలేని స్టెల్త్ సామర్థ్యంతో దూసుకెళుతూ దాడులు జరిపేలా దాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.రాడార్ సైతం గుర్తించలేని, శత్రువుల కంటబడని ఓ అమేయ ‘అదృశ్య శక్తి’గా విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఎఫ్-35 విమానానికి సంబంధించి కీలక బలహీనతను తాము కనిపెట్టినట్టు ఇప్పుడు ఇరాన్ ప్రకటించింది. తాము సొంతంగా అభివృద్ధి చేసుకున్న ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి ద్వారా అమెరికన్ ఎఫ్-35 యుద్ధవిమానాన్ని కూల్చినట్టు పేర్కొంది.గమనంలో ఎఫ్-35 జెట్ వెలువరించే వేడి లేదా పరారుణ వికిరణం ఆధారంగా ఆ విమానాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చేవేశామని తెలిపింది. రాడార్లకు దొరక్కుండా తప్పించుకునే సామర్థ్యం ఎఫ్-35కు ఉంటే ఉండొచ్చుగాక... ఇంజిన్ విడుదల చేసే వేడి పరంగా (హీట్ సిగ్నేచర్) మాత్రం అది పూర్తిగా శత్రువుల కళ్లుగప్పలేదని తేటతెల్లమైంది.ఎఫ్-35ను దెబ్బకొట్టడానికి తమ ‘తలాష్’ గగనతల రక్షణ వ్యవస్థను ఉపయోగించినట్టు తొలుత పేర్కొన్న ఇరాన్... వాస్తవానికి ‘మాజిద్’ (ఏడీ-08) స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ సాయంతో కేవలం ఒకేఒక క్షిపణితో ఆ కార్యం సాధించినట్టు తుది పరిశీలన అనంతరం ప్రకటించింది. శత్రు రాడార్ల సంకేతాలను నిలువరించేలా లేదా వాటిని చెల్లాచెదురు చేసేలా ఎఫ్-35లోని ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కానీ ఈ సందర్భంలో అవేవీ అక్కరకు రాలేదు. ‘మాజిద్’ స్వల్పశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను ఇరాన్ 2021లో తొలిసారి ఆవిష్కరించింది. ఇది రాడార్ బదులు పరారుణ సాంకేతికతపై ఆధారపడుతుంది.ఎఫ్-35లపై స్పెయిన్ వెనుకంజ!ఎఫ్-35ను ఇరాన్ కూల్చివేసిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల సైనిక, రక్షణ రంగాల నిపుణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గగనతలంలో ఎఫ్-35కు ఎదురేలేదని ఇన్నాళ్లూ కొనసాగిన ఏకధాటి భావనను తాజాగా సందేహాలు ముప్పిరిగొంటున్నాయి. ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’కు ఎఫ్-35 సామర్థ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఈ పరిణామం పలు దేశాలను ఇప్పుడు పునరాలోచనలో పడవేయనుంది. అమెరికాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ లాక్ హీద్ మార్టిన్ తయారుచేసిన ఐదో తరం ఎఫ్-35 స్టెల్త్ జెట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనను స్పెయిన్ ప్రభుత్వం ఏడాది క్రితమే అటకెక్కించింది.2030 నాటికి తమ హారియర్ ఏవీ8బీ ఫైటర్లను తప్పించి వాటి స్థానంలో నేవల్ వెర్షన్ అయిన ఎఫ్-35బి జెట్స్ మోహరించేందుకు స్పెయిన్ నౌకాదళం తొలుత ఆసక్తి చూపినా చివరకు వెనకడుగు వేసింది. ఎఫ్సీఏఎస్ (ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్) రూపొందించే ఆరో తరం యుద్ధవిమానాల కోసం నిరీక్షించాలని, అవి అందుబాటులోకి వచ్చేవరకు తమ మెక్ డానెల్ డగ్లస్ ఎఫ్/ఏ-18 హార్నెట్స్ స్థానంలో ఎఫ్-35ఏ యుద్ధవిమానాలను తాత్కాలికంగా ప్రవేశపెట్టాలని స్పెయిన్ వైమానికదళం కూడా భావించింది.తమ నేవీ, ఎయిర్ ఫోర్స్ అవసరాల రీత్యా పాత విమానాలను డీకమిషన్ చేసి వాటి బదులు ఎఫ్-35లను ప్రవేశపెట్టడానికి స్పెయిన్ తన 2023 బడ్జెట్లో 6.25 బిలియన్ యూరోలను (సుమారు రూ.68 వేల కోట్లు) ప్రాథమికంగా కేటాయించింది. ప్రస్తుతం ఆ ప్రణాళికలు మూలనపడ్డాయి. ఎఫ్-35ల బదులు ఎయిర్ బస్ నేతృత్వంలోని సంస్థలు తయారుచేసే ‘యూరోఫైటర్’ జెట్స్ కొనాలని స్పెయిన్ తలపోస్తోంది.ఫ్రెంచ్ రఫేల్ వైపే భారత్ మొగ్గు!ఇరుదేశాల రక్షణ బంధం బలోపేతం దిశగా ఎఫ్-35 యుద్ధవిమానాలను ఇండియాకు అమ్ముతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిరుడు ఆఫర్ ఇచ్చారు. వేరియంట్ ఆధారంగా ఒక్కో ఎఫ్-35 ధర రూ.700-1,000 కోట్ల మధ్య ఉంటుంది. ఎఫ్-35లో ఎ, బి, సి అని మూడు రకాలు ఉన్నాయి. వీటిలో ఎఫ్-35ఎ రకం జెట్ టేకాఫ్, ల్యాండింగ్ సాధారణ విమానాల మాదిరిగా ఉంటుంది. దీనికి పొడవైన రన్ వే కావాలి.ఎఫ్-35బి వెర్షన్ అయితే అతికొద్ది రన్ వేతో పైకి లేచి నిట్టనిలువుగా కిందికి దిగగలదు. ఇక ఎఫ్-35సి అనేది... విమాన వాహక నౌకల (నేవీ క్యారియర్ బేస్డ్) కార్యకలాపాల్లో వాడే వేరియంట్. ఎఫ్-35లను కొనబోమని భారత్ గతంలోనే స్పష్టీకరించింది. తమ వైమానిక దళ అవసరాల కోసం రూ.3.6 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధవిమానాలను సేకరించే ప్రతిపాదనను భారత్ ఇటీవల ఆమోదించింది.అదే బాటలో స్విట్జర్లాండ్, కెనడా!అమెరికన్ ఎఫ్-35 జెట్స్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ స్విట్జర్లాండులోనూ నిరుడు డిమాండ్లు ఊపందుకున్నాయి. 36 ఎఫ్-35ఎ విమానాలను కొనాలని స్విట్జర్లాండ్ మొదట్లో భావించింది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర కారణాల రీత్యా ధర పెరిగినందున అన్ని జెట్స్ కొనలేమని, ఆరు విమానాలను తగ్గించి 30 మాత్రమే ఎఫ్-35లను కొనుగోలు చేస్తామని స్విస్ ఫెడరల్ కౌన్సిల్ ఈ నెల 6న వెల్లడించింది.ఇక కెనడా విషయానికొస్తే 16 ‘ఎఫ్-35ఏ లైట్నింగ్ 2’ విమానాల కోసం తొలుత ఆర్డర్ ఇచ్చింది. అవి త్వరలో అందుతాయి. అదనంగా మరో 14 ఎఫ్-35ల కొనుగోలుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. అయితే విమానాల ధర పెరగడం, అమెరికాతో రాజకీయ-వర్తక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ సారథ్యంలోని కెనడా ప్రభుత్వం మరిన్ని ఎఫ్-35లను కొనాలా? వద్దా? అని ప్రస్తుతం మల్లగుల్లాలు పడుతోంది. ‘హీట్ సిగ్నేచర్’ బలహీనతను కనిపెట్టి ఇరాన్ కొట్టిన ఉండేలు దెబ్బకు భవిష్యత్తులో ఎఫ్-35లకు గిరాకీ తగ్గి కొనుగోలు మార్కెట్ డీలా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భలే మంచి చౌక బేరం తప్పదా?!- జమ్ముల శ్రీకాంత్(Credits: The Wall Street Journal, MSN, Reuters, Politico, The Hill) -
టెక్సాస్ లో మంటల వెనుక మిస్టరీ అమెరికాలో హై అలర్ట్
-
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ హైలెవెల్ మీటింగ్
ఢిల్లీ: ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ముడిచమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎరువుల లభ్యతపై చర్చ జరిపారు. ఇంధన భద్రతకు ప్రత్యామ్నాయాలపై కేంద్రం దృష్టి సారించింది.పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో మధ్య పెట్రోలియం, ముడి చమురు, గ్యాస్, విద్యుత్, ఎరువుల రంగాలకు సంబంధించిన పరిస్థితులను సమీక్షించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది.విద్యా సంస్థలు, ఆసుపత్రులు వంటి కీలక రంగాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలకు వాణిజ్య ఎల్పీజీ (LPG) కేటాయింపులను కేంద్రం పెంచింది. గృహ, వాణిజ్య వినియోగదారులకు కొత్త పీఎన్జీ (PNG) కనెక్షన్ల మంజూరును వేగవంతం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించిన సంగతి తెలిసిందే. ఎల్పీజీ అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ముమ్మరంగా దాడులు కొనసాగుతున్నాయి.దేశవ్యాప్తంగా పోర్టు కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయని.. ఎలాంటి రద్దీ లేదని అధికారులు తెలిపారు. సరఫరాలను మెరుగుపరిచే క్రమంలో, అమెరికాలోని టెక్సాస్ నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వస్తున్న ఒక కార్గో నౌక మంగళూరులోని 'న్యూ మంగళూరు పోర్టు'కు చేరుకుంది. మార్చి 14 నుంచి మార్చి 31 వరకు ముడి చమురు, ఎల్పీజీపై కార్గో సంబంధిత ఛార్జీలను మాఫీ చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ప్రకటించింది.కాగా, భారత జెండాతో మరో రెండు ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత్’ త్వరలో ఉద్రిక్తమయ హార్మూజ్ గుండా పయనించి స్వదేశానికి చేరుకోనున్నాయి. గత 24 గంటలుగా హార్మూజ్ గుండా ఎలాంటి నౌకల సంచారం లేకపోయినా అదే జలసంధి గుండా ఈ రెండు ఎల్పీజీ నౌకలు సాహసోపేత ప్రయాణం సాగించనున్నాయని రాయిటర్స్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ప్రస్తుతం ప్రయాణాన్ని నిలిపేసి హార్మూజ్‌కు దూరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా సమీప నౌకాశ్రయంలో ఈ రెండు నౌకలు లంగరువేశాయని, త్వరలోనే ప్రయాణం ఆరంభిస్తాయని నౌకలను ట్రాక్ చేసే సంస్థ ‘మెరైన్‌ట్రాఫిక్’ వెల్లడించింది. -
భారీగా తగ్గుతున్న బంగారం ధర
-
విశాఖ జలాల్లోకి రష్యా యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో సముద్ర జలాల్లో అనిశ్చితి రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో విశాఖ సాగరజలాల్లో రెండు రష్యాయుద్ధ నౌకలు ప్రత్యక్షం కావడం అంతర్జాతీయ చర్చకు దారి తీసింది.రష్యానౌకాదళానికి చెందిన స్టెరెగుష్చి క్లాస్ కార్వెట్స్ అయిన షోవర్షెన్నీ, రెజ్కీ యుద్ధనౌకలు రెండు రోజుల కిందట అనధికారిక విజిట్పేరుతో విశాఖ తీరానికి చేరుకున్నాయి. రష్యా నౌకల్లో వచ్చిన సిబ్బందికి భారతనౌకాదళ అధికారులు ఘన స్వాగతం పలికారు. అయితే ఈ నౌకల రాక వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఇండియన్ నేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ నౌకలు విశాఖకు ఎందుకు వచ్చాయి.. ద్వైపాక్షిక విన్యాసాలు నిర్వహించే అవకాశం ఉందా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
ట్రంప్ భారీ రిస్క్..! అమెరికా కొత్త నిర్ణయం?
-
గిగ్ కార్మికుల ఆదాయంపై యుద్ధ మేఘాలు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు గిగ్ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా గొలుసులో తలెత్తిన అంతరాయాలు వీధి వ్యాపారుల నుంచి మెట్రో నగరాల ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు అందరినీ రోడ్డున పడేస్తున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు మూతపడుతుండటంతో.. డెలివరీ ఆర్డర్లు లేక గిగ్ కార్మికుల ఆదాయం సగానికి పడిపోయింది.అడుగంటిన సరఫరా.. ఆకాశన్నంటిన ధరలుఅంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ఎల్పీజీ దిగుమతులు తగ్గడంతో దేశీయంగా వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రమైంది. ఇదే అదునుగా భావిస్తున్న అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో ఒక్కో సిలిండర్‌ను సుమారు రూ.4,000 వరకు విక్రయిస్తున్నారని గిగ్, ప్లాట్‌ఫాం సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ‘ప్రభుత్వం కొరత లేదని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్వయంగా స్పందించి ఈ కృత్రిమ కొరతను అరికట్టాలి’ అని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.తగ్గిన ఆర్డర్లు..రెస్టారెంట్లు, ధాబాలు గ్యాస్ లేక వంటలు చేయలేకపోవడంతో జొమాటో, స్విగ్గీ వంటి ప్లాట్‌ఫారమ్‌లపై ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ వ్యవహారంపై ఓ గిగ్ సిబ్బంది స్పందిస్తూ.. ‘గతంలో రోజుకు 30-40 ఆర్డర్లు చేసేవాడిని. ఇప్పుడు 20 కూడా రావడం లేదు. గంటల తరబడి యాప్ వైపు చూస్తూ ఖాళీగా కూర్చుంటున్నాం’ అన్నాడు.ఆర్ధిక సంక్షోభంలో గిగ్ కుటుంబాలుకేవలం డెలివరీ బాయ్స్ మాత్రమే కాదు, క్లౌడ్ కిచెన్లలో పనిచేసే వారు, రోడ్డు పక్కన బండ్లు నడిపేవారు ఈ సంక్షోభంతో ఇబ్బంది పడుతున్నారు. ఆర్డర్ల పతనం వల్ల ఆదాయం తగ్గడమే కాకుండా, పెరిగిన నిత్యావసరాల ధరలు వారిని కుంగదీస్తున్నాయి. చాలా మంది గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లు లేదా ఎలక్ట్రిక్ కుక్కర్ల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ పెరిగిన కరెంటు బిల్లులు మరో భారంగా మారుతున్నాయి.ప్రభుత్వ జోక్యం అవసరంగ్యాస్ సరఫరాతోపాటు లక్షలాది మంది కార్మికుల జీవనాధారానికి సంబంధించిన అంశంపై ప్రభుత్వ స్పందించాల్సి ఉంది. సిలిండర్లను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆదాయం కోల్పోయిన డెలివరీ భాగస్వాములకు కంపెనీలు లేదా ప్రభుత్వం తరఫున ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కొందరు చెబుతున్నారు. మిడిల్ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎల్పీజీ దిగుమతులను వేగవంతం చేయాలి.ఇదీ చదవండి: యుద్ధం.. ఆయుధ ఎగుమతిదారులకు కాసుల వర్షం -
నెతన్యాహును వేటాడి హతమార్చుతాం: ఇరాన్
పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. -
పెట్రోలు వెతల సిత్రాలు చూశారా..!
-
ఖర్గ్ ఐలాండ్‌పై దాడి.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా ఖండించిన ఇరాన్.. అమెరికా చమురు మౌలిక సదుపాయాలను బూడిద చేస్తామంటూ హెచ్చరించింది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని ఇరాన్‌కు అత్యంత కీలకమైన ఈ దీవిపై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత శక్తివంతమైన దాడులు చేసింది. ఇరాన్ కిరీటంలోని రత్నం లాంటి ఖర్గ్ ఐలాండ్‌లోని ప్రతి సైనిక లక్ష్యాన్ని తునాతునకలు చేశామంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.కాగా, ‘ఇరాన్ ఇప్పటికే లొంగుబాట పట్టిందని.. మనందరినీ వేధిస్తున్న క్యాన్సర్‌ను నిర్మూలించానంటూ కూడా జీ7 దేశాధినేతలతో జరిపిన వర్చువల్ మీటింగ్‌లో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై తాము చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ విజయవంతమైందని ప్రకటించుకున్నారు. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని దేశాధినేతలు ట్రంప్‌కు సూచించారు. అంతకుముందు ట్రూత్‌సోషల్ పోస్టుల్లో ఇరాన్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ‘‘ఈ మతిలేని మూర్ఖులకు ఏం జరగనుందో చూస్తూండండి! వారి నేవీ, ఎయిర్‌ఫోర్స్, క్షిపణులు, డ్రోన్లు అన్నీ మట్టికరిచాయి. సర్వమూ నాశనమవుతోంది.నాయకులు తుడిచిపెట్టుకుపోయారు. 47 ఏళ్లుగా ఇరాన్ ప్రపంచమంతటా అమాయకులను చంపుతూ వస్తోంది. 47వ అమెరికా అధ్యక్షునిగా నేను వాళ్లను చంపుతున్నా. ఎంతో గొప్ప విషయమిది!’’ అని చెప్పుకున్నారు. ఇరాన్ వద్ద పోగుపడ్డ యురేనియం నిల్వల స్వా«దీనంపై ప్రస్తుతానికి దృష్టి పెట్టడం లేదని ట్రంప్ చెప్పారు. అయితే మున్ముందు పరిస్థితి మారే ఆస్కారం లేకపోలేదన్నారు. -
ఇరాన్‌తో యుద్ధం.. అమెరికా మరో వ్యూహం!
ఇరాన్‌తో యుద్ధం మొదలై దాదాపు రెండు వారాలు గడుస్తున్న నేపథ్యంలో అమెరికా తన సైనిక బలగాలను భారీగా పెంచింది. ఇరాన్‌పై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మిడిల్ ఈస్ట్‌కు అమెరికా మెరైన్ కమాండోలను తరలించింది. సముద్ర మార్గంలో మెరైన్ దళాలను మోహరించింది. యూఎస్ఎస్ ట్రిపోలి యుద్ధనౌకలో 2500 మెరైన్ కమాండోలతో పాటు 20 యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లు మధ్యప్రాచ్యానికి పంపినట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు.మరోవైపు, పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నిన్న (శుక్రవారం) భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నగరం నడిరొడ్డున అత్యంత శక్తిమంతమైన పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఖుద్స్ డే ప్రదర్శనల్లో ప్రజలు వేలాదిగా పాల్గొని ఉండగా ఈ ఉదంతం జరిగినట్టు ప్రభుత్వ టెలివిజన్ పేర్కొంది. పేలుడు కారణమేమిటో తెలియకపోయినా ఆ ప్రాంతంపై దాడి చేస్తామని శుక్రవారం ఉదయమే ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. అంతేగాక ఫిరదౌసీ స్క్వేర్ వద్ద ర్యాలీలు మొదలయ్యేందుకు కాసేపటి ముందే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా భారీ స్థాయి వైమానిక దాడులకు దిగాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్.. ఇజ్రాయెల్, పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విస్తృత దాడులను కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగే చమురులో ఐదో వంతు ప్రయాణించే హోర్ముజ్ జలసంధిని (Strait of Hormuz) ఇరాన్ దాదాపుగా మూసివేసింది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, ఇతర లక్ష్యాలపై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల లెబనాన్‌లో సంక్షోభం మరింత ముదిరింది. ఇప్పటివరకు దాదాపు 800 మంది మరణించగా.. 8.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ హెచ్చరించింది. -
ఐదుగురు భారతీయులు మృతి: విదేశాంగ మంత్రిత్వ శాఖ
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతూనే ఉంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ శుక్రవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. -
‘ఘోస్ట్ టౌన్’గా మారిన దుబాయ్!
దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్ట్లు, మిచెలిన్-స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ‘ఘోస్ట్ టౌన్’ను తలపిస్తోంది.ఇరాన్ క్షిపణి దాడుల ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్‌లోని పలు బీచ్ బార్లు, స్విమ్మింగ్ పూల్స్, పర్యాటక ప్రదేశాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. గూచీ వంటి హై-ఎండ్ దుకాణాలు కూడా తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్, గ్లోబల్ విలేజ్ థీమ్ పార్క్, ఐన్ దుబాయ్ అబ్జర్వేషన్ వీల్ వంటి ప్రముఖ పర్యాటక ఆకర్షణలను కూడా తాత్కాలికంగా మూసివేశారు.సాధారణంగా వీకెండ్ సమయంలో ట్రాఫిక్‌తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులు ఇచ్చి పంపుతున్నారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరలకు గదులు అందిస్తున్నాయి.ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్‌ను విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్యం నుంచి బయలుదేరే విమానాల్లో దాదాపు సగం విమానాలు రద్దు అయినట్లు ట్రావెల్ అనలిటిక్స్ సంస్థ తెలిపింది. ముఖ్యంగా దుబాయ్‌లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అధికారులు మాత్రం తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలు ధ్రువీకరించని సమాచారాన్ని పంచుకోరాదని హెచ్చరిస్తున్నారు. -
వీసాల పొడిగింపు.. భారత్ గుడ్ న్యూస్
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభావిత విదేశీ పౌరులకు అన్ని రకాల వీసాలకు 30 రోజుల పాటు పొడిగింపు ఇవ్వాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎక్కువ కాలం బస చేసినందుకు విధించే జరిమానాలను కూడా మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది.దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్ శుక్రవారం సాయంత్రం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది. రెగ్యులర్ వీసాలు, ఈ-వీసాలు సహా అన్ని రకాల వీసాలకు ఈ సడలింపులు వర్తిస్తాయని తెలిపింది.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో పలువురు విదేశీయులు ప్రయాణ సమస్యల కారణంగా తమ దేశాలకు వెళ్లలేకపోతున్నారు.వీసా పొడిగింపు, జరిమానా మాఫీభారత ప్రభుత్వం ప్రకటించిన సడలింపులు ఇలా ఉన్నాయి..గడువు ముగిసిన లేదా త్వరలో ముగియనున్న అన్ని రకాల వీసాలకు ఒక నెల పాటు పొడిగింపు.కేసు ప్రాతిపదికన ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా ఈ పొడిగింపు మంజూరు.ఫిబ్రవరి 28, 2026 తర్వాత ఎక్కువ కాలం బస చేసిన విదేశీయులపై విధించే జరిమానా పూర్తిగా మాఫీ.ఎగ్జిట్ పర్మిట్, తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్‌పై సడలింపుయుద్ధ పరిస్థితుల వల్ల చిక్కుకుపోయిన విదేశీయులకు భారత్ మరిన్ని సడలింపులు ప్రకటించింది.అవసరమైన విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు ఉచితంగా జారీ.ఎగ్జిట్ పర్మిట్ కోసం దరఖాస్తు చేయకపోవడం వలస చట్ట ఉల్లంఘనగా పరిగణించరు.విమానాల మళ్లింపు కారణంగా భారత్‌కు వచ్చే విదేశీయులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్ (TLP) మంజూరు.ముందుగానే సూచనలుమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ప్రారంభమైన వెంటనే, మార్చి 1న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విదేశీ పౌరులకు సూచనలు జారీ చేసింది. వీసా పొడిగింపు లేదా బసను క్రమబద్ధీకరించుకోవాల్సిన అవసరం ఉన్నవారు తమ సమీపంలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ను సంప్రదించాలని సూచించింది. -
సామాన్యుడి జేబుకు ‘యుద్ధం’ చిల్లు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచంలోని వివిధ దేశాలతోపాటు భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. యునైటెడ్ స్టేట్స్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు కేవలం దౌత్యపరమైన అంశాలకే పరిమితం కాకుండా భారతీయులు రోజువారీ వాడే ఎఫ్ఎంసీజీ వస్తువుల ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముడి చమురు కొరతతో ప్యాకేజింగ్ ఖర్చులు భారమవడంవల్ల కంపెనీలు ధరల పెంపు లేదా పరిమాణం తగ్గింపు దిశగా అడుగులు వేస్తున్నాయి.పశ్చిమాసియా ప్రాంతం ప్యాకేజింగ్ పరిశ్రమకు కీలకంగా ఉంది. సబ్బులు, బిస్కెట్లు, డిటర్జెంట్ల ప్యాకింగ్‌కు వాడే పాలిమర్లు (పాలీప్రొపైలిన్, పాలిథిలిన్) నేరుగా ముడి చమురు నుంచే తయారవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో సరఫరా గొలుసు దెబ్బతింది.ఇప్పటివరకు గల్ఫ్ దేశాల నుంచి 50% పాలిమర్లను దిగుమతి చేసుకున్న భారత కంపెనీలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా చైనా, థాయ్‌లాండ్, సింగపూర్ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ముడి చమురు ధరలు పెరగడంతో రవాణా, ముడిసరుకు సేకరణ ఖరీదైన వ్యవహారంగా మారింది.ధర పెంపు లేదా క్వాంటిటీలో కోత?వ్యాపార నిర్వహణ భారమవడంతో దిగ్గజ సంస్థలు తమ వ్యూహాలను మారుస్తున్నాయి. ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ మయాంక్ షా దీనిపై స్పందిస్తూ.. తమ మొత్తం ఖర్చులో ప్యాకేజింగ్ వాటా 15-20 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నారు. ‘చమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగితే చిన్న ప్యాకెట్లలో పరిమాణాన్ని తగ్గించడం, పెద్ద ప్యాకెట్ల ధరలను పెంచడం తప్ప మరో మార్గం లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, డిటర్జెంట్లు, క్లీనింగ్ ఉత్పత్తుల తయారీలో కీలకమైన లీనియర్ ఆల్కైల్ బెంజీన్ (ఎల్ఏబీ) ధరలు కూడా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. డిటర్జెంట్ ముడి పదార్థాల ఖర్చులో దీని వాటా దాదాపు 50% ఉండటం గమనార్హం.జీఎస్టీ లాభాలకు గండిఈ ధరల పెంపు నిర్ణయం సామాన్య వినియోగదారుడికి భారంగా మారనుంది. గత సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన జీఎస్టీ 2.0 సవరణల వల్ల కంపెనీలు ప్యాకెట్ల పరిమాణాన్ని పెంచి, ధరలను తగ్గించాయి. తద్వారా లభించిన ఉపశమనాన్ని ప్రస్తుత యుద్ధ వాతావరణం పూర్తిగా తుడిచిపెట్టేసే ప్రమాదం ఉంది.ఇదీ చదవండి: దిగొస్తున్న పసిడి ధరలు.. వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే.. -
ట్రంప్ కోరిక నెరవేరుతుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని సైన్యం ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరి 2026 చివరి వారంలో ఇరాన్‌పై భారీ దాడులకు దిగింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తోందని, అది ప్రపంచ శాంతికి ముప్పు అని వైట్ హౌస్ వాదిస్తున్నప్పటికీ తెర వెనుక అసలు కథ వేరే ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా అణ్వాయుధాలు ఇప్పటికే తమవద్ద ఉన్నాయని బాహాటంగా చెబుతున్న ఉత్తర కొరియా విషయంలో అమెరికా మెతక వైఖరి అవలంబిస్తూ ఇరాన్‌ను లక్ష్యం చేసుకోవడం వెనుక ‘చమురు రాజకీయాలు’ బలంగా పనిచేస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.అణుసాకుతో చమురుపై కన్ను?ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యమని చెబుతోంది. అయితే, తాజాగా జరిగిన దాడుల వల్ల ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్ వంటి అణు కేంద్రాలతో పాటు ఆ దేశ నౌకాదళం, క్షిపణి వ్యవస్థలు కూడా దెబ్బతిన్నాయి. ఇరాన్ వద్ద భారీ చమురు నిల్వలు ఉన్నాయి. రోజుకు సుమారు 3.5 మిలియన్ బారెళ్ల ముడి చమురును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఇరాన్ సొంతం.హర్మూజ్ జలసంధిప్రపంచ చమురు రవాణాలో 20% వాటా కలిగిన హర్మూజ్ జలసంధిపై ఇరాన్‌కు పట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధించడం ద్వారా అటు చైనాకు చమురు సరఫరాను అడ్డుకోవడం, ఇటు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను నియంత్రించడం అమెరికా వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు.ఉత్తర కొరియాకు అభయహస్తం?మరోవైపు, కిమ్ జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా ఇప్పటికే డజన్ల కొద్దీ అణ్వాయుధాలను, ఎకాఎకి అమెరికాను చేరుకోగల ఐసీబీఎం క్షిపణులను కలిగి ఉంది. ఇటీవల జరిగిన వర్కర్స్ పార్టీ కాంగ్రెస్‌లో కిమ్ తన అణు సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటామని స్పష్టం చేశారు.కిమ్‌కు ఎందుకు మినహాయింపు?నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ఉత్తర కొరియా దగ్గర ఎటువంటి చమురు నిల్వలు లేవు. అక్కడ యుద్ధం చేస్తే ప్రాణ, ఆస్తి నష్టం తప్ప అమెరికాకు లభించే ఆర్థిక ప్రయోజనం శూన్యం. గతంలోనూ కిమ్‌ను ట్రంప్ గొప్ప నాయకుడుగా అభివర్ణించారు. తాజాగా కూడా ఉత్తర కొరియా అణు హోదాను గుర్తిస్తే చర్చలకు సిద్ధమని కిమ్ సంకేతాలిచ్చారు. ఇరాన్‌పై కఠినంగా ఉండే ట్రంప్, ఉత్తర కొరియా విషయంలో మాత్రం చాకచక్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం.‘ప్రస్తుతం ఒక దేశం దగ్గర చమురు ఉంటే అది ఆ దేశానికి వరమో లేక అగ్రరాజ్యాల దాడులకు కారణమయ్యే శాపమో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అణ్వాయుధాల కంటే చమురు నిల్వలే అమెరికా యుద్ధ ప్రాధాన్యతలను నిర్ణయిస్తున్నాయని ఇరాన్ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది’ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: డబుల్ రిలీఫ్.. పసిడి, వెండి ప్రియులకు ఊరట -
సముద్రంలో చిక్కుకుపోయిన 28 భారత నౌకలు
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. ఈ నౌకల్లో మొత్తం 778 మంది భారతీయ నావికులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నౌకల పరిస్థితి, సిబ్బంది భద్రతపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తోంది.ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి పరిధిలోని పర్షియన్ గల్ఫ్‌లో 24 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిలో 677 మంది భారతీయ నావికులు ఉన్నారు. అదేవిధంగా జలసంధికి తూర్పు వైపున మరో నాలుగు నౌకలు ఉండగా, వాటిలో 101 మంది భారతీయ నావికులు సేవలందిస్తున్నారు.నౌకల్లో ఉన్న సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ అధికారులు నౌకల నిర్వహణ సంస్థలతో పాటు నావికుల కుటుంబాలతో కూడా నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ తాజా సమాచారాన్ని అందిస్తున్నారు.ఇదిలా ఉండగా, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్ ప్రాంతీయ పరిణామాలను పర్యవేక్షిస్తూ, అవసరమైతే తక్షణ సహాయ చర్యలను సమన్వయం చేయనుంది.ఫిబ్రవరి 28న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ భారత జెండా కింద నడిచే నౌకలు, భారతీయ నావికులు అదనపు భద్రతా చర్యలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. భద్రతా ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా అనుసరించడంతో పాటు సిబ్బంది వివరాలను క్రమం తప్పకుండా అధికారులకు తెలియజేయాలని సూచించింది.అలాగే షిప్ మేనేజర్లు, రిక్రూటింగ్ ఏజెన్సీలు భారత రాయబార కార్యాలయాలు, స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని ఆదేశించింది. అవసరమైతే భారతీయ నావికులకు తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.ఇదిలా ఉండగా, దేశంలోని ప్రధాన నౌకాశ్రయాల్లో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగుతున్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ప్రధాన పోర్టులకు సూచనలు జారీ చేసినట్లు పేర్కొంది.ప్రస్తుతం ప్రధాన నౌకాశ్రయాలు నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రాంతీయ పరిస్థితిని నిజ సమయంలో అంచనా వేస్తున్నాయి. అలాగే నౌకలు, కార్గో పరిస్థితిపై క్రమం తప్పకుండా నివేదికలు సమర్పిస్తున్నాయి. -
వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లు!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడంతో ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోంది. దీనివల్ల ఇన్నాళ్లూ వడ్డీ రేట్ల తగ్గింపు కోసం వేచి చూసిన సామాన్యులకు, పెట్టుబడిదారులకు కేంద్ర బ్యాంకులు షాక్ ఇచ్చేలా కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడం పక్కన పెట్టి ఈ ఏడాది చివరి నాటికి మరింత పెంచే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.అంచనాలు తలకిందులుఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఒకటి లేదా రెండుసార్లు వడ్డీ రేట్లను పెంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రేట్ల తగ్గింపు ఉంటుందని భావించినప్పటికీ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగడం దీనికి ప్రధాన కారణం. అదేవిధంగా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తోంది. గతంలో రేట్ల కోత ఉంటుందని ఊహించిన మార్కెట్ వర్గాలకు ఇది పెద్ద మలుపు.గత తప్పిదాల నుంచి పాఠాలు2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పుడు ద్రవ్యోల్బణంపై కేంద్ర బ్యాంకులు ఆలస్యంగా స్పందించాయనే విమర్శలు ఉన్నాయి. సాధారణంగా ఇంధన ధరల పెరుగుదల తాత్కాలికమని, అధిక ధరల వల్ల డిమాండ్ తగ్గి ధరలు అదుపులోకి వస్తాయని బ్యాంకర్లు భావిస్తారు. అయితే, గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఆలస్యం చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి.బ్రిటన్‌లో సంక్లిష్ట పరిస్థితియూకేలో ద్రవ్యోల్బణం ప్రస్తుతం 3% వద్ద ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బీఓఈ) లక్ష్యం (2%) కంటే ఎక్కువ. యుగోవ్/ సిటీగ్రూప్ సర్వే ప్రకారం, ఇరాన్ యుద్ధానికి ముందే వినియోగదారుల ధరల పెరుగుదల 3.3%గా ఉంది. దీంతో బీఓఈ తన అంచనాలు మారుస్తోంది.ఇదీ చదవండి: చికెన్, పిజ్జా, బర్గర్.. కంపెనీలకు కష్టాలు -
T20 WC 2026: ఆరోపణలపై స్పందించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆదివారం ముగిసింది. శ్రీలంకతో కలిసి ఈ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి జగజ్జేతగా అవతరించింది. ఇదిలా ఉంటే.. సూపర్–8 దశలోనే నిష్క్రమించిన వెస్టిండీస్ మ్యాచ్‌లు అయిపోయి పది రోజులు దాటిపోయింది. సెమీస్‌లో వెనుదిరిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసి వారం రోజులకు పైనే.పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులుకానీ ఇన్ని రోజులైనా ఈ రెండు జట్లు భారత్‌లోనే గడపాల్సి వచ్చింది. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియా వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. గల్ఫ్ గగన తలం మూసివేయగా, వందల సంఖ్యలో భారత్ నుంచి రోజువారీ విమాన సర్వీసులు రద్దయ్యాయి. చార్టర్ విమానాల్ని ఏర్పాటు చేయాలనుకున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రయత్నాలు కూడా విఫలమవడంతో గల్ఫ్ మీదుగా వెళ్లాల్సిన కరీబియన్, సఫారీ జట్లు ఇక్కడే చిక్కుకుపోయాయి.చివరకు మంగళవారం కూడా ప్రత్యామ్నాయ ఆకాశ మార్గాల్లో ప్రత్యేక విమానాల్లో ఆటగాళ్లను స్వదేశాలకు చేర్చాలనుకున్నా... వీలుపడలేదు. ఎట్టకేలకు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లయిట్లలో పంపించడంతో క్రికెటర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇంగ్లండ్‌కు ప్రాధాన్యం ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సెమీస్‌లోనే వెనుదిరగగా.. మరుసటి రోజే స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాము భారత్‌లోనే చిక్కుకుపోవడం పట్ల విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ, ప్లేయర్ ఆకీల్ హొసేన్ తదితరులు ఐసీసీ తీరును విమర్శించారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం ఇంగ్లండ్‌కు ఇచ్చిన ప్రాధాన్యత.. విండీస్, సౌతాఫ్రికా జట్లకు ఇవ్వలేదని.. ఇది వివక్షే అంటూ ఐసీసీపై ఆరోపణలు చేశాడు.మేము అర్థం చేసుకోగలంఈ నేపథ్యంలో ఐసీసీ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ‘‘ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, వారి కుటుంబాలు వరల్డ్‌కప్‌లో ఆయా జట్ల ప్రయాణం ముగిసిన తర్వాత కూడా స్వదేశానికి చేరుకోకపోవడం పట్ల అసంతృప్తి చెందిన తీరును మేము అర్థం చేసుకోగలం.వారి కోపంలో అర్థం ఉంది. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం వల్లే ఈ పరిస్థితి. అంతర్జాతీయ గగనతల ప్రయాణాలకు ఇబ్బంది కలిగింది. క్షిపణుల ప్రయోగాలు, ప్రతీకార చర్యల వల్ల పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. అందుకే చార్టర్ ఫ్లైట్లు ఏర్పాటు చేయడంలోనూ ఆలస్యం జరిగింది.మా ఆధీనంలో లేవుఈ పరిస్థితులన్నీ ఐసీసీ ఆధీనంలో లేనివి. యుద్ధం వల్లే పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు చార్టర్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్టు అధికారులు, ప్రభుత్వాలతో మేము సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాము. ఆటగాళ్లను సురక్షితంగా స్వదేశాలకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశాము. సౌతాఫ్రికా జట్టు ఇప్పటికే బయల్దేరగా.. వెస్టిండీస్ బృందంలోని చాలా మంది సభ్యులు ఇంటికి చేరుకున్నారు’’ అని ఐసీసీ పేర్కొంది.ఇక ఐసీసీ వర్గాలు మైకేల్ వాన్ (Michael Vaughan) విమర్శలపై స్పందిస్తూ.. గగనతలంలో ఉన్న పరిస్థితులను బట్టే ఇంగ్లండ్ జట్టును ముందుగా స్వదేశానికి పంపించామని పేర్కొన్నాయి. మిగతా జట్ల ప్రయాణం గల్ఫ్ ప్రాంతం గుండా సాగాల్సినందునే ఆలస్యం అయిందని స్పష్టం చేశాయి.వారు మాత్రం ఇక్కడేఇదిలా ఉంటే.. ఐపీఎల్ సీజన్ కోసం పలువురు వెస్టిండీస్ క్రికెటర్లు భారత్‌లోనే ఉండిపోయారు. రావ్మన్ పావెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్), రూథర్‌ఫర్డ్ (ముంబై ఇండియన్స్), హెట్‌మైర్ (రాజస్తాన్ రాయల్స్), రొమారియో షెఫర్డ్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)లు మాత్రం జట్టు వెంట బయలుదేరలేదు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు త్వరలోనే తమ శిబిరాలను ప్రారంభించేందుకు సిద్ధమవడంతో ఆటగాళ్లు ఆయా జట్లతో చేరనున్నారు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి' -
ఐటీ కారిడార్ హాస్టళ్లలో ‘గ్యాస్’ కష్టాలు..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ హాస్టళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరా వ్యవస్థలో మరింత అంతరాయం కలగవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాలని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ తమ సభ్యులకు, నివాసితులకు మార్గదర్శకాలు జారీ చేసింది.మెనూ నుంచి చపాతీ, దోశ అవుట్?గ్యాస్ కొరత దృష్ట్యా హాస్టల్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ఒక నోటీసును విడుదల చేసింది. గ్యాస్ ఎక్కువగా ఖర్చయ్యే అల్పాహారాలను ప్రస్తుతానికి నిలిపివేయాలని హాస్టల్ యజమానులను కోరింది. చపాతీ, దోశ, పూరీ వంటి ఎక్కువ సమయం తీసుకునే వంటకాలకు స్వస్తి పలకాలని సూచించింది. పరిస్థితి మెరుగుపడే వరకు కేవలం అన్నం, సాంబార్ వంటి ప్రాథమిక భోజనం మాత్రమే అందించే అవకాశం ఉంది. లభ్యతను బట్టి అదనపు కూరలు, స్నాక్స్‌ను కూడా తాత్కాలికంగా రద్దు చేయాలని అసోసియేషన్ స్పష్టం చేసింది.‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసితులు హాస్టళ్ల యాజమాన్యానికి సహకరించాలి. వంటకు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలని హాస్టల్ యజమానులను కోరుతున్నాం’ అని నోటీసులో పేర్కొన్నారు.హోటల్ పరిశ్రమలోనూ ఆందోళనహాస్టళ్లు మాత్రమే కాకుండా నగరంలోని హోటళ్లు కూడా వాణిజ్య సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ రబ్బానీ మాట్లాడుతూ.. గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో పలుచోట్ల వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.25 రోజుల వెయిటింగ్ పీరియడ్మరోవైపు, తెలంగాణలో గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలను అధికారులు పాక్షికంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 2.3 లక్షల సిలిండర్ల సరఫరా స్థిరంగా ఉందని వెల్లడించారు. అయితే, ప్రజలు భయంతో సిలిండర్లను నిల్వ చేయకుండా చూసేందుకు ఇండియన్ ఆయిల్ రిఫైనర్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త గ్యాస్ బుకింగ్‌ల కోసం 25 రోజుల వెయిటింగ్ పీరియడ్ అమలులోకి వచ్చింది. సరఫరా క్రమబద్ధీకరణ కోసమే ఈ నిబంధన విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రీఛార్జ్ ముగిస్తే ఇన్కమింగ్ కాల్స్ ఎందుకు ఆపేస్తారు? -
బంగ్లాదేశ్‌కు భారత్ ఆపన్నహస్తం
పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు దక్షిణ ఆసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో తీవ్ర ఇంధన సంక్షోభంలో కూరుకుపోయిన బంగ్లాదేశ్ తన అవసరాల కోసం ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు చూస్తోంది. గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినడంతో తలెత్తిన కొరతను అధిగమించేందుకు భారత్ నుంచి అత్యవసరంగా డీజిల్ దిగుమతులను వేగవంతం చేసింది.బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీ) ఛైర్మన్ ముహమ్మద్ రెజానుర్ రెహ్మాన్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా 5,000 టన్నుల డీజిల్ సరుకు బంగ్లాదేశ్‌కు చేరుతోంది. భారత్ నుంచి ఏటా 1.8 లక్షల టన్నుల డీజిల్‌ను పైప్‌లైన్ ద్వారా దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఆరు నెలల్లో కనీసం 90 వేల టన్నుల డీజిల్‌ను దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అందుతున్న 5,000 టన్నులతో పాటు రాబోయే రెండు నెలల్లో ఆరు నెలలకు సరిపడా కోటాను పూర్తిగా భారత్ నుంచి దిగుమతి చేస్తామని రెహమాన్ తెలిపారు.మూతపడుతున్న యూనివర్సిటీలుబంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ధరలు ఆకాశాన్ని తాకడం, సరఫరా నిలిచిపోవడంతో దేశంలో ఇంధన పరిమితులు ప్రారంభమయ్యాయి. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను మూసివేసింది. ల్యాబ్‌లు, ఏసీలు, హాళ్లలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండటమే దీనికి కారణం. ప్రజలు ఇంధనాన్ని నిల్వ చేయకుండా ఉండేందుకు రోజువారీ విక్రయాలపై పరిమితులు విధించారు. స్పాట్ మార్కెట్ నుంచి అత్యధిక ధరలకు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్జీ) కొనుగోలు చేస్తోంది.భారత్ పాత్ర కీలకంఅంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండుతున్న వేళ పొరుగు దేశానికి భారత్ అందిస్తున్న ఈ సహకారం వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘వినియోగాన్ని తగ్గించడానికి, ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం’ అని బంగ్లాదేశ్ విద్యుత్, ఇంధన శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం మరింత కాలం కొనసాగితే బంగ్లాదేశ్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు భారత్ వంటి దేశాలు భరోసాగా నిలిచే అవకాశం ఉంది.ఇదీ చదవండి: డబుల్ ర్యాలీ.. పసిడి, వెండి ధరల్లో మార్పులు -
ఇరాన్‌కు తుర్కియే వార్నింగ్..
తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఇరాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నుంచి వచ్చిన బాలిస్టిక్ క్షిపణిని నాటో రక్షణ వ్యవస్థలు రెండోసారి కూల్చివేశాయని, ఇలాంటి "తప్పుడు, రెచ్చగొట్టే చర్యలు" కొనసాగిస్తూ మధ్యప్రాచ్యాన్ని మళ్లీ గత శతాబ్దంలోలా యుద్ధభూమిగా మార్చేస్తామంటే ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎర్డోగాన్ మాట్లాడుతూ, ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలను తుర్కియే నిశితంగా గమనిస్తోందని తెలిపారు. తమ ఆందోళనలను నేరుగా టెహ్రాన్‌కు తెలియజేశామని చెప్పారు. “ఇరాన్‌కు అవసరమైన హెచ్చరికలు ఇచ్చాం. అయినప్పటికీ వారు తప్పుదోవలోనే కొనసాగుతున్నారు” అని ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు.దౌత్యపరమైన పరిష్కారాలకే తుర్కియే ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. “ఇతర యుద్ధాల మాదిరిగానే తుర్కియే న్యాయం వైపు నిలుస్తుంది. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడానికే మేము మద్దతు ఇస్తాం” అని తెలిపారు.అదే సమయంలో దేశ రక్షణ సామర్థ్యాలపై కూడా ఎర్డోగాన్ నమ్మకం వ్యక్తం చేశారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని లక్ష్యంగా చేసుకునే ఎలాంటి బెదిరింపులకైనా తగిన ప్రతిస్పందన ఇవ్వగల సామర్థ్యం తుర్కియేకి ఉందని పేర్కొన్నారు. “తుర్కియే ప్రతి రంగంలో బలమైన దేశం. ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగలదు” అన్నారు. "మధ్యప్రాచ్యాన్ని శతాబ్దం క్రితం మాదిరిగా మళ్లీ ఆపరేటింగ్ టేబుల్‌పై ఉంచడానికి అనుమతించం" అని ఎర్డోగాన్ హెచ్చరించారు.అలాగే గాజా పరిస్థితిపై మాట్లాడుతూ, గాజాలో జరుగుతున్న ఘటనల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించుకుంటూ ఇజ్రాయెల్ రెండు దేశాల పరిష్కారాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించకుండా త్వరగా ముగియాల్సిన అవసరం ఉందని, లేకపోతే యూరప్-ఆసియాతో పాటు ప్రపంచానికే నష్టం జరుగుతుందని ఎర్డోగాన్ హెచ్చరించారు. -
రష్యా మాస్టర్ ప్లాన్.. ఇదే అదను!
పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం మండిపోతుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రిఫైనరీలు, ఆయిల్ స్టోరేజ్ డిపోలు ధ్వంసమవుతున్నాయి. హార్ముజ్ జలసంధి దాదాపు మూతపడింది. ప్రపంచంలో 20 శాతం చమురు సరఫరా ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. దీంతో మిడిల్ ఈస్ట్ నుంచి చమురు, ఎల్ఎన్జీ సరఫరాలు తీవ్రంగా తగ్గాయి. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 100 డాలర్లు దాటింది.. కొన్ని సమయాల్లో 119 డాలర్ల వరకు చేరింది.ఈ సంక్షోభానికి సద్వినియోగం చేసుకోవాలని రష్యా భావిస్తోంది. "ఇదే అదను! చమురు ధరలు భారీగా పెరిగిన ఈ సమయంలో మన సరఫరాలను సద్వినియోగం చేసుకోవాలి!" అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారులకు స్పష్టం చేశారు. రష్యా ఇప్పటికే యూరప్‌కు సరఫరా చేస్తున్న గ్యాస్‌ను తగ్గించి.. లేదా పూర్తిగా ఆపేసి.. ఆ సరఫరాలను ఇతర మార్కెట్లకు (ఆసియా దేశాలు, భారత్ వంటివి) మళ్లించాలని సూచించారు."మనం ఇప్పుడే ఎక్కువ సరఫరాలు అవసరమయ్యే మార్కెట్లకు మా దృష్టిని మళ్లిస్తే.. అక్కడ అడుగు పెట్టవచ్చు" అని పుతిన్ చెప్పారు. యూరప్ దేశాలు రష్యా గ్యాస్‌పై ఆంక్షలు విధించాలని, 2027 నాటికి పూర్తిగా ఆపేయాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడే ఆ సరఫరాలను ఆపి.. ధరలు ఎక్కువగా ఇచ్చే కొత్త మార్కెట్లలో స్థానం సంపాదించుకోవచ్చనేది ఆయన వ్యూహం.రష్యా ఆయిల్ (ఉరల్స్ క్రూడ్) ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. గతంలో 40 డాలర్లకి పడిపోయిన ధర.. ఇప్పుడు 60 డాలర్లు పైగా ఉంది. కొన్ని మార్కెట్లలో బ్రెంట్ కంటే కూడా ప్రీమియంతో అమ్ముడవుతోంది! ఇరాన్ యుద్ధం వల్ల మిడిల్ ఈస్ట్ ఎల్ఎన్జీ ఉత్పత్తి పునరుద్ధరణకు నెలల తరబడి సమయం పడుతుందని పుతిన్ చెప్పారు. దీంతో రష్యా ఎనర్జీ ఎగుమతుల నుంచి భారీ ఆదాయం వస్తుంది.. అది ఉక్రెయిన్ యుద్ధ ఖర్చులకు కూడా సహాయపడుతుంది.ఈ 'మాస్టర్ ప్లాన్'తో రష్యా ఆర్థికంగా బలపడుతుందా.. లేక యూరప్ ఎనర్జీ సంక్షోభం మరింత తీవ్రమవుతుందా? ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాయో చూడాలి.Putin says Russia should take advantage of the sky-high oil prices after US-Israeli attacks on Iran.Russia should redirect supplies to Europe elsewhere, he adds. “If we shift our focus right now to the markets that need more supplies, we might get a foothold there.” pic.twitter.com/FZAHksP2p6— max seddon (@maxseddon) March 9, 2026 -
‘కోటి మంది భారతీయుల క్షేమమే మా ప్రాధాన్యత’
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతకంతకూ క్షీణిస్తున్న భద్రతా వాతావరణంపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిరత కేవలం భౌగోళిక రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఇంధన భద్రత, కోటి మంది ప్రవాస భారతీయుల జీవనానికి ముప్పుగా పరిణమించిందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత తొలి రోజైన సోమవారం ఆయన రాజ్యసభలో పశ్చిమాసియా పరిణామాలపై మాట్లాడారు.క్షీణించిన భద్రత.. ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థపశ్చిమాసియాలో భద్రతా పరిస్థితులు దిగజారాయని మంత్రి పేర్కొన్నారు. ‘మేము అక్కడి పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. ఈ సంఘర్షణ ఆ ప్రాంతంలో సాధారణ జనజీవనాన్ని, ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇది ఇప్పటికే పొరుగు దేశాలకు వ్యాపించి విధ్వంసానికి దారితీస్తోంది’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల సభ తరఫున ఆయన సంతాపం ప్రకటించారు.సరఫరా గొలుసుపై ప్రభావంభారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం ప్రధానంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఉద్రిక్తతలు ఇంధన భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉందని జైశంకర్ అన్నారు. ముడిచమురుకు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత, సరఫరాలో అంతరాయాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాలు ఈ ప్రాంతంలోనే ఉండటంతో సరఫరా గొలుసు దెబ్బతినడం భారత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని పేర్కొన్నారు.కోటి మంది భారతీయుల భద్రతపశ్చిమాసియాలో సుమారు కోటి మంది భారతీయ పౌరులు నివసిస్తున్నారని, వారి శ్రేయస్సు అత్యంత ప్రధానమైన అంశమని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఇరాన్లో వేలాది మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని, వారి భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. భారతీయుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యతని పునరుద్ఘాటించారు.ఇరాన్ నౌకల అభ్యర్థనపై స్పష్టతసముద్ర లాజిస్టిక్స్ విషయంలో ఇరాన్ ఇటీవల భారతదేశాన్ని సంప్రదించిందని జైశంకర్ వెల్లడించారు. భారత తీరాల్లో మూడు ఇరాన్ నౌకలు లంగరు వేయడానికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. అయితే, ఈ అభ్యర్థనను భారత ప్రభుత్వం తన జాతీయ ప్రయోజనాలను, అంతర్జాతీయ నిబంధనలను బేరీజు వేసుకుంటూ నిశితంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.చర్చలు ముఖ్యం‘ఏ సమస్యకైనా హింస పరిష్కారం కాదు. చర్చలు, దౌత్యం ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ నమ్ముతోంది. ఇటీవల కూడా మేము ఇదే విషయాన్ని చెప్పాం’ అని జైశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనడం భారతదేశ ఆర్థిక పురోగతికి, ప్రాంతీయ భద్రతకు అత్యవసరమని సభకు వివరించారు.ఇదీ చదవండి: నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం! -
నగరాల్లో వంటగ్యాస్ సంక్షోభం!
మిడిల్ఈస్ట్ ప్రాంతంలో మారుతున్న యుద్ధ సమీకరణాలు సామాన్యుడి వంటింటిపై ప్రభావం చూపే దశకు చేరాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దీని ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి, వంటగ్యాస్ కొరత పెరిగినట్లు కొందరు భావిస్తున్నారు.వేచి ఉండే సమయం పెంపు.. పెరిగిన ఆందోళనగ్యాస్ రీఫిల్ బుక్ చేసిన వినియోగదారులు మునుపటిలా వెంటనే సిలిండర్ పొందే పరిస్థితి లేదు. సరుకు రవాణాలో ఆలస్యం కారణంగా బుకింగ్ చేసిన తర్వాత డెలివరీ కోసం రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో సోమవారం ఉదయం నుంచే డీలర్ల వద్ద బుకింగ్‌లు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా రెండు సిలిండర్లు ఉన్న కుటుంబాలు, స్టాక్ అయిపోతుందనే భయంతో డీలర్ అవుట్లెట్ల వద్ద క్యూ కడుతున్నారు.కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేతహోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను డీలర్లు పూర్తిగా నిలిపివేశారు. ‘కనీసం 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్లు అయినా అందుబాటులో ఉన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్స్ తీవ్ర సంక్షోభంలో పడుతున్నాయి’ అని ఒక సబర్బన్ డీలర్ పేర్కొన్నారు. దీనివల్ల హోటల్ యజమానులు బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసే ప్రమాదం ఉందని, అది చట్టవిరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పెరిగిన ధరలు.. కొత్త నిబంధనలుసంక్షోభం చాలదన్నట్లు ధరల పెరుగుదలతో వినియోగదారుడిపై మరింత భారం మోపినట్లయింది. ఆదివారం నుంచి కమర్షియల్ సిలిండర్ ధర రూ.115, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 చొప్పున పెరిగింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ప్రకారం, ఇకపై దేశీయ వినియోగదారులు ఒక సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత మాత్రమే తదుపరి రీఫిల్ బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. గతంలో ఇది 15 రోజులుగా ఉండేది. గతంలో ఉన్న సరళమైన బుకింగ్ సౌకర్యాన్ని ప్రభుత్వం నియంత్రించడం గమనార్హం.క్షేత్రస్థాయిలో భయాందోళనలుముంబయిలోని అంధేరీ వంటి రద్దీ ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచే వినియోగదారులు డీలర్ల కార్యాలయాలకు పరుగులు తీశారు. ‘గ్యాస్ అయిపోకముందే ఒక సిలిండర్ తెచ్చి పెట్టుకోవాలని చూస్తున్నాం. యుద్ధం ఎటు దారితీస్తుందో, సరఫరా ఎప్పుడు ఆగుతుందో తెలియడం లేదు’ అని ఒక స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘చైనాతో చేసిన పొరపాటు భారత్‌తో చేయం’ -
మా జట్టుకే ప్రాధాన్యం!.. ఐసీసీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఫైర్
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీరును తప్పుబట్టాడు. ఐసీసీ ఒక్కొక్క జట్టును ఒక్కోలా చూస్తుందని.. తాజాగా ఇంగ్లండ్‌కు పెద్ద పీట వేసిన తీరే ఇందుకు నిదర్శనమని విమర్శించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత్- శ్రీలంక ఆతిథ్యం దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే.టైటిల్ పోరుతో తెరఫిబ్రవరి 7న మొదలైన ఈ ఐసీసీ టోర్నీ నేటి (మార్చి 8) ఫైనల్‌తో ముగియనుంది. భారత్- న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య జరిగే టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ టోర్నీ మధ్యలోనే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు.. అందుకు ఇరాన్ స్పందిస్తున్న తీరుతో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది.వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు ఇక్కడే!ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల గగనతలం మూసివేయడంతో వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు భారత్‌లోనే చిక్కుకుపోయాయి. నిజానికి విండీస్ మార్చి 1 టీమిండియా చేతిలో ఓటమి తర్వాత టోర్నీ నుంచి నిష్క్రమించింది. పరిస్థితులు సాధారణంగా ఉండి ఉంటే.. ఆ మరుసటి రోజే స్వదేశానికి చేరుకోవాల్సింది.కానీ పశ్చియాసియాలో యుద్ధం కారణంగా విండీస్ జట్టు వారం రోజులుగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు.. సౌతాఫ్రికా సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో జరిగిన మార్చి 4 నాటి మ్యాచ్‌లో ఓడి ఎలిమినేట్ అయింది. యుద్ధ పరిస్థితుల వల్ల జట్టు కూడా ఇక్కడే ఉంది. మరోవైపు.. సెమీ ఫైనల్లో మార్చి 5న టీమిండియా చేతిలో ఓడిన ఇంగ్లండ్ కూడా ఇక్కడే ఉండాల్సి రాగా.. ఐసీసీ జోక్యంతో శనివారం స్వదేశానికి ప్రత్యేక విమానంలో బయల్దేరింది. ఇక వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లకు కూడా ఐసీసీ ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అనుమతి రాలేదని సమాచారం.దీంతో ఆ రెండు జట్లు ఇంకా భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ.. ‘‘మమ్మల్ని త్వరగా పంపిచేయండి’’ మహాప్రభో అంటూ మొరపెట్టుకున్న తీరు చర్చనీయాంశమైంది.ఇంగ్లండ్‌కి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికిందిఈ పరిణామాలపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఐసీసీ తీరును విమర్శించాడు. ‘‘ఇంగ్లండ్ గురువారమే నాకౌట్ అయింది. వాళ్లకి మాత్రం చార్టర్ ఫ్లైట్ దొరికింది. వెస్టిండీస్ గత ఆదివారం నుంచి కోల్‌కతాలోనే చిక్కుకుపోయింది.సౌతాఫ్రికా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇక్కడే అధికార దుర్వినియోగం ఎలా జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. జట్లన్నీ ఒకే పరిస్థితిలో ఉన్నపుడు.. వాటన్నింటీ ఒకే విధంగా ట్రీట్ చేయాలి కదా!.. ఓ దేశ బోర్డు శక్తిమంతమైనది అయినంత మాత్రాన ఐసీసీ వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని మైకేల్ వాన్ ట్వీట్ చేశాడు.ఓవరాక్షన్ వద్దుఅయితే, వాన్ పోస్టుకు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండియా- యూరోప్ మధ్య గగనతలంలో ఎలాంటి అడ్డంకులు లేవని.. అదే వెస్టిండీస్ వంటి జట్టు స్వదేశం చేరాలంటే గల్ఫ్ దేశాలు దాటాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.ఒకవేళ యూరోప్ గుండా విండీస్ జట్టును పంపించాలన్నా ఇప్పటికిప్పుడు వీసా, ఒకే చోట 40- 50 మందికి సీట్లు అరేంజ్ చేయడం కుదరదని అంటున్నారు. భౌగోళిక పరిస్థితులను బట్టే ఓ జట్టు ముందు.. ఓ జట్టు వెనక వెళ్లడం జరుగుతుందని.. అంతే తప్ప ఇందులో అధికార దుర్వినియోగం ఏమీ లేదని వాన్‌కు చురకలు అంటిస్తున్నారు. కాగా ఆదివారం నాటికి వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు స్వదేశానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.చదవండి: T20 WC Final: సాంట్నర్‌కు ఇచ్చిపడేసిన సూర్యకుమార్ -
పాకిస్తాన్లో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్.. డీజిల్!
పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను దాదాపు 20 శాతం వరకు పెంచినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఆ దేశ పెట్రోలియం మంత్రి అలీ పర్వేజ్ మాలిక్ టెలివిజన్ ద్వారా దేశ ప్రజలకు పెట్రోల్, డీజిల్ పెంపు విషయాన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.ప్రభుత్వం పెట్రోల్ ధరను లీటరుకు 55 పాకిస్తాన్ రూపాయలు పెంచి 321.17 రూపాయలకు నిర్ణయించింది. అలాగే డీజిల్ ధరను లీటరుకు 335.86 రూపాయలకు పెంచింది. ఇటీవలి సంవత్సరాల్లో ఇది అతిపెద్ద ధర సర్దుబాట్లలో ఒకటిగా భావిస్తున్నారు.ద్రవ్యోల్బణంపై ప్రభావంఇంధన ధరల పెరుగుదలతో దేశంలో ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తక్కువ ఆదాయ వర్గాలపై ఇది తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా ఇంధన ధరలు పెరిగితే రవాణా ఛార్జీలు పెరగడం, దాంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడం సాధారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలుధరల పెంపు ప్రకటనకు ముందే లాహోర్, కరాచీ వంటి ప్రధాన నగరాల్లోని పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొరత వచ్చే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ముందుగానే ఇంధనం కొనుగోలు చేయడానికి ఎగబడినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది.ప్రభుత్వం హెచ్చరికఇంధన నిల్వలు చేసుకునే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. దేశంలో తగినంత పెట్రోల్ నిల్వలు ఉన్నప్పటికీ మధ్యప్రాచ్య పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి వస్తాయో తెలియకపోవడంతో వాటిని జాగ్రత్తగా వినియోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.చమురు దిగుమతులపై ఆధారపడిన పాకిస్తాన్పాకిస్తాన్ తన ముడి చమురులో ఎక్కువ భాగాన్ని సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ సరఫరాలు ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాలో కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వస్తాయి. ఇకపై అంతర్జాతీయ చమురు ధరల మార్పులకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతి వారం సమీక్షిస్తామని పాకిస్తాన్ చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలపై ట్రంప్ రియాక్షన్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలపై ట్రంప్ స్పందించారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదన్న ట్రంప్.. తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇరాన్ తన పట్టు కోల్పోయిందని.. పొరుగు దేశాలకు లొంగిపోయిందంటూ వ్యాఖ్యానించారు. అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడులతోనే ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. ఇకపై పొరుగు దేశాలను ఆ దేశం బెదిరింపులకు దిగదంటూ చురకలు అంటించారు.ఇరాన్.. ఓడిపోయింది. పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇరాన్ ఇక మధ్యప్రాచ్య రౌడీ కాదు. ఇరాన్ నలిగిపోతోంది. పొరుగు దేశాలపై ఇకపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు జరిపిన నిరంతర దాడుల వల్లే ఇది సాధ్యమైంది’’ అంటూ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేశారు. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ తన పొరుగు దేశాల ముందు ఓడిపోవడం ఇదే మొదటిసారి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకప్పుడు మధ్యప్రాచ్యంలో అందరినీ భయపెట్టిన ఇరాన్.. ఇప్పుడు మధ్యప్రాచ్య పరాజితగా మారిందని ట్రంప్ ఎద్దేవా చేశారు.కాగా, ఉద్రిక్తతలను తగ్గించేలా.. పొరుగు దేశాలను తమ సోదరులుగా అభివర్ణించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. దాడులు చేసినందుకు క్షమాపణలు తెలిపిన సంగతి తెలిసిందే. తమపై దాడులు జరిగితే తప్ప, పొరుగు దేశాలపై క్షిపణులు ప్రయోగించవద్దని తమ సాయుధ దళాలకు ఆదేశాలిచ్చామని ఆయన పేర్కొన్నారు.మరోవైపు, ఇరాన్‌పై ఇవాళ మరింత తీవ్రమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటివరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలను కూడా ఈసారి ధ్వంసం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా, ఇరాన్ అధ్యక్షుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దుబాయ్, అబుదాబిలలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తాత్కాలికంగా సేవలను నిలిపివేసింది. -
భారత్‌కు ఇంధన సవాలు
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధ వాతావరణం భారతదేశ ఇంధన భద్రతకు పెను సవాలుగా మారాయని 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా పేర్కొన్నారు. ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్న ఆయన భారత ఆర్థిక గమనం, రాష్ట్రాల పురోగతిపై తన విశ్లేషణను పంచుకున్నారు.అంచనాలను మించి ఆర్థిక వృద్ధిప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని పనగారియా స్పష్టం చేశారు. ‘2025-26తో ముగిసిన మూడేళ్ల కాలంలో భారత వాస్తవ జీడీపీ సగటున 7.3 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పాదక రంగం ఏకంగా 11.2 శాతం సగటు వృద్ధితో దూసుకుపోతోంది. ఇది పారిశ్రామికాభివృద్ధిలో ఒక సానుకూల సంకేతం’ అని ఆయన విశ్లేషించారు.అమెరికా వాణిజ్య విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను భారత్ చాకచక్యంగా అవకాశాలుగా మలుచుకుందని ప్రశంసించారు. ఇటీవల కొన్ని దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వాణిజ్య పరిధి పెరుగుతుందన్నారు.తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలుదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన ప్రధానాంశాలను పనగారియా సూచించారు.దిగుమతి సుంకాలు, నాణ్యత నియంత్రణ ఉత్తర్వులను హేతుబద్ధీకరించడం.1956 నాటి యూజీసీ చట్టం స్థానంలో పార్లమెంటు పరిశీలనలో ఉన్న కొత్త చట్టాన్ని తీసుకురావడం.2013 నాటి ఎల్ఏఆర్ఆర్ చట్టాన్ని సవరించి భూసేకరణ ప్రక్రియలో ఉన్న అడ్డంకులను తొలగించడం.రాష్ట్రాలకు సూచనలు‘విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్) నష్టాల వల్ల రాష్ట్రల ఖజానా ఖాళీ అవుతోంది. రాబోయే 5-7 ఏళ్లలో వీటిని క్రమ పద్ధతిలో ప్రైవేటీకరించాలి. కార్మిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపరమైన భద్రత వంటి అంశాల్లో సరళీకృత విధానాలను అవలంబించాలి. పట్టణ భూ విపణిని వ్యాపార అనుకూలంగా మార్చడంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలస వచ్చే వారికి అనువైన వాతావరణం కల్పించాలి. భారతదేశం తన యువ శక్తిని, విస్తారమైన నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా మారుతుంది’ అని అరవింద్ పనగారియా ఆశాభావం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: అమెరికాలో పెరిగిన నిరుద్యోగం -
T20 WC 2026: ఐసీసీ రంగంలోకి దిగినా.. తప్పని చిక్కులు
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో వెస్టిండీస్ ఫర్వాలేదనిపించగా.. సౌతాఫ్రికా సెమీస్ వరకు ప్రయాణం కొనసాగించింది. లీగ్ దశలో అదరగొట్టిన విండీస్ జట్టు.. సూపర్-8లో కీలక మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడి నిష్క్రమించింది.మరోవైపు.. సౌతాఫ్రికా లీగ్ దశలో అజేయంగా నిలవడంతో పాటు.. సూపర్-8లోనూ హ్యాట్రిక్ విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. అయితే, కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి మరోసారి ‘చోకర్స్’ అన్న బిరుదును సార్థకం చేసుకుంది. ఇక ఈ రెండు జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించినా.. ఇంకా ఇంటికి చేరుకోలేదు.భారత్‌లోనే చిక్కుకుపోయారుఇందుకు మధ్య ప్రాచ్యంలోని యుద్ధ వాతావరణం కారణం. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుండగా.. అందుకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిస్తోంది. దీంతో గల్ఫ్ దేశాల్లో గగనతలం మూసివేశారు. దీంతో వెస్టిండీస్, జింబాబ్వే, సౌతాఫ్రికా జట్ల ఆటగాళ్లు భారత్‌లోనే చిక్కుకుపోయారు. అయితే, జింబాబ్వే జట్టును ప్రత్యేక విమానంలో ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)తరలించినట్లు సమాచారం.ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినా..ఇక వెస్టిండీస్ జట్టు కోసం కూడా ప్రత్యేక విమానం ఏర్పాటు చేయగా.. ఎయిర్ ట్రాఫిక్ అధికారుల నుంచి ఇంత వరకు ఆమోదం లభించనట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లలో మరోసారి ఆందోళన నెలకొంది. కాగా ఇప్పటికే వెస్టిండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ (Daren Sammy).. తమను స్వదేశానికి చేర్చమంటూ దీనంగా అర్థించిన విషయం తెలిసిందే.ఇక బౌలర్ అకీల్ హొసేన్ సైతం క్రిస్టియాన్ రొనాల్డోనే ఈ పరిస్థితులలో తమను ఆదుకోగలడంటూ ట్వీట్ చేశాడు. అయితే, ఐపీఎల్లో భాగమైన షెర్ఫానే రూథర్‌ఫర్డ్, రోవ్‌మన్ పావెల్, షిమ్రన్ హెట్‌మైర్ తదితరులు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.సౌతాఫ్రికానూ వీడని చిక్కులుఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా ఆటగాళ్లు కూడా మరికొన్నాళ్లు భారత్‌లోనే ఉండాల్సి రావొచ్చు. అయితే, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో దాదాపు నలుగురు ఆటగాళ్లు నేరుగా కివీస్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సెమీస్ మ్యాచ్‌లలో సౌతాఫ్రికాను న్యూజిలాండ్.. ఇంగ్లండ్‌ను టీమిండియా ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఇరుజట్ల మధ్య ఆదివారం నాటి టైటిల్ పోరుకు అహ్మదాబాద్ వేదిక.చదవండి: T20 WC Final: బుమ్రా మనిషే.. తనకూ చెడ్డరోజు ఉంటుంది: కివీస్ స్టార్ -
కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్న ఎగుమతిదారులు
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదరడంతో భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య వివాదం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో భారతీయ ఓడరేవుల్లో సుమారు 38,000 కంటైనర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సరుకు పంపలేక, ఇటు పోర్టుల్లో ఉంచితే పెరిగే భారీ అద్దెలను భరించలేక ఎగుమతిదారులు ఇప్పుడు తమ కంటైనర్లను వెనక్కి తీసుకుంటున్నారు.సగానికి పైగా కంటైనర్లు వెనక్కి!తాజా అధికారిక సమాచారం ప్రకారం, నిలిచిపోయిన కంటైనర్లలో దాదాపు 50 శాతం అంటే సుమారు 19,000 కంటైనర్లను ఎగుమతిదారులు వెనక్కి రప్పించుకుంటున్నారు. దీనికోసం కస్టమ్స్ శాఖకు ‘బ్యాక్ టు టౌన్’ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా త్వరగా పాడైపోయే పండ్లు, కూరగాయలు, ఔషధాల విషయంలో ఎగుమతిదారులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు.వీటిని ఏం చేస్తారు?విదేశాలకు వెళ్లాల్సిన ఉల్లి, అరటి, ద్రాక్ష, బాస్మతీ బియ్యం ఇప్పుడు భారతీయ మార్కెట్లలోనే అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల దేశీయంగా వీటి ధరలు కొంత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ ఎగుమతిదారులకు మాత్రం ప్యాకేజింగ్, రవాణా ఖర్చుల రూపంలో నష్టం తప్పదనే అభిప్రాయాలున్నాయి. పోర్టుల్లో కంటైనర్ నిలిచి ఉంటే నిర్వహణ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. షిప్పింగ్ లైన్లు కూడా 2,000 డాలర్ల వరకు అదనపు సర్ఛార్జీలు విధిస్తుండటంతో ఎగుమతి లాభదాయకం కాదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కింద తెలియజేశాం.ఇదీ చదవండి: ప్రకటనల రంగంలో ఏఐ విప్లవం -
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఇరాన్ కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే కీలక వ్యాఖ్యలు చేశారు. తమ టార్గెట్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పొరుగు అరబ్ దేశాలకు ఎటువంటి నష్టం కలగలేదన్నారు.ఇరాన్ చేపట్టిన సైనిక దాడులు చాలా జాగ్రత్తగా.. కేవలం అమెరికా లక్ష్యాలను మాత్రమే గురిచూసి చేసినవని ఆయన తెలిపారు. ఈ దాడుల వల్ల పొరుగున ఉన్న ఏ ఒక్క అరబ్ దేశానికి కూడా ప్రాణనష్టం, ఆస్తి నష్టం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్‌లో ప్రసంగిస్తూ.. ఇరాన్ చర్యలను సమర్థించుకున్నారు.అలాగే, ఏఎన్ఐతో మాట్లాడుతూ.. చివరి బుల్లెట్ వరకు ప్రతిఘటించడం తప్ప.. మరో మార్గం లేదన్నారు. ఇరాన్ ప్రస్తుతం పూర్తి యుద్ధ స్థితిని ఎదుర్కొంటోందని ఖతీబ్జాదే నొక్కి చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడికి, దురాక్రమణకు మేము గురవుతున్నాము. వారు ఇరాన్‌కు భారీ నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు. నా తోటి పౌరులు అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న కార్పెట్ బాంబింగ్లతో నిరంతరం దాడులకు గురవుతున్నారు. టెహ్రాన్ నిరంతర దాడుల నీడలో ఉంది.ఇది ఇరాన్ పౌరుల వీరోచిత యుద్ధం. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలి. అలాగే, ఒక దేశాధినేతను అమెరికా హత్య చేసిందని ఆరోపిస్తూ, ఇది ప్రపంచ దౌత్య సంబంధాలకు ముప్పు అంటూ ఆయన హెచ్చరించారు. -
ఇరాన్‌తో యుద్ధం.. ఇజ్రాయెల్‌కు వారానికి ఎంత నష్టమంటే..!
జెరూసలేం: జనాలను, జలవనరులను నాశనంచేసే యుద్ధం కారణంగా దేశాల ఖజానాలు వేగంగా ఖాళీ అవుతుంటాయి. ఇప్పుడు ఇరాన్‌పై బాంబులేస్తూ యుద్ధంలో మునిగిపోయిన ఇజ్రాయెల్ ఆర్థిక కోణంలో వారానికి దాదాపు రూ.27 వేల కోట్లు నష్టపోతోందని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనావేసింది. ఇకనైనా ఇతర దేశాలతో వాణిజ్యాన్ని పెంచుకోవాలని లేదంటే ఆర్థికఊబిలో కూరుకుపోతామని ఆర్థికశాఖ హెచ్చరించింది.ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షెయీ క్లాపర్కు ఆర్థికశాఖ డైరెక్టర్ జనరల్ ఇలాన్ రోమ్ ఒక లేఖ రాశారు. భద్రతకోణంలో రక్షణాత్మక చర్యలు అవసరమేగానీ ఆర్థిక స్వావలంభన పైనా దృష్టిసారించాలని ఆయన హెచ్చరించారు. ‘‘విద్యాసంస్థలు, వ్యాపారసముదాయాలు, పని ప్రదేశాలను మూసేయడంతో వ్యాపారం తగ్గిపోయి ఆర్థికవ్యవస్థ దెబ్బతింటోంది. ఇకనైనా కఠిన ఆంక్షలను పాక్షికంగా సడలించాలి. రెడ్ లెవల్ అలర్ట్‌ను ఆరెంజ్ స్థాయికి తగ్గించాలి’’ అని ఆయన లేఖలో సూచించారుకాగా, ఇరాన్‌పై దాడి కోసం అమెరికా అక్షరాల 779 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.6,900 కోట్లు) ఖర్చు చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం ట్రంప్ ప్రకటించినట్లుగా ఇరాన్‌పై దాడులు నాలుగు లేదా ఐదు వారాలు అంతకంటే ఎక్కువ సమయం పడితే లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా.సెంటర్ ఫర్ న్యూ అమెరికన్ సెక్యూరిటీ డేటా ప్రకారం..క్యారియర్ స్ట్రైక్ గ్రూపులు (ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యూఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ వంటివి) పనిచేయడానికి రోజుకు దాదాపు 6.5 మిలియన్లు (రూ.58 కోట్లు) ఖర్చయ్యాయి. అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక వ్యక్తులను టార్గెట్ చేస్తూ అమెరికా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ సహా రెండు యుద్ధ విమానాలను మొహరించింది. దీంతో పాటు విమానాలను తిరిగి తెచ్చుకోవడం, నేవి నౌకలను మోహరించడం, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంతో పాటు సైనికుల నిత్యవసరాలు, యుద్ధసామాగ్రి, యుద్ధంలో వినియోగించేందుకు ట్యాంకర్లు ఇతర వాహనాలకోసం వినియోగించే ఇంధనంతో పాటు వ్యవహారాల కోసం దాదాపు 630 మిలియన్ డాలర్లు (రూ.5,556 కోట్లు) ఖర్చైంది. -
T20 WC 2026: జింబాబ్వే జట్టుకు భారీ ఊరట
జింబాబ్వే క్రికెట్ జట్టుకు భారీ ఊరట లభించింది. ఎట్టకేలకు స్వదేశానికి వెళ్లే మార్గం సుగమమైంది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో జింబాబ్వే చిరస్మరణీయ విజయాలు సాధించిన విషయం తెలిసిందే.ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించిభారత్- శ్రీలంక వేదికగా ఈ మెగా టోర్నీలో గ్రూప్-బి నుంచి శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఒమన్‌లతో కలిసి జింబాబ్వే పోటీ పడింది. అనూహ్య రీతిలో మాజీ చాంపియన్లు ఆస్ట్రేలియా, శ్రీలంకను ఓడించి గ్రూప్ టాపర్‌గా సూపర్-8 చేరింది. అయితే, కీలక దశలో వెస్టిండీస్, టీమిండియా, సౌతాఫ్రికా చేతిలో ఓడి నిష్క్రమించింది.యుద్ధం కారణంగాఈ నేపథ్యంలో మార్చి 2న భారత్ నుంచి జింబాబ్వే జట్టు స్వదేశానికి పయనం కావాల్సింది. కానీ ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో గల్ఫ్ వేదికగా ప్రయాణించాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఫలితంగా జింబాబ్వే జట్టు బుధవారం వరకు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది.ఈ క్రమంలో బ్యాచ్‌ల వారీగా భారత్‌ను వీడేందుకు జింబాబ్వే సిద్ధమైనట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. బుధవారం తొలి బ్యాచ్ స్వదేశానికి పయనం కాగా.. శుక్రవారం ఆఖరి బ్యాచ్ ఇండియా నుంచి బయల్దేరుతుందని తెలిపింది.అందుకే విడతల వారీగాఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పేర్కొంది. తగినన్ని విమానాలు అందుబాటులో లేనందున విడతల వారీగా ఆటగాళ్లు జింబాబ్వేకు చేరుకుంటాడని బోర్డు వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జింబాబ్వే జట్టు దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ ఫ్లైట్‌లో వెళ్లాల్సింది. అయితే, యుద్ధ ప్రభావం కారణంగా అదిస్ అబాబా, ఇథియోపియా మీదుగా హరారేకు వారు చేరుకోనున్నట్లు సమాచారం. మరోవైపు.. వెస్టిండీస్ క్రికెట్ జట్టు సైతం భారత్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.చదవండి: మొయిన్ అలీపై నిషేధం..! -
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం.. ఐసీసీ టోర్నీ వాయిదా
అమెరికా, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధ ప్రభావం క్రికెట్‌పై కూడా పడింది. ఇప్పటికే పాకిస్తాన్ షాహీన్స్-ఇంగ్లండ్ లయన్స్ మధ్య అబుదాబీలో జరగాల్సిన అనధికారిక వన్డే సిరీస్ రద్దు కాగా.. తాజాగా ఐసీసీ టోర్నీ వాయిదా పడింది. నేపాల్‌లోని ఖాట్మండు వేదికగా మార్చి 10 నుంచి 20వ తేదీ వరకు జరగాల్సిన ICC Men’s Cricket World Cup League 2లో పలు మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఈ మ్యాచ్‌లలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లు పాల్గొనాల్సి ఉంది. వాయిదా విషయాన్ని క్రికెట్ నేపాల్ అధికారికంగా ప్రకటించింది. కొత్త షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.కాగా, ICC Men’s Cricket World Cup League 2 టోర్నీ ద్వారా 2027 వన్డే ప్రపంచకప్‌లో నాలుగు బెర్త్‌లు ఖరారవుతాయి. ఈ క్వాలిఫయర్ టోర్నీ వాయిదా ఆయా జట్ల అర్హత అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో ఒమన్, యూఏఈ, నేపాల్ జట్లతో పాటు యూఎస్ఏ, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, కెనడా, నమీబియా జట్లు పాల్గొంటున్నాయి.ఇదిలా ఉంటే, పశ్చిమాసియాలో యుద్దం పరోక్షంగానూ క్రికెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ యుద్దం కారణంగా గల్ఫ్‌లో దుబాయ్ సహా ప్రధాన విమానాశ్రయాలన్నీ మూసివేయడంతో టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొన్న పలు జట్లు స్వదేశాలకు తిరిగి వెళ్లలేకపోయాయి. మరోపక్క సౌతాఫ్రికాలో పరిమిత ఓవర్ల సిరీస్ ముగించుకున్న పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కూడా అక్కడే ఇరుక్కుపోయింది. ఈ విషయాలను ఐసీసీ దగ్గరుండి పరిశీలిస్తూ.. ఆయా జట్లకు తగిన సహాయ సహకారాలు అందిస్తుంది. -
భారత్ క్రూడాయిల్, ఎల్పీజీ నిల్వలు ఇలా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు) మారుతున్న యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే ఎదుర్కోవడానికి దేశం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం మన వద్ద 50 రోజులకు సరిపడా ముడి చమురు, ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.నిల్వల లభ్యత ఇలా..ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారత్ వద్ద ప్రస్తుతం ముడి చమురు 25 రోజులకు సరిపడా నిల్వలున్నాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులు మరో 25 రోజులకు సరిపోతాయి. మొత్తంగా 50 రోజుల వరకు ఎటువంటి సరఫరా అంతరాయం లేకుండా దేశ అవసరాలను తీర్చవచ్చు. ఇవి కాకుండా విశాఖపట్నం, మంగళూరు, పాడూరులోని వ్యూహాత్మక నిల్వల్లో 4.094 మిలియన్ టన్నుల ముడి చమురు సిద్ధంగా ఉంది. ఇది మన మొత్తం సామర్థ్యంలో (5.33 మెట్రిక్ టన్నులు) సుమారు 77 శాతానికి సమానం.స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్..భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోంది. ప్రతిరోజూ సుమారు 5.6 మిలియన్ బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను దేశం వినియోగిస్తోంది. గతంలో దిగుమతుల్లో 40% స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వచ్చేవి. ప్రస్తుతం ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈల నుంచి దిగుమతులు పెరగడంతో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా వచ్చే చమురు వాటా 50 శాతానికి చేరింది. యుద్ధం తీవ్రమైతే ఈ మార్గం ద్వారా సరఫరా సవాలుగా మారే అవకాశం ఉంది.ప్రభుత్వ చర్యలుపరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ‘మేము అమెరికా, దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా వంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యామ్నాయంగా చమురును సేకరిస్తున్నాం. రిఫైనరీలు అవసరమైనప్పుడు ఇతర వనరుల నుంచి కొనుగోళ్లను వేగవంతం చేస్తున్నాయి’ అని ఒక అధికారి తెలిపారు.ధరల పెంపు ఉంటుందా?ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇచ్చాయి. అయితే, యుద్ధం 10-15 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 82 డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఎల్పీజీ పరిస్థితి ఏమిటి?వంట గ్యాస్ విషయంలోనూ భారత్ ఊరటనిచ్చే సమాచారమే ఇచ్చింది. భారత్ వద్ద 25-30 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. మనం 80-85% ఎల్పీజీ అవసరాల కోసం గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్నాం. 2025 ఆర్థిక సంవత్సరంలో 20.67 మిలియన్ టన్నుల ఎల్పీజీని భారత్ దిగుమతి చేసుకుంది. వచ్చే రెండు వారాల్లో పశ్చిమ ఆసియాలో పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని కేంద్రం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతరాయాలు ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ ఇదివరకే రాజ్యసభలో స్పష్టం చేశారు.ఇదీ చదవండి: యుద్ధ భయాలు.. మార్కెట్లో నీలినీడలు -
క్రూడ్ కల్లోలం.. గ్లోబల్ మార్కెట్లు కుదేల్
అమెరికా, ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతుండటం అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ప్రధానంగా చమురు, సహజ వాయువు, పెట్రోలియం ఆధారిత ఇంధనాలను గణనీయంగా ఉపయోగించే దేశాల స్టాక్ మార్కెట్లు, కంపెనీలను కుదేలు చేస్తోంది. ఒక దశలో అమెరికాలో కీలకమైన సూచీలైన డోజోన్స్ 2.5 శాతం (1,232 పాయింట్లు), నాస్డాక్ 2.7 శాతం మేర క్షీణించాయి. ఎస్అండ్పీ 500లోని 95 శాతం స్టాక్స్ నష్టపోవడం గమనార్హం. పెరిగే ఇంధన భారం, ఫ్లయిట్ల రద్దుపరమైన సవాళ్లతో అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ షేరు 5.4 శాతం, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 5.8 శాతం పతనమయ్యాయి.అటు ఆసియా, యూరప్ సూచీలు కూడా తగ్గాయి. దక్షిణ కొరియా కోస్పి స్టాక్ ఇండెక్స్ ఏకంగా 7.2 శాతం పతనమైంది. ఆరు నెలలకు పైగా సరిపడే ఆయిల్ నిల్వలున్నప్పటికీ జపాన్ నికాయ్ 225 సుమారు 3 శాతం క్షీణించగా, జర్మనీకి చెందిన డాక్స్ సూచీ 3.9 శాతం పతనమైంది. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు కావడంతో దేశీ మార్కెట్లు పనిచేయలేదు. గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో బుధవారం (నేడు) గ్యాప్ డౌన్‌తో ప్రారంభం కావొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. ఆయిల్ అప్.. గోల్డ్ డౌన్..అంతర్జాతీయంగా ప్రామాణికమైన బ్రెంట్ క్రూడాయిల్ రేటు బ్యారెల్‌కి 7% పైగా పెరిగి 83.33 డాలర్ల వద్ద, నైమెక్స్ 7.5 శాతం పెరిగి 76.60 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మరోవైపు, ఔన్సు (31.1 గ్రాముల) పసిడి 3 శాతం పైగా నష్టపోయి 5,133 డాలర్ల వద్ద, సిల్వర్ 6 శాతం పైగా క్షీణించి 83.42 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి.ఇదీ చదవండి: పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు? -
WC 2026: యుద్ధం ఎఫెక్ట్.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
యుద్ధం వేళ ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీ నుంచి ఇరాన్ వైదొలిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో టోర్నీనే బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ ఏడాది జూన్–జూలైలలో అమెరికా, మెక్సికో, కెనడాలలో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీలో ఇరాన్ జట్టు బరిలోకి దిగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయాన్ని ఇరాన్ ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు మెహదీ తాజ్ స్పష్టం చేశాడు.వైమానిక దాడులుకాగా మిత్రదేశం ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా ఇరాన్‌పై వైమానిక దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. దాడుల్లో భాగంగా ఇజ్రాయెల్.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని మట్టుబెట్టింది. దీంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరాలపై ప్రతిదాడులు చేస్తోంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రపంచకప్ కోసం ఎదురుచూసేందుకు ఏమాత్రం వీల్లేదని మెహదీ తాజ్ అన్నాడు.ఫలితంగా యుద్ధవాతావరణం నేపథ్యంలో జూన్–జూలైలలో జరిగే ప్రపంచకప్‌లో ఇరాన్ పాల్గొనడం సందేహస్పదంగా మారింది. గ్రూప్ ‘జి’లో బెల్జియం, న్యూజిలాండ్, ఈజిప్ట్‌లతో కలసి ఉంది ఇరాన్.గత ఆరు పర్యాయాల్లోనూషెడ్యూల్ ప్రకారం జూన్ 15న న్యూజిలాండ్‌తో (కాలిఫోర్నియాలో), జూన్ 21న బెల్జియంతో (కాలిఫోర్నియాలో), జూన్ 26న ఈజిప్ట్‌తో (సియాటెల్‌లో) ఆడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇరాన్ అభిమానుల ప్రవేశంపై ట్రంప్ ప్రభుత్వం గత ఏడాది జూలైలో నిషేధం విధించింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానంలో ఉన్న ఇరాన్ జట్టు ఏడోసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందింది. అయితే ఆ జట్టు గత ఆరు పర్యాయాల్లోనూ (1978, 1998, 2006, 2014, 2018, 2022) గ్రూప్ దశను దాటి ముందుకెళ్లలేకపోయింది.ఇరాన్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?ఒకవేళ ఇరాన్ ప్రపంచకప్ టోర్నీ నుంచి తప్పుకొంటే.. ఆ జట్టు స్థానంలో ఆసియా నుంచే మరో జట్టు టోర్నీలో అడుగుపెడుతుంది. ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య ఇందుకు సంబంధించి ఫిఫాకు వివరాలు ఇవ్వనుంది. కాగా ఆసియా నుంచి టాప్‌లో ఉన్న ఇరాన్.. టోర్నీకి అర్హత సాధించగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఇరాక్, యూఏఈ ఉన్నాయి. భారీ జరిమానాఅయితే, టోర్నీ ఆరంభానికి ముందే ఇరాన్ తమ తుది నిర్ణయం చెపాల్సి ఉంటుంది. ఒకవేళ టోర్నీ ఆరంభానికి నెల రోజుల ముందు కంటే నిర్ణయం చెప్పనట్లయితే $324,000 (దాదాపు రూ. 3 కోట్లు).. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత నిర్ణయం చెబితే వైదొలిగిన జట్టు $648,000 మేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రపంచకప్ సన్నాహకాల కోసం FIFA ఇచ్చిన నిధులను కూడా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.చదవండి: FIFA World Cup 2026: అర్హత సాధించిన దేశాలు ఇవే -
సురక్షితంగా భారత్‌కు చేరుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్‌కు చేరుకుంది. మధ్యప్రాచ్యంలో యుద్దం కారణంగా దుబాయ్‌లో ఇరుక్కుపోయిన ఆమె.. ఇవాళ ఉదయం సురక్షితంగా బెంగళూరులో ల్యాండయ్యింది. వాస్తవానికి సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్‌కు వెళ్లాల్సి ఉండింది. అయితే అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ యుద్దం కారణంగా గమ్యానికి చేరకుండానే స్వదేశానికి తిరుగుముఖం పట్టింది.భయానక అనుభవం సింధు బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం చేస్తూ దుబాయ్‌లో ట్రాన్సిట్‌లో ఉండగా, గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించాయి. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. ఆ సమయంలో సింధు ఉన్న ప్రాంతం దగ్గరలో పేలుడు సంభవించడంతో పరిస్థితి భయానకంగా మారింది. ఆమె కోచ్ పేలుడు ధాటికి గురయ్యాడు.ఇంటికి చేరాను మార్చి 3న సింధు “సురక్షితంగా ఇంటికి చేరాను” అని Xలో పోస్ట్ చేసింది. “ఈ క్లిష్ట సమయంలో సహకరించిన గ్రౌండ్ టీమ్స్, దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని, తదుపరి అడుగులు ఆలోచిస్తానని పేర్కొంది. కాగా, సింధు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్స్ కోసం కఠోరంగా శ్రమించింది. ఈ సారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలన్న కసితో ఉండిన ఆమెకు అనుకోని అవరోధాలు ఎదురయ్యాయి. దుబాయ్‌లో చిక్కుకున్నప్పుడు ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల కోసం అన్వేశించినా, భద్రతా కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈ టోర్నీ నుంచి సింధులాగే మరికొందరు క్రీడాకారులు కూడా వైదొలిగినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఇవాల్టి నుంచి మార్చి 8 వరకు జరగాల్సి ఉండింది. -
హర్మూజ్ జలసంధి: చిక్కుకుపోయిన 700లకుపైగా నౌకలు
ఇరాన్ అధికారికంగా హర్ముజ్ జలసంధిని మూసి వేసింది. నౌకలు దాటడానికి ప్రయత్నిస్తే తగలబెడతామని ఐఆర్జీసీ హెచ్చరించింది. ఇరాన్ చర్యతో హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గర 700 లకు పైగా నౌకలు చిక్కుకుపోయాయి. వాటిలో 100 కంటైనర్ షిప్స్ ఉన్నాయి. మార్చి 1 వ తేదీన ఈ మార్గం నుంచి కేవలం 3 ట్యాంకర్లు మాత్రమే బయటకు వెళ్లగా, మార్చి 2వ తేదీన ఒక చిన్న ట్యాంకర్, కార్గోషిప్ మాత్రమే ప్రయాణం సాగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.కాగా, హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఓమాన్‌తో కలుపుతున్న సుమారు 33 కిలోమీటర్ల వెడల్పున్న సన్నని సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ఈ మార్గం గుండా సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఖతార్, బహ్రెయిన్, యుఏఈ మరియు ఇరాన్ దేశాల నుంచి ముడి చమురు, ఎల్ఎన్జీ సరఫరా అవుతోంది. వీటిలో ఎక్కువ భాగం ఆసియా మార్కెట్లకు, ముఖ్యంగా చైనాకు వెళ్తుంది.అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, ఈ మార్గానికి ప్రత్యామ్నాయాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సౌదీ అరేబియా, యుఏఈ కొంత మేర పైప్‌లైన్ మార్గాలను వినియోగిస్తున్నప్పటికీ, మొత్తం సరఫరాకు అవి సరిపోవు. 1980లలో ఇరాన్-ఇరాక్ ‘ట్యాంకర్ యుద్ధం’ తర్వాత పూర్తిస్థాయిలో హర్మూజ్ మూసివేత జరగలేదు. అయితే ఇటీవల ఫిబ్రవరిలో ఇరాన్ సైనిక విన్యాసాల సమయంలో కొంతకాలం రవాణా ఆంక్షలు విధించడంతో చమురు ధరలు 6 శాతం పెరిగాయి.ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. -
పక్క దేశాలపై ఇరాన్ దాడులు ఎందుకు?
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ప్రపంచమంతా ఇరాన్ తీరును నిశితంగా పరిశీలిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా, చిరకాల ప్రత్యర్థి ఇజ్రాయెల్‌తో యుద్ధం నేపథ్యంలో ఇరాన్.. తన క్షిపణులను నేరుగా వారిపై ప్రయోగించాల్సింది పోయి, ఇరాక్, కువైట్, బహ్రెయిన్ వంటి పొరుగు దేశాల వైపు మళ్లించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఇది ఇరాన్ బలహీనతా? లేక వ్యూహాత్మక చర్యలో భాగంగా వేస్తున్న ఒక ఎత్తగడా? అసలు పొరుగు దేశాలే ఇరాన్ టార్గెట్‌గా ఎందుకు అయ్యాయి? అనే అంశాలు చూద్దాం.మిత్రదేశాల ముసుగులో శత్రు స్థావరాలుఇరాన్ తన క్షిపణులను ఇరుగుపొరుగు దేశాల వైపు మళ్లించడానికి ప్రధాన కారణం.. ఆయా దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు. బహ్రెయిన్, కతార్, కువైట్.. వంటి ప్రాంతాల్లో అమెరికాకు చెందిన భారీ నౌకాదళ, వైమానిక స్థావరాలు ఉన్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడుల్లో ఈ స్థావరాలే వేదికలయ్యాయి. దాంతో నేరుగా వాషింగ్టన్‌పై దాడి చేయలేని ఇరాన్, అమెరికా ప్రయోజనాలను దెబ్బతీయడానికి పక్కనే ఉన్న ఈ లాజిస్టిక్ హబ్‌లను లక్ష్యంగా చేసుకుంది.ప్రాంతీయ ఆధిపత్యంగతంలో ఇరాన్ తన పరోక్ష యుద్ధాన్ని (ప్రాక్సీ వార్) హమాస్, హిజ్బుల్లా ద్వారా నడిపించేది. కానీ 2024-25 మధ్య జరిగిన పరిణామాల్లో ఇజ్రాయెల్ ఈ గ్రూపులను తీవ్రంగా దెబ్బతీసింది. సిరియాలో అస్సాద్ ప్రభుత్వం కూలిపోవడం, హిజ్బుల్లా నాయకత్వం తుడిచిపెట్టుకుపోవడంతో ఇరాన్ కొంత బలహీనపడింది. దీంతో తన ఉనికిని చాటుకోవడానికి పొరుగున ఉన్న ఇజ్రాయెల్ అనుకూల దేశాలపై ఒత్తిడి పెంచడం ద్వారా ప్రాంతీయ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.ఇంధన మార్కెట్ అతలాకుతలంయుద్ధం కొనసాగితే ఇరాన్ ఆర్థికంగా తట్టుకోవడం కష్టం. అందుకే, గల్ఫ్ దేశాల్లోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేసే వ్యూహాన్ని ఇరాన్ అమలు చేస్తోందని అభిప్రాయాలున్నాయి.హోర్ముజ్ జలసంధి మూసివేత: ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ మార్గాన్ని మూసివేయడం ద్వారా అమెరికా, ఐరోపా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలన్నది ఇరాన్ ప్లాన్. పొరుగు దేశాలపై దాడులు చేయడం ద్వారా ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తే తమ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్పకూలుతాయనే హెచ్చరికను ఇరాన్ పంపాలని చూస్తున్నట్లు కొందరు చెబుతున్నారు.అంతర్గత అశాంతి నుంచి దృష్టి మళ్లింపు2026 జనవరి నుంచి ఇరాన్ తీవ్రమైన దేశీయ నిరసనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభం, కరెన్సీ పతనం వల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. బయటి దేశాలపై దాడులు చేయడం ద్వారా జాతీయవాదాన్ని రగిల్చి ప్రజల దృష్టిని అంతర్గత సమస్యల నుంచి మళ్లించాలని ఇరాన్ పాలకులు చూస్తున్నారు.అధికార మార్పు భయంప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లో పాలన మార్పును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న దాడులు కేవలం సైనిక స్థావరాల మీద మాత్రమే కాదు, కీలక నాయకత్వంపై కూడా జరుగుతున్నాయి. తమ మనుగడకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఒక గాయపడిన సింహంలా ఇరాన్ తన పక్కనున్న చిన్న దేశాలపై విరుచుకుపడుతోంది. ఇది అమెరికాను చర్చల వైపు మళ్లించే ప్రయత్నం కూడా కావచ్చని కొందరి అభిప్రాయం. -
ఇరాన్ సంక్షోభం.. ఎగుమతులు, దిగుమతులపై నీలినీడలు!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటనూనెల విభాగాన్ని కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితి, అటు నూనె గింజల దిగుమతులపై.. ఇటు ఆయిల్ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.భారతదేశం తన వంటనూనె అవసరాల కోసం అధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇండోనేషియా, మలేషియా నుంచి పామ్ ఆయిల్; అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి సోయాబీన్ ఆయిల్; రష్యా, ఉక్రెయిన్ల నుంచి సన్‌ఫ్లవర్ ఆయిల్ భారత్‌కు వస్తుంటాయి. అయితే, ఈ దిగుమతుల్లో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి, సూయజ్ కాలువ గుండానే సాగుతాయి.ఈ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగితే, ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ లభ్యత తగ్గి ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగితే రవాణా, బీమా ఖర్చులు పెరిగి అది దేశీయంగా వినియోగదారుడిపై భారం మోపుతుందని అంచనా వేస్తున్నారు.ఎగుమతులపై దెబ్బకేవలం దిగుమతులే కాకుండా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఆయిల్ మీల్స్(నూనె గింజల నుంచి నూనెను తీసేసిన తర్వాత మిగిలే ఉప ఉత్పత్తి ) ఎగుమతులు కూడా ప్రతిష్టంభనను ఎదుర్కోవచ్చు. భారత ఆయిల్ మీల్స్ ఎగుమతుల్లో ఆగ్నేయాసియా వాటా 65% కాగా, పశ్చిమాసియా (గల్ఫ్) 20%, యూరప్ 15% వాటాను కలిగి ఉన్నాయి. యుద్ధం ముదిరితే గల్ఫ్, యూరప్ దేశాలకు జరిగే ఎగుమతుల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా డిమాండ్ కూడా తగ్గే అవకాశం ఉంది.క్రూడాయిల్ ధరల పెరుగుదల కేవలం రవాణా ఖర్చులనే కాకుండా గ్లోబల్ బయోఫ్యూయల్ మార్కెట్ ద్వారా వంటనూనెల ధరలను కూడా ప్రభావితం చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువలో వచ్చే మార్పులు కూడా ఈ రంగంపై ప్రభావం చూపుతాయని అంటున్నాయి. -
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలనం
వాష్టింగన్: పశ్చిమాసియాలో అంతకంతకూ ఉద్రిక్తలు పెరుగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్నికి ఆజ్యం పోశారు. ఇరాన్ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు కంబాట్ దాడులే చేశాం. అవసరమైతే అమెరికా సైన్యాన్ని ఇరాన్‌కు పంపిస్తాం. ప్రత్యక్ష యుద్ధం చేస్తాం’అని స్పష్టం చేశారు. ఇరాన్‌పై కొనసాగుతున్న దాడులపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ ప్రతిసారి అబద్ధం చెబుతోంది. ఇరాన్ దగ్గర అమెరికాను టార్గెట్ చేసే మిసైల్ వ్యవస్థ ఉంది. ఇరాన్ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్లో ఆపరేషన్ ఫ్యూరీ కొనసాగుతుంది.అణ్వాయుధాల తయారీని ఇరాన్ ఆపడం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఖమేని మరణంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌కు చెందిన మొత్తం యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశాం. ఆదేశంపై మరిన్ని దాడులు జరుపుతాం.ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తాం. ఇప్పటికే ఇరాన్ నావికాదళాన్ని తుడిచిపెట్టాం. ఇరాన్ క్షిపణి కేంద్రాలను భూగర్భంలో కొండల మధ్య దాచింది. అమెరికా,ఇజ్రాయెల్ సైన్యాలకు పెనుసవాల్‌గా మారింది. లక్ష్యాలను సాధించడానికి నాలుగు నుంచి ఐదు వారాల సమయం పడుతుంది. అవసరమైతే గ్రౌండ్ ట్రూప్స్ పంపడానికి వెనకాడబోం. ఇవాళ రాత్రంతా ఇరాన్‌పై దాడులు జరుపుతాం’అని హెచ్చరించారు.ఇజ్రాయెల్,అమెరికా లక్ష్యంగా ఇరాన్ దాడుల్ని తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సౌదీ రియాద్‌లో యూఎస్ ఎంబీసీపై ఇరాన్ రెండు డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడులతో రాయబార కార్యాలయం అగ్నికి ఆహుతైంది. అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడిని ట్రంప్ ఖండించారు. ఇరాన్‌కు గట్టి బుద్ధి చెబుతాం. ప్రతీకారం ఎలా ఉంటుందో చూపిస్తాం’అని పునరుద్ఘాటించారు. -
అణ్వాయుధాలకు చేరువలో ఇరాన్.. ఆయుధాలు అందితే వినాశనమే?
పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా.. ఇరాన్‌పై దాడులను మరింత తీవ్రతరం చేశాయి.


