Strait of Hormuz
-
మిత్రం దేశం ఇలా చేస్తుందా.? అమెరికాపై థరూర్ ఆగ్రహం
సాక్షి, ఢిల్లీ: ఇటీవల ఒమన్ తీరంలో అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికులు మృతిచెందిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఒమన్ దాడిలో భారతీయ నావికుల మృతిపై 'మిత్రదేశం' అమెరికా సంతాపం తెలపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిలో భారతీయ సిబ్బంది మరణించిన ఘటనపై అమెరికా స్పందించిన తీరు సరైంది కాదని విమర్శించారు.శశిథరూర్ మాట్లాడుతూ.."ఈ అధికారిక అమెరికా ప్రకటనను చదవడం చాలా షాకింగ్‌గా ఉంది. అమాయక భారతీయ ప్రాణాలు కోల్పోవడంపై ఇందులో ఎలాంటి విచారం లేదా సంతాపం లేదు. ఒక 'మిత్రదేశం', వ్యూహాత్మక భాగస్వామి ఇంత ఘోరమైన ఉదాసీనతను ఎలా ప్రదర్శిస్తుంది?" అని ఎక్స్ వేదికగా వాషింగ్టన్‌ని ప్రశ్నించారు.ఒకవేళ ఆ నౌక నిబంధనలను పాటించకుండా ఉన్నా.. ఆ వాణిజ్య నౌకపై దాడులు కాకుండా ఇతర మార్గాల ద్వారా ఎందుకు ఆపలేకపోయారని అడిగారు. సాధారణ సిబ్బంది ప్రాణాలను బలిగొనేలా క్షిపణులను ప్రయోగించకుండా, ఒక నౌక యొక్క ప్రొపల్షన్ (నడిచే వ్యవస్థ) లేదా స్టీరింగ్‌ను మాత్రమే నిలిపివేయడం సాధ్యం కాదా?" అని ఆయన ప్రశ్నించారు.ట్రంప్ వివరణ కాగా ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే వివరణ ఇచ్చారు. ఈ దాడులు జరిపింది. ఇరాన్ అని వాటిని ఎట్టిపరిస్థితుల్లో ఊపేక్షించేది లేదన్నారు.మార్కో రూబియోతో జైశంకర్ ఫోన్ఒమన్ గల్ఫ్‌లో అమెరికా జరిపిన సైనిక దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శనివారం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలో అమెరికా మూడు సార్లు భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న నౌకలపై దాడి చేసింది. ఇందులో రెండు సార్లు భారతీయ నావికులను రక్షించగా ఒకసారి దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడంపై న్యూఢిల్లీ ఇప్పటికే వాషింగ్టన్కు తన తీవ్ర అభ్యంతరాలను, ఆందోళనను తెలియజేసింది. -
ఇరాన్‌తో ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలను తరిమేస్తూ శాంతికపోతాలకు స్వాగతం పలుకుతూ శాశ్వత శాంతి ఒప్పందం ఇరాన్‌తో ఆదివారం కుదుర్చుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు. ఒప్పందం సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరికీ తెరుస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు.ఇరాన్ విషయంలో ఒబామా హయాంలో అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎత్తిపొడుస్తూ ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘బరాన్ హుస్సేన్ ఒబామా ఇరాన్‌తో ఉమ్మడి సమగ్ర కార్యాచరణ(జేసీపీఓఏ) ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇరాన్ అణ్వాయుధం తయారీకి ఒక రకంగా బాటలుపరిచింది. ఇది ఇలాగే అమల్లో ఉండి ఉంటే ఇరాన్ ఆరేళ్ల క్రితమే అణ్వాయుధాన్ని తయారుచేసి ఉండేది. ఇప్పటికే దానిని ఉపయోగించేవారు. ఇరాన్‌తో నేను కుదుర్చుకుంటున్న ఒప్పందం దీనిని పూర్తి విరుద్ధం.ఇరాన్ అణ్వాయుధ కలను కల్లను చేసే ఒప్పందం ఇది. కొనుగోలు, సమీకరణ, అభివృద్ధి ద్వారా కూడా వాళ్ల లక్ష్యం నెరవేరకుండా నా ఒప్పందం చేస్తుంది. ఇంతటి గొప్ప ఒప్పందం ఆదివారం జరగబోతోంది. ఒప్పందంపై సంతకాలు పూర్తవగానే హార్మూజ్‌ను అందరి కోసం తెరుస్తాం. ఇరాన్‌తో మా బంధం గతం కంటే భిన్నంగా, గత ప్రభుత్వాల కంటే ఎంతో మెరుగ్గా ఉండనుంది. ఒబామా వందల బిలియన్ల డాలర్లను పెట్టుబడులు, ఒప్పందాలు, నగదు రూపంలో ఇరాన్ కోసం ఖర్చుచేశారు. కానీ మేం అదనుచూసి గుట్టుచప్పుడుకాకుండా ఇరాన్‌లోని అణుధూళిని పట్టుకొచ్చేస్తాం.అద్భుతమైన పైలట్లు బీ–2 బాంబర్ విమానాలతో ఇరాన్ పర్వతాల్లో రేడియోధార్మిక పదార్థాన్ని భూస్థాపితం చేశారు. ఇప్పుడు మేం ఇరాన్‌తో, యావత్ పశి్చమాసియాతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం. భవిష్యత్‌లోనూ కలిసి పనిచేస్తాం. ఈ ప్రక్రియ వేగంగా, సులభంగా, సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నా. ఇది ఒకవేళ ఆచరణసాధ్యంకాకపోతే మాకు భయంకరమైన ప్రత్యామ్నాయం ఉంది. ఇది ఎప్పటికీ ఉపయోగించకూడదనే కోరుకుంటున్నా’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు.]24 గంటల్లోనే: షెహబాజ్ షరీఫ్యుద్దం ముసిగి శాంతి ఒప్పందం రాబోయే 24 గంటల్లో ఖరారు కావొచ్చని అంతకుముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగీ్చలను ట్యాగ్ చేశారు. ‘‘శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేనంత దగ్గరగా వచ్చేశాం. రాబోయే 24 గంటల్లో దీనికి తుదిరూపం లభించే అవకాశం ఉంది. ఆ వెంటనే ఒప్పందంపై ఎల్రక్టానిక్ విధానంలో అమెరికా, ఇరాన్‌లు సంతకాలు పెట్టేందుకు పాకిస్తాన్ సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చేవారం సాంకేతిక స్థాయి చర్చలు జరుగనున్నాయి. శాంతి చర్చల సమయంలో అమెరికా, ఇరాన్‌లు చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు’’అని షరీఫ్ తెలిపారు.వచ్చే నెల 4న ఖమేనీ అంత్యక్రియలు!ఇస్లామాబాద్: ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వచ్చే నెల 4వ తేదీన జరుగుతాయని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ శనివారం వెల్లడించింది. పశి్చమాసియాలో యుద్ధాన్ని పూర్తిగా ముగించే దిశగా అమెరికా, ఇరాన్‌ల మధ్య అతిత్వరలో ఒప్పందం కుదరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం: ఇరాన్ ఒమన్ తీరంలో భారతీయులున్న మూడు నౌకలపై ఇరాన్ సైన్యమే డ్రోన్లతో దాడి చేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలను భారత్‌లోని ఇరాన్ ఎంబసీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని తేల్చిచెప్పారు. ఒమన్ తీరంలో వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించిన ఘటన నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ఇరాన్‌పై అసంబద్ధ ఆరోపణలు చేశారని పేర్కొంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేసింది. -
హర్ముజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన
టెహ్రాన్: పశ్చిమాసియా యుద్ధంపై శాంతి చర్చల వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు ఇకపై ఉచితంగా ప్రయాణం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇరాన్, ఒమన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ అంశమై ఇరు దేశాలు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు.పశ్చిమాసియా యుద్ధంలో ప్రధానంగా చర్చంతే హర్ముజ్‌పైనే యుద్దం ప్రారంభంలోనే ఇరాన్ హర్ముజ్‌ని దిగ్భందించడంతో ప్రపంచ చమురు రవాణాకు ఆటంకం తలెత్తింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. ఈ నేపథ్యంలో అమెరికా ఈ జలసంధిని తెరవాలని ఎన్ని సార్లు కోరినా ఇరాన్ ససేమిరా అంది. తాజాగా శాంతి చర్చల ప్రస్థావన నేపథ్యంలో అబ్బాస్ అరాగ్చీ కీలక ప్రకటన చేశారు.అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ" జలసంధి నిర్వహణ మునుపటిలా ఉండదు. ఇందులో అంతర్జాతీయ జలమార్గం ఏది లేదు. ఇది పూర్తిగా ఇరాన్, ఒమన్ సౌర్వభౌమాధికారం కిందకి వస్తుంది. ఈ జలసంధి గుండా పయణించే నౌకలకు అందించే సేవలు ఇకపై ఉచితంగా ఉండవు. ఇందులో నుంచి ప్రయాణించే నౌకలు ఖచ్చితంగా రుసుము చెల్లించాల్సి ఉంటుంది." అని అన్నారు.ఈ విషయమై ఒమన్‌తో చర్చలు పూర్తయ్యాయి. హర్ముజ్ జలసంధి భద్రత, నియంత్రణపై ఇరు దేశాలు త్వరలో సంయుక్త కార్యాచరణ ప్రకటిస్తాయి అని అన్నారు. కాగా ఇదివరకూ హర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు ఎటువంటి పన్ను ఉండేది కాదు. పశ్చిమాసియా యుద్దం నేపథ్యంలో ఇరుదేశాలు మునుపటి కార్యాచరణనను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
యుద్ధానికి ముగింపు? కీలక ప్రకటన చేసిన ఇరాన్!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు దారితీసిన అమెరికా-ఇరాన్ ఘర్షణ ముగింపుకు చేరువైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు దేశాల మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరే దశకు చేరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ఇప్పటిదాకా ట్రంప్ ప్రకటనలను ఖండిస్తూ వచ్చిన ఇరాన్.. ఈసారి కాస్త సానుకూలంగానే స్పందించింది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదిపేసిన హర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకోనున్న నేపథ్యంలో.. అసలు ఈ ఒప్పందంలో ఏం ఉండబోతోంది? యుద్ధం ముగిస్తే ఎవరు గెలిచినట్లు?.. అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా పరిపాలనలోని ఓ సీనియర్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే కొద్ది రోజుల్లో తొలి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు ఇరాన్ కూడా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ దాదాపు ఖరారైందని ప్రకటించింది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. చర్చలు తుది దశకు చేరాయని అన్నారు. "అమెరికాతో ఒప్పందం ఇంత దగ్గరగా ఎప్పుడూ రాలేదు" అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆ పోస్టును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో షేర్ చేయడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో.. ట్రంప్ మరో ట్విస్ట్ ఇచ్చారు.ఇరాన్ మీడియా ప్రచురించిన 14 అంశాల అవగాహన ఒప్పందం వివరాలను ట్రంప్ ఖండించారు. ఇటు అసలు షరతులపై ఊహాగానాలు చేయొద్దని అరాఖ్చీ మీడియాను కోరారు. చర్చలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు ఈ యుద్ధంలో తామే గెలిచినట్లు ఇరాన్ ప్రకటించుకోవడం.. ఈ మొత్తం ఎపిసోడ్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.అదే కీలకంఈ ప్రతిపాదిత ఒప్పందంలో.. అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి ఉండబోతోందని తెలుస్తోంది. ప్రపంచ చమురు, సహజవాయు సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఈ మార్గం గుండా రవాణా అవుతుంది. యుద్ధం తర్వాత ఇరాన్ మూసివేసిన ఈ జలసంధిని మళ్లీ తెరవడానికి అంగీకరించినట్లు సమాచారం. ప్రతిగా అమెరికా ఇరాన్‌పై విధించిన కొన్ని ఆర్థిక ఆంక్షలను సడలించడంతో పాటు, నిలిపివేసిన బిలియన్ల డాలర్ల ఆస్తులను విడదీయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.అణు ఒప్పందం.. ఆగాల్సిందే!అయితే అణు కార్యక్రమం అంశం మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. 60 రోజులపాటు ప్రత్యేక చర్చలు జరిపి దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఒప్పందంలో ప్రతిపాదించినట్లు సమాచారం. అమెరికా వాదన ప్రకారం ఇరాన్ అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తొలగించి, అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఇరాన్ మాత్రం యురేనియాన్ని పూర్తిగా వదులుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. దాన్ని తక్కువ శుద్ధి స్థాయికి మార్చే (డౌన్బ్లెండింగ్) మార్గానికే తాము సిద్ధమని అరాఖ్చీ ఓ అంతర్జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ ఒప్పందంలో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. యుద్ధ నష్టాలకు పరిహారం, అలాగే ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా చాలా కాలంగా చేస్తున్న డిమాండ్లను పక్కన పెట్టే అవకాశాలపై కూడా చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే అమెరికా అధికారులు ఈ అంశాలను ఖండిస్తున్నారు.ఇది ఇంకో ట్విస్ట్ఇక ఈ చర్చల్లో ఇజ్రాయెల్ భాగస్వామి కాకపోవడం మరో కీలక పరిణామం. అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యలకు దిగిన ఇజ్రాయెల్.. తుది ఒప్పందంలో భాగం కాదని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందని ఇరాన్ కోరుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మాత్రం అలాంటి ఆలోచన లేదని ప్రకటించింది.ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరాలపై భయాలు తగ్గడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రెండు నెలల కనిష్ఠానికి చేరాయి. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఒప్పందం తన ప్రధాన లక్ష్యాలను నెరవేర్చిందని చెబుతున్నప్పటికీ, ఒప్పంద నిబంధనలు ఇరాన్‌కు ఎక్కువ ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు “యుద్ధంలో విజేత ఇరానే” అని టెహ్రాన్ ప్రకటించడం ఈ ఒప్పందం చుట్టూ మరింత రాజకీయ ఆసక్తిని పెంచుతోంది.ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే యుద్ధానికి ముగింపు పలికే చారిత్రాత్మక ఒప్పందం కుదురుతుందా? లేదంటే చివరి క్షణంలో మళ్లీ కొత్త మలుపులు తిరుగుతుందా?.. -
అది ఇరాన్ ఘాతుకమే
వాషింగ్టన్: ఒమన్ తీరం సమీపంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి చేసింది తాము కాదని.. అది ముమ్మాటికీ ఇరాన్ ఘాతుకమేనని అమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తేల్చిచెప్పారు. హార్మూజ్ జలసంధి నుంచి బయలుదేరిన నౌకలపై ఇరాన్ సైన్యం డ్రోన్లు ప్రయోగించిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ఎంతమాత్రం అంగీకారయోగ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్టుచేశారు. అలాగే శాంతి ఒప్పందంలోని పలు అంశాలను మీడియాకు ఇరాన్ లీక్ చేసిందని మండిపడ్డారు. ఇదిలా ఉండగా, మూడు నౌకలపై అమెరికా సైన్యం దాడి చేసినట్లు భారత ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇంతలోనే ట్రంప్ ఇరాన్ వైపు వేలెత్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. ప్రాణాంతక దాడులు ఆపాల్సిందే: భారత్ భారతీయ సిబ్బందితో కూడిన మూడు వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని అంతకుముందు భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఇలాంటి ప్రాణాంతకమైన, ఘోరమైన దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వీటిని ఆపాల్సిందేనని తేల్చిచెప్పింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ భారత్‌లో అమెరికా అత్యున్నత దౌత్యవేత్త(ఛార్జ్ డి అఫైర్స్) జాసన్ మీక్స్‌కు శుక్రవారం సమన్లు జారీ చేసింది. తమ విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని పేర్కొంది. జాసన్ మీక్స్‌కు సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. నౌకపై భీకర దాడి గురించి తెలిసిన తర్వాత తొలుత బుధవారం రాత్రి సమన్లు ఇచ్చారు. ముగ్గురు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో మరోసారి సమన్లు జారీ చేశారు. ‘‘భారతీయ సిబ్బంది విధి నిర్వహణలో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం కొనసాగిస్తున్న దాడుల పట్ల జాసన్ మీక్స్‌కు ఇప్పటికే ఒకసారి తీవ్ర నిరసన తెలియజేశాం. ఈ దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించడం బాధాకరం’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నౌకాయానంపై ప్రాణాంతకమైన బలప్రయోగం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కావని, క్లిష్ట సమయంలో ఒక సున్నితమైన ప్రాంతంలో అంతర్జాతీయ సముద్ర వాణిజ్య భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని తేల్చిచెప్పింది. భారతదేశం తీవ్ర ఆందోళనలను అమెరికా ప్రభుత్వ వర్గాలకు తెలియజేయాలని, అలాగే పశ్చిమాసియాలో పనిచేస్తున్న అమెరికా సైనిక బలగాలు పౌరుల ప్రాణనష్టం జరగకుండా నిరోధించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అమె రికా దౌత్యవేత్తకు సూచించినట్లు తెలియజేసింది. భరతమాత బిడ్డలను మోదీ కాపాడలేరు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: అమెరికా మిలటరీ కాల్పుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమెరికాతో రాజీపడ్డ ప్రధాని భరతమాత బిడ్డలను కాపాడలేకపోయారని, వారి ప్రాణా లను తీసుకున్న వారిని ప్రశ్నించే శక్తి కూడా ఆయనకు లేకపోయిందని శుక్రవారం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల్లో అంతర్జాతీయ సముద్ర జలాల్లో మూడు నౌకలపై అమెరికా దాడుల చేసి ముగ్గురు భారతీయులను చంపితే ఇప్పటివరకూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. వచ్చే వారం జరగనున్న జీ–7 సమావేశాల్లోనూ ఆయన నోరు మెదపరని, నవ్వుతూ కొన్ని ఒప్పందాలపై సంతకాలు చేసి వస్తారని, మరణించిన ముగ్గురు నావికుల గురించి ఏమీ మాట్లారని విమర్శించారు.ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు: ఇరాన్ భారత సిబ్బందితో ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా సైన్యం దాడులు చేయడాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ శుక్రవారం ఖండించారు. ఇలాంటి చర్యలు ప్రపంచ శాంతి, భద్రతకు ముప్పు కలిగిస్తాయని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అమెరికా చర్యలు నౌకాయాన స్వేచ్ఛకు ప్రమాదం కలిగిస్తున్నాయని ఆరోపించారు. అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. నౌకలపై అమెరికా దాడులు చేయడాన్ని ప్రభుత్వ సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనంగా ఇస్మాయిల్ బఖాయీ అభివర్ణించారు. -
ముగ్గురు భారతీయులు మృతి.. ట్రంప్ కీలక ప్రకటన
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదన్నారు. నౌకలపై దాడి చేస్తుంది ఇరాన్ అని వాటిని అమెరికా అడ్డుకుంటుందన్నారు. హర్ముజ్‌లో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల హర్ముజ్‌లో భారతీయ నౌకలపై జరిగిన దాడిలో ముగ్గురు భారత నావికులు మరణించిన సంగతి తెలిసిందే.ఇటీవల తరచుగా హర్ముజ్ జలసంధిలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకలపై అమెరికా దాడులు జరిపింది. బుధవారం ఒమన్ సమీప ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. ఒకరోజు తర్వాత మరోసారి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడి చేసింది. ఒమన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. గత నాలుగురోజుల్లో భారతీయన నౌకలపై దాడి చేయడం ఇది మూడోసారి.ఈ ఘటనపై తీవ్రంగా ఆగ్రహించిన భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్ జేసన్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయనకు మూడురోజుల వ్యవధిలో రెండుసార్లు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ అంశంపై స్పందించారు. -
వాణిజ్య నౌకలపై అమెరికా వరుస దాడులు
సాక్షి, ఢిల్లీ: హర్ముజ్ జలసంధిలో 20 మంది భారతీయ నావికులతో వెళ్తున్న 'గినియా-బిస్సావు' పతాకం గల నౌకపై అమెరికా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇటీవల భారత్‌కు చెందిన చమురు నౌకలపై అమెరికా తరచుగా దాడులు చేస్తోంది. ఒమన్ సమీపంలోని హర్మూజ్ సముద్ర జలాల్లో చమురు రవాణా నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన పూర్తై రెండురోజులైన గడవక ముందే మరోసారి భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేసింది. దీంతో ఈ ఘటనపై భారత్ సీరియస్ అయ్యింది..ఈ ఘటనను నిరసిస్తూ (శుక్రవారం) భారత్‌లోని అమెరికా తాత్కాలిక రాయబారి జేసన్ మీక్స్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి , అమెరికా రాయబారితో ఈ విషయమై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు బుధవారం నాడు 'పలావు' పతాకంగల MT సెట్టెబెల్లో నౌకపై జరిగిన దాడికి సంబంధించి కూడా జేసన్ మీక్స్‌ను MEA పిలిపించి మాట్లాడింది. మూడు రోజుల్లో అమెరికా దౌత్య కార్యాలయానికి సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి.భారతీయ నావికులే టార్గెట్‌గా జరుగుతున్న ఈ దాడులను భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి సమీపంలో భారత నౌకాదళం అత్యున్నత నిఘాను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. "వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు తక్షణమే ముగియాలి. అంతర్జాతీయ చట్టాలకు లోబడి అంతర్జాతీయ జలమార్గాలలో స్వేచ్ఛా వాణిజ్యం, నౌకల రాకపోకలను పునరుద్ధరించాలి. ఈ ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల వల్ల భారతీయ నావికులకు ముప్పు వాటిల్లడం తీవ్ర ఆందోళనకరం." అని తెలిపింది.కాగా ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో 18,000 మందికి పైగా భారతీయ నావికులు పనిచేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, క్షేమం, దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఒమన్ తీరంలో నౌకపై దాడి.. సురేష్ మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి,తాడేపల్లి: ఒమన్ తీరంలో భారతీయులు ప్రయాణిస్తున్న నౌకపై జరిగిన దాడి ఘటనలో వైజాగ్‌కు చెందిన మెరైన్ ఇంజినీర్ సురేశ్ పట్నాల మృతిచెందడం అత్యంత విషాదకరమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సురేశ్ పట్నాల ఉండటం మరింత కలచివేసిందని అన్నారు. ఒక మెరైన్ ఇంజినీర్ ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. సురేష్‌ను కోల్పోయిన కుటుంబం ఎదుర్కొంటున్న వేదన మాటల్లో చెప్పలేనిదన్నారు.మృతుడు సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు వారికి ఇవ్వాలని కోరారు. సురేశ్ పట్నాల ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.ఒమన్ తీరంలో నౌకపై దాడివైజాగ్కు చెందిన మెరైన్ ఇంజినీర్ పత్నాల సురేష్ (44) విధులు నిర్వహించిన నౌకపై ఒమన్ తీరంలో అమెరికా సైన్యం మిసైళ్లతో దాడి జరిపింది. ఈ దాడిలో ఆయనతో పాటు మరో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జూన్ 10న హర్మూజ్ జలసంధిలోని ఒమన్ తీరంలో ‘ఎంటీ సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై మిసైల్ దాడి సమయంలో జరిగింది. ఈ నౌక ఇరాన్ నుంచి చమురును దిగుమతి చేసుకుంటూ నిబంధనల్ని ఉల్లంఘించే ప్రయత్నం చేసిందని అమెరికా సైన్యం ఆరోపించింది.ఎంటీ సెట్టెబెల్లో నౌకపై అమెరికా సైన్యం జరిపిన మిసైల్ దాడిలో సురేష్‌తో పాటు హిమాచల్ ప్రదేశ్ నివాసి ఆదిత్య శర్మ (23) ఉన్నారు. మూడవ బాధితుడు ఎవరనే పూర్తి వివరాలు వెలువడలేదు. సదరు బాధితుడు భారతీయుడేనని అధికారులు ధృవీకరించారు -
అమెరికా దుశ్చర్య!
దుబాయ్/న్యూఢిల్లీ/విశాఖపట్నం/ఐరాస: ఇరాన్‌పై ముమ్మర దాడులకు తెగించిన అమెరికా బుధవారం ఒమన్ సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లోని ఎంటీ సెటెబె చమురురవాణా నౌకపై జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ వాసిగా గుర్తించారు. వరసబెట్టి భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్యనౌకలపై అమెరికా దాడులు చేయడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛావాణిజ్యానికి భంగం కల్గించేలా కాల్పులు జరపడం చట్టవ్యతిరేకమని భారత్ పునరుద్ఘాటించింది. తక్షణం కాల్పుల పర్వానికి ఫుల్స్టాప్ పెట్టాలని భారత్ సూచించింది. ఈ మేరకు ఇప్పటికే ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్‌డిఅఫైర్స్ జేసన్‌ను పిలిపించి భారత్ తన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. మృతదేహాల స్వా«దీనం ఎంటీ సెటెబె నౌకపై జరిగిన దాడిలో ముగ్గురు భారతీయులు గల్లంతైనట్లు బుధవారం వార్తలొచ్చాయి. అయితే వాళ్లు ప్రాణాలు కోల్పోయారని, వాళ్ల మృతదేహాలను స్వా«దీనంచేసుకున్నామని భారత నౌకాయాన మంత్రి శర్బానంద సోనోవాల్ గురువారం ప్రకటించారు. వాళ్ల కుటుంబాలకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ అన్నివేళలా అండగా ఉంటారని మంత్రి భరోసా ఇచ్చారు. సెటెబెపై దాడిలో మిగతా 21 మంది భారతీయ సిబ్బందిని ఒమన్ తీరగస్తీ బలగాలు కాపాడాయని మంత్రి వెల్లడించారు. 24 మంది భారతీయ సిబ్బంది ఉన్న మరో చమురు రవాణా నౌక మారీవెక్స్‌పై అమెరికా దాడిలో మొత్తం 24 మందినీ కాపాడటం తెల్సిందే. మూడో నౌక మీదా దాడి భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై అమెరికా దాడులపర్వం గురువారమూ కొనసాగింది. ఒమన్‌లోని షినాస్ నౌకాశ్రయం సమీప జలాల్లో ఉన్న ఎంటీ జల్వీర్ నౌక పైనా అమెరికా దాడులకు తెగించింది. ఈ నౌకలో 20 మంది భారతీయ నావికులున్నారు. గినియా బిసావూ దేశ జెండాతో వెళ్తున్న ఈ నౌక మీదకు అమెరికా తన యుద్ధవిమానం నుంచి రెండు హెల్ఫైర్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి నౌక ఇంజిన్ రూమ్‌ను నాశనం చేశాయి. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. ఒమన్ రాయల్ నేవీ దళాల సాయంతో నౌకలోని 22 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా తీసుకొస్తున్నామని మస్కట్ నగరంలోని భారతీయ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో స్పష్టంచేసింది. గత నాలుగు రోజుల వ్యవధిలో భారతీయులున్న నౌకపై అమెరికా దాడి చేయడం ఇది మూడోసారి అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ తెలిపారు. భారతీయ సిబ్బంది ఉన్నారని తెలిసీ దాడిచేశామని అమెరికా గురువారం తొలిసారిగా ఒప్పుకుంది. ‘‘ఎంటీ జల్వీర్ ఇరాన్ చమురును అనుమతిలేకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా తరలిస్తోంది. దిశ మార్చుకోవాలని పదేపదే హెచ్చరించినా బేఖాతరు చేశారు. అందుకే నౌకపై దాడిచేశాం’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ తన చర్యను సమర్థించుకుంది. 2 వారాల్లో 15వ వివాహ వార్షికోత్సవం అమెరికా దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు వ్యక్తి 44 ఏళ్ల పటా్నల సురేశ్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ఢిల్లీలోని ఆంధ్రభవన్ గురువారం ప్రకటించింది. భార్య భార్గవితో కలిసి జూన్ 24వ తేదీన 15వ వివాహ వార్షికోత్సంకోసం స్వస్థలానికి వచ్చేందుకు సురేశ్ అధికారుల అనుమతి తీసుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో సురేశ్ మృతి వార్త తెలిసి అతని కుటుంబం ఒక్కసారిగా కుంగిపోయింది. ఆయనకు 12, 10 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి మరణించాడన్న వార్త తెలిసి పిల్లలిద్దరూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘గత ఐదు నెలలుగా సముద్రంలో విధినిర్వహణలో ఉండిపోయారు. మ్యారేజ్‌డే కోసం త్వరలో ఇంటికొస్తున్నా అని చెప్పారు. కానీ ఇంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మెరైన్ ఇంజనీరింగ్‌ను ఆయన వృత్తిలా భావించరు. ఎంతో తపనతో పనిచేస్తారు’’అని భార్య భార్గవి వాపోయారు.ఐరాస వేదికగా భారత్ నిరసన అమెరికా దాడి సంస్కృతిపై భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా ధ్వజమెత్తింది. ఏకపక్ష దాడులను తక్షణం నిలిపేయాలని డిమాండ్చేసింది. ఐరాస భద్రతా మండలిలో ‘అంతర్జాతీయ శాంతి,భద్రత: మధ్యవర్తిత్వం ద్వారా పశ్చిమాసియా సమస్యకు పరిష్కారం’’అంశంపై జరిగిన చర్చలో ఐరాసలో భారతరాయబార శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ‘‘పశ్చిమాసియా దేశాలపై దాడులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి వెళ్లే నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్రగర్భ కేబుళ్లూ ధ్వంసమవుతున్నాయి. పశ్చిమాసియాలో సుస్థిరత కొనసాగాలంటే వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు అస్సలు తెగిపోకూడదు. అగ్రరాజ్యం(అమెరికా) దాడులు ఆపాల్సిందే’’అని హరీశ్ గట్టిగా డిమాండ్‌చేశారు. -
ట్రంప్ చెప్పింది నిజమేనా?.. లేక గప్పాలా?
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ కళ్లుగప్పి హర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్ ద్వారా భారీ పరిమాణంలో చమురును అంతర్జాతీయ మార్కెట్‌కు చేరవేశామని ప్రకటించారు. అంతేకాదు, గత నెల రోజులుగా అలానే 200కు పైగా వాణిజ్య నౌకలను హర్ముజ్ దాటించామని వెల్లడించారు.ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్.. గత నెలలోనే అమెరికా సైన్యానికి ఓ రహస్య ఆదేశం ఇచ్చినట్లు తెలిపారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలకు రహస్యంగా రక్షణ కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఈ మిషన్ ఫలితంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్‌కు చేరిందని, 200కుపైగా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించాయని పేర్కొన్నారు.అమెరికా కారణంగానే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. "హర్ముజ్‌ను నియంత్రించేది ఇరాన్ కాదు.. అమెరికానే" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన ట్రంప్ మరో సంచలన విషయం వెల్లడించారు. ఇటీవల ఒకే రాత్రిలో 22 నౌకలను ఎలాంటి లైట్లు లేకుండా, రాడార్ ట్రాకింగ్‌కు చిక్కకుండా హర్ముజ్ జలసంధి దాటించినట్లు చెప్పారు. రాత్రి చీకటిని ఉపయోగించుకుని ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు వెల్లడించారు. అలాగే ప్రతిరోజూ లక్షలాది బ్యారెళ్ల చమురును బయటకు తీసుకువస్తున్నామని, అందువల్లే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు అదుపులో ఉన్నాయని వ్యాఖ్యానించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలపై తర్వాత అమెరికా సైనిక, ఇంధన శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ట్రంప్ చెప్పినట్లుగా ఇరాన్ నుంచి చమురును "తీసుకురావడం" లేదా "స్వాధీనం చేసుకోవడం" జరగలేదని స్పష్టం చేశారు. వాస్తవానికి హర్ముజ్ జలసంధిలో ఇరాన్ దాడుల భయంతో నిలిచిపోయే పరిస్థితి వచ్చిన వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించిందని తెలిపారు.అమెరికా సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో ఒమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. గత కొన్ని వారాల్లో 200కుపైగా నౌకలు ఈ భద్రతా వ్యవస్థ ద్వారా హర్ముజ్‌ను సురక్షితంగా దాటాయని పేర్కొన్నారు.ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు తరచూ అంతర్జాతీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్-లెబనాన్ ఘర్షణలు తగ్గాయని ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచాయి. అయితే ఈ ప్రకటనలను ఇరాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హర్ముజ్ జలసంధిలో 100 మిలియన్ బ్యారెళ్ల చమురును రహస్య ఆపరేషన్ ద్వారా సురక్షితంగా తరలించామన్న ట్రంప్ వ్యాఖ్యలు కూడా కొత్త సందేహాలకు తావిచ్చాయి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. జలసంధిపై ఆధిపత్యం ప్రకటించుకున్న ఇరాన్ తన నిఘా కొనసాగిస్తోంది. అమెరికా గస్తీలో ఉన్న నౌకలను అస్సలు వదలడం లేదు. మరి ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా నిజంగానే ఇరాన్ కళ్లు గప్పి భారీ ఆపరేషన్ నిర్వహించిందా? సొంత సరిహద్దుల్లోనే ఇరాన్ బకరా అయ్యిందా? లేదంటే తన రాజకీయ, దౌత్య బలాన్ని చాటిచెప్పేందుకు ట్రంప్ మరోసారి అతిశయోక్తి వ్యాఖ్యలు చేశారా? చర్చ రాజకీయ, దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతోంది. -
గల్ప్ దేశాలకు కొత్త టెన్షన్
ప్రపంచానికి హెచ్చరిక.. ఇరాన్, అమెరికా మధ్య భీకర యుద్ధం మళ్లీ ప్రారంభం.. -
ప్రపంచ దేశాలకు షాకిచ్చిన ఇరాన్
ప్రపంచదేశాలకు ఇరాన్ మరోసారి పెద్ద షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తాజా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడకూ హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. ఇరాన్ హెచ్చరికలు ఇంతటితో ఆగలేదు.నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా హర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే క్షిపణులు, నౌకాదళ బలగాలతో లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేస్తామని ఇరాన్ సైనికాధికారులు ప్రకటించారు. ఈ ప్రకటనతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇటు అంతర్జాతీయంగానూ తీవ్ర ఆందోళన నెలకొంది.హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గం. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో తరలించే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యూఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. అందుకే హర్ముజ్ మూసివేత ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్‌గా మారింది.ఇరాన్ ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ చమురు మార్కెట్లు కుదేలయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా బ్యారెల్‌కు రెండు డాలర్లకుపైగా పెరిగాయి. సరఫరా సంక్షోభం మరింత తీవ్రమైతే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని ఇంధన విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, అమెరికా మాత్రం పరిస్థితి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని చెబుతోంది. కొన్ని వాణిజ్య నౌకలు ఇప్పటికీ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాయని, తమ యుద్ధనౌకలపై ఎలాంటి దాడులు జరగలేదని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే ఇరాన్ హెచ్చరికలతో అనేక నౌకా సంస్థలు ఇప్పటికే తమ ప్రయాణాలను నిలిపివేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదలతో పాటు రవాణా వ్యయాలు, ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా–ఇరాన్ ఘర్షణ మరింత ముదిరితే హర్ముజ్ జలసంధి అంశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపే కీలక సంక్షోభంగా మారే అవకాశం కనిపిస్తోంది. -
మరో వాణిజ్యనౌకపై అమెరికా దాడి
న్యూఢిల్లీ: ఒమన్‌లోని సోహర్ నగరానికి సమీప హార్మూజ్ జలసంధి సముద్రజలాల్లో వాణిజ్య నౌక ‘ఎంటీ సెటెబెల్లో’పై బుధవారం అమెరికా సైన్యం దాడికి దిగింది. ఆ సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ముగ్గురి జాడ గల్లంతైంది. అంతే సంఖ్యలో భారతీయులున్న మరో చమురు రవాణా నౌక ‘ఎంటీ మ్యారీవెక్స్’పై అమెరికా రెండ్రోజుల క్రితం దాడి చేయడంపై భారత్ ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న వేళ ‘ఎంటీ సెటెబెల్లో’ నౌకపై దాడి జరగడం గమనార్హం. దాడి ఘటనపై భారత్ బుధవారం ఘాటుగా స్పందించింది. ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంలోని ఉన్నతాధికారి, చార్జ్డి అఫైర్స్ జేసన్ మీక్స్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. ఈ మేరకు భారత్ అధికారిక ప్రకటన వెలువర్చింది. భారతీయ సిబ్బంది ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దాడి చేయడాన్ని మోదీ సర్కార్ తప్పుబట్టింది. పశ్చిమాసియాలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఇకనైనా ఆపాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ జలమార్గాలల్లో స్వేచ్ఛాయుత, నిరాటంకమైన నౌకాయానాన్ని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పేర్కొంది. సెటెబెల్లో నౌకలోని 24 మంది భారతీయ సిబ్బందిలో ఇప్పటివరకు 21 మందిని రక్షించినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. గల్లంతైన ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోందని వార్తలొచ్చాయి. -
కార్గో నౌకపై దాడి ఘటన.. ముగ్గురు భారతీయుల గల్లంతు
ఒమన్ తీరంలో భారతీయులున్న నౌకపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. 21 మంది భారతీయులను రక్షించగా.. మరో ముగ్గురు గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇవాళ (బుధవారం) ధృవీకరించింది. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా ఖండించింది. ఒమన్ అధికారులతో కలిసి గాలింపు, సహాయక చర్యలు చేపట్టినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఒమన్ గల్ఫ్‌లోని సోహార్ తీరంలో పలావు (Palau) జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఇంజన్ రూమ్‌ను మిస్సైల్ తాకింది. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. ఈ నౌక ఒమాన్‌లోని సోహార్ పోర్టుకు ఈశాన్య దిశలో సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్న సమయంలో దాడికి గురైన వెంటనే ప్రమాద సంకేతం (distress call) పంపింది. ఈ దాడి కారణంగా నౌకలో అగ్ని ప్రమాదం కూడా సంభవించినట్లు సమాచారం.కాగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. -
విదేశీ పెట్టుబడులకు సంస్కరణల కార్పెట్!
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితులను సమర్థవంతంగా గట్టెక్కడం, విదేశీ పెట్టుబడులను తిరిగి ఆకర్షించేందుకు కేంద్రం తన సంస్కరణల అజెండాను మరింత వేగంగా ముందుకు తీసుకుపోనుంది. గత ఏడాదిన్నరగా మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తరలిపోతుండడం చూస్తున్నాం. హర్మూజ్ జలసంధి మూసివేతతో చమురు, గ్యాస్ సరఫరాల్లో సమస్యలు ఏర్పడి వాటి ధరలు భారీగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో దిగుమతుల బిల్లు పెరిగిపోయి రూపాయి విలువ క్షీణిస్తోంది. ఇది విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరిచే అంశం. ఈ తరుణంలో తిరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అదనపు చర్యలను పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో విదేశీ పెట్టుబడుల ఉపసంహరణపై ఎలాంటి ఆంక్షల ప్రతిపాదనలు లేవని స్పష్టం చేశాయి. దేశీ ఆర్థిక మూలాలు పటిష్టంగానే ఉన్నాయని.. బలమైన వినియోగానికి తోడు మెరుగైన జీఎస్టీ వసూళ్లు, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు మెరుగుపడుతున్న పరిస్థితులను అవి గుర్తు చేస్తున్నాయి. చమురు, ఎరువుల దిగుమతుల బిల్లు పెరిగిపోయిన తరుణంలో దేశీ వృద్ధి పథాన్ని కాపాడుకోవడంతోపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను, ఆస్తుల విక్రయాన్ని మరింత వేగిరపరచాలని సర్కారు యోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్థికరంగ సంస్కరణలు.. ఆర్థిక రంగంలో సంస్కరణలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తద్వారా క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం చేయాలనుకుంటోందని తెలిపాయి. అవసరమైన చర్యలను ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి చేపడుతుందని, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) ఆకర్షించనున్నట్టు చెప్పాయి. గత వారం ప్రభుత్వ సెక్యూరిటీల్లో (జీ–సెక్‌లు) విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పీఐ) పెంచడం కోసం చర్యలు తీసుకోవడం తెలిసిందే. వడ్డీ ఆదాయం, దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాలపై పన్నుల నుంచి విదేశీ పెట్టుబడిదారులకు మినహాయింపునిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని ఆయా వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇది రూపాయి బలోపేతానికి కొంతమేర సాయపడినట్టు పేర్కొన్నాయి. బంగారం, వెండి దిగుమతులపైనా సుంకాలను 6% నుంచి 15 శాతానికి పెంచడం ఫలితాన్నిస్తున్నట్టు చెప్పాయి. బీమాలో 100% ఎఫ్‌డీఐను అనుమతించడం గమనార్హం.కట్టడిలోనే ద్రవ్యలోటు.. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో మాదిరే వృద్ధి కార్యకలాపాలు ప్రస్తుత త్రైమాసికంలోనూ (2026–27 ఏప్రిల్–జూన్) కొనసాగుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లు కూడా స్థిరంగానే ఉన్నట్టు చెప్పాయి. దిగుమతుల వ్యయాలు పెరిగిపోయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును బడ్జెట్లో పేర్కొన్న విధంగా జీడీపీలో 4.3 శాతానికి కట్టడి చేయడం ఇప్పటికీ సాధ్యమేనని పేర్కొన్నాయి. -
హర్మూజ్ జలసంధి దగ్గర టెన్షన్ టెన్షన్..
హర్మూజ్ జలసంధి దగ్గర యూఎస్ ఆర్మీ అపాచీ హెలికాప్టర్ కూలిపోయిందని.. అందులో ఇద్దరు సిబ్బందిని దళాలు సురక్షితంగా కాపాడినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే, హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. హెలికాప్టర్‌పై ఇరాన్ దళాలు దాడి చేశాయా? ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణాను ఇరాన్ సమర్థవంతంగా అడ్డుకోవడాన్ని నిరోధించేందుకు అమెరికా దళాలు సాగిస్తున్న కార్యకలాపాల సమయంలోనే ఈ అపాచీ ప్రమాదం జరిగింది. ఈ ఆపరేషన్లలో భాగంగా యూఎస్ మిలిటరీ అపాచీ హెలికాప్టర్లతో పాటు MQ-9 రీపర్ డ్రోన్లు, F/A-18, F-35 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను రంగంలోకి దించింది.ఫిబ్రవరి 28న ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ దాదాపు 30 MQ-9 రీపర్ డ్రోన్లను కూల్చివేసిందని, అలాగే శత్రువుల దాడి లేక పొరపాటున జరిగిన కాల్పుల వల్ల పలు యుఎస్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ధ్వంసమయ్యాయని అంతర్జాతీయ కథనాలు చెబుతున్నాయి. ఈ ఘటన కూడా నిజమని తేలితే.. ఈ ఘర్షణల్లో యుఎస్ కోల్పోయిన మొదటి అపాచీ హెలికాప్టర్ ఇదే అవుతుంది.'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ఆపరేషన్ కింద హార్ముజ్ జలసంధి, పరిసర జలాల్లో వాణిజ్య నౌకలకు రక్షణగా యూఎస్ నేవీ వెళ్లేందుకు ముందు... సెంట్రల్ కమాండ్ ఫోర్స్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ అక్కడ వైమానిక పర్యటన నిర్వహించిన ఫోటోలను గత నెలలో సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది. AH-64 అపాచీ హెలికాప్టర్.. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలలో ఒకటి. వ్యూహాత్మక రవాణా మార్గాలను పర్యవేక్షించడానికి, చిన్న బోట్ల ద్వారా జరిగే దాడులను అడ్డుకోవడానికి, శత్రు డ్రోన్లను కూల్చివేయడానికి ఈ హెలికాప్టర్లను ఉపయోగిస్తారు.హార్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణాను పునరుద్ధరించడానికి వాషింగ్టన్, టెహ్రాన్ దేశాల మధ్య పలుసార్లు చర్చలు జరుగుతున్నప్పటికీ... ఆ ప్రాంతంలో యూఎస్ సైన్యం తన దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే హార్మూజ్ జలసంధి.. పర్షియన్ గల్ఫ్‌లోని ఇరాన్ నియంత్రణలో ఉన్న దీవులకు అత్యంత సమీపంలో అపాచీ హెలికాప్టర్లు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి.ఇరాన్ దిగ్బంధనానికి ప్రతిస్పందనగా అమెరికా.. ఏప్రిల్ నెలలో ఇరాన్ ఓడరేవులకు ప్రవేశ పరిమితులను విధించిందని కూడా ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అప్పటి నుంచి హెచ్చరికలను బేఖాతరు చేసిన 130 కి పైగా నౌకలను యూఎస్ నౌకాదళాలు వెనక్కి పంపడమే కాకుండా.. మార్గాన్ని మార్చుకోని కొన్ని నౌకలను నిలిపివేశాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇరాన్ కూల్చివేసిన F-15E స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం నుండి ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వారు శత్రు భూభాగంలో పడినప్పటికీ.. యుఎస్ దళాలు వారిని విజయవంతంగా రక్షించి వెనక్కి తీసుకొచ్చాయి. -
భారతీయ నౌకపై దాడి.. 24 మంది నావికులు..!
టెహ్రాన్: హర్ముజ్‌లో ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ రోజు (సోమవారం) ఒమన్ తీర సమీపంలో భారతీయ నావికులు ప్రయాణిస్తున్న నౌకపై దాడి జరిగింది. దీంతో భారత వాయుసేన తక్షణమే స్పందించి అందులోని నావికులను రక్షించింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.ఒమన్ తీర సమీపంలో 'ఎంటి మారివెక్స్'అనే ఆయిల్ సరఫరా చేస్తున్న నౌకలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నౌకలో 24మంది నావికులు ఉన్నారు. దీంతో హుటాహుటీన స్పందించిన నావిక దళం వారందరినీ హెలికాప్టర్ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రస్తుతం వారందరూ క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈ దాడి ఎవరూ చేశారని సమాచారం ఇంకా తెలియలేదు. కాగా ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తకరంగా మారాయి. ఇరాన్, ఇజ్రాయెల్ పరస్ఫరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో సహా పలు ప్రాంతాలలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ట్రంప్ మాటలు లెక్కచేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్‌పై విరుచుకపడింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్, సిరియా దేశాలు గగన తలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.Helicopter rescue operation underway for 24 Indian seafarers after vessel Marivex was struck off the coast of OmanFootage from the scene show the crew being lifted from the damaged vessel after fighting for survival at sea pic.twitter.com/crlSDYaU6y— RT (@RT_com) June 8, 2026 -
హార్ముజ్ జలసంధిలో యుద్ధం.. పెట్రోల్, డీజిల్ దొరకటం కష్టమేనా?
-
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్‌కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్‌వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్‌ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్‌లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
ప్రపంచానికి ఇంధన షాక్..? హర్మూజ్ తర్వాత మరో కీలక జలసంధి క్లోజ్!?
-
మేము కోరుకున్నది దక్కకపోతే..
వాషింగ్టన్: పశ్చిమాసియాలో హార్మూజ్ జలసంధి దిగ్బంధం సహా యుద్ధానికి ముగింపు పలికే లక్ష్యంతో మంచి ఒప్పందానికి అమెరికా, ఇరాన్‌లు చాలా దగ్గరగా వచ్చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అయితే, తాము కోరుకున్నది లభించకపోతే ఆ ఒప్పందాన్ని వేరే విధంగా ముగిస్తామని ట్రంప్ తెలిపారు. ఫాక్స్ న్యూస్‌లో తన కోడలు లారాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పలు అంశాలపై మాట్లాడారు. ఇరాన్‌తో ఒప్పందానికి చాలా సమీపంలోకి వచ్చేశామని ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ, తొందరపడితే మంచి ఒప్పందం కుదరదని అభిప్రాయపడ్డారు. నెమ్మదిగా అయినా సరే కచ్చితంగా తాము కోరుకున్నది సాధిస్తున్నామని తేల్చిచెప్పారు. కోరుకున్నది దక్కేదాకా వేచి చూస్తామని, ఒప్పందం విషయంలో తొందరేమీ లేదని సంకేతాలిచ్చారు. చర్చల విషయంలో ఇరానీయులు మంచి నిపుణులు అని అన్నారు. కానీ, ఇరాన్ సైనికపరంగా ఇప్పటికే ఓడిపోయినందున ప్రస్తుతం అన్ని అవకాశాలు అమెరికా చేతిలోనే ఉన్నాయని స్పష్టంచేశారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోగలిగితే మంచిదేనని.. లేకపోతే యుద్ధాన్ని మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయడం లేదని ఇరాన్ చెప్పిందని ట్రంప్ అన్నారు. ఒకవేళ వారు(ఇరాన్) అణ్వాయుధాన్ని కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అలాంటి అయుధాన్ని కొనుగోలు చేయబోమని ఇరాన్ హామీ ఇచ్చిందన్నారు. ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌పై అమెరికాకు గణనీయమైన పట్టు సాధించిందని తెలిపారు. అయితే, ఇరాన్ నాయకత్వంలో కొందరు మితవాదులు ఉండడంతో తాము ఇరాన్ సైన్యాన్ని పూర్తిగా నిరీ్వర్యం చేయలేదని అన్నారు. ఇరాన్‌లోని అత్యంత తీవ్రవాద శక్తులను, కీలక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామని పునరుద్ఘాటించారు. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన 60 రోజల తాత్కాలిక ఒప్పందంపై సంతకం చేయడానికి ట్రంప్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అందులోని అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. -
డీల్‌పై సంతకానికి ట్రంప్ నో
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులపాటు పొడిగించేందుకు, హార్మూజ్‌లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం పట్ల ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దీన్ని పరిశీలించిన ట్రంప్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సిచ్యుయేషన్ రూమ్‌లో తన సలహాదారులతో చర్చించానని, ఇరాన్‌తో ఒప్పందంపై అతిత్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, డీల్‌పై సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఇరాన్‌తో చేసుకొనే ఏ ఒప్పందమైనా అమెరికాకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం డీల్ విషయంలో అమెరికాతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌తో మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
ట్రంప్‌వి బిల్డప్ బాబాయ్ మాటలే..!
‘అన్నీ సెట్ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు."హర్ముజ్‌లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్‌కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.అలాగే ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్‌లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది. -
అమెరికా ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత
టెహ్రాన్/దుబాయ్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోతోంది. ఇరాన్ సైన్యం దాడుల్లో అత్యంత విలువైన యుద్ధ విమానాలు, డ్రోన్లు నేలమట్టమవుతున్నాయి. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్‌ను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవలే హార్మూజ్ జలసంధి సమీపంలో ఖేష్మ్ దీవి వద్ద ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఇందుకోసం కొత్తగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ‘అరాశ్–ఇ–కమాంగీర్’ను ఉపయోగించినట్లు పేర్కొంది. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ విలువ 30 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా తగ్గిపోలేదని చెప్పడానికి ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత ఒక ఉదాహరణ అని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇకపైనా సవాలు చేసే స్థితిలో ఇరాన్ ఉందని అంటున్నారు. ఇరాన్ సైన్యం స్థానికంగానే నూతన గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సి వస్తోందని అమెరికా చెబుతోంది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్‌ను హార్మూజ్ జలసంధి సమీపంలో కూల్చివేయడం చూస్తే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరాశ్ ద ఆర్చర్ అరాశ్–ఇ–కమాంగీర్ అనేది ఇరాన్ గగనతలం, సముద్ర సరిహద్దుల సమీపంలో ఉన్న శత్రు గూఢచార డ్రోన్లను అడ్డగించగల, కూల్చివేయగల ఒక స్టెల్త్–డిటెక్షన్ వ్యవస్థ. అరాశ్–ఇ–కమాంగిర్ అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. పర్షియన్ పురాణాల్లోని ‘అరాశ్ ద ఆర్చర్’ ఒక మహాయోధుడు. విదేశీ దండయాత్రల నుంచి ఇరాన్‌ను రక్షించినందుకు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇరాన్ జానపద కథల ప్రకారం చూస్తే.. అరాశ్ తన ప్రాణాలను పణంగా పెట్టి విసిరిన బాణం ద్వారా ఇరాన్, మధ్య ఆసియా మధ్య సరిహద్దు ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థిర రాడార్ వ్యవస్థలపై ఆధారపడకుండా.. శత్రుదేశాల డ్రోన్లు, విమానాలను లక్ష్యంగా చేసుకునేలా తక్కువ ఖర్చుతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీలో పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది. వివిధ రకాల క్షిపణుల రూపకల్పనలో ఇరాన్ చాలావరకు స్వయం సమృద్ధి సాధించింది. చౌకైన, సరళమైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇవి ఖరీదైన అమెరికా యుద్ధవిమానాలను, డ్రోన్లను సులువుగా దెబ్బతీస్తున్నాయి. ఫైటర్ జెట్‌నూ కూల్చేశాంఅమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. శుక్రవారం ఉదయం బషెహర్ ప్రావిన్స్‌లోని జామ్ గవర్నరేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అమెరికా ఫైటర్ జెట్‌ను ఇరాన్ సేనలు నేలమట్టం చేసినట్లు స్థానిక గవర్నర్ మసూద్ టాంగెస్తానీ చెప్పారని వెల్లడించింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు. యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్ సైన్యం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అయితే, అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చేశామంటూ ఇరాన్ చేసి ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని తేల్చిచెప్పింది. ‘మేము ఒక్క యుద్ధ విమానం కూడా నష్టపోలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. -
బ్లాకేడ్ ఎత్తేస్తున్నా.. మీ భార్యలకు హాయ్ చెప్పండి.. ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై తాను త్వరలోనే ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తాను వైట్‌హౌస్‌లోని ‘సిట్యుయేషన్ రూమ్’లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తానని తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు.ఇరాన్- అమెరికా చర్చలు ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తోన్నా అందులో ఎటువంటి పురోగతి ఉండడం లేదు. పాకిస్థాన్ ఇస్లామాబాద్ వేదికగా జరిగిన చర్చలు ఎటువంటి ఫలితం లేకుండా ముగిశాయి. అనంతరం అమెరికా పలుమార్లు చర్చలకు ప్రయత్నించగా ఎటువంటి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కీలక ప్రకటన చేశారు.ఈ విషయమై తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలా వద్దా అనే అంశంపై నేను ఇప్పుడు తుది నిర్ణయం తీసుకోబోతున్నాను. ఈ విషయమై ప్రస్తుతం వైట్ హౌస్ 'సిట్యుయేషన్ రూమ్' (టాప్-సెక్యూరిటీ బంకర్) లో సమావేశం కాబోతున్నాను. మా అద్భుతమైన, మునుపెన్నడూ లేని నౌకాదళ దిగ్బంధం కారణంగా జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలు ఇక 'ఇంటికి వెళ్లే' ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ అభిమాన అధ్యక్షుడి తరపున మీ భార్యలకు, భర్తలకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు నా తరపున హలో చెప్పండి" అని పోస్ట్ చేశారు.ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదని, హార్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్‌లో అమర్చిన ల్యాండ్మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిస్తుందని పేర్కొన్నారు. . ఇరాన్ వద్ద భూగర్భంలో దాగి ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అమెరికా బయటకు తీస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ లతో కలిసి సమన్వయంతో ఆ నిల్వలను వెలికితీసి, పూర్తిగా ధ్వంసం చేస్తామని వెల్లడించారు. కాగా ప్రస్తుతం జరిగిన చర్చలు కేవలం అంతగా ప్రాధాన్యత లేని కొన్ని చిన్నపాటి అంశాలపైనే జరిగాయని ట్రంప్ పేర్కొన్నారు. -
మెగా డీల్: ఇరాన్‌కు అమెరికా బంపరాఫర్!
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అయితే “మెగా డీల్”లో భాగంగా ఇరాన్‌కు అమెరికా భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఆఫర్లు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం (MoU) దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ అంగీకారం అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశంగా ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.ఇక మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో.. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్‌కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఈ డీల్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారింది 300 బిలియన్ డాలర్ల విలువైన “పునర్నిర్మాణ పెట్టుబడి నిధి”. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, అమెరికా కంపెనీలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది.అయితే ఈ ఫైల్ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీదే ఉందని.. ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే, శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్న ఈ డీల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
పశ్చిమాసియాలో మళ్లీ సెగలు
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ సైనిక స్థావరంపై బుధవారం రక్షణాత్మక దాడికి దిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ అటాక్ డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరాన్ వన్–వే దాడి డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. బందర్ అబ్బాస్‌లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దళాలు క్షిపణులు వర్షం కురిపించాయి. ఐదో డ్రోన్‌ను ప్రయోగించడానికి ఇరాన్ జవాన్లు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఒప్పందం దగ్గర్లోనే ఉంది ఇరాన్ సైనిక శక్తి చాలావరకు క్షీణించిందని, అందుకే తమతో చర్చలకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి తొందరేమీ లేదని చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నప్పటికీ ఇరాన్‌తో ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదన్నారు. అయితే, అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. అలాగైతే ఒమన్‌ను పేల్చేస్తాం: ట్రంప్ హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఒమన్ సహా ఏ ఒక్క దేశాన్ని కూడా అనుమతించబోమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే కొత్త ఒప్పందంలో భాగంగా.. ఇరాన్, ఒమన్ కలిసి హార్మూజ్ గుండా జరిగే రవాణాను నియంత్రిస్తాయంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ జలసంధిని ఎవరూ కంట్రోల్ చేయలేరని అన్నారు. అవి అంతర్జాతీయ జలాలు అని గుర్తుచేశారు.ఒమన్ కూడా అందరిలాగే ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. లేకపోతే మనం ఒమన్‌ను కూడా పేల్చివేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. కువైట్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి అమెరికాపై ఇరాన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరంపై బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే, వీటిని కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా సైనిక వర్గాలు గురువారం స్పష్టంచేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. తమ భూభాగంపై దాడి జరిగిందని కువైట్ ప్రకటించింది. అయితే, తమపై తొలుత దాడిచేసినందుకు ప్రతీకారంపై ఓ గల్ఫ్ దేశంలో అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తేల్చిచెప్పింది. ఒమన్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒమన్, అమెరికా మిత్రదేశాలు. అమెరికా సైనిక కార్యక్రమాలకు ఒమన్ సహకరిస్తోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రాథమిక ఒప్పందం సిద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆమోదమే తరువాయి వాషింగ్టన్: కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్‌లు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే ప్రాథమిక ఒప్పందం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇరుపక్షాల ప్రతినిధులు ఇటీవలే 60 రోజుల అవగాహన ఒప్పందం ముసాయిదాపై అంగీకారానికి వచ్చారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే పశ్చిమాసియాలో అతిపెద్ద దౌత్యపరమైన పురోగతిగా నిలిచే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్న తరుణంలో కాల్పుల విరమణ ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చనే భయాందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇరుపక్షాలు ప్రాథమిక ఒప్పందానికి రావడం విశేషం. ఇందులో చాలా అంశాలు మంగళవారం నాటికే ఖరారయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. తమ ఉన్నతస్థాయి నాయకుల నుంచి ఆమోదం పొందామని ఇరాన్ ప్రతినిధులు సైతం పేర్కొన్నారు. దీనిపై తన నిర్ణయం ఏమిటన్నది ఇంకా డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టలేదు. ఒప్పదం ముసాయిదాలోని వివరాలను వైట్ హౌస్ ధ్రువీకరించలేదు. -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణల్లో తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు అనుబంధ వర్గాలు విడుదల చేసిన ప్రకటనల్లో.. “ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించే ప్రతి చర్యకు సమాధానం ఉంటుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. హర్ముజ్ సమీపంలోని అమెరికా బలగాలు, సముద్ర మార్గాల్లో కదులుతున్న మిలిటరీ కార్యకలాపాలపై తమ నిఘా కొనసాగుతోందని ఇరాన్ పేర్కొంది.మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్‌లోని కొన్ని సైనిక కేంద్రాలపై రాత్రికి రాత్రే కొత్త వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పలు ఇరానియన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు కూడా అమెరికా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న వేళ.. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడం పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తోంది. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ మీడియా “హర్ముజ్‌లో సంయుక్త నిర్వహణ, ఆంక్షల సడలింపు” వంటి అంశాలతో ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “హర్ముజ్ తెరిచే ఉంటుంది.. నియంత్రణ అమెరికా మిత్రదేశాల భద్రతకే ప్రాధాన్యం” అని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కలవరపడుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ చిన్న ఉద్రిక్తత జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.రష్యా, చైనా వంటి దేశాలు ఇరు పక్షాలు అదుపు పాటించాలని పిలుపునిస్తుండగా.. ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా చూస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో “ఇది నిజంగా శాంతి ప్రయత్నమా? లేక యుద్ధానికి ముందు వ్యూహాత్మక ఒత్తిడా?” అన్న చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా హర్ముజ్‌పైనే నిలిచింది. ఎందుకంటే అక్కడి ప్రతి కదలిక ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. -
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్ డ్రామాను తలపిస్తోంది.ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్‌ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ ప్రచారం చేసింది.అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్‌లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్‌హౌస్.. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్‌హౌస్ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్‌పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్‌పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. -
పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్ విషయంలో ఒమన్ గనుక ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్‌పై విరుచుకపడ్డారుఅమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్ "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్‌ని అన్నారా? లేక ఇరాన్‌కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్హౌస్నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది. -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్‌హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్‌పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్‌హౌస్ తన అధికారిక వైట్‌హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
ఇరాన్‌పై అమెరికా నిప్పుల వర్షం
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సోమవారం దక్షిణ ఇరాన్‌పై భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టేన్ టిమ్ హాకిన్స్ సోమవారం ప్రకటించారు.ఇవి కేవలం తమ ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని వివరణ ఇచ్చారు. ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను కాపాడుకోవడానికి దాడులకు చేయక తప్పలేదన్నారు. అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. అమెరికా దాడుల్లో ఇరాన్‌కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు.పడవలపై అమెరికా దాడులు చేయడంతో నలుగురు ఇరాన్ జవాన్లు మరణించినట్లు ‘తబ్నాక్’అనే వార్తా సంస్థ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న, సైనిక ఓడరేవుతోపాటు విమానాశ్రయం కలిగిన బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. తాజా దాడులు కాల్పుల విరమణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి యత్నాలకు భంగం కలిగించొద్దు: ఇరాన్ అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికి సంకేతంగా అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం ఖతార్‌లో చర్చల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టంచేశారు. అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్‌ను కూల్చాం: ఐఆర్జీసీ అమెరికాకు బుద్ధి చెప్పామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్లను, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటపెట్టలేదు. ఆ యురేనియంను నాశనం చేయాల్సిందే: ట్రంప్ ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం(అణు ధూళి)ను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి, నాశనం చేయవచ్చని చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాల్లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ వద్దనున్న యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతు విధించిన విషయం విదితమే. కానీ, తాజాగా ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
ఖనిజ సహకారంతో చైనాకు చెక్!
న్యూఢిల్లీ: అరుదైన ఖనిజాల ఉత్పత్తి, ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి నాలుగు దేశాల క్వాడ్ కూటమి ‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ప్రారంభించింది. అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో 20 బిలియన్ డాలర్ల (1.91 లక్షల కోట్లు) వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడును అడ్డుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఆ ప్రాంతంలో సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని క్వాడ్ విదేశాంగ మంత్రులు తీర్మానించారు.అలాగే ఇంధన రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ఢిల్లీలో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో అమెరికా, ఆ్రస్టేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, పెన్నీ వాంగ్, తోషిమిత్సు మొతేగి పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు.‘కీలక ఖనిజాల సహకార కార్యక్రమాన్ని’ఖరారు చేశారు. సమావేశం అనంతరం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దేశాలు తమ సొంత మార్గాలను నిర్ణయించుకోవడానికి, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి వీలు కల్పించే స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు మద్దతును పునరుద్ఘాటిస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలు చేకూర్చేందుకు సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని, నిర్దిష్టమైన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. అక్కడ ఏకపక్ష చర్యలు వద్దు హార్మూజ్ జలసంధి గుండా ప్రపంచ వాణిజ్యం నిరాటంకంగా సాగాలని విదేశాంగ మంత్రులు స్పష్టంచేశారు. అక్కడ వాణిజ్య నౌకలపై ఇరాన్ సుంకాలు విధించడాన్ని తప్పుపట్టారు. అలాగే తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే, బలప్రయోగంతో అస్థిరపరిచే లేదా ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు.చైనా తీరుపై మండిపడ్డారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాకు తేల్చిచెప్పారు. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలో శాంతి, స్థిరత్వాన్ని భగ్నం చేసే చర్యలు మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. చట్టాలను పాటించాల్సిందే: జైశంకర్ క్వాడ్ ఎజెండాలో భాగంగా కీలక, అరుదైన ఖనిజాల ఒప్పందం, ఇండో–పసిఫిక్ ఇంధన భద్రతా కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడారు. చర్చలు, ద్వైపాక్షిక సంప్రదింపుల్లో ఎక్కువ భాగం ప్రపంచ ప్రస్తుత పరిస్థితిపైనే జరిగాయని చెప్పారు. సహజంగానే, చర్చల ప్రధాన ఉద్దేశం ఇండో–పసిఫిక్‌కు సంబంధించిన అంశాలేనని అన్నారు.సురక్షితమైన, నిరాటంకమైన సముద్ర వాణిజ్యంపై చర్చించామని, ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. స్వేచ్ఛాయుత, బహిరంగ ఇండో–పసిఫిక్‌కు అనేక కోణాలు, పార్శా్వలు ఉన్నాయని, వాటిలో సాధించిన పురోగతిని క్వాడ్ సమావేశం సమీక్షించిందని జైశంకర్ ఉద్ఘాటించారు. నాలుగు దేశాల మధ్య ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించాలని, సప్లై చైన్లను బలోపేతం చేయాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. సముద్ర భద్రతకు చర్యలు: రూబియో ఇండో–పసిఫిక్ సముద్ర నిఘా సహకార కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్వాడ్ సమావేశం నిర్ణయించిందని మార్కో రూబియో తెలిపారు. ఇది ఇండో–పసిఫిక్‌లో మన నాలుగు దేశాల సముద్ర నిఘా సామర్థ్యాలను వినియోగించుకుంటుందని అన్నారు. క్వాడ్ దేశాల మధ్య ఇండో–పసిఫిక్ మారిటైమ్ డొమైన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. పసిఫిక్ దీవుల్లో ఓడరేవు మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి క్వాడ్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్ గుండానే సాగుతోందని గుర్తుచేశారు. అందుకే సముద్ర భద్రతకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దు: చైనా బీజింగ్: క్వాడ్‌పై తన అక్కసును చైనా మరోసారి వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంగళవారం పేర్కొంది. క్వాడ్ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. కూటముల పేరిట మరో దేశంతో ఘర్షణ పడొద్దని చెప్పారు. -
ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్ పునఃప్రారంభం..?
ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్‌లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.హర్ముజ్‌లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇటీవల ఇరాన్ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఒప్పందానికి చేరువలో..
వాషింగ్టన్/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలిఇరాన్తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్‌తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్‌తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్‌ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలన్నారు. మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్‌తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.ఒప్పందంలో ఏముంది? → ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. → అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. → ఇరాన్ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. → యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది. → హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. → ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు. -
శాశ్వత శాంతి విరమణ ఒప్పందం.. హర్మూజ్ జలసంధి ఓపెన్..!
-
హార్ముజ్‌ను మింగేస్తున్న ‘ఎల్లో ఫ్లీట్’
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ దాదాపు 90 రోజులుగా స్తంభించిపోయింది. ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ కూటమి.. ఇరాన్ మధ్య మొదలైన ఘర్షణలు, ఈ జలమార్గాన్ని మూసుకుపోయేలా చేశాయి. 1967 నాటి సూయజ్ కాలువ ఘటనలో పలు నౌకలు చిక్కుకుపోయి తుప్పు పట్టిన ‘ఎల్లో ఫ్లీట్’ మాదిరిగానే ఇప్పుడు హార్ముజ్ జలసంధి పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. చరిత్ర నేర్పుతున్న హెచ్చరికలను విస్మరిస్తే, రాబోయే రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపులకు లోనయ్యే ప్రమాదం కనిపిస్తోంది.చరిత్ర పునరావృతమైతే?1967లో అరబ్-ఇజ్రాయెల్ యుద్ధ సమయంలో సూయజ్ కాలువలో చిక్కుకున్న 15 నౌకలు, ఎనిమిదేళ్ల పాటు అక్కడే ఉండిపోయి ‘ఎల్లో ఫ్లీట్’గా మిగిలిపోయాయి. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో అదే పరిస్థితి తలెత్తితే? ఇది సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించినా, 90 రోజులుగా సాగుతున్న ఈ అప్రకటిత దిగ్బంధనం చూస్తుంటే, అదే జరగబోతోందనే భయాలు వెంటాడుతున్నాయి. రాబోయే ముప్పును పసిగట్టిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా చమురును రవాణా చేసేందుకు ప్రత్యామ్నాయ పైప్‌లైన్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 2027 నాటికి ఇది సిద్ధం కావచ్చని అంచనా. దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నా, వాస్తవ క్షేత్రస్థాయిలో పరిస్థితి చాలా కాలం పాటు ఉద్రిక్తంగానే ఉండవచ్చని అబుదాబి భావిస్తోంది.వాల్ స్ట్రీట్ ఆశలు ప్రస్తుతం వాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులు ఈ సంక్షోభం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నారు. చమురు ధరలు మరీ విపరీతంగా పెరగకుండా, మార్కెట్ సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకు త్వరగా పరిష్కారం వస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే, హార్ముజ్ జలసంధి మూసివేత వల్ల కలిగే ఆర్థిక భారం ఇంకా పూర్తిస్థాయిలో బయటపడలేదన్నది వాస్తవం. అమెరికాలో స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ఉన్నంత వరకు, వాషింగ్టన్ పెద్దగా ఆందోళన చెందడం లేదు.ఇరాన్ వ్యూహంమరోవైపు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆ దేశం వెనక్కి తగ్గేలా లేదు. నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, కరెన్సీ విలువ పడిపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఉనికి కోసం పోరాడుతున్న ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగేలా కనిపించడం లేదు. ఇరు పక్షాలు ఎవరికి వారు అవతలి వైపు ముందుగా దిగివస్తారేమోనని వేచి చూస్తున్నారు.నిల్వలతో కాలక్షేపం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా ఆగిపోయింది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వాడుకోవడం, ఎమర్జెన్సీ రిజర్వులను విడుదల చేయడం ద్వారా ఈ ప్రభావాన్ని ఇప్పటివరకు నియంత్రించగలిగారు. కానీ ఈ నిల్వలు శాశ్వతం కాదు. ప్రతిరోజూ మనం ఆ గడువుకు దగ్గరవుతున్నాం.రాబోయే రోజుల్లో భారీ సవాల్చివరగా, హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా మూసి ఉంచడం ఏ దేశానికీ మంచిది కాదు. ఒక తాత్కాలిక ఒప్పందం తక్షణ అవసరం. అయితే, గతంలో జరిగిన చరిత్రను గుర్తుంచుకుంటే అసాధ్యమైనది అనుకున్నవి కాలక్రమేణా సాధారణం అయిపోయే ప్రమాదం ఉంది. యుద్ధం ముగిసినా, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రపంచ ఇంధన భద్రతకు రాబోయే రోజుల్లో పెద్ద సవాలుగా నిలవనున్నాయి.ఇది కూడా చదవండి: ‘జెన్ జెడ్’ మంత్రం.. ‘హార్ట్ఫుల్నెస్’ ధ్యానం -
మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్‌కు 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. అలాగే సీఎన్జీ కేజీకి రూ.1 పెరిగింది. పెరిగిన ధరలు శనివారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి. పది రోజుల వ్యవధిలో ఇది మూడోసారి పెంపు.. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్‌తో.. అధిక ధరలకు క్రూడాయిల్‌ను కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్నివారాలుగా గగ్గోలు పెట్టాయి. ఒక అంచనా ప్రకారం ఆ లెక్క రూ.1,600 కోట్లు ఉందని.. వినియోగదారులపై ఆ భారం వేయకుండా వచ్చామని ఇన్నాళ్లు చెబుతూ వచ్చాయి. మరోవైపు కేంద్రం కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు ఇంధన ధరలు పెంచలేదు. అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ తరుణంలో.. చమురు రేట్లు దూసుకుపోతున్న తరుణంలో ఇప్పుడు పెంపు తప్పడం లేదని ఆయిల్ కంపెనీలు, కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. మే 15.. రెండింటిపైనా రూ.3 చొప్పున పెంపుమే 19.. పెట్రోల్‌పై 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంపుమే 23.. 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనడం.. హర్ముజ్ ఉద్రిక్తతలు చల్లారకపోవడంతో ఈ పెంపు ఇక్కడితో ఆగకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదని, దీంతో రాబోయే రోజుల్లో ఇంధన ధరల పెంపు మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. చమురు కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడడానికి ఇప్పటికీ చేసిన పెంపు సరిపోదని అంటున్నారు. మరో రెండు వారాలపాటు దశలవారీగా గానీ కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు. ✔️ తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి (పెట్రోల్ 87 పైసలు, డీజిల్ 91 పైసలు పెరిగిన తర్వాత):ఢిల్లీ: పెట్రోల్ ₹99.50, డీజిల్ ₹92.41ముంబై: పెట్రోల్ ₹108.27, డీజిల్ ₹94.77హైదరాబాద్: పెట్రోల్ ₹112.23, డీజిల్ ₹100.44కోల్‌కతా: పెట్రోల్ ₹110.18, డీజిల్ ₹96.76చెన్నై: పెట్రోల్ ₹105.53, డీజిల్ ₹97.13బెంగళూరు: పెట్రోల్ ₹107.69, డీజిల్ ₹95.73పాట్నా: పెట్రోల్ ₹110.27, డీజిల్ ₹96.52జైపూర్: పెట్రోల్ ₹109.76, డీజిల్ ₹95.23తిరువనంతపురం: పెట్రోల్ ₹112.11, డీజిల్ ₹101.00చండీగఢ్: పెట్రోల్ ₹99.03, డీజిల్ ₹87.19విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹115.35, డీజిల్ ₹103.08విశాఖపట్నం (ఏపీ): పెట్రోల్ ₹113.83, డీజిల్ ₹101.23గమనిక: ధరల్లో ప్రాంతానుసారం స్వల్ప మార్పులు ఉండొచ్చు -
హార్మూజ్‌పై పట్టుకు ఇరాన్ ప్లాన్.. అథారిటీ ఏర్పాటు
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేస్తూ దీవుల వద్ద చెక్పాయింట్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో నౌకలపై రుసుములు విధిస్తోంది. జలసంధిలో ఇరాన్ సరికొత్తగా పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ ఏర్పాటు చేసింది. కొత్త “Hormuz Safe” ఇన్సూరెన్స్ పథకం ద్వారా ఇరాన్ ఆర్థిక లాభాలు పొందుతోంది. దీని వల్ల ప్రపంచ చమురు సరఫరాలో ఐదవ వంతు ప్రభావితం అవుతోంది.హార్మూజ్ జలసంధిపై తన నియంత్రణను బలపరచడానికి ఇరాన్ కొత్త సంస్థను ఏర్పాటు చేసింది. జలసంధి నిర్వహణ బాధ్యతలను పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (Persian Gulf Strait Authority) అనే ఈ సంస్థను అప్పగించింది. ఇందులో భాగంగా చెక్పాయింట్లు అమలు చేస్తోంది. నౌకలపై ట్రాన్సిట్ అనుమతులు జారీ చేసి, రుసుములు వసూలు చేస్తోంది. ముఖ్యంగా టోల్ ఫీజులు వసూలు చేయడం, నౌకల కార్గో వివరాలు, జెండా, గమ్యం వంటి సమాచారం సేకరించడం వంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని నౌకలకు రెండు మిలియన్ డాలర్ల వరకు టోల్ ఫీజులు విధిస్తున్నారు. దీని ద్వారా ఇరాన్ $10 బిలియన్ ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఇరాన్ ఈ సంస్థ ద్వారా హార్మూజ్ జలసంధిపై తన భౌగోళిక ప్రభావాన్ని పెంచుకోవడం, ఆర్థిక లాభం పొందడం, అమెరికా ఆంక్షలను తప్పించుకోవాలని ప్లాన్ చేసింది.ఇదే ఉదాహరణ.. కాగా, Agios Fanourios-I అనే ట్యాంకర్ ఇరాక్ క్రూడ్ ఆయిల్‌తో వియత్నాం వైపు బయలుదేరింది. కానీ ఏప్రిల్ చివరి నుండి దుబాయ్ తీరంలో నిలిపివేయబడింది. మే 10న ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత మాత్రమే హార్మూజ్ గుండా ప్రయాణం కొనసాగింది. సాధారణంగా 5 గంటల్లో పూర్తయ్యే ప్రయాణం, ఇరాన్ జోక్యం వల్ల 2 రోజులు పట్టింది. మరోవైపు.. ఈ జలమార్గం గుండా కేవలం కొద్ది సంఖ్యలో నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికాకు చెందిన సిన్మాక్స్ ఇంటెలిజెన్స్ అనే సంస్థ విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్ 18 నుండి మే 6 మధ్య 60 కంటే తక్కువ నౌకలు మాత్రమే ఈ జలసంధి గుండా ప్రయాణించగలిగాయి. యుద్ధానికి ముందు, సాధారణంగా ఒక రోజులో సుమారు 120 నుండి 140 నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించేవి, వాటిలో దాదాపు సగం చమురు ట్యాంకర్లే ఉన్నాయి.ప్రభావంప్రపంచ చమురు సరఫరా: హార్మూజ్ గుండా 20% గ్లోబల్ ఆయిల్ వెళ్తుంది.మార్కెట్ కలకలం: ఆలస్యం, రుసుములు, అనిశ్చితి కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.ప్రాంతీయ ఉద్రిక్తతలు: గల్ఫ్ దేశాలు, అమెరికా, యూరప్ దేశాలు ఇరాన్ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.ప్రపంచ ప్రతిస్పందన: UK, France వంటి దేశాలు 40 దేశాల సమావేశం ఏర్పాటు చేసి, యూరోపియన్ ఎస్కార్ట్ ప్లాన్‌పై చర్చిస్తున్నాయి. -
షిడ్వార్ ద్వీపాన్ని చుట్టుముట్టిన చమురుతెట్టు
దుబాయ్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు మొదలెట్టాక హార్మూజ్ జలసంధి సమీపంలోని షిడావ్ర్ ద్వీపాన్ని చమురుతెట్టు చుట్టేసింది. ఇప్పుడు చమురుతెట్టు అక్కడి జీవావరణంపై గొడ్డలిపెట్టుగా తయారైంది. షిడ్వార్ ద్వీపంలోని సముద్రతీరాలను పెద్దమొత్తంలో ముడిచమురుతో జిగటగా తయారైన అలలు పోటెత్తుతున్నాయి. ద్వీపం తీరం మొత్తాన్నీ దాదాపు చమురుతెట్టు ఆక్రమించేసింది. ఈ జీవావరణ విధ్వంసం తాలూకు వివరాలు సంబంధిత ఉపగ్రహ చిత్రాలు, ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడుల తర్వాత పెద్దమొత్తంలో ముడిచమురు సముద్రజలాల్లోకి చేరింది. ఇది పల్చని పొరలా సముద్రఉపరితల జలాలపై పేరుకుని అలలరూపంలో సమీప ద్వీపాల తీరాలకు చేరుతోంది. వీటితోపాటు ఇరాన్‌కు చెందిన ఎహ్సాన్ జలాలీ అనే వ్యక్తితీసిన స్మార్ట్‌ఫోన్ వీడియో ఫుటేజీ సైతం షిడ్వార్ ద్వీపంలో జరిగిన జీవావరణ విధ్వంసాన్ని కళ్లకుకడుతోంది. తాబేళ్లు, పక్షులు, స్క్వాడ్చేపలు, డాలి్ఫన్లు ఇలా పలురకాల జీవులు చమురుతెట్టులో చిక్కుకుని చనిపోతున్నాయి. 30 సెంటీమీటర్ల రెజల్యూషన్‌తో ఫొటోలు తీసే ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ ప్లీడస్ నియో ఆప్టికల్ శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోలనూ తాజాగా విడుదలచేశారు. ఏప్రిల్ పదో తేదీన ఇరాన్‌లోని చమురుశుద్ధి కర్మాగారాలపై దాడి తర్వాత రెండ్రోజులైనా అక్కడి నుంచి మంటలు ఎగిసిపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల్లో స్పష్టమైంది. షిడ్వార్ ఐలాండ్‌ను స్థానికంగా మరో ద్వీపం అని కూడా పిలుస్తారు. చిత్తడి నేలలకు ఈ ద్వీపం ప్రసిద్ధి. ఇరాన్లో కని్పంచే బుల్లి ‘టెర్న్’పక్షు లు, సముద్రపక్షులకు ఈ ద్వీపం ఆలవాలంగా ఉంది. చిత్తడినేలలను భూమి సహజ ఊ పిరితిత్తులుగా పేర్కొంటారు. మురుగునీరు విస్తరించకుండాచేసి, భూగర్భజలాలను శుద్ధిచేసే నేలలుగా చిత్తడినేలలుప్రసిద్ధిచెందాయి. ఇప్పుడివి నాశనమవుతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేశారు. -
ఇరాన్ వార్.. నయా ట్రెండ్
ప్రపంచ యుద్ధాల రూపురేఖలు మారిపోతున్నాయ్. క్షిపణులు, అణు బాంబులు, డ్రోన్లు మాత్రమే కాదు.. ఇప్పుడు సరిహద్దులు, వనరులు, ఆఖరికి డిజిటల్ నెట్‌వర్క్‌లు కూడా ఆయుధాలయ్యాయి. అదెలా సాధ్యమో.. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. తనకంటే బలమైన సైన్యం ఉన్న అమెరికాను విసిగెత్తిస్తూ ‘వార్ ట్రెండ్’ను సెట్ చేసింది.ఇరాన్ తన సరికొత్త వ్యూహం అమలుకు.. హర్ముజ్ జలసంధిని వేదికగా చేసుకుంది. దీని ద్వారానే ప్రపంచంలో ఐదో వంతు చమురు రవాణా జరుగుతుందని తెలిసిందే కదా. అందుకే జలసంధిపై తమదే పూర్తి ఆధిపత్యం అని ప్రకటించుకుని.. టోల్‌ప్లాజా ఏర్పాటుతో వసూళ్లు చేపట్టాలని భావించింది. తద్వారా.. వచ్చిన సొమ్ముతో యుద్ధం వల్ల దెబ్బతిన్న ఇరాన్‌ను పునరుద్ధరించుకోవడం, దేశ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకుంటామని ప్రకటించి ప్రపంచ దృష్టిని ఆకర్షించుకోగలిగింది. అదే సమయంలో.. సముద్ర గర్భం కేబుళ్లపై దృష్టిసారించి భయపెట్టింది కూడా. ఇప్పుడు కేబుళ్ల విషయంలో అమెరికన్ దిగ్గజ కంపెనీలు కాంప్రమైజ్ కావాలని.. ఎంతో కొంత తమకు చెల్లించాలని(పన్ను, ఫీజు, ఫైన్.. ఏదో ఒక రూపేణా).. అలాగే వాటి నిర్వహణ(రిపేర్లు వగైరా) బాధ్యతలు కూడా తమ ఆధ్వర్యంలోనే సాగాలని కండిషన్లు పెడుతోంది. లేకుంటే కత్తిరింపులు తప్పవన్నట్లు బెదిరిస్తోంది. అలా.. తన భౌగోళిక స్థానాన్నే ఇరాన్ ఆయుధంగా మలుచుకుంది.టిట్ ఫర్ టాట్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ విషయంలో ఏం చేయాలనుకున్నాడో.. ఇరాన్ ఆ పనే కౌంటర్‌గా చేసి చూపించింది. అదే ఆర్థికంగా దెబ్బ తీయడం. ఇరాన్‌ను ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేసిన ట్రంప్.. హర్ముజ్ బ్లాకేడ్, నిధుల ఫ్రీజ్‌లను చూపించి ఇరాన్ మెడలు వంచాలనుకున్నాడు. అయితే ఆ నష్టం ధాటికి ఇరాన్ తలొగ్గలేదు. సరికదా.. యుద్ధాన్ని సరికొత్త మలుపులు తిప్పింది.యుద్ధం ప్రారంభంలో.. చౌకగా తయారైన షాహెడ్ డ్రోన్లు ఉపయోగించి అమెరికా రక్షణ వ్యవస్థలను ఆగమాగం చేసింది. తద్వారా అమెరికా సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. ఆ తర్వాత హర్ముజ్ జలసంధి ద్వారా నౌకాయానాన్ని అడ్డుకోవడంతో తన వ్యూహాన్ని మొదలుపెట్టింది. హర్ముజ్ అనేది కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు ఉండడం, పైగా తమ తీరానికి దగ్గరగా ఇరాన్‌కు ఎంతో కలిసొచ్చింది. రోజుకు 100–150 నౌకలు వెళ్లే హర్ముజ్‌లో మైన్స్, డ్రోన్లు, ఫాస్ట్ అటాక్ బోట్స్‌తో నియంత్రించింది. ఫలితంగా ఒక్క నౌక కూడా నీట మునగకుండానే ఇన్సూరెన్స్ ప్రీమియంలు 300% పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లు దాటింది. యూరప్ దేశాలు అదనంగా 28 బిలియన్ డాలర్ల ఇంధన బిల్లు చెల్లించాల్సి వచ్చింది. అలా క్షిపణుల యుద్ధం కాస్తా ఆర్థిక యుద్ధం అయ్యింది.భవిష్యత్తులో.. ఇరాన్ తన యుద్ధాన్ని క్షిపణుల నుంచి మరో దారికి మలిచింది. ఎనర్జీ + డేటా.. ఇవి రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే అంశాలే. అలా రెండు కీలక ప్రవాహాలను ఒకేసారి నియంత్రించే శక్తి తమ వద్ద ఉందని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇకపై యుద్ధం కేవలం బాంబులు, గన్స్‌తో కాదు.. వివిధ వనరుల రూపంలోనూ జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇరాన్ చూపించిన ఈ యుద్ధ వ్యూహాన్ని ఉత్తర కొరియా, చైనా అధ్యయనం చేస్తున్నాయి. రష్యా కూడా ఈ ఉద్రిక్తతను నిశీతంగా పరిశీలిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక దేశానికి కాదు, ప్రపంచానికి కొత్త హెచ్చరిక అని నిపుణులు చెబుతున్నారు.కొత్తదేం కాదా?ఇరాన్ అనుసరించిన ఈ వ్యూహం కొత్తేదేం కాదట. ఇది అర్థం చేసుకోవాలంటే చరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకోవాలనుకుంటున్నారు విశ్లేషకులు.థెర్మోపిలే యుద్ధం (480 BC): స్పార్టా రాజు లియోనిడాస్ కొద్దిమంది సైనికులతో పర్షియన్ సైన్యాన్ని ఒక పర్వత మార్గంలో నిలువరించగలిగాడు. సంఖ్యలో తక్కువైనా, భౌగోళిక స్థానం (చోక్పాయింట్)ను ఉపయోగించి శత్రువుల అధిక బలాన్ని నిర్వీర్యం చేశాడు. ఇది “స్థానం” అనే ఆయుధం ఎంత శక్తివంతమో చూపించింది.రోమన్ సామ్రాజ్యం – కార్తేజ్: ప్యూనిక్ యుద్ధాల అనంతరం రోమన్లు కార్తేజ్ పొలాలను ఉప్పు చల్లి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు. ఇది భౌగోళిక వనరులను ధ్వంసం చేసి శత్రువును బలహీనపరిచే వ్యూహం.నెపోలియన్ (19వ శతాబ్దం): బ్రిటన్‌తో వాణిజ్యాన్ని నిషేధించి యూరప్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించాడు. ఇది వాణిజ్యాన్ని ఆయుధంగా మార్చిన ఉదాహరణ.బలహీన దేశం కూడా తన భౌగోళిక స్థానాన్ని ఆయుధంగా మార్చుకుని శక్తివంతమైన దేశాలను నిలువరించగలదు. ఇది చరిత్ర చెప్పిన పాఠం. ఆ పాఠాన్నే ఇరాన్ వల్లేసింది. అమెరికా అణు బాంబులను ఆపడానికి యుద్ధం మొదలుపెడితే.. కానీ ఇరాన్ తన భూభాగాన్ని ఆయుధంగా మార్చి మరింత శక్తివంతమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. -
ఇరాన్ సంచలన నిర్ణయం
పశ్చిమాసియా యుద్ధం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కీలకమైన వాణిజ్య మార్గం హర్ముజ్ మూసివేతతో పలు దేశాలు సంక్షోభాలతో అల్లలాడిపోతున్నాయి. ఇరాన్‌కు మరో ఆప్షన్ లేదని.. చర్చలకు దిగి రావాల్సిందేనని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఈ సంక్షోభం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇరాన్ మరో కీలక బలహీనతపై దృష్టి సారించింది.. హర్ముజ్ జలసంధి కిందుగా సాగుతున్న అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మార్గాలు.. ఈ యుద్ధంలో కొత్త ఉద్రిక్తతలకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. టెహ్రాన్ వర్గాలు తాజాగా ప్రకటించిన ప్రణాళికనే ఇందుకు కారణం. దీని ప్రకారం.. హర్ముజ్ కింద నుంచి వెళ్తున్న అండర్ మైన్ సీ కేబుల్స్కుగానూ ఫీజులు వసూలు చేయాలని ఇరాన్ బలంగా భావిస్తోందట!. ‘‘జలసంధి గూండా పలు నెట్వర్క్ కేబుల్స్ వెళ్తున్నాయి. అయితే.. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ఈ మార్గాల వినియోగానికి ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. సహకరించకపోతే డేటా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడవచ్చు’’ అని ఇరాన్ హెచ్చరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాదు.. కేబుళ్ల మరమ్మత్తులు, నిర్వహణ హక్కులు కూడా ఇరాన్ కంపెనీలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా ఒకటి కథనం ప్రచురించింది. దీంతో ఇరాన్ మూమాలు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం లేదన్న చర్చ జోరందుకుంది.అదే గనుక జరిగితే..ప్రపంచ ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్‌లో 95% పైగా ఈ సముద్రపు మార్గాల ద్వారానే జరుగుతుంది. హర్ముజ్ జలసంధి గుండా అనేక అంతర్జాతీయ కనెక్టివిటీ మార్గాలు వెళ్తాయి. భద్రతా కారణాల వల్ల ఎక్కువ భాగం ఒమన్ వైపు ఉన్నప్పటికీ.. ఫాల్కన్, గల్ఫ్ బ్రిడ్జి ఇంటర్నేషనల్ అనే రెండు ప్రధాన మార్గాలు మాత్రం ఇరాన్ జలప్రాంతాల గుండా సాగుతున్నాయి. వీటికి నష్టం కలిగితే బ్యాంకింగ్ వ్యవస్థలు, ఆర్థిక మార్కెట్లు, సైనిక కమ్యూనికేషన్లు, కృత్రిమ మేధస్సు, అంతర్జాతీయ లావాదేవీలు అన్నీ ప్రభావితమవుతాయి. ఇరాన్ అండర్ సీ మైన్ కేబుల్స్‌పై దృష్టి పెడితే.. ఇరాన్ పొరుగు దేశాలు, భారత్, తూర్పు ఆఫ్రికా, యూరప్–ఆసియా మధ్య ఆర్థిక లావాదేవీలు అన్నీ తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. సింగపూర్ వంటి ఆసియా డేటా హబ్‌ల నుంచి యూరప్ వరకు కనెక్టివిటీ దెబ్బతింటే, ఫైనాన్షియల్ ట్రేడింగ్, బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్లు, క్రాస్-బోర్డర్ పేమెంట్లు అన్నీ ఆలస్యమవుతాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా, పెద్ద స్థాయి అంతరాయం అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఒకవేళ ఏదైనా డ్యామేజ్ జరిగినా మరమ్మత్తులు కూడా సవాలే. ఎందుకంటే రిపేర్ షిప్‌లు ఒకేచోట నిలిచి పని చేయాలి. ఆ సమయంలో ఇరాన్ అడ్డుకుంటే అది అసాధ్యం కాదు..నిజానికి.. యుద్ధ ప్రారంభ సమయంలోనే అండర్ సీ కేబుల్స్ అంశం తెర మీదకు వచ్చింది. వీటిని కత్తిరించడం ద్వారా ఇరాన్ ‘డిజిటల్ వార్’ జరపొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆ సమయంలో ఇరాన్ వాటిని కొట్టిపారేసింది. ఇప్పుడు జలసంధిలో నౌకల నుంచి మాత్రమే కాదు.. ఈ కేబుల్స్‌పైనా ఫీజులు వసూలు చేసే యోచన చేస్తుండడం గమనార్హం. అంతర్జాతీయ చట్టంఇరాన్ మీడియా ప్రకారం, 1982లోని ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టం (UNCLOS) ప్రకారం తీరరాష్ట్రాలకు తమ జలప్రాంతాల్లో కనెక్టివిటీ మార్గాలపై షరతులు విధించే హక్కు ఉంది. ఇరాన్ ఆ ఒప్పందంపై సంతకం చేసినా.. ఇంకా ఆమోదించలేదు. సుయాజ్ కాలువలో ఈజిప్ట్ వసూలు చేసే ఫీజులను ఉదాహరణగా చూపుతున్నా.. హోర్ముజ్ సహజ జలసంధి కావడం వల్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అయితే.. చమురు తర్వాత ఇప్పుడు డేటా కూడా ఇరాన్ చేతిలో బందీ అవుతుందా? అనే ఆందోళన అంతర్జాతీయంగా పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి కింద ఉన్న ఈ మార్గాలు కత్తిరించబడినా? లేదంటే పన్నులు విధించబడినా.. ప్రపంచ డిజిటల్ కనెక్టివిటీకి ఇది మరో పెద్ద దెబ్బ కానుంది. -
శాంతికి భారత్ కీలకం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు భారత్ మరింత కీలకపాత్ర పోషించాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ కోరారు. ఇరాన్‌కు సంబంధించినంత వరకు ఎలాంటి సైనికపరమైన పరిష్కారం లేదని స్పష్టం చేశారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. హార్మూజ్ జలసంధి అంశం ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారిందంటూ వ్యాఖ్యానించిన ఆయన.. హార్మూజ్ గుండా అన్ని రకాల నౌకల స్వేచ్ఛాయానానికి అవసరమైన సాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని చెప్పారు. అణ్వాయుధాలను సమకూర్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నారు. పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి చర్చలు, సంప్రదింపులు మినహా మరో మార్గం లేనే లేదని పేర్కొన్నారు. -
హార్మూజ్‌ను దాటిన 2 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: హార్మూజ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతున్నా ఎల్పీజీ సరకుతో వస్తున్న రెండు సరకురవాణా నౌకలు విజయవంతంగా జలసంధిని దాటాయి. ‘సైమీ’ఎల్పీజీ ట్యాంకర్ మే 13వ తేదీన హార్మూజ్‌ను దాటగా ఎన్వీ సన్‌షైన్ అనే మరో ఎల్పీజీ నౌక గురువారం దాటింది. ఈ రెండు నౌకలతో కలిపి గత రెండు నెలల్లో హార్మూజ్‌ను దాటి భారతీయ నౌకల సంఖ్య 13కు పెరిగింది.యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి బయల్దేరిన సైమీ నౌకలో దాదాపు 20,000 టన్నుల ఎల్పీజీ నిల్వలున్నాయి. ఇది మే 16వ తేదీకల్లా గుజరాత్‌లోని కాండ్లా నౌకాశ్రయానికి చేరుకునే ఆస్కారముంది. ఎన్వీ సన్‌షైన్ నౌకలో ఏకంగా 46,427 టన్నుల ఎల్పీజీ ఉంది. ఇది మే 18వ తేదీకల్లా న్యూ మంగళూరు పోర్ట్‌కు చేరుకునే అవకాశముందని కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముకేశ్ మంగళ్ తెలిపారు. ఈ రెండు నౌకలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్‌కు రప్పిస్తోంది. ఆగని దాడుల పరంపర.. కొన్ని నౌకలు విజయవంతంగా హార్మూజ్‌ను దాటుతున్నా మరి కొన్నింటిపై దాడులు కొనసాగుతున్నాయి. గతంలో రెండు నౌకలపై దాడి జరగ్గా ఇప్పుడు మరో నౌకపై మెరుపుదాడి చేశారు. దీంతో సోమాలియా నుంచి షార్జాకు వెళ్తున్న భారతీయ జెండాతో ఉన్న సంప్రదాయక సరకు రవాణా నౌక ‘హాజీ అలీ’యాత్ర విషాదంగా ముగిసింది. బుధవారం తెల్లవారుజామున ఒమన్ ప్రాదేశిక సముద్రజలాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ నౌకపై దాడి జరిగింది. ‘‘57 మీటర్ల పొడవు, 14 మీటర్ల వెడల్పున్న ఈ నౌక ప్రధాన భాగం చెక్కతో నిర్మించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో నౌక తీవ్రంగా దెబ్బతిని సముద్రజలాల్లో మునిగిపోయింది. ఈలోపు విషయం తెల్సుకుని ఒమన్ తీరగస్తీ దళాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. నౌకలోని 14 మంది సిబ్బందిని కాపాడాయి. నావికులందరినీ త్వరలోనే భారత్‌కు తరలిస్తాం. నౌకపై ఎవరు దాడి చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది. స్వేచ్ఛా వాణిజ్యాన్ని అడ్డుకుంటూ వాణిజ్య నౌకలపై దాడి, నావికులకు ప్రాణహాని కల్గించే ఇలాంటి చర్యలు ఏమాత్రం ఆమోదనీయంకాదు’’అని అదనపు కార్యదర్శి ముకేశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
భారత నౌకపై దాడి: ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో నౌక పూర్తిగా మునిగిపోయినప్పటికీ, అందులోని 14 మంది భారతీయ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.సోమాలియా నుండి బయలుదేరిన ఈ నౌక బుధవారం ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా దాడికి గురైంది. దాడి కారణంగా నౌకలో భారీగా మంటలు చెలరేగి, చివరకు అది సముద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ తక్షణమే స్పందించి, సిబ్బందిని రక్షించి 'దిబా' నౌకాశ్రయానికి తరలించారు.భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంఈ దాడిని విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. వాణిజ్య నౌకలు, పౌర నావికులను లక్ష్యంగా చేసుకోవడం "ఆమోదయోగ్యం కాదు" అని స్పష్టం చేసింది. "భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినందుకు ఒమన్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాణిజ్య నౌకల స్వేచ్ఛకు ఆటంకం కలిగించడం, అమాయక పౌరుల ప్రాణాలను పణంగా పెట్టడం వంటి చర్యలను భారత్ సహించదు" అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.యూఏఈ సంఘీభావంఈ ఉగ్రవాద దాడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర నావిగేషన్‌కు, ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్ర ముప్పు అని హెచ్చరించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 2817ను ఈ దాడి స్పష్టంగా ఉల్లంఘించిందని యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత నౌకల భద్రత కోసం తీసుకునే అన్ని చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని యూఏఈ ప్రకటించింది.ఆందోళన కలిగిస్తున్న ప్రాంతీయ పరిస్థితులుఫిబ్రవరి 28న అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుండి భారత నౌకలపై దాడి జరగడం ఇది మూడవసారి. హర్మూజ్ జలసంధిలో భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్న తరుణంలో ఈ తాజా దాడి చోటుచేసుకోవడం గమనార్హం. వాణిజ్య మార్గాలను ఆర్థిక బ్లాక్మెయిల్ కోసం వాడుకోవడం పైరసీ చర్యలతో సమానమని, ఇది ప్రపంచ ఇంధన భద్రతకు ముప్పు అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.UAE Strongly Condemns Terrorist Attack on Indian-Flagged Ship off the Coast of Oman pic.twitter.com/gRArK2tniB— MoFA وزارة الخارجية (@mofauae) May 14, 2026 -
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కొత్త సమస్య
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు కేవలం ముడి చమురు ధరలే కాదు అంతకుమించిన పెను సంక్షోభం ముంచుకొస్తోంది. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని హార్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంధన రంగంతోపాటు ప్రపంచ ఆహార భద్రతను, పారిశ్రామిక ఉత్పత్తిని అతలాకుతలం చేస్తున్నాయి. ఎరువులు, సల్ఫర్, పారిశ్రామిక లోహాల సరఫరా గొలుసు విచ్ఛిన్నం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.1,150 శాతం పెరిగిన ధరలుప్రపంచ పారిశ్రామిక రంగానికి లైఫ్ లైన్ వంటి సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆర్గస్ ప్రైసింగ్, యూఎస్ జియోలాజికల్ సర్వే గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లతో పోలిస్తే చైనా సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏకంగా 1,150 శాతం పెరిగాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సల్ఫర్ ధరల్లో 750 శాతం పెరుగుదల నమోదైంది. ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారు అయిన చిలీలో ధరలు 230 శాతం పెరిగాయి.సల్ఫ్యూరిక్ యాసిడ్ లేకుండా ఎరువుల ఉత్పత్తి, రాగి ప్రాసెసింగ్, బ్యాటరీల తయారీ, సెమీకండక్టర్ల ఫ్యాబ్రికేషన్ అసాధ్యం. ప్రపంచ సల్ఫర్ ఎగుమతుల్లో సగానికి పైగా పర్షియన్ గల్ఫ్ నుంచే వస్తుండటంతో హార్మూజ్ జలసంధి మూసివేత ఈ సరఫరాను పూర్తిగా స్తంభింపజేసింది.చమురు సంక్షోభంసౌదీ ఆరామ్కో సీఈఓ అమిన్ నాసర్ ఈ పరిస్థితిని ‘ప్రపంచం ఇప్పటివరకు చూడని అతిపెద్ద ఇంధన సరఫరా షాక్’గా అభివర్ణించారు. గతంలో రోజుకు 70 నౌకలు ప్రయాణించే హార్మూజ్ జలసంధి ద్వారా ఇప్పుడు కేవలం 2 నుంచి 5 నౌకలు మాత్రమే వెళ్తున్నాయి. సుమారు 240 నౌకలు సముద్రం మధ్యలోనే నిలిచిపోయాయి.ప్రతి వారం ప్రపంచ మార్కెట్లు 100 మిలియన్ బ్యారెళ్ల చమురును కోల్పోతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1 బిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలిగింది. అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వలు 1982 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది.ఎరువుల కొరతతో ఆహార సంక్షోభంచమురు కంటే ఎరువుల సంక్షోభమే అత్యంత భయంకరంగా ఉండబోతోందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఎరువుల వాణిజ్యంలో మూడింట ఒక వంతు హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఖతార్ ఫెర్టిలైజర్ కంపెనీ ఇప్పటికే ‘ఫోర్స్ మేజర్’(నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల పనిని పూర్తి చేయలేకపోవడం) ప్రకటించగా, నెలకు 3-4 మిలియన్ టన్నుల ఎరువుల సరఫరా నిలిచిపోయింది.భారత్ ఇప్పటికే మూడు యూరియా ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించగా బంగ్లాదేశ్ ఐదు ప్లాంట్లలో నాలుగింటిని మూసివేసింది. బ్రెజిల్లో యూరియా దిగుమతులు 33 శాతం పడిపోయాయి. ఈ సరఫరా అంతరాయం కొనసాగితే వచ్చే కొద్ది నెలల్లోనే 4.5 కోట్ల మంది తీవ్ర ఆకలి బారిన పడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆందోళన వ్యక్తం చేసింది.పారిశ్రామిక రంగంపై ప్రభావంకేవలం వ్యవసాయమే కాదు, హైటెక్ పరిశ్రమలు కూడా చిక్కుల్లో పడ్డాయి. సెమీకండక్టర్లకు అవసరమైన హీలియం సరఫరా నిలిచిపోయింది. సల్ఫర్ కొరత కారణంగా ఇండోనేషియాలో నికెల్ ప్రాసెసింగ్ నిలిచిపోయింది. ఇది నేరుగా ఈవీ బ్యాటరీల తయారీపై దెబ్బకొడుతోంది.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలుఒకవైపు ఆర్థిక సంక్షోభం వెంటాడుతుంటే, మరోవైపు అగ్రరాజ్యాల మధ్య దౌత్యపరమైన వేడి పెరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనలను తోసిపుచ్చడం, అమెరికా అణు జలాంతర్గామి జిబ్రాల్టర్ చేరుకోవడం వంటి పరిణామాలు యుద్ధ మేఘాలను సూచిస్తున్నాయి. మే 14-15 తేదీల్లో ట్రంప్ బీజింగ్ పర్యటనపైనే ఇప్పుడు ప్రపంచం ఆశలు పెట్టుకుంది.మార్కెట్లు కేవలం చమురు ధరల పెరుగుదలను మాత్రమే అంచనా వేస్తున్నాయి. కానీ తెరవెనుక ఎరువులు, సల్ఫర్ కొరత సృష్టిస్తున్న విధ్వంసం ఇంకా అంచనాలకు అందడం లేదు. ఒకవేళ జూన్ మధ్య నాటికి హార్మూజ్ జలసంధిలో పరిస్థితులు చక్కబడకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2027 వరకు కోలుకోవడం కష్టమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన -
హర్మూజ్ దాటే నౌకలకు సర్వీస్ ఛార్జీ
హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై "సేవా రుసుము" (Service Fee) వసూలు చేసేందుకు ఇరాన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిదాబాది ధ్రువీకరించినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. నౌకల రాకపోకల పర్యవేక్షణ (Navigation), సహాయక చర్యల (Rescue Operations) వంటి సేవలకు ప్రతిఫలంగా ఈ రుసుములను వసూలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.ఎంపిక చేసిన నౌకలకే అనుమతిహర్మూజ్ జలసంధి గుండా అన్ని నౌకలను కాకుండా, ఎంపిక చేసిన వాటిని మాత్రమే అనుమతిస్తామని ఘరిదాబాది పేర్కొన్నారు. నౌకలపై విధించే ఛార్జీల విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను, పారదర్శకతను పాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో భారత దేశ సహకారాన్ని ఇరాన్ స్వాగతిస్తోందని పేర్కొన్నారు.భారత్‌కు ప్రాధాన్యత"భారతదేశం మాకు అత్యంత స్నేహపూర్వక దేశం. ఇప్పటికే భారత్‌కు చెందిన 11 నౌకలకు అనుమతి ఇచ్చాము. మిగిలిన నౌకల అనుమతి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నాము" అని ఆయన ఎన్డీటీవీతో చెప్పారు.ప్రాంతీయ ఉద్రిక్తతలపై స్పందిస్తూ, ఇరాన్ కాల్పుల విరమణను కోరలేదని, అమెరికాయే ఆ ప్రతిపాదన తెచ్చిందని గరిదాబాది సంచలన వ్యాఖ్యలు చేశారు. "ప్రస్తుత పరిస్థితి 'శాంతి లేదు - యుద్ధం లేదు' అన్నట్లుగా ఉంది. అందుకే ప్రారంభంలో మేము కాల్పుల విరమణను వ్యతిరేకించాం. అయితే దౌత్యపరమైన పరిష్కారం కోసం చివరికి చర్చలకు అంగీకరించాం," అని ఆయన వివరించారు. -
వాహన, వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్‌షాక్?
సాక్షి,న్యూఢిల్లీ: వంటగ్యాస్, పెట్రోల్,డీజిల్ వినియోగదారులకు బిగ్‌షాక్ తగలనుంది. వచ్చే వారంలో కేంద్రం లీటర్ పెట్రోల్‌కు రూ.2 నుంచి రూ.4వరకు.. వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.40 నుంచి రూ.50వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇరాన్-అమెరికా యుద్ధంలో ఆయిల్ కంపెనీలకు లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. అయితే, పెట్రోల్,డీజిల్ ధరలు పెంచకపోతే ఆ భారం భరించలేమని కంపెనీలు చెబుతున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెంచితే ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని కేంద్రం ఆందోళనలో ఉంది.ఈ క్రమంలో దశలవారీగా పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలను పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. హర్మూజ్‌ను మూసివేయడంతో భారత్‌కు ముడిచమురు సరఫరా నిలిచిపోయింది. దీంతో కంపెనీలు రష్యా,పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ రేట్లకు ముడిచమురును కొనుగోలు చేస్తున్నాయి. -
అమెరికా ప్రతిపాదనలపై చర్చకు ఓకే
దుబాయ్/ఇస్లామాబాద్: అమెరికా అందజేసిన 14 సూత్రాల ప్రతిపాదనపై చర్చలకు ఇరాన్ సిద్ధమైంది. ఇందుకోసం పాకిస్తాన్‌కు ప్రతినిధులను పంపించేందుకు అంగీకరించింది. ఈ మేరకు మధ్యవర్తిగా ఉన్న పాక్‌కు సమాచారం పంపినట్లు ఇరాన్ అధికార వార్తా సంస్థ వెల్లడించింది. అయితే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు సహా అన్ని యుద్ధాలను నిలిపివేయాలని, నౌకాయానం భద్రతకు భరోసా ఇవ్వాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ముందుగా వీటిపైనే చర్చలు జరగాలని స్పష్టం చేసింది. ఇవి కార్యరూపం దాల్చాకే హార్మూజ్‌ను తిరిగి తెరవడం, అణుకార్యక్రమాన్ని వదలుకోవడంపై వంటి వాటిపై చర్చలు జరపాలని ప్రభుత్వం పేర్కొందని ఇరాన్ టీవీ తెలిపింది. ఈ షరతులపై అమెరికా స్పందించాల్సి ఉంది. మరోవైపు ఇరాన్–అమెరికాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఆటంకాలు కొనసాగుతున్నాయి. తాజాగా గుర్తు తెలియని ప్రాంతం నుంచి దూసుకొచ్చిన డ్రోన్ల దాడులతో ఖతార్ తీరంలోని ఓ సరుకు నౌకకు నిప్పంటుకోగా, కొన్ని డ్రోన్లు కువైట్ గగనతలంలోకి చొరబడ్డాయి. ఆదివారం ఉదయం అబుధాబి నుంచి వస్తున్న వాణిజ్య నౌకపై జరిగిన డ్రోన్ దాడి ఫలితంగా చెలరేగిన మంటలను వెంటనే ఆర్పేశామని ఖతార్ తెలిపింది. ఆదివారం వేకువజామున తమ గగనతలంలోకి ప్రవేశించిన గుర్తు తెలియని డ్రోన్లను మధ్యలోనే పేల్చివేసినట్లు కువైట్ వెల్లడించింది. దాడులపై ఖతార్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన ఏమాత్రం ఆమోదయోగ్యం కాని ఉద్రిక్తత అంటూ వ్యాఖ్యానించింది. తాము గుర్తు తెలియని డ్రోన్లను కూల్చివేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇవి ఇరాన్ ప్రయోగించినవేనంటూ ఆరోపించింది. గత వారం హార్ముజ్ జలసంధిలో లంగరు వేసి ఉన్న తమ నౌకపై వెంటవెంటనే రెండు డ్రోన్‌దాడులు జరిగినట్లు దక్షిణ కొరియా నౌక ఆదివారం తెలిపింది. దాడితో పేలుడు, మంటలు చెలరేగాయని వెల్లడించింది. -
కాల్పుల విరమణపై సందేహాలు!
దుబాయ్: అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా శుక్రవారం దాడికి దిగడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా తీరుపై ఇరాన్ భగ్గుమంటోంది. ప్రతిదాడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ఇరాన్ ట్యాంకర్లపై తమ బలగాలు దాడి చేశాయని అమెరికా సైన్యం తెలిపింది. అంతకుముందు తమ నౌకలపై జరిగిన దాడులను తిప్పికొట్టామని, జలసంధిలోని ఇరాన్ సైనిక స్థావరాలపై దాడి చేశామని ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 41 మందిని అరెస్టు చేసినట్లు బహ్రెయిన్ శనివారం ప్రకటించింది. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించడం, హార్మూజ్ జలసంధిని నౌకాయానానికి వీలుగా తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని టెహ్రాన్ ఉపసంహరించుకోవడంపై ఒప్పందం కోసం అమెరికా చేసిన తాజా ప్రతిపాదనపై ఇరాన్ఇంకా స్పందించలేదు. కొన్ని అంశాలపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతోంది. అణు కార్యక్రమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్‌పై బాంబు దాడులను పునఃప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేయడం గమనార్హం. మరోవైపు అమెరికా మద్దతుగా నిలుస్తున్న బహ్రెయిన్‌కు ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికాకు వత్తాసు పలకడం తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. హార్మూజ్ జలసంధి ఒక కీలకమైన జీవనాధారం. దానిని మీ అంతట మీరే శాశ్వతంగా మూసివేసే ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దు’’అంటూ ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిషన్ అధిపతి ఇబ్రహీం అజీజీ తేల్చిచెప్పారు. పశ్చిమాసియాలో ఘర్షణలు ముగిసిన తర్వాత హార్మూజ్‌లో తమ నౌకలను రక్షించుకోవడానికి యుద్ధనౌకను పంపించనున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ ప్రకటించింది. -
హర్ముజ్ లో టెన్షన్ టెన్షన్.. నిలిచిపోయిన 1500 ఓడలు..
-
ట్రంప్ మైండ్ గేమ్.. ఇరాన్ యుద్ధంలో మరో ట్విస్ట్
ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా పర్షియన్ గల్ఫ్ వేదికగా మరోసారి ఇరు దేశాలకు దాడులు మొదలయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన పేరిట పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. అయితే ఇరాన్ చర్చలకు దిగొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొన్ని గంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. హర్ముజ్‌లో యూఎస్ యుద్ధనౌకలపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. జలసంధిలో గస్తీ కాస్తున్న ట్రక్ట్సన్, మాసన్ లక్ష్యంగా దాడులు చేసింది. అమెరికా రక్షణ వ్యవస్థ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పి కొట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. అయితే కాల్పుల విరమణ కొనసాగుతోందని.. జరిగింది చిన్నస్థాయి దాడులని ఆయన అన్నారు. అయితే ఆ వెంటనే. ఇరాన్‌లోని క్షిపణి లాంచ్ సైట్లు, కమాండ్ సెంటర్లపై అమెరికా దాడికి దిగింది. మరోవైపు.. హర్ముజ్ జలసంధిలో వెళ్తున్న ఇరాన్ ట్యాంకర్‌పై అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. క్విష్మ్, బందర్ అబ్బాస్ నగరాల్లోనూ దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై క్షిపణులు విరుచుకుపడడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయని పలు మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి!. ఈ దాడుల వెనుక యూఏఈ పాత్ర ఉందని ఇరాన్ అనుమానిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్నిఅమెరికా తుంగలో తొక్కిందని విమర్శిస్తూనే.. ప్రతిఘటన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. దీంతో శాంతి చర్చలకు విఘాతం కలిగే అకాశం కనిపిస్తోంది.ఇరాన్‌కు సాలిడ్ వార్నింగ్!ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందానికి రావాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఇరాన్ సాధారణ దేశం కాదు.. అది ఉన్మాదుల చేతుల్లో ఉంది. గాలిలోనే వాళ్ల డ్రోన్లు దగ్గం అయ్యాయి. సీతాకోకచిలుకల్లా సముద్రంలో రాలిపోయాయి. శాంతి ఒప్పందంపై త్వరగా సంతకం చేయాలి. లేదంటే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది’’ అని అన్నారు.ట్రంప్ తీరు బాగోలేదు!ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలకు పాక్‌తో కలిసి సౌదీ అరేబియా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హర్ముజ్ జలసంధిలో నౌకల కోసం చేపట్టిన ఎస్కార్ట్ ఆపరేషన్‌ను ట్రంప్ 24 గంటలు గడవక ముందే ఆపేశారు. ఆయన ఇలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుండడంపై సౌదీ అరేబియా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అమెరికాకు గగనతల అనుమతులు నిరాకరిస్తూ నిర్ణయం తీసుకుంది. -
త్వరలోనే అందుబాటులోకి హార్మూజ్
టెహ్రాన్: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి త్వరలోనే తెరుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా, ఇరాన్‌లు మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు సమాచారం. హార్ముజ్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకువాలని ఇరు దేశాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిస్థాయి ఒప్పందం కుదిరేందుకు ఆస్కారం ఉంది. దాంతో జలసంధి పూర్తిస్థాయిలో తెరుచుకుంటుంది. అక్కడ చిక్కుకుపోయిన చమురు నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఫిబ్రవరి 28న దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత హార్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది. కొన్ని దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తోంది. అనంతరం అమెరికా కూడా జలసంధిలో ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించింది. హార్మూజ్ మూసివేతతో చమురు రవాణా స్తంభించిపోయింది. చమురు, ఎల్పీజీ ధరలు పెరిగిపోయాయ. ప్రధానంగా ఆసియా దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హార్మూజ్‌లో ఇరాన్ ఆంక్షల వల్ల చిక్కుకుపోయిన నౌకలను విడిపించేందుకు అమెరికా సైన్యం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించింది. కానీ, ఇరాన్‌తో చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి లభించడంతో ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను నిలిపివేస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఒప్పందానికి రాకపోతే ఇరాన్‌పై మళ్లీ బాంబు దాడులు మొదలవుతాయని ఆయన స్పష్టంచేశారు. పశ్చిమాసియాలో రెండు నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి త్వరలోనే తెరపడవచ్చన్న సంకేతాలు రావడం గురువారం అంతర్జాతీయ మార్కెట్లను ఉత్తేజపరిచింది. స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అమెరికా, ఇరాన్‌ల మధ్య ఒప్పందం అతి త్వరలోనే కుదురుతుందని భావిస్తున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహీర్ అంద్రాబీ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గురువారం వాటికన్ సిటీలో పోప్ లియో–14తో సమావేశయ్యారు. మధ్యప్రాచ్యంలో శాశ్వత శాంతిని సాధించడానికి సాగుతున్న ప్రయత్నాల గురించి చర్చించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పోప్ లియో–14పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, వాటికన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మార్కో రూబియో ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలాగే వాటికన్ విదేశాంగ మంత్రి కార్డినల్ పెట్రో పారోలిన్తోనూ రూబియో భేటీ అయ్యారు. పశ్చిమాసియా పరిణామాలపై చర్చించారు. -
మళ్లీ ట్రంప్ బెదిరింపులు
వాషింగ్టన్: ఇరాన్‌పై బాంబులేసి యుద్ధాగ్ని జ్వాలల్ని రాజేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ అదే పాట పాడారు. ‘‘గతంలో మేం పెట్టిన షరతులకు తలొగ్గి ఇరాన్ ఆచరణసాధ్యమైన శాంతి ఒప్పంద ప్రతిపాదనలతో ముందుకొస్తోందని సమాచారమొచ్చింది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు మేం ఆరంభించిన ‘ఎపిక్ ఫ్యూరీ’సైనిక చర్య దాదాపు ముగింపుకొచ్చింది. అత్యంత ప్రభావవంతమైన మా దిగ్బంధం ధాటికి ఇప్పుడు హార్మూజ్ ఇరాన్ సహా అందరికీ అందబాటులోకి రాబోతోంది. ఈ దిశలో ఇరాన్గనక మళ్లీ తోకజాడిస్తే బాంబుల వర్షం కురవడం ఖాయం. గతంలో ఎన్నడూలేనంతటి భీకరంగా బాంబులేస్తాం’’అని ట్రంప్ తన సోషల్‌మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో పోస్ట్ చేశారు. హార్మూజ్‌ను వీలైనంత త్వరగా తెరవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీకి బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సూచించిన నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటనచేయడం గమనార్హం. మరోవైపు ఒక పేజీకి సరిపడా షరతులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరాన్, అమెరికాలు ఓవైపు ముందడుగేస్తున్నాయన్న వార్తలు వెలువడ్డాయి. మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే విదేశీ చమురునౌకలకు రక్షణగా తమ యుద్ధనౌకలను సాయంగా పంపే ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదరనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. -
కామికేజ్ డాల్ఫిన్లతో దాడులకు టెహ్రాన్ ప్లాన్..?
ప్రస్తుతం ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం చల్లారడం లేదు. ఇరు దేశాలు సీజ్ఫైర్ అమలు చేస్తున్న యుద్దం విషయంలో మాత్రం స్పష్టత రావట్లేదు. అయితే ఇటీవల ఓ కొత్త విషయం పలువురిని ఇబ్బందులకు గురి చేసింది. అమెరికాపై దాడులకు ఇరాన్ కామికేజ్ డాల్ఫిన్లను ఉపయోగించే అవకాశం ఉందని కథనాల వచ్చాయి. కాగా దీనిపై తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్ స్పందించారు.ప్రస్తుతం హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఏం చేయాలో గుండా రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా సైతం ఇరాన్ నౌకశ్రయాలను బ్లాకేడ్ చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాల్‌స్ట్రీట్ జనరల్‌లో ప్రచురితమైన కథనం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.ఈ విషయమై అమెరికా రక్షణ శాఖ మంత్రిని సంప్రదించగా ఈ విధంగా మాట్లాడారు. "ఇరాన్ తన కార్యకలాపాల కోసం 'కామికేజ్ డాల్ఫిన్లను వాడడం పూర్తిగా అవాస్తవం ఇరాన్ వద్ద అటువంటి డాల్ఫిన్ ఆపరేషన్లు ఏవీ లేవని తాను ఖచ్చితంగా చెప్పగలను. అయితే అమెరికా వద్ద అవి ఉన్నాయా అనే ప్రశ్నకు మాత్రం నేను అవును లేదా కాదు అని సమాధానం చెప్పను" అని అన్నారు.ఇరాన్ వద్ద కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయాఇరాన్ వద్ద ప్రస్తుతం కామికేజ్ డాల్ఫిన్లు ఉన్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. అయితే 2000 సంవత్సరంలో ఇరాన్ రష్యా నుండి కొన్ని శిక్షణ పొందిన డాల్ఫిన్లను కొనుగోలు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. కాని అవి ఇప్పుడు చాలా వృద్ధాప్యంలో ఉంటాయని, కాబట్టి వాటిని ప్రస్తుత యుద్ధ అవసరాలకు వాడటం అసాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.అమెరికా అమెరికా మాత్రం గత కొన్ని దశాబ్దాలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇస్తోంది. 'యుఎస్ మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్' ద్వారా వీటిని మైన్లను గుర్తించడానికి, సముద్రంలో వస్తువులను వెతకడానికి ఉపయోగిస్తారు.అమెరికా శిక్షణ ఇచ్చే డాల్ఫిన్లు మైన్లను గుర్తించడానికే పరిమితమని అవి బాంబులతో పాటు పేలిపోయే 'కామికేజ్' రకం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.డాల్ఫిన్ల ప్రత్యేకతసైనిక అవసరాల కోసం డాల్ఫిన్లను వాడటం కొత్తేమీ కాదు. రష్యా కూడా తన ఓడరేవుల రక్షణ కోసం వీటిని వాడుతుంటుంది. సైన్స్ ప్రకారం, డాల్ఫిన్ల వద్ద ఉన్న సోనార్ వ్యవస్థ అత్యంత అధునాతనమైనది. ఎంత చీకటిగా ఉన్నా లేదా బురద నీటిలోనైనా ఇవి నీటి అడుగున ఉన్న లక్ష్యాలను ఖచ్చితంగా గుర్తించగలవు. మానవ నిర్మిత డ్రోన్ల కంటే ఇవే వేగంగా మైన్లను పసిగట్టగలవని అమెరికా నేవీ వెబ్సైట్ పేర్కొంది.కామికేజ్ అనే పేరుసాధారణంగా, ఆత్మహత్యాయుద్ధానికి పాల్పడే వారిని (ముఖ్యంగా జపాన్ విమాన పైలట్లు) 'కామికేజ్' అని పిలుస్తారు. డాల్పిన్ల విషయానికి వస్తే, వాటి శరీరానికి పేలుడు పదార్థాలను అమర్చి, శత్రువుల నౌకలను లేదా సబ్మెరైన్లను ఢీకొట్టి పేల్చేలా శిక్షణ ఇవ్వడాన్నే "కామికేజ్ డాల్పిన్లు" అంటారు.అయితే, అధికారికంగా ఏ దేశం కూడా తాము ఇలాంటి "ఆత్మహత్య" దళాలను వాడుతున్నామని ఒప్పుకోలేదు. కానీ, అమెరికా మరియు రష్యా వంటి దేశాలు "మెరైన్ మామల్ ప్రోగ్రామ్స్" ద్వారా ప్రస్తుతం డాల్పిన్లకు సైనిక శిక్షణ ఇస్తున్నాయి. -
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్ నిలిపేస్తున్నాం: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌లోని హార్మూజ్ జలసంధికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో దౌత్యపరమైన ప్రయత్నాలలో పురోగతి కనిపిస్తున్నందున జలసంధి గుండా నౌకల రాకపోకలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. అయితే, ఇరాన్‌పై ఉన్న బ్లాకేడ్ (నౌకాశ్రయాల నిర్బంధం) మాత్రం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘ఇరాన్‌తో చర్చల్లో గొప్ప పురోగతి కనిపిస్తోంది. అందుకే హార్మూజ్‌లో చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ఆపరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. పాకిస్తాన్, ఇతర దేశాల అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ఆపరేషన్‌ను నిలిపివేయడానికి మేం పరస్పరం అంగీకరించాం. ఇరాన్ ప్రతినిధులతో చర్చలు సంపూర్ణ, తుది ఒప్పందం దిశగా వెళ్తున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముంది. అయితే, సముద్ర కార్యకలాపాలు నిలిచిపోయినప్పటికీ ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. ఇరాన్ నౌకాశ్రయాలపై దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుంది. ఇరాన్‌పై అమెరికా సాగిస్తున్న పోరాటం సైనిక విజయమే. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశముందని పేర్కొన్నారు.President Trump posts on TruthSocial: Based on the request of Pakistan and other Countries, the tremendous Military Success that we have had during the Campaign against the Country of Iran and, additionally, the fact that Great Progress has been made toward a Complete and Final… pic.twitter.com/BF6mZ4AtCc— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 6, 2026కాగా, ఈ చర్యల ద్వారా అమెరికా ఒకవైపు సైనిక ఒత్తిడి కొనసాగిస్తూ, మరోవైపు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. హార్మూజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి కీలక మార్గం. ముఖ్యంగా చమురు రవాణాలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మార్గంలో ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.కీలక పరిణామాలు.. ఇక, ఇరాన్‌తో అమెరికా చర్చలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య సందేశాల మార్పిడి జరుగుతోంది. అయితే అమెరికా ప్రతిపాదనలపై ఇరాన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అణు కార్యక్రమం కూడా ఈ చర్చల్లో కీలక అంశంగా మారింది. ఇరాన్ అణ్వాయుధాల దిశగా కదులుతోందని అమెరికా ఆరోపిస్తుండగా, ఇరాన్ మాత్రం తన కార్యక్రమం శాంతియుతమని చెబుతోంది. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చూస్తే హార్మూజ్‌లో ఉద్రిక్తతలు తగ్గకపోయినా, చర్చల ద్వారా పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌కు ఇచ్చిన తాత్కాలిక విరామం ఆ దిశలో కీలక మలుపుగా మారే అవకాశముంది. -
'ప్రత్యామ్నాయం' వైపు పలు దేశాలు
హార్మూజ్ దిగ్బంధనాల అడకత్తెరలో చిక్కుకుని ప్రపంచం విలవిలలాడుతున్న వేళ, దక్షిణ అమెరికాలోని కొలంబియా అనే చిన్న దేశంలో గమనార్హమైన సమావేశాలు జరిగాయి. ఏప్రిల్ 24 నుంచి 29 వరకు సుమారు 60 దేశాల భాగస్వామ్యంతో జరిగిన ఆ సమావేశాల అజెండా – పెట్రోల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల నుంచి ప్రత్యామ్నాయాల వైపు మళ్లటం ఎట్లాగన్నది. ఇది ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధంవల్ల ఏర్పడిన ఒత్తిడికి పర్యవసానం. పర్యావరణ అంశాలపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన 30 సంవత్సరాలకు పైగా సదస్సులు జరుగుతుండటం, శిలాజ ఇంధనాల వినియోగం తగ్గింపు గురించి తీర్మానాలు, ఒప్పందాల మాట తెలి సిందే. కానీ ఇపుడు మొదటిసారిగా ఐక్యరాజ్యసమితితో నిమిత్తం లేకుండా, అమెరికాను కనీసం ఆహ్వానించకుండా ఈ సమావేశాలు జరగటం విశేషం. పెద్ద దేశాలకు లేదు ఆహ్వానంఅమెరికాయే కాదు. రష్యా, చైనా, ఇండియా, గల్ఫ్ దేశాల వంటివి కూడా అందులో పాల్గొనలేదు. కానీ, సమావేశాలకు సహనిర్వాహకురాలైన నెదర్లాండ్స్‌తో పాటు పలు యూరోపియన్ దేశాలు వెళ్లాయి. ఇందులో అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ను న్నాయి. అమెరికాను ఆహ్వానించకపోవటం ఎందువల్ల? దీనికి నిర్వాహకులు చెప్పిన సమాధానం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యాన ఎన్నో సమావేశాలు జరిగినా ఆ తీర్మానాలను అమెరికా వీటో చేస్తూ వస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ అయితే అసలు శిలాజ ఇంధనాల వినియోగం సమస్యే కాదంటూ కొట్టివేసి ప్యారిస్ ఒప్పందం నుంచి నిష్క్రమించారు. తక్కిన పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలావరకు ఇటువంటి ఇంధనాలతోనే ముడిబడి ఉన్నాయి. వారు ప్రత్యామ్నాయాల కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా, చైనాలో తప్ప ఇతరచోట్ల మందకొడిగానే సాగుతున్నాయి.ఈ పరిస్థితుల మధ్య మిగిలిన దేశాలు శిలాజ ఇంధనాల పరిధి నుంచి వీలైనంత వేగంగా బయట పడటం తప్పనిసరి అవుతున్నది. ఇదెంత అత్యవసరమో ఉక్రెయిన్ యుద్ధ సందర్భంలో ఒకసారి తెలిసి రాగా, ఇపుడు ఇరాన్ యుద్ధంవల్ల మరింత తీవ్ర రూపంలో అర్థమవుతున్నది. చమురును, గ్యాస్‌ను ఉత్పత్తి చేసే దేశాలు, వాటి వ్యాపారాన్ని నియంత్రించే కంపెనీలు గల రాజ్యాలు, వాటి ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు మొత్తం శిలాజ ఇంధన రంగం బందీ అయిపోయింది. ఇంధన ఉత్పత్తులు, ధరల నియంత్రణను కొందరు తరచు ఆయుధంగా ఉపయోగించుకున్నారు. అటువంటి ఇంధన వనరులు గల ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకునేందుకు రాజకీయంగా, సైనికంగా అనేకం చేశారు. ఈ స్థితి ఇప్పుడు ఇరాన్ యుద్ధ సందర్భంగా పరాకాష్ఠకు చేరింది. ఇంత క్లిష్ట స్థితి చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నది నిపుణుల మాట.యుద్ధంతో పెరిగిన ఒత్తిడిఈ ప్రభావాలు చిన్న దేశాలపై సరేసరి కాగా అభివృద్ధి చెందిన యూరప్‌పై కూడా పడుతున్నాయి. అందువల్లనే కొలంబియా సమావేశాలకు నెదర్లాండ్స్ సహ నిర్వాహకురాలు కాగా, వచ్చే సంవత్సరం పసిఫిక్ ద్వీప దేశమైన తువాలూ సమావేశాలకు ఐర్లండ్ సహనిర్వాహకురాలు కావాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పులతో సముద్ర జలాల స్థాయి పెరిగి 2100 నాటికి తువాలూ దేశం 90 శాతం మునుగుతుందన్నది అంచనా. కొలంబియా సమా వేశాలకు పలు యూరోపియన్ దేశాలు వెళ్లటాన్ని బట్టి, ఇరాన్ యుద్ధంతో తలెత్తిన శిలాజ ఇంధన సమస్యలు వారికి కూడా ఎంత ఇబ్బందికరంగా మారాయో గ్రహించవచ్చు. యూరోపియన్ యూనియన్ దేశాలు బొగ్గు, చమురు, గ్యాస్ వినియోగాలను 2050 నాటికి దశల వారీగా నిలిపి వేయాలని నిర్ణయించాయి కూడా.కొలంబియాలో జరిగిన నిర్ణయాలు అన్నీ శిలాజ ఇంధన ఉత్పత్తి దేశాలూ, కంపెనీలూ, వాటిని నియంత్రించే శక్తులతో ప్రమేయం ఉండని విధంగా ఇతర ఇంధన వనరుల వైపు వేగంగా మళ్లాలని. అవి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు, అణు విద్యుత్తు, ఎలక్ట్రికల్, బ్యాటరీ రంగాలు, జల విద్యుత్తు, సముద్ర కెరటాల విద్యుత్తు వంటివి. ఇవి శిలాజ ఇంధన రంగం నుంచి విముక్తం చేయటంతోపాటు ఆర్థిక స్వాతంత్య్రాన్నిచ్చి పర్యావరణ సమస్యల నుంచి పరిష్కారాలను చూపుతాయి. వీటన్నింటి ప్రభావంతో బయటి శక్తుల ప్రభావాలు తగ్గి, దేశాభివృద్ధి, సామాజికాభివృద్ధి వంటివి సులభమవుతాయి. అమెరికా, జర్మనీలకు చెందిన మాజీ ఇంధన మంత్రులైతే, ఒక దాదాకు, గుత్తాధికారం గల శక్తికి గల ప్రభావం నుంచి బయట పడేందుకే ఈ ప్రయత్నాలు జరుగు తున్నాయని వ్యాఖ్యానించటం గమనించదగ్గది. ఈ విధమైన వివిధ అంచనాలను గమనించినపుడు, శిలాజ ఇంధనాలన్న ఒక్క అంశంతో ముడిబడి ఎన్నెన్ని ఉన్నాయనే ఆశ్చర్యం కలుగుతుంది.పర్యావరణ ప్రజాస్వామ్యంకొలంబియా సమావేశాలకు అధ్యక్షత వహించిన ఆ దేశ పర్యావరణ మంత్రి ఐరీన్ వెలెజ్ టోర్రెస్, ‘ప్రపంచ పర్యావరణ ప్రజాస్వామ్యానికి ఈ చర్చలు ఆరంభ’మని అన్నారు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రపంచంలోని ‘పెట్రో నియంతృత్వాలకు, ఎలక్ట్రో ప్రజాస్వామ్యాలకు మధ్య విభజనకు ఇది నాంది అవుతున్న’ దని ప్రకటించారు. ఈ పరిణామాలను గమనించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం అధిపతి సైమన్ స్టియెల్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై చమురు పరిశ్రమ ఆధిపత్యం కారణంగానే ఈ ప్రమాదం పట్ల ప్రభుత్వాలు కళ్లు తెరిచాయని అన్నారు. జాతీయ భద్రతలు, ఆర్థిక సుస్థిరతలు, విధానపరమైన స్వయం నిర్ణయాలు, మౌలికమైన రీతిలో సార్వభౌమాధికారాల పరిరక్షణల కోసం కూడా ప్రత్యామ్నాయ ఇంధన వ్యవస్థలు అవసరమని స్పష్టం చేశారు. కొన్ని దేశాల సైనిక సలహాదారులు సైతం ఇదే అభిప్రాయంతో ఉండటం గమనించదగ్గది.అయితే, కొలంబియాలో 60 దేశాలు చూపిన చొరవ, ఆ దిశగా ఆయా దేశాలు వచ్చే సమావేశాల నాటికి ప్రణాళికలు రూపొందించనుండటం గొప్ప విషయమేగానీ, లక్ష్యసాధనకుగల సమస్యలు తక్కువ కాదు. ప్రత్యామ్నాయ ఇంధనాలకు కాగల ఖర్చు శిలాజ ఇంధనాల కన్న చాలా తక్కువే. ఆ పని దశల వారీగా కూడా చేయవచ్చు. అసలు సమస్య సాంకేతిక నైపుణ్యాలు, ప్రత్యామ్నాయ ఇంధన పరికరాల ఉత్పత్తికి సంబంధించినది. ఈ రెండు విషయాలలోనూ చైనా అగ్రస్థానంలో ఉంది. వారు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయగలరుగానీ, ఇతర దేశాల స్వయం సమృద్ధికి సహకరించగలరా? అదెట్లున్నా కొలంబియా చొరవ హర్షించదగ్గది.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
"భారత్ పేరుతో అమెరికా కొత్తనాటకం"
అమెరికా అవకాశ వాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తమ దేశానికి అవసరం ఉంటే ఉగ్రవాద నాయకులను కూడా ప్రపంచ శాంతి దూతలను చేస్తోంది. అదే వారితో పనైపోతే ఈడ్చితంతుంది. ఇది ఆ దేశం యెుక్క నైజం.. తాజాగా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఆ విషయాన్ని మరోసారి రుజువు చేశారు.ఇరాన్‌తో యుద్ధం ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తేలా చేసిన యుఎస్ఏ ఇప్పుడు.. అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడం కోసం ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. తనపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చుకోవడానికి మానవతా సాయం పేరుతో కొత్తనాటకానికి తెర తీసింది. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఈ విషయమై మాట్లాడుతూ.. హర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు దారి చూపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపొందించిన "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" ప్రణాళిక ఒక "మానవతా ప్రయత్నం" అంతర్జాతీయ సరఫరా గొలుసులను, ముఖ్యంగా భారతదేశంలోని కోట్లాది మంది ప్రజల వంట అవసరాలకు కీలకమైన లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) రవాణాను రక్షించడమే దీని లక్ష్యం అని ఆయన అన్నారు.గత నెలలో జరిగిన ప్రపంచ బ్యాంకు సదస్సులో పేద మరియు అత్యంత బలహీనమైన దేశాలు తన వద్దకు వచ్చి, హర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య రవాణాను పునరుద్ధరించాలని అమెరికాను కోరాయని అందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. "ఇది ఒక మానవతా ప్రయత్నం. ఇందులో కేవలం ఇంధనం మాత్రమే కాదు, ఎరువులు, ఆహార రవాణా మరియు భారతదేశంలోని బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు వంట కోసం ఉపయోగించే LPG కూడా ఉన్నాయి," అని ఆయన అన్నారు.చైనాపై ఆరోపణలుకాగా ఈ నేపథ్యంలోనే బెన్సెంట్ చైనాను విమర్శించారు."ఇరాన్‌కు చైనా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాద ప్రోత్సాహక దేశం. చైనా వారి ఇంధనంలో 90 శాతాన్ని కొనుగోలు చేస్తూ, ఆ ఉగ్రవాద దేశానికి నిధులు సమకూరుస్తోంది," అని ఆయన ఆరోపించారు. వచ్చే వారం ట్రంప్ మరియు జిన్‌పింగ్‌ల భేటీ జరగనున్న నేపథ్యంలో, ఈ విషయంలో చైనా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన కోరారు.ఇరాన్ దగ్గర సత్తా లేదుయుద్ధంలో ఇరాన్ తన పోరాట పటిమను కోల్పోయిందని, అమెరికా దళాలకు వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న ప్రకటనలన్నీ కేవలం 'ప్రచారమే అన్నారు. ఇరాన్ నాయకత్వం దేశవ్యాప్తంగా బంకర్లలో దాక్కుంది, అసలేం జరుగుతుందో వారికి తెలియడం లేదని .ఇరాన్ నౌకాదళం ఇప్పుడు ఒక నౌకాదళంలా లేదు, అది కేవలం "సముద్రపు దొంగల ముఠా"గా మారిందన్నారు. వారు అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను అడ్డుకోవాలని చూస్తున్నారని అమెరికా దాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. సైనికులకు జీతాలు అందకపోతే వారు పోరాడలేరని ఆయన వ్యాఖ్యానించారు. -
రానున్న 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో ఏం జరగబోతోంది
-
మళ్లీ మొదలైన పశ్చిమాసియా యుద్ధం!
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. యూఏఈలోని పుజైరా చమురు కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిపింది. క్షతగాత్రుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నట్లు సమాచారం. త్వరలో శత్రువుల పునాదులు పెకలిస్తామని ఐఆర్జీసీ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ దాడులు జరగడం గమనార్హం.గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు, చిన్న పడవలతో యుద్ధానికి దిగింది. అయితే 12 బాలిస్టిక్ మిసైళ్లు, 3 క్రూయిజ్ మిసైళ్లు, 4 డ్రోన్లను యూఏఈ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలోనే పలువురికి గాయాలైనట్లు సమాచారం. మరోవైపు.. పర్షియన్ గల్ఫ్ తీరంలోని ముసందం (Musandam) గవర్నరేట్ పరిధిలోని బుఖా ప్రాంతంలో(ఒమన్) కార్మికుల నివాస భవనం దెబ్బతింది. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులు గాయపడ్డారు. ఈ దాడుల్ని ఈయూ, సౌదీ అరేబియాలు ఖండించాయి. దాడుల నేపథ్యంలో యూఏఈ తమ విమానాలను నిలిపివేసింది.ఇటు హర్ముజ్‌లోనూ..హర్ముజ్ జలసంధిలోనూ ఇరాన్ అమెరికా రక్షణలో ఉన్న నౌకలను టార్గెట్‌గా చేసుకుని దాడులు జరిపాయి. అయితే తమ నౌకలు సేఫ్‌గానే ఉన్నాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. దాడుల్లో దక్షిణ కొరియాకు చెందిన ఓ వాణిజ్య నౌక మంటల్లో కాలిపోయింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో వందలాది నౌకలు హర్ముజ్‌లో నిలిచిపోయాయి. వాటిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు అమెరికా రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేస్తోంది.ట్రంప్ ఏమన్నారంటే.. ఇరాన్ తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. యూఎస్ నౌకలను.. యూఎస్ రక్షణలో ఉన్న నౌకలపై ఇరాన్ దాడులు జరిపిన వాళ్లను భూమ్మీద లేకుండా చేస్తాం హెచ్చరించారు. ఈ తరుణంలో కాల్పుల విరమణ(ceasefire) కొనసాగుతోందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు. అయితే ‘‘యుద్ధం సైనికంగా ముగిసింది’’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.ఇరాన్ వైఖరియూఏఈపై దాడులు జరిపింది తామేనని ఇరాన్ అంగీకరించలేదు. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పందిస్తూ.. ఈ ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు సైనిక పరిష్కారం పనికి రాదు. రాజకీయ పరిష్కారం అవసరం అని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఇరాన్ తాజా దాడుల నేపథ్యంలో.. ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. గల్ఫ్ దేశాల్లో కాల్పులు, హెచ్చరికలు కొనసాగుతున్నాయి. సీజ్ ఫైర్ చాలా బలహీనంగా మారడంతో ఏ క్షణాన ఏం జరగనుందో అని గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. -
హర్ముజ్‌పై ట్రంప్ కీలక ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి యుద్ధం దిశగా అడుగులేస్తున్నాయి. ఇప్పటికే ఇరు దేశాలు పరస్పర ప్రతిపాదనలను తోసిపుచ్చుకున్నాయి. శాంతి చర్చలంటూనే.. ఇరాన్‌ను రెచ్చగొట్టేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన హర్ముజ్‌లో సరికొత్త ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ఫ్రీడమ్.. ట్రంప్ చేసిన తాజా ప్రకటన. హర్ముజ్ జలసంధిలో చిక్కుకున్న నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ మేరకు ఆయన సోషల్ ట్రూత్‌లో ‘‘చిక్కుకున్న ఆ నౌకలు తటస్థమైనవి. ఈ ఉద్రిక్తతలతో వాటికి ఏ సంబంధం లేదు. ఏ తప్పు చేయకుండానే అందులో ఉన్న సిబ్బంది ఆహారం, ఇతర అవసరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని సురక్షితంగా బయటకు తేవాల్సిన అవసరం అమెరికా బాధ్యత’’ అని ప్రకటించారు. ఏం చేస్తారంటే.. ట్రంప్ చెప్పిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు ఫ్రీడమ్ సోమవారం మధ్యాహ్నాం(మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది. మానవతా దృక్పథంతో ఈ ఆపరేషన్ చేపడుతున్నామని.. ప్రాంతీయ స్థిరత్వానికి, అలాగే అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ఎంతో కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సీ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం.. సముద్ర మార్గంలో చిక్కుకున్న వందలాది నౌకలు, వాటిల్లోని సుమారు 20,000 మంది సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకు రావడం. ఆ నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు అమెరికా సైన్యం దారి చూపుతుంది. వాటికి రక్షణగా నిలుస్తుంది. తద్వారా వాటి వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు సహాయం చేస్తుంది. సీ ఆపరేషన్‌కు ఇరాన్ సహకరిస్తుందా?హర్ముజ్ సముద్ర మార్గం ప్రపంచ చమురు రవాణాకు కీలకమైనది. రెండు నెలలుగా ఇక్కడ ఏర్పడ్డ అంతరాయం, కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ప్రభావం పడింది. గ్లోబల్ మార్కెట్ కుదేలైంది. దీనిని ఆసరాగా చేసుకుని అమెరికాను తమ డిమాండ్లకు ఒప్పించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ తరుణంలో ట్రంప్ తాజా ప్రకటనకు, నౌకలు సురక్షితంగా బయటకు వచ్చేందుకు సహకరిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పటికే ఇరాన్ ప్రతిపాదించిన 14 పాయింట్ల శాంతి ప్రణాళికను ట్రంప్ తిరస్కరించారు. ఆయన దానిని "అంగీకారయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో "సానుకూల చర్చలు" జరుగుతున్నాయని ట్రంప్ సూచించారు. అదే సమయంలో ప్రాజెక్టు ఫ్రీడమ్‌లో గనుక జోక్యం చేసుకుంటే కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.ఇరాన్ ఏమందంటే.. ప్రాజెక్టు ఫ్రీడమ్‌ను మానవతా చర్యగా ట్రంప్ చెబుతున్నప్పటికీ.. ఇది ముమ్మాటికీ అమెరికా వ్యూహాత్మక శక్తి ప్రదర్శనగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే.. ఈ చర్యను అసాధ్యంగా ఇరాన్ అభివర్ణిస్తోంది. హర్ముజ్ తమ ఆధీనంలో ఉందని.. ఇప్పటికే అమెరికా బ్లాకేడ్(దిగ్బంధనం) తమ సార్వభౌమత్వానికి భంగం కలిగిస్తోందని.. ఇప్పుడు నౌకల తరలింపునకు అమెరికా తన సైన్యాన్ని రంగంలోకి దించితే గనుక అది కాల్పుల విరమణ ఉల్లంఘన కిందకే వస్తుందని ప్రకటించింది. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి అబ్రహీం అజిజీ ఈ సముద్ర ఆపరేషన్‌పై సెటైర్లు వేశారు. హర్ముజ్ సముద్ర మార్గం అనేది అమెరికా ట్రూత్ సోషల్ పోస్టులతో నిర్వహించబదని ఎద్దేవా చేశారు. హర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని స్పష్టం చేశారాయన. దీంతో “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”కు ఇరాన్ సహకారం ఇవ్వదనేది స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఇది ఎలాంటి ఉద్రిక్తతలకు దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. -
హార్మూజ్‌ను దాటిన ఎల్పీజీ నౌక
న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పిజీ) కొరత కొంతవరకు తీరిపోయే అవకాశం వచ్చింది. 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పిజీతో ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటేసి భారత్ దిశగా పయనం సాగిస్తోందని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక పేరు ఎంటీ సర్వశక్తి. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 18 మంది భారతీయులే. ఈ నెల 2న హార్మూజ్‌లో కీలకమైన చెక్‌పాయింట్‌ను విజయవంతంగా దాటేసింది. ఈ నెల 13వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. భారత్‌లో సగంరోజు అవసరానికి సరిపడా ఎల్పీజీ ఈ నౌకలో ఉంది. గంటకు 12 నుంచి 14 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆదివారం సాయంత్రానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్నట్లు తెలిసింది. సర్వశక్తి నౌకలోని సిబ్బంది, ఎల్పీజీ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. గతంలో పర్షియన్ గల్ఫ్, భారత్‌లోని ఓడరేవుల మధ్య రాకపోకలు సాగించిన ఈ అతిపెద్ద గ్యాస్ నౌకను భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్దెకు తీసుకుంది. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత హార్మూజ్‌ను దాటిన మొదటి భారత అనుబంధ చమురు నౌక సర్వశక్తి కావడం విశేషం. భారత జెండా లేదా భారత యాజమాన్యంలోని 14 నౌకలు ఇప్పటికీ హార్మూజ్ జలసంధి పశ్చిమ భాగంలో చిక్కుకుపోయి ఉన్నాయి. -
ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్లాన్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధిని తెరిపించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రణాళిక సిద్ధం చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రణాళికలో భాగంగా మిత్రదేశాలతో సమన్వయం చేసుకుంటూ, హార్మూజ్‌లో ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని అమెరికా కొనసాగిస్తుందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.జలసంధిలో స్వేచ్ఛాయుత ఇంధన రవాణాకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్‌పై ఆర్థికంగా ఒత్తిడి పెంచడం, తద్వారా ఆ దేశం దిగొచ్చేలా చేయడమే అసలు ఉద్దేశమని పేర్కొన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ పలు దౌత్య, విధానపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారని తెలియజేశారు. మొత్తానికి ఇరాన్‌కు దారికి తీసుకురావడం, హార్మూజ్‌ను తెరిపించడం ట్రంప్ లక్ష్యమని స్పష్టం చేశారు. మరోవైపు, శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని.. ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామంటూ పరోక్షంగా స్పష్టం చేశారు.హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా.. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. -
పేరుకుపోతున్న ఇరాన్ చమురు నిల్వలు.. నెక్ట్స్ జరిగేదేంటంటే?
ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధం కారణంగా టెహ్రాన్ చమురు ఎగుమతులు తగ్గాయి. ఇరాన్ చమురు నిల్వలు పేరుకుపోతున్నాయి. చమురు నిల్వ చేసుకునే ప్రదేశాలు తక్కువగా ఉండడంతో ట్యాంకర్లలో క్రూడ్ నిల్వలు పెరుగుతున్నట్లు షిప్పింగ్ డేటా చూపిందని విశ్లేషకులు తెలిపారు. దీని వల్ల ఇరాన్లో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రపంచం ముందు ఏయే సవాళ్లు ఉన్నాయి? గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఇరాన్ క్రూడ్‌ను తీసుకెళ్లిన నౌకలు ఏప్రిల్ 13-25 తేదీల మధ్య చాలా తక్కువగా ఉన్నాయని చమురు విశ్లేషణ సంస్థ వోర్టెక్సా తెలిపింది. మార్చిలో 13-25 తేదీల మధ్య 23.4 మిలియన్ బారెల్స్ ఎగుమతి చేసింది. మార్చి 13-25 తేదీలతో పోల్చితే ఏప్రిల్ 13-25 తేదీల మధ్య 80 శాతానికి పైగా తగ్గుదల నమోదైందని తెలిపిన ఎల్ఎస్ఈజీ డేటాను వోర్టెక్సా చూపించింది.ఇరాన్‌కు చెందిన కొన్ని నౌకలు పోర్టుల నుంచి బయలుదేరిన తర్వాత అమెరికా అడ్డుకుంది. ఆంక్షల పరిధిలో ఉన్న కంటైనర్ నౌకలు, ఆసియా జలాల్లోని ఇరాన్ ట్యాంకర్లు కూడా ఇందులో ఉన్నాయి.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల మొత్తం చమురు మార్కెట్లో సరఫరా తగ్గి, డిమాండ్‌తో పోలిస్తే అందుబాటులో ఉన్న చమురు తక్కువగా ఉండటం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారుతోంది. చమురు సరఫరా తగ్గి, పోటీ పెరిగి, ధరలు పెరుగుతున్నాయి.ఈ దశలో, సుమారు 4 మిలియన్ బ్యారెల్స్ ఇరాన్ క్రూడ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి విజయవంతంగా బయటకు వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. అయితే, ఆ నౌకలను తర్వాత అడ్డగించారా? అన్నది ప్రస్తుతం నిర్ధారించలేకపోతున్నారు.ఇరాన్ నుంచి సరఫరా తగ్గడం వల్ల మార్కెట్లో ఇప్పటికే ఉన్న క్లిష్ట పరిస్థితి మరింత పెరిగింది. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో.. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్, ఇరాక్ నుంచి చమురు ఎగుమతులు తగ్గి, ధరలు పెరిగాయి.గత నెలలో, ధరలు తగ్గేందుకు ఇరాన్‌కు అమెరికా ఇంధన ఎగుమతులపై తాత్కాలిక ఆంక్షల మినహాయింపు ఇచ్చింది. బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్‌కు సుమారు $50 పెరిగాయి. దీంతో పెట్రోల్, డీజిల్, జెట్ ఇంధన ధరలు పెరిగాయి.ప్రపంచంలోనే అతిపెద్ద అంతరాయం ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి అంతరాయం అని పేర్కొంది. హార్మూజ్ నిర్బంధం ప్రారంభమైన తర్వాత గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏ ఇరాన్ క్రూడ్ ట్యాంకర్లు బయటకు వెళ్లలేదని తెలుస్తోంది.తమ నిర్బంధం ద్వారా ఇరాన్‌కు క్రూడ్ ఎగుమతి ఆదాయం తగ్గిందని అమెరికా తెలిపింది. “ప్రస్తుతం 41 ట్యాంకర్లలో 69 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉంది, ఇవి ఇరాన్ ప్రభుత్వం అమ్మలేకపోతోంది” అని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది.ఇరాన్ కరెన్సీ రియాల్ (దేశీయ ద్రవ్య మాధ్యమం) అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఇది చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను చూపిస్తోంది. ఒత్తిడి ఉన్నప్పటికీ, ఖార్గ్ దీవిలోని ప్రధాన ఎగుమతి కేంద్రంలో ఇరాన్ ఇంకా క్రూడ్ లోడింగ్ కొనసాగిస్తోందని ట్యాంకర్ ట్రాకర్స్ తెలిపింది.ఉపగ్రహ చిత్రాల ప్రకారం గల్ఫ్ ఆఫ్ ఒమాన్‌లోని చాబహార్ పోర్టు వద్ద దాదాపు 10 ట్యాంకర్లు నిలిచివున్నాయి. ఫిబ్రవరిలో ఇరాన్ రోజుకు సుమారు 3.24 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఉత్పత్తి చేసింది. అందులో సగం దేశీయ రిఫైనింగ్‌కు ఉపయోగించింది.అయితే, నిల్వలకు స్థలం తక్కువగా ఉండటంతో ఒకటి రెండు వారాల్లో ఉత్పత్తి తగ్గించాల్సి రావచ్చని విశ్లేషకులు తెలిపారు. భూభాగ నిల్వలు సుమారు 60 శాతం నిండి ఉన్నాయి. పూర్తి నిల్వలు 50 మిలియన్ బ్యారెల్స్ పైగా ఉన్నాయి. మొత్తం సామర్థ్యం 86 మిలియన్ బ్యారెల్స్. సామర్థ్య పరిమితుల వల్ల జూన్ మధ్యలో ఇరాన్ ఉత్పత్తిని తగ్గించాల్సి రావచ్చని ఎఫ్జీఈ నెక్స్టాంట్ ఈసీఏ కన్సల్టెన్సీ అంచనా వేసింది. -
జలసమాధి చేస్తాం
టెహ్రాన్: శత్రువుల భారీ నుంచి గల్ఫ్‌ను కాపాడుతామని, ఈ ప్రాంతాన్ని సురక్షితంగా మారుస్తామని ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. జలమార్గంలో శత్రు మూకల దురాగతాలను అంతం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పర్షియన్ గల్ఫ్‌లో చిల్లర పనులు చేస్తున్న ‘గ్రహాంతరవాసులను’జలగర్భంలోకి పంపిస్తామని తేల్చిచెప్పారు. వారిని నీటిలోనే సమాధి చేస్తామని పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ మేరకు ఖమేనీ విడుదల చేసిన లిఖిత సందేశాన్ని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో గురువారం చదివి వినిపించారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవుల గుండా ప్రయాణించే నౌకలపై దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా, అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలోనే మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు జారీ చేశారు. గల్ఫ్‌తోపాటు హార్మూజ్‌కు సంబంధించి ఒక కొత్త అధ్యాయం రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. హార్మూజ్‌లో ‘నూతన నిర్వహణ’అన్ని గల్ఫ్ దేశాలకు శాంతి, పురోగతి, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వెల్లడించారు. తద్వారా పొరుగు దేశాలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. పర్షియన్ గల్ఫ్‌లో అభద్రతకు అమెరికా ఇక్కడ తిష్టవేయడమే ముఖ్య కారణమని ఖమేనీ ఆక్షేపించారు. గల్ఫ్‌లో సొంత స్థావరాలను కాపాడుకొనే సామర్థ్యం అమెరికాకు లేదన్నారు. అలాంటప్పుడు ఈ ప్రాంతంలోని ఆశ్రితులకు భద్రత కల్పిస్తుందన్న ఆశ అసలే లేదని ఉద్ఘాటించారు. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అక్కడ దురాశ, దురుద్దేశంతో ప్రవర్తించే ఇరాన్ శత్రువులకు నీటి అడుగున తప్ప మరెక్కడా స్థానం లేదని హెచ్చరించారు. సముద్ర గర్భంలో శత్రువును దెబ్బకొట్టడానికి రహస్య అస్త్రం సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ సైన్యం ప్రకటించిన తర్వాత మొజ్తబా ఖమేనీ అమెరికాకు ఈ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అమెరికా ప్రమేయం లేకపోతేనే గల్ఫ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన వెల్లడించారు. అమెరికాతో స్నేహం వదులుకోవాలని గల్ఫ్ దేశాలకు పరోక్షంగా సూచించారు. భయంకర భూతం అమెరికా ఇరాన్ అణు, క్షిపణి సామర్థ్యాలను జాతీయ ఆస్తిగా పరిరక్షించుకుంటామని మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. ఈ విషయంలో కఠిన వైఖరి అవలంబించక తప్పదని తెలిపారు. దేశంలోనూ, వెలుపల ఉన్న 9 కోట్ల మంది ఇరానీయన్లు నానోటెక్నాలజీ, బయోటెక్నాలజీ నుంచి అణు, క్షిపణి సామర్థ్యాల వరకు తమ ఆధ్యాతి్మక, మానవ, శాస్త్రీయ, పారిశ్రామిక, సాంకేతిక సామర్థ్యాలన్నింటినీ జాతీయ సంపదలుగా భావిస్తారని స్పష్టంచేశారు. వారు దేశ జలాలను, భూమిని, గగనతలాన్ని ఎలాగైతే కాపాడుకుంటారో.. అలాగే వీటిని కూడా భద్రంగా కాపాడుకుంటారని పేర్కొన్నారు. అమెరికాను ‘గ్రేట్ సాతాను’గా ఖమేనీ అభివరి్ణంచారు. అదొక భయంకర భూతమని నిందించారు. పర్షియన్ గల్ఫ్‌లో అమెరికన్లకు ఏం పని అంటూ ప్రశ్నించారు. వారు ఇక్కడి వ్యవహారాలో జోక్యం చేసుకోవడం మానుకోవాలని హితవు పలికారు. హార్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. హార్మూజ్‌పై ఇరాన్ నియంత్రణ ఉంటేనే గల్ఫ్ దేశాలు సురక్షితంగా ఉంటాయని స్పష్టంచేశారు. -
జలసంధిలో చట్టాల ఉల్లంఘన!
ప్రపంచమంతా ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం, కాల్పుల విరమణ, యుద్ధ విరమణ గురించి ఉత్కంఠగా పరిశీలిస్తున్నది. విచిత్రమయిన, ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ యుద్ధంలో న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు, మధ్యవర్తి అర్హతల గురించిన చర్చ మచ్చుకు కూడా లేదు. యుద్ధంలో భాగస్వాములు కాని అరబ్ దేశాల అవస్థల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందరి దృష్టీ కేవలం హార్మూజ్ జలసంధిని ఒకవైపు ఇరాన్, మరోవైపు పరోక్షంగా అమెరికా దిగ్బంధించడం మీదనే ఉన్నది. ఎందుకంటే హార్మూజ్ గుండా చమురు, గ్యాస్ నిరాటంకంగా రవాణా జరిగితే చాలు, మిగతా విషయాలు మాకేమిటనే ధోరణిలో ప్రపంచ దేశాలు ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల ఉల్లంఘన గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘బలవంతుడి మాటే చట్టం’ అని ప్రపంచ దేశాలు రాజీ పడినట్టుగా కనిపిస్తున్నది. అంతర్జాతీయ చట్టాల అమలుకు బాధ్యత తీసుకోవాల్సిన ఐక్యరాజ్య సమితి కోమాలో ఉన్నట్టుగా తోస్తున్నది.మౌనం దాల్చిన ప్రపంచ దేశాలు!పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న శాంతి చర్చలలో ప్రతిష్ఠంభనకు రెండు ప్రధాన పీటముడులు ఉన్నాయి. ఒకటి, హార్మూజ్ దిగ్బంధనం; రెండు, ఇరాన్ అణు కార్యక్రమం. హార్మూజ్ జలసంధిని పూర్తిగా నియంత్రించే అధికారం తనకున్నదని ఇరాన్ వాదిస్తున్నది. మొదటి విడత చర్చల తర్వాత ఇరాన్ కాస్త మెత్తబడి హార్మూజ్ నుండి అన్ని నౌకల రవాణాకు సహకరించడానికి ముందుకొచ్చింది. కానీ, ఇరాన్ రేవు పట్టణాల నుండి వచ్చే నౌకలను, ఇరాన్ రేవులకు వెళ్లే నౌకలను అడ్డగిస్తామని అమెరికా మంకుపట్టు పట్టడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఇరాన్, అమెరికాలకు ఈ రకంగా ప్రపంచ వాణిజ్యాన్ని అడ్డుకొనే హక్కు ఉందా అని ప్రపంచ దేశాలు ప్రశ్నించాల్సింది పోయి, నోరు మెదపకుండా కూర్చోవడం శోచనీయం. సన్నని జలసంధులు, సముద్ర మార్గాల గుండా సరుకుల రవాణాను నియంత్రించడానికి రెండు ప్రధాన అంతర్జాతీయ చట్టాలున్నాయి. 1. యుఎన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ (యు.ఎన్.సి. ఎల్.ఓ.ఎస్), 2. శాన్ రెమో మాన్యువల్. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. రెండు రకాల జలసంధి రవాణా మార్గాలను గుర్తించింది. అవి : 1. ఇన్నోసెంట్ పాసేజ్, 2. ట్రాన్సిట్ పాసేజ్. తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల దూరం లోపు నౌకల రవాణా జరిగితే ఆ మార్గాన్ని ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 19 కింద తీరదేశాల భద్రతకు ముప్పు లేకుండా నౌకలు ప్రయాణించవచ్చు. ఆర్టికల్ 25 (3) ప్రకారం తీర దేశం ఇన్నోసెంట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను తన దేశ భద్రత దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. భౌగోళిక రాజకీయ వ్యూహాలు12 నాటికల్ మైళ్లకు ఆవల ఉండే జలమార్గాలను ట్రాన్సిట్ ప్యాసేజ్గా పరిగణిస్తారు. యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్. ఆర్టికల్ 44 ప్రకారం తీరదేశాలు ట్రాన్సిట్ ప్యాసేజ్ గుండా నౌకల రవాణాను అడ్డుకోవడం నిషేధం. ఇరాన్–ఒమన్ తీరాలను విభజించే హార్మూజ్ జలసంధి వెడల్పు కనిష్ఠంగా 21 నాటికల్ మైళ్లు. ఒమన్, ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాలు (టెరిటోరియల్ వాటర్స్) చెరొక 12 నాటికల్ మైళ్లకు విస్తరిస్తే మొత్తం 24 నాటికల్ మైళ్లు. కానీ జలసంధి 21 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే నౌకలు ఇరాన్ సార్వభౌమ సముద్ర జలాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకే ఇరాన్ హార్మూజ్‌ను ఇన్నోసెంట్ పాసేజ్‌గా పరిగణిస్తూ, తన భద్రత దృష్ట్యా మూసివేస్తానని వాదిస్తున్నది. ఇక అమెరికా హార్మూజ్ జలసంధి గుండా ఇరానియన్ రేవు పట్టణాలకు నౌకల రవాణాను అడ్డుకోవడం యు.ఎన్.సి.ఎల్.ఓ.ఎస్ నిబంధనలను, యుఎన్ ఛార్టర్, హై సీస్ ఫ్రీడమ్ యాక్ట్ నిబంధనలను అతిక్రమించడమే. 1908లో ఇరాన్లో చమురు నిల్వలు కనుగొన్నప్పటి నుంచి మధ్యప్రాచ్యం... యూకే, ఫ్రాన్స్, జర్మనీ, రష్యా; అనంతరం అమెరికాల జియోపొలిటికల్ వ్యూహంలో పావుగా మారింది. యూకే, ఫ్రాన్స్, డచ్, జర్మన్, యూఎస్ఏల చమురు కంపెనీలు, రాత్స్‌చైల్డ్ వంటి యూదుల ప్రైవేట్ బ్యాంకులు చక్రం తిప్పాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టమాన్ సామ్రాజ్యాన్ని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా పంచుకున్నాయి. టర్కీ, ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ల సరిహద్దులను తమ ఇష్టానుసారం చమురు నిల్వల ప్రయోజనాల ఆధారితంగా నిర్ధారించాయి. వలస పాలకులు, చమురు కంపెనీల వారు సరిహద్దులను గీయటం, మధ్యప్రాచ్యంలో సున్నీ–షియా–కుర్ద్ –యూదుల మధ్య వైషమ్యాలు తీవ్రరూపం దాల్చటం... ప్రస్తుత రావణకాష్టానికి కారణం. షియాల ప్రాబల్యమున్న ఇరాన్–ఇరాక్‌ల నుంచి రక్షణ కోసం అరబ్ దేశాలు అమెరికా పంచన చేరాయి. అమెరికా ఈ దేశాలలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసి, రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. పెట్రో డాలర్ బూమ్‌తో అరబ్ దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా తయారయ్యాయి. కానీ పొరుగున పాలస్తీనా (గాజా), సిరియా, లెబనాన్, ఇరాన్, ఇరాక్లలో అనిశ్చితి కొనసాగుతున్నది. ఈ ప్రాంతీయ అనిశ్చిత స్థితి తమ ఆర్థిక, రాజకీయ స్థిరత్వానికి ముప్పు అని గుర్తించి అరబ్ దేశాలు క్రమంగా ఇజ్రాయిల్‌తో మైత్రికి ముందుడుగు వేశాయి. ఇజ్రాయిల్‌తో సంబంధాలను మెరుగుపరచుకున్నాయి. ఇరాన్ మంత్రి రష్యా పర్యటన!2020 కల్లా చైనా, రష్యా, భారత్‌లు అమెరికాకు ప్రత్యామ్నాయ శక్తులుగా ఆవిర్భవించాయి. 2023లో చైనా మధ్యవర్తిత్వంలో సౌదీ అరేబియా ఇరాన్‌తో సంబంధాల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేసింది. భారత్ ప్రతిపాదించిన ఐమెక్ (ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్)లో యూఏఈ, సౌదీ చేరాయి. అమెరికా–ఐరోపాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పాటయిన బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) కూటమిలో సౌదీ, యూఏఈలు 2024లో సభ్యులుగా చేరడం అరబ్ దేశాల నూతన వ్యూహాన్ని బలపరుస్తున్నది. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీలు ‘పెట్రో యువాన్’ను బలపరచటానికి తోడ్పడుతున్నాయి. భారత్–యూఏఈలు డాలర్లో కాకుండా స్థానిక కరెన్సీలలో వాణిజ్యానికి ఒప్పందం చేసుకున్నాయి. యూఎస్ఏ నాయకత్వంలోని పశ్చిమ దేశాల స్విఫ్ట్ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా యూఏఈ, సౌదీ, చైనా, హాంకాంగ్‌లు ఎం–బ్రిడ్జ్ ప్రాజెక్టును పరీక్షిస్తున్నాయి. డాలర్లకు బదులుగా ఖతర్, సౌదీలు బంగారంలో పెట్టుబడులను అధికం చేస్తున్నాయి. మరోవైపు అరబ్ దేశాలు గత దశాబ్దకాలంగా చైనా, భారత్, రష్యాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న మల్టీ అలైన్మెంట్ విధానం అరబ్ దేశాలకు కూడా అనుసరణీయంగా కన్పిస్తున్నది. ఈ నేపథ్యంలో, ఇరాన్–అమెరికాల మధ్య శాంతి చర్చల సమన్వయ ప్రయత్నాలలో భాగంగా ఇరాన్ విదేశాంగ మంత్రి జరిపిన రష్యా పర్యటన క్రమంగా ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఇరాన్ యుద్ధంలో రష్యా ప్రత్యక్ష పాత్రకు బహుశా ఇది నాంది కావచ్చు. గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
ఇరాన్‌పై అమెరికా దాడులు మళ్లీ మొదలు.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని రీతిలో ఇరాన్‌పై మెరుపు దాడులు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంటామ్) సైనిక చర్యలకు సన్నాహాలు చేస్తోందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ నివేదించింది. రెండు వేర్వేరు మూలాల ఆధారంగా.. గురువారం ఇరాన్‌పై దాడుల ప్రణాళికలపై సెంటామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్‌తో ట్రంప్ చర్చించనున్నట్లు పేర్కొంది.చర్చలలో ప్రధాన అంశాలుట్రంప్–కూపర్ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. వాటిలో ఇరాన్‌పై భారీ స్థాయిలో కాంబాట్ ఆపరేషన్ నిర్వహించడం, శాంతి ఒప్పంద చర్చలు ముందుకు సాగేందుకు ప్రయత్నించడం, యుద్ధం ముగించే ముందు శత్రువుకు చివరి దెబ్బ ఇవ్వడం వంటి వ్యూహాలు ఉన్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, అమెరికాతో శాంతి చర్చలకు ఇరాన్‌ను ఒప్పించేలా స్వల్పకాలిక శక్తివంతమైన దాడులు జరిపేందుకు సెంటామ్ మొగ్గు చూపుతోంది. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి, అదనంగా బాంబులు వర్షం కురిపించి అణు చర్యలపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.సెంట్రల్ కమాండ్ మరో ప్రణాళికలో హర్మూజ్ జలసంధిలోని కొంత భాగాన్ని స్వాధీనం చేసుకుని వాణిజ్య నౌకాయానానికి తిరిగి తెరవడంపై దృష్టి సారించింది. ఈ ఆపరేషన్‌లో భూతల దళాలు కూడా పాల్గొనవచ్చని నివేదిక పేర్కొంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ట్రంప్ ప్రధాన బలంగా భావిస్తున్నారని సమాచారం. అయినప్పటికీ, ఇరాన్ లొంగకపోతే ఆయన సైనిక చర్యను పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.మూడవ ప్రత్యామ్నాయంఈ బ్రీఫింగ్లో ప్రస్తావనకు రాబోయే మరో వ్యూహం, ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక దళాలతో ఆపరేషన్ చేపట్టడం. గతంలో ఇరాన్ అణు కార్యక్రమం ఒక ముప్పు అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించడానికి ఇది ప్రధాన కారణమని ఆయన అన్నారు. యుద్ధం ఇప్పటికే 60 రోజులకు పైగా కొనసాగుతోంది. ఇరాన్ మాత్రం తాము అణ్వాయుధాలను కోరుకోవడం లేదని, శాంతియుత ప్రయోజనాల కోసం అణు సాంకేతికతను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని చెబుతోంది.జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ కూడా ట్రంప్‌తో జరిగే సెంట్రల్ కమాండ్ సమావేశానికి హాజరుకానున్నారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ముందు కూడా కూపర్ ఇలాంటి బ్రీఫింగ్ ఇచ్చారు. దానికి ప్రతిస్పందనగా ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు జరిపి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని మరింతగా పెంచిందని యాక్సియోస్ నివేదిక హైలెట్ చేసింది. -
ఇక నో హార్మూజ్.. భారత్‌కు గుడ్‌న్యూస్
ఇరాన్, అమెరికా యుద్ధం వేళ చమురు విషయంలో భారత్‌కు శుభవార్త. చమురు ఉత్పత్తి, తరలింపు విషయంలో యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిని బైపాస్ చేసి, ఫుజైరా(Fujairah) ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది భారత్ లాంటి అతిపెద్ద చమురు మార్కెట్‌కు మంచి పరిణామం. ఈ క్రమంలో హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు. దీంతో భారత్ చమురు కష్టాలకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.యూఏఈ రెండు రోజుల క్రితమే.. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) బయటకు వచ్చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. మే ఒకటో తేదీ నుంచి యూఏఈ బయటకు రాబోతోంది. ఈ నేపథ్యంలో యూఏఈ అవసరాలు, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఇరాన్ హార్మూజ్ అవసరం లేకుండా.. బైపాస్ చేసి, ఫుజైరా ద్వారా యూఏఈ తన చమురు రవాణాను మళ్లించనున్నట్టు వెల్లడించింది.After leaving OPEC, the UAE can now freely increase its oil production, thanks to the Fujairah Pipeline that bypasses the Strait of Hormuz.The Emirates had planned and developed this independent export route for years, enabling it to add up to 2 million barrels per day.A… pic.twitter.com/rqQpwq7hB0— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) April 28, 2026ఇక, యూఏఈ ఒపెక్ నుంచి బయటకు రావడంతో తన చమురు ఉత్పత్తిని రోజుకు పది లక్షల బ్యారెళ్ల మేర తక్షణమే పెంచుకోగలదు. ఒపెక్ నుంచి ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేకుండా పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోకెమికల్స్‌ను ఎగుమతి చేయవచ్చు. దీంతో భారత్ కష్టాలకు చెక్ పడొచ్చు. ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉండటం వల్ల భారత్‌కు యూఏఈ తన తొలి ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, భద్రతా రంగాల్లో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చమురు.. భారీ సంఖ్యలో భారత్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. హార్మూజ్ జలసంధి గుండా రావాల్సిన అవసరం లేకుండా ఫుజైరా ద్వారా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చు.ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్ ఇలా.. హబ్షాన్-ఫుజైరా ఆయిల్ పైప్‌లైన్, దీనిని అబుదాబి క్రూడ్ ఆయిల్ పైప్‌లైన్ (ADCOP) అని కూడా పిలుస్తారు. అబుదాబిలోని హబ్షాన్ చమురు క్షేత్రాల నుండి ఒమన్ గల్ఫ్‌లోని ఫుజైరా ఓడరేవు వరకు 380-406 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పైప్‌లైన్‌ను, ఇరుకైన హార్మూజ్ జలసంధిని తప్పించుకోవడానికే ప్రత్యేకంగా నిర్మించారు. సుమారుగా 4 బిలియన్ డాలర్ల వ్యయంతో 2012లో ఈ పైప్ లైన్‌ను నిర్మించారు. దీని ద్వారా రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేయవచ్చు. ఫుజైరా పోర్టులో ఆయిల్ నింపుకుని, ట్యాంకర్లు నేరుగా అరేబియా సముద్రంలోకి వెళ్తాయి. దీంతో హార్మూజ్ జలసంధి అవసరం లేకుండా పోతుంది.ఫుజైరా నుంచి భారత్‌కు ఆయిల్ సరఫరా గణాంకాలు..యూఏఈ సరఫరా (ఏప్రిల్ 2026): రోజుకు 619,000 బ్యారెల్స్గత ఆర్థిక సంవత్సర సగటు: రోజుకు 433,000 బ్యారెల్స్వృద్ధి: సుమారు 43% పెరుగుదలభారత్ మొత్తం క్రూడ్ దిగుమతి (ఏప్రిల్ 1–26, 2026): రోజుకు 4.4 మిలియన్ బ్యారెల్స్ (ఫిబ్రవరి 5.2 మిలియన్ బ్యారెల్స్‌తో పోలిస్తే 15% తక్కువ)భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావంహార్మూజ్లో ఉద్రిక్తతల కారణంగా సరఫరా మార్గాలు కష్టతరంగా ఉన్నప్పటికీ, ఫుజైరా పైప్‌లైన్ వల్ల భారత్‌కు స్థిరమైన సరఫరా లభిస్తోంది.ఇది ధరల పెరుగుదల ఒత్తిడిని తగ్గిస్తోంది.యూఏఈ ఉత్పత్తి సామర్థ్యం 2027 నాటికి 5 మిలియన్ బ్యారెల్స్/రోజు చేరుతుంది.ఒపెక్ పరిమితులు లేకుండా యూఏఈ ఎక్కువగా ఉత్పత్తి చేయగలదు. దీని వల్ల ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉంది.దీంతో, భారత్‌కు దిగుమతి బిల్లు తగ్గుతుంది. ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం.. ఇంధన ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. -
నో ప్లాన్ బీ..! నెక్ట్స్ స్టెప్ బాంబింగ్ కంటే డేంజర్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మాటే లేకుండా తిరస్కరించారు. అణు ఒప్పందం విషయంలో తాను పెట్టిన షరతులకు అంగీకరించే దాకా హర్ముజ్ జలసంధిలో దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముందు హర్ముజ్‌ను తెరవండి. ఆ తర్వాత అణు ఒప్పందంపై చర్చలు జరుపుదాం.. అని ఇరాన్ నుంచి అమెరికాకు ప్రతిపాదన వెళ్లింది. అయితే ట్రంప్ అందుకు ఒప్పుకోవడం లేదు. ముందుగా అణు ఒప్పందం జరగాలని.. అప్పటివరకు బ్లాకేడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ దిగ్బంధనంతో ఊపిరి ఆడకుండా విలవిలలాడుతోంది(ఈ క్రమంలో త్రీవ పదజాలం ప్రయోగించారాయన). అమెరికా షరతులపై అణు ఒప్పందానికి ఇరాన్ అంగీకరించే వరకు ఈ బ్లాకేడ్ కొనసాగిస్తుంటుంది. ఈసారి బ్లాకేడ్ బాంబింగ్ కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది’’ అని అన్నారాయన. అయితే..దీనికి ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. అమెరికా బ్లాకేడ్‌కు త్వరలోనే అపూర్వమైన ప్రతిస్పందన ఇస్తాం అంటూ బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. మేం దౌత్యానికి అవకాశం ఇస్తున్నాం. కానీ మా సహనం పరిమితమే. అవసరమైతే కఠోర చర్యలకు దిగుతాం అని హెచ్చరించారు.ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని.. అవసరమైతే టోల్ కూడా వసూల్ చేస్తామని చెబుతూ ఇరాన్ జలసంధిని మూసేసింది. ఫలితంగా చమురు సంక్షోభం మొదలైంది. అయితే తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో జలసంధిని ఇరాన్ తెరిచింది. ఈలోపే తన మిత్రదేశం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరాన్ వెంటనే మళ్లీ మూసేసింది. ఇక చర్చల్లో ఇరాన్ మొండి వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఏప్రిల్ 13న అమెరికా నేవీ హర్ముజ్ బ్లాకేడ్‌ను ప్రకటించింది. అమెరికా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లు ఇరాన్‌కు వచ్చీపోయే వాణిజ్య నౌకలను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. హెచ్చరికలను పట్టించుకోకుండా మొండిగా ముందుకు వస్తే దాడులు చేశాయి. అప్పటి నుంచి ఈ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ఇంకోవైపు ఇరాన్ చమురు ఎగుమతులు దాదాపు నిలిచిపోయి ఆ దేశానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. హర్ముజ్‌ను తాము మూసేయడంతో ఇరాన్‌కు ఒకరోజుకి 500 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోందని అమెరికా అంటోంది. అయితే ఇరాన్ మాత్రం దీన్ని సార్వభౌమత్వంపై దాడిగా ప్రకటించుకుంది.ప్లాన్‌బీ లేనే లేదు!అమెరికా-ఇరాన్ మధ్య న్యూక్లియర్ డీల్ ఇంకా కుదరలేదు. మధ్యవర్తిగా ఉన్న పాక్ ఈ విషయంలో ఘోరంగా విఫలమైంది. దీంతో మరో వ్యూహం జోలికి పోకుండా ట్రంప్ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చలకు రప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ‘‘ఇరాన్ తన ప్రధాన ఆదాయ వనరు చమురును వినియోగించుకోలేకపోతోంది. ఆ నిల్వలు పేరుకుపోయి పైప్లైన్లు పేలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు.. ఇకపై తాను మంచోడిలా ఉండలేనంటూ తుపాకీతో ఉన్న ఫొటోను ఆయన పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్‌పై మరోసారి దాడులకే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.ఇప్పటికే అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) పరిస్థితిని సమీక్షిస్తోంది. కుదిరితే చిన్నస్థాయిలో దాడులు చేయాలని.. వాటి ఫలితం మాత్రం ఇరాన్‌పై అత్యంత ప్రభావం చూపాలని ప్రణాళిక గీస్తోంది. అయితే ఈ దాడులకు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రావాల్సి ఉందని ఓ అధికారి చెబుతున్నారు. ఇరాన్ మాత్రం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటామని.. ప్రతిఘటనకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఈ లెక్కన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు హర్ముజ్ మరోసారి కేంద్ర బిందువుగా మారే అవకాశం కనిపిస్తోంది. -
హర్మూజ్ లో చిక్కుకున్న వందలాది నౌకలు
-
ట్రంప్‌ను డైలామాలోకి నెట్టిన ఇరాన్!
ఇరాన్, అమెరికా మధ్య చర్చల విషయంలో ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే, ఇరాన్ తాజాగా చేసిన కొత్త ప్రతిపాదనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అణ్వస్త్ర కార్యక్రమాన్ని మినహాయించి ఇరాన్‌తో చర్చలు జరపడంలో అర్థమే ఉండదని అమెరికా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా ప్రారంభమైన నేపథ్యంలో దాని ప్రస్తావనే ఆలస్యం కావడంపై మల్లగుల్లాలు పడుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి.అయితే, శాంతి చర్చల్లో భాగంగా అమెరికాకు ఇరాన్ ఇటీవలే కొత్త ప్రతిపాదనలను పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా పంపించింది. ఇందులో భాగంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవడం, హార్మూజ్ జలసంధిని తెరవడం అనేవి జరిగిన తర్వాతే తమ అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ తేల్చి చెప్పింది. మరోవైపు.. అణ్వస్త్ర కార్యక్రమంపై ఇరాన్‌తో చర్చలు ఫలప్రదమైన తర్వాతే మిగతా విషయాలపై ఫోకస్ పెడతామని అమెరికా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ పంపిన నూతన ప్రతిపాదనలపై చర్చించేందుకు తన సలహాదారులతో ట్రంప్ తాజాగా సమావేశమైనట్లు తెలిసింది. అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరగనిదే, మిగతా అంశాలపై ఇరాన్‌తో చర్చలను మొదలుపెట్టలేమని ట్రంప్ తేల్చి చెప్పినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఇరాన్ ప్రతిపాదించిన క్రమంలో చర్చల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేమని ట్రంప్ స్పష్టం చేశారని పేర్కొన్నాయి.ఇరాన్‌కు నో ఛాన్స్.. ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కో రూబియో తాజాగా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ..‘ఇరాన్ ఇక ఏ దశలోనూ అణ్వాయుధాలను అభివృద్ధి చేయలేదని నిర్ధారించే ఒప్పందం కుదరాల్సిందే. ఈ విషయంలో ఇరాన్‌కు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకూడదు. ఇరాన్ నుంచి దీనిపై అమెరికా ధ్రువీకరణ పొందాలి’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో.. అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో మరోసారి ప్రతిష్టంభన ఏర్పడింది. ఇరు దేశాలూ తమ షరతుల ప్రకారమే చర్చలు జరగాలని వాదిస్తున్నాయి. వాదనను నెగ్గించుకునే యత్నంలో అమెరికా, ఇరాన్ ఉండటంతో చర్చల ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితులు కనిపించడం లేదు.ఇరాన్ ప్రతిపాదనలు ఇవే...ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించడం, మళ్లీ ఇరాన్‌పై దాడులు జరగవు అనే హామీలను పొందడం.ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడం, హార్మూజ్ జలసంధిని తెరవడం.మొదటి రెండు ప్రతిపాదనలు అమల్లోకి వచ్చాక తమ అణ్వస్త్ర కార్యక్రమం, సంవర్ధిత యురేనియం హక్కులపై అమెరికాతో చర్చలను మొదలుపెడతామని ఇరాన్ ప్రతిపాదించింది. -
‘హార్ముజ్’ పేరెత్తాడని.. పాక్ యువకునికి నరకం!
ఇస్లామాబాద్: సోషల్ మీడియాలో ఏదైనా జోక్ వేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన వింత పరిస్థితి పాకిస్తాన్లో నెలకొంది. తమ రోజువారీ ట్రాఫిక్ కష్టాలను వర్ణిస్తూ, ఓ యువకుడు సరదాగా చేసిన ఓ పోస్ట్ ఏకంగా అతన్ని కటకటాల వెనక్కి నెట్టివేసింది.ఇస్లామాబాద్‌లోని టార్నోల్ రైల్వే క్రాసింగ్ వద్ద నిత్యం ఉండే ట్రాఫిక్ రద్దీపై ఓ యువకుడు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ చేశాడు. ‘టార్నోల్ రైల్వే క్రాసింగ్.. హార్ముజ్ జలసంధికి ఏమాత్రం తీసిపోదు. ఒకవేళ దీన్ని మూసివేస్తే మన సమస్యలన్నీ తీరిపోతాయి’ అని అందులో రాసుకొచ్చాడు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి తరచూ వార్తల్లో నిలుస్తోంది. అలాంటి సున్నితమైన అంశాన్ని స్థానిక రైల్వే గేటుకు ముడిపెడుతూ, చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది.పోలీసుల యాక్షన్.. కఠిన సెక్షన్ల కింద కేసుఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో ఇస్లామాబాద్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు యువకుడిని అదుపులోకి తీసుకొని అతని మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసి ఆధారాలు సేకరించారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, అక్రమ నిర్బంధం, నేరానికి యత్నించడం వంటి పాకిస్తాన్ పీనల్ కోడ్‌లోని పలు కఠినమైన సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాజధాని, దాని పరిసర ప్రాంతాల్లో భద్రతా కారణాల దృష్ట్యా సెక్షన్ 144 అమల్లో ఉందని, అందుకే ముందస్తు భద్రతలో భాగంగానే ఈ అరెస్ట్ చేశామని పోలీసులు ఈ చర్యను సమర్థించుకుంటున్నారు.భావప్రకటనా స్వేచ్ఛపై మొదలైన తీవ్ర చర్చఅయితే, భద్రత పేరుతో పోలీసులు చేసిన ఈ అరెస్ట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం డార్క్ హ్యూమర్‌తో చేసిన ఓ చిన్న కామెంట్‌ను జాతీయ భద్రతా ముప్పుగా భావించి, అరెస్ట్ చేయడం ఏంటని న్యాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని పలువురు మండిపడుతున్నారు. భద్రత, పౌర హక్కుల మధ్య సమతుల్యత పాటించడంలో అధికారులు విఫలమయ్యారని, ఒక జోక్‌కు ఇంతలా స్పందించడం సరికాదని స్థానిక పత్రికలు సైతం తమ సంపాదకీయాల్లో పోలీసుల తీరును ఎండగడుతున్నాయి.ఇది కూడా చదవండి: షాకింగ్: సన్యాసుల ముసుగులో భారీగా డ్రగ్స్ స్మగ్లింగ్! -
పోరు ఆపితే తెరుస్తాం
కైరో/మాస్కో/దుబాయ్: హార్మూజ్ జలసంధిని దిగ్బంధం నుంచి విముక్తి కల్పించి యుద్ధానికి చరమగీతం పాడితే హార్మూజ్ జలసంధి గుండా విదేశీ వాణిజ్యనౌకల రాకపోకలకు మార్గం సుగమం చేస్తామని ఇరాన్ కొత్త ప్రతిపాదనలను తెరమీదకు తెచ్చింది. ఆదివారం ఒమన్ నుంచి పాకిస్తాన్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు తమ ప్రతిపాదనలకు హెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి తెలియజేశారు. వీటిని అమెరికాకు పాక్ అందజేయనుంది. వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుతిన్‌తో అరాఘ్చీ భేటీ.. ఇరాన్ మంత్రి అరాఘ్చీ సోమవారం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. తమ సార్వ¿ౌమత్వం కోసం పోరాడుతున్న ఇరానియన్లను ఈ సందర్భంగా పుతిన్ పొగిడారు. తర్వాత పశ్చిమాసియా యుద్ధం, హార్మూజ్ దిగ్బంధం, అమెరికా షరతులు, ఇరాన్ డిమాండ్లు తదితర కీలకాంశాలపై అరాఘ్చీ, పుతిన్ విస్తృతంగా చర్చించుకున్నారని రష్యా అధ్యక్షభవనం క్రిమ్లిన్ తెలిపింది. ‘‘పశ్చిమాసియాలో శాంతిస్థాపన కోసం రష్యా తన శక్తిమేరకు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో వ్యూహాత్మక బంధం బలోపేతానికి కృషిచేస్తాం’’అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టంచేశారు. భారతీయ ట్యాంకర్‌పై కాల్పులు.. ఒమన్ నుంచి భారత్‌కు వస్తున్న రసాయనాల ట్యాంకర్ ఎంటీ చిరాన్7పై ఇరాన్ గన్బోట్లు హెచ్చరిస్తూ కాల్పులు జరిపాయి. ఏప్రిల్ 25వ తేదీన జరిగిన ఈ కాల్పులఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హార్మూజ్‌కు వాయవ్యంగా ఒమన్‌కు చెందిన షినాస్ పోర్ట్ సమీప జలాల గుండా నౌక వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. నౌకలోని 17 మంది భారతీయనావికులకు ఎలాంటి గాయాలుకాలేదని కేంద్ర షిప్పింగ్, పోర్ట్‌లు, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రంధావా తెలిపారు. -
దిగివచ్చిన ఇరాన్.. యుద్ధం ముగింపు, హార్మూజ్‌పై గ్రీన్‌సిగ్నల్!
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య చర్చల వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు అందించింది అంటూ ఓ అమెరికన్ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. దీంతో, యుద్ధంగా ముగుస్తుందా? అనే చర్చ మొదలైంది. అమెరికన్ మీడియా సంస్థ యాక్సియోస్ ప్రకారం..‘అమెరికాతో యుద్ధాన్ని ముగించేందుకు, హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు ఇరాన్ కొత్త ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తానీ అధికారుల ద్వారా అమెరికాకు ఇరాన్ చేరవేసింది. వివాదాస్పద అణు చర్చలను తదుపరి దశకు వాయిదా వేస్తున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది’ అని వెల్లడించింది. కాగా, పశ్చిమాసియా సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ కొత్త ప్రతిపాదన కీలక పరిణామంగా ఆ మీడియా కథనం అభివర్ణించింది. యాక్సియోస్ ప్రకారం.. వైట్‌హౌస్‌కు ఈ ప్రతిపాదన అందింది. కానీ, దీనిని పరిశీలించడానికి యునైటెడ్ స్టేట్స్ సుముఖంగా ఉందో లేదో స్పష్టంగా తెలియదు.Amid the deepening stalemate in peace talks, Iran has conveyed a fresh proposal to the United States through Pakistani mediators, prioritising reopening the Strait of Hormuz and bringing the ongoing war in West Asia to an end while deferring contentious nuclear negotiations to a… pic.twitter.com/DNRlZgKoZH— India Today Global (@ITGGlobal) April 27, 2026ఇదిలా ఉండగా.. చర్చలకు రెడీ అయితే ఇరాన్ ఎప్పుడైనా తమకు సందేశాన్ని పంపొచ్చని ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు పొందే అవకాశాన్ని ఇరాన్‌కు ఇచ్చేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈనేపథ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ పంపిన కొత్త ప్రతిపాదనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక, ఇరు దేశాల మధ్య స్తంభించిపోయిన శాంతి ప్రయత్నాల మధ్య ఈ ప్రతిపాదన వచ్చింది.అణు చర్చలపై ఉత్కంఠ..అంతకుముందు.. ఇరాన్ కనీసం ఒక దశాబ్దం పాటు యురేనియం శుద్ధిని నిలిపివేయాలని, ప్రస్తుతం ఉన్న నిల్వలను దేశం నుండి తరలించాలని అమెరికా డిమాండ్ చేసింది. అయితే, నివేదిక ప్రకారం, ఈ డిమాండ్లకు ఎలా స్పందించాలనే దానిపై ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి మరియు ప్రధాన సంధానకర్త అబ్బాస్ అరఘ్చి వారాంతంలో మధ్యవర్తులతో చెప్పారు. ఇక, పాకిస్తానీ మధ్యవర్తుల ద్వారా తెలియజేసిన రెండు దశల ప్రణాళికలో మొదట హార్మూజ్ జలసంధిపై సంక్షోభాన్ని పరిష్కరించడం, అమెరికా దిగ్బంధనాన్ని ముగించడంపై ప్రాధాన్యత ఇస్తుంది. కొత్త ప్రతిపాదన ప్రకారం, కాల్పుల విరమణను సుదీర్ఘ కాలం పాటు పొడిగించడమో లేదా యుద్ధానికి శాశ్వత ముగింపు పలకడమో చేయాలి. జలసంధిని తిరిగి తెరిచి, దిగ్బంధనాన్ని ఎత్తివేసిన తర్వాత, తదుపరి దశలో మాత్రమే అణు చర్చలు ప్రారంభించాలి. -
ఫలితాలు, ఫెడ్‌పైనే ఫోకస్
అటు హార్మూజ్‌పై వివాదాలు, ఇటు ముడిచమురు ధరలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయితే యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు, దేశీ కార్పొరేట్ క్యూ4 ఫలితాలకు ఇన్వెస్టర్లు అత్యధిక ప్రాధాన్యత వచ్చే వీలుంది. వెరసి ఈ వారం సైతం తీవ్ర ఆటుపోట్లకు అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియాలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయనున్నాయి. మరోపక్క ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి(క్యూ4) ఫలితాల సీజన్ మరింత వేడెక్కనుంది. అంతేకాకుండా ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లకు దిక్సూచిగా నిలిచే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) పాలసీ సమీక్ష నిర్ణయాలు కీలకంగా నిలవనున్నాయి. వెరసి పలు అంశాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(మే 1) స్టాక్, కమోడిటీ, కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. ఐఐపీ.. గత వారాంతాన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్, యాక్సిస్ బ్యాంక్, హిందుస్తాన్ జింక్ తదితరాలు క్యూ4 ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో అల్ట్రాటెక్ సిమెంట్, కోల్ ఇండియా, వరుణ్ బెవరేజెస్, ఏయూ స్మాల్‌బ్యాంక్, ఎస్బీఐ కార్డ్స్, అదానీ టోటల్, మారుతీ సుజుకీ, ఎటర్నల్, గార్డెన్‌రీచ్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పవర్, ఇండియన్ బ్యాంక్, వారీ ఎనర్జీస్, ఫెడరల్ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, బజాజ్ ఫిన్సర్వ్, చోళమండలం తదితరాల పనితీరు వెల్లడికానుంది. మార్చి నెలకు రేపు(28న) పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) వివరాలు వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ 5.2 శాతం వృద్ధిని సాధించింది. ఇతర అంశాలు విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు 100 డాలర్ల ఎగువకు చేరాయి. డాలరుతో మారకంలో రూపాయి 93.5కు బలహీనపడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశీ స్టాక్స్‌లో భారీఎత్తున అమ్మకాలు చేపడుతున్నారు. ఈ ప్రతికూల అంశాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు స్టాక్ నిపుణులు తెలియజేశారు. చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు పెరగనుంది. దీంతో ఆర్బీఐ కఠిన విధానాలకు తెరతీయవలసి ఉంటుందని ఆరి్ధకవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమాసియా వివాదాలు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. వెరసి ఈ వారం స్టాక్ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు తెలియజేశారు.సాంకేతికంగా చూస్తే ప్రధానంగా ఐటీ రంగం 10 శాతం పతనంకావడంతో గత వారం మార్కెట్లు క్షీణించాయి. సాంకేతికంగా చూస్తే ఈ వారం నిఫ్టీకి 23,650–23,500 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. ఇక్కడ బలపడితే.. 24,700వరకూ పురోగమించే అవకాశముంది. ఇక సెన్సెక్స్ 76,000–75,600 పాయింట్ల వద్ద సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడినుంచి పుంజుకుంటే 77,300ను అధిగమించే వీలుంది. ఆపై 78,000 పాయింట్లను దాటవచ్చు. దిగువస్థాయిల్లో 75,000 వద్ద రికవరీకి వీలుంది. చమురు షాక్ గత వారం ముడిచమురు ధరలు 8–10 శాతం ఎగశాయి. దీనికితోడు ఐటీ దిగ్గజాలు నిరుత్సాహపరచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు పతన బాటలో సాగాయి. వెరసి గత వారం(20–24) నికరంగా సెన్సెక్స్ 1,829 పాయింట్లు(2.3 శాతం) పతనమైంది. 76,664 వద్ద ముగిసింది. నిఫ్టీ 456 పాయింట్లు(1.9 శాతం) కోల్పోయి 23,898 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ స్వల్పంగా 0.6–0.2 శాతం మధ్య నీరసించాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చర్చల వేళ మరో ట్విస్ట్.. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
టెహ్రాన్: మరోసారి అమెరికాను ఇరాన్ తీవ్రంగా హెచ్చరించింది. అమెరికా 'సముద్రపు దోపిడీ' కొనసాగిస్తే.. ప్రతీకారం తప్పదంటూ ఇరాన్ సైన్యం తేల్చిచెప్పింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC) మధ్య సమన్వయం వహించే అత్యున్నత సైనిక విభాగం 'ఖాతం అల్-అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్' ఈ ప్రకటనను విడుదల చేసింది. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తమ సాయుధ బలగాల నుండి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయం అంటూ ఇరాన్ పేర్కొంది.ఇరాన్ సాయుధ దళాలు గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా, గరిష్ట స్థాయి సంసిద్ధతతో ఉన్నాయని.. జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఇరాన్ స్పష్టం చేసింది. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిలో శత్రువుల కదలికలను నిరంతరం గమనిస్తున్నామని.. అమెరికా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే కోలుకోలేని దెబ్బ తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.మరోవైపు, అమెరికా-ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించి శాంతి చర్చలు జరపాలన్న పాకిస్థాన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమైనట్లు తెలుస్తోంది. ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇవాళ(శనివారం) పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు పాక్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన ఈ చర్చల అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. అమెరికా నౌకాదళం ముందుగా హార్ముజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవులపై ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని టెహ్రాన్ స్పష్టమైన షరతు విధించింది. ఒకవైపు శాంతి చర్చలకు అవకాశాలు పూర్తిగా మూసుకుపోగా.. మరోవైపు సముద్ర జలాల్లో అమెరికా తన కఠిన వైఖరిని అవలంబిస్తోంది. ఇరాన్ ఓడరేవుల వైపు వెళ్తున్న ఆ దేశ నౌకను అమెరికా యుద్ధనౌక అడ్డుకోవడం అంతర్జాతీయంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని అమలు చేయడంలో భాగంగా సముద్ర జలాల్లో పహారా కాస్తున్న ‘యూఎస్ఎస్ రాఫెల్ పెరాల్టా’ అనే గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్ ఈ ఆపరేషన్ చేపట్టింది. ఏప్రిల్ 24న ఇరాన్ జెండాతో తమ దేశంలోని ఓడరేవు వైపు వెళ్తున్న ఒక నౌకను అమెరికా నావికాదళం విజయవంతంగా అడ్డుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం అధికారికంగా ప్రకటించింది. -
హార్ముజ్ లో హై టెన్షన్.. అటు అమెరికా.. ఇటు ఇరాన్ నౌకలు సీజ్
-
హార్ముజ్ లో రణరంగం.. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం
-
చర్చలపై కొత్త ఆశలు!
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో హార్మూజ్‌జలసంధి దిగ్బంధంతో రెండో దఫా చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ పాకిస్తాన్ చేరుకోవడం శాంతి చర్చలపై కొత్త ఆశలను చిగురింపజేస్తోంది. పాకిస్తాన్‌తోపాటు ఒమన్, రష్యాల్లోనూ పర్యటించి శాంతి చర్చల్లో తేల్చుకోవాల్సిన కీలకాంశాలపై ఒక అవగాహనకు రానున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ‘‘టెహ్రాన్ నుంచి ఇస్లామాబాద్(పాకిస్తాన్), మస్కట్(ఒమన్), మాస్కో(రష్యా) పర్యటనకు శ్రీకారం చుడుతున్నా. ద్వైపాక్షిక అంశాలపై మా భాగస్వాములతో సహకారం కోసం ఈ మూడు దేశాల్లో పర్యటించబోతున్నా. పొరుగుదేశాలే మాకు ముఖ్యం’’అని అరాఘ్చీ తన సామాజిక మాధ్యమ ‘ఎక్స’ఖాతాలో శుక్రవారం ఒక పోస్ట్‌పెట్టారు. దీంతో రెండోదఫా చర్చలకు సన్నాహకాలు మొదలయ్యాయని తెలుస్తోంది. అరాఘ్చీ తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు. అమెరికా దౌత్యవేత్తలకు సాయపడే బృందాలు, భద్రతా సిబ్బంది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో సిద్ధంగా ఉన్నాయి. అమెరికా సాంకేతిక బృందంతో ఇరాన్ మధ్యవర్తులు మాట్లాడి షెడ్యూల్‌ను ఖరారుచేశాక అసలైన అమెరికా ప్రతినిధుల బృందం శనివారం రాత్రికల్లా ఇస్లామాబాద్‌కు చేరుకుంటుందని పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. స్టీవ్ విట్కాఫ్, కుష్నర్లు శనివారం పాకిస్తాన్ చేరుకుంటారని అమెరికా కూడా ధ్రువీకరించింది. కొనసాగుతున్న దిగ్బంధం‘‘ట్రంప్ సూచనమేరకు సముద్రమందుపాతరలను పెట్టే పడవలను పేల్చేందుకు కాచుకుని కూర్చున్నాం. దశాబ్దాల్లో తొలిసారిగా పశ్చిమాసియాజలాల్లో ఒకేసారి మూడు అమెరికా యుద్ధవిమానాల వాహక నౌకలు యూఎస్ఎస్ అబ్రహాం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్, యూఎస్ఎస్ జార్జ్ హెచ్.డబ్ల్యూ.బుష్ లు చక్కర్లు కొడుతున్నాయి. 200 యుద్ధవిమానాలు, 15,000 మంది నావికాదళసభ్యులు హార్మూజ్‌ను దిగ్బంధించాయి’’అని అమెరికా సెంట్రల్ కమాండ్ శుక్రవారం వెల్లడించింది. మరోవైపు అమెరికాయేతర నౌకలు సైతం అమెరికా నౌకాశ్రయాల్లోకి ముడిచమురు, సహజవాయువులను సరఫరాచేసేందుకు వీలుగా జోన్స్ చట్టం అమలును మరో 90 రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. మరోవైపు ఇరాన్ స్వాదీనంచేసుకున్న ఎపామినోండాస్ నౌకలోని భారతీయ నావికుడు సురక్షితంగా ఉన్నట్లు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ డైరెక్టర్ మన్దీప్ సింగ్ రణ్‌ధావా శుక్రవారం చెప్పారు. -
వెంటబడి.. చొరబడి
టెహ్రాన్: దుబాయ్ నుంచి బయల్దేరి హార్మూజ్ జలసంధి మీదుగా గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు క్షేమంగా రావాల్సిన కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’ను ఇరాన్ బలగాలు స్వా«దీనం చేసుకున్న వీడియో తాజాగా బహిర్గతమైంది. లైబీరియా జెండాతో వస్తున్న ‘ఎపామినోండాస్’పైకి ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు మెరుపువేగంతో దాడిచేసి తమ వశం చేసుకున్న వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఒమన్‌కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న నౌకపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వెంటనే గన్బోట్లలో నేవీ కమెండోలు మెరుపువేగంతో నౌక సమీపానికి చేరుకున్నారు. నౌక పక్కల వైపు ఉండే చిన్నపాటి ప్రవేశ ద్వారం గుండా లోపలికి చొరబడ్డారు. ఈ దురాక్రమణపర్వం మొత్తం నేవీ వాళ్ల డ్రోన్ కెమెరాల్లో రికార్డయ్యాయి. మాస్క్ లు ధరించిన కమెండోలు రైఫిళ్లు ఇతర మారణాయుధాలతో నౌకలోకి చొరబడి తమను ప్రతిఘటించే సాయుధులకోసం వెతికారు. నౌకలో సాయుధుల ఎవరూ లేకపోవడంతో నేరుగా నౌక ఇంజిన్ రూమ్‌లోకి వెళ్లి దాని ఆపరేటింగ్ సిస్టమ్‌ను తమ వశంచేసుకున్నారు. తర్వాత నౌక తమ అ«దీనంలోకి వచి్చందని అధికారికంగా ప్రకటించారు. తర్వాత నౌకను ఇరాన్ తీరం వైపు మళ్లించారు. తీరానికి తీసుకెళ్లాక నౌకను తనిఖీచేసి సరకులో ఏమైనా అక్రమ, చట్టబద్ధ వస్తువులున్నాయా లేదా అనేది తనిఖీచేస్తారు. వాస్తవానికి ఈ నౌక రాకపోకలకు సంబంధించి ఎలాంటి ముందస్తు అనుమతులులేవని ఇరాన్ నేవీ ప్రకటించింది. నౌకను స్వా«దీనంచేసుకునే క్రమంలో ఎపామినోండాస్ పైకి ఇరాన్ కమెండోలు కాల్పులు జరిపి గ్రనేడ్లు విసిరేశారు. దీంతో నౌకలోని ప్రధానభాగమైన బ్రిడ్జ్(సెంట్రల్ కమాండ్ సెంటర్) పాక్షికంగా దెబ్బతింది. కానీ నౌకలోని సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. దెబ్బకు దెబ్బ... హార్మూజ్‌లో, హిందూ మహాసముద్రంలో రెండు ఇరాన్ నౌకలను అమెరికా బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. ఇరాన్ కార్గో నౌక ‘టౌస్కా’స్వాధీనపరంపర తాలూకు వీడియోలను మీడియాకు అందజేశాయి. ఇరాన్ నౌకలను సులభంగా తమ వశంచేసుకున్నామని ఆ వీడియోల్లో అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. దీంతో ఆగ్రహించిన ఐఆర్జీసీ నేవీ బలగాలు తాము సైతం విదేశీ నౌకలను స్వా«దీనంచేసుకోగలమని నిరూపించాలనుకున్నాయి. ఇందులోభాగంగా ‘ఎపామినోండాస్’, ‘యుఫోరియా’, ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌకలను స్వా«దీనం చేసుకుని తమ సత్తా చాటాయని తెలుస్తోంది. -
డేటా వార్!.. కేబుళ్లను కత్తిరిస్తామంటూ ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో.. పర్షియన్ గల్ఫ్‌లోని కీలక డిజిటల్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరగొచ్చని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కారప్స్ (ఐఆర్జీసీ) బాంబు పేల్చింది. సముద్రంలోని ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచంలోని అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ప్రయాణిస్తోంది. కేబుల్స్‌కు ముప్పు వాటిల్లితే నష్ట ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండనుంది. చాలా దేశాలు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలుగా మారిన నేపథ్యంలో ఈ పరిస్థితి ఆందోళనకరమైనదే. -సాక్షి, స్పెషల్ డెస్క్హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను, వాటికి ఉన్న ముప్పును ఐఆర్‌జీసీకి అనుబంధంగా ఉన్న తస్నీమ్ వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో వివరించింది. ఇంధన రవాణాకే గాక ప్రపంచ డేటా ప్రవాహానికీ ఈ జలసంధి అత్యంత కీలక మార్గమని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం ఈ సముద్ర కేబుల్ వ్యవస్థలపైనే ఆధారపడుతున్నాయని నొక్కి చెప్పింది. కేబుళ్ల ల్యాండింగ్ స్టేషన్స్, క్లౌడ్ హబ్‌లను శత్రువుపై ఒత్తిడి పెంచే వ్యూహాత్మక కేంద్రాలని తెలిపింది. ఎలాంటి అంతరాయం కలిగినా ఆయా దేశాల ఆర్థిక, సమాచార వ్యవస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని హెచ్చరించింది. గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ డేటా సెంటర్లు కేంద్రీకృతమై ఉన్నాయి. మూల స్తంభాలుగా.. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ భారీ నెట్వర్క్ ఉంది. ఇది ఆసియా, యూరప్, ఆఫ్రికా మధ్య కీలక అనుసంధానంగా నిలుస్తుంది. పశ్చిమ దేశాలతో భారత్‌ను అనుసంధానించే ఐదు ప్రధాన సముద్రగర్భ కేబుల్ వ్యవస్థలు మన దేశ డిజిటల్ కమ్యూనికేషన్లకు మూల స్తంభాలుగా ఉన్నాయి. వీటిలో ఫాల్కన్ నెట్వర్క్, ఆసియా–ఆఫ్రికా–యూరప్–1, టాటా టీజీఎన్–గల్ఫ్, సౌత్ఈస్ట్ ఆసియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్–4, ఇండియా–మిడిల్ ఈస్ట్–వెస్టర్న్ యూరప్ ఉన్నాయి. కేవలం ఎర్ర సముద్రం గుండానే 15–20 కేబుల్స్ వెళ్తున్నాయి. రిలయన్స్ అభివృద్ధి చేస్తున్న ఇండియా–యూరప్–ఎక్స్‌ప్రెస్, ఇండియా–ఆసియా–ఎక్స్‌ప్రెస్, గూగుల్‌కు చెందిన ధివారు సముద్ర కేబుల్ ప్రాజెక్టులు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. సేవలకు అంతరాయం.. ఒకటి లేదా రెండు కేబుల్స్ దెబ్బతింటే ఆ అంతరాయాన్ని సాధారణంగా సరిచేయొచ్చు. అనేక కేబుల్స్ తెగిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గడం, వెబ్‌సైట్స్ పనిచేయకపోవడం, బ్యాంకింగ్, క్లౌడ్ సిస్టమ్స్, డిజిటల్ పేమెంట్స్ వంటి సేవలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన దేశంలోని ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో సుమారు 60% ముంబై నుంచి గల్ఫ్ ప్రాంతం మీదుగా యూరప్ వైపు వెళ్లే మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మిగిలిన ట్రాఫిక్ చెన్నై నుంచి సింగపూర్ మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపు సాగే మరో మార్గం ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల నుంచి ఆసుపత్రి డేటా వరకు అన్నీ ’క్లౌడ్’లో భద్రపరచి ఉన్నాయి. కనెక్టివిటీ పోతే ఈ సేవలు పూర్తిగా నిలిచిపోతాయి. భారత్ ఒక ’డిజిటల్ ద్వీపం’ లాంటిది. మన అంతర్జాతీయ డేటాలో 97% సముద్ర మార్గాల ద్వారానే ప్రయాణిస్తుంది. మరమ్మతులకు నెలలు.. తరచుగా నౌకల లంగర్ల వల్ల జరిగే ప్రమాదవశాత్తు నష్టాలు కూడా ఇంటర్నెట్ అంతరాయాలకు కారణమవుతాయి. భారీ స్థాయిలో నష్టం జరిగితే వాటిని సరిచేయడానికి వారాలు లేదా నెలల సమయం పట్టవచ్చు. 2024, 2025లో ప్రాంతీయ ఉద్రిక్తతల సమయంలో ఎర్ర సముద్రంలోని పలు సముద్రగర్భ కేబుల్స్ దెబ్బతిన్నాయి. దీనివల్ల ఇంటర్నెట్ వేగం తగ్గడంతోపాటు అనేక దేశాల్లో సేవలకు అంతరాయం కలిగింది. ఆ ప్రాంతంలోకి ప్రవేశం పరిమితంగా ఉండటం వల్ల మరమ్మతులు చేయడానికి నెలలు పట్టింది. రిస్క్ అనాలసిస్.. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం దిగ్గజాలు తమ అంతర్జాతీయ డేటా ప్రసారం కోసం ఈ హార్ముజ్ జలసంధి, ఎర్ర సముద్ర మార్గాలపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయి. హార్ముజ్ గుండా వెళ్లే కేబుల్స్‌కు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడటానికి ఇరాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరపాలని ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ విజ్ఞప్తుల నేపథ్యంలో టెలికం శాఖ ఆపరేటర్లందరినీ తమ డేటా మార్గాల భద్రతపై ’రిస్క్ అనాలిసిస్’ నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఒకవేళ కేబుల్స్ దెబ్బతింటే డేటాను ప్రత్యామ్నాయ మార్గాల (సింగపూర్ లేదా పసిఫిక్ రూట్) ద్వారా ఎలా మళ్లించాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. -
అమెరికా నేవీకి ట్రంప్ కీలక ఆదేశాలు
అమెరికా- ఇరాన్ రెండో విడత చర్చలుకు రాయబారం నడుస్తోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఆ జలసంధిని బ్లాకేడ్ చేసిన నేపథ్యంలో జలసంధిలో మందుపాతరలు పెట్టడానికి యత్నిస్తున్న ఏ నౌకలైనా పేల్చిపడేయాలని తెలిపారు. ఈ మేరకు యుఎస్ నేవీని ఆదేశించినట్లు ప్రకటన విడుదల చేశారు.పశ్చిమాసియాలో అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఓ వైపేమో శాంతి చర్చల ప్రస్థావన తెస్తూనే మరోవైపు అమెరికా- ఇరాన్ రెండు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. కొద్ది సేపటి క్రితమే హర్ముజ్ జలసంధిలో తొలిసారిగా పన్నువసూలు చేసినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా బ్లాకేడ్‌కు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ సైతం హర్ముజ్ విషయంలో తీవ్రంగా స్పందిచారు.ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు."హార్ముజ్ జలసంధి ప్రయాణిస్తున్న ఏ నౌకలైనా సరే ఏ బోట్లనైనా, అవి చిన్నవైనా పెద్దవైనా (వారి నౌకాదళ నౌకలన్నీ, మొత్తం 159 కూడా సముద్ర గర్భంలోనే ఉన్నాయి. పేల్చిపడేయాలని నేను యునైటెడ్ స్టేట్స్ నేవీని ఆదేశించాను. ఇందులో ఎటువంటి సంకోచం ఉండకూడదు." అని ఆదేశించినట్లు తెలిపారు.అయితే ప్రస్తుతం జలసంధిలో అమెరికా మైన్-క్లియరింగ్ (గనుల తొలగింపు) కార్యకలాపాలు ఇప్పటికే కొనసాగుతున్నాయని, ఆ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అదనంగా మరిన్ని మైన్ 'స్వీపర్లు' హర్ముజ్‌కు తరలించాలని దానిని మూడు రెట్లు పెంచాలని అమెరికా నేవీని ఆదేశించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
హర్ముజ్ వద్ద మరోసారి టెన్షన్ టెన్షన్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్ముజ్ జలసంధిని బ్లాకేడ్ చేశాం అని అమెరికా ప్రకటించడం.. అదే సమయంలో ఇరాన్ సైతం హర్ముజ్ నుంచి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ హర్ముజ్‌లో తొలిసారిగా టోల్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించింది. దీంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్రేజా హాజీ ఈ మేరకు ప్రకటన చేసినట్లు అల్ జజీరా కథనం పేర్కొంది. " ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకల నుండి ఇరాన్ టోల్ వసూలు చేయడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మొదటి విడత ఆదాయాన్ని ఇప్పటికే దేశంలోని సెంట్రల్ బ్యాంక్‌లో జమ చేశాం" అని ఆయన అన్నట్లు పేర్కొంది. అమెరికా విధిస్తున్న నౌకాదళ ఆంక్షలకు ప్రతిచర్యగా ఇరాన్ ఈ పన్నును అమలు చేస్తోన్నట్లు తెలిపింది.కాగా ఇదివరకే హర్ముజ్ విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మరియు నౌకాదళ ఒత్తిడి కొనసాగినంత కాలం ఈ చమురు రవాణా మార్గాన్ని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించినప్పటికీ, అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాకిస్థాన్ చేస్తున్న రాయబార ప్రయత్నాలను ఇరాన్ గుర్తించినప్పటికీ, అమెరికా తీరును మాత్రం తప్పుబడుతూ వస్తుంది.కాగా ఇదివరకే అమెరికా బెదిరింపులకు ఏ మాత్రం తగ్గేది లేదని ఇది వరకే ఇరాన్ పలుమార్లు స్పష్టం చేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇరాన్‌కు తరచుగా తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్ముజ్ వద్ద టోల్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. -
హర్మూజ్ జల సంధిలో భారత్ నౌకను సీజ్ చేశాం : ఇరాన్
టెహ్రాన్: అమెరికా-ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం చర్చలపై ప్రతిష్టంభన నెలకొన్న వేళ హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న వాణిజ్య నౌకలను ఇరాన్ అడ్డుకుంటూ, స్వాధీనం చేసుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం ఇరాన్ నౌకాదళం రెండు వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంది. వాటిలో ఒకటి భారత్‌కు చెందిన నౌక కూడా ఉంది. ఈ నౌక దుబాయ్ నుంచి బయలుదేరి గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఇరాన్ కమాండోలు గన్బోట్ల ద్వారా భారత్ నౌకను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఎస్ఈ పేరుతో పనామా జెండాతో వెళ్తున్న మరో ఫ్రాన్స్ నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు నౌకలను ఇరాన్ తీరానికి తీసుకెళ్లారు.ఇరాన్ విడుదల చేసిన వీడియోలో ముసుగులు ధరించిన కమాండోలు తుపాకులతో నౌకపైకి ఎక్కి తనిఖీలు చేపట్టిన దృశ్యాలు చూడొచ్చు. నౌకపై కాల్పులు జరిపి, గ్రెనేడ్లు విసరడంతో బ్రిడ్జ్ (కమాండ్ సెంటర్) దెబ్బతింది. అయితే సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు.ఈ ఘటనకు ముందు అమెరికా మెరైన్లు రెండు ఇరాన్ జెండా కింద నడుస్తున్న నౌకలను స్వాధీనం చేసుకోవడంతో, ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా అధికారులు ఇరాన్ ‘మస్కిటో ఫ్లీట్’ అనే చిన్న, వేగవంతమైన పడవలను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.భారత్‌కు వెళ్తున్న వాణిజ్య నౌకల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మార్గం కావడంతో, ఇలాంటి దాడులు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 🇮🇷⚡️BREAKING: IRGC releases footage showing their Navy forces seizing the 'MSC Epaminondas' vessel in the Strait of Hormuz earlier today. pic.twitter.com/Mx8Jt6QIAB— IRGC (@IRGC_Press) April 22, 2026 -
ఇరాన్‌పై అమెరికా మరో ట్విస్ట్..
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణ గడువు పొడిగింపు, హార్మూజ్ జలసంధి దిగ్బంధంపై అమెరికా భారీ ట్విస్ట్ ఇచ్చింది. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి ఐదు రోజుల గడువు ఉందన్న వార్తలు, నిరవధిక గడువు ఉందన్న సమాచారం నిజం కాదని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి నిర్దిష్ట గడువును ఇంకా విధించలేదని ఆమె తేల్చిచెప్పారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హార్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న దిగ్బంధం పట్ల ట్రంప్ సంతృప్తిగా ఉన్నారు. ఇరాన్‌తో కాల్పుల విరమణకు సంబంధించి 3 నుంచి 5 రోజుల గడువు ఉందన్న వార్తలు నిజం కాదు. చర్చల సమయం, తదుపరి చర్యల గడువును అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే నిర్ణయిస్తారు. ఇక, ఇరాన్ ప్రస్తుతం చాలా బలహీనంగా ఉంది. చర్చలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఇప్పుడు ట్రంప్ చేతిలోనే ఉన్నాయి.ఇరాన్‌కు ప్రధాన ఆదాయ వనరైన చమురు ఎగుమతులను అమెరికా అడ్డుకుంది. ఖర్గ్ ద్వీపం చమురు నిల్వలతో నిండిపోయింది. ఖర్గ్ ద్వీపం నుంచి చమురును బయటకు పంపే అవకాశం లేకుండా అమెరికా దిగ్బంధించింది. దీనివల్ల ఇరాన్ ప్రతిరోజూ సుమారు 500 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతోంది. కనీసం తన సొంత ప్రజలకు వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి ఇరాన్ చేరుకుంది. ట్రంప్ ప్రయోగించిన ఈ ఆర్థిక ఒత్తిడి సత్ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకొచ్చారు.White House press secretary Karoline Leavitt said Wednesday that President Trump “has not set a firm deadline to receive an Iranian proposal" following another extension to the ceasefire."There's obviously a lot of internal division," Leavitt said, referring to Iran's… pic.twitter.com/zHXmKkdhrB— CBS News (@CBSNews) April 22, 2026 ఇరాన్ కౌంటర్.. మరోవైపు.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో శాంతి చర్చలకు అసలైన అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో వివరించారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమెరికా గౌరవించక పోవడం ఒక కారణమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ఓడరేవులపై, ఆర్థిక వ్యవస్థపై కొనసాగుతున్న ఆంక్షలు, దిగ్బంధం మరో కారణమని చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సైనిక, రాజకీయ బెదిరింపులు శాంతి చర్చలకు అడ్డంకులని తెలిపారు. అమెరికా మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను ప్రపంచం మొత్తం చూస్తోందని విమర్శించారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు, ఒప్పందాలకు సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో హార్మూజ్‌ను తెరిచే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. -
ఓ మై గాడ్.. ఇరాన్ ఎంత పని చేసింది?
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ మొదటికొచ్చింది. అమెరికా బ్లాకేడ్.. ఇరాన్ ఆధిపత్య ప్రయత్నాలతో చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఎంత కాలం కొనసాగుతుందనే దానిపై అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఓ క్లారిటీ ఇచ్చింది.హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి కనీసం మరో ఆరు నెలల టైం పట్టవచ్చని తాజాగా పెంటగాన్ ఓ నివేదికలో పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా చట్టసభ సభ్యులతో ఆ విభాగం రహస్యంగా ఓ సమావేశం నిర్వహించిందని.. అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కీలకమైన నివేదికను అక్కడి సభ్యులకు వివరించిందన్నది ఆ కథనం సారాంశం. అయితే..ఈ జాప్యానికి శాంతి చర్చలతో సంబంధం లేదని తెలుస్తోంది. ఇరాన్ అమర్చిన సీ మైన్స్ ఉండటం వల్లే ఈ ఆలస్యం జరగవచ్చని ఆ నివేదిక తెలిపింది. హర్ముజ్ రూట్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 కంటే ఎక్కువ మైన్స్‌నే అమర్చి ఉంటుందని అంచనా. ఇందుకోసం ఇరాన్ జీపీసీ (Global Positioning Capability/Control) టెక్నాలజీ వాడింది. అందుకే వాటిని గుర్తించడం కష్టతరంగా మారింది. కాబట్టి.. వాటిని తొలగించడానికి టైం పట్టవచ్చని ఆ నివేదిక పేర్కొంది. అయితే..ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాతే పూర్తిస్థాయిలో వాటి తొలగింపు ఆపరేషన్ చేపట్టడానికి వీలుంటుందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే పెంటగాన్ ఈ కథనాలను ధృవీకరించాల్సి ఉంది. ఇరాన్ ఇటీవల హర్ముజ్ జలసంధి సముద్ర మైన్స్ (Sea Mines) గురించి పలు ప్రకటనలు చేసింది. ముఖ్యంగా, నౌకలు మైన్స్‌తో ఢీకొనే ప్రమాదం ఉందని హెచ్చరించి.. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పర్యవేక్షణలో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పలు దేశాల వాణిజ్య నౌకలకు సూచించింది. అయితే డీల్ కుదిరాక ఇరాన్ సహకారంతోనే సీ మైన్స్‌ను తొలగిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అది జరిగే పని కాదంటూ ఇరాన్ ట్రంప్ ప్రకటనపై సెటైర్లు కూడా వేసింది. ఏయే యుద్ధాల్లో వాడారంటే..సీ మైన్స్ (Sea Mines) అనేవి సముద్రంలో ఉంచే పేలుడు పరికరాలు. ఇవి నౌకలు లేదంటే జలాంతర్గాములు (submarines) దగ్గరికి వచ్చినప్పుడు పేలిపోతాయి. చరిత్రలో అనేక యుద్ధాల్లో వీటిని విస్తృతంగా ఉపయోగించారు. 14వ శతాబ్దంలో చైనా సామ్రాజ్యంలో జపాన్ దొంగలపై వీటిని ఉపయోగించినట్లు చరిత్రలో ప్రస్తావన ఉంది. అమెరికన్ రెవల్యూషన్-సివిల్‌వార్ టైంలో అమెరికా తొలిసారిగా వాడింది. మొదటి ప్రపంచ యుద్ధంలో.. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు కొరియా, వియత్నాం యుద్ధాల్లోనూ వీటిని వాడారు. రష్యా నౌకల కదలికలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్.. తాజాగా హర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరులో ఇరాన్ వీటిని ఉపయోగించాయి.ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి హర్ముజ్ జలసంధిలో నౌకల రవాణాకు అంతరాయం కలుగుతూ వస్తోంది. హర్ముజ్‌పై పూర్తి ఆధిపత్యం తమదేనని ఇరాన్.. అలా కుదరదు స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని అమెరికా వాదిస్తూ వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ, శాంతిచర్చల(అణు ఒప్పందం ప్రధానంగా) కోసం కొనసాగుతోన్న దౌత్య ప్రయత్నాలతో.. హర్ముజ్ సమస్యకు త్వరలోనే ముగింపు లభిస్తుందని అంతా భావించారు. కానీ, అమెరికా డిమాండ్లను ఇరాన్ తోసిపుచ్చడం, చర్చలకు(రెండో దఫా) ముందుకు రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. -
హార్ముజ్ లో భారత్ నౌక సీజ్.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్
-
నౌకలపై ఇరాన్ దాడి
వాషింగ్టన్/టెహ్రాన్/ఇస్లామాబాద్/దుబాయ్: పాక్ ప్రాయోజిత శాంతి చర్చల ప్రక్రియకు తూట్లు పొడుస్తూ ఇరాన్ హార్మూజ్ జలసంధిని మరోమారు కాల్పులమోతకు వేదికగా మార్చేసింది. శాంతి చర్చలకు ఫలవంతమైన ప్రతిపాదనలతో ఇరాన్ వచ్చేవరకు కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే విదేశీ నౌకలపై ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ బలగాలు దాడులపర్వానికి తెరలేపాయి. ఇటీవల కొన్ని గంటలపాటు హార్మూజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనతో పర్షియన్ గల్ఫ్ నుంచి ఆశగా బయల్దేరిన నౌకలు గురువారం హార్మూజ్ జలసంధిని దాటే క్రమంలో వాటిపైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు తుపాకులు ఎక్కుపెట్టాయి. దీంతో మూడు నౌకలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. మూడింటిలో రెండింటిని ఇరాన్ స్వా«దీనంచేసుకుని తమ తీరానికి తీసుకెళ్తున్నాయి. మరోవైపు ఇరాన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్‌కు బయల్దేరని కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం సైతం పాకిస్తాన్‌కు బయల్దేరలేదు. దీంతో రెండో దఫా చర్చలు సాధ్యపడలేదు. అయితే చర్చలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయేగానీ రద్దుకాలేదని అమెరికా వ్యాఖ్యానించింది. శుక్రవారంలోపు రెండోదఫా చర్చలు జరిగే వీలుందని ట్రంప్ చెప్పినట్లు ‘ది న్యూయార్క్ పోస్ట్’తన కథనంలో పేర్కొంది. మరోవైపు బుధవారంతో ముగిసిపోతున్న కాల్పుల విరమణ గడువును ట్రంప్ హఠాత్తుగా పొడిగించడంపై మధ్యవర్తిత్వ దేశం పాకిస్తాన్ హర్షం వ్యక్తంచేసింది. సత్ఫల ప్రతిపాదనలతో ముందుకొచ్చేలా ఇరుపక్షాలను ఒప్పించేందుకు తమకు గడువు, సువర్ణావకాశం దక్కాయని పాకిస్తాన్ వెల్లడించింది. ‘‘మా దాడుల ధాటికి ఇరాన్ నాయకత్వంలో విభేదాలు పొడచూపాయి. పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నా. ఇరాన్ నుంచి ఆమోదయోగ్య ప్రతిపాదనలు వచ్చేదాకా కాల్పుల విరమణ గడువు పొడిగిస్తున్నా. గడువు పొడిగించినా హార్మూజ్ దిగ్బంధం, ఇరాన్ నౌకాశ్రయాల గుండా నౌకల రాకపోకలపై నిషేధం కొనసాగుతుంది’’అని ట్రంప్ అన్నారు. రెండో దఫా చర్చలు జరిగి శాశ్వత శాంతి ఒప్పందం అమల్లోకి వస్తే హార్మూజ్ తెరచుకుని ముడిచమురు సంక్షోభం సమసిపోయి క్రూడ్ ఆయిల్, పెట్రో ధరలు దిగొచ్చేవి. ఇవేవీ సాకారంకాకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగి పరోక్షంగా నిత్యావసర సరుకుల ధరలు మరింత ప్రియమైన పెనుప్రమాదం అలాగే పొంచి ఉంది. ముంద్రా పోర్ట్‌కు వస్తుంటే మెరుపుదాడిఒమన్కు ఈశాన్యంగా 15 నాటికల్ మైళ్లదూరంలో హార్మూజ్ జలాల్లో ఉన్న లైబీరియా జెండాతో వెళ్తున్న కంటైనర్ నౌక ‘ఎపామినోండాస్’పైకి ఐఆర్జీసీ నేవీ గన్బోట్లు హఠాత్తుగా కాల్పులు జరిపి నౌక ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌కు రావాల్సి ఉందని నౌకల స్థితిగతులపై నిఘా పెట్టే ‘మెరైన్ ట్రాఫిక్’సంస్థ వెల్లడించింది. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కేంద్రంగా పనిచేసే పనామా జెండాతో వెళ్తున్న ‘యుఫోరియా’నౌక మీద ఇరాన్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నౌకలోని నావికులకు ఎలాంటి గాయాలు కాలేదు. ఇరాన్ తీరానికి కేవలం 8 నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు యుఫోరియాపై కాల్పులు జరిపారని వ్యాన్‌గార్డ్, యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీఓ) వెల్లడించింది. ఇరాన్ తీరానికి కేవలం ఆరు నాటికల్ మైళ్లదూరం నుంచి వెళ్తున్నప్పుడు పనామా జెండాతో ఉన్న ‘ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా’నౌక మీదా బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో నౌక కిందిభాగం స్వల్పంగా దెబ్బతింది. ఎపామినోండాస్, ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌకలను స్వా«దీనంచేసుకుని ఇరాన్తీరాలకు బలగాలు తీసుకెళ్తున్నాయి. ఎలాంటి సరైన ధృవీకరణ పత్రాలు, అనుమతులు లేకుండా, రహస్యంగా ఇవి హార్మూజ్‌ను దాటుతున్నాయని ఇరాన్ నేవీ ఆరోపించింది. ట్రాకింగ్‌ను సైతం ఏమార్చి పారిపోతున్నాయని పేర్కొంది. ఎంఎస్సీ ఫ్రాన్సిస్కా నౌక శ్రీలంకలోని హంబన్»ొటా నౌకాశ్రయానికి, యుఫోరియా నౌక జెడ్డాకు వెళ్లాల్సి ఉందని వాటి ట్రాకింగ్డేటా ప్రకారం తెలుస్తోంది. యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28వ తేదీ తర్వాత ఇప్పటిదాకా 30కిపైగా నౌకలపై దాడులు జరిగాయి.గడువు పెంపుపై పెదవి విరిచిన ఇరాన్ గడువు పెంపును అమెరికా వేసిన మరో ఎత్తుగడగా ఇరాన్ అభివర్ణించింది. ‘‘సదభిప్రాయంతోనే సీరియస్‌గా తొలి దఫా చర్చలకు కూర్చున్నాం. కానీ అమెరికా అవిశ్వాసం చూపింది. అసంబద్ధ, అతి డిమాండ్ల చిట్టా విప్పింది. ఈ వారాంతంలోపు అమెరికాతో శాంతి చర్చల్లో పాల్గొనాలా వద్దా అనే దానిపై మేం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ చెప్పారు.క్షిపణుల ప్రదర్శన మరోవైపు తమపై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ జంకుతున్నాయంటూ ఇరాన్ పాలకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వసూచనల మేరకు ఇరాన్ సాయుధబలగాలు బుధవారం టెహ్రాన్ వీధుల్లో భారీ క్షిపణులు, మిస్సైల్ లాంఛర్లను ఊరేగింపుగా ప్రదర్శించారు. తమ వద్ద ఇంకా భారీసంఖ్యలో క్షిపణులు ఉన్నాయని పేర్కొన్నారు. క్షిపణులను చూసేందుకు జనం పెద్దసంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. జెండాలను చేతబూని ఇరాన్ పాలకులకు అనుకూలంగా నినాదాలుచేశారు.సముద్ర ఇంటర్నెట్ కేబుళ్లు కత్తిరిస్తాం: ఇరాన్గల్ఫ్ దేశాలకు ఇంటర్నెట్ సేవలు అందించే అత్యంత కీలక సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుళ్లను తప్పదనుకుంటే కత్తిరించేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ఒక హెచ్చరిక జారీచేసింది. ఈ వార్తను ఇరాన్ వార్తాసంస్థ టాస్నిమ్ ప్రచురించింది. ‘‘ఈసారి హార్మూజ్ జలసంధి గుండా వెళ్లే పలు ప్రధాన కేబుళ్లు ఏకకాలంలో ‘ప్రమాదవశాత్తు’ పాడైపోవచ్చు లేదా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మారొచ్చు. దీంతో పర్షియన్ గల్ఫ్ దేశాల్లో ఇంటర్నెట్ సేవలు స్తంభించిపోయే ప్రమాదముంది. గల్ఫ్ అరబ్ దేశాల ఇంటర్నెట్ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుంది’’ అని టాస్నిమ్ తన కథనంలో పేర్కొంది. హార్మూజ్ గుండా పలుదేశాల ఇంటర్నెట్ కేబుళ్లు వెళ్తున్నాయి. ఎర్రసముద్ర జలాల్లో ఇప్పటికే ఇవి పలుమార్లు కత్తిరింపులకు గురయ్యాయి. తమ పరిధిలోనూ వాటిని కత్తిరిస్తామని ఇరాన్ దన్నుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు పలుమార్లు హెచ్చరించారు.ఎలాంటి చెల్లింపులు జరపలేదునగదు, క్రిప్టో కరెన్సీ లావాదేవీల వార్తలను ఖండించిన భారత్ న్యూఢిల్లీ: ఇండియా దిశగా వస్తున్న నౌకలు సురక్షితంగా హార్మూజ్ జలసంధిని దాటేలా ఇరాన్‌కు భారత్ నగదు లేదా క్రిప్టోకరెన్సీ చెల్లింపులు జరిపిందన్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదని మోదీ సర్కార్ స్పష్టంచేసింది. హార్మూజ్ జలసంధి దిగ్బంధం తర్వాత ఏ దేశానికి చెందిన నౌకనూ రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అనుమతించట్లేదు. అయితే తమ నౌక ఇప్పటికే తమ వద్ద అనుమతి పొందిందని, అనుమతి పొందిన జాబితాలో రెండో నంబర్ తమ నౌకదేనని ‘సన్మార్ హెరాల్డ్’నౌకలోని సిబ్బంది చెబుతున్నట్లుగా ఉన్న ఒక ఆడియో క్లిప్ బయటకురావడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై మోదీ సర్కార్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర పోర్ట్‌లు, షిప్పింగ్, వాటర్‌వేస్ శాఖ అదనపు కార్యదర్శి ముఖేశ్ మాంగళ్ బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘హార్మూజ్‌ను దాటేందుకు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) నేవీ అధికారులకు సన్మార్ హెరాల్డ్ నౌక కెప్టెన్ డాలర్ల రూపంలో నగదు చెల్లింపులు జరిపాడని వస్తున్న వార్తలో నిజంలేదు. ఈ విషయాన్ని మేం నౌక యజమానితో మాట్లాడి రూఢీచేసుకున్నాం. ఈ ఉదంతంతో భారత్‌కు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’’అని ముఖేశ్ స్పష్టంచేశారు. ఏప్రిల్ 18వ తేదీన రెండు భారత్‌కు వచ్చే నౌకలపై ఆర్‌ఆర్‌జీసీ నేవీ బలగాలు కాల్పులు జరిపాయి. కాల్పులు ఆపేస్తే వెనక్కి వెళ్లిపోతామని సన్మార్ హెరాల్డ్ నౌకలోని సిబ్బంది చెప్పినట్లుగా ఆనాడు మీడియాలో వార్తలొచ్చాయి. -
హర్ముజ్‌లో మళ్లీ టెన్షన్: భారత నౌకను దిగ్బంధించి..
పశ్చిమాసియా సంక్షోభం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది. హర్ముజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒమన్ వైపు వెళ్తున్న నౌకలపై ఇరాన్ దాడులకు దిగింది. అలాగే భారత్‌కు చెందిన నౌకను సైతం దిగ్బంధించినట్లు సమాచారం అందుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని ఇరాన్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అమెరికా మాత్రం స్వేచ్ఛా రవాణాకు ఆటంకం కలిగించొద్దని హెచ్చరిస్తోంది. ఈ క్రమంలో బుధవారం హర్ముజ్‌లో వెళ్తున్న కంటైనర్ షిప్‌లపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డు నౌకలు కాల్పులు జరిపాయి. ఈ దాడుల్ని బ్రిటన్ ఆర్మీ ధృవీకరించింది. మొత్తం మూడు నౌకలపై దాడులు జరిగాయని.. గ్రీక్, పనామా, లైబీరియా రిజిస్ట్రేషన్ నౌకలుగా వాటిని గుర్తించారు. తొలుత.. ఈ ఉదయం గ్రీక్ ఆపరేటెడ్ కంటైనర్ షిప్‌పై ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఇరాన్ బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో నౌక పూర్తిగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదని.. సిబ్బంది క్షేమంగానే ఉన్నారని సమాచారం. ఆ వెంటనే పనామా, లైబీరియా షిప్‌లపై దాడి జరిగింది. దాడులను ధృవీకరించిన ఇరాన్ మీడియా.. హర్ముజ్ జలసంధిపై తమ ఆధిపత్యం కొనసాగుతుందని స్పష్టం చేసింది.భారత నౌకపై కూడా.. భారత్‌కు చెందిన నౌకలకు స్వేచ్ఛా రవాణా ఉంటుందని ఇరాన్ పదే పదే చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే బుధవారం నాటి పరిణామాలు మరోలా ఉన్నాయి. గుజరాత్ వైపు వస్తున్న ఓ నౌకను ఇరాన్ అడ్డగించింది. దిగ్బంధించిన ఆ నౌక పరిస్థితి.. సిబ్బంది క్షేమసమాచారాలపై స్పష్టత రావాల్సి ఉంది. మొన్నీమధ్య కూడా హర్ముజ్‌లో భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరిపింది. ఏప్రిల్ 18న ఐఆర్జీసీ రెండు భారత-పతాక నౌకలపై కాల్పులు జరిపింది. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు, కానీ నౌకలు వెనక్కి తిరగాల్సి వచ్చింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారత నౌకల భద్రత విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కోరింది.ప్రపంచ వర్తక వాణిజ్యానికి హర్ముజ్ జలసంధి కీలకమన్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఈ రూట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే.. కాల్పుల విరమణ కొనసాగుతున్నా హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధం) కొనసాగుతుందని అమెరికా అంటోంది. ఈ క్రమంలో టౌసా అనే వాణిజ్య నౌకను సీజ్ చేసింది. ఇది యుద్ధ చర్యేనంటున్న ఇరాన్.. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగడం పరిస్థితిని మరింత తీవ్రతరంగా మార్చే అవకాశం లేకపోలేదు. -
చర్చలపై తొలగని ఉత్కంఠ
వాషింగ్టన్/ఇస్లామాబాద్/టెహ్రాన్: హార్మూజ్ జలసంధి దిగ్భంధం, తమ కార్గో నౌకపై దాడి, స్వాధీనం ఘటనలతో ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న ఇరాన్ పాకిస్తాన్‌కు శాంతి చర్చల బృందాన్ని పంపేదిలేదని తెగేసి చెప్పడంతో రెండో దఫా శాంతి చర్చలపై సందిగ్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని ఏర్పాట్లూ చేశాక అతిథులు రాబోరన్న వార్త తెల్సి కంగుతున్న అతిథ్య పాకిస్తాన్ మరోమారు తమ దౌత్యమంత్రాంగాన్ని ముమ్మరంచేసింది. ఓ మెట్టు దిగిరావాలని అమెరికాకు సూచిస్తూనే మరోసారి చర్చలకొచ్చి సయోధ్యకు ప్రయత్నించాలని ఇరాన్‌కు హితబోధ చేస్తోంది. గత 24 గంటలుగా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పులేకపోగా కొత్తగా హిందూమహాసముద్రంలో ఇరాన్ నౌకను అమెరికా తమ అదీనంలోకి తెచ్చుకోవడంతో ఇరాన్ పాలకుల్లో కోపం మరింత ఎక్కువైంది.కనీసం గడువు తేదీని అయినా పొడిగించి.. మరోమారు సత్ఫల సయోధ్యకు యత్నించే అవకాశం తమకు ఇవ్వాలని ఇరుదేశాల నాయకత్వాలను పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మంగళవారం కోరారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రాయబారం ఏ మేరకు సత్ఫలితాలనిస్తుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది. ‘‘ఇరాన్ మాతో సంప్రతింపులు జరపాలి. ఒప్పందం కుదిరితే ఇరాన్ మళ్లీ గొప్పదేశంగా అవతరించవచ్చు. అద్భుత దేశంగా ఎదగవచ్చు. మంచి ఒప్పందంతోనే అమెరికా ప్రతినిధి బృందం సంతోషంగా ఇస్లామాబాద్ నుంచి వెనుతిరుగుతుందని ఆశిస్తున్నా.రెండోదఫా చర్చలకు ఇరాన్ ముందుకు రాక తప్పదు. ఆ దేశానికి మరో మార్గమే లేదు. ఒకవేళ శాంతి ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌పై బాంబులేయడమే అత్యుత్తమ మార్గం. కాల్పుల విరమణ గడువును పొడిగించే ప్రసక్తే లేదు. గడువు పొడిగింపు అనేది నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు’’అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంగళవారం సీఎన్‌బీసీ ‘స్వా్కక్ బాక్స్’కార్యక్రమంలో స్పష్టంచేశారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగుస్తుండటంతో బుధవారం ఏం జరుగుతుందోననే ఉత్కంఠ మరింత ఎక్కువైంది మేమింకా వేచిచూస్తున్నాంఇరాన్ స్పందన కోసం పాక్ వేచిచూస్తోంది. ‘‘ప్రతినిధి బృందం పంపుతుందోలేదో అనే సందేశం కోసం మేం ఆశగా ఎదురుచూస్తున్నాం. కాల్పుల విరమణ గడువు ముగిసేలోపే రెండోదశ చర్చలు మొదలుకావడం అత్యంత కీలకం’’అని పాక్ సమాచార శాఖ మంత్రి అతౌల్లాహ్ తరార్ మంగళవారం సాయంత్రం మీడియాతో చెప్పారు. అమెరికా వైఖరితోనే మేం రావట్లేదు చర్చలపై ఇరాన్ మంగళవారం స్పందించింది. ‘‘అమెరికా అధ్యక్షుడి చంచల మనస్తత్వం, అసంబద్ధ ప్రకటనలు, సంబంధంలేని వ్యాఖ్యానాలు, బెదిరింపులు, అమెరికా ప్రతినిధి బృందం చేసిన అతి డిమాండ్లతో మేం విసిగిపోయాం. ఫలవంతమైన చర్చలు జరుగుతాయనే నమ్మకం ఉంటేనే రెండోదశ చర్చలకు వస్తాం’’అని ఇరాన్ విదేశాంగ శాఖ పతినిధి ఇస్మాయిల్ బఘేల్ తెలిపారు.మరో నౌక స్వాదీనం: అమెరికా ఇండోనేసియా, శ్రీలంక మధ్యలో హిందూ మహాసముద్రజలాల్లో ఇరాన్‌కు చెందిన ‘ఎం/టీ టిఫానీ’నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. హెచ్చరికల తర్వాత తమ బలగాలు నౌకపైకి దిగాయని అమెరికా ప్రకటించింది. ఈ నౌకను అమెరికాకు తరలించాలా లేదంటే మిత్రదేశంలోకి తరలించాలా అనేది మరో నాలుగు రోజుల్లో తేలుస్తామని అమెరికా తెలిపింది. దిగ్భంధనాన్ని ఛేదించిన జీ సమ్మర్ఇరాన్కు చెందిన ముడిచమురు రవాణా నౌక ‘జీ సమ్మర్’విజయవంతంగా అమెరికా దిగ్బంధనాన్ని చేధించుకుని అరేబియా సముద్రం దిశగా పయనిస్తోందని వార్తలొచ్చాయి. ఏ ఒక్క నౌక కూడా తమ దిగ్బంధనం నుంచి తప్పించుకోబోదని గొప్పలుపోయిన అమెరికాకు ఈ వార్త తలనొప్పిగా మారింది. హార్మూజ్‌ను దాటేసి, ఏప్రిల్ 19వ తేదీన గల్ఫ్ ఆఫ్ ఒమన్నూ దాటేసిందని నౌకల ట్రాకింగ్ డేటా పేర్కొంది.ఆ 8 మందిని విడిచిపెట్టండిఇరాన్కు ట్రంప్ పిలుపు వాషింగ్టన్: ఇరాన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ఎనిమిది మంది మహిళలను వదిలేయాలని ఆదేశ ప్రభుత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. ఇస్లామాబాద్‌లో అమె రికా–ఇరాన్‌ల చర్చలు ప్రారంభమవుతాయని భావిస్తున్న వేళ ఆయనీ విజ్ఞప్తి చేయడం గమనార్హం. ఆరుగురు మహిళలు, ఇద్దరు యువతులకు సంబంధించిన ఫొటోలను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో విడుదల చేశారు. ‘మన మధ్య జరగబోయే చర్చలకు ఇది శుభారంభం అవుతుంది’అనే వ్యాఖ్యను జోడించారు. -
మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్ : ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణను పొడిగించేది లేదని ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ దిగ్బంధంతో ఇప్పటికే విజయం సాధించాం. అద్భుతమైన డీల్‌తో చర్చలకు ముగింపు పలుకుతాం’అని అన్నారు. ముందస్తు ప్రకటించినట్లు ఏప్రిల్ 22తో ఇరాన్‌పై అమెరికా కాల్పుల విమరణ ఒప్పందం ముగియనుంది. ఈ క్రమంలో ట్రంప్ సీఎన్‌బీసీ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఇరాన్‌తో ఒప్పందం విజయవంతంగా ముగిస్తాం. పశ్చిమాసియా యుద్ధ చర్చల్లో అమెరికా స్థానం బలంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించే అవకాశం లేదు. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునే దిశగా అమెరికా కాల్పుల విమరణ ధైర్యంగా తీసుకున్న నిర్ణయం. పొడిగింపులు అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఈ నిర్ణయం అమెరికా తన చర్చా శక్తిని తగ్గించకుండా, ప్రత్యర్థులపై ఒత్తిడి కొనసాగించడానికి తీసుకున్నదని ఆయన సూచించారు.మేము చివరికి ఒక గొప్ప ఒప్పందాన్ని సాధిస్తాం. అమెరికా భవిష్యత్తు చర్చలు విజయవంతంగా ముగుస్తాయని, దేశానికి లాభదాయకమైన ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
హర్ముజ్ తొలిసారిగా జిన్‌పింగ్ స్పందన
ప్రస్తుతం హర్ముజ్ విషయంలో తీవ్ర ప్రతిష్టంభన నడుస్తోంది. అమెరికా, ఇరాన్ రెండు దేశాలు పట్టు వదలకుండా భీష్మించుకొని కూర్చువడంతో తీవ్ర ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ స్పందించారు. హర్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించాలని ఇరు దేశాలు యుద్ధాన్ని వీడి శాంతి బాట పట్టాలని హితవు పలికారు.ప్రస్తుతం యుద్ధం విషయంలో చైనాపై అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. యూఎస్ఏ నిఘా ఏజెన్సీలు ఇరాన్‌కు చైనా ఆయుధాల తరలింపు చేస్తోందని సమాచారం అందించాయి. వాటిలోనూ మ్యాన్‌పాడ్ (భుజంపై మోసుకెళ్లగలిగే ఆయుధాలు) తరలింపు చేపడుతుందని వీటితోనే అమెరికా క్షిపణులపై ఇరాన్ దాడి చేయగలిగిందని పేర్కొన్నాయి. అయితే దీనిని చైనా ఖండించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ తొలిసారిగా హర్ముజ్ విషయంలో స్పందించారు.ఈ మేరకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాలు శాంతి కోసం వివాదాలను, రాజకీయ మరియు దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని, తక్షణమే సమగ్ర కాల్పుల విరమణ జరగాలని జిన్‌పింగ్ కోరినట్లు బీజింగ్ కథనాలు వెల్లడించాయి. హర్ముజ్ జలసంధి తెరిచి ఉండటం అంతర్జాతీయ సమాజంతో పాటు ఎంతో ప్రయోజనకరమని కోరినట్లు తెలుస్తోంది.ఈనేపథ్యంలో జిన్‌పింగ్ మధ్యప్రాచ్య కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. మధ్యప్రాచ్య దేశాలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని జిన్‌పింగ్ అన్నట్లు తెలుస్తోంది. దీంతో పరోక్షంగా భద్రత కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలనే సూచించినట్లుగా సమాచారం. అయితే యుద్ధం ప్రారంభమై దాదాపు 50 రోజులు గడుస్తోంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు స్పందించడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అత్యధికంగా సహజ వాయువును (LNG) దిగుమతి చేసుకునే చైనాకు ఈ జలసంధి అత్యంత కీలకం.హర్ముజ్ చైనాకు కీలకంఅయితే ప్రపంచంలోనే చైనా అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉంది. తన చమురుఅవసరాల్లో దాదాపు 70 శాతం దిగుమతులు ద్వారానే సమకూర్చుకుంటుంది. దిగుమతుల్లో రష్యా తొలిస్థానంలో ఉండగా తదుపరి సౌదీ అరేబియా ఉంది. అయితే యుద్ధం కారణంగా మార్చి నెలలో ఆ ప్రాంతానికి చైనా ఎగుమతులు 43 శాతం పడిపోయాయని కథనాలు పేర్కొన్నాయి. -
హర్ముజ్ వద్ద అమెరికా బలగాల వార్నింగ్
ప్రస్తుతం హర్ముజ్ జలసంధిని అమెరికా బ్లాకేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న ఓ నౌకకు యుఎస్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు. ఇది అమెరికా దిగ్భందనమని వెనక్కి వెళ్లకపోతే తీవ్రపరిణామాలుంటాయన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓవైపేమో అమెరికా హర్ముజ్‌ను బ్లాకేడ్ చేయగా మరోవైపు ఇరాన్ సైతం జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జలసంధి గుండా వెళ్లే నౌకలను అడ్డుకుంటుంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది.యూఎస్ గస్తీ హెలికాప్టర్‌లోని సిబ్బంది ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. " ఇది యునైటెడ్ స్టేట్స్ వార్‌షిప్ 115. మీరు యుఎస్ బ్లాకేడ్ చేసిన ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ బ్లాకేడ్ ఇరాన్ పోర్టులకు అన్నిటికీ వర్తిస్తుంది. ఇది షిప్పైన ఉన్న అన్ని జెండాలకు వర్తిస్తుంది. అని హెచ్చరించారు.. ఈ దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు 27 నౌకలను అమెరికా దళాలు వెనక్కి పంపించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రతి నౌకను తనిఖీ చేసే అధికారం తమకు ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే బలప్రయోగం చేస్తామని అమెరికా హెచ్చరించింది.అయితే ఇటీవల అమెరికా 'టౌస్కా' అనే ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకుంది. దీనిని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇది సముద్రపు దొంగతనమని అమెరికా దళాలు అంతర్జాతీయ నియమాలను ఉల్లంఘించాయని ఆరోపించింది. తమ వాణిజ్య నౌకపై జరిగిన ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.కాగా ఇరు దేశాల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా మరో దఫా శాంతిచర్చలకు రావాలని పట్టుబట్టడం ఇరాన్ దానిని తిరస్కరించడంతో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.Since the commencement of the blockade against ships entering or exiting Iranian ports and coastal areas, U.S. forces have directed 27 vessels to turn around or return to an Iranian port. pic.twitter.com/G8dl96wN4H— U.S. Central Command (@CENTCOM) April 20, 2026 -
ఇరాన్‌కు చైనా వెన్నుపోటు.. కారణం అదేనా?
ఇరాన్, అమెరికా యుద్ధంలో నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాల దృష్టి హార్మూజ్ జలసంధిపైనే ఉంది. జలసంధిని తెరిచి నౌకల రాకపోకలు జరగాలని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. కానీ, ఇరాన్ మాత్రం.. హార్మూజ్ అంతర్జాతీయ జలమార్గం కాదని.. అది తమ భూభాగానికి చెందిన సముద్ర ప్రాంతమంటూ కొత్త పలుకు ఎత్తుకుంది. అందువల్ల నౌకలు వెళ్లడానికి ఇరాన్ అనుమతి అవసరమని, అలాగే టోల్ వసూలు చేసే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. ఇలాంటి తరుణంలో మొట్టమొదటి సారిగా హార్మూజ్ అంశంపై ఇరాన్ మిత్ర దేశం చైనా స్పందించింది. ఇరాన్‌కు షాక్ ఇచ్చే విధంగా జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.హార్మూజ్‌పై ఇరాన్ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్.. హర్మూజ్‌ను అంతర్జాతీయ జలమార్గంగా అభివర్ణించారు. హార్మూజ్ జలసంధిని సాధారణ రాకపోకలకు తెరిచి ఉంచాలి. వెంటనే జలసంధిని తెరవాలని ఇరాన్‌కు సూచించారు. ఇది ప్రాంతీయ దేశాలు, అంతర్జాతీయ సమాజ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంది. తక్షణ, సమగ్ర కాల్పుల విరమణను చైనా సమర్థిస్తుందన్నారు. శాంతిని పునరుద్ధరించడానికి దోహదపడే అన్ని ప్రయత్నాలకు చైనా మద్దతు ఇస్తుంది. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచిస్తోందని పేర్కొన్నారు. కాగా, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించడం, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన తర్వాత చైనా అధ్యక్షుడు తొలిసారిగా ప్రకటన చేయడం విశేషం.అయితే, హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఆసియాలో తీవ్రమైన ఇంధన కొరతకు దారితీసింది. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఇరాన్ చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే చైనా, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు సుదీర్ఘకాలం కొనసాగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.నౌకపై దాడులు.. చైనా ఆందోళనమరోవైపు అమెరికా నావికా దిగ్బంధాన్ని ధిక్కరిస్తూ, చైనా నుంచి ఇరాన్ ఓడరేవుకు వెళ్తున్న ఒక సరకు రవాణా నౌకపై అమెరికా నేవీ కాల్పులు జరపడంపైనా చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని, కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయని, ఘర్షణలను రెచ్చగొట్టడం, ఉద్రిక్తతలను పెంచడం వంటివి మానుకుంటాయని భావిస్తున్నాం. అలాగే హార్మూజ్ జలసంధిలో సాధారణ నౌకాయానాన్ని పునఃప్రారంభించడానికి అవసరమైన పరిస్థితులను కల్పిస్తాయని మేము ఆశిస్తున్నాం’ అని పేర్కొంది.హార్మూజ్ మూసివేతతో చైనాకు నష్టాలు👉ఎనర్జీ సరఫరా అంతరాయం: చైనా క్రూడ్ ఆయిల్లో సుమారు 50% గల్ఫ్ దేశాల నుండి వస్తుంది. హార్మూజ్ మూసివేయడం లేదా దాడులు పెరిగితే, చైనాకు రోజుకు లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా ఆగిపోతుంది.👉ఆర్థిక ప్రభావం: ఇంధన ధరలు పెరగడం వల్ల చైనా పరిశ్రమలు, రవాణా, విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. ఇది GDP వృద్ధిని మందగింపజేస్తుంది. చైనా ఆర్థిక వృద్ధి 0.5–1% వరకు తగ్గే అవకాశం ఉంది.👉వాణిజ్య నష్టం: ఇరాన్, గల్ఫ్ దేశాలతో చైనా వాణిజ్యం 40–50% వరకు తగ్గింది. ఇది చైనా ఎగుమతులు, దిగుమతులపై నేరుగా ప్రభావం చూపుతోంది. వాణిజ్యం తగ్గడం వల్ల చైనాకు బిలియన్ల డాలర్ల నష్టం జరుగుతుంది.👉జియోపాలిటికల్ ఒత్తిడి: అమెరికా-ఇరాన్ ఘర్షణల కారణంగా హార్మూజ్ అస్థిరత పెరిగింది. చైనా తన నౌకలు, వాణిజ్య మార్గాలను రక్షించుకోవడానికి అదనపు ఖర్చు పెట్టాలి.చైనా ప్రధాన ప్రత్యామ్నాయ మార్గాలు..1. పైప్లైన్లురష్యా–చైనా పైప్లైన్లు: సైబీరియా నుండి చైనాకు నేరుగా ఆయిల్, గ్యాస్ సరఫరా.మధ్య ఆసియా పైప్లైన్లు: కజకిస్తాన్, టుర్క్‌మెనిస్తాన్ నుండి గ్యాస్ సరఫరా. ఇవి హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గిస్తాయి.2. ఆర్కిటిక్ సముద్ర మార్గంరష్యా "నార్తర్న్ సీ రూట్" ద్వారా చైనాకు ఆయిల్, LNG సరఫరా పెరుగుతోంది. ఈ మార్గం హార్మూజ్, మలక్కా వంటి "చోక్పాయింట్"లను తప్పించగలదు.3. స్ట్రాటజిక్ రిజర్వులుచైనా వద్ద 90 రోజులకు సరిపడే ఆయిల్ రిజర్వులు ఉన్నాయి. హార్మూజ్ మూసివేత వంటి తక్షణ షాక్‌లను ఎదుర్కోవడానికి వీటిని ఉపయోగిస్తోంది.4. ఎనర్జీ డైవర్సిఫికేషన్పునరుత్పాదక శక్తి (సోలార్, విండ్)లో భారీ పెట్టుబడులు.సూపర్‌గ్రిడ్ ప్రాజెక్ట్: దేశీయ విద్యుత్ ఉత్పత్తి పెంచి, ఆయిల్ దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం వంటి చర్యలు తీసుకుంటోంది. -
ట్రంప్ కొత్త రాగం.. మా కండీషన్ అదే..
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా అఖండ విజయం సాధించింది. ఇరాన్‌పై స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో టెహ్రాన్ తీవ్రంగా నష్టపోయిందని, బలహీనపడిందని అన్నారు. ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా ట్రుత్ వేదికగా..‘యుద్ధంలో ఇరాన్‌పై మేము విజయం సాధించాం. ఇరాన్ సైనిక సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి. అమెరికా దాడుల కారణంగా ఇరాన్ చాలా బలహీనపడింది. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతింది. వైమానిక దళం కార్యకలాపాలు తగ్గాయి. రక్షణ వ్యవస్థలు కూడా బలహీనంగా మారాయి. అలాగే, ఆర్థిక పరంగా కూడా ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం చవిచూస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌పై అమలు చేస్తున్న ఆంక్షలు, సముద్ర నిర్బంధం కీలక పాత్ర పోషిస్తున్నాయి’ అని వెల్లడించారు.ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా వదులుకోవాలి. ఇదే ప్రధాన షరతు అంటూ ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే తాను కూడా ఇరాన్ నాయకులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే, చర్చలు విఫలమైతే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడులు తీవ్రంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అయితే, ఈ పరిస్థితిని కొన్ని మీడియా సంస్థలు తప్పుగా చూపుతున్నాయని కూడా ఆయన విమర్శించారు. కొన్ని ఫేక్ న్యూస్ మీడియా సంస్థలు దీనిని తప్పుగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా ది న్యూయార్క్ టైమ్స్, ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది వాషింగ్టన్ పోస్ట్ వంటి సంస్థలను ఆయన తీవ్రంగా విమర్శించారు.ఇదిలా ఉండగా.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన వేళ, ఇస్లామాబాద్ చర్చలు కీలక మలుపు తిప్పే అవకాశముంది. ఒకవైపు ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ చర్చల ఫలితం ఆధారంగా రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుందో చూడాల్సి ఉంది. -
హార్మూజ్‌ను దాటిన 10 భారతీయ నౌకలు
న్యూఢిల్లీ: ఇప్పటిదాకా భారతీయ జెండాతో ఉన్న 10 సరకు రవాణా నౌకలు హార్మూజ్ జలసంధిని విజయవంతంగా దాటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి రణ్«దీర్ జైశ్వాల్ వెల్లడించారు. ‘‘భారతీయ నౌక ‘దేశ్ గరిమా’విజయవంతంగా హార్మూజ్‌ను ఆదివారం దాటేసింది. దీంతో జలసంధిని దాటిన మన నౌకల సంఖ్య పదికి పెరిగింది. ముడి చమురుతో బయల్దేరిన ఈ నౌక త్వరలోనే ముంబై నౌకాశ్రయానికి చేరుకోనుంది. పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా పలు నౌకలు భారత్ దిశగా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని జైశ్వాల్ చెప్పారు. -
సందిగ్ధంలో చర్చలు!
టెహ్రాన్/వాషింగ్టన్/ఇస్లామాబాద్/దుబాయ్: తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటనతో పశ్చిమాసియాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇరాన్–అమెరికా యుద్ధంలో రెండో దశ శాంతి చర్చలు ముందుకుసాగడం ప్రశ్నార్థకంగా మారింది. తమ అ«దీనంలో ఉన్న హార్మూజ్ జలసంధిని అమెరికా హఠాత్తుగా దిగ్బంధించడంతో ఇప్పటికే గుర్రుమీదున్న ఇరాన్ ఆదివారం తమ వాణిజ్య నౌకపై అగ్రరాజ్య నావికాదళం దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో పట్టరాని ఆవేశంతో ఊగిపోతోంది. దీంతో అమెరికాతో రెండో దఫా చర్చలకు కూర్చునేదేలేదని తెగేసి చెప్పింది. ‘‘రెండువారాల కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించింది. హార్మూజ్‌ను దిగ్బంధించింది. మా ‘తౌస్కా’ కార్గో నౌకపై దాడి చేసి స్వా«దీనంచేసుకుంది. అందుకే మా బృందాన్ని ఇస్లామాబాద్‌కు పంపట్లేదు. శుద్ధిచేసిన యురేనియంను అప్పగించడంపై ఏనాడూ అమెరికాతో చర్చించలేదు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ సోమవారం స్పష్టంచేశారు. దీంతో ఇప్పటికే రెండో దశ చర్చలకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిన పాకిస్తాన్ వెనువెంటనే రంగంలోకి దిగింది. అటు ఇరాన్‌ను బ్రతిమాలుతూనే హార్మూజ్ దిగ్బంధం, నౌకపై దాడి అంశాల్లో పట్టువిడుపులు ఉండాలని అమెరికాకు హితబోధ చేస్తోంది. చర్చల కోసం ఈజిప్ట్ సైతం ఇరాన్‌ను ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నంచేస్తోంది. దీంతో చర్చలకు యత్నాలు ఏమేరకు ఫలిస్తాయో, అవి నేటి చర్చల్లో ఏ స్థాయిలో ప్రతిఫలిస్తాయో చూడాల్సిందే. హెచ్చరిక, దాడి, స్వా«దీనం.. హార్మూజ్ జలసంధిని దిగ్బంధించడంతోపాటు తమ నౌకాశ్రయాల మీదుగా ఏ ఒక్క నౌక బయల్దేరకుండా అడ్డుకుంటూ అమెరికా చేస్తున్న చేష్టలతో ఇరాన్‌కు చిర్రెత్తుకొస్తోంది. దీనికి తోడు ఆదివారం గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో హార్మూజ్ దిశగా వస్తున్న 900 అడుగుల పొడవైన భారీ ఇరాన్ వాణిజ్య నౌక ‘తౌస్కా’ను అమెరికా ఆదివారం స్వా«దీనంచేసుకుంది. ఇరాన్‌లోని బందాస్ అబ్బాస్పోర్ట్కు వెళ్లేందుకు దుస్సాహసం చేయకుండా తక్షణం ఉన్నచోటే ఆగిపోవాలని తొలుత అమెరికా నావికాదళాలు హెచ్చరించాయి. దాదాపు ఆరుగంటలపాటు ఈ హెచ్చరికలు చేశారు. అయినా సరే తౌస్కా అలాగే ప్రయాణాన్ని కొనసాగించడంతో అమెరికా గైడెడ్ మిస్సైల్ విధ్వంసక నౌక ‘యూఎస్ఎస్ స్పుయెన్స్’ దాడిచేసింది. తౌస్కాలోని ఇంజిన్ రూమ్‌పైకి కాల్పులు జరిపింది. తర్వాత యూఎస్ఎస్ ట్రిపోలీ నౌక, హెలికాప్టర్లలో అమెరికా నావికాదళాలు ‘తౌస్కా’ను సమీపించి స్వాదీనం చేసుకున్నాయి. తమ నౌకను అమెరికా స్వాదీనం చేసుకుందన్న వార్త తెల్సి ఇరాన్ ప్రతిదాడికి దిగింది. ఒమన్ సముద్రంలో ఉన్న అమెరికా నౌకలపైకి డ్రోన్ల దండును పంపి దాడిచేసింది. గడువు పొడిగించబోను: ట్రంప్ తాత్కాలిక కాల్పుల విరమణ గడువును పొడిగించబోనని సోమవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్ ప్రతినిధి బృందం ఇంకా పాకిస్తాన్‌కు రాని నేపథ్యంలో రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ట్రంప్ ఈ వ్యాఖ్యలుచేయడం గమనార్హం. ‘‘ అమెరికా కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రంతో తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుంది. ఆలోపు ఇరాన్ మాతో శాంతిచర్చలు పూర్తిచేసి ఒప్పందం కుదుర్చుకోవాలి. గడువును పొడిగించడం అనేది దాదాపు అసాధ్యం. ఒప్పందం కుదరకపోతే దాడులు తథ్యం’’ అని ట్రంప్ అన్నారు. దీనిపై ఇరాన్ స్పందించింది. ‘‘అసంబద్ధ, అతి డిమాండ్లతో అమెరికా చర్చల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేసింది. అలాంటి అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధపడబోం. అమెరికా దౌత్యమోసానికి మేం బలికాబోం’’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. గడువు పొడిగించబోనని ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే పెజెష్కియాన్ మాట్లాడటం గమనార్హం. చర్చల కోసం అమెరికా బృందం మంగళవారం పాకిస్తాన్‌కు బయల్దేరే ఆస్కారముంది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించలేదు. ఇరాన్, పాక్ మంతనాలు చర్చలకు ప్రతినిధి బృందాలను పంపాలని ఇరాన్‌ను పాక్ కోరింది. ఈ మేరకు సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడారు. చర్చల పర్వం మరింత మందుకు సాగాల్సిన ఆవశ్యకతను అరాఘ్చీకి ఇషాక్ వివరించారు. -
భారత నౌకలను పేల్చేస్తాం బయటపడ్డ రేడియో సంభాషణ క్లిప్...
-
హార్మూజ్‌పై ఇరాన్ భారీ ట్విస్ట్.. దిమ్మ తిరిగే ప్లాన్!
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య మాటల దాడి నడుస్తోంది. సై అంటే సై అని ఇరు పక్షాల నేతలు వాదించుకుంటున్నారు. యుద్ధం, దాడుల విషయంలో తగ్గేదేలే అంటూ ప్రతి సవాల్ చేసుకుంటున్నారు. రెండో దఫా చర్చలకు అమెరికా సిద్ధమైన వేళ ఇరాన్ చెక్ పెట్టింది. చర్చలకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. మరోవైపు.. హార్మూజ్ జలసంధిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జలసంధి తెరవాల్సిందేనని ట్రంప్ పట్టుబడుతుంటే.. అదంతా జాంతా నై అని ఇరాన్ మొండి పట్టుతో ఉంది. ఇలాంటి తరుణంలో జలసంధిపై మరింత పట్టు బిగించాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది.అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిపై మరింత పట్టు కోసం ఇరాన్ ప్రణాళికలు, కొత్త చట్టాలను అన్వేషిస్తోంది. ఇప్పటి వరకు ఇరాన్‌కు నష్టం కలిగించిన ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్దమైంది. జలసంధిపై నియంత్రణను కట్టుదిట్టం చేసే కొత్త చట్టాన్ని ఇరాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. తాజాగా ఇరాన్ పార్లమెంటరీ సివిల్ ఇంజనీరింగ్ కమిటీ చైర్మన్.. ఈ మేరకు మహమ్మద్ రెజాయ్ కూచీ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై పూర్తి నిషేధంతో పాటు ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై కఠిన నిబంధనలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసిందన్నారు. ఈ ముసాయిదా చట్టం తుది రూపం దాల్చే దశకు చేరుకుందని వెల్లడించారు.అలాగే, అతి త్వరలోనే దీనిని ఇరాన్ పార్లమెంట్ ఆమోదించనున్నట్లు తెలిపారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలను హార్మూజ్ గుండా ప్రయాణించేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణించే దేశాల నౌకలు ప్రయాణించాలంటే ఆ దేశ జాతీయ భద్రతా మండలి నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. గతంలో ఇరాన్‌కు నష్టం కలిగించిన దేశాల నౌకలు ఆ నష్టపరిహారాన్ని చెల్లించే వరకు జలసంధి గుండా ప్రయాణించడానికి వీలు లేదన్నారు. జలసంధి గుండా వెళ్లే నౌకలు తమ రవాణా రుసుమును కేవలం ఇరాన్ కరెన్సీలో చెల్లించాల్సి ఉంటుందని బాంబు పేల్చారు.ఉచితం కాదు: ఇరాన్ఇదే సమయంలో హార్మూజ్ జలసంధిలో నౌకల భద్రత ఉచితం కాదని ఇరాన్ ఉపాధ్యక్షుడు మహ్మద్ రెజా ఆరిఫ్ అన్నారు. ఇరాన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ ప్రపంచ దేశాలు తమ నౌకల భద్రతను ఉచితంగా ఆశించడం కుదరదని తేల్చిచెప్పారు. తమ చమురు ఎగుమతులపై ఉన్న ఆర్థిక, సైనిక ఒత్తిడిని తొలగిస్తేనే ప్రపంచ చమురు ధరలు అదుపులోకి వస్తాయని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అమెరికా చేస్తోన్న నౌకాదళ దిగ్బంధనం కొనసాగినంత కాలం జలసంధిలో సరఫరా పునరుద్ధరణ కష్టమని తేల్చి చెప్పారు. ఇప్పుడు ప్రపంచం ముందు రెండే దారులు ఉన్నాయి. అందరికీ స్వేచ్ఛా యుత చమురు మార్కెట్ ఉండాలి లేదంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవడానికి సిద్ధపడాలని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ వ్యతిరేక దేశాలు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
సీజ్ ఎఫెక్ట్.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు, ప్రతి దాడులు జరుగుతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలపైకి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించింది. దీంతో, మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.కాగా, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న ఓ నౌకను అమెరికా సీజ్ చేసింది. దిగ్భంధనాన్ని దాటినందుకు తౌస్కా అనే వాణిజ్య నౌకపై రెండు రౌండ్ల కాల్పులు జరిపినట్లు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ధ్రువీకరించారు. మరోవైపు అమెరికా సెంట్రల్ కమాండ్ దీనిపై పోస్టు చేసింది. ఓ నౌక ఇరాన్ పోర్టు వైపు ప్రయాణించబోతే తాము సీజ్ చేసినట్లు పేర్కొంది. దీంతో, ఈ చర్యకు ప్రతిస్పందించి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. అనంతరం, అమెరికా యుద్ధ నౌకల పైకి డ్రోన్లను ప్రయోగించింది. గల్ఫ్ఆఫ్ ఒమన్ నుంచి అమెరికా నౌకలను ఐఆర్జీసీ తరిమినట్లు పేర్కొంది. అమెరికా చర్యలను సాయుధ పైరసీగా ఇరాన్ అభివర్ణించింది.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ వేదికగా రెండో విడత శాంతి చర్చలకు అమెరికా ఇరాన్ సన్నద్ధమయ్యాయి. తమ దేశ ప్రతినిధులు సోమవారం పాక్‌కు చేరుకుంటారని, మంగళవారం చర్చలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాము ప్రతిపాదించిన ఒప్పందాన్ని అంగీకరించాలని ఇరాన్‌కు సూచించారు. లేకపోతే ఆ దేశంలో విద్యుత్ కేంద్రాలు, వంతెనలన్నింటినీ ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అసలు చర్చలకు రావడం లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది. -
హర్మూజ్ భద్రతకై భారత్‌తో పనిచేస్తాం.. లీ-జే-మ్యూంగ్
సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు భద్రత కల్పించడం తప్పనిసరన్నారు. ఈ అంశంలో భారత్‌తో కలిసి పనిచేయడానికి సౌత్ కొరియా సిద్ధంగా ఉందని తెలిపారు.దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ తన మూడు రోజుల పర్యటన నిమిత్తం నిన్న (ఆదివారం) భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్బంగా న్యూఢిల్లీలోని విమానాశ్రయంలో ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర అనిశ్చితి నెలకొన్న వేళ అభివృద్ధి చెందుతున్న దేశాలైన సౌత్ కొరియా, భారత్ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దిగుమతుల విషయంలో ఏ ఒక్క దేశంపైనా పూర్తిస్థాయిలో ఆధారపడకూడదని అది దేశ మనుగడకే ప్రశ్నార్థకమవుతుందన్నారు.హర్ముజ్ జలసంధిపై మాట్లాడుతూ.. "రిపబ్లిక్ ఆఫ్ కొరియా, భారత్ రెండూ దేశాలు ముడి చమురు,సహజ వాయువుతో సహా తమ ఇంధన సరఫరాలలో మెజారిటీ వాటా కోసం మధ్యప్రాచ్యంపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల, మన ప్రజల భద్రతకు మరియు మన దేశాల మనుగడకే కీలకమైన సముద్ర మార్గాల భద్రతను నిర్ధారించడం అత్యవసరం. హర్ముజ్ జలసంధిలో అన్ని నౌకలు సురక్షితంగా, స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు కొరియా, భారత్‌తో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఈ ఉమ్మడి నిబద్ధతను నిలబెట్టుకోవడానికి సంబంధిత అంతర్జాతీయ వేదికలలో కూడా మేమిద్దరం కలిసి పనిచేయడం కొనసాగిస్తాము". అని అన్నారుప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు దేశాలు చమురుకోసం మరో మార్గాన్ని ఎంచుకోవడం కూడా అవసరం అని ఆయన అన్నారు. ఇటీవల హర్ముజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ కాల్పులు జరిపింది. ఈ నేపథ్యంలో ఈయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.కాగా ఈ రోజు (సోమవారం)ష్ట్రపతి భవన్లో లీ -జే-మ్యూంగ్‌కు అధికారికంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. -
‘ప్రతీకారం తీర్చుకుంటాం..’ అమెరికా-ఇరాన్‌ల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు!
ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. రెండో దఫా చర్చలపై ప్రతిష్టంబన కొనసాగుతుండగా.. అమెరికా నౌకాదళం ‘‘టౌస్కా’’ అనే ఇరాన్ వాణిజ్య నౌకను అడ్డగించి స్వాధీనం చేసుకుంది. ఈ నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చైనా నుండి ఇరాన్ వైపు ప్రయాణిస్తుండగా పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ చర్యకు గట్టి ప్రతీకారమే ఉంటుందని ఇరాన్ హెచ్చరిస్తోంది. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ.. హర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది అమెరికా. తమ సైన్యం హెచ్చరించినా ఆ నౌక ఆగలేదని.. అందుకే స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. ఇరాన్ సైనిక కమాండ్ ఖాతమ్ అల్-అన్బియా ఈ చర్యను.. సముద్ర దొంగతనంగా, ఆయుధ దోపిడీగా అభివర్ణించారు. అమెరికా రెండు వారాల కాలం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ.. అమెరికా దాడికి తగిన ప్రతిస్పందన ఇస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో.. నౌకను అమెరికా మెరైన్లు స్వాధీనం చేసుకున్నారని, ప్రస్తుతం నౌకపై పూర్తి నియంత్రణ ఉందని పేర్కొన్నారు. ఈ నౌకపై గతంలో అక్రమ కార్యకలాపాలు జరిపినందుకు అమెరికా ట్రెజరీ శాఖ ఆంక్షలు విధించిందని ఆయన గుర్తు చేశారు.మొదట ఇరాన్ ఈ ఘటనను ఖండిస్తూ.. తమ నౌకాదళం సమయానికి స్పందించి అమెరికా దాడిని అడ్డుకుందని ప్రకటించింది. అయితే, తరువాత అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన వీడియోలో నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టమైంది. ఈ సంఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉంది.చర్చలపైనా ఉత్కంఠఇరాన్–అమెరికా మధ్య ఇస్లామాబాద్(పాకిస్తాన్) వేదికగా తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. ఈ క్రమంలో ఇవాళ అమెరికా ప్రతినిధుల బృందం పాక్‌కు వెళ్తుందని ట్రంప్ ప్రకటించారు. అయితే.. ఇరాన్ మాత్రం ప్రధాన అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం లేదని అంటోంది. హర్ముజ్‌లో అమెరికా కవ్వింపు చర్యలు, తమకు వ్యతిరేకంగా ఇస్తున్న ప్రకటనల నేపథ్యంలో చర్చలకు వెళ్లబోమని ప్రకటించింది. దీంతో ట్రంప్ ఇరాన్‌పై భగ్గుమన్నారు. చర్చలకు రాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఈ నెల 22తో ముగియనుంది. ఇరాన్ దిగిరాకుంటే కాల్పుల విరమణ పొడిగింపు ఉండదని.. భీకర దాడులు జరుపుతామని ట్రంప్ అంటున్నారు. -
చర్చలకు ఇరాన్ నో
వాషింగ్టన్: రెండో విడత చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఆదివారం ఈ దిశగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంగళవారం పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయని తొలుత ట్రంప్ ప్రకటించారు. తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ సోమవారం సాయంత్రంకల్లా ఇస్లామాబాద్ చేరతారన్నారు. వాటిలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాల్గొంటారని అనంతరం వైట్‌హోస్ పేర్కొంది. అనంతరం ఇరాన్ స్పందిస్తూ, తాము ఈ చర్చల్లో పాల్గొనబోమని స్పష్టం చేసింది. అమెరికా తమ ఓడరేవుల దిగ్బంధాన్ని కొనసాగించినంత కాలం ఎలాంటి చర్చలనూ అంగీకరించబోమని కుండబద్దలు కొట్టింది. ఆ దేశ అధికార వర్తా సంస్థ ఐఆర్ఎన్ఏ ఈ మేరకు వెల్లడించింది. శాంతి ఒప్పందానికి ఇరాన్ ముందుకు రాకపోతే ఆ దేశంలోని వంతెనలు, విద్యుదుత్పత్తి ప్లాంట్లను నామరూపాల్లేకుండా ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ గడువు ఈ నెల 22తో ముగియనుంది. అమెరికా, ఇరాన్ మధ్య ఇటీవల ఇస్లామాబాద్‌లోనే జరిగిన చర్చలు విఫలం కావడం తెలిసిందే. అణు కార్యక్రమాన్ని శాశ్వతంగా పక్కన పెట్టాలన్న అమెరికా డిమాండ్‌కు ఇరాన్ అంగీకరించలేదు. విరమణకు ఇరాన్ తూట్లు: ట్రంప్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న నౌకలపై ఐఆర్జీసీ కాల్పులు జరపడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని మండిపడ్డారు. ‘‘మేము న్యాయమైన, సహేతుకమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. ఇరాన్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నా. లేదంటే ఇకపై మేం ఎంతమాత్రం మంచివాళ్లం కాదు.’’ అన్నారు.హార్మూజ్ ఉద్రిక్తంహార్మూజ్లో ఉద్రిక్తత పరిస్థితులు యథాతథంగా కొనసాగుతూనే ఉన్నాయి. వందలాది నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. హార్మూజ్‌లో శనివారం భారత్ సహా పలు దేశాల నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. అసంబద్ధ డిమాండ్ల వల్లే: ఇరాన్ అమెరికా అసంబద్ధ డిమాండ్ల కారణంగానే రెండో విడత చర్చల్లో పాల్గొనవద్దనే నిర్ణయానికి వచ్చినట్టు ఇరాన్ వెల్లడించింది. ‘‘ఆచరణసాధ్యం కాని, మితిమీరిన డిమాండ్లు చేయడం, ఇష్టానికి వైఖరి మార్చుకోవడం వంటి చర్యలు, పరస్పర విరుద్ధ ప్రకటనలు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌కు అలవాటుగా మారాయి. దీన్ని ఇకపై ఎంతమాత్రమూ సహించే ప్రసక్తే లేదు’’ అంటూ కుండబద్దలు కొట్టింది. తమ ఓడరేవుల దిగ్బంధం కాల్పుల విరమణ ఒప్పందానికి పొడవడమేనని ధ్వజమెత్తింది.బయటకు వెళ్లిపో!హార్మూజ్ జలసంధిలో రెండు భారత నౌకలపై ఇరాన్ కాల్పులు జరపడం పట్ల స్పందించాలని కోరిన మహిళా విలేకరిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే బయటకు వెళ్లిపోమ్మంటూ మండిపడ్డారు. ట్రంప్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
మార్కెట్‌కు హార్మూజ్ టెన్షన్!
పశ్చిమాసియా యుద్ధ ఆందోళనలకు తాత్కాలికంగా తెరపడినట్లు గత వారాంతాన వెలువడిన వార్తలు ఒక్క రోజులోనే రివర్స్ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన ఉత్సాహానికి బ్రేక్ పడనుంది. వెరసి ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమన పథం పట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముడిచమురు ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపగల యూఎస్, ఇరాన్ యుద్ధ ఆందోళనలు తిరిగి పెరగనున్నాయి. హార్మూజ్ జలాలపై యూఎస్, ఇరాన్ బలప్రయోగ వార్తలు అంతర్జాతీయంగా మరోసారి అనిశ్చితికి దారితీయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. దీంతో ప్రధానంగా చమురు రవాణాకు విఘాతం కలగడంతో ధరలు మళ్లీ ఊపందుకునే వీలుంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. చమురు ధరలు, గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్‌కు కీలకమైన ఇరాన్, యూఎస్ యుద్ధ పరిస్థితులపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్ముడి ఆర్. తెలియజేశారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఈ నెల 22న ముగియనుంది. రిజల్ట్స్ సీజన్.. గత వారాంతాన బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐతోపాటు యస్ బ్యాంక్ క్యూ4(జనవరి–మార్చి) ఫలితాలు ప్రకటించాయి. ఈ ప్రభావం నేడు ఆయా స్టాక్స్‌పై కనిపించే వీలుంది. ఇప్పటికే జోరందుకున్న జనవరి–మార్చి ఫలితాల సీజన్ మరింత ఊపందుకోనుంది. ఈ వారం పలు దిగ్గజాలు పనితీరు వెల్లడించనున్నాయి. జాబితాలో ఐటీ దిగ్గజాలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రాసహా.. హావెల్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్, నెస్లే, పెర్సిస్టెంట్, ఒరాకిల్, ఎస్బీఐ లైఫ్, ఎల్టీ టెక్, ఎల్‌టీఎం, ఎల్అండ్టీ ఫైనాన్స్ తదితరాలున్నాయి. గణాంకాలు కీలకం మార్చి నెలకు నేడు(20న) ఇన్ఫ్రా ఔట్పుట్ గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ బాటలో గురువారం(23న) హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసులు తదితర పీఎంఐ ఇండెక్స్ వివరాలు తెలియనున్నాయి. గత వారం వెలువడిన రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఆర్బీఐ పాలసీ నిర్ణయాలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. వీటికితోడు డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, చమురు ధరలు తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు.గత వారమిలా వరుసగా రెండో వారం దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో నిలిచాయి. సెన్సెక్స్ నికరంగా 943 పాయింట్లు(1.2 శాతం) బలపడి 78,494 వద్ద ముగిసింది. నిఫ్టీ 303 పాయింట్లు(1.3 శాతం) పుంజుకుని 24,354 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం మరింత అధికంగా 3.2 శాతం, 4.6 శాతం చొప్పున ఎగశాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
భారత్‌లో వంట గ్యాస్ కొరత ముంచుకొస్తుందా?
న్యూఢిల్లీ: అమెరికా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని అందుకే హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న నౌకలపై ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దీంతో భారత్‌లో ఇంధన సరఫరా భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రస్తుతం దేశంలో 60 రోజుల వరకు చమురు, పెట్రోల్, డీజిల్,ఏటీఎఫ్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, దీర్ఘకాలిక అంతరాయం వస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో 85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఇందులో ఎక్కువ భాగం సౌదీ అరేబియా, యూఏఈ వంటి పశ్చిమ ఆసియా దేశాల నుంచే వస్తుంది. ఈ సరఫరా ప్రధానంగా హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. కాబట్టి ఆ మార్గం మూసుకుపోతే సరఫరా అంతరాయం, రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు అన్నీ పెరుగుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.భారత్ గత కొన్నేళ్లుగా ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటోంది. రెడ్ సీ–సూయజ్ కాలువ మార్గం, బాబ్ ఎల్-మండెబ్ జలసంధి వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగిస్తోంది. అదనంగా, అమెరికా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల నుంచి కూడా సరఫరా పొందుతోంది. ప్రస్తుతం భారత్‌కి 60 రోజుల చమురు నిల్వలు, 50 రోజుల ఎల్ఎన్జీ నిల్వలు, 40 రోజుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో ప్రభుత్వం తెలిపిన ప్రకారం, మొత్తం నిల్వ సామర్థ్యం 74 రోజులు వరకు ఉంది.ప్రస్తుతం నిల్వలు ఉన్నప్పటికీ హర్మూజ్ జలసంధి దీర్ఘకాలం మూసుకుపోతే భారత్‌కి ఇంధన సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇంధన ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం నియంత్రణ కష్టమవుతుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు, కొత్త సరఫరా ఒప్పందాలు, వ్యూహాత్మక నిల్వలు పెంపు వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
హార్మూజ్ విషయంలో ఇరాన్ బిగ్ ట్విస్ట్..
-
హార్మూజ్‌పై ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్.. అమెరికా, ఇజ్రాయెల్‌పై నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిని ప్రస్తుతానికి తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. అయితే, వనరులు ఉన్నంత మాత్రాన యుద్ధంలో గెలవలేరు అంటూ కౌంటర్ ఇచ్చారు.ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అంతర్జాతీయ ఇంధన రవాణాకు హార్మూజ్ జలసంధి అత్యంత కీలకం. హార్మూజ్ జలసంధిపై పట్టు సాధించడం అమెరికా ప్రధాన లక్ష్యం. ఈ జలసంధిని తమ అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇరాన్‌ను ప్రపంచ దేశాల నుంచి వేరు చేయాలని వారు చూశారు. కానీ, ఇరాన్ నౌకాదళం, క్షిపణి దళాల పహారా ముందు వారి ప్రయత్నాలు సాగలేదు. అమెరికా వద్ద ఎక్కువ ధనం, సైనిక శక్తి, అధునాతన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసిన అనుభవం ఉండవచ్చు. శత్రువుల దగ్గర వనరులు ఉన్నా, వాటిని ఉపయోగించే ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలి. యుద్ధంలో ఇరాన్ సాధించిన పైచేయిని చూసి అగ్రరాజ్యం భయపడి ఒప్పందానికి వచ్చింది. మొదట హెచ్చరికలు జారీ చేసిన శత్రువులు, ఇరాన్ వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు మధ్యవర్తుల ద్వారా విజ్ఞప్తులు పంపుతున్నారు’ అని సెటైర్లు వేశారు.Mohammad Bagher Ghalibaf:“We are fully prepared, if they make even the slightest mistake, we will respond with force.”The message is clear: escalation won’t go unanswered. The stakes just got higher. pic.twitter.com/SuOEkhH2wj— Irfan Ahmad (@Irfuu_) April 18, 2026ట్రంప్ ఆటలు సాగవు..ఇరాన్‌ను బలహీనపరచాలని శత్రు దేశాలు పన్నిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రజల దేశభక్తిని, సైనిక వ్యూహాలను అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వ్యూహాత్మక తప్పిదాలు చేశాయి. ఇరాన్ తన పరిమిత వనరులతోనే శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ కలలు కన్నారు. కానీ, ఇరాన్ గడ్డపై ట్రంప్ ఆటలు సాగవు. ఇరాన్ అంటే వెనిజులా కాదని, ఇక్కడ శత్రువుల బెదిరింపులకు లొంగిపోయే ప్రభుత్వం లేదు అనేది ముందుగా తెలుసుకోవాలి’ అని హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల విషయంలో ఇరాన్ రాజీ పడే ప్రసక్తే లేదు. ఇరాన్ రేవులపై అమెరికా విధిస్తున్న దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు హార్మూజ్ జలసంధిని మూసే ఉంటుందని స్పష్టం చేశారు.‘అమెరికా ఫస్ట్’ కాదు.. ఇజ్రాయెల్ ఫస్ట్.. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ట్రంప్ చెప్పిన అమెరికా ఫస్ట్ నినాదంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన.. ట్రంప్ పదేపదే చెబుతున్న ‘అమెరికా ఫస్ట్’ నినాదం గాలికి వదిలేశారు. ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ‘అమెరికా ఫస్ట్’ అనే నినాదం ఆచరణలో లేదన్నారు. ఆయన ‘ఇజ్రాయెల్ ఫస్ట్’ అనే నినాదం ఎత్తుకున్నట్టు ఉన్నారు. అలాగే వ్యవహరిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చే తప్పుడు సమాచారంతో అమెరికా తన విదేశీ విధానాలను నాశనం చేసుకుంటోంది అంటూ విమర్శించారు. -
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు!
కైరో/న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు రవాణాకు జీవనాడి అయిన హార్మూజ్ వద్ద ఉద్రిక్తతలు మళ్లీ తారస్థాయికి చేరుతున్నాయి. ఆ జలసంధిని తెరిచినట్టు ఇరాన్ శుక్రవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్మూజ్‌ను దాటుతున్న రెండు భారత చమురు నౌకలపై శనివారం ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ)కి చెందిన స్పీడ్ బోట్లు కాల్పులకు దిగాయి. దాంతో అవి జలసంధిని దాటకుండానే వెనుదిరిగినట్టు అంతర్జాతీయంగా నౌకల రాకపోకలను ట్రాక్ చేసే టాంకర్ట్రాకర్స్ డాట్‌కామ్ తదితర సంస్థలు వెల్లడించాయి. వాటిలోని సిబ్బంది సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలీకి సమన్లు జారీ చేసింది. అంతేగాక ఇరాన్ చర్యపై తీవ్ర నిరసన కూడా వెలిబుచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐఆర్జీసీ కాల్పులతో మరో నాలుగు భారత చమురు నౌకలు హార్మూజ్‌ను దాటకుండానే వెనుదిరిగాయి. చమురు, సహజవాయువు, ఎరువుల నిల్వలతో కూడిన 13 భారత నౌకలు ప్రస్తుతం జలసంధి వద్ద చిక్కుబడి ఉన్నాయి. అవి సురక్షితంగా హార్మూజ్ దాటేలా ఇరాన్‌తో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. అయితే ‘దేశ్ గరిమ’ అనే చమురు నౌక శనివారం హార్మూజ్‌ను దాటి భారత్‌వైపు బయల్దేరినట్టు తెలుస్తోంది. మరోవైపు హార్మూజ్ జలసంధిని తిరిగి మూసేస్తున్నట్టు ఇరాన్ తాజాగా ప్రకటించింది. తమ ఓడరేవుల దిగ్బంధానికి అమెరికా స్వస్తి పలకని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. దిగ్బంధం కొనసాగినంత కాలం హార్మూజ్‌ను తెరవబోమని ప్రకటించింది. దీనికి తోడు ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరింపులకు దిగారు. త్వరలో ఒప్పందానికి రానిపక్షంలో కాల్పుల విరమణ పొడిగింపు ఉండబోదని కుండబద్దలు కొట్టారు. అంతేగాక ఇరాన్‌పై మళ్లీ బాంబుల వర్షం కురిపిస్తామని తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. అణు కార్యక్రమంతో పాటు అన్ని అంశాలపైనా ఇరాన్ తమతో సమగ్ర ఒప్పందం కుదుర్చుకునేదాకా ఆ దేశ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతుందని కూడా అధ్యక్షుడు స్పష్టం చేశారు. దాంతో పశి్చమాసియాలో పరిస్థితులు మళ్లీ విషమించేలా కన్పిస్తున్నాయి. త్వరలో చర్చలు! అమెరికా, ఇరాన్ నడుమ మరో దఫా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు పాకిస్తాన్ వెల్లడించింది. ఆ రెండు దేశాల నడుమ కాల్పుల విరమణ ఏప్రిల్ 22తో ముగుస్తుండటం తెలిసిందే. ఆ లోపే చర్చలు జరిగే అవకాశమున్నట్టు పాక్ పేర్కొంది. చర్చల నిమిత్తం పంపిన అమెరికా నూతన ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా వెల్లడించింది. ఇప్పటిదాకా 23 నౌకలు వెనక్కు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించినప్పటి నుంచీ ఇప్పటిదాకా హార్మూజ్ జలసంధి వద్ద 23 నౌకలను అడ్డగించి వెనక్కు పంపినట్టు అమెరికా పేర్కొంది. ఆ దేశ సెంట్రల్ కమాండ్ ఎక్స్ పోస్టులో ఈ మేరకు వెల్లడించింది. ఇరాన్ ఓడరేవులతో పాటు ఆ దేశ తీర ప్రాంతమంతటా నౌకల రాకపోకలపై నిషేధం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నట్టు పేర్కొంది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 13న అమెరికా సైన్యం ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానికి దిగింది.తీవ్ర పోరుకు సిద్ధం: మొజ్తబా శత్రువులపై తీవ్ర పోరాటానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. వారికి భారీ ఓటమి రుచి చూపేందుకు ఇరాన్ నావికా దళం ఇప్పటికే సర్వ సన్నద్ధంగా ఉందని శనివారం విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. ఇరాన్ సైన్యం వ్యవస్థాపక దినం సందర్భంగా సాయుధ దళాలకు ఆయన శుభాకాంక్షలు అందజేశారు. పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైన్యం చేపట్టిన డ్రోన్ దాడులను ప్రత్యేకంగా ప్రశంసించారు. లెబనాన్‌లో శాంతిదళాలపై కాల్పులు → ఒక ఫ్రెంచి సైనికుని మృతి → హెజ్బొల్లా పనేనన్న మాక్రాన్ పారిస్: లెబనాన్‌లో ఐరాస శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పుల్లో ఒక ఫ్రెంచి సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ మేరకు వెల్లడించారు. తమ దేశానికి చెందిన మరో ముగ్గురు సైనికులు గాయపడ్డట్టు తెలిపారు. దక్షిణ లెబనాన్‌లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటుచేసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇది హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టులో మాక్రాన్ వివరించారు. ఇందుకు బాధ్యులైన వారిని లెబనాన్ ప్రభుత్వం తక్షణం అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.యురేనియం అప్పగించబోం: ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను అమెరికాకు అప్పగించే ప్రసక్తే లేదని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. వాటిని అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందనే అర్థం వచ్చేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి సయీద్ ఖతీబ్జాదే పూర్తిగా ఖండించారు. అంతేగాక, ‘‘అమెరికా మితిమీరిన అహంకారంతో వ్యవహరిస్తోంది. కనుక ఆ దేశంతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధంగా లేదు’’అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ వద్ద 440 కిలోలకు పైగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నట్టు అంచనా. -
హర్ముజ్‌ను మళ్లీ మూసేసిన ఇరాన్
ప్రపంచ వ్యాప్తంగా అందరి చూపు హర్మూజ్ జలసంధి వైపే. హర్మూజ్ జలసంధిని తెరవడం.. కీలక నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు దేశాలు నడుంబిగించిన వేళ.. మళ్లీ హర్మూజ్ జలసంధి మూతపడింది. నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 17వ తేదీ) హర్మూజ్ జలసంధిని తిరిగి ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్.. రోజు వ్యవధిలోనే దాన్ని మళ్లీ మూసేసింది. అమెరికా వైఖరి కారణంగా హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గంటకో మాట మాట్లాడుతున్న తరుణంలో అసలు ఏం జరుగుతుందో ఇరాన్‌కు అంతు చిక్కడం లేదు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికి ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ఆపై మరి కాసేపటికి హర్మూజ్ జలసంధిని తాము మూసివేస్తున్నామని ప్రకటించారు ట్రంప్. దాంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల నడుమ ట్రంప్ మాటల్లో స్పష్టత లేదని అభిప్రాయానికి వచ్చేసింది ఇరాన్. అంతే హర్మూజ్ జలసంధిని తెరిచినట్లే తెరిచి మళ్లీ మూసేసింది. నిన్న ఏం జరిగిందంటే..నిన్న శుక్రవారం ప్రపంచదేశాలకు ఇరాన్ శుభవార్త చెప్పింది. దాదాపు నెలరోజులకు పైగా పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే ఇంతకాలం హెచ్చరికలు జారీ చేసిన టెహ్రాన్ ఎట్టకేలకు బెదిరింపులకు స్వస్థి పలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు ఉపిరి పీల్చుకున్నాయి. హర్మూజ్‌పై ఇరాన్ ప్రకటనతో నిన్న స్టాక్‌మార్కెట్లకు ఊపందుకున్నాయి. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడవగా ముడిచమురు నేలచూపులు చూసింది. దీనికి కారణం హర్మూజ్‌కు ఇరాన్ విముక్తి కలిగించడమే అయితే ట్రంప్ చేష్టలతో ఇరాన్‌కు మరోసారి నమ్మకం చల్లగిల్లింది.ట్రంప్ కామెంట్స్ ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ అన్నింటికీ అంగీకరించింది ‘‘ అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి" అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ సీరియస్దీనిపై ఇరాన్ సైతం ఘాటుగా స్పందించింది. ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారు. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ట్రంప్ ద్వంద్వ వైఖరిఇలా ఒకవైపు చర్చలు అంటూనే ట్రంప్ ద్వంద్వ వైఖరి ప్రకటించారు. హర్మూజ్‌ను ఇరాన్ తెరిచిన దానికి ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. కాసేపటికి దాన్ని తాము మూసివేస్తున్నట్లు ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ఇక తమది అనే సంకేతాలిచ్చిన ట్రంప్.. ఇరాన్‌ను మళ్లీ బెదిరించే యత్నం చేశారు. కథ మళ్లీ మొదటికిఈ పరిస్థితుల నడుమ హర్మూజ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూ ఇరాన్‌ను బెదిరించే యత్నాలు చేశారు ట్రంప్. హర్మూజ్ తమది అనడంతోపాటు అణుకార్యక్రమాన్ని ఇరాన్ నిలిపివేస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దీనిపై చిర్రెత్తుకొచ్చిన ఇరాన్,.. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దాంతో హర్మూజ్ కథ రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్లీ హర్మూజ్‌ను ఇరాన్ మూసేయడంతో ఇది ఎటువైపు పోతుందో అనే చర్చ మొదలైంది. -
పెట్రోలుకు నీటి వాకిలి హార్మోజ్ జలసంధి
ఇప్పుడు రోజూ హార్మోజ్ జలసంధి వార్తల్లో ఉంది. యుద్ధం జరుగుతుంటే దానిని ఒక దేశం మూసేస్తానంటే మరో దేశం తెరుస్తాను అంటోంది. దీని వివరాలు చూద్దాం. అసలు జలసంధి అంటే ఏంటి? రెండు పెద్ద సముద్రాలను కలిపే సన్నటి నీటి దారిని ‘జలసంధి’ అంటారు. ఇది ఒక నీటి వంతెన లాంటిది. మన ఇంటి సందులో నుంచి మెయిన్ రోడ్‌కి వెళ్లినట్టు. హోర్ముజ్ జలసంధి కూడా అలాంటిదే. ఇది ఇరాన్ దేశం, ఒమన్ దేశం మధ్యలో ఉంది. పర్షియన్ గల్ఫ్ అనే సముద్రాన్ని అరేబియా సముద్రంతో కలుపుతుంది. మ్యాప్‌లో చూస్తే V షేప్‌లో కనిపిస్తుంది. దీని పేరు ‘హోర్ముజ్’ అనే దీవి పేరు మీదుగా వచ్చింది. ఆ దీవి ఒకప్పుడు వ్యాపారానికి చాలా ఫేమస్.ఏమిటి ఈ జలసంధి ప్రత్యేకత?ప్రపంచంలో రోజూ వాడే పెట్రోల్, డీజిల్‌లో దాదాపు 20%– అంటే రోడ్డు మీద తిరిగే 5 పెట్రోలు ట్యాంక్ లారీల్లో 1 లారీలోని సరుకు– ఇదే దారిలో షిప్పుల్లో వెళ్తుంది. అందుకే దీన్ని ‘ఆయిల్ హైవే’ అంటారు. ఈ జలసంధి మొత్తం వెడల్పు 33 కిలోమీటర్లు. కానీ పెద్ద పెద్ద షిప్పులు వెళ్లడానికి కేవలం 3 కి.మీ. దారి మాత్రమే వాడతారు. రెండు వైపులా వెళ్లే, వచ్చే షిప్పులకు వేరు వేరు లైన్లు ఉంటాయి – రోడ్ మీద లాగా. రోజుకి దాదాపు 20–30 పెద్ద ఆయిల్ ట్యాంకర్ షిప్పులు ఇక్కడి నుంచి వెళ్తాయి. ఒక్కో షిప్ 2 కోట్ల లీటర్ల ఆయిల్ తీసుకెళ్లగలదు!ఇక్కడ ఎందుకు గొడవలు?ఈ దారి చాలా చిన్నది కాబట్టి, ఏదైనా దేశం దీన్ని మూసేస్తే ప్రపంచానికి పెట్రోల్ దొరకడం కష్టం. పెట్రోల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అందుకే అన్ని దేశాలు దీన్ని జాగ్రత్తగా చూస్తాయి. మనం వాడే పెట్రోల్, డీజిల్‌లో చాలా భాగం గల్ఫ్ దేశాల నుంచి ఇదే దారిలో వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏదైనా జరిగితే మన బైక్, బస్ రేట్లు కూడా పెరుగుతాయి. హోర్ముజ్ జలసంధి అంటే ప్రపంచానికి పెట్రోల్ పంచే ‘సన్నటి డోర్’. ఆ డోర్ సేఫ్‌గా ఉంటేనే మన వాహనాలు స్మూత్‌గా నడుస్తాయి. -
బుధవారం మళ్లీ ప్రళయమే: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ మాటల యుద్ధం నడుస్తోంది. హార్మూజ్ విషయం, ఇరాన్‌తో చర్చలు అంశంలో అధ్యక్షుడు ట్రంప్ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. తాజాగా కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు.కాగా, ఇరాన్ ఒప్పందం కుదరకపోతే కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించకపోవచ్చని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ గడువులోగా ఒప్పందం కుదురుతుందా లేదా అనే దానిపై నిర్ణయం ఆధారపడి ఉంటుందని అన్నారు. మళ్లీ బాంబులు వేయడం ప్రారంభించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మళ్లీ బాంబుల మోత ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసి ఉంచిన హార్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా తెరిచింది. కాల్పుల విరమణ ముగిసేదాకా వాణిజ్య నౌకలు అందులో రాకపోకలు సాగించవచ్చని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ఈ పరిణామాన్ని స్వాగతించిన ట్రంప్ ఇరాన్ ఒప్పందం కుదిరేదాకా ఇరాన్ దిగ్బంధనాన్ని మాత్రం తాము ఉపసంహరించుకోబోమని స్పష్టం చేశారు. అలా అయితే హార్మూజ్‌ను మళ్లీ మూసి వేస్తామంటూ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది.#WATCH | On being asked if he will extend the ceasefire, US President Donald Trump says, "Maybe I won't extend it. But the blockade is going to remain. So you have a blockade, and unfortunately, we'll have to start dropping bombs again..."(Source: The White House) pic.twitter.com/6HURzpzE0s— ANI (@ANI) April 18, 2026మళ్లీ మూసివేస్తాం: ఇరాన్ఇరాన్ పోర్టుల దిగ్బంధమనం కొనసాగుతుందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ మండిపడ్డారు. తమ నౌకలను అడ్డుకుంటే హార్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. హార్మూజ్ జలసంధి, శాంతి ఒప్పందం తదితర విషయాలపై ట్రంప్ ఒక గంటలోనే 7 పోస్టులు చేశారని, అవన్నీ అబద్ధాలేనని ఘాలిబఫ్ తెలిపారు. అబద్ధాలతో యుద్ధం గెలవలేరని.. చర్చల్లో కూడా పురోగతి సాధించలేరని విమర్శించారు. జలసంధికి సంబంధించి ప్రతి నిర్ణయం తామే తీసుకుంటామని రాసుకొచ్చారు. తాము ఇప్పటికే ప్రకటించిన మార్గంలోనే నౌకల రాకపోకలు సాగుతాయని పేర్కొన్నారు.ఐఆర్జీసీ హెచ్చరిక.. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచామని ఇరాన్ విదేశాంగమంత్రి ప్రకటించగా, IRGC నేవీ విభాగం మాత్రం పలు నిబంధనలు విధించింది. హార్మూజ్ గుండా వెళ్లే అన్ని నౌకలు తప్పనిసరిగా తమ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తాము నిర్దేశించిన మార్గంలోనే పౌర, వాణిజ్య నౌకలు రాకపోకలు సాగించాలని తెలిపింది. సైనిక నౌకలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని స్పష్టంచేసింది. ఈ నిబంధనలన్నీ.. కాల్పుల విరమణ ఒప్పంద నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. -
గంటలో ట్రంప్ 7 అబద్ధాలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ది అసలు నోరేనా? అని అంటోంది ఇరాన్ మీడియా. పశ్చిమాసియా యుద్ధంపై వైట్‌హౌజ్ వేదికగా ఒక్క గంటలో ఆయన ఏడు ప్రకటనలు చేశారు. అయితే అవన్నీ అబద్ధాలేనని ఇరాన్ అంటోంది. ఇంతకీ ఏ ఏడు ఏంటంటే.. ఇరాన్-అమెరికా మధ్య హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)పై ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా నౌకా దళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే.. తాము హార్ముజ్‌ను మూసివేస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఘలీబాఫ్.. డోనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.ఎక్స్ వేదికగా స్పందించిన ఘలీబాఫ్.. హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు ఇరాన్ అనుమతితోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దిగ్బంధనం కొనసాగితే, హార్ముజ్ జలసంధి ఎంతమాత్రం తెరిచి ఉండదంటూ ఆయన స్పష్టం చేశారు. "వారు ఈ అబద్ధాలతో యుద్ధంలో గెలవలేదు. చర్చల్లో కూడా ఎక్కడికీ వెళ్లలేరు. జలసంధి తెరిచి ఉందా లేదా అనేది క్షేత్రస్థాయి పరిస్థితులు నిర్ణయిస్తాయి కానీ సోషల్ మీడియా కాదు. ట్రంప్ ఒక గంటలో ఏడు ఆరోపణలు చేశారని.. అవన్నీ అబద్ధాలు’’ అంటూ ఘలీబాఫ్ కొట్టిపారేశారు. అయితే, ఆ ఏడు అవాస్తవాలు ఏమిటనేది ఆయన స్పష్టంగా వివరించలేదు.లెబనాన్‌లో కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకల కోసం హార్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదో వంతు హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా దాదాపు రెండు నెలల పాటు మూతబడటంతో ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు, సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ప్రస్తుతం ఇరాన్ దీనిని తెరిచినప్పటికీ, వాణిజ్య నౌకలు భద్రతా హామీల కోసం వేచి చూస్తున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.అయితే, ఇరాన్ యుద్ధంపై గతంలో ట్రంప్ ఏడు స్టేట్మెంట్లను పరిశీలిస్తే.. అవన్నీ అబద్ధాలేనని తేలింది. హార్ముజ్ పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఇరాన్.. మా అనుమతితో మాత్రమే తెరుస్తామని చెబుతోంది. నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ వ్యాఖ్యలు చేయగా.. ఇది తప్పుదారి పట్టించే ప్రకటన అంటూ అమెరికా ఒత్తిడి కొనసాగుతుందని ఇరాన్ చెప్పింది. ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ వ్యాఖ్యలను ఘలీబాఫ్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ యుద్ధంలో నిలబడిందని పేర్కొన్నారు.అలాగే, చర్చలు దాదాపు పూర్తయ్యాయని ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన ఇరాన్.. యురేనియం తరలింపు వంటి అంశాలు ఎప్పుడూ చర్చల్లో లేవని స్పష్టం చేసింది. ఇరాన్ యురేనియం అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని పేర్కొంది. హార్ముజ్ ఎప్పటికీ తెరిచి ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ కౌంటర్ ఇస్తూ.. ఆంక్షలు కొనసాగితే హార్ముజ్‌ను మూసివేస్తామని హెచ్చరించింది. అమెరికా–ఇరాన్ ఒప్పందం త్వరగా కుదురుతుందని ట్రంప్ చెప్పగా.. ఇది అవాస్తమంటూ పేర్కొన్న ఇరాన్.. చర్చలు ఇంకా క్లిష్టంగా ఉన్నాయని తెలిపింది.హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని ట్రంప్ చెప్పారు.. మా అనుమతితోనే తెరుస్తామని ఇరాన్ చెప్పిందినావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయని ట్రంప్ అన్నారు.. అమెరికా బ్లాకేడ్ కొనసాగుతోందని ఇరాన్ అంటోందిఇరాన్ యుద్ధంలో ఓడిపోయిందని ట్రంప్ అన్నారు.. తాము యుద్ధంలో నిలబడ్డామని ఇరాన్ స్పష్టం చేసిందిచర్చలు దాదాపుగా పూర్తయ్యాయని ట్రంప్ చెప్పుకొచ్చారు.. ఆయన చెప్పిన అంశాలపై చర్చలు జరగలేదని ఇరాన్ చెబుతోందిశుద్ధి యురేనియం ఇరాన్ అమెరికాకు తరలిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.. శుద్ధి చేసిన యురేనియం ఎక్కడికీ తరలించబడదని ఇరాన్ అంటోందిహర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతోందని.. ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పడం.. అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించిందిడీల్ త్వరలోనే అని ట్రంప్.. చర్చలు క్లిష్టదశలో ఉన్నాయని ఇరాన్ స్పష్టీకరణ -
ఇరాన్‌కు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: హార్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సహాయంతో ఇరాన్ జలమార్గం నుండి సముద్ర మైన్లను తొలగిస్తోందని ట్రంప్ చెప్పుకొచ్చారు. మైన్లను తొలగించడానికి అమెరికా, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయని ట్రంప్ అన్నారు.ఇక, అమెరికా నేవీ ఇప్పటికే ఒక లిట్టోరల్ కాంబాట్ షిప్‌ను మైన్ క్లియరింగ్ ఆపరేషన్ల కోసం అక్కడ ఉంచారు. అలాగే, అదనంగా జపాన్ నుంచి రెండు మైన్ క్లియరింగ్ నౌకలు కూడా ఆ ప్రాంతానికి బయలుదేరాయి. అయితే, యుద్ధం నేపథ్యంలో హార్మూజ్‌లో చిన్న పడవల సాయంతో ఇరాన్ మైన్లను అమర్చింది. కాగా.. గత వారం న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, హార్మూజ్‌లో ఇరాన్ వేసిన అన్ని మైన్స్‌ను గుర్తించడం కష్టంగా మారింది. కొన్ని మైన్స్.. నీటి ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు తెలిపింది. దీంతో, నీటి నుంచి మైన్స్‌ను తీయడం కష్టంగా మారిందని పేర్కొంది.మరోవైపు.. బెల్జియం, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ సహా ఐరోపా దేశాలకు హార్మూజ్ జలసంధిలో ఉన్న మైన్లను తొలగించే సామర్థ్యం ఉందని ఫ్రాన్స్ రక్షణ మంత్రి కేథరీన్ వాట్రిన్ వెల్లడించారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈ జలమార్గం గుండా ప్రయాణించే నౌకలకు ఐరోపా దేశాలు పూర్తి మద్దతుతో కూడిన ఎస్కార్ట్ సేవలను అందించగలవని వాట్రిన్ తెలిపారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, కీలకమైన నౌకా మార్గాలను సురక్షితం చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ సహా ఇతర ప్రపంచ నాయకులు సమావేశం కానున్నారు.సమావేశానికి మాక్రాన్, స్టార్మర్ నాయకత్వంమరోవైపు ఇరాన్‌పై దౌత్య, ఆర్థిక ఒత్తిడిని పెంచే అంతర్జాతీయ ప్రయత్నాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నాయకత్వం వహిస్తున్నారు. హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడమే లక్ష్యంగా ఒక అంతర్జాతీయ మిషన్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికల్లో భాగంగా ఈ చర్చలు ఉంటాయని బ్రిటన్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.సుమారు 40 దేశాల నాయకులు హాజరుకాగా మాక్రాన్‌తో కలిసి ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పారిస్‌కు చేరుకోనున్నారు. అలాగే జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోని కూడా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇతర ప్రపంచ నేతలు వర్చువల్‌గా ఇందులో పాల్గొననున్నట్లు సమాచారం. ఇరాన్‌తో కాల్పుల విరమణకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సముద్ర మార్గం గుండా సురక్షిత ప్రయాణం లక్ష్యంగా సుమారు 40 దేశాల నాయకులు ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియా CNN పేర్కొంది. అయితే, ఆ జాబితాను ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు, సిబ్బంది భద్రతను మెరుగుపరిచేందుకు అంతర్జాతీయ సముద్ర సంస్థ (International Maritime Organization) చేస్తున్న పనికి మద్దతు ఇవ్వడంపై కూడా ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని పేర్కొంది. -
ఇరాన్ గుడ్ న్యూస్.. తెరుచుకున్న హార్ముజ్
-
ఇరాన్.. హర్ముజ్.. ట్రంప్.. అంతా గందరగోళమే!
పశ్చిమాసియా ఉద్రిక్తతలను ముగించేందుకు రెండో దఫా చర్చలకు అమెరికా-ఇరాన్‌లు సిద్ధపడుతున్నాయి. తేదీ ఇంకా ఖరారు కాకపోయినా మళ్లీ పాకిస్తాన్ వేదికగానే చర్చలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వరుస ప్రకటనలు.. ఇటు ఇరాన్ వాటిని ఖండించుకుంటూ పోతుండడం ఈ సంక్షోభంలో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఓ మెట్టు కిందకు దిగింది. లెబనాన్ కాల్పుల విరమణ కుదరడంతో హర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించింది. ‘హర్ముజ్‌ను పూర్తిగా తెరిచాం. చమువురు నౌకల రాకపోకలను అడ్డుకోం. కాల్పుల విరమణ కాలంలో అన్ని వాణిజ్య నౌకలకు సురక్షితంగా మార్గం ఉంటుంది’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ఈ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. పది శాతం దాకా రేట్లు తగ్గాయి. అయితే.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటన గందరగోళానికి దారి తీసింది. ఇరాన్‌తో జరుగుతున్న చర్చల వ్యవహారం పూర్తయ్యే వరకు హర్ముజ్‌లో తమ బ్లాకేడ్(దిగ్బంధంనం).. అదీ ఫుల్ ఫోర్స్‌తో కొనసాగుతుందని ప్రకటించారు. అయితే.. చర్చల ప్రక్రియ త్వరగానే పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు అంశాలపై చర్చలు జరిగాయని, వీలైనంత త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. ఇరాన్ అన్నింటికీ అంగీకరించిందని.. కానీ యురేనియంపై డీల్ కుదిరేవరకు ఆంక్షలు కొనసాగుతాయని ట్రంప్ అన్నారు. ‘‘అణు కార్యక్రమాన్ని ఇరాన్ నిలపివేస్తుంది. తన “న్యూక్లియర్ డస్ట్” (అధికంగా శుద్ధి చేసిన యురేనియం) అమెరికాకు అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఫ్రీజ్ చేసిన ఇరాన్ నిధులు మాత్రం వెనక్కి ఇవ్వబోం. త్వరలో శాశ్వత ఒప్పందంపై చర్చలు జరుగుతాయి. ఒప్పందం కుదిరితే ఉచిత చమురు, హర్ముజ్ ద్వారా స్వేచ్ఛా రవాణా.. అన్నీ బాగుంటాయి అని వ్యాఖ్యానించారు.అయితే.. ఇరాన్ మాత్రం ట్రంప్ తన ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చుకుంటూ పోతున్నారని అంటోంది. అమెరికా దిగ్బంధం కొనసాగితే.. హర్ముజ్‌ను మళ్లీ మూసేస్తామని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బకాయీ స్టేట్ మీడియా టీవీ చానెల్లో మాట్లాడుతూ.. శుద్ధి చేసిన యురేనియం ఇరాన్ నుంచి ఎక్కడికీ తరలించబడదు. కొనసాగుతున్న చర్చల్లో ఇది ఒక ఎర్ర గీత (red line)గా మారింది అని అన్నారు. ఈ లెక్కన హర్ముజ్తో పాటు యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గబోదని స్పష్టమవుతోంది. పశ్చిమాసియా యుద్ధంలో.. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాల సంయుక్త దాడులతో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా.. ఇరాన్లో 3,000 మంది, లెబనాన్‌లో 2,100 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్ దేశాల్లో డజను మందికి పైగా మరణించారు. అమెరికా సైనికుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.హర్ముజ్ జలసంధి.. శుద్ధి చేసిన యురేనియం, ఫ్రీజ్ చేసిన నిధులు.. ఈ విషయాల్లో రెండు దేశాల మధ్య చర్చల్లో ఎటూ తేలడం లేదు. ఈ నెల 11వ తేదీన పాక్ మధ్యవర్తిత్వంతో ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. రెండో దఫా చర్చల్లో అయినా ఈ అంశాలు ఓ కొలిక్కి వస్తేనే యుద్ధం ఆగేది. లేకుంటే.. మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ -
హార్మూజ్ తెరుచుకుంది
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్ ప్రపంచదేశాలకు శుక్రవారం శుభవార్త విన్పించింది. పర్షియన్ గల్ఫ్ జలాల మీదుగా పయనిస్తే నౌకలను తగలబెడతామనే బెదిరింపులకు స్వస్తిపలికి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకల రాకపోకలకు హార్మూజ్ జలసంధిని బార్లా తెరుస్తున్నట్లు ఇరాన్ శుక్రవారం ప్రకటించింది. ఈ వార్త వినగానే ప్రపంచదేశాలు చమురుసంక్షోభం బారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకున్నాయి. స్టాక్‌మార్కెట్లకు సైతం కొత్త ఊపొచ్చింది. అమెరికా స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అనూహ్య డిమాండ్‌తో ముందస్తు కొనుగోళ్లతో ముడిచమురు ధర కొండెక్కగా తాజా వార్తతో ధర నేలచూపులు చూసింది.మార్చి నెలలో గరిష్టంగా బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 119 డాలర్లకు పెరగ్గా శుక్రవారం శుభవార్త తర్వాత ఒక్కసారిగా 90 డాలర్ల దిగువకు దిగొచ్చింది. ధర శుక్రవారం ఉదయం 98 డాలర్లు ఉండగా హార్మూజ్ వార్త వెలువడగానే 10 శాతం పడిపోయి 88 డాలర్లకు చేరుకుంది. హార్మూజ్ గుండా నౌకల రాకపోకలు మొదలుకానున్నాయని ఇరాన్ చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వాగతించారు. ‘‘జలసంధిని తెరుస్తున్నామని ఇప్పుడే ఇరాన్ ప్రకటించింది. హార్మూజ్ గుండా రాకపోకలు ఊపందుకోనున్నాయి. థాంక్యూ. అయితే హార్మూజ్‌పై అమెరికా ఆధిపత్యం కొనసాగుతుంది. హార్మూజ్ గుండా ఇరాన్, దాని మిత్రదేశాల నౌకల రాకపోకలను అడ్డుకుంటాం.ఇరాన్‌తో శాంతి ఒప్పందం 100 శాతం పూర్తయి, అమల్లోకి వచ్చేదాకా, యుద్ధం ముగిసేదాకా ఇరాన్‌కు చెందిన నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. ఇరాన్‌తో చర్చల్లో ఇప్పటికే చాలా అంశాల్లో ఏకాభిప్రాయం సాధించాం. లెబనాన్ ప్రస్తావన, దానితో సంబంధం లేకుండానే ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంటాం. అమెరికా సాయంతో ఇరాన్ జలసంధిలోని పాత సముద్ర మందుపాతరలను తొలగిస్తోంది. మరోసారి హార్మూజ్‌ను మూసేయబోమని ఇరాన్ మాకు హామీ ఇచ్చింది. ప్రపంచానికి వ్యతిరేకంగా హార్మూజ్‌ను ఆయుధంగా ఇరాన్ ఉపయోగించడం సాధ్యపడదు’’అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకిరావడంతో హార్మూజ్‌ను తెరుస్తున్నాం.తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉండే ఈ పది రోజులపాటే హార్మూజ్ తెరచి ఉంటుంది’’అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తెలిపారు. హార్మూజ్‌ను తెరవాలంటే తొలుత లెబనాన్‌పై కాల్పులు ఆపేయాలన్న డిమాండ్‌కు ఇజ్రాయెల్, అమెరికా తలొగ్గడంతోనే హార్మూజ్‌ను తెరుస్తున్నట్లు ఇరాన్ చెప్పుకొచ్చింది. దీనిపై అమెరికా, ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి స్పందనా లేదు. పాకిస్తాన్ సాయుధబలగాల సారధి, ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ టెహ్రాన్‌లో ఇరాన్ అగ్రనాయకత్వంతో చర్చలు జరిపిన మరుసటిరోజే హార్మూజ్‌పై ఇరాన్ కీలక ప్రకటన వెలువర్చడం గమనార్హం. క్షేమంగా రవాణాపై సమావేశం మరోవైపు హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో ఉమ్మడిగా పనిచేయాలని డజన్లకొద్దీ దేశాలు కృతనిశ్చయంతో ముందుకెళ్తున్నాయి. ఈ మేరకు శుక్రవారం పారిస్‌లోని దేశాధ్యక్షభవనంలో బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీసహా 30 దేశాల అధినేతలు, 20 అంతర్జాతీయ కూటముల అధ్యక్షులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి జర్మనీ చాన్స్‌లర్ ఫెడ్రిక్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతదితరులు స్వయంగా, ఇతరులు వర్చువల్‌గా హాజరయ్యారు. నాటోపై ట్రంప్ ఆగ్రహం ‘‘ఇప్పుడు హార్మూజ్ జలసంధి వివాదం ముగిసిపోయింది. అంతా అయిపోయాక ఇప్పుడు తీరిగ్గా నాటో కూటమి నుంచి నాకు ఫోన్‌కాల్ వచ్చింది. మీకేమైనా సాయం కావాలంటే చేసిపెడతామని అడిగారు. మీ సాయం నాకు అస్సలు అక్కర్లేదని ముఖంమీదే చెప్పేశా. అవసరమైనప్పుడు సాయపడకుండా ముఖంచాటేశారు. నాటో కేవలం కాగితం పులి’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చించి ఇరాన్‌ను పాక్ ఒప్పించిందని ట్రంప్ ఆ దేశాన్ని పొగిడారు. ‘‘పాకిస్తాన్‌కు, పాక్ గొప్ప ప్రధానికి, ఫీల్డ్ మార్షల్‌కు కృతజ్ఞతలు. ఇద్దరూ గొప్ప వ్యక్తులు’’అని ట్రంప్ ఒక పోస్ట్‌చేశారు. -
ఇరాన్ యురేనియం మా చేతికి
వాషింగ్టన్/దుబాయ్/బీరూట్/ఇస్లామా బాద్: భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక కీలక పోస్ట్ పెట్టారు. ‘‘ఇరాన్ భూగర్భ అణు కేంద్రాల్లోని దాచిపెట్టిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలపై అమెరికా బీ2 బాంబర్లు భారీ బాంబును పడేసి సర్వనాశనం చేశాయి. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయింది. ఆ అణుమట్టి మా చేతికి రాబోతోంది. ఈ మట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుంది. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదు’’అని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్‌గానీ ఇటు ఇరాన్‌గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు మరోదఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధంచేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతంచేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని గురువారమే టెహ్రాన్‌కు చేరుకుని ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం పాక్‌లోని ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా–ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారముంది. కాల్పులవిరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారుచేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌కు వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే, తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తానని ట్రంప్ చెప్పారు. నేరుగా చర్చలొద్దు: హెజ్భొల్లా ఇజ్రాయెల్‌తో నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగకూడదని లెబనాన్ ప్రభుత్వాన్ని హెజ్భొల్లా సాయుధులు హెచ్చరించారు. ‘‘నేరుగా ప్రత్యక్ష చర్చలకు దిగితే దక్షిణ లెబనాన్ సరిహద్దు ఆక్రమిత ప్రాంతాల్లో శాశ్వతంగా తిష్టవేసేందుకు ఇజ్రాయెల్ కుట్ర పన్నుతుంది. అలా జరక్కుండా చూడాల్సిన బాధ్యత మీదే. అసలే మీది అసమర్థ ప్రభుత్వం. అనాలోచితంగా మీరు తీసుకునే నిర్ణయాలు లెబనాన్ భవిష్యత్తును అంధకారంలోకి నెడతాయి’’అని హెజ్భొల్లా పార్లమెంటరీ విభాగ నాయకుడు హసన్ ఫదలల్లాహ్ హెచ్చరించారు. దక్షిణ లెబనాన్‌పై దాడిచేస్తే మేం చూస్తూ ఊరుకోబోమని హెజ్భొల్లా పునరుద్ఘాటించింది. మరోవైపు లెబనాన్– ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ శుక్రవారం ఆనందం వ్యక్తంచేశారు. ‘‘ట్రంప్ ముక్కుసూటి, దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యంచేశారు’’అని షెహబాజ్ పొగిడారు. ఒప్పందానికి తూట్లు! ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య కుదిరిన పదిరోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి శుక్రవారం ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బిన్ట్ జబేయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడిచేసింది.ఈ ఘటనలో ఒక సిరియన్ మూలాలున్న వ్యక్తి చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. దాడిలో కారు, బైక్ ధ్వంసమయ్యాయి. దక్షిణ లెబనాన్‌పై పలు చోట్ల మోర్టార్ దాడులు జరిగాయని లెబనాన్ ఆర్మీ, అమెరికా శాంతిదళ సభ్యులు శుక్రవారం తెలిపారు. దాడులపై ఇజ్రాయెల్ స్పందించలేదు. కానీ కాల్పులవిరమణ వేళ కవి్వంపు చర్యలకు దిగినా తాము దీటుగా దాడులతో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు రాకెట్లు, క్షిపణులతో ఉన్న సాయుధ హెజ్భొల్లాను పూర్తిగా నిర్వీర్యంచేస్తేగానీ తమ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ శుక్రవారం వ్యాఖ్యానించారు. దక్షిణ లెబనాన్‌లోకి చొచ్చుకొచ్చామని, వెనుతిరిగే ప్రసక్తే లేదని తెలిపారు. బలగాల ఉపసంహరణ ఉండబోదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టంచేశారు. కాగా లెబనాన్‌పై ఇప్పటికే అతిగా దాడులుచేశారని, ఇక ఆపేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ శుక్రవారం సూచించారు. తిరిగొస్తున్న స్థానికులు.. లెబనాన్‌లో పదిరోజులపాటే కాల్పులమోత ఆగుతుందని తెల్సి కూడా గతంలో వలసపోయిన వేలాది మంది స్థానికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. లిటానీ నది మీదుగా ఖాస్మియే వంతెన మీదుగా దక్షిణ లెబనాన్‌కు వేలాది మంది జనం కార్లు, వాహనాల్లో బయల్దేరడంతో ఆ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పరుపులు, సూట్‌కేసులు, నిత్యావసర వస్తువులతో వాహనాలు నిండిపోయాయి. మరోవైపు ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 2,294 మంది చనిపోయారని లెబనాన్ ప్రకటించింది. -
నేను హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నా: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించినప్పటికీ, అమెరికా మాత్రం తన బ్లాకేడ్‌ను ఎత్తివేయబోమని ఆయన స్పష్టం చేశారు. ‘హర్మూజ్ తెరిచి ఉంది.. కానీ ఇరాన్‌తో మా లావాదేవీ పూర్తయ్యే వరకు బ్లాకేడ్ కొనసాగుతుంది’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో ప్రకటించారు.ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో కలకలం రేపాయి. ఇరాన్ సముద్ర మార్గం తెరవడం వల్ల చమురు ధరలు తగ్గి ఊరటనిచ్చినా, అమెరికా బ్లాకేడ్ కొనసాగుతుండటం ఉద్రిక్తతలను తగ్గించలేకపోయింది. అమెరికా–ఇరాన్ చర్చలు విజయవంతంగా సాగుతున్నాయి. త్వరలో ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.మరోవైపు అణు అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అధికంగా శుద్ధి చేసిన యురేనియంను మాకు అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఇరాన్‌తో కలిసి భూగర్భంలో దాచిన యురేనియాన్ని తొలగించనున్నాం’అని చెప్పారు. అంతకుముందు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌లో కాల్పుల విరమణ సమయంలో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన తర్వాత అంతర్జాతీయ ముడి చమురు ధరలు 10 శాతం వరకు తగ్గాయి. -
హార్ముజ్ దిగ్బంధం వేళ.. యూఎస్ సంచలన వీడియో విడుదల
ఇరాన్ నౌకాశ్రయాలు, తీరప్రాంతాలు లక్ష్యంగా తాము చేపట్టిన దిగ్బంధం (Blockade) కార్యకలాపాలలో భాగంగా ఓ వాణిజ్య నౌకను అమెరికా నావికాదళ హెలికాప్టర్ పక్కకు మళ్లించిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ షేర్ చేసిన ఈ వీడియోలో యూఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ (DDG 112) నౌకలోని ఒక నావికుడి ఆడియో సందేశం ఉంది. ఒమన్ గల్ఫ్ మీదుగా ఆ డిస్ట్రాయర్ నౌకకు చెందిన హెలికాప్టర్ ఎగురుతున్నట్లు ఈ ఫుటేజీలో కనిపిస్తోంది.ఇరాన్ నౌకాశ్రయాల్లోకి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను అమలు చేస్తున్న క్రమంలో అమెరికా దళాలు ఓ వాణిజ్య నౌకను నియంత్రిస్తున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. కాగా, 10 వేల మంది నావికులు, మెరైన్లు, యుద్దవిమాన పైలట్లు, యుద్ద విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లను హార్మూజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. ‘‘వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లను మొహరించాం. ఏ ఒక్క విదేశీ సరకు రవాణా నౌక హార్ముజ్‌ను దాటడానికి వీల్లేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్లిపోయాయి’’ అని అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డేన్ కెయిన్ ప్రకటించారు.Audio🔊of a Sailor aboard USS Michael Murphy (DDG 112), with video from the guided-missile destroyer’s embarked helicopter flying over the Gulf of Oman, as the U.S. Navy diverts a merchant vessel while enforcing the blockade on ships entering or departing Iranian ports. U.S.… pic.twitter.com/10QxlEoGkk— U.S. Central Command (@CENTCOM) April 16, 2026హార్మూజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తేయకపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీంనేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహీ హెచ్చరించారు. అయితే కాల్పుల విరమణను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రపాయ ఒప్పందానికి వచ్చాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.మరోవైపు, పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. శాంతి చర్చల్లో కీలక పురోగతి దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ అంగీకరించిందని చెప్పారు. ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయన్నారు. శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మాకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించింది. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాం. ఒప్పందం కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో నేనూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పారు. -
ఆయనది పత్తి గింజల కలే!
పశ్చిమాసియా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటనకు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నామని చెప్పిన ఆయన.. అమెరికాకు ఈ డీల్ ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన గాల్లో కోటలు కట్టుతున్నాడంటూ ఇరాన్ మీడియా ఎద్దేవా చేసింది.శుద్ధిచేసిన యురేనియం నిల్వలను తమకు అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గురువారం వైట్‌హౌజ్‌లో ఓ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య సంప్రదింపులు విజయవంతంగా సాగుతున్నాయని.. ఈ ఒప్పందం కుదిరితే అమెరికాకు ఉచితంగా చమురుతో పాటు హర్ముజ్ జలసంధి నుంచి స్వేచ్ఛా రవాణాకు వీలు ఉంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబీ (Islamic Republic of Iran Broadcasting) వెటకారంగా స్పందించింది.ట్రంప్ గాల్లో కోటలు కడుతున్నారంటూ ఆయన మాట్లాడిన వీడియోతో ఐఆర్ఐబీ ఓ పోస్ట్ చేసింది. దీనికి అదనంగా ఓ పర్షియన్ సామెతను ఉటంకించింది. ‘‘ఒంటె పత్తి గింజల గురించి కలలు కంటుంది. కొన్నిసార్లు వాటిని ఒక్కసారిగా మింగేస్తుంది, కొన్నిసార్లు ఒక్కొక్కటిగా తింటుంది. ట్రంప్ కూడా అంతే. ఆయన ఊహాలోకంలో విహరిస్తున్నారు’’ అంటూ సెటైర్ వేసింది.Building castles in the air!Or in Persian we have a similar proverb:'The camel dreams of cottonseed; sometimes gulping it down, sometimes eating it grain by grain!'شتر در خواب بیند پنبهدانهگهی لپلپ خورد گه دانه دانه pic.twitter.com/HA15h1aQVU— IRIB (Islamic Republic of Iran Broadcasting) (@iribnews_irib) April 16, 2026సాధారణంగా.. సాధ్యంకాని విషయాలను కలలు కనే వ్యక్తులను ఎగతాళి చేయడానికి ఈ పర్షియన్ సామెతను వాడుతుంటారు. విశేషం ఏంటంటే.. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ గతంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద ఈ సామెతను ఉపయోగించారు. ఆయన 2026 ఫిబ్రవరి 28న అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆయన తనయుడు మొజ్తాబా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఎన్నికయ్యారు.యురేనియం విషయంలో ట్రంప్‌నకు ఎలాంటి మాట ఇవ్వలేదని ఇరాన్ మీడియా తాజా ప్రకటనతో స్పష్టమవుతోంది. ఆయన ఏవేవో క్లెయిమ్‌లు చేసుకుంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు చెబుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డీల్ కుదిరితే.. పాకిస్థాన్‌కు వెళ్లి, సంతకాల ప్రక్రియలో తానూ భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రంప్ చెబుతున్నారు. అంతేకాదు.. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించేందుకు కూడా తాను సిద్ధమేనని అంటున్నారు. ఈ నెల 22వ తేదీతో ఆ గడువు ముగియనున్న సంగతి తెలిసిందే. -
నాటో కూటమి కథ కంచికేనా?
ఇరాన్ యుద్ధం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన సైనిక కూటమి ‘నాటో’లో అంతర్యుద్ధానికి కారణమవటం ప్రపంచ జియో పొలిటికల్ చదరంగాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నది. తమ దేశాల నౌకా బలగాలను హార్మూజ్ జలసంధి వద్ద మోహరింప చేయాలన్న యూఎస్ అధ్య క్షుడి విజ్ఞప్తిని నాటో దేశాలు తిరస్కరించాయి. తమ దేశాలలోని సైనిక స్థావరా లను వినియోగించటానికి అంగీకరించ లేదు. ఈ యుద్ధం మా (నాటో) యుద్ధం కాదని తేల్చి చెప్పాయి. అమెరికా అధ్యక్షుడు నాటో కూటమిని ‘కాగితపు పులి’గా అభి వర్ణిస్తూ యూఎస్ఏ దాన్నుండి వైదొలుగుతుందని బెదిరించాడు. ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ని (ఇరాన్ యుద్ధాన్ని) సమర్థించని, యూఎస్ఏకు సహాయపడని మిత్ర దేశాలను యూఎస్ఏ రక్షించ బోదని ఆ దేశ రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ హెచ్చరించాడు. ఐరో పాను రక్షించటానికి మాత్రమే నాటో కూటమి ఏర్పడలేదనీ, యూఎస్ ఏను సమర్థించటం కూడా నాటో ప్రధాన విధి అనీ యూఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో అభిప్రాయ పడ్డాడు.ప్రపంచాన్ని శాసించిన శక్తిరెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1949లో పన్నెండు దేశాలతో ఆవిర్భవించిన నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమి ఇటీవల స్వీడన్ చేరికతో 32 దేశాలకు విస్తరించింది. సోవియట్ రష్యాను అడ్డుకోవటానికి యూఎస్ఏ నాయ కత్వంలో ఏర్పడిన ఈ సైనిక–రాజకీయ కూటమి గత 75 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలను శాసించిందనటంలో సందేహం లేదు. ఈ 32 సభ్య దేశాలలో ఏ ఒక్క దేశం మీద దాడి జరిగినా దానిని మొత్తం కూటమి మీద దాడిగా పరిగణిస్తుంది. 32 సభ్య దేశాలే కాకుండా, 40 ఇతర దేశాలతో కూడా ఈ కూటమి సైనిక, వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకున్నది. సోవియట్ రష్యాను నిలువరించటానికి స్థాపించబడిన ‘నాటో కూటమి’ని సోవియట్ విచ్ఛిన్నం తరువాత కొనసాగించాల్సిన ఆవశ్యకత లేదు. రష్యా బలహీనంగా ఉండటాన్ని ఆసరాగా చేసు కొని ఈ కూటమి సోవియట్ ప్రాబల్య ప్రాంతాలలోనికి విస్తరించింది. ఇదే ఉక్రెయిన్ యుద్ధానికి దారి తీసింది. నాటో సభ్య దేశాలలో యూఎస్ఏ నాయకత్వంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేశారు. ఈ స్థావరాలలో అత్యాధునిక యుద్ధ విమానాలు, శత్రు క్షిపణులను ఎదుర్కొనే మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను, అమెరికన్ సైనికులను మోహరించి ఆ యా దేశాలకు యూఎస్ఏ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసింది. సైనిక, గూఢచర్య సమాచారాన్ని, సైబర్ సమాచారాన్ని పంచుకోవటమే కాకుండా మిలిటరీ డ్రిల్స్ నిర్వహిస్తూ ఈ దేశాలపై సోవియట్ యూనియన్ (రష్యా), ఇతర శత్రు దేశాలు కన్నెత్తి చూడకుండా కాపాడుతున్నది.యూఎస్ఏ నీడన ఐరోపా1990వ దశకం నుండి క్రమంగా నాటో దేశాలలో అలసత్వం ప్రవేశించింది. తమ దేశాల సైనిక, రక్షణ బాధ్యతను పూర్తిగా యూఎస్ఏ పైన తోసివేశాయి. తమ రక్షణ ఖర్చులను తగ్గించి, పూర్తిగా సంక్షేమం, అభివృద్ధిపైన దృష్టి పెట్టాయి. జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలకు రష్యా ముప్పుగా కనప డటం ఆగిపోయింది. నాటో కూటమి ఒప్పందం ప్రకారం ప్రతి సభ్య దేశం తన జీడీపీలో కనీసం 2 శాతం రక్షణ రంగంపై ఖర్చు చేయా లనే నిబంధనను ఖాతరు చేయలేదు. మొత్తం రక్షణ వ్యయంలో 65 శాతం యూఎస్ఏ భరిస్తోంది. ఇదే సమయంలో ఈ ఐరోపా దేశాలు తమ తయారీ రంగాన్ని దాదాపుగా చైనాకు అవుట్సోర్సింగ్ చేశాయి. మానవ వనరుల కొరతను ఎదుర్కోవటానికి సిరియా, జోర్డాన్, లెబనాన్, ఈజిప్టు, మొరాకో, అల్జీరియా వంటి దేశాల నుండి చౌక శ్రామికుల వలసలను ప్రోత్సహించాయి. ఇంధన అవసరాలకు రష్యా నుండి చౌకగా వచ్చే గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డాయి. స్థూలంగా పరిశీలిస్తే జర్మనీ, ఫ్రాన్స్, యూకే, ఇటలీ, స్పెయిన్ మొదలగు ఐరోపా దేశాలు గత నాలుగు దశాబ్దా లలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎగుమతి–దిగుమతి వ్యాపారం, విలాస వస్తువుల తయారీ వంటి రంగాల ఆధారంగా ఆర్థిక వ్యవస్థను నిర్మించుకున్నాయి. తక్కువ ఖర్చుతో ఉన్నత జీవన ప్రమాణాలను అను భవిస్తున్నాయి.ట్రంప్ 2025లో అధికారంలోకి రాగానే ‘అమెరికా ఫస్ట్’ నినా దాన్ని అందుకొన్నాడు. నాటో రక్షణ వ్యయంలో కూటమి దేశాలు తమ వంతు వాటాను భరించాల్సిందేనని మెలిక పెట్టాడు. ఐరోపా దేశాల రక్షణ బాధ్యతను మోస్తున్నందుకు ప్రతిఫలంగా ఇరాన్ యుద్ధంలో మద్దతు ఇవ్వాలని పట్టుబడుతున్నాడు. అమెరికా కోణంలో ఆలోచిస్తే ఈ వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. ఇరాన్ యుద్ధం తమ యుద్ధం కాదనేది యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల వాదన. ఇదే కోణంలో ఆలోచిస్తే ఉక్రెయిన్ యుద్ధం కూడా యూఎస్ఏ యుద్ధం కాదు. ఉక్రెయిన్ నాటో సభ్య దేశం కూడా కాదు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఎదుర్కొంటున్నది యూఎస్ఏ సైనిక సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, యూఎస్ఏ ఆర్థిక సహాయమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.మాటలతో మారిన తీరు2003 ఇరాక్ యుద్ధంలో కూడా నాటో దేశాలు పాల్గొనటం విషయంలో ఇదేరకమైన భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. అయిన ప్పటికీ యూకే, స్పెయిన్, ఇటలీ, పోలండ్ తమ సైనికులను యూఎస్ఏకు మద్దతుగా పంపించాయి. ప్రస్తుత ఇరాన్ యుద్ధం వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఇజ్రాయెల్, అమెరికా ఈ యుద్ధాన్ని ప్రారంభించేముందు నాటో దేశాలతో చర్చించలేదు. గ్రీన్‌ల్యాండ్ విషయంలో ఐరోపా దేశాలను ట్రంప్ బేఖాతరు చేశాడు. వ్యక్తిగతంగా ఫ్రాన్స్, జర్మనీ, యూకే దేశాధినేతలను కించ పరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. వలసలను ప్రోత్సహిస్తూ ఐరోపా దేశాలు తమ నాగరికతను నాశనం చేసుకుంటున్నాయని వ్యాఖ్యా నించాడు. ఉక్రెయిన్‌కు సహాయం అందించటంలో యూరోపియన్ యూనియన్‌కు అడ్డుగా వ్యవహరించిన హంగరీ దేశాధినేత విక్టర్ ఓబ్రామ్ను సమర్థించాడు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఓబ్రా మ్కు యూఎస్ ఉపాధ్యక్షుడు వాన్స్ బహిరంగంగా మద్దతు పలి కాడు. అయితే ఈ ఎన్నికల్లో 16 ఏళ్లుగా హంగరీని పాలిస్తున్న ఓబ్రామ్ ఓడిపోయాడు. ఓబ్రామ్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కూడా సన్నిహితుడు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా వైపు హంగరీ మొగ్గు చూపింది. పుతిన్ పరంగా ట్రంప్ మెతక వైఖరిని కొనసాగిస్తున్నాడు. ఇది ఐరోపా దేశాలకు మింగుడుపడటం లేదు. రష్యా నుండి చౌకగా లభించే గ్యాస్ దిగుమతులు ఆగిపోవటంతో ఐరోపా దేశాలు ఖతర్, యూఏఈ, సౌదీ నుండి ఎల్ఎన్జీ దిగుమతులపై ఆధారపడుతున్నాయి. అందువలన హార్మూజ్ జల సంధి కేంద్రంగా జరుగుతున్న ఇరాన్ యుద్ధం కొనసాగటం వాటికి ఇష్టం లేదు. ఈ యుద్ధం కేవలం యూఎస్ఏ–ఇరాన్ మధ్య కాదు. ఇజ్రాయెల్ చేరికతో యుద్ధానికి ‘మతం రంగు’ అలుముకోవటం ఖాయం. ఫ్రాన్స్‌లో 6.7 మిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం జనాభాలో సుమారు 10 శాతం. జర్మనీలో సుమారుగా 5.7 శాతం (4.7 మిలియన్లు) ముస్లిం జనాభా ఉన్నది. ఈ యుద్ధంలో భాగస్వా ములయితే తమ దేశాలలోని ముస్లిం పౌరుల మద్దతు ప్రమాదంలో పడుతుంది. నాటో దేశాలు మారుతున్న పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ బడ్జెట్లను పెంచి, సైనిక సామర్థ్యం వైపు దృష్టి పెడుతు న్నాయి. ఐరోపా దేశాల మధ్య సైనిక సంబంధాలను పటిష్ఠం చేయాలని చూస్తున్నాయి. పారిశ్రామిక రంగాన్ని పునరుజ్జీవనం చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. భారత్, చైనాలతో సన్నిహిత సంబంధాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
‘మా తొలి క్షిపణికే.. మీ నౌకలు ముంచేస్తాం’
టెహ్రాన్: మా మొదటి క్షిపణులకే మీ ఓడలు మునిగిపోతాయంటూ హార్ముజ్ జలసంధి విషయంలో అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని నియంత్రించేందుకు అమెరికా ప్రయత్నిస్తే.. ఆ నౌకలను ఇరాన్ ధ్వంసం చేస్తుందని ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ సైనిక సలాహాదారుడు మొహ్సెన్ రెజాయి హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణకు ఈ జలసంధి కేంద్ర బిందువుగా మారింది. మొహ్సెన్ రెజాయీ.. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ హెచ్చరికలు చేశారు. సైనిక దుస్తుల్లో ఉన్న ఆయన మాట్లాడుతూ.. మిస్టర్ ట్రంప్.. హార్ముజ్ జలసంధికి పోలీసు కావాలనుకుంటున్నారు. ఇది నిజంగా మీ పనేనా? అమెరికా వంటి శక్తివంతమైన సైన్యం చేసే పని ఇదేనా? మీ ఓడలు మా మొదటి క్షిపణులకే సముద్రంలో మునిగిపోతాయి" అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌లో హార్డ్లైనర్గా పేరున్న రెజాయీ.. ఒకవేళ అమెరికా ఇరాన్‌పై భూతల దాడికి దిగితే.. తాము వేలమందిని బందీలుగా పట్టుకుంటామని.. ప్రతి బందీకి ఒక బిలియన్ డాలర్లు వసూలు చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కాల్పుల విరమణను పొడిగించడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో జరిగిన మొదటి రౌండ్ చర్చలకు ఇరాన్ తరపున పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వం వహించారు. అయితే ఆదివారం ఆ చర్చలు విఫలమయ్యాయి. తిరుగు ప్రయాణంలో గాలిబాఫ్.. ట్రంప్‌ను ఉద్దేశించి, ‘‘మీరు పోరాడితే.. మేము కూడా పోరాడతాం" అని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి చివరలో అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై వైమానిక దాడులు చేసి.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీని చంపిన తర్వాత ఆరు వారాల పాటు యుద్ధం కొనసాగింది. ప్రస్తుతం రెండు వారాలుగా తాత్కాలిక కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో వాషింగ్టన్- టెహ్రాన్ మధ్య చర్చలు విఫలమవడంతో ఇరాన్ ఓడరేవులన్నింటినీ దిగ్బంధిస్తామని అమెరికా సైన్యం గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిని ఇరాన్ చట్టవిరుద్ధమంటూ సముద్రపు దొంగతనంగా అభివర్ణించింది.కేవలం 34 కిలో మీటర్ల వెడల్పు ఉన్న ఈ జలసంధి ద్వారా ప్రపంచ సముద్ర చమురు వ్యాపారంలో 20 శాతం జరుగుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఖతార్ వంటి దేశాల ఇంధన ఎగుమతులకు ఇది కీలక మార్గం. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని దాదాపుగా అడ్డుకుంది. కేవలం చైనా వంటి మిత్రదేశాల నౌకలను మాత్రమే అనుమతిస్తోంది. -
యుద్ధం ముగిసినట్టే..!
వాషింగ్టన్/దుబాయ్/ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో యుద్ధం దాదాపుగా ముగిసినట్టేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో సాయుధ పోరుకు అతి త్వరలో తెర పడుతుందని బుధవారం ఫాక్స్ న్యూస్ వార్తా సంస్థకు వెల్లడించారు. కనుక చమురు ధరలు త్వరలోనే భారీగా దిగి రానున్నాయని జోస్యం చెప్పారు. మరో రెండు రోజుల్లో ప్రపంచం అద్భుతాలను చవిచూడనుందని అమెరికా, ఇరాన్ రెండో దఫా చర్చలను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. కానీ ఆ వెంటనే గల్ఫ్ ప్రాంతానికి మరో 10 వేల మంది అదనపు సైనికులను పంపుతూ అమెరికా రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది! వాషింగ్టన్ పోస్ట్ వార్తా సంస్థ ఈ మేరకు వెల్లడించింది. దీనికి తోడు చర్చలు తిరిగి ప్రారంభం కావాలంటే ఇరాన్‌కు ట్రంప్ తాజాగా రెండు షరతులు విధించారు. హార్మూజ్ జలసంధిని తక్షణం పూర్తిస్థాయిలో తెరవాలని, చర్చల సందర్భంగా ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునేందుకు ఇరాన్ ప్రతినిధి బృందానికి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) పూర్తి అధికారాలివ్వాలని డిమాండ్ చేశారు. దాంతో యుద్ధానికి త్వరలో తెర పడనుందన్న ట్రంప్ ప్రకటన వాస్తవ రూపు దాల్చడం అనుమానాస్పదంగా మారింది. గల్ఫ్ ప్రాంతంలో ఇప్పటికే 50 వేల మంది అమెరికా సైనికులున్న విషయం తెలిసిందే. అమెరికా నావికా దళం ఆధ్వర్యంలో హార్మూజ్ జలసంధి, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం కొనసాగుతూనే ఉంది. ఇందుకు ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్రం, ఎర్ర సముద్రంలో వర్తక మార్గాలన్నింటినీ దిగ్బంధిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. లెబనాన్‌పై భీకర దాడులు టైర్ (లెబనాన్): లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగింది. మంగళవారం ఇరు దేశాల నడుమ వాషింగ్టన్లో చర్చలు మొదలవడం తెలిసిందే. అయినా బుధవారం తీర నగరం టైర్‌పై క్షిపణులు, డ్రోన్లు, బాంబులతో విరుచుకుపడింది. దాంతో ఎటు చూసినా కుప్పకూలిన భవనాలే దర్శనమిచ్చాయి. వీధులన్నీ వాటి శిథిలాలతో నిండిపోయాయి. దాడుల్లో పౌరులు భారీ సంఖ్యలో మరణించినట్టు లెబనాన్ పేర్కొంది.బుర్జ్ అల్ అరబ్ హోటల్ మూత ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటైన దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ 18 నెలల పాటు మూతబడనుంది. యుద్ధం ప్రాంరంభంలో ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ హోటల్ తీవ్రంగా దెబ్బ తిన్నది. దాంతో మరమ్మతుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు. గత 26 ఏళ్లలో ఈ హోటల్ మూతబడటం ఇదే తొలిసారి. ఇది ప్రపంచంలోనే ఏకైక సెవన్ స్టార్ కావడం విశేషం!ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోనని చైనా చెప్పింది: ట్రంప్ ఇరాన్‌కు ఇకపై ఆయుధాలు ఇవ్వబోనని చైనా అంగీకరించినట్టు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన లేఖకు రాసిన ప్రత్యుత్తరంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ మేరకు హామీ ఇచ్చారన్నారు. అంతేగాక అమెరికా హార్మూజ్ జలసంధిని తెరవనుండటంపై చైనా ఎంతో సంతోషం వెలిబుచ్చిందని కూడా చెప్పుకొచ్చారు! ‘‘త్వరలో నేను చైనా వెళ్తున్నా. ప్రెసిడెంట్ జిన్‌పింగ్ గాఢమైన ఆలింగనంతో నన్ను స్వాగతించనున్నారు’’అని ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయ అధికార ప్రతినిధి ఖండించారు. ఇరాన్‌కు చైనా ఎప్పుడూ ఆయుధాలివ్వలేదన్నారు.ఇరాన్‌కు పాక్ బృందం అమెరికా, ఇరాన్ నడుమ రెండో దఫా చర్చలకు పరిస్థితిని సానుకూలం చేసే ప్రయత్నాల్లో భాగంగా సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ సారథ్యంలోని పాక్ ప్రతినిధి బృందం బుధవారం టెహ్రాన్ చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులతో మంతనాలు జరిపింది. రెండో దఫా చర్చలకు ఇస్లామాబాద్‌లో ఇప్పటికే ముమ్మర ఏర్పాటు జరుగుతున్నాయి. -
అందుకు చైనా అంగీకరించింది.. ట్రంప్ ఆసక్తికర పోస్ట్
హర్మూజ్ జలసంధి దిగ్బంధనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్‌ను శాశ్వతంగా తెరిచి ఉంచుతాం.. దీంతో చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుంది. మా నిర్ణయం పట్ల చైనా సంతోషంగా ఉంది. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వబోమని చైనా చెప్పింది.’’ అంటూ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ కీలకమైన జలసంధి ఇకపై ఎన్నడూ మూతపడదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అయితే, తాము ఇరాన్‌కు ఎలాంటి సైనిక సహకారం అందించడం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గత కొన్ని రోజులుగా పదేపదే ఖండిస్తోన్న సంగతి తెలిసిందే. చైనా చాలా కాలంగా ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తోందని.. క్షిపణుల తయారీలో ఉపయోగపడే ద్వంద్వ-వినియోగ పారిశ్రామిక భాగాలను సరఫరా చేయడం ద్వారా ఇరాన్‌ను ప్రోత్సహిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.కాగా, పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది.మరోవైపు, రెండో విడత చర్చలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ఇరాన్‌తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని.. త్వరలోనే ముగుస్తుందని నేను భావిస్తున్నాన్నారు. అయితే, ఇరాన్‌తో సంఘర్షణలో అమెరికా పని ఇంకా ముగియలేదు...కానీ, యుద్ధం కారణంగా ఇరాన్ భారీగా నష్టపోయింది. నేను వెళ్లిపోతే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు సమయం పడుతుంది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే వారిని సర్ అని పిలవాల్సి వచ్చేంది. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు. మా పని ఇంకా పూర్తి కాలేదు. ఏం జరుగుతుందో చూద్దాం. వారు ఒక ఒప్పందం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
అమెరికా చమురు దిగ్బంధంపై చైనా వార్నింగ్
-
ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ
ఇరాన్ యుద్ధంలో అమెరికాకు కాస్ట్లీ దెబ్బ తగిలింది. ఈ దేశానికి చెందిన అత్యంత విలువైన డ్రోన్ ఒకటి ప్రమాదానికి గురైంది. అమెరికా అధికారిక ప్రకటనతో ఈ విషయం ధృవీకరణ అయ్యింది. హర్ముజ్ జలసంధిలో గల్లంతైన ఆ డ్రోన్ విలువ రూ.22,000 కోట్లుగా తేలింది.అమెరికా నౌకాదళం హర్ముజ్ జలసంధిలో అత్యాధునిక డ్రోన్ ఎంక్యూ ఫోర్సీ(MQ-4C) ట్రిటాన్‌తో నిఘా నిర్వహిస్తోంది. దీని విలువ 238 మిలియన్ డాలర్లు. ఈ కాస్ట్లీ డ్రోన్ ప్రమాదాన్ని ‘క్లాస్ A మిషప్’గా నమోదు చేశారు. ఈ ఘటన ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన మరుసటిరోజే (ఏప్రిల్ 9) జరిగింది.అధికారుల వెల్లడించిన ప్రకారం.. డ్రోన్ 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 10,000 అడుగుల కిందకు పడిపోయింది. VVPE804 అనే కాల్‌సైన్‌తో మూడు గంటల సాధారణ మిషన్‌లో ఉన్న ఈ డ్రోన్ అకస్మాత్తుగా 7700 ఎమర్జెన్సీ కోడ్ ప్రసారం చేసింది. ఇది సాధారణంగా విమానంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ఇచ్చే సంకేతం. ఆ అత్యవసర సంకేతం ఇచ్చిన తర్వాత అది కనపడకుండా పోయింది. అది హర్ముజ్‌లో గల్లంతైనట్లు అధికారికంగా ధృవీకరించారు.MQ-4C ట్రిటాన్ అమెరికా నౌకాదళంలో అత్యంత ఆధునిక డ్రోన్లలో ఒకటి. దీన్ని అధిక ఎత్తులో, దీర్ఘకాలిక మిషన్ల కోసం రూపొందించారు. సముద్రంపై ఎక్కువసేపు పర్యవేక్షించేందుకు, సైనిక కదలికలపై నిఘా కోసం దీనిని ఉపయోగిస్తున్నారు. అమెరికాకు చెందిన నార్త్రోప్ గ్రుమ్మాన్ లిమిటెడ్ సర్వీసెస్‌గా వీటిని తయారు చేసింది. మొత్తం 68 డ్రోన్లు ఫ్లస్ 2 ప్రోటోటైపులను అమెరికా సైన్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటిదాకా 48 డ్రోన్లను రంగంలోకి దించింది. మరో విశేషం ఏంటంటే.. ఆస్ట్రేలియా కూడా నాలుగు డ్రోన్లను ఆర్డర్ చేసింది. అయితే తాజా డ్రోన్ నష్టం అమెరికా నౌకాదళానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు. -
24 గంటల్లో హార్ముజ్ దాటిన 20 నౌకలు
-
అదే జరిగితే.. భారత్‌కు ఫ్లస్, చైనాకు చుక్కలే!
పశ్చిమాసియా యుద్ధంలో హర్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. జలసంధిని పూర్తిగా తమ కంట్రోల్లో ఉండాలని.. టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. అయితే హర్ముజ్‌లో స్వేచ్చగా నౌకా రవాణా జరగాలని అమెరికా సహా పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో హర్ముజ్‌ను ఇరాన్ మూసివేయగా.. దిగ్బంధనంతో వచ్చిపోయే నౌకలకు చుక్కలు చూపిస్తోంది అమెరికా. ఇదిలా ఉండగానే.. మరో జలసంధిపై డొనాల్డ్ ట్రంప్ కన్నేసినట్లు చర్చ మొదలైంది.దక్షిణాసియా వర్తకానికి కీలకమైన మలక్కా జలసంధిపై అమెరికా దృష్టిసారించినట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇటీవల ఇండోనేషియాతో అగ్రరాజ్యం చేసుకున్న రక్షణ ఒప్పందం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా సైనిక విమానాలకు ఇండోనేషియా గగనతలంలో విస్తృత ప్రవేశం లభించనుంది. దీని ద్వారా మలకా జలసంధిపై కూడా అమెరికా పర్యవేక్షణ, ఆపరేషనల్ సామర్థ్యం పెరగనుంది..మలక్కా జలసంధి (Strait of Malacca) అనేది ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే, వ్యూహాత్మకంగా కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటి. హిందూ మహాసముద్రాన్ని పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతూ.. ఇండోనేషియా సుమత్రా దీవి పశ్చిమ భాగం, మలేషియా ద్వీపకల్పం తూర్పు భాగం మధ్య సుమారు 930 కిలోమీటర్లు పొడవున విస్తరించి ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఇది ఆసియా–పసిఫిక్ వాణిజ్యానికి ప్రధాన ద్వారం.చైనాకు..మలక్కా జలసంధి ప్రపంచ వాణిజ్యంలో కీలక మార్గం. ప్రపంచ వాణిజ్యంలో సుమారు 25 నుంచి 40 శాతం దాకా సరుకు రవాణా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. మిడిల్ ఈస్ట్ నుంచి తూర్పు ఆసియా దేశాలకు వెళ్లే చమురు, గ్యాస్‌లో పెద్ద భాగం ఈ మార్గం ద్వారా చేరుతుంది. చమురు, గ్యాస్‌తో పాటు ఎలక్ట్రానిక్స్, పరిశ్రమ ఉత్పత్తులు, తయారీ సరుకులు ఈ మార్గం ద్వారా తరలించబడతాయి. ముఖ్యంగా చైనా వంటి తూర్పు ఆసియా దేశాలు ఈ మార్గంపై అధికంగా ఆధారపడుతున్నాయి.మలక్కా డైలమాచైనా తన చమురు, గ్యాస్, ముడి పదార్థాల దిగుమతులలో ఎక్కువ భాగాన్ని మలక్కా జలసంధి ద్వారా పొందుతుంది. ఈ మార్గం ఆగిపోతే లేదంటే అడ్డంకులు ఎదురైతే చైనా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం మలక్కా జలసంధిపై అధికంగా ఆధారపడటం.. తద్వారా ఏర్పడిన బలహీనత వల్ల మలక్కా డైలమా అనే పేరు ముద్రపడింది. 2003లో అప్పటి చైనా అధ్యక్షుడు హు జింటావో నోటి నుంచి ఈ పదం పుట్టుకొచ్చింది.చైనాకు చుక్కలేఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు సరఫరాలో సుమారు 80 శాతం మలకా జలసంధి ద్వారా చైనాకు చేరుతుంది. కాబట్టి ఈ జల సంధిపై అమెరికా తన ఆధిపత్యం పెంచుకుంటే మాత్రం చైనాకు చుక్కలు గ్యారెంటీ. అలాగే.. మలక్కా జలసంధి కొన్ని ప్రాంతాల్లో వెడల్పు కేవలం 3 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. ఈ చోక్ పాయింట్లను గనుక ఏదైనా దేశం నియంత్రించినా.. చైనాకు కష్టమే. ఈ మార్గం ఆగిపోతే చైనాకు ఇంధన సంక్షోభం తలెత్తుతుంది.భారత్‌కు ఫ్లస్భారతదేశ వాణిజ్యంలో మలక్కా జల సంధి కీలక పాత్రే పోషిస్తోంది. మలక్కా జలసంధి పశ్చిమ ప్రవేశద్వారం దగ్గరే భారత అండమాన్–నికోబార్ దీవులు ఉన్నాయి. క్యాంప్‌బెల్ బేలోని భారత వాయుసేన స్థావరం, నౌకాదళ గస్తీ సముద్ర మార్గాలపై పర్యవేక్షణ చేస్తోంది. కాబట్టి ఈ జల సంధిలో అమెరికా చేసే ఏ ప్రయత్నానికైనా భారత్ సహకారం అవసరం. ఇది ఇండో–పసిఫిక్ రీజియన్‌లో భారత్ ప్రాధాన్యాన్ని పెంచడంతో పాటు చైనా విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు భారత్‌కు ఓ మంచి అవకాశం కల్పిస్తుంది. అంత వీజీ కాదుమలక్కా జలసంధిపై అమెరికా ఆధిపత్యం ప్రదర్శించడం అంత సలువేం కాదు. నిజానికి ఈ ప్రయత్నం కొత్త కూడా కాదు. గతంలో చైనాను దృష్టిలో పెట్టుకుని అమెరికా చాలా ప్రయత్నాలే చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ యుద్ధం.. ఇరాన్‌కు చైనా మద్దతు.. ఇరాన్‌కు చైనా ఆయుధాల సరఫరా.. ఇవన్నీ ట్రంప్‌కు కోపం తెప్పించాయి. అయితే.. మలక్కాపై ఆధిపత్యానికి అమెరికాకు ప్రాంతీయ సవాళ్లు ఎదురు కావొచ్చు. ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ కలిసి మలక్కా జలసంధిని నిర్వహిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సింగపూర్ పోర్టు మౌలిక సదుపాయాలు, గ్లోబల్ షిప్పింగ్ సేవలలో ఆధిపత్యం కారణంగా ఈ మార్గం స్థిరత్వం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకం. పలు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉన్నందున అమెరికా విస్తృత పాత్రకు ఆటంకాలు ఏర్పడొచ్చు. అయితే ఇప్పటికిప్పుడు కాకపోయినా చైనాను భవిష్యత్తులోనైనా ఇరకాటంలో పడేసే అంశమే. -
మెలోనీతో స్నేహానికి బీటలు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య స్నేహ బంధానికి బీటలు వారుతోంది. ఇరాన్ యుద్ధంలో అగ్రరాజ్యానికి ఇటలీ మద్దతు ఇవ్వకపోవడం ఒక కారణం కాగా.. పోప్ లియో వ్యవహారంలో ఆమె స్పందించిన తీరు వాళ్లిద్దరి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇరాన్ యుద్ధంలో అమెరికాకు మద్దతు ప్రకటించాలని ట్రంప్ ఇటలీపై ఒత్తిడి తెచ్చారు. అయినా ఆ దేశ ప్రధాని మెలోనీ అందుకు తలొగ్గలేదు. ఇటలీని ఈ యుద్ధంలోకి లాగడం తన దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆమె భావించారు. ఇరాన్ యుద్ధంలో తమ దేశం పాల్గొనబోదని.. ఇది ప్రపంచంలోనే పెద్ద సంక్షోభమని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా ఏప్రిల్ 14న ఇజ్రాయెల్‌తో తమ దేశానికి ఉన్న రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.ఈలోపు పోప్ లియో XIV ఇరాన్ యుద్ధంపై స్పందించడం.. ఆయనకు ట్రంప్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. ఇరాన్ యుద్ధంపై పోప్ మాట్లాడటం తగదని, ఆయనకు పరిస్థితులు అర్థం కావడం లేదని ట్రంప్ ఘాటుగా విమర్శించారు. అయితే ట్రంప్ పోప్‌పై చేసిన వ్యాఖ్యలను మెలోనీ తీవ్రంగా ఖండించారు. ఈ రెండు పరిణామాలు ట్రంప్‌నకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ యుద్ధం, మధ్యధరా ప్రాంతంలో ఇంధన భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య మెలోనీ ఏమాత్రం ధైర్యం చూపడం లేదని.. ఇటలీని రక్షించడంలో ఆమె విఫలమవుతున్నారని ట్రంప్ ఆరోపించారు. ‘‘ఇరాన్‌కు అవకాశం వస్తే ఇటలీని రెండు నిమిషాల్లో పేల్చేస్తుంది. ఇటలీకి హర్ముజ్ జలసంధి ద్వారా చమురు వస్తున్నా.. యుద్ధంలో పాల్గొనడానికి ఆమె నిరాకరించడం ఆశ్చర్యం కలిగించింది’’ అని వ్యాఖ్యానించారాయన. ఇక మీదట యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలను తామే చూసుకోవాలని.. అమెరికా సైన్యం ఇతరుల కోసం పోరాడబోదని కుండబద్దలు కొట్టారు. అదే సమయంలో.. పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంగీకారయోగ్యం కావని మెలోనీ అనడంపై స్పందిస్తూ.. వాస్తవానికి పోప్ కాదు మెలోనీనే కరెక్ట్ పర్సన్ కాదంటూ ట్రంప్ ఓ కామెంట్ చేశారు. జార్జియా మెలోనీ 2022 అక్టోబర్ నుండి ఇటలీ ప్రధానిగా కొనసాగుతున్నారు. అమెరికా–యూరప్ మధ్య వారధిగా ఆమెకంటూ ఓ పేరు ముద్రపడింది. పైగా ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక.. ఆమె ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఆ మధ్య ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం వేళ ఆమెను పొగడ్తలతోనూ ముంచెత్తారు. అయితే పశ్చిమాసియా సంక్షోభం ఇప్పుడు వీళ్ల మధ్య చిచ్చు రాజేసినట్లైంది. -
హర్మూజ్ జలసంధిని మూసివేస్తారా.. ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్
టెహ్రాన్ : శాంతి చర్చలు విఫలమవడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతున్నాయి. ఫలితంగా పశ్చిమాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ స్టైల్లో అభి తొహ్ సిర్ఫ్ ట్రైలర్ హాయ్, పిక్చర్ అభి బాకీ హాయ్ అంటూ ట్రంప్‌నకు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. అందులో ఇరాన్ నావికాదళం ఉపయోగించే చిన్న, వేగవంతమైన క్షిపణి పడవల గురించి ప్రస్తావిస్తూ.. అవును, ఆ వేగవంతమైన క్షిపణి పడవలు వేడెక్కుతున్నాయి. ఇరాన్ నావికాదళం ‘నాశనమైపోయింది’ అని ట్రంప్ పదేపదే చెప్పడం విచిత్రంగా ఉంది. ఇప్పుడు క్షిపణుల సమూహం మిమ్మల్ని ఎంత త్వరగా కట్టడి చేయగలదో తెలుసుకోబోతున్నారు’ అని పేర్కొంది. పశ్చిమాలో యుద్ధం కారణంగా ఇరాన్ రూ.25 లక్షల కోట్లు నష్టపోయింది. ఇరాన్‌ను మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేలా అమెరికా హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించింది. ఇందుకోసం ఇరాన్ పోర్టులు, తీరప్రాంతాల చుట్టూ 15కు పైగా యుద్ధ నౌకలను మోహరించింది. అమెరికా నౌకాదళానికి అత్యంత శక్తివంతమైన యూఎస్ఎస్ అబ్రహీం లింకన్ కూడా ఇరాన్ తీరప్రాంతంలో ఉంది. పరిస్థితులు ప్రతికూలమైతే దాడికి దిగే అవకాశం ఉంది. ఇరాన్ అణ్వాయుధాల జోలికి వెళ్లదని, వాటి తయారీకి అవసరమైన పరికరాలను సేకరించబోదని వారి నుంచి మాకు ఒక కచ్చితమైన హామీ కావాలి. ఇదే ట్రంప్ ప్రధాన లక్ష్యం. అందుకు అనుగుణంగా పాకిస్థాన్‌లో ఇరాన్ -అమెరికా దేశాలు శాంతి చర్చలు జరిపాయి. ఆ చర్చలు విఫలం కావడంతో ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయాన్ని తగ్గించే లక్క్ష్యంగా అమెరికా హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో చమరు కోసం ఇరాన్‌కు వెళ్లే నౌకలు సముద్రంలోని నిలిచిపోతాయి. తద్వారా చమురు అమ్ముకుని ఆర్థికంగా బలంగా ఉన్న ఇరాన్‌కు అమెరికా తీసుకుంటున్న చర్యలతో సతమతమవుతోంది. -
అమెరికాకు చైనా వార్నింగ్ : నాలుగు కీలక ప్రతిపాదనలు
పశ్చిమ ఆసియా (Middle East) సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చైనా దౌత్యపరమైన జోక్యాలను ముమ్మరం చేసింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తాజాగా నాలుగు అంశాల ప్రణాళికను (Four-point framework) ప్రతిపాదించారు. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చలలో పురోగతి స్తంభించిపోయిన నేపథ్యంలో,ఉద్రిక్తతలను తగ్గించి, స్థిరత్వాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా చైనా ఈ ప్రతిపాదన చేసింది. చైనా నాలుగు సూత్రాల ప్రణాళిక,కీలక అంశాలుజిన్హువా వార్త నివేదిక ప్రకారం అమెరికా నేతృత్వంలోని జోక్యాలకు భిన్నంగా, పశ్చిమ ఆసియాలో తన దౌత్యపరమైన ఉనికిని విస్తరించుకోవడానికి చైనా చేస్తున్న విస్తృత ప్రయత్నాలకు ఈ ప్రతిపాదనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. యుఏఈ నాయకుడు ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ప్రణాళికను సమర్పించారు.శాంతియుత సహజీవనం , సంయమనంసార్వభౌమాధికారానికి గౌరవం ఇవ్వడం మరో కీలకమైన స్తంభమని పేర్కొంది. దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని ఈ ప్రతిపాదన నొక్కి చెబుతోంది. ప్రాంతీయ శక్తులన్నీ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని చైనా కోరుతోంది. గొడవలను పక్కన పెట్టి దేశాల మధ్య పరస్పర అవగాహన పెరగాలని సూచించింది.సార్వభౌమాధికారానికి గౌరవంఏ దేశం కూడా ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని చైనా నొక్కి చెప్పింది. ప్రతి దేశం స్వయంప్రతిపత్తిని గౌరవించాలని ఈ ప్రణాళికలో చైనా పేర్కొందిభద్రతతో కూడిన ఆర్థిక అభివృద్ధిసుస్థిరమైన శాంతి కావాలంటే ఆర్థిక వృద్ధి కూడా అంతే ముఖ్యమనిజిన్పింగ్ అభిప్రాయపడ్డారు. భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిని కలిపి ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం దేశాల మధ్య సహకారం పెరగాలని ఆయన పిలుపునిచ్చారు.అంతర్జాతీయ చట్టాల అమలుచివరి అంశం అంతర్జాతీయ చట్టంపై కేంద్రీకృతమై ఉంది. అంతర్జాతీయ నిబంధనలను అందరూ సమానంగా పాటించాలని చైనా స్పష్టం చేసింది. ప్రపంచ నిబంధనలనుఎంపిక చేసుకుని పాటించడంపై జిన్‌పింగ్ హెచ్చరించారు. వాటిని అమలు చేయడంలో స్థిరత్వం పాటించాలని పిలుపు నిచ్చారు. "అంతర్జాతీయ చట్ట పాలనను కాపాడాలి. 'మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాడుకోవడం, లేనప్పుడు వదిలేయడం' కుదరదని చైనా స్పష్టం చేసింది. ప్రపంచం తిరిగి అరాచక చట్టాల వైపు మళ్లడానికి అనుమతించలేం అంటూ ఆయన ఘాటుగా స్పందించారు. ఇదీ చదవండి: రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్‌నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!అదే సమయంలో, హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిణామాలపై చైనా తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ వ్యూహాత్మక జలమార్గంలో ఆంక్షలు విధించవద్దని చైనా అమెరికాను గట్టిగానే హెచ్చరించింది. ఇరాన్‌తో తమ సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని, ఇరాన్‌తో తమకు ఉన్న వాణిజ్య, ఇంధన సంబంధాలను కొనసాగిస్తామని చైనా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.పశ్చిమాసియా నుండి వచ్చే ఇంధనంపై చైనా ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే ఆ ప్రాంతంలో స్థిరత్వం ఉండటం చైనా ఆర్థిక ప్రయోజనాలకు అత్యవసరం.అమెరికా నాయకత్వంలోని దౌత్యం విఫలమవుతున్న తరుణంలో, తాము ఒక నమ్మకమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చైనా ప్రయత్నిస్తోంది. ఈ ప్రతిపాదనలకు ఆదరణ లభిస్తుందా ? ఇతర దేశాల నుండి ఎలాంటి మద్దతు లభిస్తుందో వేచి చూడాలి. ఇదీ చదవండి: పండ్లు, చిప్స్ ప్యాకెట్లతో పెళ్లి కారు ముస్తాబు : నెటిజన్లు షాక్ -
ప్రపంచ మార్కెట్లు షాక్, భగ్గుమన్న చమురు ధరలు
-
ఇరాన్ నౌకపై అమెరికా కన్ను
-
హర్ముజ్ బ్లాకేడ్‌తో భారత్‌పై తీవ్ర ప్రభావం!
హర్ముజ్ జలసంధిని అమెరికా సైన్యం దిగ్బంధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. సౌదీ అరేబియా సహా పలు దేశాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రిక్వెస్ట్‌లు చేస్తున్నాయి. చైనా సహా ఇంకొన్ని దేశాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి. అదే సమయంలో.. ఈ బ్లాకేడ్ ప్రభావంతో ప్రపంచ ఇంధన మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ పరిణామం భారత్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపే చాన్స్ కనిపిస్తోంది.గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర ప్రస్తుతం 99 డాలర్ల వద్ద ఉంది. హర్ముజ్ బ్లాకేడ్ కొనసాగితే అది 150 డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ గల్ఫ్ దేశాలపై అధికంగా ఆధారపడుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల దిగుమతి బిల్లులు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, వాణిజ్య లోటు పెరిగే అవకాశం లేకపోలేదు. పైగా జలసంధి ద్వారా రోజుకు 12 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా జరుగుతుంది. ఈ మార్గం మూసుకుపోతే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తీవ్ర తరం కావొచ్చు. అలాగే పెరిగిన ఇంధన ధరలు నేరుగా రవాణా, విద్యుత్, ఆహార ధరలపై ప్రభావం చూపెట్టొచ్చు. హర్ముజ్ బ్లాకేడ్పై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది.అదంతా ఉత్త ప్రచారమే!భారత నౌకలకు హర్ముజ్ జలసంధి మార్గాన్ని ఇరాన్ మూసేసిందని ఒక ప్రచారం నడుస్తోంది. అయితే అది ఉత్తదేనని ఇరాన్ అంటోంది. న్యూఢిల్లీలో ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘భారతదేశం మా స్నేహపూర్వక దేశం. హర్ముజ్ మార్గం భారత నౌకలకు తెరిచే ఉంటుంది. అమెరికా ఈ బ్లాకేడ్‌తో తప్పు లెక్కలు వేసింది. ఈ చర్య అంతర్జాతీయ చట్టాలను ధ్వంసం చేస్తుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది’’ అని హెచ్చరించారు.మొత్తంగా, హోర్ముజ్ బ్లాకేడ్ భారత్‌కు ఇంధన భద్రతా సంక్షోభం తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ఇరాన్ ఇచ్చిన హామీ కొంత ఉపశమనం కలిగిస్తోంది. కానీ ధరల పెరుగుదల, సరఫరా అంతరాయం వంటి సమస్యలు భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం లేకపోలేదు. -
హర్ముజ్ బ్లాకేడ్.. అమెరికాకు చైనా తీవ్ర హెచ్చరికలు
ఇరాన్ పోర్టులకు నౌకలు చేరకుండా హర్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించింది. సముద్రంలో భారీ నౌకలను మోహరించి పహారా కాస్తోంది. ఒకవైపు అమెరికా సైన్యం.. మరోవైపు ఇరాన్ సైన్యం మోహరింపుతో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొన్నాయి. అయితే ఈ పరిణామం మరోవైపు అమెరికా-చైనాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. జలసంధిపై అమెరికా నేవీ బ్లాకేడ్ ప్రారంభించడంతో చైనా తీవ్రంగా స్పందించింది. ఇరాన్‌తో తప్ప ఒప్పందాలను అడ్డుకోవడం ఏమాత్రం సరికాదని వ్యాఖ్యానించింది. చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ మీడియా ద్వారా మాట్లాడుతూ.. ‘‘మాకు ఇరాన్‌తో వాణిజ్య, ఇంధన ఒప్పందాలు ఉన్నాయి. మా వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకోవద్దని మేము ఆశిస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే పరిణామాలు మరోలా ఉంటాయి’’ అని హెచ్చరించారు. అయితే అమెరికా చర్యను వ్యతిరేకించిన ఆయన.. హర్ముజ్ చైనాకు తెరిచే ఉంటుందని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం బ్లాకేడ్ ప్రకటన చేశారు. ఇరాన్ పోర్టులకు వచ్చే–వెళ్లే అన్ని నౌకలను అమెరికా సెంట్కామ్ తనిఖీ చేస్తుందని.. అనుమతి లేకుండా ప్రవేశించే నౌకలను అడ్డుకోవడం, దారి మళ్లించడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం నుంచే హర్ముజ్ దిగ్బంధనం ప్రారంభమైంది. అయితే ఈ బ్లాకేడ్ చైనీస్ యువాన్(కరెన్సీ) వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా కూడా ఉండి ఉండొచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హర్ముజ్ జలసంధి ద్వారా చైనాకు 40 శాతం చమురు, 30 శాతం ఎల్ఎన్జీ సరఫరా జరుగుతోంది. అందుకే హర్ముజ్ గూండా నిర్బంధం లేని రవాణా అంతర్జాతీయ సమాజానికి అవసరమని చైనా మొదటి నుంచి చెబుతోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణకు మద్దతు కూడా ప్రకటించింది. అమెరికా, చైనా ఇరాన్‌పై విభిన్న వైఖరులు అవలంబిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ జరిపిన దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. ఈ దాడుల్ని చైనా ఖండించింది. అయితే రహస్యంగా ఈ యుద్ధంలో చైనా నుంచి ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా అవుతున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 50% టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. చైనా మాత్రం తాము ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని మొత్తుకుంటోంది. -
War Updates: అమెరికా, ఇరాన్ శాంతి చర్చల్లో కీలక పరిణామం
పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగుతోంది. అమెరికా నౌకలు ఇప్పటికే హర్ముజ్‌ను తమ ఆధీనంలోకి తీసుకోగా.. తీవ్ర ప్రతిఘటన తప్పదని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగిస్తోంది. -
హార్మూజ్ దిగ్బంధం
కైరో/దుబాయ్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర రూపు దాలుస్తున్నాయి. చర్చల వైఫల్యంపై మండిపడుతున్న అమెరికా మరోసారి ఇరాన్‌పై తీవ్ర చర్యలకు దిగుతోంది. సోమవారం సాయంత్రం నుంచి హార్మూజ్ జలసంధితో పాటు ఇరాన్‌కు చెందిన ఓడరేవులన్నింటినీ దిగ్బంధించింది. హార్మూజ్ గుండా ఇరాన్ ఓడల రాకపోకలను కూడా అడ్డుకుంటోంది. చర్చలు విఫలమైతే హార్మూజ్‌ను దిగ్బంధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారమే హెచ్చరించడం తెలిసిందే. అమెరికా నావికా దళం సోమవారం సాయంత్రమే రంగంలోకి దిగింది. ఇరాన్ తీర ప్రాంతాలన్నింటినీ పూర్తిస్థాయిలో పహారా కాస్తోంది. ఏ దేశానికి చెందిన నౌకలూ ఇరాన్ రేవుల్లోకి రాకపోకలు జరపడానికి వీల్లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అయితే, ఇరానేతర రేవుల నుంచి వచ్చే నౌకలను మాత్రం హార్మూజ్ గుండా వెళ్లేందుకు అనుమతిస్తామని వెల్లడించడం విశేషం! ఇరాన్ ‘ఫాస్ట్ అటాక్’షిప్‌లు గనక తమ నావికా దళం దిగ్బంధించిన ప్రాంతాల సమీపంలోకి వస్తే మరో ఆలోచనే లేకుండా వాటిని తక్షణం పేల్చేస్తామని ట్రంప్ అల్టిమేటమిచ్చారు. అమెరికా తాజా చర్యతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరిగేలా కన్పిస్తున్నాయి. అంతేగాక ట్రంప్ ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ కూడా బుట్టదాఖలయ్యేలా కన్పిస్తోంది. దాని గడువు ఏప్రిల్ 22 దాకా ఉంది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధం ద్వారా అమెరికా సాధించబోయేది ఏమిటో అర్థం కావడం లేదంటూ అంతర్జాతీయ నిపుణులు పెదవి విరుస్తున్నారు. అగ్ర రాజ్యం తాజా చర్యలపై ఇరాన్ మండిపడింది. గల్ఫ్ ప్రాంతంలోని ఓడరేవులన్నింటినీ పూర్తిస్థాయిలో లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతానని తీవ్రంగా హెచ్చరించింది. ‘‘పర్షియన్ గల్ఫ్, ఒమన్ సముద్ర ప్రాంత రక్షణ బాధ్యత ఈ ప్రాంతంలోని ప్రతి దేశానిదీ. మాపై దాడులు, దిగ్బంధాలు జరిగితే ఈ ప్రాంతంలోని ఏ రేవూ సురక్షితం కాబోదు’’అని ఇరాన్ సైన్యం, రివల్యూషనరీ గార్డ్ (ఐఆర్జీసీ) స్పష్టం చేశాయి. హార్మూజ్ ఇప్పటికీ పూర్తిగా ఇరాన్ అదుపులోనే ఉన్నట్టు చెప్పుకొచ్చాయి. ‘ట్రంప్‌కు యుద్ధమే కావాలనుకుంటే మేం సిద్ధమే’అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ గలీబాఫ్ స్పష్టం చేశారు. అంతేగాక ‘ఆటలో ఇప్పటిదాకా వాడని సరికొత్త ‘వ్యూహా’లను ఇకపై బయటికి తీస్తా’మంటూ ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఎబ్రాహీం రజెయ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా నుంచి అమెరికా ఖాళీ చేతులతో వెనుదిరగాల్సిందేనని ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ విభాగం చీఫ్ ఎస్మాయిల్ ఖానీ ఎద్దేవా చేశారు. గత వారం కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి 40 వాణిజ్య నౌకలు హార్మూజ్‌ను దాటాయి. అమెరికా, ఇరాన్ నడుమ యుద్ధానికి తెర దించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.ఇరాన్ గమ్మత్తైన ‘గణిత’పోస్టు హార్మూజ్‌ను దిగ్బంధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలను ఇరాన్ ఎద్దేవా చేసింది. ఈ మేరకు గమ్మత్తైన గణిత సమీకరణాలతో ఎక్స్‌లో పోస్టు పెట్టింది. ‘‘హార్మూజ్ దిగ్బంధంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిపోతాయి. తర్వాత జరిగే చైన్ రియాక్షన్ వల్ల చూస్తుండగానే అవి చుక్కలనంటుతాయి’’అంటూ వాటి అర్థాన్ని కూడా వివరించింది!‘హార్మూజ్’పై భేటీ.. బ్రిటన్, ఫ్రాన్స్ వెల్లడి లండన్/పారిస్: పశ్చిమాసియా యుద్ధానికి తెర దించి హార్మూజ్ జలసంధిని తక్షణం తెరిపించే ప్రయత్నాలను బ్రిటన్, ఫ్రాన్స్ ముమ్మరం చేశాయి. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ వారంలో సమావేశం నిర్వహించనున్నట్టు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ వెల్లడించారు. ఈ అంశంపై వారిద్దరూ ఫోన్లో చర్చలు జరిపారు. అమెరికా చేపట్టిన హార్మూజ్, ఇరాన్ రేవుల దిగ్బంధానికి బ్రిటన్ మద్దతివ్వబోదని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.100 మంది హెజ్బొల్లా ఫైటర్ల మృతి! బీరూట్: ఇజ్రాయెల్ సైన్యం, హెజ్బొల్లా దళాలు సోమవారం లెబనాన్‌లో పరస్పర దాడులకు దిగాయి. దక్షిణాదిన వ్యూహాత్మకంగా కీలకమైన కొండ ప్రాంత పట్టణం బింట్ బెల్ వద్ద ఇజ్రాయెల్ సైన్యంపై హెజ్బొల్లా తీవ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. అయితే పట్టణంపై ఇజ్రాయెల్ సైన్యం పట్టు సాధిస్తున్నట్టు లెబనాన్ మీడియా తెలిపింది. బింట్ బెల్ వద్ద కనీసం 100 మంది హెజ్బొల్లా తీవ్రవాదులను మట్టుబెట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. లెబనాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించలేదు. రాజధాని బీరూట్‌పై దాడులకు ఇజ్రాయెల్ విరామం ఇచ్చింది. మంగళవారం ఇజ్రాయెల్, లెబనాన్ నడుమ ప్రత్యక్ష చర్చలు జరగనుండటం తెలిసిందే. అమెరికాలోని ఇరు దేశాల రాయబారులు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు. అయినా లెబనాన్‌పై దాడులు మాత్రం ఆగబోవని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. చర్చలకు సిద్ధమే: ఇరాన్న్యూఢిల్లీ: అమెరికాతో మరో దఫా చర్చలకు ఇరాన్ సిద్ధమేని భారత్‌లో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఫతాలీ ప్రకటించారు. అయితే, ‘అమెరికా అక్రమ డిమాండ్లు చేయరాదు. ఇరాన్ షరతులకు అంగీకరించాలి’అని పేర్కొన్నారు. తమ శక్తి ఏమిటో అమెరికాకు బాగా తెలుసని ఆయనన్నారు. హార్మూజ్ ఇరాన్‌దేనని స్పష్టం చేశారు. ఇరాన్ చమురు విక్రయాలపై తీవ్ర చర్యలు: అమెరికా ఇరాన్‌కు చెందిన నిషేధిత చమురును కొనుగోలు చేసినా, విక్రయించినా తీవ్ర చర్యలు తప్పవని అమెరికా హెచ్చరించింది. అలాంటి వ్యక్తులు/దేశాలను కోర్టుల్లో నిలబెట్టి తీరుతామని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచె ప్రకటించారు. -
హర్మూజ్ జలసంధిపై ట్రంప్ కొత్త గేమ్ ప్లాన్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు హర్మూజ్ జలసంధిలో నౌకల్ని ఆపేస్తూ, మరో వైపు ఇరాన్‌ను బయపెట్టించేలా ఆ దేశంపై మరోసారి ముప్పేట క్షిపణులతో దాడి చేసే అవకాశాలపై ట్రంప్ తన సీనియర్ సలహాదారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.నిన్న ఇదే అంశంపై ట్రంప్ ఫ్లోరిడాలోని డోరల్ రిసార్ట్‌లో ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడారు. దౌత్యపరమైన పరిష్కారానికి సిద్ధంగా ఉన్నానంటూనే ఇరాన్‌కు పరోక్షంగా హెచ్చరికలు జారీచేశారు. ‘హర్మూజ్ జలసంధిపై ఆంక్షలు కొనసాగిస్తూ, ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయాలని అనుకుంటున్నాను. కానీ నేను అలా చేయాలని అనుకోవడం లేదు. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ఇరాన్‌ది. సముద్రపు నీటిని త్రాగునీటిగా మార్చే సాలినేషన్ ప్లాంట్లు వాళ్లవి. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వాళ్లవి. వాటిపై సులభంగా దాడి చేయొచ్చు’ అని అన్నారు.యుద్ధం ప్రారంభ దశలో భాగమైన బాంబింగ్ దాడుల్ని మళ్లీ ప్రారంభించే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ట్రంప్ సలహాదారులు మాత్రం ఈ తరహా దాడులు చేసే అవకాశం తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కారణం.. బాంబింగ్ దాడులతో ప్రాంతీయ అస్థిరతను మరింత పెరిగే ప్రమాదం ఉంది. అలాగే ట్రంప్ దీర్ఘకాలిక సైనిక యుద్ధాల్ని కొనసాగించేందుకు ఇష్టపడటం లేదని వారు చెబుతున్నారు.మరో ప్రత్యామ్నాయం తాత్కాలికంగా ఆంక్షలను కొనసాగిస్తూ.. దీర్ఘకాలంలో హర్మూజ్ జలసంధి ద్వారా సురక్షిత రవాణా జరిగేలా మిత్రదేశాలను బాధ్యత వహించేలా ఒత్తిడి చేసే అవకాశం ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ఒలివియా వేల్స్ తెలిపారు. ‘ట్రంప్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిపై నావికాదళ ఆంక్షలు విధించారు. ఇరాన్ దోపిడీని ఆపారు. అదనపు అన్ని అవకాశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు’ అని వాల్ స్ట్రీట్ జర్నల్‌కు తెలిపారు.ఇరాన్‌తో చర్చలు విఫలమైన తర్వాత ట్రంప్ ఏ చర్యలకు ఉపక్రమించనున్నారనే అంశాలపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని వైట్ హౌస్ వర్గాలు స్పష్టం చేశాయి. ట్రంప్ మాత్రం ఇరాన్ తిరిగి చర్చలకు రావాలనుకుంటుందని పేర్కొన్నారు. -
ట్రంప్ సముద్ర దిగ్బంధనం : ఇరాన్ తీవ్ర హెచ్చరిక
ఇరాన్ సముద్ర కార్యకలాపాలపై దిగ్బంధనాన్ని అమలు చేయడానికి అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్ర స్థాయిలో హెచ్చరిక జారీ చేసింది. తమ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండదని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. యుద్ధ విరమణ చర్చలు విఫలమైన తర్వాత టెహ్రాన్‌పై ఒత్తిడి పెంచే లక్ష్యంతో, ఇరాన్ ఓడరేవులలోకి ప్రవేశించే లేదా బయలుదేరే నౌకలను అడ్డుకోవడం ప్రారంభిస్తామని అమెరికా సైన్యం ప్రకటించిన నేపథ్యంలో ఈ హెచ్చరిక వచ్చింది. ఏప్రిల్ 13 (సోమవారం) నుండి ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు అమలులోకి రానున్న తరుణంలో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి.అమెరికా సముద్ర దిగ్బంధనం (Blockade)పై ట్రంప్ ప్రకటన నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. ఒకవేళ అమెరికా దాడులకు దిగితే, తాము కూడా దీటుగా స్పందిస్తామని, తమ వద్ద ఇంకా వాడని ఆయుధాలు/అస్త్రాలు ఉన్నాయని ఇరాన్ నేతలు స్పష్టం చేశారు. తమ దేశ ఓడరేవులను లక్ష్యంగా చేసుకుంటే, పర్షియన్ గల్ఫ్ లేదా ఒమన్ సముద్రంలోని ఏ ఓడరేవు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది. "పర్షియన్ గల్ఫ్ భద్రత అనేది అందరికీ ఉండాలి, లేదంటే ఎవరికీ ఉండదు" అని ఇరాన్ మిలిటరీ మరియు రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు, ఏప్రిల్ 13 ఉదయం 10 గంటల (EDT) నుండి ఇరాన్ ఓడరేవుల్లోకి ప్రవేశించే లేదా బయటకు వచ్చే అన్ని దేశాల నౌకలను అమెరికా సైన్యం అడ్డుకోనుంది. ఇరాన్ తన అణు కార్యక్రమంపై అమెరికా షరతులను అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఓడరేవులకు వెళ్లే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని, ఇతర దేశాల మధ్య ప్రయాణించే నౌకలకు హార్ముజ్ జలసంధి గుండా అనుమతి ఉంటుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా క్రూడ్ ఆయిల్ ధర 8 శాతం పెరిగి 104.24 డాలర్లకి చేరగా, బ్రెంట్ క్రూడ్ 102.29 కి డాలర్ల చేరుకుంది. హార్ముజ్ జలసంధి గుండా రోజుకు 100-135 నౌకలు వెళ్లేవి, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 40కి పడిపోయింది. ఇదీ చదవండి: రిషబ్శెట్టికి జోడీగా తెరంగేట్రం : ఆశా వారసురాలి గురించి తెలుసా?యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లక్షలాది బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసిన ఇరాన్‌పై ఒత్తిడిని పెంచడానికే ఈ దిగ్బంధనం ఉద్దేశించినట్లుగా ఉంది. ఇరాన్ చమురు ఎగుమతుల కోసం ఉపయోగిస్తున్న "డార్క్ ట్రాన్సిట్స్" (రహస్య రవాణా) ను అడ్డుకోవడమే అమెరికా ప్రధాన లక్ష్యం. అయితే, ఈ దిగ్బంధనం వల్ల గల్ఫ్ ప్రాంతంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందేమోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది. ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22తో ముగియ నుండటంతో, ఆ తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందా అనే ఆందోళన నెలకొంది. ఇదీ చదవండి: పోప్‌కు కౌంటర్ : ట్రంప్ సంచలన పోస్ట్ -
ఇరాన్‌పై అమెరికా యుద్ధం.. భారత్‌లో వీటి ధరలు పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఇరాన్‌పై అమెరికా యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో హర్మూజ్ జలసంధిలో చమురు, ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో వినియోగదారులు గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి త్వరలో సల్ఫర్ దిగుమతులపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. ఫలితంగా సల్ఫర్ ఆధారిత ఉత్పత్తుల తయారీ ఖర్చులు పెరిగి, వాటి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే సల్ఫర్ రవాణాలో దాదాపు సగం హర్మూజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. సల్ఫర్ అనేది ఎరువుల తయారీ, రసాయన పరిశ్రమలు, లోహ శుద్ధి, బ్యాటరీలు, సెమీకండక్టర్ల తయారీకి అవసరమైన ప్రధాన ముడి పదార్థం. హర్మూజ్ జలసంధి మార్గంలో అంతరాయం కొనసాగితే ఈ కీలక పదార్థం కొరత మరింతగా పెరిగే అవకాశం ఉంది.ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన ఇరాన్‌పై అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల ప్రభావంతో 44 వేలకుపైగా కంపెనీల ఉత్పత్తుల రవాణా అంతరాయం ఎదుర్కొన్నట్లు డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ మరో నివేదికలో పేర్కొంది.దీని ప్రభావం భారత్‌లోని తయారీ రంగాలపై తీవ్రంగా పడనుంది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో పాటు వాటి ధరలను కూడా పెంచాల్సి వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికే కరీఫ్ సీజన్ కోసం ఎరువుల సబ్సిడీని 12 శాతం పెంచింది. అయినప్పటికీ యుద్ధం కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక భారమూ మరింత పెరుగుతుంది. చైనా మే నెల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగుమతులను నిలిపివేయనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా సరఫరా ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఇప్పటికే యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనాలో సల్ఫర్ ధరలు 15 శాతం పెరిగాయి.భారత్ మాత్రం ద్వంద్వ సమస్యను ఎదుర్కొంటోంది. రైతులకు ఎరువుల ధరలు పెరగకుండా సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రభుత్వ ఆదాయంపై భారీ ఒత్తిడి పడుతుంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఆహార ధరలు పెరిగి ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి, ఇరాన్–అమెరికా యుద్ధం ప్రభావం కేవలం చమురు, ఎల్పీజీ సరఫరాలకే పరిమితం కాదు. సల్ఫర్ సరఫరా అంతరాయం దేశ ఆహార భద్రత, రైతుల ఖర్చులు, పరిశ్రమల ఉత్పత్తి ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపనుందని నివేదికలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. -
8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల సంపద ఢమాల్
స్టాక్ మార్కెట్లపై హర్ముజ్ సంక్షోభం ఎఫెక్ట్ పడింది. చర్చలు విఫలమై చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయి భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లకుపైగా.. నిష్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఈ ప్రభావంతో కేవలం 8 నిమిషాల్లో 8 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరయ్యింది.హర్ముజ్ జలసంధి సంక్షోభం ప్రభావంతో ఇవాళ్టి ట్రేడింగ్ సెషన్లో భారతీయ స్టాక్ మార్కెట్లు తీవ్రంగా కుదేలయ్యాయి. చర్చలు విఫలమవడంతో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 8 శాతం పెరగడంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం వెంటనే మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.సెన్సెక్స్ 73,000 స్థాయికి చేరగా, నిఫ్టీ 23,600 కంటే దిగువకు పడిపోయింది. కేవలం ఎనిమిది నిమిషాల్లోనే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. ఈ పతనంతో మార్కెట్లో భయాందోళనలు పెరిగి, చిన్న పెట్టుబడిదారులు పెద్ద నష్టాలను ఎదుర్కొంటున్నారు. చమురు ధరల పెరుగుదలతో ఎయిర్‌లైన్స్, పెయింట్స్, ఫర్టిలైజర్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండిగో, ఏషియన్ పెయింట్స్ వంటి కంపెనీల షేర్లు గణనీయంగా పడిపోయాయి. మరోవైపు, ఎనర్జీ-అప్‌స్ట్రీమ్ రంగం, డిఫెన్స్ సంబంధిత షేర్లు మాత్రం కొంత స్థిరంగా నిలిచాయి. నిపుణుల అంచనా ప్రకారం.. హర్ముజ్ సంక్షోభం కొనసాగితే భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దిగుమతి ఖర్చులు పెరగడం, ద్రవ్యోల్బణం అధికమవడం, వృద్ధి మందగించడం వంటి సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. పెట్టుబడిదారులు తాత్కాలికంగా రిస్క్ ఉన్న రంగాల నుండి దూరంగా ఉండి, స్థిరమైన రంగాల వైపు దృష్టి మళ్లించాలని సూచిస్తున్నారు. -
ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంను స్వీకరించేందుకు సిద్ధం: రష్యా
ఇరాన్, అమెరికా చర్చలు విఫలమైన నేపథ్యంలో హార్మూజ్ టార్గెట్‌గా ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ... -
హార్మూజ్.. ఆనాటి హురుమాంజియే..
సాక్షి, హైదరాబాద్: హార్మూజ్ జలసంధి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిన ఈ జలసంధి ఒకప్పుడు ఇదే ప్రపంచానికి నాగరికతను పరిచయం చేసింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల రవాణాకు కేంద్రబిందువుగా నిలిచింది. ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాలకు సాంస్కృతిక వారధిగా కొనసాగింది. కాకతీయులు, రాయల కాలంలో విశేష ప్రాచుర్యంలో ఉంది. వందల ఏళ్ల క్రితమే ఈ జలసంధికి తెలుగుసాహిత్యంలో సముచితమైన స్థానం లభించింది. శ్రీకృష్ణదేవరాయలు, శ్రీనాథ కవిసార్వభౌముడు తమ సాహిత్యంలో ఈ జలసంధిని ‘హురుమాంజి’గా అభివర్ణించారు. హురుమాంజి జలసంధి నుంచే అనేక రకాల వ్యాపారాలు కొనసాగినట్లు శ్రీనాథుడు ‘హరవిలాసం’లో ప్రస్తావించారు.తిప్పయ్యశెట్టి అనే వ్యాపారి హురుమాంజి నుంచి అనేక రకాల విలువైన వస్తువులను తెచ్చి విక్రయించేవాడని ప్రస్తావించాడు. ఖర్జూర, బాదం, వాల్నట్స్ వంటి ఎండుఫలాలు అక్కడినుంచి దిగుమతి అయ్యేవని ఆ గ్రంధంలో పేర్కొన్నారు. మరోవైపు మేలైన గుర్రాలు ‘హురుమాంజి’ నుంచి తెప్పించినట్లు శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’లో చెప్పారు. ‘విజయనగర సామ్రాజ్యానికి సైనిక శక్తి చాలా ముఖ్యం, అందులోనూ గుర్రపు దళం ఎంతో కీలకం. అరేబియా, పర్షియా దేశాల్లోని ‘హురుమాజి’ రేవు నుంచి వచ్చే ఉత్తమ జాతి గుర్రాలను వెనుకాడకుండా ఎక్కువ ధర ఇచ్చి అయినా సరే కొనుగోలు చేయాలి’ అని ఆముక్తమాల్యదలో ప్రస్తావించారు. ఆ హురుమాంజియే ఇప్పటి హార్మూజ్ జలసంధి అని చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల కాలంలో, ఆ తరువాత రాయలకాలంలో హురుమాంజి నుంచి మోటుపల్లి, మచిలీపట్నం ఓడరేవులకు సరుకులు రవాణా అయ్యేవి. తెలుగు సాహిత్యంలో ‘పర్షియా’.. ఈ ఒక్క జలసంధి మాత్రమే కాదు. పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే అనేక పదాలు 15వ శతాబ్దం నుంచే తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయని ప్రముఖ రచయిత వసుధేంద్ర తెలిపారు .‘గ్రీస్, పర్షియన్ రెండూ అత్యంత ప్రాచీనమైన నాగరికతలే అయినా పర్షియన్ సంస్కృతి మాత్రమే అనేక దేశాలకు విస్తరించింది’ అని చెప్పారు. బిర్యానీలు, రకరకాల మాంసాహార వంటకాలు, డబల్కామీటా, బాదుషా, జిలేబీ వంటి మిఠాయిలు కూడా అక్కడి నుంచి దిగమతి అయి మన ఆహారపు అలవాట్లలో భాగమయ్యాయి.కుంకుమపువ్వు, రోజ్‌వాటర్ దిగుమతి ‘ఇరాన్ సంస్కృతి అప్పటి రాజులను బాగా ప్రభావితం చేసింది. ఆ నాటి రాచరిక వ్యవస్థను రాయలకాలంలో అనుకరించారు. అందుకే పర్షియాకు చెందిన అనేక పదాలకు సమానమైన అర్ధాన్నిచ్చే పదాలను సంస్కృతంలో ప్రస్తుతించారు’ అని వసుధేంద్ర వివరించారు. ఈ క్రమంలో ‘అమీర్’ను ఇక్కడ ‘అమరనాయకుడు’ అని, ‘సుల్తాన్’ అనే పదానికి సమానమైన అర్ధాన్నిచ్చేవిధంగా ‘సురత్రానా’ అనే పదాన్ని వాడుకలోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో రెండు వైపులా రాకపోకలు విస్తృతంగా కొనసాగాయి. చాలామంది వ్యాపారులు పర్షియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇక్కడి నుంచి సుగంధద్రవ్యాలు వంటివి అక్కడికి ఎగుమతి చేశారు. ఆనాటి పర్షియన్ సంస్కృతి రాజులనే కాకుండా సమాజంలోని ఉన్నతవర్గాలను విశేషంగా ఆకట్టుకుంది. బాదం, పిస్తా, కుంకుమపువ్వు, రోజ్‌వాటర్ వంటివి అక్కడి నుంచి దిగుమతి చేసుకొనేవారు. -
చర్చల వైఫల్యం వెనక... ఐదు కారణాలు!
అమెరికా, ఇరాన్ నడుమ ఎంతో ఆశావహంగా మొదలైన శాంతి చర్చలు విఫలం కావడం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్ర నిరాశలో ముంచెత్తింది. ఈ వైఫల్యం వెనక పలు కారణాలున్నట్టు అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాటిలో ప్రధానమైనవి...1. అటు అమెరికా, ఇటు ఇరాన్ తమ ప్రాధాన్యాలకే కట్టుబడి ఉండాలనే మొండి పట్టుదలతో ఇస్లామాబాద్‌లో అడుగుపెట్టాయి. ఎవరూ తమ డిమాండ్ల నుంచి ఇసుమంతైనా వెనక్కు తగ్గలేదు. అవతలి వారి వాదనలకు ఏ మాత్రమూ విలువ ఇవ్వలేదు. చర్చలు వైఫల్యానికి ఈ వైఖరే ప్రధాన కారణంగా నిలిచింది. యురేనియం శుద్ది కార్యక్రమాన్ని తక్షణం, శాశ్వతంగా ఆపేయాలని అమెరికా డిమాండ్‌కు ఇరాన్ ససేమిరా అంది. విద్యుదుత్పత్తి అవసరాల నిమిత్తం యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగించి తీరతామని కరాఖండిగా చెప్పింది.2. చర్చలన్నాక అగ్రరాజ్యాధినేత అయినా నోరు అదుపులో పెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దౌత్యధర్మాన్ని పూర్తిగా విస్మరించారు. ఇరాన్ బృందం పాక్‌లో కాలుమోపాక కూడా కాక పెంచేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారు. చర్చలు విఫలమైతే ఇరాన్‌పై మునుపెన్నడూ ఉపయోగించని శక్తిమంతమైన ఆయుధాలతో మరింత భీకరంగా విరుచుకుపడతామంటూ ఆయన పెట్టిన పోస్టులు పరిస్థితిని దిగజార్చాయి. ఓవైపు చర్చలకు పిలిచి మరోవైపు ఇలా బెదిరింపులకు పాల్పడటం ఏ రకమైన దౌత్య నీతి అంటూ అమెరికా ప్రతినిధులను ఇరాన్ బృందం నిలదీసినట్లు సమాచారం.3. కాల్పుల విరమణ లెబనాన్‌కూ వర్తిస్తుందని తాము మొదటి నుంచీ చెబుతున్నా చర్చలను బేఖాతరు చేస్తూ ఆ దేశంపై ఇజ్రాయెల్ భీకరంగా దాడులు కొనసాగిస్తుండటం ఇరాన్‌కు సుతరామూ నచ్చలేదు. లెబనాన్‌పై దాడులు చేయకుండా ఇజ్రాయెల్‌ను నిరోధిస్తామని అమెరికా నుంచి ఎలాంటి హామీ రాకపోవడాన్ని ఇరాన్ తీవ్రంగా తప్పుబట్టింది. మధ్యవర్తిగా హుందాగా వ్యవహరించాల్సిన పాక్ కూడా పరిస్థితిని దిగజార్చేలా ప్రవర్తించింది. ఇజ్రాయెల్ జాతి హననానికి పాల్పడుతోందంటూ పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ పోస్టు పెట్టడంతో మండిపడ్డ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుచేశారు. చర్చలతో తమ దాడులకు సంబంధం లేదంటూ కుండబద్దలు కొట్టారు.4. అంతర్జాతీయ ఇంధన రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని బేషరతుగా తెరవాలని ట్రంప్ డిమాండ్‌చేశారు. షరతుల్లేకుండా దాన్ని తెరవబోమని, చర్చల్లో బేరసారాలకు హార్మూజ్ తమకు కీలక ఆయుధమని ఇరాన్ ప్రతినిధులు వాదించారు. హార్మూజ్‌ను తెరవకపోతే ఇరాన్ నాగరికతనే బూడిద చేస్తామన్న ట్రంప్ బెదిరింపులను తీవ్రంగా తప్పుబట్టారు. హార్మూజ్‌ను తెరవాలంటే ఇరాన్‌పై ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందుకు అమెరికా బృందం ఒప్పుకోలేదు. పైగా ఈ విషయంలో ట్రంప్ ధోరణినే గట్టిగా సమరి్థంచింది. హార్మూజ్ గుండా పయనించే నౌకల నుంచి చార్జీలు వసూలుకు ఇరాన్‌తో కలిసి టోల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలను ఇరాన్ అంగీకరించలేదు. హార్మూజ్‌పై తమతో పాటు ఒమన్ పాక్షిక అధికారాలను గుర్తించాలన్న ఇరాన్ డిమాండ్‌కు అమెరికా ఒప్పుకోలేదు.5. అమెరికా, ఇరాన్ బృందాల మధ్య పరస్పర విశ్వాస లోపం అడుగడుగునా కనిపించింది. హామీలను అవతలి పక్షం పాటిస్తాయా అన్న అనుమానాలు ఇరువైపులా కొట్టొచి్చనట్టు కన్పించాయి. తమ ప్రతిపాదనలు అద్భుతమని అమెరికా చెప్పుకుంటే, అవన్నీ చెత్త షరతులని ఇరాన్ ప్రతినిధులు కుండబద్దలు కొట్టారు.ఇక ఏం జరగనుంది? చర్చల వైఫల్యం తాలూకు తక్షణ ప్రభావం కాల్పుల విరమణపై పడే అవకాశముంది. అమెరికా, ఇజ్రాయెల్ మళ్లీ ఇరాన్‌పై మూకుమ్మడిగా దాడులు ప్రారంభించే ప్రమాదం కన్పిస్తోంది. చర్చలు విఫలమైతే చరిత్ర చూడని స్థాయిలో ఇరాన్‌పై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. అదే జరిగితే ప్రాణ, ఆస్తినష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం కూడా కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. హార్మూజ్ జలసంధి తెరచుకోని పక్షంలో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ముదిరే ఆస్కారముంది. తమ వద్ద అణుబాంబు లేని కారణంగానే అమెరికా ఇంతగా దాడులకు దిగుతోందన్న అభిప్రాయంతో ఉన్న ఇరాన్, ఇక అణ్వస్త్ర కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన కొనసాగించే వీలుంది. భారత్‌లో ఇంధన కష్టాలు మరింత పెరిగే అవకాశముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హార్మూజ్‌ను దిగ్బంధించండి
వాషింగ్టన్: శాంతిచర్చలు విఫలమవడంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనువెంటనే హార్మూజ్ జలసంధిని దిగ్భంధించాలని తమ నావికాదళానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఆదివారం ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘ఇరాన్‌కు అక్రమంగా టోల్ చెల్లించిన ఏ ఒక్క సరకు రవాణా నౌక కూడా జలసంధి గుండా రాకపోకలు సాగించడానికి వీల్లేదు. ఇరాన్‌కు డబ్బులే కావాలి. మరీ ముఖ్యంగా అణ్వాయుధం కావాలి. అందుకే వాళ్ల ప్రయత్నాలను అడ్డుకుంటూ మేం హార్మూజ్‌ను దిగ్భందిస్తాం. ఇరాన్ అమర్చిన సముద్ర మందుపాతరలను ధ్వంసంచేస్తాం’’ అని అన్నారు. జలసంధి దిగ్బంధంలో మరికొన్ని దేశాలు అమెరికాకు సాయపడనున్నట్లు వార్తలొచ్చాయి. ‘‘ఇరాన్‌తో యుద్ధం చేయడం కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం వెతకడం ముఖ్యమని భావించి శాంతిచర్చలకు సిద్ధపడ్దాం. చాలా అంశాల్లో వాళ్లతో మాకు ఏకాభిప్రాయం కుదిరింది. కానీ అణ్వస్త్ర తయారీ కార్యక్రమం నిలుపుదలపై ఇరాన్ మొండికేసింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి. సంక్లిష్టమైన, అనూహ్యమైన, ప్రమాదకర ఇరాన్ పాలకుల చేతికి అణ్వాయుధం దక్కకుండా చేస్తా. ఇరాన్ ఏనాటికీ అణ్వస్త్ర సామర్థ్యం సాధించబోదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చర్చల్లో మధ్యవర్తి పాత్ర పోషించిన పాక్ ప్రస్తావనను ట్రంప్ ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ‘‘పాక్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిజంగా అసాధారణ వ్యక్తులు. భారత్‌తో యుద్ధాన్ని నిలువరించి ప్రత్యక్షంగా 3–5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడిన నన్ను మునీర్, షెహబాజ్ పొగడ్తల్లో ముంచెత్తారు. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలను తరలిస్తే చైనాపై అదనంగా 50 శాతం టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. ఫాక్స్ న్యూస్ ‘సండే మారి్నంగ్ ఫ్యూచర్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణి విధ్వంసక మిస్సైల్ లాంచర్‌ను ఇరాన్‌కు చైనా రహస్యంగా పంపిస్తోందన్న వార్తలు చదివా. అవి నిజమని అనుకోను. ఇప్పుడు చైనాతో అమెరికా సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ చైనా నిజంగానే ఇరాన్‌కు ఆయుధ సాయం చేస్తే 50 శాతం పన్నుల భారం పడేస్తా’’ అని హెచ్చరించారు. -
చర్చలు విఫలం
ఇస్లామాబాద్: ప్రపంచమంతా అత్యంత ఆశతో ఎదురు చూసిన అమెరికా, ఇరాన్ చర్చలు చివరికి విఫలమయ్యాయి. పశ్చిమాసియాలో భీకర యుద్ధానికి ముగింపు పలికి శాంతి, సుస్థిరతకు బాటలు వేస్తాయని, శాశ్వత కాల్పుల విరమణకు బాటలు పరుస్తాయని, ఆ మేరకు ఇరు దేశాల నడుమ ఒప్పందం కుదురుతుందని ప్రపంచ దేశాలు పెట్టుకున్న ఆశలు వమ్మే అయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సారథ్యంలోని బృందం, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ సారథ్యంలోని ఇరాన్ బృందం మధ్య జరిగిన శిఖరాగ్ర చర్చలు ఎటూ తేలకుండానే అర్ధాంతరంగా ముగిశాయి. ఏకధాటిగా 21 గంటలపాటు కొనసాగిన చర్చల్లో అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎవరి డిమాండ్లపై వారు మొండిపట్టు పట్టడంతో ఎలాంటి ఒప్పందమూ సాధ్యపడలేదు. దాంతో ఇరు బృందాలూ ఆదివారమే తమ తమ దేశాలకు వెనుదిరిగాయి. అమెరికా వెళ్లేముందు వాన్స్ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చలు విఫలమయ్యాయని స్వయంగా ప్రకటించారు. ‘‘అణు కార్యక్రమాలకు స్వస్తి పలకబోనని ఇరాన్ మొండికేసింది. హార్మూజ్పైనా అదే వైఖరి! చర్చల వైఫల్యానికి ఇవి రెండే ప్రధాన కారణాలు. ఇరాన్‌తో 21 గంటలపాటు చర్చలు జరిపాం. కొన్ని అంశాలపై లోతుగా మాట్లాడాం. చర్చలకు సంబంధించి ఇదొక్కటే మంచివార్త. కానీ ఉమ్మడి నిర్ణయానికి మాత్రం రాలేకపోయాం. ఇది అమెరికాకంటే ఇరాన్‌కే అతి పెద్ద దుర్వార్త. అణ్వాయుధం తయారు చేయబోమని ఒక్క నిర్దిష్టమైన, స్పష్టమైన హామీని మాత్రమే కోరాం. అధ్యక్షుడు ట్రంప్ కోరుతున్నది కూడా ఇదే. చర్చల ద్వారా మేం ఇదే సాధించాలనుకున్నాం. చర్చలకు మేం ముందుకు రావడానికి అసలు కారణమూ ఇదే. కానీ మా షరతులకు ఇరాన్ ఒప్పుకోలేదు. చర్చల సందర్భంగా ట్రంప్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆయన వైఖరిని ఇరాన్ బృందానికి ఎప్పటికçప్పుడు తెలియజేస్తూ వచ్చాం’’ అని వాన్స్ చెప్పారు. తమ ప్రతిపాదనలను ఇరాన్ ఇకనైనా ఆమోదిస్తుందో లేదో చూడాలన్నారు. అణ్వస్త్ర తయారీ, హార్మూజ్ జలసంధి ద్వారా సాధారణ రాకపోకలు, విదేశాల్లో దిగ్భందంలో ఉన్న ఇరాన్ స్థిరచరాస్తులను విడిపించడం వంటి ప్రధానాంశాల్లో సయోధ్య వీలవకపోవడమే చర్చల వైఫల్యానికి కారణమని ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. అసాధ్యమైన డిమాండ్లు: బఘేర్ చర్చల వైఫల్యంపై ఇరాన్ బృంద సారథి, స్పీకర్ ఘాలిబఫ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ఇరాన్ సర్వతోముఖాభివృద్ధికి కోసం దూరదృష్టితో మేం చేసిన పలు ప్రతిపాదనలకు అమెరికా అంగీకరించలేదు. మా బృంద విశ్వాసాన్ని సంపాదించడంలో విఫలమైంది. దాని ఆధిపత్య తరహా దౌత్యమే ఇందుకు కారణం. మాపై సైనిక చర్య నేపథ్యంలో దేశ రక్షణ కోసం 40 రోజులుగా చేస్తున్న పోరాటంలో రాజీ ఉండబోదని కరాఖండిగా చెప్పేశాం. చర్చల సాఫల్యం అవతలి పక్షం అనుకూల వైఖరి, అంకితభావం మీదనే ఆధారపడి ఉంటుంది. అమెరికా మా ముందు ఆచరణ సాధ్యం కాని, అతి, అక్రమ డిమాండ్లు పెట్టింది. ఇలాంటి చర్యలతో చర్చలు ముందుకు సాగబోవు. పరస్పర అవిశ్వాసం, సంశయాల నడుమ సఫలత అసాధ్యం’’ అన్నారు. ‘‘ఒకే దఫాలో ఉమ్మడి నిర్ణయం ఆశించడం కష్టం. పలుమార్లు చర్చల తర్వాత బహుశా ఇరు పక్షాల వైఖరిలో కాస్త సారూప్యత సాధ్యపడొచ్చు’’ అని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయెల్ బఖాయీ అభిప్రాయపడ్డారు. మలి దఫా చర్చలపై యోచిస్తున్నట్టు అతిథ్య పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ప్రకటించారు. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌తో అమెరికా జరిపిన తొలి ప్రత్యక్ష చర్చలు ఇవే కావడం తెలిసిందే. ఇస్లామాబాద్‌లో శనివారం మొదలైన ఈ చర్చల్లో అమెరికా తరఫున వాన్స్‌తో పాటు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో అధ్యక్షుని దూత స్టీవ్ విట్కాఫ్; ఇరాన్ తరఫున బఘేర్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ; మధ్యవర్తిత్వ దేశ హోదాలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చల్లో పాల్గొన్నారు. పశ్చిమాసియా నుంచి అమెరికా సేనల నిష్క్రమణ, హార్మూజ్‌పై పట్టు వంటి 10 కీలక డిమాండ్లతో ఇరాన్; అణ్వస్త్ర తయారీకి తక్షణం అడ్డుకట్టే ప్రధాన డిమాండ్‌గా వాన్స్ బృందం పాక్‌లో కాలుమోపాయి.లెబనాన్‌పై ఆగని దాడులు బీరూట్: లెబనాన్‌తో మంగళవారం చర్చలు జరపనున్నా, ఆ దేశంపై దాడులను మాత్రం ఇజ్రాయెల్ ఆపడం లేదు! ఆదివారం దక్షిణ లెబనాన్‌లోని మారౌబ్ గ్రామంపై దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్‌పై దాడులను పోప్ లియో–14 తీవ్రంగా ఖండించారు. మరోవైపు 40రోజులపాటు జరిగిన యుద్ధంలో ఇప్పటిదాకా ఇరాన్లో 3,375 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఫోరెన్సిక్ మెడిసన్ ఆర్గనైజేషన్ ఆదివారం ప్రకటించింది. మృతుల్లో 500 మంది దాకా మహిళలున్నారు. ఇప్పటిదాకా యుద్ధంలో లెబనాన్‌లో 2,055 మంది, ఇజ్రాయెల్‌లో 23 మంది, గల్ఫ్‌దేశాల్లో డజను మందికిపైగా చనిపోయారు. -
ఇరాన్‌కు కొత్త టెన్షన్..
వాషింగ్టన్ : అమెరికా, ఇజ్రాయెల్‌తో ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌కు కొత్త టెన్షన్ మొదలైంది. శత్రువును భయపెట్టేందుకు ఉయోగపడిన సముద్ర మందుపాతరలు(సీమైన్స్) ఇప్పుడు ఇరాన్‌కూ కొత్త భయాందోళనలు పెంచేస్తున్నాయి. సీమైన్స్ కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు లేకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. బహ్రెయిన్, ఖతర్, యూఏఈ, సౌదీల వంటి గల్ఫ్ దేశాల నుంచి ముడిచమురు, పెట్రో సరకులతో బయల్దేరే నౌకలు హార్మూజ్‌ను దాటకూడదనే లక్ష్యంతో ఆ మార్గంలో సీమైన్స్ ఏర్పాటుచేసిన ఇరాన్ ఇప్పుడు వాటి జాడ వెతికేందుకు తిప్పలు పడుతోంది. వాటిని అమర్చేటప్పుడు లేదా నీటిలోకి వదిలేటప్పుడు వాటి పొజిషన్‌ను ఒక క్రమపద్దతిలో నమోదుచేయలేదని తెలుస్తోంది. సముద్ర జలాల ప్రవాహంతో అవి అటూ ఇటూ కొట్టుకుపోయే ప్రమాదముంది.దీంతో ఇప్పుడు అవి కచ్చితంగా ఎక్కడ ఉన్నాయనే స్పష్టత ఇరాన్‌కు కూడా లేదు. దీంతో యుద్ధం పూర్వపు సాధారణ స్థితికి నౌకల రాకపోకలను అనుమతించే పరిస్థితి ఇప్పుడు లేదని తెలుస్తోంది. ఇరాన్ నావికాదళం రంగంలోకి దిగి సీమైన్స్ జాడ కనిపెట్టి వాటిని తొలగించడం లేదా నిర్వీర్యం చేయాల్సి ఉంది. అప్పటిదాకా నౌకల పూర్తిస్థాయి రాకపోకలకు అనుమతి అసాధ్యమనే వార్తలు వినవస్తున్నాయి. కాగా, దీనిపై ఇరాన్ ఇంతవరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. సీమైన్స్‌ను జాగ్రత్తగా తొలగించే సాంకేతికత ఇరాన్ వద్ద లేదు అనే పుకార్లు సైతం ఎక్కువయ్యాయి. దీంతో కాల్పుల విరమణ ఇప్పటికే మొదలైనా నౌకల సాఫీ ప్రయాణంపై ఇంకా సందిగ్ధత రాజ్యమేలుతోంది. -
కొంప మునిగింది.. సముద్రంలో బాంబులు..! ఇరాన్ తలచుకున్నా హార్ముజ్ తెరుచుకోదా?
-
హార్మూజ్‌ను దాటిన జగ్ విక్రమ్
న్యూఢిల్లీ: భారతీయ జెండా కలిగిన ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ హార్మూజ్‌ను విజయవంతంగా దాటేసింది. అమెరికా–ఇరాన్‌ల మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లోకి వచ్చాక హార్మూజ్‌ను దాటిన మొదటి భారతీయ ట్యాంకర్ ఇది. శనివారం మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌ను దాటి భారత్ దిశగా సాగుతోంది. ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన జగ్ విక్రమ్ సుమారు 20 వేల టన్నుల ఎల్పీజీని మోసుకొస్తోంది. కాగా, మార్చి మొదటి వారం నుంచి హార్మూజ్‌ను వీడిన 9వ భారతీయ ట్యాంకర్ ఇది. మరో 15 భారతీయ నౌకలు ఇప్పటికీ అక్కడే వేచి ఉన్నాయి. వీటితోపాటు వివిధ దేశాలకు చేరుకోవాల్సిన మొత్తం 426 ట్యాంకర్లు, 34 ఎల్పీజీ, 19 ఎల్ఎన్జీ క్యారియర్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లు మెరైన్ ట్రాఫిక్ డేటా చెబుతోంది. -
ఇరాన్‌తో శాంతి చర్చల వేళ అమెరికాకు ఎదురు దెబ్బ?
అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న తలెత్తుతోంది... అగ్రరాజ్యం అమెరికా ప్రకటించిన ఈ యుద్ధ విరమణ నిజంగా శాంతి కోసమా? లేక తన దౌత్య వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వేసుకున్న ముందస్తు వ్యూహమా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమైన తీరు పట్ల ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అమెరికాలోని మేధావి వర్గం ఈ చర్చల ద్వారా ఏదో ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తుంటే, మరోవైపు క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నమైన సంకేతాలను ఇస్తున్నాయి. యుద్ధం అనేది కేవలం క్షిపణుల మోతతో ముగిసిపోయేది కాదు, అది సృష్టించిన ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు దశాబ్దాల పాటు ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంటాయి.ఈ క్లిష్ట సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డ్వైట్ డి. ఐసెన్‌హోవర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి: "ప్రజలు శాంతిని ఎంతగా కోరుకుంటారంటే, ఏదో ఒక రోజు ప్రభుత్వాలు పక్కకు తప్పుకొని వారికి ఆ శాంతిని అందజేయక తప్పదు” అని. కానీ నేటి పరిస్థితి చూస్తుంటే, ప్రభుత్వాలు శాంతిని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నాయే తప్ప, నిబద్ధతతో పనిచేయడం లేదనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వ్యవహారం ఇప్పుడు చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారనుంది. ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి ఈ మార్గంపై ఇరాన్ పట్టు సాధించడం అమెరికా దౌత్య నీతికి తగిలిన అతిపెద్ద దెబ్బ. ఇరాన్ ఇక్కడ టోల్ వసూలు చేయాలని చూడటం లేదా నౌకాయానాన్ని నియంత్రించాలని ప్రయత్నించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని భావించినా, ఆచరణలో వారిని ఆపే శక్తి ఎవరికి ఉందన్నదే అసలు ప్రశ్న. గతాన్ని పరిశీలిస్తే, జాన్ ఎఫ్. కెన్నెడీ క్యూబన్ మిస్సైల్ సంక్షోభం సమయంలో ప్రదర్శించిన సంయమనం, వ్యూహాత్మక ఓర్పు నేటి నాయకత్వంలో లోపించినట్లు కనిపిస్తోంది.మరోవైపు, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వైఖరి ఈ చర్చల భవితవ్యాన్ని మరింత క్లిష్టతరం చేస్తోంది. లెబనాన్‌పై దాడులను ఆపే ఉద్దేశం ఇజ్రాయెల్‌కు లేదని స్పష్టమవుతున్న తరుణంలో, అమెరికా చేసే చర్చలు ఎంతవరకు ఫలప్రదమవుతాయి? ఒకవైపు తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, మరోవైపు ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ట్రంప్‌కు కత్తిమీద సాము లాంటిదే. రిచర్డ్ నిక్సన్ చైనా వైపు అడుగులు వేసినప్పుడు ప్రదర్శించిన రియల్‌పాలిటిక్ వ్యూహాన్ని ట్రంప్ ఇప్పుడు అమలు చేయగలరా? లేక కేవలం తన ఇమేజ్ను కాపాడుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారా? ఈ యుద్ధం వల్ల కేవలం ఇరాన్ మాత్రమే దెబ్బతిందని అనుకుంటే పొరపాటే. అమెరికా తన ఖజానా నుండి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్లను ఈ యుద్ధం కోసం తగలేసింది. ఈ భారీ సొమ్మును అమెరికా ప్రజల సంక్షేమం కోసం, విద్య, వైద్య రంగాల కోసం ఖర్చు చేసి ఉంటే అగ్రరాజ్యం మరింత శక్తివంతంగా తయారయ్యేది.అణు ఒప్పందం విషయంలో కూడా అమెరికా ఇప్పుడు రక్షణ స్థితిలో పడిపోయింది. బరాక్ ఒబామా హయాంలో కుదిరిన జేసీపోఏ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల కలిగిన నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో ఇరాన్‌ను ఒక క్రమపద్ధతిలో నియంత్రించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఇరాన్ అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంది. ఇప్పుడు వారిని నియంత్రించడం అంటే వారికి కొన్ని భారీ మినహాయింపులు ఇవ్వక తప్పని పరిస్థితి. నమ్మకం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో పునాది వంటిది, కానీ ఈ యుద్ధం వల్ల అమెరికా తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయింది. చర్చల మధ్యలో దాడులు చేయడం వల్ల ఇరాన్ ఇప్పుడు అమెరికాను తీవ్రమైన అనుమానంతోనే చూస్తోంది.చివరగా చెప్పాలంటే, ఈ వారాంతపు చర్చలు కేవలం ఒక రాజకీయ ప్రహసనం కాకూడదు. యుద్ధం వల్ల పెరిగిన చమురు ధరలు, ఎరువుల కొరత వల్ల ఆఫ్రికా వంటి దేశాల్లో పేదరికం, ఆకలి చావులు పెరుగుతున్నాయి. అబ్రహం లింకన్ అన్నట్లుగా, "మన శత్రువును మిత్రుడిగా మార్చుకున్నప్పుడు, ఆ శత్రువును నాశనం చేసినట్లే అవుతుంది” అని. ట్రంప్ ఈ సూత్రాన్ని పాటిస్తారా లేక పాత కక్షలతోనే ముందుకు సాగుతారా? చర్చల పేరుతో కాలయాపన చేయడం వల్ల మధ్యప్రాచ్యంలో మంటలు మరింత చెలరేగే ప్రమాదం ఉంది. కేవలం ఆధిపత్య పోరు పక్కన పెట్టి, మానవతా దృక్పథంతో అడుగులు వేసినప్పుడే ఈ చర్చలకు ఒక అర్థం పరమార్థం ఉంటుంది.::: కంచర్ల యాదగిరిరెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ


