బోయకొండ గంగమ్మా..పాహిమాం | Sakshi
Sakshi News home page

బోయకొండ గంగమ్మా..పాహిమాం

Published Sat, May 18 2024 4:25 AM

బోయకొ

చౌడేపల్లె: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీబోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం రాహుకాల అభిషేక పూజలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. గంగమ్మ తల్లీ శరణు అంటూ పూజల్లో పాల్గొన్నారు. వేకువ జామున ఆలయాన్ని శుద్ధి చేసి, ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, ఈఓ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాల సమయంలో అమ్మవారికి అభిషేక పూజలు చేశారు. కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహిళలు ఉపవాస దీక్షలతో పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

అన్న ప్రసాదాల పంపిణీ

ఆలయం వద్ద భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌, ఈఓ పర్యవేక్షణలో సుమారు 2 వేల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం బోయకొండ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొన్న చోట జరుగుతున్న మరమ్మతు పనులను ఈఓ, చైర్మన్‌ పరిశీలించి తగు సూచనలు చేశారు.

బోయకొండ గంగమ్మా..పాహిమాం
1/1

బోయకొండ గంగమ్మా..పాహిమాం

Advertisement
 
Advertisement
 
Advertisement