ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది.ఈరోజు వేకువజామున 2.43 గంటలకు..
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో మరోసారి భూమి కంపించింది. సోమవారం వేకువజామున 2.43 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. అద్దంకి, సంతనూతలపాడు, కొరిశపాడు, మేదరమెట్ల పరిసర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ చాలాసార్లు ప్రకాశం జిల్లాలో భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.