
సాక్షి, ప్రకాశం: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో పలు చోట్లు శనివారం ఉదయం భూమి కంపించింది. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని మండ్లమ్మురు, తాళ్లూరు మండలాల్లో భూమి కంపించింది. ఈ రెండు మండలాల్లోని పలు గ్రామాల్లో రెండు సెకన్ల పాటు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో, ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.
ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రంగా భూ ప్రకంపనలు వచ్చాయి. అదే సమయంలో ఏపీలో విశాఖ సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది.