
సాక్షి, ప్రకాశం జిల్లా: బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి గోషిపోతల ఆకాష్ (17), పులిగుజు తన్ని (18) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కంభంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సీలేరు నదిలో పడి..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరులో విషాదం జరిగింది. సీలేరు నదిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నదిలో కొట్టుకుపోయిన చింతూరుకు చెందిన శ్రీను, దిలీప్ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరో యువకుడు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు.