
అనంతపురం ఎడ్యుకేషన్: కులాంతర వివాహ ప్రోత్సాహకాలకు దరఖాస్తు చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌చార్జ్ అధికారి ఎస్.లక్ష్మానాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా నిర్వహిస్తున్న గిరిపుత్రిక కళ్యాణం, కులాంతర వివాహ ప్రోత్సాహక బహుమతి పథకాలను చంద్రన్న పెళ్లికానుక పథకంలోకి ప్రభుత్వం చేర్చిందన్నారు. ఏప్రిల్ 20కి ముందు గిరిపుత్రిక కళ్యాణ పథకానికి అన్‌లైన్ దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 31 వరకు ఈపాస్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు