
సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ దైర్జన్యానికి దిగారు. భూవివాదంలో హైకోర్టు స్టేకాపీ ఇచ్చేందుకు వెళ్లి సాక్షి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. స్టేకాపీ ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రాప్తాడు విలేకరి కొండన్నపై దుర్భాషణలాడారు. గతంలో కూడా సీఐ రాజేంద్రనాథ్‌పై అనేక ఆరోపణలు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కందుకూరు వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మంత్రి పరిటాల సునీత అండతో సీఐ రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా రాజేంద్రనాథ్‌పై ఉండడం గమనార్హం.