ఒకవైపు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ కాంగ్రెస్ వాళ్లే అడుగుతారని, మరోవైపు పార్లమెంటులో మాత్రం ఏపీకి ప్రత్యేక హోదాను వాళ్లే అడ్డుకుంటారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు.
కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను వెంకయ్యనాయుడు నేతృత్వంలో ఏపీ బీజేపీ నేతలు కలిశారు. పునర్విభజన చట్టంలోని వాగ్దానాలపై చర్చించారు. వాగ్దానాల అమలును పరిరక్షించేందుకు హోం మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించామని రాజ్నాథ్ సింగ్ ఆ బృందానికి తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రెండింటికీ న్యాయం చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్తో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఏపీకి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలుచేస్తామని, కాంగ్రెస్ నేతలు మాత్రం తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అన్నారు. ఒకవైపు ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ వాళ్లే అడుగుతారని, మరోవైపు పార్లమెంటులో మాత్రం ఏపీకి ప్రత్యేక హోదాను వాళ్లే అడ్డుకుంటారని వెంకయ్యనాయుడు మండిపడ్డారు.