కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండ గ్రామంలో శనివారం తెల్లవారుజామున కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
విజయవాడ: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో శనివారం తెల్లవారుజామున కుటుంబ కలహాలతో దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతుల ఒంటిపై మంటలు త్వరగా వ్యాపించాయి. దీంతో వారు బిగ్గరగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి... మంటలార్పివేసి... వారిని గుడివాడలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించాలని వైద్యులు బంధువులకు సూచించారు. దీంతో వారిని విజయవాడ తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.