
సాక్షి, మంగళగిరి : అన్న వస్తున్నాడు! నవరత్నాలతో రాష్ట్ర గతిని మార్చనున్నాడు. పేదవాడి ఇంటికి సంక్షేమాన్ని చేర్చనున్నాడు. రాజన్న రాజ్యాన్ని నెలకొల్పి చదువుల విప్లవానికి నాంది పలకనున్నాడు. అవును ఇప్పుడు నియోజకవర్గంలో వినిపిస్తున్న మాటలు ఇవి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పట్టణంలోని అంజుమన్ షాదిఖానా పక్కన మంగళగిరి నియోజకవర్గం అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) పార్టీ కార్యాలయం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో కొత్తగా కార్యాలయానికి వచ్చిన యువకులు వాటిని చూసి తాము విషయాలను తెలుసుకోవడంతో పాటు పదిమందికీ వివరిస్తున్నారు.