
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలోని కరువుపై పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం వారు కలిశారు. అనంతరం జిల్లాలోని కరువు పరిస్థితి గురించి వివరిస్తూ లేఖను కేంద్ర బృందానికి అందజేశారు. అందులో అనంతపురం జిల్లాది రాష్ట్రంలోని వ్యవసాయ రంగంలో ఒక ప్రత్యేక పరిస్థితి. వ్యవసాయ రంగానికి అత్యంత వనరులు కలిగిన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో ఎంత సాగుభూమి ఉన్నదో ఒక్క అంనంతపురంలోనే అంత సాగుభూమి ఉన్నదని, అతి తక్కువ సాగునీటి వనరులతో కేవలం వ్యవసాయమే ఆధారంగా ఉన్న జిల్లా అనంతపురం అని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం కింది లేఖను చదవగలరు.