
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిర్దేశించిన లాక్‌డౌన్ మార్చి వాహన విక్రయాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. దీనికితోడు బీఎస్6 పర్యావరణ నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన అమ్మకాలు భారీగానే తగ్గాయి.మారుతీ సుజుకీ, హ్యుందాయ్ అమ్మకాలు దాదాపు సగం వరకూ తగ్గగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ (టీకేఎమ్) కంపెనీల అమ్మకాలు 40–90% రేంజ్‌లో క్షీణించాయి.