మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష | Khaleda Zia gets five-year jail term | Sakshi

మాజీ ప్రధానికి ఐదేళ్ల జైలు శిక్ష

Published Thu, Feb 8 2018 3:04 PM | Last Updated on Thu, Feb 8 2018 3:22 PM

Khaleda Zia gets five-year jail term  - Sakshi

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలేదా జియా

ఢాకా : బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. సుమారు 21 మిలియన్‌ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్‌ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడినందుకు కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది.

ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్‌ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాదేశ్‌ అంతటా భద్రత కట్టుదిట్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement