బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఎమ్మిగనూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
ఆదోని టౌన్: బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని ఎమ్మిగనూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు సమక్షంలో హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. ఈ నెల 25వ తేదీన ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన నాగేంద్ర మాయమాటలతో లోబర్చుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు బాలిక తన కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. బాలిక ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జ్ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 48 గంటలలోనే కేసును ఛేదించారని చెప్పారు. 2012 పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు.