నేడు ముఖ్యమంత్రి రాక | CM arrival today at anantapur | Sakshi
Sakshi News home page

నేడు ముఖ్యమంత్రి రాక

Published Sat, Aug 13 2016 11:49 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం 5.45 గంటలకు అనంతపురం వస్తారు.

అనంతపురం అర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం జిల్లాకు విచ్చేస్తున్నారు. సాయంత్రం పుట్టపర్తికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా సాయంత్రం 5.45 గంటలకు అనంతపురం వస్తారు. సాయంత్రం ఆరు నుంచి రాత్రి 8.30 గంటల వరకు అధికార కార్యక్రమాలు ఏమీ లేవు. ఈ సమయంలో మంత్రులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశం అవుతారని పార్టీ వర్గాల సమాచారం.

అదే విధంగా కొత్తూరు అమ్మవారి శాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొనే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. 15న ఉదయం 8.57 గంటలకు పోలీసు శిక్షణ కళాశాల మైదానం చేరుకుని స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొం టారు. 11 గంటలకు కార్యక్రమం మగిస్తారు. అనంతరం తేనీటి విందులో పాల్గొంటారు. 12 గంటలకు బయలుదేరి వెళతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement