టీటీడీకి అనుబంధంగా ఉండే శ్రీ గోవిందస్వామి (ఎస్జిఎస్) ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
టీటీడీకి అనుబంధంగా ఉండే శ్రీ గోవిందస్వామి (ఎస్జిఎస్) ఆర్ట్స్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. కొంతమంది సీనియర్ విద్యార్థులు కలిసి ఓ జూనియర్ విద్యార్థిని వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. అయితే ఈ ర్యాగింగ్ ఘటనను కప్పిపుచ్చేందుకు కాలేజి యాజమాన్యం ప్రయత్నించింది. తమను సీనియర్లు ర్యాగింగ్తో చిత్ర హింసలు పెడుతున్నారని జూనియర్ విద్యార్థులు వాపోయారు.
అయితే, వారిని మీడియా ముందుకు రానీయకుండా కాలేజి యాజమాన్యం అడ్డుకుంటోంది. దాంతో విషయాలు పూర్తిగా బయటకు రాలేదు. గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజిలో ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇంకా చల్లారకముందే పవిత్ర తిరుపతి క్షేత్రంలో ఇలా జరగడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.