ధర్మాన్ని రక్షిద్దాం..
ప్రతిఒక్కరూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వి.ఆర్. కృష్ణారావు చెప్పారు.
తాడేపల్లి (తాడేపల్లి రూరల్): ప్రతిఒక్కరూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐ.వి.ఆర్. కృష్ణారావు చెప్పారు. సీతానగరంలోని ‘సీత’ కార్యాలయంలో ఆదివారం సమరసత ఫౌండేషన్ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొన్నారు. హిందూ ధర్మంలో అందరూ సమానమేనని అన్నారు. హిందూ ధర్మ ప్రచారానికి ఫౌండేషన్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. కంచి స్వామి విజయేంద్ర సరస్వతి మాట్లాడుతూ విశ్వశాంతి కోసం అందరూ ధర్మాన్ని పాటించాలని ఉద్బోధించారు. ఫౌండేషన్ కార్యదర్శి త్రినాథ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ‘సీత’ డైరెక్టర్ వి.జయరాఘవాచార్యులు, అక్షర భారతి ఉపాధ్యక్షుడు డి.రామకృష్ణ పాల్గొన్నారు.