రీకాకుళం జిల్లాలో మంగళవారం భూమి స్వల్పంగా కంపించింది. పొందూరు మండల పరిధిలో స్వల్ప భూకంపం సంభవించింది.
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం భూమి స్వల్పంగా కంపించింది. పొందూరు మండల పరిధిలో స్వల్ప భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ప్రకంపనలు రావడంతో.. ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలుచోట్ల ఇళ్లలోని సామాగ్రి కిందపడినట్లు సమాచారం. కాగా నెల వ్యవధిలో ఈ ప్రాంతంలో భూమి కంపించడం ఇది మూడోసారి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.