జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతో పాటు, 2 ఎంపీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు.
ఆత్మకూరు, న్యూస్‌లైన్: జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలతో పాటు, 2 ఎంపీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకుని క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని ఆ పార్టీ ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. గురువారం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి నుంచి నెల్లూరుకు బయలుదేరిన ఆయన నెల్లూరుపాళెం సెంటర్‌లో తనను కలిసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో ఆయన కాసేపు ముచ్చటించారు. పోలింగ్ సరళిపై వారితో సమీక్షించారు.
గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి హోరెత్తుతోందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టబోతున్నారన్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం ఫ్యాన్ గాలి వేగాన్ని మరింత పెంచాయన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ హయాం నాటి రాజన్న రాజ్యాన్ని చూసేందుకు ప్రజలందరూ మూకుమ్మడిగా వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారని పోలింగ్ సరళి, ఓటర్ల ఉత్సాహం తేటతెల్లం చేస్తున్నాయన్నారు. కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు.
పోలింగ్ సరళిపై సమీక్ష
వివిధ ప్రాంతాల నుంచి బ్రాహ్మణపల్లికి వచ్చిన నేతలతో మేకపాటి గౌతమ్‌రెడ్డి పోలింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల వారీగా వచ్చే మెజార్టీని సంబంధిత నేతలు ఆయనకు లెక్కలతో సహా చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ హవా సాగుతోందని గౌతమ్‌రెడ్డి చెప్పారు. ఆత్మకూరు నియోజకవర్గంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో ఆత్మకూరు మండల కన్వీనర్ ఇందూరు నారసింహారెడ్డితో పాటు పలు మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.