బావే నా హీరో ! | rajinikanth biography movie hero in Dhanush | Sakshi
Sakshi News home page

బావే నా హీరో !

Published Mon, Sep 26 2016 2:09 AM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM

బావే నా హీరో !

బావే నా హీరో !

అక్కాచెల్లెళ్లకు నటుడు ధనుష్ మొత్తంగా దొరికి పోయాడా? వరుస చూస్తుంటే అలానే అనిపిస్తోంది.

అక్కాచెల్లెళ్లకు నటుడు ధనుష్ మొత్తంగా దొరికి పోయాడా? వరుస చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ధనుష్ సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య భర్త అన్న విషయం తెలిసిందే. ఆయన హీరోగా ఐశ్వర్యధనుష్ 3 అనే వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించిన విషయం విదితమే. నేటి టాప్ నాయకి శ్రుతిహసన్ ధనుష్‌తో జత కట్టిన 3 చిత్రం కమర్షియల్‌గా ఆశించిన విజయాన్ని అందించలేదన్నది గమనార్హం. అయితే ఆ చిత్రంలోని వై దిస్ కొలవెర్రి డీ పాట బహుళ ప్రాచుర్యం పొందింది. తాజాగా ధనుష్‌ను తన మరదలు సౌందర్య రజనీకాంత్ తన బావే తన హీరో అంటున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

సౌందర్యా రజనీకాంత్ గ్రాఫిక్ రంగంలో మంచి నిపుణత సాధించారన్నది తెలిసిందే. తనూ అక్క బాటలోనే మెగాఫోన్ పట్టి తన తండ్రినే దర్శకత్వం వహించి ఘనత కెక్కారు. తొలుత సుల్తాన్ ది వారియర్ అనే యానిమేషన్ చిత్రాన్ని మొదలు పెట్టి అది మధ్యలోనే ఆగిపోవడంతో కోచ్చడైయాన్ చిత్రానికి తెరకెక్కించారు. ఇది మోషన్ ఫార్మెట్‌లో రూపొందిన తొలి భారతీయ 3డీ, యానిమేషన్ చిత్రంగా నమోదైందన్నది గమనార్హం. కాగా గత ఏడాదిగా భర్త అశ్విన్‌కుమార్‌కు దూరంగా జీవిస్తున్న సౌందర్య రజనీకాంత్ త్వరలో ఆయన నుంచి వివాహరద్దు పొందనున్నట్లు వెల్లడించారు.

 తన తండ్రి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించిన సౌందర్య రజనీకాంత్ ఇప్పుడా ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి తన బావ(ధనుష్) హీరోగా ఒక చిత్రం తెరకెక్కించడానికి రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు, దీన్ని ఇంతకు ముందు రజనీకాంత్ కథానాయకుడిగా కబాలి చిత్రాన్ని నిర్మించిన కలైపులి ఎస్.థాను నిర్మించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు టాక్.అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement