
ఉదయనిధి నూతన చిత్రం ప్రారంభం
యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ వేగం పెంచారు. ఇంతకు ముందు చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ
యువ నటుడు ఉదయనిధి స్టాలిన్ వేగం పెంచారు. ఇంతకు ముందు చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ వచ్చిన ఈయన ఇప్పుడు ఒకేసారి మూడు చిత్రాలు చేస్తుండటం విశేషం. ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే ఎళిల్ దర్శకత్వంలో శరవణన్ ఇరుక్క భయమేన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తన సొంత బ్యానర్ రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలో నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని సమాచారం.
కాగా ఉదయనిధి స్టాలిన్ దర్శకుడు గౌరవ్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఇలా ఉండగా ఉదయనిధి స్టాలిన్ మరో చిత్రానికి సిద్ధం అయ్యారు. పొదువాగ ఎన్ మనసు తంగం అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. నవ దర్శకుడు దళపతి ప్రభు మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నటుడు పార్తీపన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. నటి నివేద నాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి హాస్య పాత్రలో నటిస్తున్నారు.
బాలసుబ్రహ్మణ్యం చాయాగ్రహణం, డీ.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ సోమవారం ఉదయం తేనిలో ప్రారంభమైంది. తొలి షెడ్యుల్‌ను 23 రోజుల పాటు తేని, మధురై, కోవై, సత్యమంగళం ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్టు ఆ చిత్ర వర్గాలు తెలిపాయి. కాగా చిత్రాన్ని 2017 సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.