శ్రీనగర్: కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం రక్షణ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకుని ఓ పోలీసు, సైనికుడు ప్రాణాలుకోల్పోయారు.
శ్రీనగర్: కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం ఉదయం రక్షణ బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకుని ఓ పోలీసు, సైనికుడు ప్రాణాలుకోల్పోయారు. మరో పౌరుడు గాయపడ్డాడు. బారాముల్లా జిల్లాలోని హార్డ్షోరా గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘావర్గాల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సైనిక సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఒక్కసారిగా ప్రత్యర్థులు కాల్పులకు దిగడంతో ప్రాణనష్టం చోటుచేసుకుంది. ప్రతిగా రక్షణ బలగాలు ప్రారంభించాయి. ప్రస్తుతానికి ఒక ఇంటిలో ముగ్గురు తీవ్రవాదులున్నట్లు వారివద్ద సమాచారం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాల్పులు కొనసాగుతున్నాయి.