
రాహుల్ గాంధీకి ఆరెస్సెస్ ఆహ్వానం
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ భగవద్గీత చదివితే ఆయన కూడా ఆరెస్సెస్‌లో చేరుతారని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ అన్నారు.
గత వారం రాహుల్‌గాంధీ చెన్నైలో మాట్లాడుతూ బీజేపీ, ఆరెస్సెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాను కూడా భగవద్గీత, పురాణాలు, ఉపనిషత్తులు చదువుతానని చెప్పారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఇంద్రేష్ కుమార్ ‘రాహుల్‌గాంధీ గీతా, పురాణాలు చదివితే ఆయన భవిష్యత్తులో ఆరెస్సెస్‌లో చేరాలనికోరుకుంటారు’ అంటూ ఆయన హాస్యమాడారు.