
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాలకు మే 21న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అసెంబ్లీలో ప్రవేశించడానికి మార్గం సుగమమైంది. ఏప్రిల్ 3న జరగాల్సిన ఈ ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. గత ఏడాది నవంబర్ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఠాక్రే, మే 27లోపు విధాన మండలికి ఎన్నిక కావాల్సి ఉంది. లేని పక్షంలో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి ఉంటుంది.