కశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు దాడులకు పాల్పడినా భయపడకుండా రాజకీయ పార్టీలు శనివారం ప్రచారం కొనసాగించాయి.
శ్రీనగర్: కశ్మీర్‌లో శుక్రవారం ఉగ్రవాదులు దాడులకు పాల్పడినా భయపడకుండా రాజకీయ పార్టీలు శనివారం ప్రచారం కొనసాగించాయి. అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తోపాటు ప్రతిపక్ష పీడీపీ, ఇతర పార్టీల నేతలు డజన్ల సంఖ్యలో సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ పాట్రన్ ముఫ్తీ మొహమ్మద్ సయీద్‌లు సహా కీలక నేతలు నిర్వహించిన సభలకు కశ్మీరీలు భారీగా తరలివచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. ముందుజాగ్రత్త చర్యగా సభలు, ర్యాలీలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.